మూ డెంగ్.. రెండు నెలల వయసున్న ఆడ పిగ్మీ హిప్పో అదరినీ అలరిస్తోంది. థాయ్‌లాండ్‌లో చోన్ బురిలోని జంతుప్రదర్శనశాలలో ఇది నివసిస్తోంది. దీని ఫోటోలు ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది. ఈ ప్రత్యేకమైన హిప్పో కాస్త బొద్దుగా, చాలా చిన్నగా ఉండటంతో ఆన్‌లైన్‌లోనూ చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు.
మూ డెంగ్’ అంటే థాయ్‌లో ఎగిరిపడే పంది మాంసం అని అర్ధం. ఇది స్థానికంగా ప్రసిద్ధి చెందిన చిరుతిండి. ఇప్పుడు అంతరించిపోతున్న పిగ్మీ హిప్పోకు ఈ పేరు పెట్టారు. ఇది పశ్చిమ ఆఫ్రికాకు చెందినది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం.. ప్రపంచంలో 2,000 నుంచి 2,500 మాత్రమే మిగిలి ఉన్నాయి.
กินคลีน ☘️#hippo #PygmyHippo #ขาหมูแอนด์เดอะแก๊ง #หมูเด้งจะเด้งกี่โมง pic.twitter.com/gOn2s5Fb57
— Khamoo.andthegang (@and_khamoo) September 10, 2024
ఈ బుజ్జి హిప్పోను చూసేందుకు పట్టాయాకు సమీపంలోని ఒక జంతు ప్రదర్శనశాల (జూ)కు జనాలు పోటెత్తుతున్నారు. వందలాది మంది సందర్శకులు ఐదు నిమిషాల పాటు ఎన్‌క్లోజర్ క్యూలో ఉండి దీనిని చూస్తున్నారు. కొంతమంది అయితే రెండు గంటల ప్రయాణి చేసి మరి దానిని సందర్శించేందుకు వస్తున్నారు. జులైలో ఈ హిప్పో పుట్టినప్పటి నుంచి జూకు వచ్చే సందర్శకుల సంఖ్య రెట్టింపు అయిందని ఖ్యావ్ ఖ్యూ ఓపెన్ జూ నిర్వాహకులు వెల్లడించారు.
— X (@X) September 15, 2024
అయితే బుజ్జి హిప్పోను సందర్శకులు ఇబ్బంది పెడుతున్నట్లుగా చూపించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో మూ డెంగ్‌ను చూడటానికి వచ్చే వారు పద్ధతిగా వ్యవహరించాలని జూ డైరెక్టర్ కోరారు. ఈ జంతువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, వాటికి సురక్షితమైన, సౌకర్యమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని తెలిపారు.
కాగా ఈ హిప్పోను లేపడానికి కొంతమంది సందర్శకులు దానిపై నీళ్లు చల్లడం, వస్తువులు విసిరేస్తున్నట్లుగా నెట్టింట్లో ఉన్న వీడియోలు చూపిస్తున్నాయి. దీంతో మూ డెంగ్ స్థావరం చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, బుజ్జి హిప్పో పట్ల తప్పుగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. అది మేల్కొని ఉన్నప్పుడే దానిని చూడాలని ఆయన కోరారు.
Comments
Please login to add a commentAdd a comment