Boat Racing
-
రాకాసి అలల పని పడుతూ గస్తీ కాసే బోట్లు (ఫొటోలు)
-
వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..
ఒరెగాన్లోని హ్యాపీ వ్యాలీకి చెందిన గ్యారీ క్రిస్టెన్సెన్ అసాధారణమైన గిన్నిస్ రికార్డు సాధించాడు. ఓ బారీ గుమ్మడికాయను పడవగా మార్చి ఏకంగా కొలంబియా నదిలో 26 గంటలు ప్రయాణించి ఈ రికార్డు సృష్టించాడు. ఆయన వాషింగ్టన్‌లోని నార్త్ బోన్నెవిల్లే నుంచి ప్రారంభించి.. 73.50 కిమీ దూరంలో కెనడాలో ఉన్న వాంకోవర్ వరకు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ రికార్డుని నెలకొల్పాడు. ఆయన 2011 నుంచి అతి పెద్ద గుమ్మడి కాయలను పెంచడం ప్రారంభించాడు. అలా 2013లో అతిపెద్ద గుమ్మడికాయతో తొలిసారిగా పడవ తయారు చేసి ‘వెస్ట్‌కోస్ట్ జెయింట్ పంప్కిన్ రెగట్టా’ పోటీల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి గ్యారీకి ఇలా భారీ గుమ్మడికాయలను పండించడం వాటిని పడవగా మలచడం ఒక అలవాటుగా మారింది. ఆ క్రమంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డుపై దృష్టసారించాడు. అందుకోసం గ్యారీ అక్టోబర్ 4న 556 కిలోల భారీ గుమ్మడికాయను పండించాడు. ఆ తర్వాత అక్టోబర్5న అధికారుల సమక్షంలోనే పడవగా తయారు చేసి తన సాహసకృత్యాన్ని ప్రారంభించారు. ఇక అధికారులు ఆ పడవకి ఒక కెమెరాను అమర్చి గ్యారీ ప్రయాణాన్ని రికార్డు చేశారు. అలా గ్యారీ గుమ్మడి కాయ పడవతో ఏకాధాటిగా ప్రయాణించి ఈ ప్రపంచ రికార్డుని సాధించాడు. (చదవండి: కింగ్ చార్లెస్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!) -
యువతుల‘పడవ’ళ్లు!
దాల్ సరస్సులోని నీళ్లు ఎప్పుడూ స్వచ్ఛంగా ఉండి, శ్రీనగర్ పట్టణ ప్రాంత సోయగాలను, ప్రకృతి రమణీయతను ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇక ఆ సరస్సులో సోమవారం జరిగిన బోట్ రేస్ ఏకంగా మహిళా సాధికారతనే పరవళ్లు తొక్కించింది! 150 మందికి పైగా అందరూ మహిళలే పాల్గొన్న అలాంటి ఒక రేస్ దాల్ సరస్సులో జరగటం ఇదే మొదటిసారి. మహిళా అథ్లెట్లను ప్రోత్సహించటం, జమ్మూ లోయలోని మహిళల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయటం, సంప్రదాయ మూస పద్ధతులను బద్దలు కొట్టించి మహిళల్ని ఇంటి బయటికి రప్పించటం ఈ పడవ పోటీల లక్ష్యం. కశ్మీర్ మహిళలకు వాటర్ స్పోర్ట్స్‌లో శిక్షణ ఇచ్చేందుకు తన జీవితాన్నే అంకితం చేసిన ప్రఖ్యాత అథ్లెట్,పారిస్ ఒలింపిక్స్‌లో భారతదేశపు మొదటి మహిళా జ్యూరీ.. బిల్కిస్ మీర్ ఈ పోటీలను నిర్వహించారు.‘‘మహిళల కోసం దాల్ సరస్సులో ఏర్పాటు చేసిన ఈ మొట్టమొదటి ట్రాక్ రేస్ చరిత్రాత్మక మైనది. పురుషులకు ఎన్నో ఈవెంట్స్ ఉంటాయి. మహిళలకు అన్ని ఉండవు. ఇటువంటి మరిన్ని రేసులను నిర్వహించి, 35మంది యువతుల్ని వారి ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసుకుని అంతర్జాతీయ పోటీలకు శిక్షణ ఇస్తాం’’ అని బిల్కిస్ మీర్ తెలి΄ారు. పోటీలోపాల్గొన్న మాదిహా ఫరూక్ అనే యువతి, తను ఈ రేసులో భాగం అయినందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ‘‘ఆడపిల్లలకు ఆటలేంటి అనే భావజాలం సమాజం నుండి రూపుమాసిపోవాలి’’ అని అన్నారు.అందమైన జలమార్గాలకు పేర్గాంచిన కశ్మీర్లో, మహిళల్ని వాటర్ స్పోర్ట్స్‌లో ప్రోత్సహించటం ద్వారా సాధికారత వైపు పడవల్ని పరుగులెత్తించటం బాగుంది. -
అధికారులతో కలిసి రిజర్వాయర్ లో సీఎం వైఎస్ జగన్ బోటింగ్
-
ప్రపంచంలోనే మొట్టమొదటిది.. ‘రేస్ బర్డ్’కు ఎన్నెన్నో విశేషాలు
ఇప్పుడు అన్ని వాహనాలు ఎలక్ట్రిక్మయం అయిపోతున్నాయ్. బైక్‌లు, కార్లు మొదలుకొని బస్సుల దాకా అన్ని వాహనాలు కరెంటుతో నడుస్తున్నాయ్. ఇదే కోవలో ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్ రేసింగ్బోట్ సిద్ధం కాబోతోంది. దాని విశేషాలేంటో చూద్దాం... –సాక్షి, సెంట్రల్ డెస్క్ ఎలక్రిక్ రేసింగ్ బోట్ ‘రేస్‌బర్డ్’ ప్రొటోటైప్ మొదటి టెస్ట్‌రన్ విజయవంతంగా పూర్తిచేసుకుంది. ఇది ఇటీవల ఉత్తర ఇటలీలోని సాన్ నజారో సమీపంలోని ‘పో’ అనే నదిపై దూసుకుపోయింది. మాజీ పవర్‌బోట్ చాంపియన్ లూకా ఫెరారీ ఈ బోట్‌ను నడిపారు. వచ్చే ఏడాది మొదటిసారి జరగనున్న ఎలక్ట్రిక్ రేస్బోట్ చాంపియన్‌షిప్‌లో ‘ఈ1’ అనే ఈ రేస్‌బర్డ్ పాల్గొననుంది. జలాలపై విద్యుత్ విప్లవం ‘రేస్‌బర్డ్ ఎగిరింది. మాకు చాలా సంతోషంగా ఉంది’ అని టెస్ట్‌రన్ తర్వాత ఈ1 సిరీస్ ట్విట్టర్లో ప్రకటించింది. విద్యుత్ విప్లవం అధికారికంగా జలాలను తాకిందని గర్వంగా తెలిపింది. పో నదిపై టెస్ట్‌రన్ నిర్వహించినప్పుడు ఇంజనీర్లు పలు సాంకేతిక పరీక్షలు చేసి రేస్‌బర్డ్ సామర్థ్యాన్ని పరీక్షించారు. త్వరలో వేర్వేరు వాతావరణ పరిస్థితుల్లో ఇది ఎలా పనిచేస్తుందో పరీక్షిస్తామని కంపెనీ బృందం తెలిపింది. మరికొన్ని వారాలపాటు దీన్ని అన్నిరకాలుగా పరీక్షించనున్నట్లు పేర్కొంది. అలల నుంచి 16 అంగుళాలు పైకి... ఈ రేస్‌బర్డ్ ఆలోచన నార్వేకు చెందిన సోఫి హోర్న్ అనే డిజైనర్ మది నుంచి పుట్టింది. హైడ్రోఫాయిల్ సాంకేతికతో రూపొందించిన ఈ పడవ నీటి అలల నుంచి 16 అంగుళాల ఎత్తువరకు ఎగరగలదు. ఆ సమయంలో నీటిపై కంటే కూడా ఎక్కువ వేగంతో దూసుకెళ్లే సామర్థ్యం కలిగిఉంటుంది. రేస్‌బర్డ్ కోసం అభిమానులు ఇక ఎంతో కాలం వేచిచూడాల్సిన అవసరంలేదని కంపెనీ తెలిపింది. త్వరలోనే దీన్ని ప్రదర్శనకు పెడతామని, ఆ తేదీలను కూడా ప్రకటిస్తామని చెప్పింది. రేస్ బర్డ్ విశేషాలు పొడవు 23 అడుగులు వెడల్పు 6.5 అడుగులు బరువు 800 కిలోలు బ్యాటరీ 150 కిలోవాట్ సామర్థ్యం గరిష్ట వేగం 50 నాటికల్ మైళ్లు (గంటకు 93 కిలోమీటర్లు) -
వైరల్ వీడియో: తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న యువకులు
-
Viral: చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చారు, చివరికి ట్విస్ట్ ఏంటంటే?
నైరోబి: ఆ ముగ్గురు స్నేహితులకు అక్కడికి వెళితే ప్రాణం పోతుందని తెలుసు. అయినా వెళ్లారు. చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చి తృటిలో తప్పించుకున్నారు. అసలేం జరిగిందంటే.. కెన్యాలో విక్టోరియా సరస్సు ఉంది. ఆ సరస్సులో అత్యంత ప్రమాదకరమైన నీటి ఏనుగులు ఉన్నాయి. పొరపాటున సరస్సులో ప్రయాణిస్తుండగా వాటి కంటపడితే కనికరం లేకుండా వేటాడి ప్రాణాలు తీస్తాయి. అయితే డికెన్ ముచెనా అనే యువకుడు తన ముగ్గురు స్నేహితులతో కలిసి విక్టోరియా సరస్సులో నీటి ఏనుగుల్ని వీక్షించేందుకు వెళ్లారు. వెళ్లేముందు సరస్సులోని హిప్పోపొటామస్(నీటి ఏనుగులు) గురించి తెలుసుకున్నారు. సరస్సులోకి దిగిన ఆ ముగ్గరికి నీటి ఏనుగులు కనిపించలేదు. దీంతో వాటి కోసం అన్వేషణ ప్రారంభించారు. అంతలోనే ఓ నీటి ఏనుగు స్పీడ్ బోట్లో ప్రయాణిస్తున్న యువకులపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. నీటిలో మునిగి మెరుపు వేగంతో దాడి చేసేందుకు పలుమార్లు ప్రయత్నించింది. కానీ ఆ యువకులు స్పీడ్ బోట్ వేగాన్ని పెంచడంతో తృటిలో ప్రాణాల్ని కాపాడుకోగలిగారు. ఈ ఘటన అనంతరం డికెన్ మాట్లాడుతూ.. నీటి ఏనుగుల గురించి, అవి తలపెట్టే ప్రమాదం తెలుసుకున్నాం. వాటిని చూసేందుకు స్పీడ్ బోట్ లో ప్రయాణించాం. కానీ అవి మాకు ఎక్కడా కనిపించలేదు. సరస్సులో మరికొంత దూరం వెళ్లాం. అదే సమయంలో ఓ నీటి ఏనుగు మాపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. దేవుడి దయవల్ల సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డాం. చెప్పాలంటే చావుకు షేక్ హ్యాండ్ ఇచ్చినట్లైందని తెలిపాడు. ఇక, ఈ ఘటన జరిగే సమయంలో డికెన్ తీసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చదవండి : చిప్ దొబ్బినట్లుంది, పారాచుట్ లేకుండా విమానం నుంచి దూకాడు -
ఎఫ్1హెచ్2వో బోట్ రేస్ విజేత షాన్ టొరెంటే
సాక్షి, అమరావతి: ఎఫ్1హెచ్2వో బోట్ రేస్‌లో అబుదాబి టీంకు చెందిన షాన్ టొరెంటే విజేతగా నిలిచాడు. ఆదివారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్దనున్న కృష్ణా నదిలో ఉత్కంఠభరితంగా సాగిన తుది పోరులో టొరెంటే మొదటి స్థానం సాధించగా.. ఎమిరేట్స్ టీంకు చెందిన మహిళా డ్రైవర్ స్ట్రోమా మారియట్ రెండో స్థానంలోనూ, అబుదాబి డ్రైవర్ ఎరిక్ స్టార్క్ మూడో స్థానంలోనూ నిలిచారు. అమరావతి తరఫున బరిలోకి దిగిన డ్రైవర్ జోనస్ అండర్సన్ మొదట్లో గట్టి పోటీ ఇచ్చినప్పటికీ.. బోట్లో సాంకేతిక లోపం తలెత్తడంతో మధ్యలోనే వైదొలిగాడు. అలాగే 44 ల్యాప్‌లు పూర్తి చేయాల్సిన తుది పోరులో అమరావతి టీంకే చెందిన రెండో డ్రైవర్ ఎరిక్ ఎడిన్ 43 ల్యాప్లే పూర్తి చేసి ఆరో స్థానంలో నిలిచాడు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో ఏడు దశల్లో జరిగే ఈ ఎఫ్1హెచ్2వో తదుపరి బోట్ రేస్ దుబాయ్‌లో జరగనుంది. కాగా, ఫార్ములా–4 రేస్‌లో శ్యామ్ విఠేల్ మొదట స్థానంలోనూ, జెఫ్ బెంజిమెన్ రెండో స్థానంలోనూ, అహ్మద్ అల్ ఫాహిమ్ మూడో స్థానంలోనూ నిలిచారు. ఏటా నిర్వహిస్తాం.. పోటీ ముగిసిన అనంతరం సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. ఇకపై ఏటా ఎఫ్1హెచ్2వో రేస్‌లు నిర్వహిస్తామని చెప్పారు. వచ్చే ఏడాది నవంబర్ 15, 16, 17 తేదీల్లో ఈ పోటీలు రాష్ట్రంలో జరుగుతాయన్నారు. ఈ రేస్‌ల వల్ల రాష్ట్రం పర్యాటక స్థలంగా గుర్తింపు సాధిస్తోందని చెప్పారు. అంతర్జాతీయ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ నెలలో ఎయిర్‌ఫోర్స్ ఈవెంట్ జరుగుతుందని.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1 నుంచి 7 వరకు వాటర్ ఫెస్టివల్ నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం విజేతలకు సీఎం చంద్రబాబు ట్రోఫీలు అందజేశారు. అలాగే అబుదాబి టీం మేనేజర్ కాప్ లీ డింగ్, ఎఫ్1హెచ్2వో ఉపాధ్యక్షుడు లుకిమినా కపిలిసినోని, కలెక్టర్ బి.లక్ష్మికాంతం, పర్యాటక శాఖ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, హిమాన్షు శుక్లాను సీఎం సత్కరించారు. హెచ్2వో రేసింగ్ అధ్యక్షుడు మాట్లాడుతూ.. వచ్చే ఏడాది ఫిబ్రవరి తర్వాత రాష్ట్రంలోని యువతకు బోట్ రేసింగ్‌లో శిక్షణ ఇస్తామన్నారు. కార్యక్రమంలో మంత్రులు నిమ్మకాయల చినరాజప్ప, అఖిల ప్రియ, దేవినేని ఉమామహేశ్వరరావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధ ప్రసాద్ ఎంపీ కేశినేని నాని తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై అమరావతిలో ఏటా బోట్ రేసింగ్‌లు
సాక్షి, అమరావతి: రాజధాని అమరావతిలో ఇక ఏటా బోట్ రేసింగ్ పోటీలు నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. విజయవాడ వద్ద కృష్ణా నదిలో శుక్రవారం ఆయన పవర్ బోట్ ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు ప్రారంభించారు. తర్వాత ఆయన సతీమణి భువనేశ్వరి, మనవడు దేవాన్ష్లతో కలిసి బోట్లో విహరించారు. భవానీఘాట్ వద్ద ఏర్పాటు చేసిన పర్యాటక సదస్సును ప్రారంభించిన అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ.. అమరావతిలో తప్ప ఇతర దేశాల్లో ఉప్పునీటిలో ఇలాంటి పోటీలు నిర్వహిస్తారన్నారు. ప్రపంచంలో ఎఫ్1హెచ్2వో రేసులు ఏడు చోట్ల నిర్వహిస్తుండగా అమరావతిలో నిర్వహించేది 5వ రేసు అన్నారు. ఆరో రేసు దుబాయి, ఏడవ రేసు షార్జాలలో జరగనున్నాయని తెలిపారు. ప్రకాశం బ్యారేజికి ఎగువున వైకుంఠపురం దిగువున చోడవరం బ్యారేజీలు వస్తున్నాయని, ఆయా ప్రాంతాల్లో 70 నుంచి 80 కిలోమీటర్ల పొడవున వాటర్ ఫ్రంట్ ఏర్పడనుందన్నారు. కృష్ణా నదిలో 9 ఐలాండ్లు ఉన్నాయని ఆయా ప్రాంతాల్లో ఐకానిక్ బ్రిడ్జిలు రాబోతున్నాయని తెలిపారు. బోట్ రేసు నిర్వహించే ప్రాంతాన్ని ఎన్టీఆర్ సాగర్ అమరావతిగా నామకరణం చేశారు. హైదరాబాద్‌లో ఫార్ములా–1 కార్ల రేసును తీసుకురావడానికి ప్రయత్నించానని అయితే అమరావతికి అంతకన్నా మెరుగైన విధంగా నిర్వహించేందుకు ఎఫ్1హెచ్2వో రేసులను తీసుకురాగలిగానని చెప్పారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు వచ్చే నాలుగేళ్లలో లక్ష రూములు అందుబాటులోకి తీసుకువచ్చే విధంగా పని చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో 32 చారిత్రక వారసత్వ కట్టడాలపై పర్యాటక శాఖ రూపొందించిన వీడియోను సీఎం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు భూమా అఖిల ప్రియ, లోకేష్, దేవినేని ఉమా, పర్యాటక శాఖ చైర్మన్ జయరామిరెడ్డి, ఎఫ్1హెచ్2వో ప్రెసిడెంట్ నికోదేశాన్ డిర్మానో, యుఐఎం చైర్మన్ గాయస్ రఫాయల్, పర్యాటక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, టూరిజం అథారిటీ ఎండీ హిమాన్షు శుక్లా, కృష్ణా జిల్లా కలెక్టర్ బి.లక్ష్మీకాంతం తదితరులు పాల్గొన్నారు. అయితే బోట్ రేసింగ్ కోసంమీడియాకు జారీచేసే పాసుల జారీని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించారు. వారు ఒక్కో పాసును రూ. 500 చొప్పున బయటవారికి విక్రయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ విషయంపై గందరగోళ పరిస్థితి నెలకొంది. వచ్చే నెల 30న బీసీ సదస్సు డిసెంబర్ 30న రాజమహేంద్రవరంలో జయహో పేరుతో బీసీ సదస్సు నిర్వహించాలని నిర్ణయించినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ సదస్సుకు సన్నాహకంగా రెండురోజులుగా జరుగుతున్న వర్క్‌షాపు ముగింపు సమావేశం శుక్రవారం ఉండవల్లి గ్రీవెన్స్ హాలులో జరిగింది. ఈ సదస్సులో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ బీసీలకోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సదస్సుకు సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
ఆహ్లాదం.. ఆహ్వానం
సాక్షి, విజయవాడ :ఒక వైపు ఎఫ్1హెచ్2ఓ పవర్ బోట్ రేసింగ్ చాంపియన్ షిప్.. మరో వైపు గ్లోబల్ మ్యూజికల్ ఫెస్టివల్.. ఇంకో వైపు గగన విన్యాసాలు (ఎయిర్ షో).. మధ్యలో భారతదేశ సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబించే శిల్పారామం ఎగ్జిబిషన్. వావ్.. ఇన్ని మెగా ఈవెంట్లను కొద్ది రోజుల తేడాలో ఒకే ప్రదేశంలో చూసే అవకాశం లభించటం చాలా అరుదుగా లభిస్తుంది కదూ. విజయవాడ నగర ప్రజలకు కనుల పండుగే. ప్రపంచ వ్యాప్తంగా ముఖ్యమైన దేశాల్లో జరిగే ఎఫ్1హెచ్2ఓ పవర్ బోట్ రేసింగ్ చాంపియన్ షిప్ పోటీలకు ఆంధ్రప్రదేశ్‌లో అందునా అమరావతిని ఎంపిక చేయటం ఒక అదృష్టంగా చెప్పవచ్చు. దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు రానున్న నేపథ్యంలో అధికారులు పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ నగరం ఆహ్లాదానికి కేరాఫ్‌గా మారి ఆహ్వానిస్తోంది. పున్నమిఘాట్లో మూడు రోజులు పండు వెన్నెల కురియనుంది. శుక్రవారం నుంచి కృష్ణా నదిలో ఎఫ్1హెచ్2ఓ బోట్ రేసింగ్‌కు సర్వం సిద్ధమైంది. ఎయిర్‌షోకు వేదిక కాబోతోంది. ఇప్పటికే వివిధ దేశాల నుంచి ఎయిర్‌షో పారాచూట్లు బెజవాడకు చేరుకున్నాయి. నగరానికి కొత్త లుక్ తెచ్చిపెట్టాయి. సిద్ధమవుతున్న ఎఫ్1హెచ్2ఓ పార్క్ చిన్నారులకు సంతోషాలు పంచనుంది. మొత్తమీద పర్యాటకులకు కనువిందు అందబోతోంది. -
హుషారెత్తించిన పడవ పోటీలు
-
అరేబియా సముద్రం.. అద్భుత ద్వీపం
‘ నీలిరంగు పులుముకున్న సముద్రం మధ్య నుంచి పడమర వైపు 14 నాట్స్ వేగంతో నౌకాయానం.. సినిమాల్లో తప్ప చూడని నౌకలో సుమారు 900 కిలోమీటర్ల దూర ప్రయాణం.. ప్రపంచపటంలో చుక్కల్లా కనిపించే ద్వీపాల్లో విహారం.. సముద్రజలాల్లో స్నోర్కలింగ్, కాయాకింగ్, స్కూబా డైవింగ్.. సాగర లోతుల్లో వెలుగులు వెదజల్లే కోరల్ ప్లాంట్స్, రంగురంగుల చేపలు, ఇతర జీవరాశుల సమీప వీక్షణం.. రాత్రి వేళ నడిసంద్రంలోని నౌకలోనే నిద్ర... ఊహిస్తేనే విహరించాలని మనసు ఉరకలేస్తుంది కదూ... అదే వెళ్లొస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి..! గత నెల 27న కేరళ రాజధాని కొచ్చి నుంచి అరేబియా సముద్రంలోని కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్‌కు 50 మంది నగర వాసులు వెళ్లి... ఉరకలెత్తించిన ఉత్సాహంతో తిరిగొచ్చారు. వారితో పాటే ‘సాక్షి’ కూడా సాగరయానం చేసి... లక్షద్వీప్‌లోని రెండు ద్వీపాల్లోని అందాలు నగర వాసులను ఎంతగా అబ్బురపరిచాయో పరిశీలించింది. నాలుగు రాత్రులు... ఐదు రోజుల పాటు సాగిన ఈ పర్యటనపై ప్రత్యేక కథనం... టూర్ ప్రత్యేకత ఏమిటంటే.. కేంద్ర ప్రభుత్వ పాలన(యూటీ)లో ఉన్న లక్షద్వీప్ గురించి తెలియని వారుండరు. అరేబియా సముద్రంలో దేశ సరిహద్దు లోపల ఇప్పటి వరకు గుర్తించిన 36 ద్వీపాలు కలిపి లక్షద్వీప్(1973కు ముందు పేరు లక్కదివ్వాస్) జిల్లా. అయితే ఇందులో కేవలం పది ద్వీపాల్లోనే జన జీవనం. ఈ ద్వీపాల్లోని రెండో అతిపెద్ద ద్వీపం ‘మినీకాయ్’(మొదటిది అంద్రోథ్). మినీకాయ్ ద్వీపంలోని జనాభా 12 వేల లోపే. లక్షద్వీప్ పర్యాటక శాఖ ఈ ద్వీపంలో ‘2వ మినీకాయ్ ఫెస్ట్- 2013’ పేరుతో డిసెంబర్ 28,29 తేదీల్లో ఉత్సవాలను నిర్వహించింది. ప్రత్యేక ఆఫర్ల ద్వారా దేశ వ్యాప్తంగా పర్యాటకులను ఆహ్వానించింది. ఈ మేరకు వివిధ రాష్ట్రాల్లోని టూర్ ఆపరేటర్ల ద్వారా 250 మంది పర్యాటకులతో ఈ యాత్ర మొదలైంది. నగరం నుంచి తొలిసారి ఓ ప్రయివేట్ ట్రావెల్స్ సంస్థ ద్వారా అత్యధికంగా 50 మంది నగరవాసులు తరలివెళ్లారు. నౌకలోని మిగతా యాత్రికుల్లో 50 శాతం కేరళవాసులే. హైదరాబాద్ నుంచి డిసెంబర్ 27 ఉదయానికి కొచ్చి చేరిన తరువాత అక్కడి నుంచి టూర్ మొదలైంది. సముద్రయానం సాగిందిలా.. ఉదయం 11 గంటల నుంచి కొచ్చిలోని విల్లింగ్టన్ ఐలాండ్‌లో ఉన్న లక్షద్వీప్ రిపోర్టింగ్ సెంటర్‌కు ప్రయాణికులంతా చేరుకున్నారు. బోర్డింగ్ పాస్‌లు తీసుకొని సెక్యూరిటీ చెక్ తర్వాత సమీపంలోని కొచ్చి డాక్‌యార్డ్‌కు వెళ్లారు. అక్కడ సిద్ధంగా ఉన్న నాలుగంతస్తుల ‘లక్షద్వీప్ సీ’ నౌక ద్వారా మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రయాణం మొదలైంది. 250 మంది కెపాసిటీ గల ఈ నౌక 14 నాట్స్ వేగంతో 215 నాటికల్ మైళ్లు(398 కి.మీ) ప్రయాణించి మరుసటి రోజు (28న) ఉదయం 9 గంటలకు మినీకాయ్ ద్వీపం సమీపానికి చేరుకుంది. అక్కడ్నుంచి మోటార్ బోట్ల ద్వారా మరో 5 కిలోమీటర్లు సముద్రంలోనే ప్రయాణించి మినీకాయ్ చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సాగరతీరంలో ఉత్సవాలు మొదలయ్యాయి. స్థానికులు పాల్గొన్న బోట్ రేసింగ్, స్విమ్మింగ్ క్రీడలు పర్యాటకుల్ని ఆకర్షించాయి. సాయంత్రం స్థానిక స్టేడియంలో ఎగ్జిబిషన్‌తో పాటు 6 ద్వీపాలకు చెందిన జట్లతో టగ్ ఆఫ్ వార్ పోటీలు, స్థానిక కళాకారుల ప్రదర్శనలు ఔరా అనిపించాయి.