ఒరెగాన్‌లోని హ్యాపీ వ్యాలీకి చెందిన గ్యారీ క్రిస్టెన్‌సెన్ అసాధారణమైన గిన్నిస్ రికార్డు సాధించాడు. ఓ బారీ గుమ్మడికాయను పడవగా మార్చి ఏకంగా కొలంబియా నదిలో 26 గంటలు ప్రయాణించి ఈ రికార్డు సృష్టించాడు. ఆయన వాషింగ్టన్‌లోని నార్త్ బోన్నెవిల్లే నుంచి ప్రారంభించి.. 73.50 కిమీ దూరంలో కెనడాలో ఉన్న వాంకోవర్ వరకు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ రికార్డుని నెలకొల్పాడు.
ఆయన 2011 నుంచి అతి పెద్ద గుమ్మడి కాయలను పెంచడం ప్రారంభించాడు. అలా 2013లో అతిపెద్ద గుమ్మడికాయతో తొలిసారిగా పడవ తయారు చేసి ‘వెస్ట్‌కోస్ట్ జెయింట్ పంప్‌కిన్ రెగట్టా’ పోటీల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి గ్యారీకి ఇలా భారీ గుమ్మడికాయలను పండించడం వాటిని పడవగా మలచడం ఒక అలవాటుగా మారింది.
ఆ క్రమంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డుపై దృష్టసారించాడు. అందుకోసం గ్యారీ అక్టోబర్ 4న 556 కిలోల భారీ గుమ్మడికాయను పండించాడు. ఆ తర్వాత అక్టోబర్5న అధికారుల సమక్షంలోనే పడవగా తయారు చేసి తన సాహసకృత్యాన్ని ప్రారంభించారు. ఇక అధికారులు ఆ పడవకి ఒక కెమెరాను అమర్చి గ్యారీ ప్రయాణాన్ని రికార్డు చేశారు. అలా గ్యారీ గుమ్మడి కాయ పడవతో ఏకాధాటిగా ప్రయాణించి ఈ ప్రపంచ రికార్డుని సాధించాడు.
(చదవండి: కింగ్ చార్లెస్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!)
Comments
Please login to add a commentAdd a comment