
ఎన్నో గొప్పగొప్ప కళాఖండాల్ని చూశాం. ఎంతో వైవిధ్యభరితమైన కళాఖండాలతో తీర్చిన రాజభవనాలు, అలానాటి పూర్వీకుల ప్యాలెస్‌లు ఎన్నో మనల్ని మంత్రముగ్దుల్ని చేశాయి. అలానే ఇక్కడొక గొప్ప ప్యాలెస్ మనల్ని కట్టిపడేసేంత ఆకర్షణగా ఉంది. కన్నులు తిప్పుకోలేనంతా ఆకర్షణీయంగా ఉంది కూడా. కానీ అదేంటో చూస్తే మాత్రం కచ్చితంగా షాక్ అవుతారు. ఏంటి ఇలాంటివి కూడా అత్యంత విలాసంగా కడతారు. అదీకూడా కేవలం దానికోసం ప్యాలస్ లాంటి భవనమా! అని నోరెళ్లబెట్టడం ఖాయం!.
ఇంతకీ ఈ ప్యాలెస్‌ని పోలిన భవనం థాయ్‌లాండ్‌లో ఉంది. మనం ముందు బయట నుంచి చూడగానే..వావ్ భలే కట్టారు. ఏదో గుడి లేదా మహల్ అనే అనకుంటారు. లోపలికి వెళ్లి చేసేంత వరకు కూడా అదేంటో తెలియదు. తీరా వెళ్లాక ఓస్ దీని కోసమా అని ఒక్కసారిగా మనలోని హుషార్ అంతా ఆవిరైపోతుంది. అదే సమయంలో ఆశ్చర్యం కూడా కలుగుతుంది. అయితే అదేంటంటే.. ఓ వాష్ రూమ్. దీన్ని అసాధారణ రీతిలో చాలా విలాసవంతంగా నిర్మించారు.
ఆ ప్యాలస్ ఓ విలాసవంతంగా డిజైన్ చేసిన బాత్‌రూమ్. బంగారు రంగు డిజైన్‌తో ధగధగలాడిపోతున్న ఆభవనం ఓ భారీ బాత్రూమ్ అనే చెప్పాలి. బాత్రూం వెలుపల నిర్మాణ శైలి, తోట అన్ని అద్భుతంగా ఉంటాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు వాహ్ చాలా అందంగా ఉందని ఒకరూ, మాటల్లో వివరించ లేనంత అద్భుతంగా ఉందని మరోకరూ ప్రశంసిస్తూ పోస్ట్‌లు పెట్టారు. ఎలాగైన ఈ రాయల్ బాత్రూమ్‌ని సందర్శించాల్సిదేనని పలువురు నెటిజన్లు అనడం విశేషం.
(చదవండి: ఆ ఊరిలో మహిళలు పిల్లల్ని కనడానికే భయపడుతున్నారు!పుట్టిన మూడు నెలలకే..)
Comments
Please login to add a commentAdd a comment