ఆకలితో వచ్చిన పక్షి.. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. | Viral Video: Man And Bird Eat Food From The Same Plate Heart Warming Video | Sakshi
Sakshi News home page

ఆకలితో వచ్చిన పక్షి.. అతను చేసిన పనికి నెటిజన్లు ఫిదా..

Published Wed, Jun 16 2021 2:42 PM | Last Updated on Wed, Jun 16 2021 5:47 PM

Viral Video: Man And Bird Eat Food From The Same Plate Heart Warming Video  - Sakshi

మనలో చాలా మంది జంతువులు, పక్షులను పెంచుకోవడానికి ఇ‍ష్టపడతారు.  ఈ క్రమంలో వాటికి కావాల్సిన ఆహారాన్ని, దానా పెట్టి సంబరపడుతూ ఉంటారు. మరికొందరైతే..  తమ ఇళ్లలోని బాల్కనీలలో పక్షుల కోసం ప్రత్యేకంగా.. ఇళ్లను తయారు చేస్తారు. అంతటితో ఆగకుండా, వాటి కోసం దానా, నీళ్లు పెట్టడం మనకు తెలిసిన విషయమే. అయితే, ఈ వీడియోలో ఒక వ్యక్తి  భోజనం చేస్తున్న క్రమంలో ఒక పక్షి వచ్చింది. అది, అతనితో కలిసి అదే ప్లేట్‌లో ఆహారం తింటుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. 

వివరాలు.. ఈ వీడియోలోని సదరు వ్యక్తికి బాగా ఆకలేసినట్టుంది. దీంతో ఒక డాబా చేరుకుని తీరిగ్గా తింటున్నాడు. ఈ క్రమంలో ఎక్కడి నుంచి వచ్చిందో కానీ.. ఒక పక్షి ఎగురుకుంటూ వచ్చింది. పాపం.. దానికి బాగా ఆకలేసినట్టుంది. సరిగ్గా ఆ వ్యక్తి భోజనం చేస్తున్న టేబుల్‌పై వాలిపోయింది. అంతటితో ఆగకుండా అతని.. ప్లేట్‌లోని ఆహారం తినడం మొదలు పెట్టింది. ఆ వ్యక్తి  దాన్ని ఏమాత్రం అదిలించలేదు. మొదట్లో దానికి కావాల్సిన ఆహారాన్ని కొద్దిగా కింద వేశాడు.. ఆ పక్షి  ఏమాత్రం భయలేకుండా ఆ పదార్థాన్ని తినేసింది.

కాసేపయ్యాక.. అది అతని ప్లేట్‌లోని పదార్థాన్ని ఇ‍ష్టంగా తింటుంది. ఇద్దరు కలిసి ఒకే ప్లేట్‌లో భోజనాన్ని తినేశారు. ఈ సంఘటన ఎక్కడ జరిగిందో తెలియలేదు. అయితే , ఈ వీడియోను మేఘరాజ్‌ దేశాలే అనే వ్యక్తి ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశాడు. ప్రస్తుతం ఇది సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. దీన్ని చూసిన నెటిజన్లు ‘పాపం.. పక్షికి బాగా ఆకలేసినట్టుంది..’, ‘ నీ మానవత్వానికి హ్యట్సాఫ్‌..’, ‘ ఆకలితో వచ్చిన అతిథి కడుపు నింపావ్‌..’ ‘ఆ పక్షి.. మంచి వ్యక్తి దగ్గర వెళ్లి వాలింది..’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

చదవండి: వైరల్ వీడియో: రియల్‌ హీరోస్‌.. అగ్నిప్రమాదం నుంచి ముగ్గురు చిన్న పిల్లలని..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement