సాక్షి, చైన్నె: తన భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ. 2 లక్షలు మొత్తాన్ని చిల్లరగా 20 బస్తాలలో కోర్టుకు ఓ భర్త గురువారం తీసుకొచ్చాడు. ఈ చిలర్ల చూసి షాక్‌కు గురైన న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ చిల్లర మొత్తాన్ని నోట్లుగా మార్చి సమర్పించాలని ఆదేశించారు.
వివరాల ప్రకారం.. కోయంబత్తూరుకు చెందిన దంపతులు గతంలో విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు రాగా, తనకు భరణం ఇప్పించాలని ఆ భార్య కోర్టుకు విన్నవించారు. దీంతో, న్యాయమూర్తి ఆ భర్తకు ఆదేశాలు ఇచ్చారు. రూ. 2 లక్షలు భరణం అందజేయాలని సూచించారు. దీనిని ముందే గ్రహించిన ఆ భర్త వినూత్న ప్రయోగం చేసి కంగు తిన్నాడు. తన భార్య మీదున్న కోపంతో కోర్టు నుంచి బయటకు వెళ్లి తన కారులో ఉన్న బస్తాలు ఒకొక్కటిగా తీసుకొచ్చి పెట్టారు.
అనంతరం, 20 బస్తాలను కోర్టులో ఉంచి, ఇదిగోండి రూ. 2 లక్షలు అంటూ సూచించాడు. న్యాయమూర్తి ప్రశ్నించగా, రూ. 80 వేలకు ఒక్క రూపాయి నాణెలు, మిగిలిన మొత్తం రూ. 5 ,రూ. 10, రూ. 20 నాణేలు అంటూ వివరించాడు. దీనిని విన్న అక్కడున్న వారంతా అవ్వాక్కయారు. ఇతడు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న జడ్జి మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈచిల్లరను నోట్లుగా మార్చి తీసుకొచ్చి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ భర్త చిల్లర బస్తాలను కోర్టు నుంచి మళ్లీ తన కారు వద్దకు మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ వ్యవహారం కోయంబత్తూరుకోర్టు ఆవరణలో సర్వత్రా హాస్యాన్ని పంచినట్లయ్యింది. విచారణ వాయిదా పడడంతో చిల్లర బస్తాలతో ఆ భర్త తాను వచ్చిన కారులోనే వెళ్లియాడు.
Comments
Please login to add a commentAdd a comment