హీరో సిద్దార్థ్ (Siddharth).. ఒకప్పుడు టాప్ హీరో! ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు! తమిళ, తెలుగు భాషల్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన ఇతడు ఈ మధ్యకాలంలో మాత్రం హిట్లు లేక అవస్థలు పడుతున్నారు. కొన్నేళ్లుగా సక్సెస్‌కు దూరంగా ఉన్న సిద్దార్థ్ రెండేళ్లక్రితం చిత్తా (చిన్నా) మూవీతో విజయం అందుకున్నాడు. అయినప్పటికీ ఈ సినిమాకు తమిళంలో వచ్చినంత ఆదరణ తెలుగులో రాకపోవడం గమనార్హం.
ఓటీటీలో సిద్దూ మూవీ
సిద్దార్థ్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మిస్ యూ. గతేడాది డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్ అందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో రిలీజైన మిస్ యు ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఎటువంటి ముందస్తు ప్రకటన లేకుండా మిస్ యు మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. జనవరి 10 నుంచి మిస్ యు.. అమెజాన్ ప్రైమ్‌లో తమిళ, తెలుగు భాషల్లో ప్రసారమవుతోంది. రాజశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సిద్దార్థ్, ఆషిక రంగనాథ్ జంటగా నటించారు. శామ్యూల్ మాథ్యూస్ నిర్మించారు. గిబ్రాన్ సంగీతం అందించారు.
(గేమ్ ఛేంజర్ మూవీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
సిద్దార్థ్ కెరీర్ అలా మొదలైంది
బాయ్స్ సినిమాతో హీరోగా ప్రయాణం మొదలుపెట్టాడు సిద్దార్థ్. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానా మూవీతో సెన్సేషన్ అయ్యాడు. బొమ్మరిల్లుతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. తెలుగు, తమిళంలో సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టాడు. అతడు హిందీలో నటించిన తొలి చిత్రం రంగ్ దే బసంతి. బాలీవుడ్ స్ట్రైకర్, చష్మే బద్దూర్ సినిమాలు చేశాడు.
హిందీలోనూ లక్ పరీక్షించుకున్న సిద్దార్థ్
కానీ అక్కడ పెద్దగా గుర్తింపు లేకపోవడంతో సౌత్‌లోనే తన స్టార్‌డమ్‌ను కొనసాగించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో కొన్ని విజయాలను సాధించగా మరికొన్ని అపజయాలను మూటగట్టుకున్నాడు. తెలుగులో కొంచెం ఇష్టం కొంచెం కష్టం, ఓయ్, బావ, ఆట, అనగనగా ఓ ధీరుడు, ఓ మై ఫ్రెండ్, లవ్ ఫెయిల్యూర్, జబర్దస్త్, మహా సముద్రం సినిమాలు చేశాడు. గత కొన్నేళ్లుగా తమిళంపైనే పూర్తిగా ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతం టెస్ట్, ఇండియన్ 3 సహా మరో తమిళ చిత్రంలో యాక్ట్ చేస్తున్నాడు.
సింగర్ కూడా
సిద్దార్థ్ హీరో మాత్రమే కాదు.. నిర్మాత, సింగర్ కూడా! లవ్ ఫెయిల్యూర్, జిల్ జంగ్ జుక్, చిత్తా (చిన్నా) చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన ఇతడు ఎన్నో పాటలు పాడాడు. అపుడో ఇపుడో ఎపుడో.. (బొమ్మరిల్లు మూవీ), నిను చూస్తుంటే.. (ఆట), ఓయ్ ఓయ్ (ఓయ్ మూవీ), మా డాడీ పాకెట్స్.. (ఓ మై ఫ్రెండ్), ఎక్స్‌క్యూజ్ మీ రాక్షసి.. (నిను వీడని నీడను నేనే) ఇలా ఎన్నో పాటలు ఆలపించాడు.
గతేడాది పెళ్లి
సిద్ధార్థ్ 2024 సెప్టెంబర్‌లో తన ప్రేయసి, హీరోయిన్ అదితిరావు హైదరిని పెళ్లి చేసుకున్నాడు. కొన్నేళ్ల పాటు సీక్రెట్ డేటింగ్‌లో ఉన్న ఈ జంట వనపర్తిలోని ఓ పురాతన ఆలయంలో మొదటగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇరు కుటుంబాల అంగీకారంతో అదే ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇద్దరికీ ఇది రెండో పెళ్లే!
చదవండి: భార్య కాళ్లు కడిగి నీళ్లు నెత్తిన చల్లుకున్న కమెడియన్
Comments
Please login to add a commentAdd a comment