ప్రపంచ జూనియర్ స్క్వాష్
చాంపియన్‌షిప్‌లో పతకం ఖరారు
హ్యూస్టన్ (అమెరికా): ప్రపంచ జూనియర్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత కుర్రాడు శౌర్య బావా సంచలనం సృష్టించాడు. ఈ మెగా టోర్నీలో బాలుర సింగిల్స్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లి కనీసం కాంస్య పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. 2014లో కుష్ కుమార్ తర్వాత ఈ టోర్నీలో భారత్‌కు పతకం రావడం ఇదే ప్రథమం. ఢిల్లీకి చెందిన 18 ఏళ్ల శౌర్య క్వార్టర్ ఫైనల్లో 2–11, 11–4, 10–12, 11–8, 12–10తో లో వా సెర్న్ (మలేసియా)పై గెలుపొందాడు.
80 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శౌర్య మూడు మాŠయ్‌చ్ పాయింట్లను కాపాడుకోవడం విశేషం. నిర్ణాయక ఐదో గేమ్‌లో శౌర్య 7–10తో ఓటమి అంచుల్లో నిలిచాడు. అయితే శౌర్య ఆందోళన చెందకుండా సంయమనంతో ఆడి వరుసగా ఐదు పాయింట్లు గెలిచి గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.
బాలికల సింగిల్స్ విభాగంలో జాతీయ చాంపియన్ అనాహత్ సింగ్ పోరాటం ముగిసింది. క్వార్టర్ ఫైనల్లో 16 ఏళ్ల అనాహత్ 8–11, 9–11, 11–5, 12–10, 11–13తో నదీన్ ఎల్‌హమీ (ఈజిప్‌్ట) చేతిలో పోరాడి ఓడిపోయింది.
Comments
Please login to add a commentAdd a comment