Pumpkin
-
వాట్ ఏ రికార్డ్!..గుమ్మడికాయ పడవతో 26 గంటలు..
ఒరెగాన్లోని హ్యాపీ వ్యాలీకి చెందిన గ్యారీ క్రిస్టెన్సెన్ అసాధారణమైన గిన్నిస్ రికార్డు సాధించాడు. ఓ బారీ గుమ్మడికాయను పడవగా మార్చి ఏకంగా కొలంబియా నదిలో 26 గంటలు ప్రయాణించి ఈ రికార్డు సృష్టించాడు. ఆయన వాషింగ్టన్‌లోని నార్త్ బోన్నెవిల్లే నుంచి ప్రారంభించి.. 73.50 కిమీ దూరంలో కెనడాలో ఉన్న వాంకోవర్ వరకు సుదీర్ఘ ప్రయాణం చేసి ఈ రికార్డుని నెలకొల్పాడు. ఆయన 2011 నుంచి అతి పెద్ద గుమ్మడి కాయలను పెంచడం ప్రారంభించాడు. అలా 2013లో అతిపెద్ద గుమ్మడికాయతో తొలిసారిగా పడవ తయారు చేసి ‘వెస్ట్‌కోస్ట్ జెయింట్ పంప్కిన్ రెగట్టా’ పోటీల్లో విజయం సాధించారు. అప్పటి నుంచి గ్యారీకి ఇలా భారీ గుమ్మడికాయలను పండించడం వాటిని పడవగా మలచడం ఒక అలవాటుగా మారింది. ఆ క్రమంలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డుపై దృష్టసారించాడు. అందుకోసం గ్యారీ అక్టోబర్ 4న 556 కిలోల భారీ గుమ్మడికాయను పండించాడు. ఆ తర్వాత అక్టోబర్5న అధికారుల సమక్షంలోనే పడవగా తయారు చేసి తన సాహసకృత్యాన్ని ప్రారంభించారు. ఇక అధికారులు ఆ పడవకి ఒక కెమెరాను అమర్చి గ్యారీ ప్రయాణాన్ని రికార్డు చేశారు. అలా గ్యారీ గుమ్మడి కాయ పడవతో ఏకాధాటిగా ప్రయాణించి ఈ ప్రపంచ రికార్డుని సాధించాడు. (చదవండి: కింగ్ చార్లెస్ ఇష్టపడే భారతీయ వంటకాలివే..!) -
ప్రపంచ రికార్డు కోసం 1,121కిలోల గుమ్మడికాయ (ఫొటోలు)
-
Pumpkin Halwa: టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెసిపీ, అలా.. వెన్నలా..
గుమ్మడి కాయలు రెండు రకాలు. రెండూ తీగ జాతికి చెందినవే. తీపి గుమ్మడి, లేదా కూర గుమ్మడి, రెండోది బూడిద గుమ్మడి. తీపి గుమ్మడికాయతో పులుసు కూరలు, స్వీట్ చేసుకుంటారు. బూడిద గుమ్మడికాయతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వడియాలు పెట్టుకుంటారు. మరికొన్ని చోట్ల బూడిద గుమ్మడితో స్పెషల్ స్పీట్ చెస్తారు. అయితే ఈరోజు తీపి గుమ్మడితో చేసే హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. గుమ్మడికాయ హల్వా, కావాల్సిన పదార్థాలుతీపి గుమ్మడికాయ - ఒకటి, పాలు - రెండు కప్పులు, యాలకుల పొడి - ఒక స్పూను, నెయ్యి - రెండు స్పూన్లు, జీడిపప్పు, బాదం కలిపి - అర కప్పు, కోవా - ఒక కప్పు, చక్కెర లేదా బెల్లం - ఒక కప్పు (గుమ్మడికాయ ఎలాగూ తీయగా ఉంటుంది కాబట్టి పెద్దగా తీపి అవసరంలేదు) కిస్మిస్ : కాసిన్నితయారీ విధానం మంచి తీపి గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసి ఉంచుకోవాలి. దీన్ని సన్నగా తురుముకోవాలి.ముందుగా జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా బాదం పప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని, కొద్గాది నెయ్యి వేసుకోవాలి. తరువాత గుమ్మడికాయ తురుము వేసి , సన్నని మంటమీద వేయించుకోవాలి. పచ్చివాసన పోగానే పాలు పోసి బాగా ఉడికించాలి. అది కాస్త చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కోవా వేసుకొని బాగా కలపాలి. బెల్లం అయితే హల్వా చక్కటి రంగు వస్తుంది. పది నిమిషాల ఉడికిన తరువాత దగ్గరగా వస్తుంది. నెయ్యి పైకి తేలుతుంది. ఇపుడు చిన్నమంట మీద ఉంచి మరికాసేపు ఉంచి, మంటను ఆపేయాలి. దీన్నిఒక బౌల్లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్లో గార్నిష్ చేసుకోవడమే. తడి తగలకుండా ఉంటే ఇది నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుంది. -
మొనాలిసా పెయింటింగ్‌పైకి సూప్ స్ప్రే
పారిస్: ప్రపంచ ప్రఖ్యాత మొనాలిసా పెయింటింగ్‌పైకి పర్యావరణ ఉద్యమకారులు సూప్‌ను స్ప్రే చేశారు. అయితే, పెయింటింగ్‌కు గ్లాస్ రక్షణ ఉండటంతో ఎటువంటి నష్ట వాటిల్లలేదు. 16వ శతాబ్దంలో ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డా విన్సీ చేతుల్లో రూపుదిద్దుకున్న మొనాలిసా చిత్రం ప్రస్తుతం సెంట్రల్ పారిస్‌లోని లౌవ్రె ప్రదర్శనశాలలో ఉంది. శుక్రవారం ఉదయం ‘రిపోస్టె అలిమెంటయిర్’అనే గ్రూపునకు చెందిన ఇద్దరు మహిళా ఉద్యమకారులు గుమ్మడి సూప్‌ను మొనాలిసా పెయింటింగ్‌పైకి స్ప్రే చేశారు. అనంతరం వారు ‘కళ, ఆరోగ్యకరమైన సుస్థిరమైన ఆహార హక్కుల్లో ఏది ముఖ్యమైంది? వ్యవసాయరంగం సమస్యల్లో ఉంది. రైతులు చనిపోతున్నారు. ప్రభుత్వం స్పందించాలి’అని డిమాండ్ చేశారు. మ్యూజియం సిబ్బంది వెంటనే వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించారు. పెయింటింగ్‌ను తొలగించి, శుభ్రం చేశాక గంట తర్వాత తిరిగి ప్రదర్శనకు ఉంచారు. మన వారసత్వం మాదిరిగానే ఈ పెయింటింగ్ భవిష్యత్ తరాలకు చెందాల్సిందని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యమకారుల వాదనలో అర్థం లేదని కొట్టిపారేసింది. ఇంధన ధరలు పెరిగాయని, నియంత్రణలు ఎక్కువయ్యాయంటూ శుక్రవారం రైతులు పారిస్‌ను దిగ్బంధించారు. గతంలోనూ దెబ్బతింది ప్రదర్శనకు ఉంచిన మొనాలిసా చిత్రంపై 1950లో ఓ సందర్శకుడు యాసిడ్ పోశాడు. దీంతో, పెయింటింగ్ దెబ్బతింది. అప్పటి నుంచి పెయింటింగ్‌కు రక్షణగా గ్లాస్‌ను ఏర్పాటు చేశారు. 2019లో పారదర్శకమైన బుల్లెట్‌ప్రూఫ్ అద్దాన్ని రక్షణగా బిగించారు. 2022లో ఓ ఉద్యమకారుడు భూ గ్రహాన్ని కాపాడాలని కోరుతూ పెయింటింగ్‌పైకి కేక్‌ను విసిరేశాడు. -
నడిరోడ్డుపై హిజ్రాతో పూజలు.. ఎస్ఐ తీరు చూసి షాక్‌లో ప్రయాణీకులు!
చెన్నై: రోడ్డు ప్రమాదాల కారణంగా వాహనదారులు చనిపోతే.. పోలీసులు ఏం చేస్తారు?. ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటారు. హెచ్చరికల బోర్డులు అక్కడ పెడతారు. కానీ, ఓ పోలీసు అధికారి మాత్రం దుష్టశక్తుల కారణంగానే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని భావించి.. వినూత్నంగా ఆలోచించాడు. మూఢ నమ్మకంతో ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డుపై హిజ్రాతో పూజలు చేయించాడు. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో, అధికారులు సదరు పోలీసులపై చర్యలు తీసుకున్నారు. ఈ షాకింగ్ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. చెన్నైలోని వనాగారం, మధురవాయల్ సమీపంలోని రహదారిలో ఇటీవలి కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగాయి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ ఎస్ఐ పళని సొంత నిర్ణయం తీసుకున్నాడు. శుక్రవారం ఉదయం ఒక హిజ్రాను పోలీస్ వాహనంలో అక్కడకు రప్పించాడు. ఎక్కువ ప్రమాదాలు జరిగే రోడ్డు ప్రాంతంలో పూజలు చేయించాడు. ఆ హిజ్రా గుమ్మడికాయ, నిమ్మకాయలతో ఆ రోడ్డుకు దిష్టి తీసింది. అనంతరం వాటిని నేలకేసి కొట్టింది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక, ఈ వీడియో పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి చేరింది. దీనిపై ట్రాఫిక్ అడిషనల్ కమిషనర్ కపిల్ కుమార్ శరత్కర్ స్పందించారు. ట్రాఫిక్ ఎస్ఐ పళనిని ఆ విధుల నుంచి తప్పించడంతోపాటు కంట్రోల్ రూమ్‌కు రిపోర్ట్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా కపిల్ కుమార్ మాట్లాడుతూ.. పోలీసులు అయి ఉండి తన వృత్తికి వ్యతిరేకంగా వ్యవహరించాడు. తన వ్యక్తిగత నమ్మకంతో అలా రోడ్డుపై పూజలు చేయడం కరెక్ట్ కాదు. రోడ్డు ప్రమాదాలకు దారితీసే కారణాలను శాస్త్రీయంగా విశ్లేషించి నివారణకు చర్యలు చేపట్టాలి. దుష్టశక్తిని తరిమే పేరుతో ఇలాంటి పూజలు చేయడం సరికాదని పేర్కొన్నారు. అతడిపై చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు. Cops break pumpkin on Chennai road to ward off evil; SI booted outhttps://t.co/Rl3XEZHFOf pic.twitter.com/dBDmoKqq4W — TOIChennai (@TOIChennai) June 10, 2023 ఇది కూడా చదవండి: దేశంలో తొలిసారి.. ముంబై అరుదైన ఘనత.. -
Health Tips: కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి విముక్తికై ఇలా!
Health Tips In Telugu: గుమ్మడి గింజల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. పొటాషియం, మెగ్నీషియం ఇందులో ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తపోటును అదుపులో ఉంచుతాయి. ఫ్యాటీ ఫిష్ తినడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. చేపలలో ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి గుండెను ఫిట్‌గా ఉంచుతాయి. రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి. కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి విముక్తికై! ►అరకప్పు పెరుగులో చెంచా నిమ్మరసం, అరస్పూను ఉప్పు వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ►తులసి ఆకుల రసాన్ని తీసి దానికి ఒక చెంచా తేనె కలిపి ఈ మిశ్రమాన్ని ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కిడ్నీ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. మరిన్ని ఆరోగ్య చిట్కాలు ►పుదీనా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆహారంలో ఫ్యాట్ ఎక్కువుగా ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో పుదీనా తీసుకుంటే అజీర్తి సమస్య ఉండదు. ►పైత్యం, ఆ కారణంగా తలతిప్పటం వంటి సమస్యలున్నప్పుడు జీలకర్రను మెత్తగా గ్రైండ్ చేసి ఆ పేస్ట్‌ను నీటిలో కలిపి తాగాలి. ఇలా రెండు రోజుల పాటు రోజుకు రెండుసార్లు చేయాలి. ►పొట్టకి సంబంధించిన పలు సమస్యలకు వెల్లుల్లి మంచి మందు, ఒకటి రెండు రెబ్బల వెల్లుల్లిని మెత్తగా నూరి ఆ రసాన్ని అరకప్పు నీటిలో కలిపి తాగడం వల్ల అరుగుదల సమస్య దూరం అవుతుంది. దాంతోపాటు పొట్టలో పురుగులు, శరీరంలోని విషపదార్ధాలు నశిస్తాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! వైద్యుడిని సంప్రదించిన తర్వాతే సమస్యకు తగిన పరిష్కారం పొందే అవకాశం ఉంటుంది. చదవండి: వేలెడంత సైజు.. వండుకుని తింటే.. ఆ టెస్టే వేరు! Sia: ఇకపై పాత చెప్పులు, షూస్ పారేసే ముందు ఒక్కసారి ఆలోచించండి! మీ వల్ల ఎంతో మందికి.. -
పేద్ద.. గుమ్మడి: బరువు 1161 కిలోలు.. రికార్డులు బద్దలు!
వాషింగ్టన్: గుమ్మడికాయ అంటే గరిష్ఠంగా 10-20 కిలోల వరకు ఉంటుందని చాలా మందికి తెలుసు. కానీ, వెయ్యి కిలోల గుమ్మడిని ఎప్పుడైనా చూశారా? అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలోని హాఫ్ మూన్ బే సిటీలో జరిగిన పోటీల్లో ఏకంగా 2,560 పౌండ్లు(1161 కిలోలు) బరువైన గుమ్మడికాయను ప్రదర్శించి జాతీయ రికార్డును బద్దలుకొట్టారు ట్రావిస్ జింజర్ అనే ఉద్యానవన ఉపాధ్యాయుడు. హాఫ్ మూన్ బే సిటీలో మంగళవారం 49వ ప్రపంచ స్థాయి బరువైన గుమ్మడికాయల పోటీని నిర్వహించారు. ఈ పోటీకి భారీ గుమ్మడికాయను మిన్నెసోటా నుంచి తీసుకొచ్చేందుకు ఏకంగా 35 గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చిందని తెలిపారు ట్రావిస్ జింజర్. ఆ రెండు రోజుల ప్రయాణంలో గుమ్మడికాయను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లు చెప్పారు. దానిని ప్లాస్టిక్, తడి బ్లాంకెట్లతో చుట్టి ఉంచామన్నారు. ‘మిన్నెసోటాలో వాతావరణ పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. గుమ్మడి సాగుకు ప్రతికూలమనే చెప్పాలి. రోజుకు 75 గ్యాలన్ల నీటిని అందించాలి. భారీ గుమ్మడికాయను తీసుకొచ్చి పోటీలో గెలుపొందటం చాలా సంతోషంగా ఉంది.’ అని తెలిపారు. 2020లోనూ జింజర్ పోటీలో గెలుపొందారు. గతవారం నమోదైన 2,554 పౌండ్ల బరువు గుమ్మడికాయ రికార్డును తాజాగా ఆయన బద్ధలు కొట్టారు. Travis Gienger, a horticulture teacher from Minnesota, set a new U.S. record Monday for the heaviest pumpkin after raising one weighing 2,560 pounds. https://t.co/T8vuqaCD2N pic.twitter.com/AbUj3cYwol — CBS News (@CBSNews) October 11, 2022 ఇదీ చదవండి: నీ పిచ్చి తగలెయ్య.. అది బెడ్రూం కాదురా అయ్యా!.. నడి రోడ్డు.. -
భారీ గుమ్మడిపండును డొల్లగా చేసి.. దానినే పడవగా మార్చి.. నదిని దాటి.. ఆపై!
భారీ గుమ్మడిపండును డొల్లగా చేసి, దానినే పడవగా మార్చుకున్నాడు. గుమ్మడిపండు డొల్లలో కూర్చుని, తెడ్డు వేసుకుంటూ నదిని దాటేసి, గిన్నిస్ రికార్డు సాధించాడు. విచిత్రమైన ఈ రికార్డు సాధించిన వ్యక్తి వయసు అరవయ్యేళ్లు. అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన డ్యుయానే హాన్సెన్ ఆగస్టు 26న తన అరవయ్యో పుట్టినరోజు సందర్భంగా ఈ సాహసకృత్యానికి సిద్ధపడ్డాడు. పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుపుకున్న మరుసటి రోజునే మిసోరీ నది వద్దకు చేరుకుని, ఆగస్టు 27 ఉదయం 7.30 గంటలకు గుమ్మడి తెప్పలో ప్రయాణం మొదలుపెట్టాడు. ఈ భారీ గుమ్మడి తెప్ప విస్తీర్ణం 146 అంగుళాలు. ఇందులో ఇంచక్కా కూర్చుని, తెడ్డు వేసుకుంటూ ముందుకు సాగాడు. మధ్యాహ్నం 2.52 గంటలకు విజయవంతంగా 38 మైళ్ల ప్రయాణం పూర్తిచేసుకున్నాడు. అయోవా రాష్ట్ర సరిహద్దుల్లోని అవతలి ఒడ్డుకు చేరుకుని, గిన్నిస్ రికార్డు నెలకొల్పాడు. ఇదివరకు రిక్ స్వెన్సన్ అనే వ్యక్తి ఇలాగే గుమ్మడి తెప్పలో 25.5 మైళ్ల దూరం ప్రయాణించాడు. రిక్ 2016లో మిన్నెసోటాలోని నార్త్ డకోటా నుంచి బ్రెకెన్రిడ్జ్ వరకు ప్రయాణించి నెలకొల్పిన రికార్డును డ్యుయానే హాన్సెన్ తిరగ రాశాడు. ఈ రికార్డు కోసం డ్యుయానే చాలానే కష్టపడ్డాడు. తన పెరటితోటలో పదేళ్లు శ్రమించి, 384 కిలోల భారీ గుమ్మడిని అపురూపంగా పెంచి, దానిని జాగ్రత్తగా డొల్లగా మార్చి, తెప్పలా తయారు చేసుకున్నాడు. చదవండి: జంతువుల మాదిరిగానే.. మనుషులకు తోక! -
ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకుంటే!
బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, భుజాలు, కీళ్ల నొప్పులు... ఇలా అనేక రకాలుగా ఎముకల బలహీనత వల్ల శరీరంలో నొప్పులు బాధిస్తుంటాయి. కాల్షియం లోపం ఇందుకు ప్రధాన కారణం. ఎముకల నొప్పులు తగ్గాలంటే మంచి ఉపాయం ఒకటుంది. మూడురకాల గింజల పొడుల మిశ్రమం ఎముకల పటిష్టతకు తోడ్పడి నొప్పులు శాశ్వతంగా దూరం అవుతాయి. ఈ మూడురకాల గింజలు తేలిగ్గా మార్కెట్లో దొరికేవే. ఒకసారి ప్రయత్నించి చూడండి. అవిశె గింజలు, సబ్జాగింజలు, గుమ్మడి గింజలు.. ఈ మూడు రకాల గింజల వినియోగం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. అవిశ గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) ఫ్లాక్స్ సీడ్స్ ఒమెగా 3 పోషకాల గని. కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఒమెగా 3 శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే వీటిల్లో ఉంటే కాల్షియం ఎముకలను పటిష్టం చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ అధిక ఆకలిని తగ్గించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది. సబ్జా గింజలు (చియా సీడ్స్) సబ్జా గింజలు లేదా చియా సీడ్స్‌లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం ఎముకలు పటిష్టంగా ఉండేలా తోడ్పాటు అందిస్తాయి. ఇందులో కూడా ఒమెగా 3 ఉంటుంది. అలాగే చియా సీడ్స్ యాంటీ ఆక్సిడంట్స్‌గా పనిచేస్తాయి. గుమ్మడి గింజలు (పంప్కిన్ సీడ్స్) ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఒమెగా 3, మెగ్నీషియం, జింక్ పోషకాలు ఉంటాయి. బాగా శక్తినివ్వడంతో పాటు మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎలా తయారు చేయాలి? అవిశ గింజలు, చియా సీడ్స్, గుమ్మడి గింజలను సమపాళ్లలో తీసుకుని వేర్వేరుగా వేయించుకోవాలి ఉదాహరణకు ఒకరకం గింజలను 100 గ్రాములు తీసుకుంటే మిగిలిన వాటిని కూడా వంద వంద గ్రాములే తీసుకోవాలి. దోరగా వేగిన తరువాత చల్లార్చి మిక్సీలో వేర్వేరుగా పొడి చేసుకోవాలి. మిక్సీ వేయడం పూర్తయ్యాక మూడు పొడులను కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. రోజూ ఈ మిశ్రమం నుంచి టీ స్పూన్ పొడిని మజ్జిగలో కలుపుకొని తాగాలి లేదా అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు. ఇలా కొద్దిరోజులు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ ఎముకల నొప్పులు, నడుము నొప్పి మాయం అవడమే కాకుండా.. మళ్లీ నొప్పులు రావు. చదవండి: Amarnath Vasireddy: కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! అన్నం ఎక్కువ తిన్నారో! -
గుమ్మడి గింజలు: ఎవరు తినకూడదు? ఎవరు తినవచ్చు!
సాధారణంగా గుమ్మడి కాయల్ని కూరగా చేసుకుంటాం. లేదా స్వీట్ చేసుకుంటాం. గింజల్ని పక్కన పారేస్తుంటాం. అయితే కరోనా మహమ్మారి తరువాత డ్రైఫ్రూట్స్, నట్స్‌తో పాటు గుమ్మడి గింజల వాడకం బాగా పెరిగింది. ఈ సీడ్స్లోని పోషక విలువలు మన శరీరానికి, ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయట. అయితే కొన్ని సమస్యలు ఉన్నవారు గుమ్మడికాయ విత్తనాల్ని తినకూడదు. ఎందుకలా? వాచ్‌దిస్ స్టోరీ.. గుమ్మడికాయ గింజలు చాలా ప్రయోజనాలను కలిగి ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.. ఇందులో కొవ్వు ఆమ్లాలు, భాస్వరం, పొటాషియం, జింక్ లాంటి అవసరమైన అమైనో ఆమ్లాలు, ఫినోలిక్ సమ్మేళనాలు కలిగి ఉంటాయి. మధుమేహం, గుండె జబ్బులు, కండరాలు, ఎముకల నొప్పి నివారణకు ఉపయోగపడతాయి. హైబీపీని తగ్గిస్తాయి. వీటిని తింటే రుచికి రుచికితోపాటు శక్తికి శక్తిని అందిస్తాయి. వీటిల్లో ఏ సీ ఈ విటమిన్లతోపాటు, ఐరన్, కాల్షియం, జింక్, ఫోలేట్ వంటి పోషకాలు అధికంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా మంచిది. (Chocolate Day Story: వాలెంటైన్స్ డే వీక్, స్వీటెస్ట్ డే.. ‘చాక్లెట్ డే’) మంచిగా నిద్ర పట్టాలంటే గుమ్మడి గింజలు తింటే మంచి ఫలితం ఉంటుంది. అంతేనా జుట్టు రాలడం, మొటిమలను నియంత్రించడంతోపాటు, చర్మ సంరక్షణకు కూడా ఏజెంట్లుగా పనిచేస్తాయి. వీటిల్లో జింక్ పుష్కలంగా ఉండటంతో బట్టతల సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే గాయాలను నయం చేయడంలో సహాయ పడుతుంది. చర్మాన్ని యవ్వనంగా, ముడతలు లేకుండా ఉంచుతుంది గుమ్మడి గింజల నూనెలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, కెరోటిన్ ఉంటాయి. ఇంకా చర్మ సంబంధమైన దీర్ఘకాలిక మంటలు, బొబ్బలకు ఉపశమనం లభిస్తుంది. గుమ్మడికాయ గింజలలో యాంటీఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీమైక్రోబయల్, యాంటీ ఆర్థరైటిక్‌తోపాటు యాంటీ డయాబెటిక్ లక్షణాలున్నాయి. ఇవి క్యాన్సర్, మూత్రాశయ ఇన్ ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. గుమ్మడి గింజలు ఆరోగ్యకరమైన కొవ్వు, ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లకు నిలయం. అందుకే ఇవి ఊబకాయాన్ని నిరోధిస్తాయి. ఇది స్క్రబ్, లోషన్ రూపంలో లేదా మసాజ్ చేసినప్పుడు బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్ల నుంచి కూడా రక్షిస్తుంది. ఈ సీడ్స్ తినడం ద్వారా గుండె రక్త నాళాలు గడ్డలు రాకుండా నిరోధించవచ్చు. స్ట్రోక్ వంటి వివిధ గుండె సమస్యలను నివారించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ గింజల్లోని యాంటీ డయాబెటిక్ లక్షణం సుగర్‌ను అదుపులో ఉంచుతుంది. గర్భవతులు తినవచ్చా? అత్యంత పోషకాలతో ఈ సీడ్స్ గర్భధారణ సమయంలో వినియోగానికి పూర్తిగా సురక్షితమే. ఎలాంటి దుష్ప్రభావాలు ఇంతవరకు నమోదు కాలేదు. కానీ ఈ సమయంలో జాగ్రత్త వహించాలి. అసహనం, తలనొప్పి, కడుపునొప్పి, గ్యాస్ట్రిక్ ట్రబుల్స్, డమేరియా లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అలాగే గుమ్మడి గింజలు బీపీ సుగర్ లాంటి సమస్యలున్న గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మాత్రం డాక్టర్ల సూచన మేర తీసుకోవాలి. లోసుగర్ ఉన్నవాళ్లు లో-బీపీ సమస్య ఉన్నవారు తీసుకోకుండా ఉంటే మంచిది. ఈ విత్తనాలను మరీ ఎక్కువగా తింటే అజీర్ణ సమస్యలొచ్చే అవకాశం ఉందనేది గమనించాలి. ఇలా కొన్ని పరిమితులు తప్ప ఈ గింజలతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. -
Pumpkin Seeds: ఈ సీడ్స్ తింటున్నారా?
