MenToo
-
అతుల్ సుభాష్ కేసులో సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు
అతుల్ సుభాష్ కేసులో దాఖలైన ఓ పిటిషన్‌పై దేశసర్వోన్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. మనవడిని తమకు అప్పగించాలంటూ అతుల్ తల్లి అంజు దేవి వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు ఇవాళ విచారణ జరిపింది. ఈ క్రమంలో.. నాలుగేళ్ల అతుల్ కొడుకు ఎక్కడ ఉన్నాడన్నదానిపై నిఖితా సింఘానియా తరఫు న్యాయవాది స్పష్టత ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిన్నారి ఫరిదాబాద్(హర్యానా)లోని బోర్డింగ్స్కూల్లో చదువుతున్నట్లు చెప్పాడు. అంతేకాదు.. ప్రస్తుతం నిఖిత షరతులతో బెయిల్ మీద ఉన్న దృష్ట్యా.. ఆ పిల్లాడిని బెంగళూరుకు రప్పించే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిపాడాయన. అయితే.. వచ్చే విచారణ టైంలో ఆ చిన్నారిని కోర్టులో ప్రవేశపెట్టాలని జస్టిస్ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్‌సింగ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఆదేశించింది. అయితే..అంజు దేవీ(Anju Devi) తరఫు న్యాయవాది వాదిస్తూ.. ఆరేళ్లలోపు పిల్లలను బోర్డింగ్ స్కూల్‌కు పంపడం ఎడ్యుకేషన్ గైడ్‌లైన్స్‌కు విరుద్ధమని, కాబట్టి అతని సంరక్షణను నాయనమ్మకు అప్పగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో జస్టిస్ నాగరత్న జోక్యం చేసుకుని.. ‘‘ఆ చిన్నారి నాయనమ్మతో గడిపిన సమయం చాలా తక్కువ. ఒకరకంగా చూసుకుంటే పిటిషనర్ ఆ పిల్లాడికి కొత్త ముఖమే అవుతుంది’’ అని వ్యాఖ్యానించారు. దీంతో.. అంజుదేవి తరఫు లాయర్ గతంలో ఆ నానమ్మ-మనవడు కలిసి దిగిన ఫొటోలను బెంచ్‌కు సమర్పించారు.అయితే నిఖితా సింఘానియా(Nikita Singhania) ఈ కేసులో దోషిగా ఇంకా నిరూపించబడాల్సి ఉందని, కేవల మీడియా కథనాల ఆధారంగా ఆమెను దోషిగా గుర్తించలేమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ కేసులో విచారణ కొనసాగుతున్నందున పిల్లాడి సంరక్షణ విషయంలో సరైన నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం న్యాయస్థానానికి ఉందని పేర్కొంటూ.. తదుపరి విచారణను జనవరి 20వ తేదీకి వాయిదా వేసింది.ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అతుల్ సుభాష్, నిఖిత 2019లో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆ జంట బెంగళూరుకు వెళ్లి తమ తమ ఉద్యోగాల్లో చేరింది. ఆ మరుసటి ఏడాది వారికి బాబు పుట్టాడు. 2021లో నిఖిత బెంగళూరులోని భర్తను విడిచిపెట్టి కొడుకుతో సహా పుట్టింటికి చేరింది. ఆపై భర్త, అతని కుటుంబంపై వరకట్న వేధింపుల కేసు పెట్టింది. అలా.. విచారణ కోసం అతుల్‌ను భార్య స్వస్థలం జౌన్‌పురలోని ఫ్యామిలీ కోర్టుకు కోసం వెళ్లాల్సి వచ్చేది. ఈ క్రమంలో..మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అతుల్ సుభాష్(Atul Subash) బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే క్రమంలో తన భార్య, ఆమె కుటుంబం ఏ స్థాయిలో మానసికంగా వేధించిందో పేజీల కొద్దీ రాసిన సూసైడ్ లేఖ, 90 నిమిషాల నిడివితో తీసిన సెల్ఫీ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. కొడుకును అడ్డుపెట్టుకుని తన భార్య ఆర్థికంగా తనను దోచుకుందని.. న్యాయస్థానంలోనూ తనకు అన్యాయం జరిగిందని, ఇంక తన వల్ల కాకనే ఇలా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు పేర్కొన్నాడతను. అంతేకాదు.. తన కొడుకును తన తల్లిదండ్రులకు అప్పగించాలని ఆఖరికి కోరికగా కోరాడు. ఈ ఘటన తర్వాత.. లక్షల మంది మద్ధతుతో మెన్టూతో పాటు జస్టిస్ ఈజ్ డ్యూ, జస్టిస్ ఫర్ అతుల్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో కొనసాగాయి.అతుల్ సోదరుడి ఫిర్యాదు మేరకు బెంగళూరు పోలీసులు.. పరారీలో ఉన్న నిఖితా సింఘానియాను, ఆమె తల్లీ, సోదరుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా.. రిమాండ్ విధించారు. అయితే.. వాళ్లకు కోర్టు తాజాగా కండిషనల్ బెయిల్ ఇచ్చింది. ఒకవైపు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో, మరోవైపు కర్ణాటక హైకోర్టులో.. ఇంకోవైపు సుప్రీం కోర్టులో ఈ కేసుకు సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణ జరుగుతోంది. -
ఫోన్లో భార్య సతాయింపులు.. భరించలేక భర్త బలవన్మరణం!
కట్టుకున్న భార్య రాచిరంపాన పెడుతుందని ఓ భర్త వాపోతే ఎలా ఉంటుంది?. నవ్వి ఊరుకుంటుంది ఈ సమాజం. కానీ, అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇలాంటి కేసులు.. వ్యక్తుల జీవితాలకు సంబంధించిన విచారణే కాకుండా చట్టాలను సవరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఓ అతుల్.. కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్ అజయ్ కుమార్ .. ఇలా రోజుకొక ఉదంతం ఈ చర్చలో భాగమవుతోంది. ఇదిలా ఉండగానే.. ఢిల్లీలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.వుడ్‌బాక్స్(Woodbox) అనే పాపులర్ కేఫ్ నడిపిస్తున్న పునీత్ ఖురానా(40) బలవనర్మణానికి పాల్పడ్డాడు. కల్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్ నివాసంలో మంగళవారం సాయంత్రం ఉరేసుకుని చనిపోయాడు. పునీత్ అతని భార్య మానిక జగదీష్ పహ్వాకి మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే.. ఈ కేసులో భార్య సతాయింపుల కోణం బయటకు వచ్చింది.తన భార్య వేధింపులకు సంబంధించి 16 నిమిషాల ఫోన్‌కాల్ ఆడియో.. అలాగే ఆమె ఎలా వేధించిందో చెబుతూ 54 నిమిషాల సెల్ఫ్ వీడియో రికార్డింగ్.. రెండింటిని బయటపెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడతను. ఈ మేరకు కుటుంబ సభ్యులు కూడా మానికపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.2016లో ఈ ఇద్దరికీ వివాహం జరిగింది. ఆపై వుడ్‌బాక్స్ కేఫ్‌ను ఆ భార్యాభర్తలిద్దరూ కలిసే ప్రారంభించారు. విడాకుల కేసు నేపథ్యంలో ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ.. వ్యాపారంలో మాత్రం ఇద్దరూ భాగంగానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి. పునీత్ మరణం తర్వాత.. మానికతో జరిగిన జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఒకటి బయటకు వచ్చింది.మనం విడాకులు తీసుకున్నాం. అయినా కూడా నేను వ్యాపార భాగస్వామినే. కాబట్టి, నా బకాయిలు త్వరగా చెల్లించు అని మానిక, పునీత్‌తో వాగ్వాదం పెట్టుకుంది. పునీత్ ఎంత వేడుకుంటున్నా.. ఆమె మాత్రం కఠువుగానే మాట్లాడిందా ఆడియో క్లిప్‌లో. దీంతో.. చేసేది లేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మానికను విచారణ జరపాలని నిర్ణయించారు.ఇదిలా ఉంటే.. అతుల్ సుభాష్(Atul Subash) కోసం పుట్టుకొచ్చిన #JusticIsDue హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియా నుంచి కనుమరుగు కాలేదు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిఖితా సింఘానియా బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. అయితే.. బిడ్డను సాకుగా చూపి బెయిల్ పొందలేరంటూ బెంగళూరు కోర్టు నిఖిత లాయర్‌కు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తదుపురి వాదనలు జనవరి 4వ తేదీన వింటామంది. మరోవైపు.. బెంగళూరు హైకోర్టులోనూ నిఖితా సింఘానియా ఓ పిటిషన్ వేసింది. అదే టైంలో.. మనవడి సంరక్షణ కోరుతూ అతుల్ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పైనా హైకోర్టు విచారణ జరపుతోంది. ఈ క్రమంలో నిఖితా సింఘానియా రిమాండ్‌లో ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని బెంగళూరు హైకోర్టు అతుల్ పేరెంట్స్‌కు సూచించింది.కొడుకును వంకగా పెట్టుకుని భార్య తన నుంచి డబ్బు గుంజుతోందని.. తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పుతూ తనను వేధిస్తోందంటూ 90 నిమిషాల వీడియో.. పేజీలకొద్దీ మరణ వాంగ్మూలం రాసి బెంగళూరు మరాథాహల్లి నివాసంలో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకన్నాడు. ఆయన సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 108, రెడ్‌విత్ 3(5) కింద మారథాహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న నిఖితను, అటు ఆమె తల్లి సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. అయితే.. తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధించిన మాట వాస్తవమేనని, అతని మృతిలో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానూ ఎలాంటి ప్రమేయం లేదని నిఖిత మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. -
భార్యపై కోపం.. రెండు బస్తాల నాణేలతో కోర్టుకు భర్త.. తర్వాత ఏమైందంటే..
సాక్షి, చైన్నె: తన భార్యకు భరణంగా ఇవ్వాల్సిన రూ. 2 లక్షలు మొత్తాన్ని చిల్లరగా 20 బస్తాలలో కోర్టుకు ఓ భర్త గురువారం తీసుకొచ్చాడు. ఈ చిలర్ల చూసి షాక్‌కు గురైన న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆ చిల్లర మొత్తాన్ని నోట్లుగా మార్చి సమర్పించాలని ఆదేశించారు. వివరాల ప్రకారం.. కోయంబత్తూరుకు చెందిన దంపతులు గతంలో విడాకుల కోసం కోర్టుకు ఎక్కారు. ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఈ క్రమంలో గురువారం కేసు విచారణకు రాగా, తనకు భరణం ఇప్పించాలని ఆ భార్య కోర్టుకు విన్నవించారు. దీంతో, న్యాయమూర్తి ఆ భర్తకు ఆదేశాలు ఇచ్చారు. రూ. 2 లక్షలు భరణం అందజేయాలని సూచించారు. దీనిని ముందే గ్రహించిన ఆ భర్త వినూత్న ప్రయోగం చేసి కంగు తిన్నాడు. తన భార్య మీదున్న కోపంతో కోర్టు నుంచి బయటకు వెళ్లి తన కారులో ఉన్న బస్తాలు ఒకొక్కటిగా తీసుకొచ్చి పెట్టారు. అనంతరం, 20 బస్తాలను కోర్టులో ఉంచి, ఇదిగోండి రూ. 2 లక్షలు అంటూ సూచించాడు. న్యాయమూర్తి ప్రశ్నించగా, రూ. 80 వేలకు ఒక్క రూపాయి నాణెలు, మిగిలిన మొత్తం రూ. 5 ,రూ. 10, రూ. 20 నాణేలు అంటూ వివరించాడు. దీనిని విన్న అక్కడున్న వారంతా అవ్వాక్కయారు. ఇతడు ఇచ్చిన షాక్ నుంచి తేరుకున్న జడ్జి మరో ఉత్తర్వు ఇచ్చారు. ఈచిల్లరను నోట్లుగా మార్చి తీసుకొచ్చి ఇవ్వాలని ఆదేశించారు. దీంతో ఆ భర్త చిల్లర బస్తాలను కోర్టు నుంచి మళ్లీ తన కారు వద్దకు మోసుకెళ్లాల్సి వచ్చింది. ఈ వ్యవహారం కోయంబత్తూరుకోర్టు ఆవరణలో సర్వత్రా హాస్యాన్ని పంచినట్లయ్యింది. విచారణ వాయిదా పడడంతో చిల్లర బస్తాలతో ఆ భర్త తాను వచ్చిన కారులోనే వెళ్లియాడు. -
#MenToo: మరో భార్యా బాధితుడి బలవన్మరణం
సేలం: అతుల్ సుభాష్ ఘటన తర్వాత.. ఆ తరహా భార్యాబాధితుల ఉదంతాలు ఒక్కొక్కటిగా తెర మీదకు వస్తున్నాయి. తాజాగా.. భార్య వేధింపులతో ఓ భర్త, తన తల్లిదండ్రులతో సహా బలవన్మరణానికి పాల్పడ్డాడు. తమిళనాడు నామక్కల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.వివాహం జరిగిన ఐదు నెలలకే వేరు కాపురం పెట్టాలని భార్య గొడవ చేసి పుట్టింటికి వెళ్లిపోవడంతో భర్త ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడగా, ఒక్కగానొక్క కుమారుడు మృతి చెందడం తట్టుకోలేక తల్లిదండ్రులూ ఆత్మహత్య చేసుకుని మరణించిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఎరుమపట్టి సమీపంలో ఉన్న ఎ.వాళవంది గ్రామానికి చెందిన సెల్వరాజ్ (55) పెయింటర్, ఇతని భార్య పూంగొడి (50) కూలీ కార్మికురాలు. వీరి కుమారుడు సురేంద్రన్(28) వంట కార్మికుడు. ఇతనికి వేట్టంపాడికి చెందిన స్నేహ అనే యువతితో ఐదు నెలల క్రితం వివాహం జరిగింది.వేరు కాపురం చిచ్చుఈ స్థితిలో స్నేహ పెళ్లయినప్పటి నుంచే వేరు కాపురం పెట్టాలని భర్తను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయంగా భార్యాభర్తల మధ్య అప్పుడప్పుడు గొడ వలు జరిగేవి. అదే విధంగా శనివారం కూడా సురేంద్రన్, స్నేహల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో స్నేహ అలిగి తన పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో తీ వ్ర ఆవేదన చెందిన సురేంద్రన్ ఇంటిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దిగ్భ్రాంతి చెందిన తల్లిదండ్రులు కుమారుడి మృతి తట్టుకోలేక వారు కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఒకరి తర్వాత ఒకరు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు.ముగ్గురి ఆత్మహత్యఈ స్థితిలో ఆదివారం ఉదయం ఆ ఇంటి నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో సందేహించిన ఇరుగుపొరుగు వారు వెళ్లి చూడగా ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడి ఉండడం చూసి దిగ్భ్రాంతి చెందారు. సమాచారం అందుకున్న ఎరుమపట్టి పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అదేవిధంగా నామక్కల్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ ఆకాష్ జోసి, నల్లిపాళయం ఇన్స్పెక్టర్ యువరాజ్, పోలీసులు అక్కడికి వచ్చి ముగ్గురి మృతదేహాలను స్వాధీనం చేసుకుని శవపంచనామా నిమిత్తం నామక్కల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు పాల్పడిన సురేంద్రన్ సెల్ఫోన్లో పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలించగా, అందులో ఆత్మహత్యకు ముందు సురేంద్రన్ వీడియో తీసి ఉండడం తెలిసింది. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని స్నేహ, వారి కుటుంబసభ్యుల వద్ద విచారణ జరుపుతున్నారు. పెళ్లయిన ఐదు నెలలకే కుమారుడు, తల్లి, తండ్రి బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర శోకాన్ని నింపింది.ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001మెయిల్: roshnihelp@gmail.com -
#Mentoo: ఓ డాక్టర్.. ఓ పోలీస్.. ఇలా ఎందరో?
చట్టం ముందు అందరూ సమానమే.. ఇది అనుకోవడానికే తప్ప ఆచరణలో లేదనేది ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్న మాట. ఇంతకాలం పేద-ధనికలాంటి తారతమ్యాలు వినిపిస్తే.. ఇప్పుడు ఆడ-మగగా మారిందది. అతుల్ సుభాష్ అనే టెక్కీ బలవన్మరణం నేపథ్యంతో ఈ చర్చ మరింత వేడిని రాజేస్తోంది. బెంగళూరు, ఢిల్లీ.. ఇలా మెట్రో నగరాల్లో జస్టిస్ ఫర్ అతుల్ పేరిట సంఘీభావ ప్రదర్శనలు చేసే స్థాయికి చేర్చింది. భార్య కుటుంబం పెట్టిన వేధింపులు.. తప్పుడు కేసులను భరించలేక.. వ్యవస్థతో పోరాడటంలో తడబడిన అతుల్ సుభాష్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. కానీ, అతని చివరి కోరికగా.. న్యాయం కోసం అతని తరఫున మేం పోరాడతాం అంటూ కొందరు భర్తలు రోడ్డెక్కారు. దేశ జనాభాలో ట్యాక్సులు కట్టేవాళ్లలో మగవాళ్లదే సింహభాగం. కానీ, చట్టాలు మాత్రం కేవలం మహిళల పక్షమే వ్యవరిస్తున్నాయని అంటున్నారు. సమాజంలో పురుషుల ప్రాణాలూ ముఖ్యమేనని.. వారికీ చట్టపరమైన రక్షణ కావాలని ముక్తకంఠంతో కోరుతున్నారు వాళ్లు. అయితే.."70 Crore men pay tax in India, not even one welfare scheme for men is funded by our own taxes."Delhi joins Bengaluru in nation wide protests for Atul Subhash's suicide due to harassment by wife and judiciary. pic.twitter.com/RZwJgql0sf— Mick Kay (@mick_kaay) December 14, 2024 అతుల్ ఘటన తర్వాత.. ఈ బర్నింగ్ టాపిక్కు మరో రెండు ఘటనలు తోడయ్యాయి. కర్ణాటకలో హులిమవు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ హెచ్‌సీ తిప్పన్న(34) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి రైలు పట్టాలపై పడుకుని చితికిపోయాడు. భార్య, ఆమె కుటుంబం పెట్టే నరకం భరించలేకే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తిప్పన్న రాసిన ఓ సూసైడ్ నోట్ చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు..డిసెంబర్11వ తేదీన.. రాజస్థాన్‌లో హోమియోపతి డాక్టర్ అజయ్ కుమార్(35) కృతినగర్‌లోని తన క్లినిక్‌లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చావుకు భార్య వేధింపులే కారణమంటూ లేఖ రాశాడు. భార్యను పచ్చిబూతులు తిడుతూ రాసిన ఆ లేఖలో.. ప్రస్తుత వైవాహిక వ్యవస్థను, ఆ వ్యవస్థ కారణంగా తాను ఎదుర్కొన్న న్యాయపరమైన చిక్కులను, తన నిస్సహాయతను ఆ లేఖలో ప్రముఖంగా ప్రస్తావించాడు. జస్టిస్ ఈస్ డ్యూబెంగళూరులో ఓ ప్రముఖ కంపెనీలో ఏఐ ఇంజినీర్‌గా పని చేస్తున్న యూపీవాసి అతుల్ సుభాష్.. నగరంలోని తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భార్య, ఆమె కుటుంబం తనను ఎంతగా వేధించిందో పే..ద్ద సూసైడ్ నోట్ రాసి.. గంటన్నరపాటు వీడియో తీసి Justice Is Due అని శరీరానికి అంటించుకుని మరీ బలవన్మరణానికి పాల్పడ్డారు. సుప్రీం కోర్టు తన గోడును వినాలని.. తనకు న్యాయం దక్కని తరుణంలో.. తన అస్తికలను కోర్టు బయటే మురికి కాలువలో కలపాలని.. ఒకవేళ న్యాయం దక్కితే పవిత్ర గంగలో కలపాలని డెత్ నోట్లో కోరాడతను. ఈ క్రమంలో పేజీల కొద్దీ అతుల్ వ్యధ.. ముఖ్యంగా తన కొడుకును ఉద్దేశించి రాసిన లేఖ.. చివరి బహుమతి.. అన్నీ చాలామందిని భావోద్వేగానికి గురి చేసింది.ఇక.. తన సోదరుడి మరణం వెనుక ఆయన భార్య నిఖితా సింఘానియా కుటుంబ ప్రొద్భలం ఉందని అతుల్ సోదరుడు మారతహల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిఖిత కోసం అతుల్ చేయగలిగిందంతా చేశాడని.. అయినా తన సోదరుడి ప్రాణం పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడతను. ఈ కేసు దీంతో.. బెంగళూరు పోలీసులు ఆమె స్వస్థలం ఔన్పూర్కు పంపించారు. గత మూడు రోజులుగా ఆ టీం దర్యాప్తు జరుపుతోంది. అయితే.. నిందితురాలు నిఖిత ఇంటికి తాళం వేసి ఉండడంతో గోడకు నోటీసులు అంటించారు. కచ్చితంగా పోలీసుల ఎదుట హాజరుకావాల్సిందేనని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అతుల్ మృతి తర్వాత.. రెండ్రోజులకు కొన్ని మీడియా సంస్థలు నిఖిత నివాసానికి చేరుకున్నాయి. ఆమె అందుబాటులో లేకపోగా.. సోదరుడు, తల్లి మాత్రం మీడియాను ఉద్దేశించి దుర్భాషలాడారు. ఆపై రెండ్రోజులకే వాళ్లు కూడా పరార్ కావడం గమనార్హం.ఒక భార్య.. ‘ఏడు’ భరణం కేసులువైవాహిక చట్టాల దుర్వినియోగంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ.. అలాంటి ఘటనలు మరోసారి తెరపైకి వస్తున్నాయి. ఈ ఏడాది ఆగష్టులో చట్టంతో ఆడుకున్న ఓ భార్య ఉదంతం చర్చనీయాంశమైంది..ఒకావిడ తన భర్త నుంచి భరణం కోరుతూ కోర్టును ఆశ్రయించింది. అయితే ఆ భర్త ఆమెకు ఏడో భర్త. అప్పటికే ఆరుగురు మాజీ భర్తల నుంచి విడాకులు తీసుకుని. భరణం కోసం కోర్టును ఆశ్రయించింది. ఇక.. ఏడో భర్త నుంచి భరణం అడిగిన కేసులో న్యాయమూర్తి ఆ అంశాన్ని ప్రస్తావించారు.SERIAL 498A ACCUSER A WOMAN IN KARNATAKA HAS MARRIED 7 TIMESSTAYED WITH EACH MAX 1 YEARFILED 498A, MAINTENANCE CASES ON ALLTAKEN MONEY FROM 6 HUSBANDSNOW FIGHTING CASE WITH 7TH Despite having all records with him, MiLord not sending her to JailJAI HO EQUALITY 🙏 pic.twitter.com/3zpdBFNP1m— Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) July 26, 2024ప్రతీ భర్తతో ఆరు నెలల నుంచి ఏడాది పాటు ఆమె కాపురం చేసి.. విడాకులకు వెళ్లిందని జడ్జి వ్యాఖ్యానించారు. ఈ విషయం ప్రస్తావిస్తూ.. చట్టంతో మీరు ఆడుకుంటున్నారు అని మహిళను సదరు జడ్జి మందలించారు. అలాగే.. ఆ ఆరుగురి నుంచి ఆమె భరణం భారీగానే పుచ్చుకుందట. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది కూడా. కర్ణాటకలోనే మరో ఉదంతంలో..ఓ మహిళ తన మాజీ భర్త నుంచి నెలకు రూ.6,16,300 భరణం ఇప్పించమని కోర్టును కోరింది. అయితే ఈ పిటిషన్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన జడ్జి.. అంత ఖర్చులు ఉంటే డబ్బులు సంపాదించుకోవాలంటూ ఆ మహిళకు సూచించింది. ఇదే సమయంలో భరణం అనేది భర్తకు శిక్ష కాదని గుర్తు చేసింది.ఇదీ చదవండి: అతుల్ మృగంలా ప్రవర్తించాడు: నికిత ఆరోపణ