ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో మెరిసి మంచి పేరు తెచ్చుకుంది షాలిని పాసీ. ఈ రియాలిటీ షోతో ఆమె పేరు దశదిశల మారుమోగిపోయింది. ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు రోజులను గుర్తు చేసుకుంది. ప్రసవానంతరం వెన్నెముక గాయం బారినపడి స్పర్శ కోల్పోయిన క్లిష్ట పరిస్థితులు గురించి వెల్లడించింది. ఇక జీవితంలో తాను నృత్యం చేయలేదని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా జీవితం తలకిందులైనట్లు అనిపించిందంటూ భావోద్వేగంగా మాట్లాడింది. అంతేగాదు ఆ పరిస్థితులను ఎలా అధిగమించి మాములు స్థితికి రాగలిగిందో కూడా వివరించింది.
షాలిని పాసి(Shalini Passi) 20 ఏళ్ల వయసులో తన కొడుకు రాబిన్‌కి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వెనుముక గాయం కారణంగా వెన్ను నుంచి కాళ్ల వరకు స్పర్శ(sensation) కోల్పోయింది. ఇక ఆమె జీవితంలో నడవడం, నృత్యం(dance) చేయడం అస్సలు సాధ్యం కాదని తేల్చి చెప్పారు వైద్యులు (Doctors). దీంతో ఒక్కసారిగా కళ్లముందు జీవితం చీకటిమయం అయ్యినట్లు అనిపించింది. ఇంతేనా తన పరిస్థితి అని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.
జీవితాంతం వెన్నెముక ఇంజెక్షన్‌లు చేయించుకోవాల్సిందేనని వైద్యులు చెప్పడంతో బాధతో తల్లడిల్లిపోయింది. నిజానినికి షాలినికి హిల్స్ వేసుకోవడం, డ్యాన్స్ చేయడం మహా ఇష్టం. అయితే ఇక్కడ షాలిని దిగులుతో కూర్చొండిపోలేదు. ఎలాగైనా ఆ బాధను అధిగమించాలని సంకల్పించుకుంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయ చికిత్సలను ఎంచుకుంది. యోగా, ఆయుర్వేదం వంటి వాటితో కండరాలను బలోపేతం చేసుకునేలా శిక్షణ తీసుకుంది.
అలా ఆమె వెనుముక సమస్యను జయించింది. ఇప్పటికీ తాను ఆయుర్వేద వైద్యుడి దగ్గరకే వెళ్తానని అంటోంది షాలిని. ఆయన తనకు ఎలాంటి మందులు ఇవ్వకుండానే నయం చేశారని చెబుతోంది. అలాగే చెకప్ కోసం ప్రతి ఐదు నెలలకొకసారి ఆ వైద్యుడిని కలుస్తానని అంటోంది. తాను ఇలా పూర్తి స్థాయిలో కోలుకోవడం చూసి తన వైద్య బృందం ఆశ్యర్యపోయినట్లు చెప్పుకొచ్చారు షాలిని. నిజంగా ఇది అద్భుతం. నడవగలగడం, నృత్యం చేయడం చూస్తుంటే నమ్మలేకపోతున్నామని వైద్యులే ఆశ్చర్యపోయారని షాలిని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు.
అలాగే తన కొడుకుతో గల అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన కొడుకుకి అక్కలా, స్నేహితురాలిలా ఉంటానని, అందువల్లే తన కొడుకు తనతో అన్ని ఫ్రీగా షేర్ చేసుకుంటాడని చెప్పుకొచ్చారు షాలిని. ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంతో ఫేస్‌చేస్తే తోకముడిచి తీరుతుందని షాలిని అనుభవం చెబుతోంది కదూ..!.
(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!)
Comments
Please login to add a commentAdd a comment