నా కెరీర్‌లో క్లిష్టమైన పాత్ర అది!  | Samantha Ruth Prabhu Opens Up About Challenging Role In Citadel Adaptation - Sakshi
Sakshi News home page

నా కెరీర్‌లో క్లిష్టమైన పాత్ర అది! 

Published Sun, Mar 17 2024 3:40 AM | Last Updated on Sun, Mar 17 2024 9:17 AM

Samantha Ruth Prabhu proudly labels Citadel as toughest role yet - Sakshi

‘ఏ మాయ చేశావె’తో కథానాయికగా కెరీర్‌ ఆరంభించిన సమంత ఈ పద్నాలుగేళ్లల్లో సవాల్‌ అనిపించే పాత్రలు చాలానే చేశారు. హీరోయిన్‌గా యాభై చిత్రాలు చేసిన ఆమె ‘మహానటి’, ‘బేబీ’, ‘యశోద’ తదితర చిత్రాల్లో చాలెంజింగ్‌ రోల్స్‌ చేశారు. కానీ, ఇన్నేళ్ల కెరీర్‌లో ‘సిటాడెల్‌’లో చేసిన క్యారెక్టర్‌ తనకు చాలా క్లిష్టంగా అనిపించిందని ఓ ఇంటర్వ్యూలో సమంత పేర్కొన్నారు. ‘సిటాడెల్‌’ వెబ్‌ సిరీస్‌ గురించి సమంత మాట్లాడుతూ – ‘‘నా కెరీర్‌లోనే ‘సిటాడెల్‌’లో చేసిన రోల్‌ టఫ్‌ అనడానికి కారణం నేను శారీరకంగా బలహీనం (మయోసైటిస్‌ వ్యాధిని ఉద్దేశించి) గా ఉన్నప్పుడు ఆ షూటింగ్‌ జరిగింది.

నా పరిస్థితి బాగాలేనప్పుడు షూటింగ్‌లో పాల్గొనాల్సి రావడం అనేది చాలా కష్టంగా అనిపించింది’’ అన్నారు. ప్రియాంకా చోప్రా నటించిన అమెరికన్‌ వెబ్‌ సిరీస్‌ ‘సిటాడెల్‌’ ఇండియన్‌ వెర్షన్‌లో సమంత నటించారు. సమంత ఓ లీడ్‌ రోల్‌లో ‘ఫ్యామిలీ మేన్‌’ సిరీస్‌ తెరకెక్కించిన రాజ్, డీకే ఈ సిరీస్‌కి కూడా దర్శకులు. త్వరలో ‘సిటాడెల్‌’ స్ట్రీమింగ్‌ కానున్న నేపథ్యంలో.. ‘‘నా దృష్టిలో ఈ సిరీస్‌ ఆల్రెడీ హిట్‌ అయినట్లే. ఎందుకంటే క్లిష్టమైన పరిస్థితుల్లో నటించాను. నేను చేయగలనని అనుకోలేదు. కానీ చేశాను. అందుకు గర్వంగా ఉంది’’ అని కూడా సమంత అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement