టీచర్ ఇంటికెళ్లిన స్టార్ హీరో.. ఎందుకంటే? | Raghava Lawrence Goes To A Teacher House In Tamilnadu, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Raghava Lawrence: ఇంటికెళ్లి టీచర్‌ను సన్మానించిన రాఘవ లారెన్స్.. ఎందుకో తెలుసా!

Published Sun, Jul 14 2024 3:00 PM | Last Updated on Sun, Jul 14 2024 3:11 PM

 Raghava Lawrence Goes To A Teacher House Goes Viral

కోలీవుడ్ స్టార్‌ హీరో రాఘవ లారెన్స్ గతేడాది జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌, చంద్రముఖి, రుద్రన్ సినిమాలతో అలరించాడు. ప్రస్తుతం ఆయన దళపతి విజ‍య్ హీరోగా తెరకెక్కుతోన్న గోట్‌  చిత్రంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. అయితే ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే రాఘవ.. సమాజ సేవలోనూ ముందున్నారు. మాత్రం ఫౌండేషన్‌ ద్వారా పేదలను ఆదుకుంటున్నారు. ఇటీవలే కొన్ని కుటుంబాలకు వ్యవసాయ ట్రాక్టర్స్‌, టూ వీలర్స్‌ అందించి తన గొప్పమనసును చాటుకున్నారు.

తాజాగా హీరో రాఘవ లారెన్స్ ఓ ఉపాధ్యాయున్ని  కలిశారు. ఆయన ప్రతిభను గుర్తించిన హీరో ఇంటికెళ్లి మరి సన్మానించారు. తమిళనాడులోని కళ్లకురిచి జిల్లా మనలూరుపేటకు చెందిన సెల్వం అనే  డ్రాయింగ్ టీచర్‌ను రాఘవ అభినందించారు. సోషల్ మీడియాలో అతని అద్భుతమైన డ్రాయింగ్స్‌ చూసి ముగ్ధుడైనట్లు వెల్లడించారు. అందుకే వ్యక్తిగతంగా కలిసి అభినందించాలని నిర్ణయించుకున్నట్లు లారెన్స్ తెలిపారు. ఈరోజు అతన్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అతని బహుమతి నా మనస్సుకు హత్తుకుందని రాఘవ ఆనందం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ట్విటర్‌ ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement