
సాక్షి, చెన్నై(తమిళనాడు): బీజేపీ తమిళనాడు శాఖ అధ్యక్షుడిగా అన్నామలైని నియమిస్తూ ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలో ప్రకటన విడుదల చేశారు. కరూరు జిల్లా వ్యవసాయ కుటుంబానికి చెందిన అన్నామలై ఇంజినీరింగ్, ఎంబీఏ పట్టబధ్రుడు. కర్ణాటక ఐపీఎస్‌కు చెందిన ఆయన 2018–19 వరకు పోలీసు అధికారిగా పలు హోదాల్లో పనిచేశారు.
అనంతరం బీజేపీ రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షుడిగా నియమితులై గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో అరవకురుచ్చి నుంచి పోటీచేసి డీఎంకే అభ్యర్థి ఇళంగో చేతిలో 24 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇప్పటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన ఎల్.మురుగన్ కేంద్ర మంత్రి పదవి చేపట్టడంతో ఆయన స్థానంలో అన్నామలైని నియమించారు. అన్నామలైకి బీజేపీ తమిళనాడు శాఖ జాతీయ కో–ఇన్‌చార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన హయాంలో పార్టీ మరింత బలోపేతమై తమిళనాడులో అధికారం చేపట్టగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment