Hippo
-
నెట్టింట్లో తెగ వైరల్.. ఈ బుజ్జి హిప్పోకు ఎందుకందరూ ఫిదా!
మూ డెంగ్.. రెండు నెలల వయసున్న ఆడ పిగ్మీ హిప్పో అదరినీ అలరిస్తోంది. థాయ్‌లాండ్‌లో చోన్ బురిలోని జంతుప్రదర్శనశాలలో ఇది నివసిస్తోంది. దీని ఫోటోలు ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్‌గా మారింది. ఈ ప్రత్యేకమైన హిప్పో కాస్త బొద్దుగా, చాలా చిన్నగా ఉండటంతో ఆన్‌లైన్‌లోనూ చాలామంది దీన్ని ఫాలో అవుతున్నారు.మూ డెంగ్’ అంటే థాయ్‌లో ఎగిరిపడే పంది మాంసం అని అర్ధం. ఇది స్థానికంగా ప్రసిద్ధి చెందిన చిరుతిండి. ఇప్పుడు అంతరించిపోతున్న పిగ్మీ హిప్పోకు ఈ పేరు పెట్టారు. ఇది పశ్చిమ ఆఫ్రికాకు చెందినది. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ప్రకారం.. ప్రపంచంలో 2,000 నుంచి 2,500 మాత్రమే మిగిలి ఉన్నాయి.กินคลีน ☘️#hippo #PygmyHippo #ขาหมูแอนด์เดอะแก๊ง #หมูเด้งจะเด้งกี่โมง pic.twitter.com/gOn2s5Fb57— Khamoo.andthegang (@and_khamoo) September 10, 2024 ఈ బుజ్జి హిప్పోను చూసేందుకు పట్టాయాకు సమీపంలోని ఒక జంతు ప్రదర్శనశాల (జూ)కు జనాలు పోటెత్తుతున్నారు. వందలాది మంది సందర్శకులు ఐదు నిమిషాల పాటు ఎన్‌క్లోజర్ క్యూలో ఉండి దీనిని చూస్తున్నారు. కొంతమంది అయితే రెండు గంటల ప్రయాణి చేసి మరి దానిని సందర్శించేందుకు వస్తున్నారు. జులైలో ఈ హిప్పో పుట్టినప్పటి నుంచి జూకు వచ్చే సందర్శకుల సంఖ్య రెట్టింపు అయిందని ఖ్యావ్ ఖ్యూ ఓపెన్ జూ నిర్వాహకులు వెల్లడించారు.pic.twitter.com/SSUHf775RW— X (@X) September 15, 2024 అయితే బుజ్జి హిప్పోను సందర్శకులు ఇబ్బంది పెడుతున్నట్లుగా చూపించే వీడియోలు సోషల్ మీడియాలో కనిపించడంతో మూ డెంగ్‌ను చూడటానికి వచ్చే వారు పద్ధతిగా వ్యవహరించాలని జూ డైరెక్టర్ కోరారు. ఈ జంతువులను జాగ్రత్తగా కాపాడుకోవాలని, వాటికి సురక్షితమైన, సౌకర్యమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కాగా ఈ హిప్పోను లేపడానికి కొంతమంది సందర్శకులు దానిపై నీళ్లు చల్లడం, వస్తువులు విసిరేస్తున్నట్లుగా నెట్టింట్లో ఉన్న వీడియోలు చూపిస్తున్నాయి. దీంతో మూ డెంగ్ స్థావరం చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు, బుజ్జి హిప్పో పట్ల తప్పుగా ప్రవర్తించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నిర్వాహకులు తెలిపారు. అది మేల్కొని ఉన్నప్పుడే దానిని చూడాలని ఆయన కోరారు. -
వైరల్ వీడియో: తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యువకులు
-
Viral: చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, చివరికి ట్విస్ట్ ఏంటంటే?
నైరోబి: ఆ ముగ్గురు స్నేహితులకు అక్కడికి వెళితే ప్రాణం పోతుందని తెలుసు. అయినా వెళ్లారు. చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తృటిలో తప్పించుకున్నారు. అసలేం జరిగిందంటే.. కెన్యాలో విక్టోరియా సరస్సు ఉంది. ఆ సరస్సులో అత్యంత ప్రమాదకరమైన నీటి ఏనుగులు ఉన్నాయి. పొరపాటున సరస్సులో ప్రయాణిస్తుండగా వాటి కంటపడితే కనికరం లేకుండా వేటాడి ప్రాణాలు తీస్తాయి. అయితే డికెన్ ముచెనా అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి విక్టోరియా సరస్సులో నీటి ఏనుగుల్ని వీక్షించేందుకు వెళ్లారు. వెళ్లేముందు సరస్సులోని హిప్పోపొటామస్(నీటి ఏనుగులు) గురించి తెలుసుకున్నారు. సరస్సులోకి దిగిన ఆ ముగ్గరికి నీటి ఏనుగులు కనిపించలేదు. దీంతో వాటి కోసం అన్వేషణ ప్రారంభించారు. అంతలోనే ఓ నీటి ఏనుగు స్పీడ్ బోట్లో ప్రయాణిస్తున్న యువకులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నీటిలో మునిగి మెరుపు వేగంతో దాడి చేసేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ ఆ యువకులు స్పీడ్ బోట్ వేగాన్ని పెంచడంతో తృటిలో ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. ఈ ఘటన అనంతరం డికెన్ మాట్లాడుతూ.. నీటి ఏనుగుల గురించి, అవి తలపెట్టే ప్రమాదం తెలుసుకున్నాం. వాటిని చూసేందుకు స్పీడ్ బోట్ లో ప్రయాణించాం. కానీ అవి మాకు ఎక్కడా కనిపించలేదు. సరస్సులో మరికొంత దూరం వెళ్లాం. అదే సమయంలో ఓ నీటి ఏనుగు మాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దేవుడి దయవల్ల సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాం. చెప్పాలంటే చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లైందని తెలిపాడు. ఇక, ఈ ఘటన జరిగే సమయంలో డికెన్ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి : చిప్ దొబ్బినట్లుంది, పారాచుట్ లేకుండా విమానం నుంచి దూకాడు -
వైరల్: నువ్వు మహిళవు కాదు
-
వైరల్: నువ్వు మహిళవు కాదు! సైకోవి
జకార్తా : సరదానో.. మానసిక పరిస్థితి బాగోలేకనో కొంతమంది సైకోల్లాగా వ్యవహరిస్తుంటారు. తమకు నచ్చినట్లు.. ఇష్టం వచ్చినట్లు చేసి ఇతరులను, కొన్ని కొన్ని సార్లు మూగ జీవాలను హింసిస్తుంటారు. ఇండోనేషియాకు చెందిన ఓ మహిళ కూడా అదే పని చేసింది. తన తల తిక్కపనికి ఓ మూగ జీవి ప్రాణాన్ని ప్రమాదంలోకి నెట్టబోయింది. వివరాలు.. కొద్దిరోజుల క్రితం ఇండోనేషియా, జావాకు చెందిన ఓ మహిళ అక్కడి తమన్ సఫారీకి వెళ్లింది. కారులో అన్ని జంతువుల్ని తిరిగిచూస్తున్న ఆమె నీటిలో ఉన్న హిప్పో నోట్లోకి వాటర్ బాటిల్, టిష్యూ పేపర్ విసిరింది. ఇది గమనించిన సింటియా ఆయూ అనే మహిళ హిప్పో నోట్లోని వస్తువులను వీడియో తీసింది. అనంతరం సఫారీ అధికారులకు సమాచారం ఇచ్చింది. దీంతో వెటర్నరీ వైద్యులు హిప్పోకు వైద్య పరీక్షలు నిర్వహించి బాటిల్‌ను బయటకు తీశారు. అనంతరం డోని హెర్డారు అనే వ్యక్తి నిందితురాలైన మహిళను కథిజాహ్గా గుర్తించాడు. తాను చేసిన పనికి క్షమాపణ చెబుతూ కథిజాహ్ ఓ వీడియో విడుదల చేసింది. ఈ సంఘటనపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ నువ్వు మహిళవు కాదు! సైకోవి’’.. ‘‘నువ్వు మనిషివేనా? మానవత్వం ఉందా’’ అంటూ మండిపడుతున్నారు. చదవండి : పేదరికంలో మగ్గుతున్న గురువును ఆదుకోవటానికి.. గవర్నర్ పదవికి పోటీ.. జోకర్ వేషంలో నామినేషన్ -
హిప్పోకు కోపమొస్తే.. వార్ వన్‌సైడే!
తనపై దాడి చేసేందుకు వచ్చిన మొసలిని నీటి గుర్రం నోటితో కరిచి చంపేస్తోందని అనిపిస్తోంది కదూ ఈ ఫొటో చూస్తుంటే. కానీ కాదు.. మొసలి వల్ల తన బిడ్డకు ముప్పు కలుగవచ్చన్న భయంతోనే ఈ హిప్పో ఇలా ఉగ్రరూపం దాల్చింది. దక్షిణాఫ్రికాలోని క్రూగర్ నేషనల్ పార్కులో లేక్ పానిక్ అనే సరస్సులో ఈ హిప్పోపొటామస్ తన బుల్లి హిప్పోతో హాయిగా విహరిస్తోంది. ఇంతలో ఆ పరిసరాల్లో ఈ మొసలి కంటపడింది. అంతే.. హిప్పో కొరకొరా చూసింది. తన బిడ్డ కోసమే వచ్చిందనుకుని ఒక్క ఉదుటున దూసుకొచ్చింది. దీంతో మొసలి భయంతో నీటిలో మునిగి నేలకు కరుచుకుని ఉండిపోయింది. అయినా.. శాంతించని హిప్పో ఇలా దాన్ని నోట కరుచుకుని ఒడ్డున పడేసి కొరుకుతూ చితక్కొట్టింది! ఇదంతా చూసిన కెన్ హాలీ అనే ఫొటోగ్రాఫర్ హిప్పో ఏకపక్ష దాడిని ఇలా కెమెరాలో బంధించేశాడు!