general secretary
-
సంస్కరణవాది.. స్థిత ప్రజ్ఞుడు
సాక్షి, నేషనల్ డెస్క్/సాక్షి, హైదరాబాద్: బహుభాషావేత్తగా, కాలమిస్ట్‌గా, రాజకీయవేత్తగా, వామపక్షవాదిగా సీతారాం ఏచూరిది సుదీర్ఘ ప్రస్థానం. అటు పార్టీ అగ్రనేతగా కొనసాగుతూనే ఇటు ఎర్రజెండా పట్టుకుని పలు ప్రజా ఉద్యమాల్లో తలమునకలయ్యారు. సమకాలీన భారత రాజకీయాల్లో అత్యంత కీలకమైన వామపక్ష నేతగా కొనసాగారు. తుదిశ్వాస వరకూ బడుగు, బలహీన, అణగారిన వర్గాల కోసం పాటుపడి నిఖార్సయిన కామ్రేడ్‌గా పేరు నిలబెట్టుకున్నారు. అద్భుతమైన వాక్పటిమతో సంప్రదింపులు జరపడంలో దిట్టగా ఏచూరికి పేరుంది.తెలుగు కుటుంబంలో జననం.. : సీతారాం ఏచూరి 1952, ఆగస్టు 12న చెన్నైలో స్థిరపడిన తెలుగు వాస్తవ్యులు ఏచూరి సర్వేశ్వర సోమయాజి, కల్పకం దంపతులకు జని్మంచారు. స్వస్థలం కాకినాడ కాగా బాల్యం అంతా అక్కడే గడిచింది. రామారావుపేటలో ప్రస్తుతం ఏచూరి పేరుతో ఉన్న అపార్టుమెంట్ స్థలంలోనే ఏచూరి కుటుంబ సభ్యుల ఇల్లు ఉండేది. తండ్రి సోమయాజి బదిలీపై విజయవాడ ఆరీ్టసీలో ఉన్నతాధికారిగా పనిచేసిన సమయంలో ఆరు, ఏడు తరగతులను ఏచూరి విజయవాడలో చదువుకున్నారు. ఏచూరికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మోహన్ కందా స్వయానా మేనమామ. చెన్నైలోని మేనమామ ఇంట్లో ఆయన జని్మంచారు. హైదరాబాద్ ఆల్ సెయింట్స్‌లో, ఢిల్లీలో హైసూ్కల్ విద్యను అభ్యసించారు. సీబీఎస్ఈ పరీక్షలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించారు. సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో బీఏ (ఆనర్స్) ఆర్థిక శాస్త్రం, జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ)లో ఆర్థికశాస్త్రంలో ఎంఏ పట్టా పొందారు. సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక పాత్ర..తన గురు సమానులు హర్కిషన్ సింగ్ సుర్జీత్లాగా 2004–2014 కాలంలో ఏచూరి సంకీర్ణ ప్రభుత్వాల్లో కీలక భూమిక అయ్యారు. 2004లో ప్రధాని పదవిని సోనియా గాంధీ తిరస్కరించాక నాటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్‌కలాం తర్వాత సోనియా కలిసిన తొలి కాంగ్రెసేతర నేత ఏచూరినే. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వంలో కనీస ఉమ్మడి కార్యాచరణ రూపకల్పనలో కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరంతో కలిసి పనిచేశారు. యూపీఏ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్‌కు అత్యంత నమ్మదగ్గ నేస్తంగా ఉన్నారు. నెగ్గిన ఏచూరి బడ్జెట్ సవరణల ప్రతిపాదన..గతంలో బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించి అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేసిన ప్రసంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానానికి రాజ్యసభలో ఏచూరి సవరణలు ప్రతిపాదించారు. దీనిపై జరిగిన ఓటింగ్‌లో ఆయన చేసిన సవరణల ప్రతిపాదన నెగ్గింది. రాజ్యసభ చరిత్రలో ఇలా జరగటం కేవలం నాలుగోసారి మాత్రమే. ఒబామా రాకను వ్యతిరేకించిన సందర్భం..అమెరికాపై విమర్శలు చేయడంలో ఏచూరికి ఓ ప్రత్యేకత ఉంది. ఇస్లాం ఛాందసవాదం పెరగడానికి అమెరికానే కారణం అంటూ చురుకైన విమర్శలు చేసేవారు. గణతంత్ర వేడుకలకు అప్పటి అమెరికా అధ్యక్షుడు ఒబామా ముఖ్య అతిథిగా రావడాన్ని ఏచూరి వ్యతిరేకించారు. ఇటీవల మోదీ ప్రభుత్వం తీసుకొచి్చన సీఏఏ, ఎన్ఆర్సీ చట్టాలను, జమ్మూ, కాశ్మీర్లో ఆర్టికల్ 370, 35అ రద్దును కూడా ఆయన వ్యతిరేకించారు. ఇండియా కూటమికి కృషి..పార్లమెంట్ వేదికగా సామాన్యుల సమస్యలను ఎలుగెత్తి, ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలను దునుమాడారు. విపక్షాలను ‘ఇండియా’ కూటమిగా ఏకతాటి మీదకు తేవడంలో కూడా ఏచూరి పాత్ర కీలకమైంది. లోక్‌సభలో విపక్షనేతగా మోదీ సర్కార్‌ను తూర్పారబడుతున్న రాహుల్‌గాంధీకి రాజకీయ గురువుల్లో ఒకరిగా ఈయనకు పేరుంది. ఇతర భాషల్లోనూ అనర్గళంగా..అచ్చ తెలుగు వ్యక్తి అయిన ఏచూరి హిందీ, తమిళం, బెంగాళీ, మలయాళం సైతం అనర్గళంగా మాట్లాడేవారు. హిందూ పురాణాలను ఔపోసన పట్టిన ఏచూరి సందర్భోచితంగా తన ప్రసంగాల్లో వాటిని ఉదహరిస్తూ బీజేపీకి చురకలంటించేవారు. సాంకేతికతను అందిపుచ్చుకుని సామాజిక మాధ్యమాల్లో తరచూ పోస్ట్‌లు పెట్టేవారు. ప్రకాశ్‌కారత్ నుంచి పార్టీ పగ్గాలు తీసుకున్న ఏచూరి సౌమ్యంగా ఉంటూనే పార్టీలో కఠిన నిర్ణయాలు తీసుకుంటూ ముక్కుసూటిగా వ్యవహరించే నేతగా పేరొందారు. మా భుజాలపై తుపాకులు పెట్టి తప్పించు కుంటారా? తెలంగాణ ఏర్పాటు విషయంలో రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తోందన్న విమర్శలు వచ్చాయి. కొన్ని పక్షాలు ఒప్పుకోవడం లేదన్న భావనతోకాంగ్రెస్ పార్టీ వ్యవహరించేది. అలాంటి సందర్భంలో తెలంగాణపై జరిగిన చర్చలో సీతారాం ఏచూరి ‘తెలంగాణపై ఏ పార్టీ అభిప్రాయాలు ఆ పారీ్టకి ఉంటాయి. ఆయా పారీ్టల అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా? తెలంగాణపై మీరేం చేయాలనుకుంటున్నారో అది చేయండి. అంతేగానీ మా భుజాలపై తుపాకులు పెట్టి పేల్చాలనుకోవడం సరికాదు..’ అని ఏచూరి కాంగ్రెస్‌కు గట్టి కౌంటర్ ఇచ్చారని పార్టీ నేత జూలకంటి రంగారెడ్డి గుర్తు చేశారు. మూడుసార్లు ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక 2015లో విశాఖలో జరిగిన సీపీఐ(ఎం) సదస్సులో పారీ్టకి ఐదో ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. 2018 ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో జరిగిన సదస్సులో, 2021 కోజికోడ్ మహాసభలోనూ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం అదే హోదాలో ఆయన మృతి చెందారు. ఏచూరి మొదటి భార్య ఇంద్రాణి మజుందార్ కాగా ప్రముఖ జర్నలిస్టు సీమా ఛిస్తీని రెండో వివాహం చేసుకున్నారు. కుమార్తె అఖిల, ఇద్దరు కుమారులు ఆశిష్, డ్యానిష్ కాగా.. 34 ఏళ్ల పెద్ద కుమారుడు ఆశిష్ 2021లో కోవిడ్‌తో కన్నుమూశారు. అఖిల.. యూనివర్సిటీ ఆఫ్ ఎడెన్‌బర్గ్, యూనివర్సిటీ ఆఫ్ సెయింట్ ఆండ్రూస్‌లో బోధిస్తారు.ఎస్ఎఫ్ఐలో చేరికతో.. 1974లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)లో చేరికతో ఏచూరి రాజకీయ ప్రస్థానం మొదలైంది. 1975లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్)లో సభ్యుడు అయ్యారు. పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరించిన ఏచూరి అనేక ఉద్యమాల్లో భాగస్వాములు అయ్యారు. 1975లో దేశంలో అత్యవసర పరిస్థితి విధించిన సమయంలో అరెస్టై కొన్నాళ్లు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో జేఎన్‌యూలో పీహెచ్డీ చేస్తున్న ఆయన..ఆ కారణంగా డాక్టరేట్ పూర్తి చేయలేకపోయారు. ఎంతోమంది సన్నిహితుల మధ్య తాను డాక్టరేట్ పూర్తి చేయలేకపోయానని ప్రస్తావిస్తూ బాధపడుతుండేవారు.దేశంలో అత్యవసర పరిస్థితిని ఎత్తివేసిన తర్వాత ఏచూరి జేఎన్‌యూ విద్యార్థి నాయకుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1978లో ఎస్ఎఫ్ఐ సంయుక్త కార్యదర్శిగా, ఆ తర్వాత అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. పశి్చమ బెంగాల్, కేరళయేతర వ్యక్తి ప్రెసిడెంట్ కావడం అదే తొలిసారి కావడం విశేషం. కాగా 1984లో సీపీఐ(ఎం) కేంద్ర కమిటీకి ఆయన ఎన్నికయ్యారు. 1992లో పొలిట్‌బ్యూరో సభ్యుడయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా, వివిధ కమిటీల్లో..2005లో పశి్చమబెంగాల్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఇదే ఏడాది హోం వ్యవహారాల కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2006 రవాణా, పర్యాటకం, సాంస్కృతిక కమిటీలకు చైర్మన్‌గా, సాధారణ ప్రయోజనాల కమిటీలో సభ్యుడిగా, జనాభా, ప్రజా ఆరోగ్యంపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ఫోరంలో సభ్యుడిగా, విలువల కమిటీలో సభ్యుడిగా, బిజినెస్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా నియమితులై సేవలు అందించారు. 2009లో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కాన్సులేటివ్ కమిటీతో పాటు, పార్లమెంట్ హౌస్‌లో దేశ నాయకులు, పార్లమెంటేరియన్ల చిత్రపటాలు, విగ్రహాల ఏర్పాటుకు ఉద్దేశించిన కమిటీలో సభ్యుడిగా నియమితులయ్యారు. 2010లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ వరల్డ్ అఫైర్స్‌లో సభ్యుడిగా ఉన్నారు. 2011లో తిరిగి రాజ్యసభకు తిరిగి ఎన్నికయ్యారు. 2012లో వ్యవసాయ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు.గొప్ప రచయిత ఏచూరి గొప్ప రచయితగా కూడా పేరు సంపాదించారు. పారీ్టకి చెందిన వారపత్రిక పీపుల్స్ డెమోక్రసీకి రెండు దశాబ్దాలకు పైగా సంపాదకులుగా పనిచేశారు. సైద్ధాంతిక రంగంలో, హిందూత్వంపై ఆ పుస్తకంలో విమర్శలు చేసేవారు. ఇలా రచయితగా మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించారు. ‘లెఫ్ట్ హ్యాండ్ డ్రైవ్’ పేరుతో ఆంగ్లపత్రికకు కాలమ్స్ రాసేవారు. ‘క్యాస్ట్ అండ్ క్లాస్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ టుడే’, ‘సోషలిజం ఇన్ ఛేంజింగ్ వరల్డ్’, ‘మోదీ గవర్నమెంట్’, ‘న్యూ సర్జ్ ఆఫ్ కమ్యూనలిజం’, ‘కమ్యూనిలజం వర్సెస్ సెక్యులరిజం’ వంటి పుస్తకాలను రాశారు. ఏచూరికి పాత హిందీ పాటలంటే ఎంతో ఇష్టం. సినిమాలు చూసేందుకు ఏచూరితో కలిసి రఫీ మార్గ్ నుంచి చాణక్య ప్రాంతానికి నడుచుకుంటూ వెళ్లే వాళ్లమని తోటి సీపీఎం నేతలు నాటి సంగతులు చెప్పారు. 1977అక్టోబర్ నెల.. ఓ నూనూగు మీసాల యువకుడి నాయకత్వంలో వందలాది మంది విద్యార్థులు ఢిల్లీ వీధుల్లో కదం తొక్కారు. ఉక్కు మహిళగా పేరొందిన ఇందిరాగాంధీ ఇంటికి వారంతా ర్యాలీగా వెళ్లారు. ఎమర్జెన్సీ అనంతరం జరిగిన ఎన్నికల్లో ఇందిర నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినప్పటికీ ఆమె జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ చాన్స్‌లర్ పదవిని మాత్రం వీడలేదు. దీన్ని వ్యతిరేకిస్తూ వారంతా నినాదాలు చేయడం ప్రారంభించారు. చివరికి ఇందిర తన నివాసం నుంచి బయటకు వచ్చారు. అప్పుడు లేచాడు.. జేఎన్‌యూ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ సీతారాం ఏచూరి. ఇందిర పక్కనే నిల్చుని.. ఆమె రాజీనామానే డిమాండ్ చేస్తూ.. మెమోరాండంను చదివి వినిపించాడు. ఈ ఘటన జరిగిన కొన్ని రోజులకే ఇందిర చాన్స్‌లర్ పదవికి రాజీనామా చేశారు.అసాధారణ నేత..⇒ ఏచూరి మరణం తీవ్ర విషాదకరం. విద్యార్థి నేతగా మొదలై జాతీయ రాజకీయాల్లో కీలకంగా మారి పార్లమెంటేరియన్‌గా ఉంటూ ప్రజావాణిని వినిపించిన నేతను కోల్పోవడం విచారకరం. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే అన్ని రాజకీయపార్టీల నేతలతో మైత్రి కొనసాగించారు. ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. –ద్రౌపదీ ముర్ము, రాష్ట్రపతి⇒ ఐదు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో దేశ ప్రజాస్వామ్యం పటిష్టతకు ఏచూరి అవిశ్రాంతంగా కృషి చేశారు. ప్రజాసేవలో అలుపెరగక పనిచేశారు. – జగదీప్ ధన్‌ఖడ్, ఉప రాష్ట్రపతి⇒ వామపక్షాలకు ఏచూరి దారి దీపంగా మారారు. ప్రజా ఉద్యమాలను ముందుండి నడిపించారు. పార్టీలకతీతంగా అందరి నేతలతో కలిసిపోయే సామర్థ్యం ఆయన సొంతం. అలాంటి ఏచూరిని కోల్పోవడం విషాదకరం. పార్లమెంట్ సభ్యునిగా తనదైన ముద్ర వేశారు. ఈ విషాదకాలంలో ఆయన కుటుంబానికి మేమంతా అండగా నిలుస్తాం. – నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి⇒ ఏచూరి మరణం రాజకీయ రంగానికి తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు, పార్టీ నేతలకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను –కేంద్ర హోంమంత్రి, అమిత్ షా⇒ లౌకిక చాంపియన్ ఏచూరి. దేశ భిన్నత్వాన్ని పరిరక్షించడంలో తన నిబద్ధత చాటారు. 2004–08 ప్రభుత్వంలో కలిసి పనిచేశాం. చిరకాలం కమ్యూనిస్ట్‌గా ఉన్నా ఆయన మూలాలు ప్రజాస్వామ్య విలువల్లో దాగి ఉన్నాయి. – సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్⇒ ఆయన నాకు అత్యంత ఆప్తుడు. దేశాన్ని లోతుగా అర్థం చేసుకున్న నేత. భారతదేశ ఆలోచన (ఐడియా ఆఫ్ ఇండియా)కు రక్షకుడు ఆయన. – రాహుల్ గాంధీ, లోక్‌సభలో విపక్షనేత⇒ సమకాలీన కమ్యూనిస్టు ఉద్యమాలకు సంబంధించిన అసాధారణ నేతల్లో ఏచూరి ఒకరు. దశాబ్దాల క్రితం ఆయన విద్యార్థి సంఘంలో, నేను ఆలిండియా యూత్ ఫెడరేషన్లో పనిచేశాం. ఆయన మరణం ప్రజాస్వామ్య వర్గాలకు తీరని లోటు. –డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి⇒ ఏచూరి మరణం భారత కమ్యూనిస్టు ఉద్యమానికి తీరని లోటు. ప్రజా, దేశ సమస్యలు ప్రస్తావించే ఒక గొంతు మూగబోయింది. పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత వామపక్షాల ఐక్యతను విస్తృతం, పటిష్టం చేసేందుకు మంచి కృషి చేశారు. – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ⇒ కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ, పశ్చిమబెంగాల్, కేరళ సీఎంలు మమతా బెనర్జీ, పినరయి విజయన్, భారత్‌లో చైనా రాయబారి ఫెహోంగ్ తదితరులు ఏచూరి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.⇒ ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తి దాయకం. ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. – ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి⇒ సామ్యవాద భావాలు కలిగిన ఏచూరి.. మరణం భారత లౌకిక వాదానికి, కార్మిక లోకానికి తీరని లోటు. శోకతప్తులైన వారి కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ⇒ ఏచూరి భారత దేశ రాజకీయాల్లో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో ఒకరు. ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరనిలోటు. – ఏపీ సీఎం చంద్రబాబు⇒ దత్తాత్రేయ, కేంద్ర మంత్రుల సంతాపం..: ఏచూరి మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర మంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు డా.కె.లక్ష్మణ్, బీఏఎల్పీనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం ప్రకటించారు. ⇒ ప్రముఖుల సంతాపం..: శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, సీతక్క, అసదుద్దీన్ ఒవైసీ, మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్ ముదిరాజ్, తదితరులు ఏచూరి మరణంపై సంతాపం వ్యక్తం చేశారు. -
మోదీపై ఫిర్యాదు: సీతారాం ఏచూరి
కోజికోడ్: ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ప్రకటనలు చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. శ్రీరాముడి అంశంపై ప్రజలను మతపరంగా సంఘటితం చేసేలా పలు ప్రకటనలు చేశారని, దీనిపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు. కోడ్‌ను ఉల్లంఘించేలా మోదీ మాట్లాడిన మాటలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఏచూరి గురువారం కేరళలోని కోజికోడ్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం అలుపెరుగని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. -
పైలట్‌కు ‘ఛత్తీస్’ బాధ్యతలు
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ రాజస్తాన్ మాజీ ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్‌కు పారీ్టలో కీలక పదవి అప్పగించింది. ఛత్తీస్‌గఢ్ ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ శనివారం ఒక ప్రకటనలో పేర్కొంది. సోనియా గాం«దీ, రాహుల్ గాంధీ సభ్యులుగా, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో సీడబ్ల్యూసీ భేటీ జరిగిన రెండు రోజులకే ఇలా పలువురు ప్రధాన కార్యదర్శలు, ఇన్‌చార్జ్‌ల బాధ్యతలను మార్చడం గమనార్హం. ఢిల్లీ, హరియాణా ఇన్చార్జ్ బాధ్యతలను దీపక్ బబారియాకు అప్పగించారు. కూమారి సెల్జాను ఉత్తరాఖండ్ ఇన్చార్జ్ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. మాణిక్కం ఠాగూర్‌ను అండమాన్ అండ్ నికోబార్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా నియమించారు. జార్ఖండ్ ప్రధాన కార్యదర్శి జీఏ మిర్‌కు పశ్చిమబెంగాల్ బాధ్యతలూ అప్పగించారు. జితేంద్ర సింగ్‌కు మధ్యప్రదేశ్ బాధ్యతలు కట్టబెట్టారు. మహారాష్ట్ర ఇన్చార్జ్గా రమేశ్ చెన్నితల, బిహార్ ఇన్చార్జ్గా మోహన్ ప్రకాశ్ నియమితులయ్యారు. మేఘాలయ, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్‌లకు ఇన్చార్జ్గా చెల్లకుమార్ ఎంపికయ్యారు. అజయ్ కుమార్‌కు తమిళనాడు, పుదుచ్చేరి అదనపు బాధ్యతలు ఇచ్చారు. జమ్మూకశ్మీర్ ఇన్చార్జ్గా భరత్సిన్హ్ సోలంకీ, హిమాచల్, చండీగఢ్ ఇన్చార్జ్గా రాజీవ్ శుక్లా, రాజస్తాన్ ఇన్చార్జ్గా సుఖ్జీందర్ సింగ్ రణ్‌ధావా, పంజాబ్ ఇన్చార్జ్గా దేవేందర్ యాదవ్, గోవా, డామన్, డయ్యూ, దాద్రానగర్, హవేలా ఇన్చార్జ్గా మాణిక్‌రావు థాకరేను నియమించారు. త్రిపుర, సిక్కిం, మణిపూర్, నాగాలాండ్‌లకు గిరీశ్ చోదంకర్ను ఇన్చార్జ్గా నియమించారు. తెలంగాణ ఇంఛార్జ్‌గా దీపా దాస్‌మున్షీ, ఏపీకి మాణిక్కం ఠాగూర్‌ను నియమించారు. ప్రియాంక చేజారిన యూపీ ఉత్తర్‌ప్రదేశ్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాం«దీని తప్పించడం గమనార్హం. ప్రియాంక గాం«దీకి ప్రధాన కార్యదర్శి పదవి ఉన్నాసరే ఆమెకు ఎలాంటి పోర్ట్‌ఫోలియో కేటాయించలేదు. అవినాశ్ పాండేకు ఉత్తరప్రదేశ్ బాధ్యతలను కట్టబెట్టారు. అజయ్ మాకెన్ పార్టీ కోశాధికారిగా ఉంటారు. -
మధ్యప్రదేశ్ ఇన్చార్జిగా సూర్జేవాలా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ గురువారం సంస్థాగతంగా కీలక మార్పులను ప్రకటించింది. త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సిన మధ్యప్రదేశ్‌కు పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్చార్జిగా రణదీప్ సూర్జేవాలాను నియమించింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఎమ్మెల్యే అజయ్ రాయ్‌కు అప్పగించింది. గుజరాత్ జనరల్ సెక్రటరీ ఇన్చార్జిగా ముకుల్ వాస్నిక్‌ను పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నియమించారని ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం పార్టీ కర్ణాటక ఇన్చార్జిగా ఉన్న సూర్జేవాలా మధ్యప్రదేశ్ బాధ్యతలు అదనంగా నిర్వహిస్తారు. సూర్జేవాలాను మధ్యప్రదేశ్ సీనియర్ ఎన్నికల పరిశీలకుడిగా ఇటీవలే పార్టీ నియమించింది. అజయ్ రాయ్ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి ప్రధాని మోదీపై పోటీ చేశారు. దళిత నేత, యూపీ పార్టీ చీఫ్ బ్రిజ్‌లాల్ ఖబ్రి స్థానంలో రాయ్ తక్షణమే నూతన బాధ్యతలు చేపడతారని పార్టీ ప్రకటన పేర్కొంది. -
పన్నీర్ సెల్వంకు భారీ షాక్
తమిళనాడు రాజకీయాల్లో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకేలో వర్గ పోరులో.. కోర్టు తీర్పు ద్వారా పళనిస్వామి మళ్లీ పైచేయి సాధించారు. పార్టీ నుంచి తనను బహిష్కరించడంతో పాటు ఏఐఏడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి పళనిస్వామి చేపట్టడాన్ని సవాల్ చేస్తూ పన్నీర్‌సెల్వం మద్రాస్ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు ఇవాళ(మంగళవారం) ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. మద్రాస్ హైకోర్టు తీర్పు వెలువడినవెంటనే.. అన్నాడీఎంకే పార్టీ అధికారికంగా ఈపీఎస్(ఎడపాడి కే పళనిస్వామి)ని పార్టీ ప్రదాన కార్యదర్శిగా ప్రకటించింది పార్టీ సీఈసీ. ఈ మేరకు చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద సంబురాలు జరుగుతున్నాయి. ఇక తాజా తీర్పుతో ఓపీఎస్(ఓ పన్నీర్ సెల్వం).. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్‌ను ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక.. అన్నాడీఎంకే పార్టీ కార్యదర్శి (తాత్కాలిక) పదవికి పళనిస్వామి నియామకాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. కిందటి ఏడాది జులైలో పార్టీ జనరల్ కౌన్సిల్ ద్వారా ఈ నియామకం జరగ్గా.. దానిని వ్యతిరేకిస్తూ పన్నీర్ సెల్వం వర్గం న్యాయస్థానాలను ఆశ్రయించింది. ఈ క్రమంలో సుప్రీం కోర్టు అన్నాడీఎంకే సాధారణ కౌన్సిల్‌ను చట్టబద్ధమైనదిగానే సమర్థించింది. అయితే తీర్మానాల చట్టబద్ధతపై నిర్ణయం మాత్రం మద్రాసు హైకోర్టుకు వదిలివేసింది. ఇదిలా ఉంటే.. గత శనివారం పార్టీ జనరల్ సెక్రటరీ పదవి ఎన్నికకు ఈపీఎస్ నామినేషన్ దాఖలు చేయగా.. ఇదంతా దొంగచాటు వ్యవహారమంటూ పన్నీర్‌సెల్వం మండిపడ్డారు. అంతలోనే మద్రాస్ హైకోర్టు ఈపీఎస్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం గమనార్హం. -
కేసీఆర్ కీలక నిర్ణయం.. బీఆర్ఎస్ యూపీ జనరల్ సెక్రటరీ ఆయనే..
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్.. దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ విస్తరణలో భాగంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. బీఆర్ఎస్ను అన్ని రాష్ట్రాల్లో విస్తరింపజేసేలా ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఉత్తరప్రదేశ్‌కు చెందిన హిమాన్షు తివారిని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అలాగే, మహారాష్ట్రలోని ఆరు డివిజన్లకు కోఆర్డినేటర్లను కూడా సీఎం కేసీఆర్ నియమించారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్ కోఆర్డినేటర్లు వీరే.. - నాసిక్ డివిజన్ దశరథ్ సావంత్ - పూణే డివిజన్ బాలా సాహెబ్ జయరాం - ముంబై డివిజన్ విజయ్ తానాజీ - ఔరంగాబాద్ డివిజన్ సోమ్‌నాథ్ తోరట్ - నాగపూర్ డివిజన్ ద్యానెష్ వకుడ్కర్ - అమరావతి డివిజన్ నిఖిల్ దేశ్‌ముఖ్. -
రెండోసారి డీఎంకే చీఫ్‌గా స్టాలిన్!...
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం చెన్నైలో పార్టీ జనరల్ అసెంబ్లీ కౌన్సిల్ జరిగింది. ఇటీవలే కొత్తగా ఏర్పడిన జనరల్ కౌన్సిల్ సమావేశంలో డీఎంకే స్థాలిన్‌ని పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది. అలాగే పార్టీ నేతలు దురైమరుగన్, టీఆర్ బాలులు కూడా జనరల్ సెక్రటరీ, ట్రెజరీ అధికారిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు నేతలు కూడా వరసగా రెండోసారి పార్టీ అత్యున్నత పదవులను చేపట్టడం విశేషం. అంతేగాదు కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన స్టాలిన్‌కి పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డీఎంకే పార్టీ 15వ సంస్థగత ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పార్టీ పదవులకు ఎన్నికలు జరిపిన తర్వాత ఆ ముగ్గురు నేతలని పార్టీ అధ్యక్షుడు, కార్యదర్శి, కోశాధికారిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది. అంతేగాదు డీఎంకే పార్టీ పితామహుడు, దివగంత ఎం కరుణానిధిన్ హయాంలో స్టాలిన్ కోశాధికారిగా, యువజన కార్యదర్శిగా పలు పదవులను చేపట్టారు. 2018లో కరుణానిధి మరణాంతరం స్టాలిన్ పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నకయ్యారు. అంతేగాదు 1969లో తొలిసారిగా సృష్టించిన పార్టీ అధ్యక్షుడి పదవికి కరుణానిధే తొలి అధ్యక్షుడయ్యారు. అంతకు ముందు వరకు పార్టీ కార్యదర్శి పదవే అత్యున్నత పదవి. 1949లో ఏర్పాటైన డిఎంకే పార్టీకి అన్నాదురై పార్టీ కార్యదర్శిగా ఉన్నారు. ఆయన చనిపోయేంత వరకు ఈ అత్యున్నత పదవిలోనే కొనసాగారు. (చదవండి: రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్: యూపీ కాంగ్రెస్) -
టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిపై చీటింగ్ కేసు
సాక్షి,బంజారాహిల్స్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ జ్ఞానేశ్వర్ నాయు డు అలియాస్ జీవీజీ నాయుడుతో పాటు మ రొకరిపై జూబ్లీహిల్స్ పో లీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి... జూబ్లీహిల్స్ రోడ్ నెం. 70 జర్నలిస్టు కాలనీలో ముంబైకి చెందిన రోనక్ కొటేచాకు అపార్ట్మెంట్లో రెండు ఫ్లాట్లు ఉన్నాయి. ఇందులో ఓ ఫ్లాట్‌ను ఫోర్జరీ పత్రాలు, నకిలీ సంతకాలు, నకిలీ ముద్రలతో తెలంగాణ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీజీ నాయుడుతో పాటు పీసీహెచ్ ఈ–జోన్ యజమాని బల్వీందర్ సింగ్ కబ్జా చేశారు. ఈ ఫ్లాట్‌ను బల్వీందర్ సింగ్ 2013లో రొనక్ కొటేచాకు విక్రయించాడు. రొనక్ కొటేచా ముంబైలో బిజీ వ్యాపారి కాగా ఇక్కడికి రాలేకపోవడంతో ఇదే అదునుగా భావించిన జీవీజీ నాయుడు సదరు ఫ్లాట్‌ను ఆక్రమించి అందులో తిష్టవేశాడు. ఫోర్జరీ పత్రాలు క్రియేట్ చేసి సిటీ సివిల్ కోర్టులో ఫ్లాట్ తనదేనంటూ నకిలీ పత్రాలు సమర్పించి కేసు వేశాడు. విషయం తెలుసుకున్న రొనక్ పలుమార్లు తన ఫ్లాట్ ఖాళీ చేయాల్సిందిగా జీవీజీ నాయుడుకు విజ్ఞప్తి చేశాడు. అయితే నాయుడు ఈ విషయాన్ని పెడచెవిన పెట్టాడు. తాను టీడీపీ రాష్ట్ర స్థాయి నాయకుడినని తనను ఎవరు ఏం చేయలేరని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇటువైపు తొంగిచూస్తే జాగ్రత్త అంటూ హెచ్చరించాడు. దీంతో బాధితుడు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు జీవీజీ నాయుడు, బలి్వందర్ సింగ్‌లతో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేశారు. ప్రధాన సూత్రధారి జీవిజీనాయుడు కోసం గాలిస్తున్నారు. చదవండి: పుట్టినరోజు వేడుకలకొచ్చిన మామ ఇంట్లో అల్లుడు చోరీ -
యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా సంతోష్
సాక్షి, న్యూఢిల్లీ: యూత్ కాంగ్రెస్ జాతీయ ప్రధా న కార్యదర్శిగా వికారా బాద్‌కు చెందిన సంతోష్ కోలుకుండను కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ నియమించారు. కొత్తగా 10 మంది జాతీయ ప్రధాన కార్యదర్శులు, 49 మంది జాతీయ కార్యదర్శులు, 9 మంది సం యుక్త కార్యదర్శులు, 8 భిన్న విభాగాలకు చైర్మన్లను నియమిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్య దర్శి కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి జాతీయ కార్యదర్శులుగా అవకాశం ఇచ్చారు. నల్లగొండకు చెందిన మమత నాగిరెడ్డి, మంచి ర్యాలకు చెందిన శ్రవణ్‌రావు, వరంగల్‌కు చెందిన సాగరిక రావులతో పాటు ఏపీ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బి.రమేశ్ బాబులను జాతీయ కార్యదర్శులుగా నియమించారు. -
ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ ఫ్రంట్లు
సాక్షి, హైదరాబాద్: దేశంలో ఎన్నికల తర్వాతే ప్రత్యామ్నాయ ఫ్రంట్లు ఏర్పడుతాయని చరిత్ర చెబుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. 1996లో యునైటెడ్ ఫ్రంట్, 2004లో యూపీఏ, 1998లో ఎన్డీఏ వంటివన్నీ ఎన్నికల పూర్తయిన తర్వాత ఏర్పడినవేనని ఉదహరించారు. 1977లో ఇందిరాగాంధీ ఓడిన సమయంలో జనతా పార్టీ కూడా ఎన్నికల తర్వాతే ఏర్పడిందన్న విషయాన్ని గుర్తుచేశారు. అందువల్ల ఎన్నికలకు ముందు ఎలాంటి ఫ్రంట్లు ఏర్పడాల్సిన అవసరం లేదని ఆయన తేల్చిచెప్పారు. సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు ఆదివారం హైదరాబాద్‌లో ముగిశాయి. అనంతరం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కలిసి ఏచూరి మీడియాతో మాట్లాడారు. ‘పార్టీ సమావేశాల్లో రాజకీయ ముసాయిదాను ఆమోదించాం. దీనిపై కార్యకర్తలు తమ అభిప్రాయాలను, సవరణలను నేరుగా కేంద్ర కమిటీకి పంపొచ్చు. ఆయా సవరణలను పార్టీ జాతీయ మహాసభల ముందుంచుతాం. పార్టీ జాతీయ మహాసభలు ఏప్రిల్ 6 నుంచి 10 వరకు కేరళలోని కన్నూరులో జరపాలని నిర్ణయించాం. మా రాజకీయ ముసాయిదాలో ప్రధానంగా బీజేపీని ఓడించడమే లక్ష్యంగా పిలుపునిచ్చాం. ఈ సమావేశాల్లో ఐదు రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపైనా చర్చించాం. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్ సహా ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి వ్యతిరేక గాలి వీస్తోంది. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటానికి బీజేపీని ఓడించాల్సిన అవసరముంది, ఆయా రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఎత్తుగడలు రచిస్తాం’అని ఏచూరి చెప్పారు. ప్రజల్లో మోదీపై అసంతృప్తి దేశ ప్రజల్లో బీజేపీ ప్రభుత్వంపైనా, ప్రధాని మోదీపైనా తీవ్ర వ్యతిరేకత ఉందని సీతారాం ఏచూరి అన్నారు. ‘ఆర్థిక సంక్షోభం పెరిగింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుతున్నా, దేశంలో పెట్రో ఉత్పత్తులు నిరంతరం పెరుగుతున్నాయి. పేదరికం, నిరుద్యోగం, ఆకలి వంటి సమస్యలతో జనం తల్లడిల్లుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగానే ఓటేస్తారు. ప్రధానమంత్రి సహా ఎవరు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలి. ఎన్నికల విరాళాలను బాండ్ల రూపంలో తీసుకొచ్చి రాజకీయ అవినీతిని చట్టబద్ధం చేశారు. ఎన్నికల బాండ్లలో 80 శాతం బీజేపీకే వెళ్తున్నాయి. ఈ డబ్బును బీజేపీ ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఎన్నికల కమిషన్ దీన్ని అడ్డుకోవాలి. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని ఓడించగల సత్తా ఉన్న సమాజ్‌వాదీ పార్టీకి మేము మద్దతు ఇస్తాం’అని ఏచూరి వివరించారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే కేసీఆర్‌కు స్వాగతం బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ పనిచేస్తే తాము స్వాగతిస్తామని ఏచూరి స్పష్టం చేశారు. అయితే ఎన్నికల్లో ఆయనతో కలిసి పనిచేస్తామా లేదా అన్నది ఇప్పుడు నిర్ణయించబోమని, ఎన్నికల నాటికి అప్పటి పరిస్థితులను బట్టి ఎత్తుగడలు ఉంటాయని స్పష్టం చేశారు. అలాగే కేసీఆర్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామన్నారు. వివిధ రాష్ట్రాల్లో వివిధ రకాలుగా పరిస్థితులు ఉంటాయని, అక్కడి స్థానిక పరిస్థితులను బట్టి ఎతుగడలు ఉంటాయని చెప్పారు. ఏదిఏమైనా బీజేపీని ఓడించడమే తమ ప్రధాన కర్తవ్యమన్నారు. సీపీఐ, సీపీఎంల విలీనం ప్రతిపాదనేదీ రాలేదన్నారు. బీజేపీపై సానుకూలంగానే టీఆర్ఎస్: తమ్మినేని టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని తమ్మినేని వీరభద్రం స్పష్టం చేశారు. ‘బీజేపీని టీఆర్ఎస్ సూటిగా విమర్శించడంలేదు. దేశవ్యాప్తంగా బీజేపీని ఓడించాలని టీఆర్ఎస్ చెప్పట్లేదు. రైతు సమస్యలు వంటి విషయాలు తప్పిస్తే ఇతరత్రా బీజేపీ పట్ల టీఆర్ఎస్ ఇంకా సానుకూల వైఖరితోనే ఉంది. రాష్ట్రంలో బీజేపీ ప్రమాదకరంగా ఎదుగుతోంది. దాన్ని ఒంటరి చేయాల్సిన అవసరం ఉంది’అని తమ్మినేని చెప్పారు. -
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి నేనే..
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి తానేనని దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ మరోమారు చాటుకున్నారు. అన్నాడీఎంకే స్వర్ణోత్సవ వేడుకల శిలాఫలకంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి తానే అని ప్రకటించుకున్నారు. అన్నాడీఎంకే నాయకత్వ పగ్గాలపై ఇప్పటికే వివాదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలో సమన్వయ కమిటీ ఓ శిబిరంగా, శశికళ నేతృత్వంలో మరో శిబిరంగా అన్నాడీఎంకే కేడర్ విడిపోయింది. చెన్నై మెరీనా తీరంలోని ఎంజీఆర్, జయలలిత సమాధులను శనివారం శశికళ సందర్శించి నివాళులరి్పంచిన విషయం తెలిసిందే. ఆదివారం అన్నాడీఎంకే 50వ వసంతంలోకి అడుగు పెట్టింది. పార్టీకి తానే ప్రధాన కార్యదర్శి అని చాటుకునే ప్రయత్నం శశికళ చేయడం పట్ల పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. ఏకమవుదాం.. పార్టీని గెలిపిద్దాం పన్నీరు సెల్వం, పళని స్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ స్వర్ణోత్సవాలు ఘనంగా జరిగాయి. శశికళ నేతృత్వంలో చెన్నై టీనగర్‌లోని ఎంజీఆర్ స్మారక మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వర్ణోత్సవ శిలాఫలకాన్ని శశికళ ఆవిష్కరించారు. ఇందులో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ అని రాసి ఉంది. అన్నాడీఎంకే జెండాతో కూడిన కారులో ఆమె ప్రయాణించారు. ఎంజీఆర్ నివాసానికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులతో గడిపారు. ముందుగా టీనగర్లో జరిగిన సేవా కార్యక్రమంలో శశికళ మాట్లాడారు. అందరం ఏకం అవుదాం.. అన్నాడీఎంకేను గెలిపిద్దాం అని పిలుపునిచ్చారు. ఎంజీఆర్, జయలలిత తమిళనాడును అన్నాడీఎంకే కంచుకోటగా మార్చారని, ఈ వైభవం మళ్లీ రావాలంటే అందరం ఒక్కటి కావాలి్సందేనని స్పష్టం చేశారు. తనను గతంలో సమస్యలు చుట్టుముట్టినా, అన్నాడీఎంకేకు చెందిన వారినే ప్రభుత్వ పాలనలో కూర్చోబెట్టానని పరోక్షంగా పళని స్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. తమిళనాడు, తమిళ ప్రజలే తనకు ముఖ్యమని.. ఎంజీఆర్, అమ్మ ఆశయాల సాధనే లక్ష్యమని తేల్చిచెప్పారు. అయితే, శశికళ చర్యలను అన్నాడీఎంకే సీనియర్ నేత జయకుమార్ ఖండించారు. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వ్యవహారం కోర్టులో ఉందని గుర్తుచేశారు. శిలాఫలకంలో ఆమె పేరును ఎలా పొందుపరిచారు? అని ప్రశ్నించారు. ఇది కోర్టు ధిక్కార చర్య అని, చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరించారు. -
MAA Elections 2021: ప్రకాష్‌రాజ్‌కు షాకిచ్చిన బండ్ల గణేష్
MAA Elections 2021: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో మరో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నానని, ప్యానల్ అధికార ప్రతినిధిగా కొనసాగలేనని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. ప్రకాశ్ రాజ్ ప్యానల్లోకి జీవిత రావడాన్ని వ్యతిరేకిస్తున్నానని పేర్కొన్నారు. త్వరలో జరిగే 'మా' ఎన్నికల్లో జనరల్ సెక్రటరీగా ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని బండ్ల గణేష్ ప్రకటించారు. ఈ సందర్భంగా 'మా' ఎన్నికలకు సంబంధించి ఆయన చేసిన వరుస ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మాట తప్పను ... మడమ తిప్పను నాది ఒకటే మాట -ఒకటే బాట నమ్మడం -నమ్మినవారికోసం బతకడం నా మనస్సాక్షి చెప్పినట్టు నడుచుకుంటాను - నేను ఎవరిమాట వినను త్వరలో జరిగే మా ఎన్నికల్లో జనరల్ సెక్రెటరీ గా పోటీ చేస్తాను - పోటీ చేసి ఘన విజయం సాధిస్తాను……. — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 మనస్సాక్షికి ఎంతచెప్పినా మాట వినడం లేదు-నన్ను పోటీ చెయ్ అంటోంది -అందుకే ఈ పోటీ అందరికీ అవకాశం ఇచ్చారు ఒకేఒక అవకాశం నాకివ్వండి నేనేంటో చూపిస్తా ... — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 నా పరిపాలన ఎంటో తెలియచేస్త వంద మంది పేద కళాకారులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడం నా ధ్యేయం దానికోసం పోరాడతా... వారి సొంత ఇంటి కల నిజం చేస్తా ఇప్పుడు పదవుల్లో ఉన్నవాళ్లు రెండేళ్లుగా ఏమి చేయలేదు... ఇప్పుడు చేస్తామంటే మా సభ్యులు నమ్మరు… — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 గొడవలతో మా సభ్యులను మోసం చేసింది చాలు.. ఇక అలా జరగొద్దు అందరి ఆశీస్సులు కావాలి -మా ను బలో పేతం చేద్దాం ముఖ్యంగా పేద కళాకారులకు ఇళ్ళ కల నిజం చేద్దాం అదే మా నిజమైన అభివృద్ది... చిహ్నం - ఇట్లు మీ బండ్ల గణేష్ — BANDLA GANESH. (@ganeshbandla) September 5, 2021 -
బీజేపీలో తీవ్ర విషాదం.. ఏపీ ప్రధాన కార్యదర్శి కన్నుమూత
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల గాంధీ కన్నుమూశారు. కొద్ది రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న లోకుల గాంధీ చికిత్స నిమ్మితం విశాఖ కేజీహెచ్‌లో చేరారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శనివారం ఉదయం మృతి చెందారు. లోకుల గాంధీ మృతి పట్ల ఏపీ బీజేపీ అధక్షుడు సోము వీర్రాజు సంతాపం ప్రకటించారు. ఈ మేరకు ట్విటర్లో స్పందించారు. చాలా చాలా బాధాకరమైన విషయం, భగవంతుడి ఆటలో ఎవరి వంతు ఎప్పుడో చెప్పలేని పరిస్థితి, ఈ క్షణం మనతో ఉన్నా, మరు క్షణం కూడా మనతోనే ఉంటారని నమ్మకంగా చెప్పలేని రోజులివి. ఒళ్ళంతా జాతీయతను నింపుకుని, నిరంతరం దేశం కోసం పోరాడుతూ, వందలాది మంది గిరిజనులను ప్రోత్సహించి పార్టీలో చేర్పించి, (1/3) pic.twitter.com/ZbEZirDbwZ — Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) August 20, 2021 -
Maoist Party: హరిభూషణ్ స్థానంలో ఎవరు?
సాక్షి ప్రతినిధి, వరంగల్: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ స్థానంలో ఆ పార్టీ ఎవరిని నియమిస్తుందనే విషయం చర్చనీయాంశమైంది. విప్లవోద్యమంలో తుదకంటూ పోరాడిన హరిభూషణ్ ఈనెల 21న కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఆ పార్టీ కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో కేంద్ర కమిటీ నాయకుడు కత్తి మోహన్‌రావు అలియాస్ ప్రకాశ్ గుండెపోటుతో మరణించగా, హరిభూషణ్, మహిళా నాయకురాళ్లు సమ్మక్క అలియాస్ భారతక్క, శారద కరోనాకు బలయ్యారు. హరిభూషణ్ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది పోలీసు ఇంటెలిజెన్స్, మాజీ మావోయిస్టు వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెరపైకి లోకేటి చందర్ పేరు హరిభూషణ్ స్థానంలో రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్ జిల్లాకు చెందిన లోకేటి చందర్ అలియాస్ స్వామిని నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్ జిల్లా కార్యదర్శిగా స్వామి చాలాకాలం పనిచేయగా, ఆయన సహచరి లోకేటి లక్ష్మి అలియాస్ సులోచన కూడా ఉద్యమంవైపే నడిచింది. మైదాన ప్రాంతాల నుంచి దళాలను ఎత్తివేసే సమయంలో దండకారణ్యానికి తరలివెళ్లినా.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ (కేఏఎన్) కమిటీకి కూడా స్వామి సారథ్యం వహించా డు. మూడు దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేస్తున్న స్వామి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కీలక బాధ్యతల్లో ఉండగా, ఉద్యమ అవసరాల రీత్యా ఆయనకు అవకాశం కల్పించవచ్చంటున్నారు. 1991 నుంచి పార్టీలో కీలకంగా ఉన్న కొంకటి వెంకట్ అలియాస్ రమేష్ పేరు కూడా ప్రచారంలో ఉంది. కరీంనగర్ జిల్లా కమిటీ సభ్యుడిగా, ఆనుపురం కొంరయ్య అలియాస్ సుధాకర్ (ఏకే) ఎన్కౌంటర్ తర్వాత జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన ఆయన అప్పటి ఉత్తర తెలంగాణ స్పెషల్ జోన్ కమిటీలో సభ్యుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో కీలకంగా ఉన్న రమేష్ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న బడే చొక్కారావు అలియాస్ దామోదర్, బండి ప్రకాశ్ పేర్లు కూడా రాష్ట్ర కార్యదర్శి కోసం పరిశీలించవచ్చంటున్నారు. కరోనా భయంతో మావోయిస్టు దంపతుల లొంగుబాటు కొత్తగూడెం టౌన్: మావోయిస్టు పార్టీ మణుగూరు ఓఎల్ఎస్ సభ్యులుగా పనిచేస్తున్న ఇడుమ సురేందర్, సోనీ దంపతులు శనివారం భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్ ఎదుట లొంగిపోయారు. శనివారం కొత్తగూడెంలో ఎస్పీ సునీల్‌దత్ విలేకరుల సమావేశంలో ఈమేరకు వెల్లడించారు. అగ్ర నాయకత్వం వేధింపులకు పాల్పడటం, పార్టీలోని నాయకులకు, కార్యకర్తలకు కరోనా సోకుతుండడంతో భయాందోళనకు గురై వీరు బయటకు వచ్చినట్లు తెలిపారు. మడివి ఇడుమ అలియాస్ సురేందర్, మడకం బుద్రి అలియాస్ సోని ఐదేళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారని, వీరు రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజనల్ కార్యదర్శి ఆజాద్‌కు గార్డుగా పనిచేశారని చెప్పారు. మావోయిస్టులకు వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఎవరూ సహాయ సహకారాలు అందించవద్దని ఎస్పీ కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటామని, మెరుగైన వైద్య చికిత్సతోపాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఓఎస్డీ తిరుపతి, భద్రాచలం ఏఏస్పీ వినీత్, ప్రమోద్ పవార్, చర్ల సీఐ అశోక్ పాల్గొన్నారు. చదవండి: ముగిసిన 30 ఏళ్ల ప్రేమ ప్రయాణం -
‘పశ్చిమ’లో టీడీపీకి ఎదురుదెబ్బ..
ద్వారకా తిరుమల (పశ్చిమ గోదావరి): జిల్లాలో టీడీపీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి చెలికాని వీరవెంకట సత్యన్నారాయణ సీతారామస్వామి (సోంబాబు) పార్టీకి గుడ్‌బై చెప్పారు. రాజీనామా పత్రాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి శుక్రవారం పంపారు. 2002లో టీడీపీలో చేరిన ఆయన 18 ఏళ్ల పాటు పనిచేశారు. 11 ఏళ్ల నుంచి పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. 2014లో అధికారంలోకి వచ్చినా, పార్టీ తనను ఏమాత్రం పట్టించుకోలేదని, ఐదేళ్లలో ఏనాడూ కనీస గౌరవం ఇవ్వలేదని రాజీనామా లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. పారీ్టకి రాజీనామా చేసిన తాను ఇకపై తన కుటుంబ సభ్యులు స్థాపించిన చారిటబుల్ ట్రస్టుల వ్యవహారాలను చూసుకుంటానని చెబుతున్నారు. (చదవండి: టీడీపీలో అసంతృప్తి సెగలు..) వెలమ సామాజిక వర్గానికి చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపారని సోంబాబు ఆరోపించారు. ఉంగుటూరు అసెంబ్లీ సీటు కేటాయించాలని కోరినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యత్వాల పేరుతో ఒక్కో జిల్లా నుంచి రూ.వంద కోట్లు వసూలు చేసిన ఘనుడు చంద్రబాబు అని ధ్వజమెత్తారు. ఒక్క గోపాలపురం నియోజకవర్గం నుంచే తాము రూ.60 లక్షలు ముట్టజెప్పామని పేర్కొన్నారు. ఆ డబ్బంతా ఏమైందో కూడా తెలియడం లేదని ధ్వజమెత్తారు. సభ్యత్వం కలిగిన కార్యకర్త చనిపోతే వారికి ఇన్సూరెన్స్ కింద కొంత నగదు ఇస్తామని చెప్పారని, అయితే ఏ ఒక్కరికీ ఇచ్చిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రతి ఆలోచన, ప్రతి నిర్ణయం పార్టీని పతనం చేస్తున్నాయని, త్వరలో టీడీపీ భూస్థాపితం కావడం ఖాయమని సోంబాబు వివరించారు. (చదవండి: టీడీపీ తప్పిదాలే పోలవరానికి శాపాలు) -
మాణిక్యమా.. చాణక్యమా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గట్టెక్కించడానికి మాణిక్యం ఠాగూర్ ఏమైనా మ్యాజిక్ చేయగలరా.. చాణక్యంతో కాంగ్రెస్ పార్టీని ఆధిక్యంలోకి తీసుకురాగలరా? వచ్చీరాగానే వచ్చిపడిన మూడు ఎన్నికల్లో కాంగ్రెస్ నావను ఏవిధంగా నడిపించగలరు? ఇదే ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో సాగుతున్న హాట్‌హాట్ చర్చ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్చార్జిగా ఆర్.సి.కుంతియా స్థానంలో నియమితులైన ఈ తమిళనాడు లోక్‌సభసభ్యుడు మాణిక్యం ఠాగూర్ పని అంత సులవేమీ కాదనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో సాగుతోంది. ఈయన పనితీరు రాష్ట్ర కాంగ్రెస్‌ను గాడిలో పడేస్తుందా? తలపండిన నేతలున్న రాష్ట్రంలో పార్టీని ఏకతాటిపైకి తీసుకొచ్చి నడపడం సాధ్యమవుతుందా? రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి బాటలోనే టీపీసీసీ అధ్యక్షుడిని కూడా మారుస్తారా? తాజాగా పార్టీలో జరిగిన అంతర్గత పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్‌వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. ‘మూడు’ను బట్టి... కుంతియా ఇన్చార్జిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ సాధించిన పెద్ద విజయాలేమీ లేవు. ఆయన ఓ మూసలో వెళ్తారనే చర్చ కూడా పార్టీ వర్గాల్లో జరిగేది. అందుకే వేటు పడి ఉంటుందేమోననే చర్చ ఉంది. కానీ, మాణిక్యంపై మాత్రం ఇందుకు భిన్నమైన చర్చ జరుగుతోంది. మాణిక్యం విద్యార్థి సంఘం నుంచి దాదాపు మూడు దశాబ్దాలుగా పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి, తమిళనాడు లాంటి రాష్ట్రంలో పార్టీ తరఫున రెండుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆయన టీపీసీసీ విషయాలను సులువుగానే ఒంటబట్టించుకుంటారనే అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పార్లమెంటు సమావేశాల తర్వాత ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికతోపాటు రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు, ఆ తర్వాత ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కలిపి... రాష్ట్రంలోని సగానికిపైగా నియోజకవర్గాల్లో మరోసారి ప్రజల తీర్పు రానుంది. ఈ తీర్పు ఆయనతోపాటు తెలంగాణలో కాంగ్రెస్ భవిష్యత్తును కూడా నిర్దేశించనుంది. జాతీయస్థాయిలో ప్రాతినిధ్యం ఏది? తాజా పునర్వ్యవస్థీకరణలో ఢిల్లీ పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను పట్టించుకున్నట్టు కూడా కనిపించలేదు. ఎప్పటిలాగే ఐఎన్టీయూసీ నేత సంజీవరెడ్డిని సీడబ్ల్యూసీ ఆహ్వానితుడిగా నియమించిన సోనియా ఇతర నాయకులను పరిగణనలోకి తీసుకోలేదు. అటు ఇతర రాష్ట్రాలకు ఇన్‌చార్జీలుగాకానీ, పార్టీ ప్రధాన కార్యదర్శులుగాకానీ, ఇతర కమిటీల్లో కానీ రాష్ట్రానికి చెందిన నేతలనెవరినీ సోనియా నియమించలేదు. పార్లమెంటు సమావేశాల తర్వాత టీపీసీసీ అధ్యక్షుడి మార్పుపై ఏఐసీసీలో చర్చ ప్రారంభం కానుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ అనుయాయులుగా పేరొందిన ఒకరిద్దరు నేతలు డోలాయమానంలో పడ్డారు. కానీ, వారు కూడా సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా ఉన్నందున ఆజాద్ ప్రభావం రాష్ట్రంలో కనిపించే అవకాశమేమీలేదని తెలుస్తోంది. -
బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బంగారు శృతి
సాక్షి, హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బంగారు శృతి గురువారం నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ నియామక పత్రాన్ని అందజేశారు. అలాగే వివిధ మోర్చాలకు కూడా అధ్యక్ష, కార్యదర్శులను నియమించారు. బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా గీతామూర్తి, కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కె.శ్రీధర్‌రెడ్డి, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శిగా డా. ఉమాశంకర్ నియమితులయ్యారు. వీరంతా గురువారమే బాధ్యతలు స్వీకరించారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక మైనార్టీల సంక్షేమానికి అమలు చేసిన కార్యక్రమాలను రాష్ట్ర మైనార్టీ మోర్చా అధ్యక్షుడు అప్సర్ పాషాతో కలిసి బండి సంజయ్ విడుదల చేశారు. -
ఐసోలేషన్‌కు కాదు.. జైలుకు వెళ్లాడు
న్యూఢిల్లీ: బీసీసీఐ అనుబంధ రాష్ట్ర క్రికెట్ సంఘాల్లో ప్రధాన కార్యదర్శి అనేది ప్రతిష్టాత్మక పదవి. అందులోనూ దేశ రాజధానికి చెందిన ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్స్ క్రికెట్ అసోసియేషన్ (డీడీసీఏ)లో ఆ హోదాకు ఉండే విలువే వేరు. అలాంటి వ్యక్తి, డీడీసీఏ ప్రధాన కార్యదర్శిగా పని చేస్తున్న వినోద్ తిహారా నెలరోజులుగా కనిపించకుండా పోయాడు. కొందరు సన్నిహితులు చెప్పిన సమాచారం మేరకు ఆయనకు కరోనా సోకినట్లు అసోసియేషన్ సహచరులు భావించారు. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లు కూడా కుటుంబసభ్యులు ఖరారు చేయడంతో అంతా అలాగే అనుకున్నారు. డీడీసీఏలో జరిగిన అవినీతి గురించి ఇటీవల విచారణ జరిగిన సమయంలో కూడా ఒక లాయర్ ఇదే విషయాన్ని చెప్పారు. అయితే అసలు సంగతి బయటపడటంతో అంతా అవాక్కయ్యారు. జీఎస్టీకి సంబంధించి ఒక కేసులో తిహారాను పోలీసులు అరెస్టు చేయడంతో ప్రస్తుతం ఆయన మీరట్ జైల్లో ఉన్నారు. నేరం తీవ్రత స్పష్టత తెలియకపోయినా... జీఎస్టీ నిబంధనలు ఉల్లంఘించడంతోనే మార్చి 17న తిహారాను అరెస్టు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు నిర్ధారించారు. మరోవైపు అసోసియేషన్‌కు సంబంధించిన ఒక కీలక పత్రంపై కూడా తిహారా సంతకం చేసినట్లు ఉండగా, అది అతను జైల్లో ఉన్న తేదీతో విడుదల కావడంతో డీడీసీఏ సభ్యులకు షాక్ తగిలింది. లాక్డౌన్ కారణంగా ఇప్పటి వరకు తిహారాకు బెయిల్ తీసుకునే అవకాశం లభించలేదు. -
‘బాబు వల్ల ఏపీకి విభజన కంటే ఎక్కువ నష్టం’
సాక్షి, వైఎస్సార్ జిల్లా : రాజకీయ అస్తిత్వం లేని చంద్రబాబు వల్ల రాష్ట్ర రాజకీయాలు కలుషితమయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. రామచంద్రయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు చెప్తున్న అభివృద్ధి అంతా అబద్దమని తేల్చి చెప్పారు. కేవలం కమీషన్ల కోసమే చంద్రబాబు మదిలో రాజధాని ఆలోచన వచ్చిందని విమర్శించారు. అమరావతి ప్రాంతంలో భూములు కేవలం ఒక సామాజికవర్గానికే కట్టబెట్టారని ఆరోపించారు. చంద్రబాబు పాలనంతా అవినీతి, అక్రమాల కంపు అని... ఆయన అవినీతి హిమాలయాలంత అని ఘాటుగా విమర్శించారు. ప్రజా వ్యతిరేకత ఎక్కువగా ఉండడంతో పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. మరోవైపు ‘నాడు మోదీని తిట్టి నేడు ఆయన కాళ్లు పట్టుకునేందుకు ఆపసోపాలు పడుతున్నాడు. రాజ్యసభ సభ్యులను బీజేపీలోకి పంపి కాళ్లబేరానికి దిగాడు. గతంలో చేసిన పాపాలకు ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు. చంద్రబాబు, పవన్‌లు బీజేపీని ఎందుకు విమర్శించరు? అధికారంలో ఉన్నా, లేకున్నా టీడీపీ, జనసేన మా పార్టీని టార్గెట్ చేసి మాట్లాడుతున్నాయి. ఎంత మంది అడ్డుపడినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చూపిస్తారు. ఎన్ని సమస్యలు వచ్చినా అధిగమించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తార’ని రామచంద్రయ్య అభిప్రాయపడ్డారు. -
‘చంద్రబాబును ఎవరూ కోరుకోవడం లేదు’
సాక్షి, తిరుపతి : అవినీతి పాలన చేసిన టీడీపీ అధినేత చంద్రబాబ మళ్లీ రావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ దేవధర్ స్పష్టం చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గాంధీ సంకల్ప యాత్ర కార్యక్రమం శనివారం తిరుపతిలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సునీల్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ స్థాపించింది నిజమైన తెలుగుదేశం పార్టీ. ఇప్పటి తెలుగుదేశం అక్రమాలకు, దోపిడీలకు కేరాఫ్‌గా మారిందని విమర్శించారు. చంద్రబాబు యూటర్న్ బాబుగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిపై జగన్మోహన్రెడ్డి చర్యలు చేపట్టి కేంద్రానికి నివేదిక ఇవ్వాలని కోరారు. -
క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా?
సాక్షి, తాడేపల్లి : ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిని ప్రజలు శిక్షించి 23 సీట్లకు పరిమితం చేసినా ఆత్మపరిశీలన చేసుకోకుండా ఉన్మాదిలా మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ ప్రధానకార్యదర్శి సి. రామచంద్రయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గత ఐదేళ్లలో చేసిన దరిద్రపాలన గురించి మరిచిపోయారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తాడేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘తిరుపతికి వెళ్ళినప్పుడు సీఎం సంతకం పెట్టలేదని మాట్లాడం సరికాదు. సంతకం అనేది జగన్మోహన్రెడ్డి వ్యక్తిగత విషయం. మనిషికి భక్తి ఉందా లేదా అనేది ముఖ్యం. జగన్మోహన్రెడ్డి ఒక్క తిరుపతినే కాదు అనేక పుణ్యక్షేత్రాలు దర్శించుకున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలపై సంతకం చేయకపోతేనే తప్పుపట్టాలి. మరి మీరు చేసిన సంతకాల పరిస్థితి ఏమిటి? రుణమాఫీ, డ్వాక్రా, బెల్ట్ షాపుల రద్దు, బంగారం ఇంటికి తెస్తామని అనేక సంతకాలు చేశారు. కానీ ఏ ఒక్క సంతకాన్ని అమలు చేయలేదు. నీచ సంస్కృతికి చంద్రబాబు విషవృక్షం లాంటివాడు. ఎన్టీఆర్‌పై రాయలేని భాషలో మాట్లాడింది చంద్రబాబు కాదా? టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం వేదికగా జగన్మోహన్రెడ్డి, ఆయన కుటంబసభ్యులపై సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ప్రచారం చేయించలేదా? ఇప్పుడు ప్రజా సంక్షేమం కోసం జగన్మోహన్రెడ్డి ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఆయనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. లోకకల్యాణం కోసం జగన్మోహన్రెడ్డి యజ్ఞం చేస్తుంటే రాక్షసులు అడ్డుకున్నట్లు చంద్రబాబు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. ఇందుకు ఎల్లో మీడియా సహకరిస్తోంది. ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్యనిషేధానికి చర్యలు తీసుకుంటుంటే అభినందించకపోగా ఇష్టారాజ్యంగా ఎందుకు మాట్లాడుతున్నారు? ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడిపింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా సీఎం జగన్ ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. చంద్రబాబు మానసిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు. ప్రస్తుతం టీడీపీ అనేది ముగిసిన అధ్యాయం. మోదీని జగన్ కలిస్తే కేసుల కోసమని మాట్లాడతారా? కేంద్రంలో మోదీ రెండోసారి గెలిచి అధికారంలోకి రావడంతో తనకు ముప్పు రాకుండా చంద్రబాబు తన కోవర్ట్‌లను బీజేపీలోకి పంపింది వాస్తవం కాదా? పోలవరాన్ని ఏటీఎంలా చంద్రబాబు మార్చుకున్నారని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీనే చెప్పడం మర్చిపోయారా? మోదీని కూడా దిగజార్చే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. మోదీపై చేసిన విమర్శలపై బీజేపీ నాయకులు స్పందించాలి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని చెప్పుకోనే చంద్రబాబు మూర్ఖంగా మాట్లాడుతున్నారు. తిరుమలలో పోటును తవ్వించింది నువ్వు కాదా? దుర్గమ్మ గుడిలో క్షుద్ర పూజలు చేయించింది నువ్వు కాదా? కనకదుర్గమ్మ వారి భూములను నీకు నచ్చిన వారికి ఇచ్చుకోలేదా?’ అని రామచంద్రయ్య ప్రశ్నించారు. -
క్యాబ్ పీఠంపై మళ్లీ దాదా
కోల్‌కతా: బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) అధ్యక్షుడిగా మరోసారి భారత మాజీ సారథి సౌరవ్ గంగూలీ శనివారం బాధ్యతలను చేపట్టాడు. అతడు మరో మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగు తాడు. 2014లో వర్కింగ్ కమిటీ సభ్యుడిగా క్యాబ్‌లో ఎంట్రీ ఇచ్చిన గంగూలీ... అనంతరం జనరల్ సెక్రటరీ పదవిని చేపట్టారు. అయితే 2015లో అప్పటి క్యాబ్ అధ్యక్షుడిగా ఉన్న జగ్మోహన్ ధాలి్మయా మృతి చెందటంతో తొలిసారి అధ్యక్షుడయ్యా -
మమత విషయంలో ఎందుకు స్పందించరు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రికి గానీ, ప్రధాన కార్యదర్శికి గానీ సమాచారం ఇవ్వకుండా పశ్చిమబెంగాల్‌కు చెందిన ఓ ఐపీఎస్ అధికారిని అరెస్టు చేసేందుకు సీబీఐ ప్రయత్నించడం దారుణమని కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజల ఓట్లతో రాజ్యాంగ బద్ధంగా ఏర్పాటైన మమతాబెనర్జీ ప్రభుత్వంపై మోదీ, అమిత్‌షాలు దాడిచేయబోయారని, మమత ఓ శక్తిలా అడ్డుకొని రాజ్యాంగాన్ని కాపాడారని అన్నారు. బెంగాల్ సీఎంను, అక్కడి పోలీసులను అభినందిస్తున్నానని చెప్పారు. ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఫెడరల్ ఫ్రంట్ ఎన్డీయేకు బీటీమ్ అని దీంతో తేలిపోయిందని ఆయన ఎద్దేవా చేశార -
‘మెదక్ నుంచి పోటీచేస్తే గెలిపిస్తాం’
సాక్షి, హైదరాబాద్: తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శిగా నియామకమైన ప్రియాంక లేదా ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీలు మెదక్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తే గెలిపిస్తామని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ఇచ్చిన కుటుంబం నుంచి పోటీ చేస్తే ఏకగ్రీవం చేయించే బాధ్యతను సీఎం కేసీఆర్ తీసుకోవాలని, బీజేపీని కూడా ఆయనే ఒప్పించాలని కోరారు. అసెంబ్లీ ప్రాంగణంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రియాంకను రాజకీయాల్లోకి తీసుకురావడంలో రాహుల్ గాంధీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని చెప్పారు. ప్రియాంకలో ఇందిరాగాంధీ కనపడుతుం దని, ఆమె ప్రభావం దేశ వ్యాప్తంగా పనిచేయడంతోపాటుగా కార్యకర్తల్లో మనోస్థైర్యాన్ని నింపుతుందని తెలిపారు. సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్కకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఆయన్ను వ్యతిరేకిస్తే రాహుల్‌గాంధీని, ఆయన నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టేనన్నారు. -
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శిగా సి.రామచంద్రయ్య
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, అధికార ప్రతినిధిగా మాజీ మంత్రి సి.రామచంద్రయ్య నియమితులయ్యారు. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగిందని పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా, సి.రామచంద్రయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. ఇటీవల విజయనగరం జిల్లాలో పాదయాత్ర సాగిస్తున్న జగన్ సమక్షంలో ఆయన పార్టీలో చేరిన విషయం తెలిసిందే. బలిజ సామాజిక వర్గానికి చెందిన సి.రామచంద్రయ్య విద్యావంతుడే కాక మంచి అధ్యయనశీలి, వక్త అనే పేరుంది. -
ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఘర్షణ
-
ఏపీ ఎన్జీవో హోమ్‌లో ఉద్రిక్తత..
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఎన్జీవో హోమ్‌లో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. ఏపీ ఎన్జీవో హౌసింగ్ బోర్డు ఆదివారం సమావేశమైంది. ఉద్యోగులకు ఇళ్ల స్థలాల కేటాయింపుపై చర్చ జరిగింది. తెలంగాణ ఎన్జీవోలు విషయం తెలుసుకుని అక్కడికి చేరుకుని, సమావేశాన్ని అడ్డుకున్నారు. అంతలోనే ఏమైందో సమావేశంలో ఒక్కసారిగా ఘర్షణకు దిగారు. జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్ రెడ్డిపై కొంతమంది దాడికి దిగారు. విషయం తెలుసుకుని పోలీసులు రంగప్రవేశం చేశారు. అంతేకాక పోలీసులు కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. -
యూత్ కాంగ్రెస్ చీఫ్‌గా కేశవ్ చంద్
సాక్షి, ఢిల్లీ : యువజన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఉత్తరప్రదేశ్‌కు చెందిన కేశవ్‌చంద్ యాదవ్ ఎంపికయ్యారు. అలాగే తెలంగాణకు చెందిన బీవీ శ్రీనివాస్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ శుక్రవారం అమరీందర్ సింగ్ రాజా స్థానంలో కేశవ్ చంద్‌ను నియమించారు. ఈ మేరకు జనరల్ సెక్రటరీ అశోక్ గెహ్లాట్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా పార్టీకి అమరీందర్ సింగ్ అందించిన సేవలను ప్రశంసించింది. -
మళ్లీ ఏచూరికే పగ్గాలు!
సాక్షి, హైదరాబాద్ : సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నిక కానున్నారు. 2015లో విశాఖపట్నంలో జరిగిన పార్టీ మహాసభల్లో ప్రధాన కార్యదర్శిగా పగ్గాలు చేపట్టిన ఆయన.. మరో మూడేళ్ల పాటు అదే పదవిలో కొనసాగనున్నారు. ఈ మేరకు ఆదివారం ఉదయం జాతీయ మహాసభల వేదికగా పార్టీ కొత్త పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీని ఎన్నుకోనున్నారు. పార్టీ రాజకీయ తీర్మానం విషయంలో తలెత్తిన అభిప్రాయభేదాల నేపథ్యంలో ఓటింగ్ వరకు వెళ్తే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఏచూరి తప్పుకుంటారని ప్రచారం జరిగినా.. ఆ అంశం సామరస్యంగానే పరిష్కారం కావడంతో ఏచూరి మరోసారి అదే పదవిలో కొనసాగుతారని పార్టీ వర్గాలంటున్నాయి. కాగా ఈసారి తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రంను పొలిట్‌బ్యూరోలోకి తీసుకుంటారనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం 16 మంది.. ప్రస్తుతం పొలిట్‌బ్యూరోలో 16 మంది సభ్యులున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోపాటు ప్రకాశ్ కారత్, రామచంద్రన్ పిళ్లై, మాణిక్‌సర్కార్, బిమన్ బోస్, బృందాకారత్, పినరయ్ విజయన్, కె. బాలకృష్ణన్, సూర్యకాంత్ మిశ్రా, ఎ.కె.పద్మనాభన్, హన్నన్‌ముల్లా, ఎం.ఎ.బేబీ, సుభాషిణి అలీ, ఎండీ.సలీం, జి.రామకృష్ణన్, బీవీ రాఘవులు పొలిట్‌బ్యూరో సభ్యులుగా పని చేస్తు న్నారు. వీరిలో రాఘవులు ఒక్కరే తెలుగు రాష్ట్రా లకు చెందిన వారు. ఏచూరిది ఏపీ అయినా ఆయన పార్టీ ప్రధాన కార్యాలయం కోటా నుంచి పదవిలో కొనసాగుతున్నారు. రామచంద్రన్ పిళ్లై, ఏకే రాఘవన్ ఈసారి రిటైర్ అవుతారనే చర్చ జరుగుతోంది. వయసు పెరిగిపోవడంతో వీరిద్దరికీ విశ్రాంతి కల్పిస్తారని అంటున్నారు. మళ్లీ కొనసాగాలనుకుంటే పొలిట్‌బ్యూరోలో అవకాశమిస్తారు. అయితే ఈసారి తమ్మినేనిని కూడా తీసుకుంటారని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆయన క్రియాశీలంగా మారారు. పార్టీ స్తబ్ధుగా ఉన్న సమయంలో 4 వేల కి.మీ. పాదయాత్ర చేసి రాష్ట్రంలోని అన్ని జిల్లాలను చుట్టి వచ్చారు. బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్ఎఫ్) ఏర్పాటు చేసి ఉద్యమాలను ఉధృతం చేశారు.ఇప్పుడు ఈ బీఎల్ఎఫ్ దేశవ్యాప్త సామాజిక ఉద్యమాలకు దిక్సూచిగా మారింది. వీటికితోడు తమ్మినేనికి పార్టీ పట్ల ఉన్న విధేయత, చిత్తశుద్ధిని పరిగణనలోకి తీసుకుని పొలిట్‌బ్యూరోలో అవకాశం ఇస్తారని అంటున్నారు. ఆయనతోపాటు వ్యవసాయ కార్మిక సంఘం నేత విజయ రాఘవన్, ఏపీకి చెందిన సీఐటీయూ నాయకురాలు హేమలతకు కూడా అవకాశం కల్పించవచ్చని తెలుస్తోంది. తెలంగాణ నుంచి పార్టీ కేంద్ర కమిటీ సభ్యులుగా తమ్మినేనితోపాటు ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు, ప్రత్యేక ఆహ్వానితురాలిగా మల్లు స్వరాజ్యం, ఏపీ నుంచి ఎస్.పుణ్యవతి, పెనుబల్లి మధు, పాటూరి రామయ్య, ఎం.ఎ.గఫూర్‌లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరిలో పాటూరి ఈసారి రిటైర్ అయ్యే అవకాశాలున్నాయి. ‘29 దేశాల సౌహార్ద సందేశాలు’ సీపీఎం జాతీయ మహాసభల సందర్భంగా ప్రపంచంలోని 29 దేశాలకు చెందిన కమ్యూనిస్టు పార్టీలు తమ సౌహార్ద సందేశాలను పంపాయి. చైనా, వియత్నాం, క్యూబా, కొరియాలతో పాటు పలు దేశాల కమ్యూనిస్టు పార్టీలు పంపిన సౌహార్ద సందేశాలను శనివారం ఆ పార్టీ ప్రతినిధులు మీడియాకు విడుదల చేశారు. నేడు బహిరంగ సభ పార్టీ పొలిట్ బ్యూరో, కేంద్ర కమిటీ ఎన్నిక అనంతరం జాతీయ మహాసభల ముగింపు సూచికగా భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. సరూర్‌నగర్ ఇండోర్‌స్టేడియం వేదికగా జరుగనున్న ఈ సభకు తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి కార్యకర్తలు హాజరు కానున్నారు. సభను వీక్షించేందుకు సభా ప్రాంగణంలో, ఎల్బీనగర్ చౌరస్తాలో 12 ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు మలక్‌పేట టీవీ టవర్ నుంచి రెడ్‌షర్ట్ వలంటీర్ల కవాతు ప్రారంభం కానుంది. ఈ కవాతులో 20 వేల మంది ఎర్ర సైన్యం పాల్గొననుంది. సాయంత్రం ఐదు గంటలకు బహిరంగ సభ ప్రారంభం కానుంది. దాదాపు మూడు లక్షల మంది ఈ మహాసభకు హాజరయ్యే అవకాశం ఉందని తమ్మినేని పేర్కొన్నారు. -
ఏచూరీయే.. లేదంటే చీలికే?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరీకి మరోసారి అవకాశం దక్కుతుందా? లేదా అనేదానిపై కామ్రేడ్లలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇప్పటికే సీతారాం అనుకూల, వ్యతిరేక వర్గాలు తమ వ్యూహాలకు పదును పెడుతుంటే మరో వర్గం.. త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ పేరును తెరపైకి తెచ్చింది. దీంతో ఈ నెల 18 నుంచి 22 వరకు ఐదు రోజులపాటు హైదరాబాద్‌లో జరగనున్న సీపీఎం జాతీయ కాంగ్రెస్ సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. సమావేశాల చివరిరోజైన ఏప్రిల్ 22న కొత్త ప్రధాన కార్యదర్శి పేరును అధికారికంగా ప్రకటించనున్నట్లు ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఏచూరీ వర్సెస్ కారత్ : పుచ్చలపల్లి సుందరయ్య మొదలుకుని ఈఎంఎస్ నంబూద్రిపాద్, హరికిషన్ సింగ్ సుర్జిత్, ప్రకాశ్ కారత్ వరకు అందరూ కనీసం మూడు పర్యాయాలు ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. ఇదే సంప్రదాయం ప్రకారం.. సీతారాం ఏచూరీయే మరోసారి ఈ బాధ్యతలు చేపట్టే అవకాశాలూ లేకపోలేదు. కానీ పార్టీ బలంగా ఉన్న బెంగాల్, కేరళ గ్రూపుల్లో స్పష్టమైన విభేదాలు పొడసూపాయి. దీనికి తోడు మాజీ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్, సీతారాం ఏచూరీ మధ్య కొంతకాలంగా అంతర్గత పోరు నడుస్తోంది. ఎన్నికలు అనివార్యమేనా..! ప్రకాశ్ కారత్కు కేరళ సీఎం పినరయి విజయన్ నుంచి బలమైన మద్దతుంది. దీనికితోడు పలు రాష్ట్రాల కామ్రెడ్లూ కారత్ వెంటే ఉన్నామంటున్నారు. 16 మంది సభ్యులున్న పొలిట్ బ్యూరో, 85 మంది సభ్యులున్న సెంట్రల్ కమిటీల్లో కారత్‌కే బలమైన మద్దతుంది. అయితే, ఏచూరీకి బలమైన మద్దతు లేదు. దీనికి తోడు, బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్‌తో కలిసిపనిచేయటమే మంచిదని మొదట్నుంచీ ఈయన చెబుతూ వస్తున్నారు. ఈ నిర్ణయాన్ని కారత్, ఆయన మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. బెంగాల్ కామ్రెడ్లు మాత్రం ఏచూరీ ఆలోచన నేటి పరిస్థితులకు తగ్గట్లుగా ఉందని.. కారత్ వ్యూహం స్టాలిన్ కాలం నాటి ఆలోచన అని అంటున్నారు. 21నాటి సమావేశంలో పార్టీ సెంట్రల్ కమిటీయే కొత్త ప్రధాన కార్యదర్శిపై నిర్ణయం తీసుకోనుంది. ఏచూరీ కాకుండా మరెవరైనా ఆసక్తి కనబరిస్తే.. ఎన్నికలు అనివార్యమే. ఏచూరీయే.. లేదంటే చీలికే? మరోవైపు ఏచూరీ, కారత్‌ల వ్యతిరేక వర్గం త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్‌ను తెరపైకి తెచ్చేందుకు యోచిస్తోంది. అటు మహిళలకు ఈసారి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వాలనే చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. అదే జరిగితే.. ప్రకాశ్ కారత్ భార్య బృందా కారత్ ఒక్కరే పోటీదారు. పలువురి పేర్లు ప్రధాన కార్యదర్శి పదవికోసం తెరపైకి వస్తున్నప్పటికీ.. ఏచూరీకి మరోసారి అవకాశం ఇవ్వని పక్షంలో పార్టీలో భారీ చీలిక తప్పదనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. -
ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శిగా భయ్యాజీ
నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యదర్శిగా సురేష్ భయ్యాజీ జోషి మరోసారి ఎన్నికయ్యారు. శనివారం ఇక్కడ జరిగిన సంఘ్ సమావేశంలో ఆయన మరో దఫా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఆర్ఎస్ఎస్ ప్రచార్ ప్రముఖ్ మన్మోహన్ వైద్య తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్న సంఘ్ ఆఫీస్ బేరర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారని వివరించారు. 2009 నుంచి ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న భయ్యాజీ జోషి తాజా ఎన్నికతో 2021 వరకు పదవిలో ఉంటారు. జోషితోపాటు కర్ణాటక, ఏపీ, తెలంగాణ ఆర్ఎస్ఎస్ వ్యవహారాలను పర్యవేక్షించే నాగరాజ్ క్షేత్రీయ సంఘ్ సంచాలక్‌గా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
ఏచూరికి ఎదురు దెబ్బ.. రాజీనామాకు సిద్ధం?
సాక్షి, న్యూఢిల్లీ : సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి ఊహించని రీతిలో ఎదురు దెబ్బ తగిలింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునే విషయమై పార్టీ అధిష్టానాన్ని ఒప్పించటంలో ఆయన రెండోసారి విఫలమయ్యారు. ఏచూరి చేసిన ప్రతిపాదనను కేంద్ర కమిటీ తోసిపుచ్చింది. దీంతో ఆయన రాజీనామాకు సిద్ధపడినట్లు తెలుస్తోంది. కోల్‌కతాలో ఆదివారం నిర్వహించిన కేంద్ర కమిటీ ఓటింగ్‌లో 55-31తో ఏచూరి చేసిన ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. దీంతో మనస్థాపం చెందిన ఆయన రాజీనామాకు సిద్ధపడ్డారు. అయితే ఏచూరిని కొనసాగాల్సిందిగా పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేయటంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తగ్గారు. అయినప్పటికీ ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో పార్టీ నిర్వహించబోయే అంతరంగిక సమావేశంలో తాడోపేడో తేల్చుకునేందుకు ఏచూరి సిద్ధమవుతున్నారు. అసలు విషయం... 2019 ఎన్నికల్లో బీజేపీ ఓటమి ప్రధాన లక్ష్యంగా సీపీఎం పార్టీ ఆరు నెలల క్రితం తీర్మానం చేసింది. పార్టీ ఓటు బ్యాంకింగ్ పెంచుకోవాలంటే బీజేపీ వ్యతిరేక కూటమితో చేతులు కలపాలని ఏచూరి ఓ ప్రతిపాదన లేవనెత్తారు. కానీ, అది ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తుందని.. పార్టీ నైతిక విలువలు దెబ్బ తింటాయని, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీది మోసపూరిత రాజకీయాలని పేర్కొంటూ సీనియర్ నేత ప్రకాశ్ కారత్ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. ఏచూరి ప్రతిపాదనకు అచ్యుతానందన్ మద్ధతు ప్రకటించగా... ప్రకాశ్ ప్రతిపాదనకు కేరళ, ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన నేతలు, పార్టీ లేబర్ విభాగం సీఐటీయూ కారత్ ప్రతిపాదనకు మద్ధతు ప్రకటించాయి. ఈ పరిణామాలు ఎంతకు తెగకపోవటంతో కోల్‌కతాలో భేటీ నిర్వహించిన కేంద్ర కమిటీ మూడు రోజులపాటు ఏచూరి-కారత్ ముసాయిదాల మీద చర్చించింది. శనివారం రాత్రి వరకు ఈ వ్యవహారంపై ఏకాభిప్రాయం కుదరకపోవటంతో ఆదివారం ఓటింగ్ నిర్వహించింది. ప్రస్తుతం కేంద్ర కమిటీలో 91 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో 55 మంది ప్రకాశ్ కారత్ ముసాయిదాకు ఓటేయగా.. 31 మంది ఏచూరి ముసాయిదావైపు మొగ్గు చూపారు. మిగతా వారు తటస్థంగా ఉన్నారు. దీంతో ఏచూరి ముసాయిదా వీగిపోయినట్లయ్యింది. ఏచూరి ఓడిపోలేదు... సీతారాం ఏచూరికి బెంగాల్ పార్టీ యూనిట్ మొదటి నుంచి గట్టి మద్ధతు ఇస్తూ వస్తోంది. ముసాయిదా వీగిపోయిన నేపథ్యంలో ఆ విభాగం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘ప్రతిపాదన మాత్రమే వీగిపోయింది. కానీ, ఆయన ఓడిపోలేదు. అంతరంగిక సమావేశంలో అసలు విషయం తేల్చుకుంటాం’ అంటూ పేర్కొంది. ఇక అలీముద్దీన్ స్ట్రీట్ ప్రధాన కార్యాలయంలో మీడియాతో స్పందించిన ఏచూరి... ‘‘పార్టీ, పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ ఆదేశాల మేరకే ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నా. అంతిమ నిర్ణయం పార్టీదే’’ అంటూ ప్రకటించటంతో ఆయన రాజీనామాకు సిద్ధపడ్డ వార్తలకు బలం చేకూరింది. కానీ, కమిటీ భేటీ, ఓటింగ్ విషయాలను మాత్రం ఆయన మీడియాతో పంచుకోలేదు. చివరిసారిగా 1975లో ప్రధాన కార్యదర్శి ప్రతిపాదన తిరస్కరణకు గురైంది. ఆ సమయంలో పీ సుందరయ్య ప్రవేశపెట్టిన ప్రతిపాదనను తిరస్కరణకు గురికాగా.. ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సివచ్చింది. -
నన్ను కుక్కని కొట్టినట్టు కొట్టాడు
-
గూండా రాజ్యం... బూతులు తిడుతూ యువతిపై దాడి
సాక్షి, కోల్‌కతా : పశ్చిమ బెంగాల్ లో హేయమైన ఘటన వెలుగు చూసింది. అధికారం ఉందన్న మదంతో ఓ యువనేత.. ఓ యువతిపై పైశాచికత్వం ప్రదర్శించాడు. బండబూతులు తిడుతూ.. పిడిగుద్దులు గుద్దుతూ... ఆమెపై దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలు మీడియాకు చిక్కటంతో అధికార పక్షంపై విమర్శలు మొదలయ్యాయి. హూగ్లీ తృణమూల్ కాంగ్రెస్ విద్యార్థి విభాగానికి(టీఎంసీపీ) జనరల్ సెక్రెటరీ షాహిద్ హసన్ ఖాన్. బాధిత విద్యార్థిని స్థానికంగా ఉన్న రిష్రా కాలేజీలో కాలేజీలో మూడో సంవత్సరం చదువుతోంది. వీరిద్దరూ ఒకే కాలేజీలో చదువుతున్నారు. దీనికి తోడు ఆమె కూడా టీఎంసీపీ స్టూడెంట్ సభ్యురాలే. అయితే పార్టీ నిధులను వ్యక్తిగత ప్రయోజనాలకు పాల్పడుతూ షాహిద్ అవినీతికి పాల్పడుతున్నాడు. ఈ విషయంపై సదరు యువతి అతన్ని నిలదీసింది. దీంతో ఆమెను యూనియన్ కార్యాలయానికి రప్పించుకుని మరీ షాహిద్ దాడికి పాల్పడ్డాడు. అసభ్య పదజాలంతో దూషిస్తూ ఆమెను చితకబాదాడు. కాలితో తన్నటం, జుట్టు పట్టుకుని లాగేయటం.. అసభ్యంగా తాకటం.. అడ్డుకునేందుకు తోటి సభ్యులు ప్రయత్నించినా వారిని తోసేస్తూ ఆమెపై దాడి చేశాడు. డిసెంబర్ 4న ఈ ఘటన చోటు చేసుకోగా.. ఆ సీసీ ఫుటేజీ దృశ్యాలు ఇప్పుడు బయటకు పొక్కాయి. ‘‘షాహిద్ నన్ను గొడ్డును బాదినట్లు బాదాడు. ఒక్కరోజే కాదు. ఈ దాడుల పర్వం కొన్నాళ్లుగా కొనసాగుతూ వస్తోంది. లైంగికంగా కూడా నన్ను వేధించేవాడు. నన్ను, నా కుటుంబాన్ని చంపుతానని బెదరిస్తున్నాడు. అతని తండ్రి జహీద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కావటంతో షాహిద్ ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోతున్నాయి. యూనియన్ ఫండ్‌ను దుర్వినియోగం చేయటం.. ఎదురు ప్రశ్నించిన వారిని ఇలా చితకబాదటం చేస్తున్నాడు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినా ఇంత వరకు చర్యలు తీసుకోలేదు. నాకు కాలేజీకి వెళ్లాలంటే భయంగా ఉంది’’ అని యువతి చెబుతున్నారు. షాహిద్‌పై వేటు... కాగా, సీసీ టీవీ దృశ్యాలు వెలుగులోకి రావటంతో స్పందించిన రిష్రా కాలేజీ యాజమాన్యం షాహిద్ సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. మరోవైపు అతన్ని జనరల్ సెక్రెటరీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీఎంసీపీ రాష్ట్ర అధ్యక్షుడు జయ దత్తా తెలిపాడు. విద్యాశాఖా మంత్రి పార్థ ఛటర్జీ ఘటనపై అధికారులను సమగ్ర నివేదికను కోరారు. అయితే తనకేం తెలీదని.. ఆ అమ్మాయి తాను మంచి స్నేహితులమని.. పైగా తోటి సభ్యురాలిపై దాడి చేయాల్సిన అవసరం తనకేంటని జహీద్ బుకాయిస్తున్నాడు. మరోవైపు యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ.. ఇంతవరకు షాహిద్‌పై చర్యలు తీసుకోకపోవటం గమనార్హం. నిందితుడిపై సత్వరమే చర్యలు తీసుకోవాలని.. లేకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని బీజేపీ హెచ్చరిస్తోంది. ఇక తృణమూల్ కాంగ్రెస్ పాలన గూండా రాజ్యంగా మారిందనటానికి మచ్చుకు ఇదో ఉదాహరణ మాత్రమేనని.. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో అన్నిచోట్లా జరుగుతున్నాయని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ప్రస్తుతం ఈ ఘటన స్థానిక మీడియాలో చర్చనీయాంశమైంది. సీసీ ఫుటేజీ దృశ్యాలు -
క్రెడాయ్ తెలంగాణ కొత్త కార్యవర్గం
సాక్షి, హైదరాబాద్: భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) తెలంగాణ కొత్త కార్యవర్గం ఎంపికైంది. – 2017–19 సంవత్సరానికి గాను అధ్యక్షుడిగా గుమ్మి రాంరెడ్డి, జనరల్ సెక్రటరీగా చెరుకు రామచంద్రా రెడ్డిలు తిరిగి నియమితులయ్యారు. ఉపాధ్యక్షులుగా ఏ ఆనంద్ రావు (కరీంనగర్), కొప్పు నరేష్ కుమార్ (ఖమ్మం), టీ వెంకటేశ్వర్లు (వరంగల్), ట్రెజరర్‌గా కే ఇంద్రసేనా రెడ్డి నియమితులయ్యారు. ఖమ్మంలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశంలో జీ రాంరెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నిజామాబాద్, కొత్తగూడెం చాప్టర్లున్నాయని, రెండేళ్లలో మరో 6 చాప్టర్లను ప్రారంభించాలని లక్ష్యించామని చెప్పారు. వచ్చే నెలలో కామారెడ్డి, మంచిర్యాలలో చాప్టర్లను ప్రారంభించనున్నామన్నారు. జిల్లాల్లో నూ జీఎస్టీ, రెరా వంటి వాటిపై అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. జనరల్ సెక్రటరీ రామచంద్రా రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రెడాయ్ తెలంగాణలో 550 మంది డెవలపర్లు సభ్యులుగా ఉన్నారని.. ప్రతి పట్టణంలోనూ చాప్టర్లను తెరవనున్నట్లు చెప్పారు. నైపుణ్య అభివృద్ధి, క్లీన్ సిటీ వంటి కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలోనూ ప్రారంభించనున్నట్లు చెప్పుకొచ్చారు. క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా ఎస్ రాంరెడ్డి క్రెడాయ్ హైదరాబాద్ చాప్టర్ అధ్యక్షుడిగా ఎస్ రాంరెడ్డి, జనరల్ సెక్రటరీగా పీ రామకృష్ణా రావులు తిరిగి ఎంపికయ్యారు. వైస్ ప్రెసిడెంట్లుగా జీ ఆదిత్య, జీ ఆనంద్ రెడ్డి, ఎస్ ఆనంద్ రావు, డీ మురళీ కృష్ణా రెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా సీజీ మురళీ మోహన్, వీ రాజశేఖర్ రెడ్డి, ట్రెజరర్‌గా కే రాజేశ్వర్‌లు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఎస్ రాంరెడ్డి మాట్లాడుతూ.. ‘‘హైదరాబాద్‌ను విశ్వనగరంగా అభివృద్ధి చేసే క్రమంగా తెలంగాణ ప్రభుత్వం అడుగులేస్తోందని.. అందుకే అంతర్జాతీయ కంపెనీలు నగరం వేదికగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకొస్తున్నాయని ఆయన కొనియాడారు. నిర్మాణ రంగంలోని సమస్యలను తొలగించేందుకూ సంఘాలతో చర్చించడం ముదావహమని’’ చెప్పుకొచ్చారు. -
ప్రేమలతకు పగ్గాలు
డీఎండీకే పగ్గాలు విజయకాంత్ సతీమణి ప్రేమలత చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆమెకు ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టేందుకు డీఎండీకే వర్గాలు నిర్ణయానికి వచ్చాయి. మరో రెండు మూడు రోజుల్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. సాక్షి, చెన్నై: 2005లో సినీ నటుడు విజయకాంత్ దేశీయ ముర్పోగు ద్రావిడ కళగం(డీఎండీకే)ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పార్టీ ఆవిర్భావంతో జరిగిన తొలి ఎన్నికల్లో తానొక్కడినే గెలిచినా, ఢీలా పడకుండా అడుగులు వేశారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా జోడు పదవులతో ముందుకు సాగి 2011లో ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. అయితే 2016 ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న పరిణామాలు డీఎండీకేను ఢీలా పడేలా చేశాయి. ఎండీఎంకే, వామపక్షాలు, వీసీకే నేతృత్వంలోని కూటమిలోకి విజయకాంత్ వెళ్లడాన్ని ఖండిస్తూ, ఆ పార్టీలో ఉన్న సీనియర్లు అందరూ బయటకు వచ్చేశారు. ఈ ప్రభావం ఆ ఎన్నికల్లో విజయకాంత్‌కు గట్టి దెబ్బ తగిలేలా చేశాయి. డిపాజిట్లే కాదు, గత కొన్నేళ్లుగా కాపాడుకుంటూ వచ్చిన ఓటు బ్యాంక్‌ను ఆయన కోల్పోక తప్పలేదు. మళ్లీ పూర్వ వైభవం లక్ష్యంగా మీలో ఒక్కడ్నీ అంటూ కేడర్ వద్దకు పరుగులు తీస్తూ వచ్చిన విజయకాంత్ ప్రస్తుతం అనారోగ్యం బారిన పడ్డారు. గత కొద్ది రోజులుగా ఆసుపత్రికి, ఇంటికి తిరగక తప్పడం లేదు. ప్రస్తుతం ఆయనకు మళ్లీ కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స అనివార్యమైనట్టుగా ప్రచారం సాగుతోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి నేపథ్యంలో పార్టీని నడిపించడంతోపాటుగా కేడర్‌ను దక్కించుకునే విధంగా పగ్గాలు ఆయన సతీమణి ప్రేమలతకు అప్పగించేందుకు తగ్గ కార్యాచరణ డీఎండీకేలో సిద్ధం అవుతోన్నట్టు సంకేతాలు వెలువడ్డాయి. విజయకాంత్ సతీమణి ప్రేమలత మంచి వాక్చాతుర్యం కల్గిన వారు. సమయానుగుణంగా స్పందించే తత్వం ఉన్న వారు. ఇంకా చెప్పాలంటే, విజయకాంత్‌ను మించి ప్రసంగాలు సాగించగల సమర్థురాలు. డీఎండీకే ఎన్నికల ప్రచారంలో ఆమె పాత్ర కీలకం. పార్టీలో ఎలాంటి పదవీ లేకున్నా, అన్నీ తానై విజయకాంత్ వెన్నంటి ఆమె సాగుతున్నారని చెప్పవచ్చు. పార్టీలో ఆమెకు పదవి కట్టబెట్టాలన్న నినాదం ఎప్పటి నుంచో వస్తున్నా, విజయకాంత్ అందుకు తగ్గ నిర్ణయాన్ని ఎన్నడూ తీసుకోలేదు. ఇందుకు కారణం, ఎక్కడ పార్టీలోని సీనియర్లు వ్యతిరేకత వ్యక్తం చేస్తారోననే. ప్రస్తుతం సీనియర్లు ఎవ్వరూ ఆ పార్టీలో లేరు. ఉన్నదంతా అభిమాన లోకం. వారిని రక్షించుకోవాలంటే, పార్టీ పగ్గాలు ప్రేమలతకు అప్పగించాల్సిన అనివార్యం ప్రస్తుతం ఏర్పడి ఉంది. విజయకాంత్ ఆసుపత్రిలో ఉండడంతో, పార్టీని నడిపించేందుకు తగ్గ కార్యాచరణను డీఎండీకే వర్గాలు సిద్ధం చేశాయి. విజయకాంత్ చేతిలో ఉన్న జోడు పదవుల్లో ఓ పదవిని ప్రేమలత స్వీకరించాలన్న నినాదాన్ని అందుకుని ఉన్నారు. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడి పదవి విజయకాంత్ వద్దే ఉంచి, పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలని ప్రేమలత మీద ఒత్తిడి తెచ్చే పనిలో కేడర్ ఉన్నారు. సామాజిక మాధ్యమాల్లో, డీఎండీకే వెబ్సైట్లోనూ ఆమె తప్ప మరొకరు లేరని, ఆమె పగ్గాలు చేపట్టాల్సిందేనని కేడర్ తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు మూడు రోజుల్లో డీఎండీకే కార్యాలయం నుంచి ప్రేమలత ప్రధాన కార్యదర్శి అన్న అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఎక్కువేనని ఓ నేత పేర్కొన్నారు. విజయకాంత్ బావమరిది సుధీష్ ఆ పార్టీ యువజన నేతగా ఉన్నా, పార్టీని నడిపించే సత్తా మాత్రం ప్రేమలతకు మాత్రమే ఉందని, ఆమె పగ్గాలు చేపట్టేందుకు ఇదే మంచి సమయంగా ఆ నేత వ్యాఖ్యానించడం గమనార్హం. -
తమిళనాడు పాలనపై గవర్నర్ ఆరా
* ఇద్దరు సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శితో భేటీ * జయ ఆరోగ్యంపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్న రాహుల్ సాక్షి, చెన్నై: తమిళనాడులో రోజువారీ సాధారణ పరిపాలనపై ఇద్దరు రాష్ట్ర సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శితో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు శుక్రవారం చర్చించారు. సీఎం జయలలిత ఆరోగ్యంపై ఆరా తీశారు. రెండు వారాలుగా జయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో భేటీ జరిగింది. జయ ఆరోగ్యంపై సమావేశమయ్యారా? లేక సీఎం మరికొద్ది రోజులు ఆస్పత్రిలోనే ఉండాల్సిన పరిస్థితుల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేస్తారా? అని ఊహాగానాలు వచ్చాయి. వాటికి తెరదించుతూ... రాష్ట్రంలో దైనందిన పాలన, ప్రభుత్వ వ్యవహారాలపై గవర్నర్ ఆరాతీశారంటూ రాజ్‌భవన్ తెలిపింది. పరిపాలనా వ్యవహారాలపై గవర్నర్‌కు ప్రధాన కార్యదర్శి పి.రామమోహనరావు వివరించారని, ఇతర అంశాలూ చర్చకు వచ్చాయని ఓ ప్రకటనలో పేర్కొంది. శుక్రవారం మధ్యాహ్నం గవర్నర్‌ను ఒంటరిగా కలసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి... సాయంత్రం మంత్రులతో పాటు మరోసారి కలిశారు. జయ ఆరోగ్యం గురించి ఆమె విధేయుడు, మంత్రి పన్నీర్‌సెల్వం, మరో మంత్రి పళనిస్వామిల్ని గవర్నర్ వాకబు చేశారు. జయ ఆస్పత్రిలో చేరాక సీనియర్ మంత్రులు, ప్రధాన కార్యదర్శితో గవర్నర్ చర్చలు జరపడం ఇదే తొలిసారి. కావేరిపై ఏర్పాటైన సాంకేతిక బృందం గురించి మంత్రుల్ని గవర్నర్ ప్రశ్నించారని రాజ్‌భవన్ పేర్కొంది. అండగా ఉంటాం..రాహుల్: కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ శుక్రవారమిక్కడి అపోలో ఆస్పత్రికి వెళ్లి జయ ఆరోగ్యంపై వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. జయకు తనతో పాటు కాంగ్రెస్ అండగా ఉంటుందన్నారు. సీఎం కోలుకుంటున్నట్లు వైద్యులు చెప్పారన్నారు. -
