Industrial subsidy
-
పత్తాలేని గిరిజన పారిశ్రామిక రాయితీ
⇒ నాలుగేళ్లుగా విడుదల కాని నిధులు ⇒ పేరుకుపోయిన బకాయిలు రూ.123 కోట్లు సాక్షి, హైదరాబాద్: గిరిజన యువతను స్వయం ఉపాధివైపు మళ్లించాలనే సంకల్పంతో తలపెట్టిన పారిశ్రామిక రాయితీ పథకం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ఈ పథ కం కింద ఎంపికైన లబ్ధిదారుల రాయితీ విడు దలకు తీవ్ర జాప్యం జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలో తాత్సారం చేయడం... మరోవైపు ఉమ్మడి రాష్ట్రంలోని బకాయిలపై స్పష్టత ఇవ్వకపో వడంతో రాయితీ బకాయిలు ఏకంగా రూ.123 కోట్లు పేరుకుపోయాయి. ఇందులో రాష్ట్ర ఏర్పాటుకు ముందున్న రాయితీ బకాయిలు రూ.78 కోట్లు. వాస్తవానికి ఈ నిధులను 2013–14 సంవత్సరం చివర్లో విడుదల చేయాల్సి ఉండగా... అప్పట్లో ఖజానాపై ఆంక్షల నేపథ్యంలో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం పాత బకాయిల విడుదలపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. దీంతో దాదాపు 4వేల మంది లబ్ధిదారుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఔత్సాహిక గిరిజన పారిశ్రామికవేత్తలు నెలకొల్పే చిన్న పరిశ్రమలకు గరిష్టంగా 75 శాతం రాయితీ ఇవ్వడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. 2012–13 సంవత్సరంలో ఈ పథకం అందుబాటులోకి రాగా... గిరిజన యువతకోసం అప్పటి ప్రభుత్వం ప్రత్యేకంగా పెద్ద మొత్తాన్ని రాయితీ కింద ఇచ్చేలా కేటాయించింది. దీంతో ఈ పథకం కింద భారీ వాహనాల కొనుగోలుకు వేలాది దరఖాస్తులు రాగా... అదేస్థాయిలో అధికారులు మంజూరు చేశారు. తొలి ఏడాది నిధుల విడుదల సంతృప్తికరంగా జరిగినప్పటికీ... ఆ తర్వాత పరిస్థితులు తలకిందులయ్యాయి. ఇటీవల ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన ఎస్సీ, ఎస్టీ కమిటీ సమావేశంలో రాయితీ నిధుల విడుదలపై ఎంపీ సీతారాం నాయక్ తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. రాయితీ సకాలంలో ఇవ్వకపోవడంతో లబ్ధిదారులు అప్పుల పాలయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. -
పారిశ్రామిక రాయితీలు ఇష్టానుసారం ఇవ్వలేం
♦ స్పష్టం చేసిన ఏపీ సీఎస్ టక్కర్.. ♦ ఎస్ఐపీసీ సమావేశం వాయిదా సాక్షి, హైదరాబాద్: ఇష్టానుసారం పారిశ్రామిక రాయితీలు ఇవ్వడానికి ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ స్పష్టం చేశారు. రెండు రోజుల కిందట రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహ కమిటీ(ఎస్ఐపీసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆయా పారిశ్రామిక సంస్థలు కోరుతున్న రాయితీలతో సంబంధిత శాఖల అధికారులు వచ్చారు. అయితే ఆ రాయితీలు ప్రభుత్వ పాలసీలకు లోబడే ఉన్నాయా? ఒకవేళ లేకపోతే నిబంధనలు ఏంచెబుతున్నాయి?అనే అంశాలను సబంధిత శాఖల అధికారులు పేర్కొనలేదు. దీంతో సమావేశాన్ని సీఎస్ టక్కర్ ఎస్ఐపీసీ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో గురువారం ముఖ్యమంత్రి నేతృత్వంలో జరగాల్సిన ఎస్ఐపీబీ సమావేశం కూడా వాయిదా పడింది. సీఎస్ ఎందుకు వాయిదా వేశారంటే.. వాస్తవానికి ఏదైనా పరిశ్రమ కోరిన మేరకు రాయితీ ఇవ్వాలంటే అది పాలసీకి లోబడి ఉందా? లేదా? పరిశీలించాలి. ఒకవేళ పాలసీకి అనుగుణంగా లే కుండా రాయితీ ఇవ్వాలంటే నిబంధనల్లో సవరణలు తీసుకురావాలా? అంతే కాకుండా పాలసీ మేరకు రాయితీలు ఇస్తున్నప్పటికీ తద్వారా రాష్ట్రానికి అనుకున్న ప్రయోజనాలు వస్తాయా లేదా? అనేది తెలియజేయాలి. అదనపు రాయితీలు ఇవ్వాలంటే అందుకు జస్టిఫికేషన్ ఉందో లేదో పేర్కొనాలి. ఈ అంశాలన్నింటినీ సంబంధిత శాఖల అధికారులు అధ్యయనం చేసి రాయితీలు కోరుతున్న పరిశ్రమల ఫైళ్లలో లిఖిత పూర్వకంగా రాయాలి. వీటినే సమావేశంలో సీఎస్ టక్కర్ స్పష్టం చేశారు. ఏదైనా పరిశ్రమ పాలసీకి విరుద్ధంగా అదనపు రాయితీ కోరితేసంబంధిత శాఖ ఆ రాయితీ ఇవ్వాలా వద్దా ఇస్తే ఎలాంటి నిబంధనలు సవరించాలనే విషయాలను స్పష్టం చేయకుండా నేరుగా ఎస్ఐపీసీకి పంపించడం ఏ మాత్రం సమంజసం కాదని సైతం సీఎస్ పేర్కొన్నారు. ఈ విషయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని సంబంధిత శాఖలన్నీ తమ అభిప్రాయాలతో ఫైళ్లను పంపిన తరువాతనే ఎస్ఐపీసీ సమావేశం నిర్వహిస్తానని స్పష్టం చేశారు.