
కోజికోడ్: ప్రధాని మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించేలా ప్రకటనలు చేస్తున్నారని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. శ్రీరాముడి అంశంపై ప్రజలను మతపరంగా సంఘటితం చేసేలా పలు ప్రకటనలు చేశారని, దీనిపై తాను ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశానని తెలిపారు.
కోడ్‌ను ఉల్లంఘించేలా మోదీ మాట్లాడిన మాటలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు. ఏచూరి గురువారం కేరళలోని కోజికోడ్‌లో మీడియాతో మాట్లాడారు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలపై సీపీఎం అలుపెరుగని పోరాటం చేస్తోందని పేర్కొన్నారు.