Sensation
-
మెద్వెదెవ్కు షాక్
మెల్బోర్న్: ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ విభాగంలో గురువారం పెను సంచలనం నమోదైంది. గత ఏడాది రన్నరప్, ప్రపంచ ఐదో ర్యాంకర్ డానిల్ మెద్వెదెవ్ (రష్యా) రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. అమెరికాకు చెందిన 19 ఏళ్ల క్వాలిఫయర్ లెర్నర్ టియెన్ అసాధారణ పోరాటపటిమ కనబరిచి మెద్వెదెవ్‌ను ఓడించి తన కెరీర్లోనే అతిపెద్ద విజయం సాధించాడు. 4 గంటల 49 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ప్రపంచ 119వ ర్యాంకర్ లెర్నర్ టియెన్ 6–3, 7–6 (7/4), 6–7 (8/10), 1–6, 7–6 (10/7)తో ఐదో సీడ్, గతంలో మూడుసార్లు రన్నరప్‌గా (2021, 2022, 2024) నిలిచిన మెద్వెదెవ్పై గెలిచాడు. మ్యాచ్ మొత్తంలో మెద్వెదెవ్ 20 ఏస్‌లు సంధించినా... 9 డబుల్ ఫాల్ట్‌లు, 82 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. గత మూడేళ్లు యూఎస్ ఓపెన్‌లో ఆడిన లెర్నర్ తొలి రౌండ్లోనే ఓడిపోయాడు. మొదటిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించిన లెర్నర్ టియెన్ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఐదు సెట్లు ఆడి నెగ్గడం విశేషం. కామిలో కారాబెల్లి (అర్జెంటీనా)తో 3 గంటల 56 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్లో లెర్నర్ టియెన్ 4–6, 7–6 (7/3), 6–3, 5–7, 6–4తో గెలుపొందాడు. మరోవైపు కాసిదిత్ సామ్రెజ్ (థాయ్‌లాండ్)తో 3 గంటల 8 నిమిషాలపాటు జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో మెద్వెదెవ్ 6–2, 4–6, 3–6, 6–1, 6–2తో గట్టెక్కాడు. రెండో రౌండ్లోనూ మెద్వెదెవ్ ఐదు సెట్లు పోరాడినా అమెరికన్ టీనేజర్ ఆటతీరుకు చేతులెత్తేశాడు. లెర్నర్, మెద్వెదెవ్ మ్యాచ్ ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం తెల్లవారుజాము 2 గంటల 53 నిమిషాలకు ముగియడం గమనార్హం. మూడో రౌండ్లో సినెర్మరోవైపు డిఫెండింగ్ చాంపియన్, నంబర్‌వన్ యానిక్ సినెర్ (ఇటలీ) మూడో రౌండ్లోకి ప్రవేశించాడు. రెండో రౌండ్లో సినెర్ 2 గంటల 46 నిమిషాల్లో 4–6, 6–4, 6–1, 6–3తో స్కూల్‌కేట్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ స్వియాటెక్ (పోలాండ్), నాలుగో సీడ్ పావోలిని (ఇటలీ), ఎనిమిదో సీడ్ ఎమ్మా నవారో (అమెరికా), తొమ్మిదో సీడ్ కసత్కినా (రష్యా), పదో సీడ్ కొలిన్స్ (అమెరికా) మూడో రౌండ్లోకి అడుగు పెట్టారు. రిత్విక్ జోడీ ఓటమి తొలిసారి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆడుతున్న భారత ప్లేయర్, హైదరాబాద్‌కు చెందిన బొల్లిపల్లి రిత్విక్ చౌదరీకి నిరాశ ఎదురైంది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్లో రిత్విక్ (భారత్)–సెగర్మన్ (అమెరికా) జోడీ 6–7 (5/7), 1–6తో ఆరో సీడ్ హ్యారీ హెలియోవారా (ఫిన్లాండ్)–హెనీ ప్యాటెన్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. శ్రీరామ్ బాలాజీ (భారత్)–వరేలా (మెక్సికో) ద్వయం రెండో రౌండ్‌కు చేరగా... జీవన్ నెడుంజెళియన్– విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్)... అనిరుధ్ చంద్రశేఖర్ (భారత్)–ద్రజెవ్స్కీ (పోలాండ్) జోడీలు తొలి రౌండ్లోనే ఓటమి పాలయ్యాయి. -
డెలివరీ తర్వాత వీల్‌చైర్‌కు పరిమితం.. జీవితాంతం ఇంజక్షన్స్..!
ఫ్యాబులస్ లైవ్స్ vs బాలీవుడ్ వైవ్స్ సీజన్-3లో మెరిసి మంచి పేరు తెచ్చుకుంది షాలిని పాసీ. ఈ రియాలిటీ షోతో ఆమె పేరు దశదిశల మారుమోగిపోయింది. ఓ ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న చేదు రోజులను గుర్తు చేసుకుంది. ప్రసవానంతరం వెన్నెముక గాయం బారినపడి స్పర్శ కోల్పోయిన క్లిష్ట పరిస్థితులు గురించి వెల్లడించింది. ఇక జీవితంలో తాను నృత్యం చేయలేదని వైద్యులు చెప్పడంతో ఒక్కసారిగా జీవితం తలకిందులైనట్లు అనిపించిందంటూ భావోద్వేగంగా మాట్లాడింది. అంతేగాదు ఆ పరిస్థితులను ఎలా అధిగమించి మాములు స్థితికి రాగలిగిందో కూడా వివరించింది. షాలిని పాసి(Shalini Passi) 20 ఏళ్ల వయసులో తన కొడుకు రాబిన్‌కి జన్మనిచ్చింది. ఆ తర్వాత ఊహించని విధంగా వెనుముక గాయం కారణంగా వెన్ను నుంచి కాళ్ల వరకు స్పర్శ(sensation) కోల్పోయింది. ఇక ఆమె జీవితంలో నడవడం, నృత్యం(dance) చేయడం అస్సలు సాధ్యం కాదని తేల్చి చెప్పారు వైద్యులు (Doctors). దీంతో ఒక్కసారిగా కళ్లముందు జీవితం చీకటిమయం అయ్యినట్లు అనిపించింది. ఇంతేనా తన పరిస్థితి అని తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది.జీవితాంతం వెన్నెముక ఇంజెక్షన్లు చేయించుకోవాల్సిందేనని వైద్యులు చెప్పడంతో బాధతో తల్లడిల్లిపోయింది. నిజానినికి షాలినికి హిల్స్ వేసుకోవడం, డ్యాన్స్ చేయడం మహా ఇష్టం. అయితే ఇక్కడ షాలిని దిగులుతో కూర్చొండిపోలేదు. ఎలాగైనా ఆ బాధను అధిగమించాలని సంకల్పించుకుంది. ఈ సమస్యకు ప్రత్యామ్నాయ చికిత్సలను ఎంచుకుంది. యోగా, ఆయుర్వేదం వంటి వాటితో కండరాలను బలోపేతం చేసుకునేలా శిక్షణ తీసుకుంది. అలా ఆమె వెనుముక సమస్యను జయించింది. ఇప్పటికీ తాను ఆయుర్వేద వైద్యుడి దగ్గరకే వెళ్తానని అంటోంది షాలిని. ఆయన తనకు ఎలాంటి మందులు ఇవ్వకుండానే నయం చేశారని చెబుతోంది. అలాగే చెకప్ కోసం ప్రతి ఐదు నెలలకొకసారి ఆ వైద్యుడిని కలుస్తానని అంటోంది. తాను ఇలా పూర్తి స్థాయిలో కోలుకోవడం చూసి తన వైద్య బృందం ఆశ్యర్యపోయినట్లు చెప్పుకొచ్చారు షాలిని. నిజంగా ఇది అద్భుతం. నడవగలగడం, నృత్యం చేయడం చూస్తుంటే నమ్మలేకపోతున్నామని వైద్యులే ఆశ్చర్యపోయారని షాలిని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అలాగే తన కొడుకుతో గల అనుబంధం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన కొడుకుకి అక్కలా, స్నేహితురాలిలా ఉంటానని, అందువల్లే తన కొడుకు తనతో అన్ని ఫ్రీగా షేర్ చేసుకుంటాడని చెప్పుకొచ్చారు షాలిని. ఎంత పెద్ద సమస్య అయినా ధైర్యంతో ఫేస్చేస్తే తోకముడిచి తీరుతుందని షాలిని అనుభవం చెబుతోంది కదూ..!.(చదవండి: షాలిని పాసీ అందమైన కురుల రహస్యం ఇదే..!) -
వీధి వ్యాపారి కాస్త స్టార్ చాయ్‌వాలాగా మారి ఏకంగా ..!
ఓ సామాన్య వీధి టీ వ్యాపారి తన అసాధారణ టాలెంట్‌తో ఒక్కసారిగా స్టార్ చాయవాలాగా మారి శెభాష్ అనిపించుకున్నాడు. రోజు చూసే చిన్న వ్యాపారమైన కాస్త విభిన్నంగా చేస్తే అద్భుతాలు సృష్టించొచ్చని చాటి చెప్పాడు. ఒకప్పుడు వీధుల్లో ఏడు రూపాయల టీతో మొదలైన ప్రస్థానం నేడు ఏకంగా రూ. 5 లక్షలు వసూలు చేసే స్థాయికి చేరుకుందంటే..అది ఊహకే అందని విజయంగా చెప్పొచ్చు. ఇంతకీ ఎవరా ఆ స్టార్ చాయ్‌వాలా అంటే..?అతడే డాలీ చాయ్‌వాలాగా పేరుగాంచిన సునీల్ పాటిల్. నాగ్‌పూర్ వీధుల్లో రూ. 7ల కప్పు చాయ్‌తో అతడి టీ వ్యాపారం మొదలయ్యింది. అయితే అందరూ చాయ్వాళ్లలా కాకుండా కాస్త విభిన్నంగా కస్టమర్లను ఆకర్షించేలా టీని తయారు చేయడం, సర్వ్ చేయడం అతడి స్పెషాల్టీ. వ్యాపారానికి కీలకమైన సూత్రం కూడా ఇదే. దాన్నే మనోడు ఎలాంటి బిజినెస్ స్కూల్లో చదవకుండానే జీవన పోరాటంతో తెలుసుకున్నాడు. దాన్ని అప్లై చేసి తన టీ షాపు వద్దకే జనాలు వచ్చేలా చేసుకున్నాడు. దీంతోపాటు తన విలక్షణమైన టీ సర్వీంగ్కి సంబంధించిన వీడియోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఫిబ్రవరి 2024లో మైక్రోసాఫ్ట్ సహ-వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన ప్రసిద్ధ చాయ్ సర్వీంగ్ కోసం వచ్చిన వీడియో నెట్టింట వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా డాలీ ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయాడు. ఆ ఒక్క వీడియో అతడి దశనే మార్చేసింది. ఏకంగా దుబాయ్‌లో కార్యాలయాన్ని తెరిచే స్థాయికి చేరుకున్నాడు. అతడు సర్వ్ చేసే విధానమే కాదు వేషధారణ కూడా అత్యంత విలక్షణంగా ఉంటుంది. అత్యంత స్టైలిష్‌గా..ఫంకీ గోల్డెన్ గాగుల్స్, గోల్డెన్ చైన్ తోపాటు వెరైటీ హెయిర్ స్టైల్‌తో ఫ్యాషన్ లుక్‌లో ఉంటాడు. ఒక రకంగా వ్యాపారాన్ని విజయవంతం చేసుకునేలా హంగు ఆర్భాటాలతో స్టైలిష్‌గా సర్వ్ చేస్తాడు. అదే అతడిని ఫేమస్ అయ్యేలా చేసింది. ఇంత స్టార్డమ్ వచ్చిన తన మూలాలను మరిచిపోకుండా తన టీ స్టాల్ సామాన్యుడి వలే పనిచేస్తుండటం విశేషం. ప్రస్తుతం అతడు దుబాయ్ నుంచి కువైట్ల వరకు పలు ఈవెంట్లలో డాలీ టీ సర్వీస్ కోసం బుక్ చేసుకుంటారట. అందుకు చాయ్‌వాలా ఏకంగా రూ. 5 లక్షలు దాక వసూలు చేస్తున్నాడు. కానీ జనాలు కూడా లెక్క చేయకుండా అతడి సేవల కోసం ఎంత డభైన వెచ్చించడం విశేషం. ఇంత క్రేజ్ పెరిగినా డాలీ తన దుకాణం వద్ద మాత్రం టీని ఇంకా రూ. 7లకే కస్టమర్లకు అందిస్తుండటం గ్రేట్. View this post on Instagram A post shared by Dolly Ki Tapri Nagpur (@dolly_ki_tapri_nagpur) (చదవండి: క్వీన్ ఎలిజబెత్ II వెడ్డింగ్ గౌను వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ! యుద్ధం కారణంగా..) -
0.1 పాయింట్ తేడాతో స్వర్ణం
పారిస్ ఒలింపిక్స్‌లో దక్షిణ కొరియాకు చెందిన టీనేజ్ షూటర్ బాన్ హ్యోజిన్ 0.1 పాయింట్ తేడాతో స్వర్ణం కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మహిళల విభాగం ఫైనల్లో 16 ఏళ్ల బాన్ హ్యోజిన్ చివరి షాట్లో అత్యుత్తమ ప్రదర్శనతో పసిడి పతకం చేజిక్కించుకుంది. 22 షాట్లు ముగిసేసరికి బాన్ హ్యోజిన్తో పాటు 17 ఏళ్ల చైనా షూటర్ హువాంగ్ యూటింగ్ 251.8 పాయింట్లతో నిలిచారు. దీంతో విజేతను నిర్ణయించేందుకు ‘షూట్ ఆఫ్’ నిర్వహించగా.. అందులో బాన్ 10.4 స్కోరు చేయగా.. హువాంగ్ 10.3 పాయింట్లతో రెండో స్థానానికి పరిమితమైంది. తద్వారా బాన్ ఒలింపిక్ చాంపియన్‌గా నిలిచిన అతిపిన్న వయసు మహిళా షూటర్‌గా రికార్డుల్లోకెక్కింది. స్విట్జర్లాండ్ షూటర్ ఆడ్రే గొగ్నియాల్ 230.3 పాయింట్లతో కాంస్యం గెలుచుకుంది. -
శౌర్య సంచలనం
హ్యూస్టన్ (అమెరికా): ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత కుర్రాడు శౌర్య బావా సంచలనం సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో బాలుర సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. 2014లో కుష్ కుమార్ తర్వాత ఈ టోర్నీలో భారత్‌కు పతకం రావడం ఇదే ప్రథమం. ఢిల్లీకి చెందిన 18 ఏళ్ల శౌర్య క్వార్టర్ ఫైనల్లో 2–11, 11–4, 10–12, 11–8, 12–10తో లో వా సెర్న్ (మలేసియా)పై గెలుపొందాడు. 80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శౌర్య మూడు మాŠయ్చ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. నిర్ణాయక ఐదో గేమ్‌లో శౌర్య 7–10తో ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే శౌర్య ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. బాలికల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో 16 ఏళ్ల అనాహత్ 8–11, 9–11, 11–5, 12–10, 11–13తో నదీన్ ఎల్హమీ (ఈజిప్‌్ట) చేతిలో పోరాడి ఓడిపోయింది. -
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
సచిన్ టెండూల్కర్ స్టేడియంలో జూలు విదిలిస్తే ఎలా ఉంటుంది.. ప్రతి బాలు బౌండరీ దాటుతుంది.. స్టేడియం మొత్తం హోరెత్తుతోంది.. తుపానొచ్చినపుడు సముద్రానికి పోటు వస్తే ఎలా ఉంటుంది? కెరటాటు తీరం వైపు పోటెత్తుతాయి.. అడ్డం వచ్చిన వాటిని ఊడ్చి పడేస్తాయి.అమితాబ్ బచ్చన్ సినిమా రిలీజైతే ఏమవుతుంది... ఏమీ కాదు... భారత్ మొత్తం స్థంభించిపోతుంది... కోట్లాదిమంది అమితాబ్ క్రేజ్ గురించి మాట్లాడుకుంటారు.. ఏ రచ్చబండ దగ్గరైనా అదే చర్చ నడుస్తుంది.. అచ్చం.. అలాగే... పైన చెప్పిన మాదిరిగానే... సీఎం వైఎస్ జగన్ ఇంటర్వ్యూ ఒక సంచలనం సృష్టించింది. టీవీ-9 లో ప్రసారమైన జగన్ ఇంటర్వ్యూ లక్షల్లో వ్యూస్ సాధించింది.. దాంతో బాటు యూట్యూబ్ లో యువత లక్షల్లో ఆ ఇంటర్వ్యూను చూసింది.అందులో అభివృద్ధి, సంక్షేమం... వంటి పలు అంశాలకు సంబంధించి జగన్ ప్రజల సందేహాలకు స్పష్టమైన సమాధానాలు ఇచ్చారు. ప్రజల మనస్సులో ఉన్న వేర్వేరు సందేహాలను టీవీ 9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ వెళ్లలచెరువు లేవనెత్తారు.. భూ సర్వే గురించి... టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు... సంధించిన ప్రశ్నలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ ఏమిటి... తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు. దాంతోబాటు పవన్ కళ్యాణ్ గురించి ఇచ్చిన పంచ్ జనంలో బాగా పేలింది... ఒకసారి తప్పు చేస్తే పొరపాటు... రెండో సారి చేస్తే గ్రహపాటు... మూడు నాలుగోసారి చేస్తే అలవాటు అంటూ పవన్ పెళ్లిళ్ల గురించి జగన్ చేసిన కామెంట్స్ జనంలోకి బాగా వెళ్లాయి. దాంతోబాటు ఆ ఇంటర్వ్యూలో జగన్ చెప్పిన కొన్ని అంశాలు..పాయింట్స్ కట్ చేసి వీడియోలను ఫోన్లలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఈ ఇంటర్వ్హును లక్షల్లో ప్రజలు తమ ఫోన్లలో చూసారని లెక్కలు కనిపిస్తున్నాయి. ఇది వైఎస్సార్ కాంగ్రెస్ క్యాడర్లో ఉత్సాహాన్ని నింపింది... ఆ ఇంటర్యూ ను ఫోన్లలో బాగా ప్రచారానికి వినియోగిస్తున్నారు.. ఈ ఇంటర్వ్హు తమకు బాగా మైలేజి ఇస్తుందని క్యాడర్ సంతోషిస్తోంది.మరోవైపు అదే సమయంలో ఏబీఎన్ ఛానెల్లో చంద్రబాబు ఇంటర్వ్యూ వచ్చినా పెద్దగా రేటింగ్ రాలేదు..చూసేవాళ్ళు కరువయ్యారు... అటు జగన్ ఇంటర్వ్యూను లక్షల్లో చూడగా చంద్రబాబు మాటలు వేలల్లోనే ఉన్నాయ్.. దీంతో బాబు మాటలు గాలిమూటలు అని ప్రజలు నిర్ణయానికి వచ్చారని.. అందుకే చూడడం లేదని ఒక అంచనాకు వచ్చారు. బాబు గత ముప్పయ్యేళ్లుగా చెప్పినవే చెబుతున్నారని... వాటిల్లో నిబద్ధత లేదని.. అందుకే ఆ గాలిమాటలు వినడానికి ప్రజలు ఇష్టపడడం లేదని అంటున్నారు.ఒక పక్క మోదీ రోడ్ షో జరుగుతున్నా.. లైవ్ స్ట్రీమింగ్ లో వ్యూస్ విపరీతంగా వచ్చాయి. అదే సమయంలో సీబిఎన్ ఇంటర్వ్యూ ఏబీఎన్ లో ప్రసారమైతే కనీసం వ్యూస్ కూడా రాలేదు. ఇది సీఎం వైయస్ జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసింది. ఇదే ఇమేజ్ మరోసారి జగన్‌ను సీఎం పీఠం ఎక్కించబోతుందనే సంకేతాలు ముందుగానే తెలుస్తోంది.-సిమ్మాదిరప్పన్న -
ఇజ్రాయెల్‌తో యుద్ధం: ఇరాన్ సంచలన ప్రకటన
టెహ్రాన్: ఇరాన్,ఇజ్రాయెల్ మధ్య యుద్ధ మేఘాలు తొలగిపోయినట్లేనా..ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లారినట్లేనా..ఇజ్రాయెల్‌పై డ్రోన్లు,మిసైళ్లతో దాడులు జరిపిన తర్వాత ఇరాన్ మెత్తబడిందా.. అంటే ఇరాన్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి చేసిన ప్రకటన అవుననే చెబుతోంది. ‘ఇజ్రాయెల్‌పై మేం జరిపిన దాడుల గురించి అమెరికాకు సమాచారమిచ్చాం. ఈ దాడులు పరిమితమైనవి. కేవలం మా ఆత్మరక్షణ కోసం చేసినవేనని తెలిపాం. మిడిల్ ఈస్ట్ ప్రాంత, ప్రపంచ శాంతి కోసం ఇరాన్ బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుంది. ఇజ్రాయెల్‌పై దాడులు కొనసాగించే ఉద్దేశమేమీ మాకు లేదు. ఇజ్రాయెల్ కవ్విస్తే మాత్రం మా ఆత్మరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడం’అని ఇరాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అమీర్ అబ్దుల్లాహియాన్ చెప్పారు. ఆదివారం(ఏప్రిల్14) ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అబ్దుల్లాహియాన్ మాట్లాడారు. ఇజ్రాయెల్‌పై ఇరాన్ చేసిన డ్రోన్,మిసైల్ దాడులను అమెరికా సహా పశ్చిమ దేశాలన్నీ ఖండించిన నేపథ్యంలో దాడులు కొనసాగించే ఉద్దేశం లేదని ఇరాన్ ప్రకటించడం గమనార్హం. కాగా, శనివారం(ఏప్రిల్ 13) అర్ధరాత్రి ఇజ్రాయెల్‌పై ఇరాన్ వందల కొద్ది డ్రోన్లు, మిసైళ్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ మిసైళ్లలో చాలా వాటిని ఇజ్రాయెల్ అడ్డుకుని కూల్చివేసింది. ఈ దాడులకు ప్రతిగా ఇజ్రాయెల్ ఎలా స్పందిస్తునేదానిపై ప్రపంచవ్యాప్తంగా ఆందోళన నెలకొంది. ఇటీవల సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో ఆ దేశానికి చెందిన 13 మంది ఆర్మీ అధికారులు మరణించారు. దీనికి ప్రతీకారంగానే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులు చేసింది. ఇదీ చదవండి.. ఇరాన్ మిసైల్ దాడులు.. తొలిసారి స్పందించిన నెతన్యాహు -
ఇంద్రభవనంలా ఉన్నా ఆ ప్యాలెస్ ఏంటో చూస్తే..షాకవ్వడం ఖాయం!
ఎన్నో గొప్పగొప్ప కళాఖండాల్ని చూశాం. ఎంతో వైవిధ్యభరితమైన కళాఖండాలతో తీర్చిన రాజభవనాలు, అలానాటి పూర్వీకుల ప్యాలెస్‌లు ఎన్నో మనల్ని మంత్రముగ్దుల్ని చేశాయి. అలానే ఇక్కడొక గొప్ప ప్యాలెస్ మనల్ని కట్టిపడేసేంత ఆకర్షణగా ఉంది. కన్నులు తిప్పుకోలేనంతా ఆకర్షణీయంగా ఉంది కూడా. కానీ అదేంటో చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఏంటి ఇలాంటివి కూడా అత్యంత విలాసంగా కడతారు. అదీకూడా కేవలం దానికోసం ప్యాలస్ లాంటి భవనమా! అని నోరెళ్లబెట్టడం ఖాయం!. ఇంతకీ ఈ ప్యాలెస్‌ని పోలిన భవనం థాయ్‌లాండ్‌లో ఉంది. మనం ముందు బయట నుంచి చూడగానే..వావ్ భలే కట్టారు. ఏదో గుడి లేదా మహల్ అనే అనకుంటారు. లోపలికి వెళ్లి చేసేంత వరకు కూడా అదేంటో తెలియదు. తీరా వెళ్లాక ఓస్ దీని కోసమా అని ఒక్కసారిగా మనలోని హుషార్ అంతా ఆవిరైపోతుంది. అదే సమయంలో ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అయితే అదేంటంటే.. ఓ వాష్ రూమ్. దీన్ని అసాధారణ రీతిలో చాలా విలాసవంతంగా నిర్మించారు. ఆ ప్యాలస్ ఓ విలాసవంతంగా డిజైన్ చేసిన బాత్రూమ్. బంగారు రంగు డిజైన్‌తో ధగధగలాడిపోతున్న ఆభవనం ఓ భారీ బాత్రూమ్ అనే చెప్పాలి. బాత్రూం వెలుపల నిర్మాణ శైలి, తోట అన్ని అద్భుతంగా ఉంటాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు వాహ్ చాలా అందంగా ఉందని ఒకరూ, మాటల్లో వివరించ లేనంత అద్భుతంగా ఉందని మరోకరూ ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఎలాగైన ఈ రాయల్ బాత్రూమ్ని సందర్శించాల్సిదేనని పలువురు నెటిజన్లు అనడం విశేషం. View this post on Instagram A post shared by 𝘒𝘳𝘪𝘴𝘩𝘢𝘯𝘨𝘪 || 𝘛𝘖𝘐𝘔𝘖𝘐 𝘛𝘈𝘓𝘌𝘚 (@krishangiisaikia) (చదవండి: ఆ ఊరిలో మహిళలు పిల్లల్ని కనడానికే భయపడుతున్నారు!పుట్టిన మూడు నెలలకే..) -
ఇదీ ప్రభాస్ రేంజ్ అంటే ఆది పురుష్ రికార్డు బిజినెస్ ...
-
మ్యూజిక్ లవర్స్ ని రాక్ చేస్తున్న ఖుషి మూవీ ఫస్ట్ సింగల్
-
Bao Fan: చైనా బ్యాంకర్ మిస్సింగ్ సంచలనం! ఇంతకీ ఎవరతను?
చైనాలో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం చోటుచేసుకుంటూనే ఉంటుంది. ప్రముఖ వ్యాపార దిగ్గజాలు ఒక్కొక్కరుగా కనిపించకుండా పోతున్నారు. తాజాగా చైనా ప్రముఖ బ్యాంకర్ బావో ఫాన్ అదృశ్యం కావడం సంచలనం సృష్టించింది. బావోఫాన్ను సంప్రదించలేకపోతున్నట్టు బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్, ప్రైవేటు ఈక్విటీ సంస్థ చైనా రినయిసెన్స్ ప్రకటించింది. ఈ వార్త వెలువడిన వంటనే ఆ కంపెనీ షేర్ ధర 50 శాతం పడిపోయింది. ఈ సంస్థలో అవినీతిపై చైనా ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో బావోఫాన్ కనిపించకుండా పోవడం వెనుక ఆ దేశ ప్రభుత్వ హస్తం ఏమైనా ఉందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కమ్యూనిస్ట్ పాలనలో ఉన్న చైనాలో వ్యాపార దిగ్గజాలు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వ్యాపారవేత్తలు ఇలా కనిపించకుండా పోవడం కొత్తేమీ కాదు. బావో ఫాన్‌కు ముందు కూడా అనేకమంది ఉన్నత వ్యాపార నిర్వాహకులు గల్లంతయ్యారు. 2015లోనే కనీసం ఐదుగురు అదృశ్యమయ్యారు. వాస్తవానికి బావోకు కొన్ని రోజుల ముందు, రియల్ ఎస్టేట్ సంస్థ సీజెన్ గ్రూప్ వైస్ చైర్మన్ కనిపించకుండా పోయారు. కొంతకాలం క్రితం చైనా టాప్ బిలియనీర్, అలీబాబా గ్రూప్ సహ వ్యవస్థాపకుడు జాక్‌మా గల్లంతయ్యారు. ఎవరీ బావోఫాన్? చైనాలో ప్రఖ్యాతిగాంచిన బ్యాంకర్లలో బావోఫాన్ ఒకరు. షాంఘై నగరంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు చైనా ప్రభుత్వంలో పనిచేసేవారు. అయినప్పటికీ అమెరికాలో ఉన్నత పాఠశాల విద్యను అభ్యసించారు బావోఫాన్. షాంఘైలోని ఫుడన్ యూనివర్సిటీ, నార్వేజియన్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి డిగ్రీలు పొందారు. 1990వ దశకంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కెరీర్‌ను ప్రారంభించిన ఆయన మోర్గాన్ స్టాన్లీ, క్రెడిట్ సూయిస్ గ్రూప్‌ల కోసం పనిచేశాడు. అనంతరం షాంఘై, షెంజెన్‌లలోని స్టాక్ ఎక్స్ఛేంజ్లలో అడ్వయిజర్‌గా పని చేశారు. 2005లో కేవలం ఇద్దరితో చైనా రినయిసెన్స్ను ప్రారంభించారు. వెంచర్ కేపిటలిస్టులు, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లకు సేవలందించారు. ఆ తర్వాత అండర్‌రైటింగ్, సేల్స్, ట్రేడింగ్‌లకు తన సేవలను విస్తరించారు. ఈ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ 2018లో హాంగ్ కాంగ్ మార్కెట్లోకి ప్రవేశించింది. ఏకంగా 346 మిలియన్ల డాలర్లను సేకరించింది. చైనాలోని ప్రధాన ఫుడ్ డెలివరీ సర్వీసులు మీటువాన్-డయాన్పింగ్, ట్రావెల్ సంస్థలు సీ ట్రిప్-క్యూనర్ విలీనాల్లో బావోఫాన్ కీలక పాత్ర పోషించారు. పలు నివేదికల ప్రకారం.. బావోఫాన్ నికర విలువ సుమారు 1.7 బిలియన్ డాలర్లు. -
మల్లారెడ్డిపై ఐటీ దాడులు: సంచలనం రేపుతున్న ‘రూ.100 కోట్లు’
సాక్షి, హైదరాబాద్: ఐటీ సోదాల్లో రూ.100 కోట్ల వ్యవహారం సంచలనం రేపుతోంది. ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో కోట్లు డొనేషన్లు తీసుకున్నారని ఆరోపణలు వస్తున్నాయి. 100 కోట్ల డొనేషన్ల పంచనామాపై ఐటీ అధికారులు సంతకం తీసుకున్నారు. సోమవారం ఐటీ విచారణకు హాజరుకావాలని మంత్రి మల్లారెడ్డి సహా, ఆయన కుమారులు, అల్లుడికి ఐటీ నోటీసులు జారీ చేసింది. ఇంజనీరింగ్ కాలేజీలో మూడు సంవత్సరాల్లో 100 కోట్లు డొనేషన్ల పేరుతో వసూలు చేయించారని మహేందర్ రెడ్డితో ఐటీ సంతకం తీసుకుంది. తన కొడుకుతో బలవంతంగా సంతకం పెట్టించారని ఐటీ అధికారులతో మల్లారెడ్డి వాదనకు దిగారు. ఇష్టం వచ్చినట్లు కోట్ల రూపాయల డొనేషన్లు పేరు చెప్పి సంతకాలు పెట్టించుకున్నారని మల్లారెడ్డి ఆరోపించారు. తమ కాలేజీలో జరిగే ప్రతి లావాదేవీలకు లెక్కలు ఉంటాయని మంత్రి చెబుతున్నారు. కాగా, మంత్రి మల్లారెడ్డి నివాసంలో రూ.6 లక్షలు, మల్లారెడ్డి పెద్దకుమారుడి ఇంట్లో రూ.12 లక్షలు, మల్లారెడ్డి చిన్నకుమారుడి ఇంట్లో రూ.6 లక్షలు, మల్లారెడ్డి అల్లుడి ఇంట్లో రూ.3 కోట్లు, ప్రవీణ్ రెడ్డి ఇంట్లో రూ.15 కోట్లు, త్రిశూల్‌రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లు, రఘునందన్‌రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు, ప్రవీణ్‌కుమార్ నివాసంలో రూ.2.5 కోట్లు, సుధీర్‌రెడ్డి నివాసంలో కోటి రూపాయలు సీజ్ చేశారు. చదవండి: అర్ధరాత్రి ఐటీ అధికారుల ల్యాప్‌టాప్‌పై హైడ్రామా.. అసలేం జరిగింది? -
4 గంటలు.. 3 సర్జరీలు
సాక్షి గాంధీ ఆస్పత్రి: గాంధీఆస్పత్రి ఆర్థోపెడిక్ వైద్యులు మరో అరుదైన ఘనత సాధించారు. నాలుగు గంటల వ్యవధిలో ముగ్గురికి శస్త్ర చికిత్సలు చేసి ఔరా అనిపించారు. నల్లగొండ జిల్లా తిరుమలగిరికి చెందిన ఆగయ్య (63), ఖమ్మం జిల్లా వాసి అయిలయ్య(65), ముషీరాబాద్‌కు చెందిన నీలవేని (50)లకు మోకాలి కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ వాల్యా ఆధ్వర్యంలో శనివారం ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఏకబిగిన మూడు కీళ్ల మార్పిడి సర్జరీలు విజయవంతంగా నిర్వహించారు. ఆయుష్మాన్ భారత్, ఆరోగ్యశ్రీ పథకాల ద్వారా సర్జరీలు ఉచితంగా చేసినట్లు గాంధీ ఆరోగ్యశ్రీ కో ఆర్డినేటర్, మైక్రోబయోలజీ హెచ్ఓడీ ప్రొఫెసర్ రాజేశ్వరరావు తెలిపారు. సర్జరీలో పాల్గొన్న ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ వాల్యా, అనస్థీషియా హెచ్ఓడీ బేబిరాణి, అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీదేవి, శ్రీనివాస నాయక్ అనీల్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు అబ్బయ్య, కిరణ్, అక్రమ్‌లు అభినందలు అందుకున్నారు. (చదవండి: అంతు చిక్కని అస్వస్థత) -
47 అంతస్తులతో ‘హైదరాబాద్ వన్’.. దేశంలోనే ఫస్ట్!
కొత్త నగరానికి వెళ్లి తాత్కాలికంగా కొన్ని రోజులుండాల్సి వస్తే... వసతి పెద్ద సమస్య. పేయింగ్ గెస్ట్‌గా ఉన్నా, ఎంత లగ్జరీ హాస్టల్ అయినా... ఇరుకు గదులు, అంతంత మాత్రంగా ఉండే ఆహారం, టైమింగ్స్... అన్నింటికీ ఇబ్బంది. సరే ఎలాగోలా సర్దుకుపోదాం అనుకున్నా.. మెన్, ఉమెన్‌కు వేర్వేరు హాస్టల్స్ వల్ల కపుల్ కలిసుండలేరు. వీటన్నింటికీ సింపుల్ సొల్యూషన్ సెన్సేషన్ ఇన్ఫ్రాకాన్ వారి ‘హైదరాబాద్ వన్’ లగ్జరీ కో–లివింగ్ ప్రాజెక్ట్. సాక్షి, హైదరాబాద్: ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి నగరానికి వచ్చే ఉద్యోగులు, విద్యార్థులు ఇక వసతికోసం ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు. 47 అంతస్తులతో అత్యంత లగ్జరీ కో–లివింగ్ ప్రాజెక్టు ఇప్పుడు హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో నిర్మాణంలో ఉంది. సాధారణ హాస్టల్స్‌లో ఒకే రూమ్‌లో నాలుగైదు బెడ్లు వేస్తారు. భోజన ఏర్పాట్లు హాస్టల్స్ నిర్వాహకులే చూసుకుంటారు. దీనివల్ల రూమ్ స్థలాన్ని మనకు నచ్చినవిధంగా ఉపయోగించుకోలేం. ఆహార నాణ్యతలోనూ రాజీ పడాల్సి వస్తుంది. ఇక నగరానికి వచ్చింది జంట అయితే.. హాస్టల్స్‌లో వేర్వేరుగా ఉండాల్సి వస్తుంది. కానీ ఈ కో–లివింగ్‌లో ఆ సమస్య ఉండదు. ఎవరైనా ఉండొచ్చు. సాధారణ హాస్టల్స్ లాగానే ఇక్కడా బెడ్‌కు ఇంతని ధర ఉంటుంది. గంటలు, రోజులు, నెల, సంవత్సరాల వారీగా గదులను అద్దెకు తీసుకోవచ్చు. హైదరాబాద్ వన్ ప్రాజెక్ట్‌లో నెలకు ఒక్క బెడ్ అద్దె రూ.26–36 వేల మధ్య ఉంటుందని సమాచారం. (క్లిక్: హైదరాబాద్ సిటీలో సాఫీ జర్నీకి సై) మహిళల కోసమే ఐదంతస్తులు... 47 అంతస్తుల్లో మొత్తం 1,928 స్టూడియో అపార్ట్మెంట్లుంటాయి. 6వ అంతస్తు నుంచి 10 వరకు కేవలం ఉమెన్ కో–లివింగ్ అపార్ట్మెంట్లుంటాయి. వీటిని మహిళా ఉద్యోగస్తులు, విదేశీ విద్యార్థులకు మాత్రమే అద్దెకిస్తారు. 36 నుంచి 46వ ఫ్లోర్ వరకు 11 అంతస్తులను సీనియర్ ప్రొఫెషనల్స్, ప్రవాసులకు మాత్రమే కేటాయించారు. 47వ అంతస్తులో మహిళల కోసం ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేస్తున్నారు. (క్లిక్: హెల్త్ స్టార్టప్‌లకు వెల్లువలా పెట్టుబడులు) జీవనశైలికి అనుకూలంగా... నేటి యువత లైఫ్‌స్టైల్‌కు అనుకూలంగా.. స్విమ్మింగ్ పూల్, జిమ్, రెస్టారెంట్లు, బార్, సెలూన్, స్పా, యాంపి థియేటర్ వంటివి ఏర్పాటు చేస్తారు. 24 గంటలు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. మహిళల భద్రత కోసం ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నారు. అత్యవసరమైన సమయాల్లో స్త్రీల సౌకర్యార్థం పలుచోట్ల ప్యానిక్ బజర్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. రక్షణ నిమిత్తం సీసీ కెమెరాలు, సాంకేతిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. విశాలమైన పార్కింగ్, అందులో ఎలక్ట్రిక్ చార్జింగ్ పాయింట్లుంటాయి. 24 గంటలు వైద్య సదుపాయం, ఫార్మసీ అందుబాటులో ఉంటాయి. ప్రతిరోజూ సాంస్కృతిక, స్ఫూర్తిదాయక కార్యక్రమాలుంటాయి. వీకెండ్స్‌లో నైట్ బజార్, ఫుడ్ ఫెస్టివల్స్ నిర్వహిస్తారు. వీటిని బయటివాళ్లు కూడా వినియోగించుకోవచ్చు. (క్లిక్: ఇందిరాపార్కులో.. లాహిరి లాహిరి) మరో మాన్హటన్.. హైదరాబాద్ వన్ ప్రాజెక్ట్‌కు 5–7 కి.మీ. పరిధిలో దాదాపు 5–6 లక్షల మంది ఉద్యోగులు పని చేస్తారు. వచ్చే నాలుగేళ్లలో ఈ ప్రాంతం అమెరికాలోని మాన్‌హటన్‌లాగా మారటం ఖాయం. నగరానికి వచ్చే విదేశీ విద్యార్థులు, ఉన్నతస్థాయి ఉద్యోగస్తులు, ప్రవాసుల సౌకర్యార్థం ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నాం. – పూర్ణ చందర్, ఈడీ, సెస్సేషన్ ఇన్ఫ్రాకాన్ -
వరంగల్ జిల్లాలో బాల్య వివాహం కలకలం
-
చంపినోళ్లకు రూ 4 లక్షలు.. మధ్యవర్తికి రూ.8 లక్షలు
భర్త హత్యకు భార్య సుపారీ సంచలనం రేపిన హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్ వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అనంతపురం సెంట్రల్: మోసం చేస్తున్న భర్తను కడతేర్చేందుకు ఓ భార్య కిరాయి హంతకులకు రూ.12 లక్షల సుపారీ ఇచ్చింది. చంపిన వ్యక్తులకు రూ.4 లక్షలు, ఒప్పందం కుదిర్చిన మధ్యవర్తికి రూ.8లక్షల చొప్పున డీల్‌తో హత్యకు కుట్రపన్నారు. పథకం ప్రకారం హతమార్చేందుకు ఒడిగట్టినా అదృష్టవశాత్తు ఒక కత్తిపోటు దిగగానే బాధితుడు కేకలు వేయడం, సమీపంలో పోలీసు వాహనం సైరన్మోగడంతో నిందితులు పారిపోయారు. ఈనెల 14న అనంతపురంలో సంచలనం సృష్టించిన హత్యాయత్నం కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సోమవారం పోలీసు కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 14న రామ్‌నగర్‌లోని కోకాకోలా గోడౌన్ వద్ద కోవూరునగరకు చెందిన వెంకటరాంప్రసాద్‌పై హత్యాయత్నం జరిగింది. మెడపై కత్తి దిగిన క్షతగాత్రున్ని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ముందు నుంచి ఈ కేసులో భార్య తరపునే అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ కోణంలోనే విచారించిన పోలీసులను నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఏ4 నిందితురాలిగా రాంప్రసాద్ భార్య కళ్యాణి, ఏ5 నిందితురాలిగా అత్త విజయలక్ష్మిని నమోదు చేశారు. హత్యలో పాల్గొన్న ఏ1, ఏ2, ఏ3, ఏ6 నిందితులుగా యల్లనూరు మండలం తిమ్మంపల్లి గ్రామానికి పెద్దవీరప్పగారి నాగేంద్ర, అచ్యుతాపురం గ్రామానికి చెందిన చిన్నకుళ్ళాయప్ప, అదే గ్రామానికి చెందిన బాలకుళ్ళాయప్ప, తిమ్మంపల్లికి చెందిన ఆవేటి వెంకటశివుడు ఉన్నారు. వీరి నుంచి ద్విచక్రవాహనం, రూ.2వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. చంపడమే మేలని.. వెంకటరాంప్రసాద్కు కళ్యాణితో 2011లో వివాహమైంది. ప్రసాద్ ధర్మవరంలో ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. కళ్యాణి బెంగుళూరులో ఒరాకిల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ధర్మవరంలో కాపురం ఉంటూ ప్రతి శని, ఆదివారాల్లో కళ్యాణి బెంగళూరు నుంచి వచ్చేది. అయితే వివాహం జరిగినప్పటి నుంచి ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకుంటున్నాయి. తన భర్త వేధిస్తున్నాడని కళ్యాణి బెంగళూరులో పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఈ కేసు విషయంలో ధర్మవరంలో పెద్దమనుషుల మధ్య పంచాయతీ పెట్టి ఇద్దరినీ రాజీ చేశారు. తర్వాత కూడా రాంప్రసాద్ కలిసి కాపురం చేయలేదు. విడాకుల కోసం జిల్లా ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ పిటిషన్ ఫైల్ చేశాడు. ఈ కేసు వాయిదాలకు ఇద్దరూ హాజరయ్యేవారు. కళ్యాణి పడుతున్న ఇబ్బందులను ఆమె తల్లి విజయలక్ష్మి చూసి తీవ్రంగా మదనపడుతుండేది. ఎలాగైనా అల్లుడిని చంపాలని నిర్ణయానికి వచ్చింది. ఈ విషయాన్ని తనకు తెలిసిన తిమ్మంపల్లికి చెందిన వెంకటశివుడుకు చెప్పింది. ఇంతలో మరికొంతమంది పెద్ద మనుషులు కలిసి విడాకుల కేసు రాజీ అయ్యేలా భార్యాభర్తలతో మాట్లాడారు. గత జూలై 18న కళ్యాణిని పిలుచుకొని విజయలక్ష్మి అల్లుడు రాంప్రసాద్ ఇంటికి వెళ్లారు. అయితే ఇంట్లోకి ఆహ్వానించకుండా రాంప్రసాద్ ఇష్టానుసారం తిట్టి పంపించాడు. ఈ బాధను భరించే కన్నా రాంప్రసాద్‌ను చంపడమే మేలు అనే నిర్ణయానికి వచ్చారు. 12 లక్షలకు సుపారీ విజయలక్ష్మి తన బంధువు అయిన తిమ్మంపల్లికి చెందిన వెంకట శివుడుకు ఫోన్‌చేసి జరిగిన అవమానాన్ని వివరించింది. దీంతో వెంకటశివుడు.. తిమ్మంపల్లికి చెందిన నాగేంద్ర కలిసి విజయలక్ష్మితో వినాయకచవితి పండుగకు ముందు ఒప్పందం కుదుర్చుకున్నారు. శివుడుకి రూ.8లక్షలు, నాగేంద్రకు రూ.4లక్షలు ఇచ్చేలా తీర్మానించుకున్నారు. ఒప్పందం ప్రకారం హత్యకు కుట్ర పన్నారు. ఈనెల 14న వెంకటరాంప్రసాద్ కోర్టులో వాయిదాకు వస్తాడని విజయలక్ష్మి, కళ్యాణిలు తెలియజేశారు. నాగేంద్రకు అడ్వాన్స్‌గా రూ.20వేలు ఇచ్చారు. పని అయిన తర్వాత మిగిలిన డబ్బు ఇస్తామని చెప్పడంతో నిందితులు అంగీకరించారు. అచ్యుతాపురానికి చెందిన చిన్నకుళ్ళాయప్ప, బాలకుళ్లాయప్పల సహకారం తీసుకున్నారు. ఈనెల 13న ద్విచక్రవాహనంలో జిల్లా కేంద్రానికి వచ్చారు. మరుసటి రోజు ఉదయం 10 గంటలకు కోర్టు వద్దకు చేరుకున్నారు. వెంకటరాంప్రసాద్‌ను నిందితులకు వెంకటశివుడు, విజయలక్ష్మి చూపించారు. పథకం ప్రకారం కోకాకోలా గోడౌన్ వద్ద ద్విచక్రవాహనంతో రాంప్రసాద్‌ను ఢీకొట్టి వెంట తెచ్చుకున్న పిడిబాకుతో మెడపై బలంగా పొడిచారు. దీంతో బాధితుడు రాంప్రసాద్ గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు. ఆ సమయంలో బెటాలియన్ ఆర్ఐ దస్తగిరి, కానిస్టేబుల్ కుమార్ వాహనంలో అటువైపు వస్తుండగా ఘటనను చూసి వాహనంతో సైరన్ మోగించారు. దీంతో నిందితులు ద్విచక్రవాహనంలో పారిపోయారు. నిందితులు బుక్కరాయసముద్రం ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం రావడంతో నాల్గవ పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. బాధితున్ని పరోక్షంగా కాపాడిన ఆర్ఐ దస్తగిరి, కానిస్టేబుల్ కుమార్, నిందితులను పట్టుకోవడంలో చొరవ చూపిన కానిస్టేబుళ్లు మెహతాజ్, నాగరాజులను ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ అభినందించి నగదు రివార్డులను అందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ మల్లికార్జునవర్మ, నాల్గవపట్టణ సీఐ శ్యామరావు తదితరులు పాల్గొన్నారు. -
భారత్‌కు కొరియా షాక్
• కబడ్డీ ప్రపంచకప్‌లో పెను సంచలనం • ఆఖరి క్షణాల్లో ఓడిన ఆతిథ్య జట్టు అహ్మదాబాద్: తొమ్మిదేళ్ల విరామం తర్వాత జరుగుతున్న కబడ్డీ ప్రపంచకప్ పెను సంచలనంతో ప్రారంభమైంది. ప్రొ కబడ్డీ లీగ్ ద్వారా స్టార్స్‌గా మారిన భారత ఆటగాళ్లు ప్రపంచ వేదికపై మాత్రం షాక్ తిన్నారు. ప్రొ కబడ్డీలో కోల్‌కతా తరఫున ఆడి భారత్‌కు చిరపరిచితుడైన కొరియా ఆటగాడు జాంగ్ కున్ లీ సంచలన ఆటతీరుతో తన జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. శనివారం జరిగిన టోర్నీ ప్రారంభ మ్యాచ్‌లో కొరియా 34-32తో భారత్‌ను ఓడించింది. తొలి ఐదు నిమిషాల్లో కొరియా 4-2 ఆధిక్యంతో ఉన్నా... భారత జట్టు పుంజుకుని వరుస పాయి0ట్లతో స్టేడియంను హోరెత్తించింది. దీంతో ప్రథమార్ధంలో భారత్ 18-13తో స్పష్టమైన ఆధిక్యం సాధించింది. ద్వితీయార్ధంలోనూ భారత్ ఓ దశలో 27-21తో ఆధిక్యంలో ఉంది. అయి0తే చివరి ఐదు నిమిషాల్లో కొరియా ఆటగాళ్లు చెలరేగిపోయారు. పటిష్టమైన డిఫెన్‌సతో టాకిల్ పాయి0ట్లు సాధించారు. మరోవైపు కున్ లీ చివరి మూడు నిమిషాల్లో ఏకంగా ఎనిమిది పాయి0ట్లు తెచ్చాడు. 39వ నిమిషం వరకు 29-27తో ఆధిక్యంలో ఉన్న భారత్... చివరి నిమిషంలో మ్యాచ్‌ను కోల్పోయి0ది. కొరియా తరఫున కున్ లీ మొత్తం పది పాయి0ట్లు సాధించడంతో పాటు మరో ఐదు బోనస్ పాయి0ట్లు కూడా తెచ్చాడు. డాంగ్ జియోన్ లీ ఆరు పాయి0ట్లు సాధించాడు. భారత్ తరఫున కెప్టెన్ అనూప్ కుమార్ 9 పాయి0ట్లు సాధించడంతో పాటు మూడు బోనస్ పాయి0ట్లు తెచ్చాడు. మంజీత్ చిల్లర్ ఐదు పాయి0ట్లు తెచ్చాడు. స్టార్ ఆటగాడు రాహుల్ చౌదరి 9 సార్లు రైడింగ్‌కు వెళ్లి 3 పాయి0ట్లు తెచ్చాడు. కబడ్డీ చరిత్రలో భారత్‌పై కొరియా గెలవడం ఇదే తొలిసారి. మరో మ్యాచ్‌లో ఇరాన్ 52-15 స్కోరుతో అమెరికాపై గెలిచింది. మేరాజ్, ఫాజల్ ఐదేసి పాయింట్లు సాధించారు. వైభవంగా ఆరంభం కబడ్డీ ప్రపంచకప్ కలర్ఫుల్గా ప్రారంభమైంది. తొలుత కళాకారుల విన్యాసాలు, లేజర్ మెరుపులతో కార్యక్రమం సాగింది. ఆ తర్వాత భారత సంప్రదాయ పద్దతిలో ఒక్కో జట్టు కెప్టెన్‌ను కోర్టులోకి తీసుకొచ్చారు. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ ముఖ్య అతిధిగా ప్రసంగించారు. -
కాల్పుల కలకలం
♦ పోలీసులపై తెగబడ్డ అంతరాష్ట్ర ముఠా సభ్యులు ♦ అదుపులో ముగ్గురు నిందితులు ♦ విచారణలో పొంతనలేని సమాధానాలు ♦ నేరాలు చేయడంలో ఆరితేరిన దుండగులు ♦ గతంలో పలు అంతరాష్ట్ర దోపిడీలు ♦ కర్ణాటక, మహారాష్ట్రాల్లో అనేక దొంగతనాలు పరిగి : పోలీసులపై శుక్రవారం అర్ధరాత్రి దుండగులు కాల్పులు జరపడం పరిగిలో కలకలం రేపింది. కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న కారులో వెళుతుండడంతో అనుమానించి వాహనాన్ని పోలీసులు ఆపడంతో దుండగులు వారిపై కాల్పులు జరిపి తప్పించేకునే యత్నం చేశారు. అయితే ట్రైనీ ఎస్ఐ ఓబుల్‌రెడ్డి, మరో ఇద్దరు కానిస్టేబుళ్లు చాకచక్యంగా వ్యహరించి ముగ్గురిని పట్టుకున్నారు. ఈ దొంగల ముఠా పరిగి గంజ్ రోడ్డులో ఉన్న ఎస్బీహెచ్ వైపు వెళుతూ గస్తీ తిరుగుతున్న పోలీసులకు తారసపడటంతో బ్యాంకు దోపిడీకే వచ్చినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ముఠా సభ్యులు తమ వద్ద అధునాతన మారణాయుధాలు కలిగి ఉండటం, వారి నేర చరితకు మరింత బలం చేకూరుస్తోంది. దీనికి తోడు వారి వద్ద లోడ్ చేయబడిన రైఫిల్, అదనంగా మూడు తూటాలు, పెద్ద పెద్ద దోపిడీలకు ఉపయోగించే పరికరాలు కలిగి ఉండడం చూస్తుంటే.. గతంలో బ్యాంకు దోపిడీకి రెక్కీని నిర్వహించినట్లు పోలీసులు భావిస్తున్నారు. అయితే వీరిని 12 గంటల పాటు విచారించిన పోలీసులు ఎట్టకేలకు కరుడుగట్టిన దొంగల ముఠాగా నిర్ధారించి ఆ కోణంలోనే విచారణ జరుపుతున్నారు. ఘనంగానే నేరచరిత్ర.. పట్టుబడిన ముఠా సభ్యుల నేర చరిత్ర ఘనంగానే ఉన్నట్లు తెలుస్తోంది. నేరాలు, బ్యాంకు దోపిడీలు, ఇతర పెద్దపెద్ద దొంగతనాలు చేయడంలో ఆరితేరిన వారుగా పోలీసుల విచారణ తేలినట్లు సమాచారం. గతంలో మన రాష్ట్రంతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాలో పలు దొంగతనాలు, దోపిడీలు చేసినట్లు తెలుస్తోంది. వీరు కర్ణాటక రాష్ట్రం గుల్బర్గాకు చెందిన వారుగా చెబుతుండగా తాండూరుతో పాటు కర్ణాటకకు చెందిన గుల్బర్గా, ఆంధ్రప్రదేశ్‌లోని గుంతకల్లు, మహారాష్ట్రకు చెందిన లాతూర్, హుస్మానాబాద్ తదితర ప్రాంతాల్లో దోపిడీలు చేసినట్లు పోలీసుల విచారణలో వెళ్లడైనట్లు సమాచారం. పట్టుబడిన ఇద్దరూ పేర్లు, గ్రామాల విషయంలో పొంతనలేని సమాధానాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక తాము హైదరాబాద్‌కు వెళ్లేందుకు వచ్చామని, దోపిడీకి రాలేదని చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. పట్టుబడిన వ్యక్తులు 30 నుంచి 40 సంవత్సరాల వయస్సు ఉందని పోలీసులు పేర్కొంటున్నారు. అయితే నిందితులు మాత్రం ఎలాంటి సమాచారం చెప్పడం లేదని సమాచారం. -
ప్రపంచాన్ని ఊపేస్తున్న పోకేమాన్ గో
-
భాగ్యనగరిలో సంగీత ఝరి!
► హైదరాబాద్ వేదికగా ‘సెన్సేషన్’ డ్యాన్స్ షో సాక్షి, హైదరాబాద్: ఆకాశం నుంచి అగ్నిపూలు జాలువారుతున్నాయా అన్నట్లు బాణసంచా కాల్పులు.. కళ్లు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు.. లయబద్ధంగా వినిపిస్తూ ఉర్రూతలూగించే సంగీత ఝరి.. అందులో తడిసి ముద్దవుతూ కుర్రకారు డ్యాన్స్‌లు.. కళ్లకు కనువిందు చేసే లేజర్ షోలు.. ఇవన్నీ నెదర్లాండ్స్ కేంద్రంగా పుట్టి ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తున్న అతిపెద్ద డ్యాన్స్ షో ‘సెన్సేషన్’ విశేషాలు. నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాంలో పుట్టి ప్రపంచ యువతను ఓలలాడిస్తున్న సెన్సేషన్ డ్యాన్స్ షోకు ఇప్పుడు హైదరాబాద్ నగరం వేదిక కానుంది. ఓ తరంగంలా సాగనున్న ఈ కార్యక్రమాన్ని సెన్సేషన్ నిర్వాహకులు ఏటా ప్రపంచ వ్యాప్తంగా పలు నగరాల్లోని ప్రముఖ స్టేడియాల్లో నిర్వహిస్తూ.. తొలిసారిగా భారత్‌లో.. అది కూడా హైదరాబాద్‌లో అడుగుపెట్టనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. దాదాపు 50 వేలకు పైగా ప్రేక్షకులు ఈ డ్యాన్స్ షోలో పాల్గొంటారు. ఫిబ్రవరి 6న హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో ‘సెన్సేషన్’ భారీ ప్రదర్శన ఇవ్వనుంది. ఇక్కడి యువతను కొంగొత్త లోకాల్లో విహరింపజేసేందుకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఈవెంట్లో పాల్గొనదలచుకునేవారు తప్పని సరిగా తెలుపు రంగు దుస్తులు ధరించాలని నిబంధన ఉంది. అందుకే ఈ షో సెన్సేషన్ వైట్‌గా పేరొందింది. ఈ డ్రెస్ కోడ్‌ను అందరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది. ఈ షోలో ప్రేక్షకులను ఓలలాడించేందుకు నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డ్యాం నుంచి దాదాపు వెయ్యి మంది కళాకారుల బృందం ఇక్కడికి రానుంది. వీరితో పాటు భారత్‌కు చెందిన ప్రముఖ డీజేలు కూడా ఈ ఈవెంట్లో పాల్గొంటారు. ప్రభుత్వానికి అందివచ్చిన అవకాశం! ప్రపంచ పర్యాటకులను ఆకట్టుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి సెన్సేషన్ మంచి అవకాశం కానుంది. భిన్న సంస్కృతులతో అలరారుతున్న హైదరాబాద్‌ను ఈ డ్యాన్స్ షోకు వేదికగా మార్చుకునేందుకు అనుమతివ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని నిర్వాహకులు కోరారు. దీన్ని మంచి అవకాశంగా భావించిన ప్రభుత్వం దీనికి అనుమతులు జారీ చేసింది. వెంటనే గచ్చిబౌలి స్టేడియంలో ఏర్పాట్లు చేసేందుకు పర్యాటక శాఖ సంసిద్ధత ప్రకటించింది. -
విశాఖ జిల్లాలో మవోయిస్టుల కలకలం
-
దుమారం రేపుతున్న పవన్‌కల్యాణ్ డైలాగ్స్!
సురేష్ ప్రొడక్షన్స్ నిర్మించిన తాజా చిత్రం 'గోపాల గోపాల'లో జనసేనాధిపతి, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పంచ్ డైలాగ్స్ దుమారం రేపుతున్నాయి. ఈ సినిమాలో అదిరిపోయే డైలాగులున్నాయి. దైవత్వం నిండిన పాత్రలో పవన్ పేల్చిన మాటల తూటాలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. పచ్చదళానికి గూబ గుయ్యమనిపిస్తున్నాయి. కొన్ని డైలాగ్స్ తమ మనో భావాలు దెబ్బతీసే విధంగా వున్నాయని తెలుగు తమ్ముళ్లు మధనపడుతున్నారు. ఈ చిత్రం పొలిటికల్ సెటైర్‌గా మారిపోయినట్లు కొందరు అంటున్నారు. పవన్‌కళ్యాణ్ చూపులతో దైవత్వాన్ని ప్రదర్శిస్తూనే మాటలతో మంట పెట్టాడని సైకిల్ శ్రేణులు లోలోపల గింజుకుంటున్నట్లు సమాచారం. ఈ డైలాగ్స్ చంద్రబాబు నాయుడుకి వర్తిస్తాయా? మరెవరికి వర్తిస్తాయి? అని సినిమా చూసిన ప్రేక్షకులు కొందరు ప్రశ్నించారు. పవన్ డైలాగులు టీడీపీ నేతల్లో సెగలు రేపుతున్నాయి. ఒక్కో డైలాగ్ ఒక్కో పంచ్ ఇస్తోందని పరోక్షంగా చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ మాటల తూటాలు పేల్చారని అంటున్నారు. * నమ్మించేవాడు నాయకుడు కాదు-నడిపించేవాడు నాయకుడు. * గెలిచేవాడు నాయకుడు కాదు-గెలిపించేవాడు నాయకుడు. ఈ డైలాగులు టీడీపీ శ్రేణులను మరీ ఇబ్బందిపెడుతున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ గెలుపును ఈ డైలాగ్స్ ప్రశ్నస్తున్నట్లు ఉన్నాయని అంటున్నారు. ఆ ఎన్నికల్లో పవన్ వల్లే టీడీపీ గెలిచిందని, పవనే లేకపోతే టీడీపీ గెలిచేది కాదనే అర్థంలో డైలాగ్స్ ఉన్నాయని అంటున్నారు. కొందరు పవన్ అభిమానులు అదే మాట చెబుతున్నారు. ఈ సినిమాలో పవన్ పవర్ఫుల్ డైలాగ్స్‌పై టీడీపీ కాస్త గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు ఒక్కొకరు ఒక్కోరకంగా స్పందించారు. అతనిని(పవన్) చూసి ఓటేశారనుకోవడం దురదృష్టకరం అని ఓ ప్రేక్షకుడు అన్నారు. పవన్ కల్యాణ్ తన శక్తిని నిరూపించారని, గత ఎన్నికలలో టీడీపిని అధికారంలోకి తీసుకువచ్చారని మరో ప్రేక్షకుడు చెప్పారు. చంద్రబాబు స్వయం కృషి వల్ల అధికారంలోకి వచ్చారని, ఎవరినో చూసి ఆయనకు ఓటువేయవలసిన అవసరంలేదని రాజమండ్రికి చెందిన ఓ ప్రేక్షకురాలు అన్నారు. మరికొన్ని రాజకీయ డైలాగ్స్: *కొన్నిసార్లు రావడం లేటవచ్చేమో కానీ, రావడం మాత్రం పక్కా *సమర్థులు మాకెందుకని ఇంట్లో కూర్చుంటే, అసమర్థులు రాజ్యమేలతారు * దారి చూపించడం వరకే నా పని. గమ్యాన్ని చేరుకోవడం నీ పని ఈ డైలాగ్స్‌ను దృష్టిలోపెట్టుకొని పవన్ అభిమానులు ఎవరికి తోచినవిధంగా వారు విశ్లేషిస్తున్నారు. జనసేన పార్టీని స్థాపించినప్పటికీ ఇటీవలి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్న పవన్ భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో పార్టీని ముందుండి గెలిపిస్తారంటూ పవన్ అభిమానులు హుషారెత్తిపోతున్నారు. నాయకుడు ఎలా ఉండాలో పేర్కొంటూ పవన్ చెప్పిన డైలాగ్ అతని అంతరార్థాన్ని సూచిస్తోందని అభిమానులే పేర్కొంటున్నారు. తాను నమ్మించి మోసం చేసే వాడిని కాదని, నడిపించి గెలిపించే తత్వం తనదని పవన్ నర్మగర్భంగా చెప్పారని విశ్లేషిస్తున్నారు. -
ఆగస్టు మిస్టరీలు!
నేటికీ పెండింగ్‌లో 13 సంచలనం రేపిన కేసులు బందోబస్తులు, సదస్సులతో పోలీసులు బిజీగా ఉండటమే కారణం సాక్షి, సిటీబ్యూరో: గతనెలలో జంట పోలీసు కమిషనరేట్లలో సంచలనం రేపిన పలు కేసులు నేటికీపెండింగ్లోనే ఉన్నాయి. నిందితుల ఆచూకీ కనిపెట్టకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. స్వాత ంత్ర దినోత్సవ వేడుకలు, గణేష్ ఉత్సవాల హడావుడి, సీసీ కెమెరాలపై అవగాహన సదస్సులు, శాంతి కమిటీల సమావేశాల్లో పోలీసులు తలమునకలై ఉండటంతో ఈ కేసుల దర్యాప్తుపై దృష్టి పెట్టలేకపోయారు. గతనెలలో జరిగిన 13 ముఖ్య ఘటనల్లో నిందితులు నేటికీ దొరకలేదు. ఇందులో హత్య, దోపిడీ, స్నాచింగ్, దృష్టిమరల్చి, చోరీ తదితర ఘటనలున్నాయి. ఈ కేసుల మిస్టరీ వీడేదెన్నడో.. ఆగస్టు 5: నార్సింగి పరిధిలో అబ్దుల్ రహీం బ్యాంక్ నుంచి రూ.3.50 లక్షలు డ్రా చేసుకుని వెళ్తుండగా దుండగులు అతడి దృష్టి మరల్చి నగదు ఎత్తుకెళ్లారు. 15: శంషాబాద్ చారినగర్‌కు చెందిన రాములును ఎవరో హత్య చేసి గుర్తు పెట్టకుండా శవాన్ని కాల్చేశారు. కుషాయిగూడ ద్వారకాపురిలో ఒంటరిగా ఉండే లక్ష్మమ్మ (70)పై ఇద్దరు దుండగులు దాడి చేసి బీరువాలో ఉన్న 12 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. 18: కంచన్‌బాగ్ హఫీజ్‌బాబానగర్‌కు చెందిన బాలిక (15)పై కొందరు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. 20: చంచల్గూడలోని సెంట్రల్ ప్రిజన్స్ బంక్ నుంచి రిమాండ్ ఖైదీ సాజిద్ (26) రూ.68,500 తీసుకుని పరారయ్యాడు. ముషీరాబాద్ పఠాన్‌బస్తీలో ఉండే అనీఫా బేగం (50) ఇంట్లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు ఆమె కళ్లల్లో కారం చల్లి, నోట్లో వస్త్రాలు కుక్కి ఐదు తులాల బంగారు నగలు, రూ.50 వేలు దోచుకెళ్లారు. 21: బేగంబజార్‌లో ఆటోలో వెళ్తున్న గోల్డ్‌స్మిత్ అలీ (45)పై దుండగులు దాడి చేసి 2 కిలోల బంగారు నగలు దోపిడీ చేశారు. చైతన్యపురి ఎస్బీఐలో గురుశంకర్ అనే వ్యక్తి రూ.9 లక్షలు డ్రా చేసి వెళ్తుండగా ఓ వ్యక్తి అడ్రస్ అడిగినట్టు నటించి స్కూటర్ డిక్కీలోని డబ్బు పట్టుకుపోయాడు. 23: రూ.40 లక్షలు బ్యాంకులో వేసేందుకు బైక్‌పై వెళ్తున్న బావ బావవురుదులు శ్యాంసుందర్, దిలీప్‌కుమార్‌పై పల్సర్‌పై వచ్చిన నలుగురు కత్తితో దాడి చేసి డబ్బు దోపిడీ చేశారు. 26: నాచారం ఎస్వీనగర్‌కు చెందిన సబిత (35) ఇంట్లోకి ప్రవేశించిన అగంతకులు ఆమె కాళ్లుచేతులు కట్టేసి, గొంతు నులిమి చంపేశారు. 28: నల్లకుంట పరిధిలో రాజేందర్ అనే వ్యక్తి తన యజమానికి చెందిన రూ.2.77 లక్షలు బ్యాంక్‌లో వేసేందుకు తీసుకెళ్తుండగా బైక్‌పై వచ్చిన నలుగురు కళ్లల్లో కారం చల్లి డబ్బు దోచుకెళ్లారు. నారాయణగూడ పరిధిలో ఫార్మాస్యూటికల్స్ వ్యాపారి ఆర్బీ జ్యోషి ఇంట్లో దొంగలు పడి కిలో బంగారు నగలు ఎత్తుకెళ్లారు. 30: ఛాదర్‌ఘాట్ కాలాడేరాకు చెందిన రహీమ్‌ఖాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్లగా... బీరువాలోని 60 తులాల బంగారు నగలు, రూ.లక్షలను దొంగలు ఎత్తుకెళ్లారు. -
సంచలనాల కోసం చేసే పనా ఇది ?!
-
తుమకూరులో మహిళ హత్య
తుమకూరు, న్యూస్‌లైన్ : నగరంలో పట్టపగలు ఓ వివాహితను వేటకొడవళ్లతో హతమార్చిన సంఘటన గురువారం తీవ్ర సంచలనం రేపింది. ఉదయం 11.45 గంటల సమయంలో నగరంలోని గాంధీనగర్‌లో ఎల్ఐసీ రోడ్డులో శాంతినగరకు వెళ్లే రైలుగేట్ ఎదురుగా ఉన్న ఇంటిలో ఈ దారుణం జరిగింది. వివరాలు... గాంధీనగర్‌లో నివాసముంటున్న సూర్యనారాయణబుద్దీ ఇంటికి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి కాలింగ్‌బెల్ కొట్టారు. ఆ సమయంలో సూర్యనారాయణ భార్య నిర్మల (48) తలుపు తీయగానే దుండగులు వేట కొడవలితో విరుచుకుపడ్డారు. అతిదారుణంగా ఆమెను నరికివేశారు. అక్కడే ఉన్న పనిమనిషి జయమ్మ అడ్డుకోవడానికి యత్నించగా ఆమెను గాయపరిచారు. హత్య జరిగిన సమయంలో నిర్మల మామ మంజునాథ్ ఇంటిలోనే ఉన్నారు. మృతురాలి భర్త సూర్యనారాయణ గూళూరు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ మైసూరు బ్యాంకులో మేనేజరుగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఐజీపీ అమర్‌కుమార్‌పాండే, జిల్లా ఎస్పీ రమన్‌గుప్తా, అడిషనల్ ఎస్పీ.హనుమంతరాయప్ప పరిశీలించారు. నిందితుల కోసం ప్రత్యేక బృందం రంగంలోకి దిగినట్లు ఎస్పీ పేర్కొన్నారు. తిలక్‌పార్కు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.