రికార్డుతో ఆటలు... రెడ్‌లైట్... గ్రీన్‌లైట్.. పిల్లలాడుకునే ఆట. కానీ 1415 మంది యూనివర్సిటీ విద్యార్థులు ఆడి రికార్డు సృష్టించారు. గతంలో 1203 మంది విద్యార్థులు నెలకొల్పిన రికార్డును కాలిఫోర్ని యా ఇర్వైన్ యూనివర్సిటీ స్టూడెంట్స్ బద్దలు కొట్టారు. ఈ క్రెడిటంతా దక్షిణ కొరియా డ్రామా ‘స్క్విడ్ గేమ్’దేనంటున్నారు. ఇదంతా ఎందుకు అంటే... లాస్ట్ ఇయర్ క్లాసులన్నీ ఆన్‌లైన్‌లోనే జరిగాయి.
మిగతా విద్యార్థులెలా ఉన్నా.. ఫస్ట్ ఇయర్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు, ఈ ఇయర్ వస్తున్న వారికి యూనివర్సిటీ కొత్త. ఈ ఏడాది వెల్‌కమ్ వీక్‌ను భిన్నంగా నిర్వహించాలకుని, ఈ ఆటతో రికార్డు నెలకొల్పింది. విద్యార్థులు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఏ ఆటనే విషయం పక్కన పెడితే... ఆడటం బాగుందని సీనియర్ విద్యార్థులు సైతం అంటున్నారు. యూనివర్సిటీకి ఈ రికార్డులు కొత్తేం కాదు.. 2012 డాడ్జ్‌బాల్, 2013లో వాటర్ పిస్టల్ ఫైట్, 2015 క్యాప్చర్ ద ఫ్లాగ్ లార్జెస్ట్ గేమ్, 2017లో బెలూన్ ట్యాగ్‌తో రికార్డులు సృష్టించింది.
🚦💙💛🐜🍽 Anteaters have done it again! With a crowd of 1,415 UCI has broken the Guinness World Records title for largest game of Red Light/Green Light. #UCIWelcome pic.twitter.com/PYwKgp8i5O
— UC Irvine (@UCIrvine) September 21, 2022
Comments
Please login to add a commentAdd a comment