ప్రధాని మోదీ, రాహుల్‌ గాంధీకి ఈసీ నోటీసులు | ECI takes notice PM Modi Rahul Gandhi over violations seeks response | Sakshi
Sakshi News home page

Hate Speech: ప్రధాని మోదీ, రాహుల్‌కు ఈసీ నోటీసులు.. ఏప్రిల్‌ 29 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశం

Published Fri, Apr 26 2024 1:10 PM | Last Updated on Fri, Apr 26 2024 1:10 PM

ECI takes notice PM Modi Rahul Gandhi over violations seeks response - Sakshi

ఢిల్లీ: లోక్‌సభ ఎన్నికల వేళ విద్వేష ప్రసంగాల వ్యవహారంలో కేంద్ర ఎన్నికల సంఘం యాక్షన్‌ తీసుకుంది. బీజేపీ, కాంగ్రెస్‌ ఫిర్యాదులపై ఎన్నికల సంఘం విచారణ చేపట్టింది. ఈ ‍క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీలకు గురువారం నోటీసులు జారీ చేసింది.

ఎన్నికల కోడ్‌ను మోదీ, రాహుల్‌ ఉల్లంఘించినందుకు నోటీసులు ఇచ్చినట్లు ఈసీ పేర్కొంది. ఏప్రిల్‌ 29, ఉదయం 11 గంటల లోపు ఇరువురు నేతలు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘిస్తూ చేసిన ప్రసంగాలపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. 

ఈ ఇద్దరు నేతలు తమ ఎన్నికల ప్రచారంలో భాగంగా విద్వేషపూరిత  ఆరోపణలు, విమర్శలు చేస్తూ ప్రసంగించారు. ఈ వ్యవహారంలో బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్‌ చీఫ్‌ను ఈసీ వివరణ కోరింది. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించకుండా పార్టీ అధ్యక్షులే జాగ్రత్త వహించాలని పేర్కొంది.

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement