నైరోబి: ఆ ముగ్గురు స్నేహితులకు అక్కడికి వెళితే ప్రాణం పోతుందని తెలుసు. అయినా వెళ్లారు. చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తృటిలో తప్పించుకున్నారు. అసలేం జరిగిందంటే.. కెన్యాలో విక్టోరియా సరస్సు ఉంది. ఆ సరస్సులో అత్యంత ప్రమాదకరమైన నీటి ఏనుగులు ఉన్నాయి. పొరపాటున సరస్సులో ప్రయాణిస్తుండగా వాటి కంటపడితే కనికరం లేకుండా వేటాడి ప్రాణాలు తీస్తాయి. అయితే డికెన్ ముచెనా అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి విక్టోరియా సరస్సులో నీటి ఏనుగుల్ని వీక్షించేందుకు వెళ్లారు. వెళ్లేముందు సరస్సులోని హిప్పోపొటామస్(నీటి ఏనుగులు) గురించి తెలుసుకున్నారు.
సరస్సులోకి దిగిన ఆ ముగ్గరికి నీటి ఏనుగులు కనిపించలేదు. దీంతో వాటి కోసం అన్వేషణ ప్రారంభించారు. అంతలోనే ఓ నీటి ఏనుగు స్పీడ్ బోట్‌లో ప్రయాణిస్తున్న యువకులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నీటిలో మునిగి మెరుపు వేగంతో దాడి చేసేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ ఆ యువకులు స్పీడ్ బోట్ వేగాన్ని పెంచడంతో తృటిలో ప్రాణాల్ని కాపాడుకోగలిగారు.
ఈ ఘటన అనంతరం డికెన్ మాట్లాడుతూ.. నీటి ఏనుగుల గురించి, అవి తలపెట్టే ప్రమాదం తెలుసుకున్నాం. వాటిని చూసేందుకు స్పీడ్ బోట్ లో ప్రయాణించాం. కానీ అవి మాకు ఎక్కడా కనిపించలేదు. సరస్సులో మరికొంత దూరం వెళ్లాం. అదే సమయంలో ఓ నీటి ఏనుగు మాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దేవుడి దయవల్ల సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాం. చెప్పాలంటే చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లైందని తెలిపాడు. ఇక, ఈ ఘటన జరిగే సమయంలో డికెన్ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
చదవండి : చిప్ దొబ్బినట్లుంది, పారాచుట్ లేకుండా విమానం నుంచి దూకాడు
Comments
Please login to add a commentAdd a comment