తెలంగాణ చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలి
వినాయక్‌నగర్ : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో జీవితాలను త్యాగం చేసినవారి చరిత్రను పాఠ్యపుస్తకాల ద్వారా భావి తరాలకు అందించాల్సిన బాధ్యత పాలకులపై ఉందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బీజేపీ చేపట్టిన తిరంగా యాత్రలో భాగంగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై శనివారం నిజామాబాద్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో వర్క్‌షాప్ నిర్వహించారు. కార్యక్రమంలో ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ నిజాంను గత పాలకులు గొప్ప రాజుగా చూపించారన్నారు. నిజాం అరాచకాలకు వరంగల్ జిల్లాలోని బైరాన్‌పల్లి, నిర్మల్ ప్రాంతంలోని వెయ్యి ఉరిల మర్రి మౌన సాక్షిగా ఉన్నాయన్నారు. అతడు గొప్ప రాజే అయితే కొమరం భీం, చాకలి ఐలమ్మలు నిజాంను ఎందుకు ఎదిరించాల్సి వచ్చిందని ప్రశ్నించారు. నరహంతక నిజాం తెలంగాణ ద్రోహులతో కలిసి ప్రజల మాన, ప్రాణాలతో పాటు, ధనాన్ని దోచుకున్నాడని ఆరోపించారు. నిజాంల కాలంలో జలియన్ వాలాబాగ్ లాంటి ఘటనలు తెలంగాణలో ఎన్నో చోటు చేసుకున్నాయని, వాటిని పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. నిజాం నిరంకుశత్వాన్ని, స్వాతంత్య్ర వీరుల త్యాగాలను తిరంగా యాత్రలో ప్రజలకు వివరిస్తామన్నారు. జిల్లాల విభజనలో స్పష్టతలేదని, పాలకులకు అనుకూలంగా విభజిస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పల్లె గంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మార్క్సిజానికి పునరంకితం కావాలి
క్యాడర్‌కు గణపతి పిలుపు న్యూఢిల్లీ: భారత్ సహా ప్రపంచ చరిత్రలో కమ్యూనిస్టులు మరిచిపోలేని నాలుగు ముఖ్య చరిత్రాత్మక ఘట్టాలున్నాయని, ఈ ఘట్టాల వార్షికోత్సవాలను పురస్కరించుకొని మార్క్సిజం-లెనినిజం-మావో ఆలోచనా విధానానికి మావోయిస్టులందరు పునరంకితం కావాలని సీపీఐ(మావోయిస్టు) సెంట్రల్ కమిటీ తరఫున ప్రధాన కార్యదర్శి గణపతి బహిరంగ లేఖలో పార్టీ క్యాడర్‌కు పిలుపునిచ్చారు. చైనాలో అర్ధ భూస్వామ్య, అర్ధ పెట్టుబడిదారి వ్యవస్థకు తిలోదకాలిచ్చి కమ్యూనిస్టు పాలనకు తెరలేపిన గొప్ప శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవం (గ్రేట్ ప్రొలిటేరియన్ కల్చరల్ రెవెల్యూషన్-జీపీసీఆర్) 50వ వార్షికోత్సవాన్ని, భారత్‌లో ఉవ్వెత్తున ఎగిసిపడిన నక్సల్బరీ సాయుధ పోరాటం 50వ వార్షికాత్సవాన్ని, ప్రపంచాన్నే కుదిపేసిన రష్యా సోషలిస్ట్ విప్లవం శతవార్షికోత్సవాన్ని, కాలం ప్రసవించి కారల్ మార్క్స్ కని రెండు శతాబ్దాలు అవుతున్న సందర్భమే ఈ నాలుగు ప్రధాన చరిత్రాత్మక ఘట్టాలని, ఈ వార్శికోత్సవ వారోత్సవాలను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. చైనా శ్రామికవర్గ సాంస్కృతిక విప్లవాన్ని, 50వ వార్షికోత్సవాన్ని ఈ ఏడాది మే 16వ తేదీ నుంచి మే 22వ తేదీ వరకు (గడిచిపోయిన కాలం), దేశంలో నక్సల్బరి సాయుధ తిరుగుబాటు 50వ వార్షికోత్సవాన్ని వచ్చే ఏడాది 23మే నెల నుంచి మే 29వ తేదీ వరకు, రష్యా సోషలిస్టు విప్లవం శత వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే ఏడాది నవంబర్ ఏడు నుంచి 13వ తేదీ వరకు, కారల్ మార్క్స్ ద్విశత జయంతిని పురస్కరించుకొని 2018, మే 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు వివిధ ప్రజా సంఘటిత కార్యక్రమాలను నిర్వహించాలని మావోయిస్టు నేత గణపతి పిలుపునిచ్చారు. అనివార్య కారణాల వల్ల తాను సూచించిన తేదీల్లో వార్షిక వారోత్సవాలను నిర్వహించడం కుదరకపోతే అనువైన తేదీల్లో నిర్వహించాలని ఆయన సూచించారు. నేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు. దేశంలో జాతీయ ప్రజాస్వామిక విప్లవాన్ని ముందుకు తీసుకెళ్లడానికి వివిధ రంగాలను శక్తులను కూడగట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఈ విషయంలో కొంత వెసలుబాటు దోరణి అవలింబించినప్పటికీ నక్సలిజం లక్ష్యానికి మాత్రం దూరం వెళ్లకూడదని చెప్పారు. నక్సలిజాన్ని ఏదోరకంగా సమర్ధించే శక్తులతోనే మమేకం కావాలని అన్నారు. నేడు ప్రపంచవ్యాప్తంగా నయా పెట్టుబడిదారి విధానం రాజ్యమేలుతున్న కారణంగా ప్రజల్లో అసహన పరిస్థితులు, కొన్ని చోట్ల తిరుగుబాటు పరిస్థితులు తలెత్తాయని చెప్పారు. కమ్యూనిజానికి, సోషలిస్టు విప్లవాలకు, ప్రజాస్వామ్య ఉద్యమాలకు వ్యతిరేకంగా పెట్టుబడిదారి సమాజం దుష్ర్పచారం సాగిస్తోందని, తాను చెప్పిన నాలుగు కమ్యూనిస్టు చారిత్రక ఘట్టాలను పురస్కరించుకొని ఎదురుదాడికి దిగాలని ఆయన సూచించారు. మేధోపరంగా, రాజకీయంగా, ప్రజా ఉద్యమాలపరంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. -
పారిశ్రామిక రాయితీలు ఇష్టానుసారం ఇవ్వలేం
♦ స్పష్టం చేసిన ఏపీ సీఎస్ టక్కర్.. ♦ ఎస్ఐపీసీ సమావేశం వాయిదా సాక్షి, హైదరాబాద్: ఇష్టానుసారం పారిశ్రామిక రాయితీలు ఇవ్వడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ స్పష్టం చేశారు. రెండు రోజుల కిందట రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ(ఎస్ఐపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయా పారిశ్రామిక సంస్థలు కోరుతున్న రాయితీలతో సంబంధిత శాఖల అధికారులు వచ్చారు. అయితే ఆ రాయితీలు ప్రభుత్వ పాలసీలకు లోబడే ఉన్నాయా? ఒకవేళ లేకపోతే నిబంధనలు ఏంచెబుతున్నాయి?అనే అంశాలను సబంధిత శాఖల అధికారులు పేర్కొనలేదు. దీంతో సమావేశాన్ని సీఎస్ టక్కర్ ఎస్ఐపీసీ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగాల్సిన ఎస్ఐపీబీ సమావేశం కూడా వాయిదా పడింది. సీఎస్ ఎందుకు వాయిదా వేశారంటే.. వాస్తవానికి ఏదైనా పరిశ్రమ కోరిన మేరకు రాయితీ ఇవ్వాలంటే అది పాలసీకి లోబడి ఉందా? లేదా? పరిశీలించాలి. ఒకవేళ పాలసీకి అనుగుణంగా లే కుండా రాయితీ ఇవ్వాలంటే నిబంధనల్లో సవరణలు తీసుకురావాలా? అంతే కాకుండా పాలసీ మేరకు రాయితీలు ఇస్తున్నప్పటికీ తద్వారా రాష్ట్రానికి అనుకున్న ప్రయోజనాలు వస్తాయా లేదా? అనేది తెలియజేయాలి. అదనపు రాయితీలు ఇవ్వాలంటే అందుకు జస్టిఫికేషన్ ఉందో లేదో పేర్కొనాలి. ఈ అంశాలన్నింటినీ సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేసి రాయితీలు కోరుతున్న పరిశ్రమల ఫైళ్లలో లిఖిత పూర్వకంగా రాయాలి. వీటినే సమావేశంలో సీఎస్ టక్కర్ స్పష్టం చేశారు. ఏదైనా పరిశ్రమ పాలసీకి విరుద్ధంగా అదనపు రాయితీ కోరితేసంబంధిత శాఖ ఆ రాయితీ ఇవ్వాలా వద్దా ఇస్తే ఎలాంటి నిబంధనలు సవరించాలనే విషయాలను స్పష్టం చేయకుండా నేరుగా ఎస్ఐపీసీకి పంపించడం ఏ మాత్రం సమంజసం కాదని సైతం సీఎస్ పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సంబంధిత శాఖలన్నీ తమ అభిప్రాయాలతో ఫైళ్లను పంపిన తరువాతనే ఎస్ఐపీసీ సమావేశం నిర్వహిస్తానని స్పష్టం చేశారు. -
ఏడోసారీ ఆమెకే బాధ్యతలు
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఏడోసారి ఎన్నికయ్యారు. గురువారం జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ఆమెను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా 14 తీర్మానాలను అన్నాడీఎంకే ఆమోదించింది. తమ ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు జల్లికట్టును అనుమతిస్తూ ఆర్డినెన్స్ తీసుకురావాలని కేంద్రాన్ని కోరింది. జాలర్ల సమస్యను పరిష్కరించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ, శ్రీలంక ప్రభుత్వం మధ్య చర్చలు జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేసింది. వరద బాధితులను ఆదుకునేందుకు వీలుగా తమిళనాడుకు వెంటనే నిధులు మంజూరు చేయాలని అభ్యర్థించింది. భారీ వర్షాలు, వరదలు నేపథ్యంలో సహాయ కార్యక్రమాలు, పునరావాస చర్యలు వేగంగా అమలయ్యేలా చూసినందుకు 'అమ్మ'కు ధన్యవాదాలు తెలుపుతూ కూడా అన్నాడీఎంకే తీర్మానం ఆమోదించింది. కాగా, ఏడోసారి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన జయలలితను అన్నాడీఎంకే కార్యకర్తలు ఘనంగా సన్మానించారు. -
మెరుగు పడిన అశోక్ సింఘాల్ ఆరోగ్యం
-
ఇంకా చెరలోనే ప్రొఫెసర్లు
-
వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదన రెడ్డి
హైదరాబాద్: వైఎస్ఆర్సీపీ ఏపీ ప్రధాన కార్యదర్శిగా సి.మధుసూదన రెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లా రైతు విభాగం అధ్యక్షుడిగా టి.ఆదికేశవులు రెడ్డిని నియమించారు. చిత్తూరు జిల్లా పార్టీ క్రమశిక్షణా సంఘం సభ్యుడిగా తిరుపతికి చెందిన మణిని నియమించారు. ** -
అన్నాడీఎంకే అధినేత్రిగా మళ్లీ జయలలితే!
అన్నాడీఎంకే అధినేత్రిగా మరోసారి జయలలిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా జయలలిత(66)ను పార్టీ నేతలంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీతో పాటు దేశ సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తానని ఆమె ఈ సందర్బంగా అన్నారు. పార్టీ నిర్వాహక కార్యదర్శి విసలాచి నెడుంజెళియన్ ఎన్నికల కమిషనర్‌గా కూడా వ్యవహరించారు. ఆగస్టు 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగిందని, జయలలిత నుంచి మాత్రమే నామినేషన్లు వచ్చాయని ఆయన తెలిపారు. దీంతో పార్టీ నియమాల ప్రకారం ఆమె ఎన్నికైనట్లు ప్రకటించారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనను ఎన్నుకొన్నందుకు జయలలిత తన మద్దతుదారులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 1987లో పార్టీ వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ మరణించినప్పటి నుంచి జయలలితే ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగుతూ వస్తున్నారు. పార్టీ నిబంధనల ప్రకారం ఐదేళ్లకోసారి ఈ ఎన్నికలు జరుగుతాయి. -
బీజేపీ ప్రధాన కార్యదర్శిగా రామ్ మాధవ్
న్యూఢిల్లీ: ఆర్ఎస్ఎస్ మాజీ అధికార ప్రతినిధి రామ్ మాధవ్‌కు బీజేపీలో కీలక బాధ్యతలు అప్పగించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా రామ్ మాధవ్ నియమితులయ్యారు. బీజేపీ అధికారంలోకి రావడం, నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు స్వీకరించాక పార్టీలో మార్పులు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. బీజేపీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్‌ను కేబినెట్లోకి తీసుకుని కీలక హోం శాఖ అప్పగించడంతో ఆయన స్థానంలో మోడీ ప్రధాన అనుచరుడు అమిత్ షాకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని భావిస్తున్నారు.