పారిశ్రామిక రాయితీలు ఇష్టానుసారం ఇవ్వలేం | takkar clarity about Industrial subsidy | Sakshi
Sakshi News home page

పారిశ్రామిక రాయితీలు ఇష్టానుసారం ఇవ్వలేం

Published Fri, Apr 1 2016 2:59 AM | Last Updated on Sun, Sep 3 2017 8:57 PM

పారిశ్రామిక రాయితీలు ఇష్టానుసారం ఇవ్వలేం

పారిశ్రామిక రాయితీలు ఇష్టానుసారం ఇవ్వలేం

స్పష్టం చేసిన ఏపీ సీఎస్ టక్కర్..
ఎస్‌ఐపీసీ సమావేశం వాయిదా

 సాక్షి, హైదరాబాద్: ఇష్టానుసారం పారిశ్రామిక రాయితీలు ఇవ్వడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ స్పష్టం చేశారు. రెండు రోజుల కిందట రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ(ఎస్‌ఐపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయా పారిశ్రామిక సంస్థలు కోరుతున్న రాయితీలతో సంబంధిత శాఖల అధికారులు వచ్చారు. అయితే ఆ రాయితీలు ప్రభుత్వ పాలసీలకు లోబడే ఉన్నాయా? ఒకవేళ లేకపోతే నిబంధనలు ఏంచెబుతున్నాయి?అనే అంశాలను సబంధిత శాఖల అధికారులు పేర్కొనలేదు. దీంతో సమావేశాన్ని సీఎస్ టక్కర్ ఎస్‌ఐపీసీ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగాల్సిన ఎస్‌ఐపీబీ సమావేశం కూడా వాయిదా పడింది.

 సీఎస్ ఎందుకు వాయిదా వేశారంటే..
వాస్తవానికి ఏదైనా పరిశ్రమ కోరిన మేరకు రాయితీ ఇవ్వాలంటే అది పాలసీకి లోబడి ఉందా? లేదా? పరిశీలించాలి. ఒకవేళ పాలసీకి అనుగుణంగా లే కుండా రాయితీ ఇవ్వాలంటే నిబంధనల్లో సవరణలు తీసుకురావాలా? అంతే కాకుండా పాలసీ మేరకు రాయితీలు ఇస్తున్నప్పటికీ తద్వారా రాష్ట్రానికి అనుకున్న ప్రయోజనాలు వస్తాయా లేదా? అనేది తెలియజేయాలి. అదనపు రాయితీలు ఇవ్వాలంటే అందుకు జస్టిఫికేషన్ ఉందో లేదో పేర్కొనాలి.

ఈ అంశాలన్నింటినీ సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేసి రాయితీలు కోరుతున్న పరిశ్రమల ఫైళ్లలో లిఖిత పూర్వకంగా రాయాలి. వీటినే సమావేశంలో సీఎస్ టక్కర్ స్పష్టం చేశారు. ఏదైనా పరిశ్రమ పాలసీకి విరుద్ధంగా అదనపు రాయితీ కోరితేసంబంధిత శాఖ ఆ  రాయితీ ఇవ్వాలా వద్దా ఇస్తే ఎలాంటి నిబంధనలు సవరించాలనే విషయాలను స్పష్టం చేయకుండా నేరుగా ఎస్‌ఐపీసీకి పంపించడం ఏ మాత్రం సమంజసం కాదని సైతం సీఎస్ పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సంబంధిత శాఖలన్నీ తమ అభిప్రాయాలతో ఫైళ్లను పంపిన తరువాతనే ఎస్‌ఐపీసీ సమావేశం నిర్వహిస్తానని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement