చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో పార్టీ జనరల్ అసెంబ్లీ కౌన్సిల్ జరిగింది. ఇటీవలే కొత్తగా ఏర్పడిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో డీఎంకే స్థాలిన్‌ని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. అలాగే పార్టీ నేతలు దురైమరుగన్, టీఆర్ బాలులు కూడా జనరల్ సెక్రటరీ, ట్రెజరీ అధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు నేతలు కూడా వరసగా రెండోసారి పార్టీ అత్యున్నత పదవులను చేపట్టడం విశేషం. అంతేగాదు కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన స్టాలిన్‌కి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
డీఎంకే పార్టీ 15వ సంస్థగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీ పదవులకు ఎన్నికలు జరిపిన తర్వాత ఆ ముగ్గురు నేతలని పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అంతేగాదు డీఎంకే పార్టీ పితామహుడు, దివగంత ఎం కరుణానిధిన్ హయాంలో స్టాలిన్ కోశాధికారిగా, యువజన కార్యదర్శిగా పలు పదవులను చేపట్టారు. 2018లో కరుణానిధి మరణాంతరం స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నకయ్యారు. అంతేగాదు 1969లో తొలిసారిగా సృష్టించిన పార్టీ అధ్యక్షుడి పదవికి కరుణానిధే తొలి అధ్యక్షుడయ్యారు. అంతకు ముందు వరకు పార్టీ కార్యదర్శి పదవే అత్యున్నత పదవి. 1949లో ఏర్పాటైన డిఎంకే పార్టీకి అన్నాదురై పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చనిపోయేంత వరకు ఈ అత్యున్నత పదవిలోనే కొనసాగారు.
(చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్)
Comments
Please login to add a commentAdd a comment