
పై ఫొటోలో అమ్మాయిని చూశారా? స్ప్రింగ్‌లు మింగినట్లుగా వెన్నును మెలి తిప్పింది కదా! అందుకే...ప్రపంచంలోనే అత్యంత ఫ్లెక్సిబుల్ గాళ్‌గా రికార్డు సృష్టించింది. యూకేలోని పీటర్‌బరోకు చెందిన 14 ఏళ్ల లిబర్టీ బారోస్.. జిమ్నాస్ట్. 30 సెకన్లలో ఛాతీని ఫ్లోర్ వరకు పదకొండుసార్లు వంచేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పింది.
తనకు మాత్రమే సొంతమైన ఈ బెండ్‌కు ‘ద లిబర్టీ లోడౌన్’అని పేరు కూడా పెట్టింది. 2017లో ఓసారి.. రిహన్నా అంబ్రెల్లా డ్యాన్స్ మూవ్స్ ప్రాక్టీస్ చేస్తుండగా తన శరీరాన్ని ఎలాగైనా వంచగలనని తెలుసుకున్న లిబర్టీ.. అప్పటినుంచి తన శరీరాన్ని స్ప్రింగ్‌లా తిప్పేస్తూ బోలెడు క్రేజ్ సంపాదించుకుంది.
Comments
Please login to add a commentAdd a comment