-
వామ్మో! ఈ గుమ్మడి కాయ 17 మంది బరువుతో సమానం
టుస్కానీ: గిన్నిస్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవటం కోసం రకరకాలగా ప్రయత్నిస్తుంటారు. కానీ ఒక రైతు మాత్రం విన్నూతనంగా అతి పెద్ద గుమ్మడియకాయను పండించి గిన్నిస్ రికార్డులో స్థానం దక్కించుకున్నాడు. అసలు ఎక్కడ జరిగింది ఏంటి చూద్దామా!. (చదవండి: చూడ్డానికి పిల్ల...కానీ చెరుకు గడలను ఎలా లాగించేస్తుందో!) వివరాల్లోకెళ్లితే.....టుస్కానీలోని చియాంటిలో రాడ్డా కమ్యూన్కు చెందిన రైతు స్టెఫానో కట్రుపి 2008 నుండి పెద్ద పెద్ద గుమ్మడికాయలను పెంచుతున్నాడు. అతను సెప్టెంబర్ 26, 2021న పిసా సమీపంలోని పెక్సియోలీలో జరిగిన కాంపియోనాటో డెల్లా జుకోన్ గుమ్మడికాయ పండుగలో ఈ అతి పెద్ద గుమ్మడి కాయను ప్రదర్శనకు తీసుకు వచ్చాడు. అంతేకాదు ఈ గుమ్మడి కాయ కేవలం మార్చి నుంచే మొలకెత్తడం ప్రారంభించింది అని కట్రుపి చెబుతున్నాడు . ఈ మేరకు కట్రుపి ఈ గుమ్మడి కాయ ఉత్పత్తి, నాణ్యత పరంగా పోటీకి సరిపోతుందని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్సైట్ ధృవీకరించిందని అన్నారు. ఈ క్రమంలో కట్రుపి మాట్లాడుతూ...వాతావరణ నియంత్రణ అనేది అంకురోత్పత్తి నుండి పంట వరకు కీలకమైన అంశం. అంతేకాదు మొక్కలు మంచిగా కాయలు కాయలంటే వేడి చేయడం, చల్లబరచడం, షేడింగ్ చేయడం, మంచు తుడవడం, అవసరమైనప్పుడు నీరు పోయడం వంటివి అవసరం, ” అని చెప్పాడు. అంతేకాదు 2020లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్సైట్ ధృవీకరించిన బరువు, చుట్టుకొలతల్లో అతి పెద్ద జాక్ ఓలాంతర్న్ తర్వాత ఈ బరువైన గుమ్మిడికాయ నిలుస్తుందని స్పష్టం చేసింది. (చదవండి: వాట్ ఏ ఎక్స్ప్రెషన్స్...ఎవ్వరికైనా నవ్వు రావల్సిందే....) View this post on Instagram A post shared by Guinness World Records (@guinnessworldrecords) -
ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే గుమ్మడి..
►గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల ఆరోగ్యానికి గుమ్మడి ఎంతగానో ఉపకరిస్తుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ సి వల్ల రక్తంలోని తెల్ల రక్తకణాలు వృద్ధి చెందేందుకు సహాయపడుతుంది. అందువల్ల శరీరంలో రోగనిరోధక కణాలు శక్తివంతంగా పనిచేస్తాయి. ►గుమ్మడిలో కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ‘ఎ’ అధికంగా ఉంటుంది. ►రక్తపోటు తగ్గడంలోనూ గుమ్మడి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. పక్షవాతం రాకుండా కాపాడుతుంది. ►గుమ్మడిలో ఉండే బీటా కెరొటిన్ మన చర్మం మీద సూర్యకిరణాల ప్రభావం పడకుండా కాపాడుతుంది. ►గుమ్మడి గింజల్లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలైన ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. ►గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు గుమ్మడి గింజలు తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ►గుమ్మడి గింజలు ప్రతిరోజు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి. ►డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది. ►చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. ►ఏదైనా పరిమితంగా తీసుకోవాలి. ►గుమ్మడి అధికంగా తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి. ►ముఖ్యంగా మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ గింజలు తినేవారు మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. ►పండ్లతో పాటు పండ్ల రసాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి. -
కూరగాయలతోనే పొట్ట తగ్గించుకోండి
► కొంతమందికి పొట్ట వద్ద కొవ్వు పేరుకుపోయి చూడటానికి ఎబ్బెట్టుగా అనిపిస్తుంది. అయితే కూరగాయలతోనే ఈ కొవ్వును తగ్గించుకోవచ్చు. ► కొవ్వును కరిగించేందుకు గుమ్మడి కాయ తీసుకోవడం మంచిది. మంచి గుమ్మడితో కూర చేసుకుని తినడం, బూడిద గుమ్మడి జ్యూస్ చేసుకుని తాగడం మంచి ఫలితాలనిస్తుంది. ► ఆహారంలో పచ్చి మిరపకాయలను విరివిగా వాడటం ద్వారా కూడా కొవ్వు కరుగుతుందని నిపుణుల మాట. ► కాలీఫ్లవర్, క్యాబేజీలను మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీటిలో ఉండే పీచు పదార్థాలు పొట్ట పెరగడాన్ని ఆరోగ్యంగా అరికడతాయి. ► అదేవిధంగా వారానికి రెండు మూడు సార్లు పుట్టగొడుగులు తీసుకోవడం కూడా కొవ్వు కరిగించడానికి తోడ్పడుతుంది. పుట్టగొడుగుల్లో ఉన్న ప్రోటీన్లు మన శరీరంలో మెటబాలిజంను బాగా పెంచుతాయి. దీంతో కొవ్వు బాగా కరుగుతుంది. ► ఎక్కువ మోతాదులో ఆకుకూరలు తీసుకోవడమూ శరీరంలోని అదనపు కొవ్వు ను కరిగించడానికి తోడ్పడుతుంది. ఇక్కడ చదవండి: ఫోడ్మ్యాప్ ఆహారం అంటే..? ఈ ఆహారంతో అస్తమాకు చెక్! -
వేడివేడి గుమ్మడి
ఇంట్లో గుమ్మడి నెలలో మహా అయితే ఒకసారి కనిపించొచ్చు. తెలిసిన ఒకటీ అరా కూరలు దానితో చేస్తుండవచ్చు. గుమ్మడి రుచిలో మేటి... పోషకాలకు సాటి... అంతేకాదు ప్రయత్నించి చూస్తే పదహారు రకాల కూరలు కూడా చేసి ఆస్వాదించవచ్చు. ఇక్కడ ఎంచి ఎనిమిది ఇచ్చాం. మరో ఎనిమిది మీరు ట్రై చేయండి. గుమ్మడి రుచులతో కమ్మటి విందు చేసుకోండి. గుమ్మడి పాయసం కావలసినవి: గుమ్మడి కాయ తురుము – ఒక కప్పు; చిక్కటి పాలు – రెండున్నర కప్పులు; బాదం పప్పులు – 12; జీడిపప్పులు – 6; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; కిస్మిస్ – 10; బెల్లం తరుగు – 5 టేబుల్ స్పూన్లు; నెయ్యి – అర టీ స్పూను; పాల పొడి – 2 టేబుల్ స్పూన్లు. తయారీ: ►స్టౌ మీద బాణలిలో ఒకటిన్నర కప్పుల పాలు పోసి కొద్దిగా కాగిన తరవాత, గుమ్మడికాయ తురుము జత చేసి ఉడికించాలి ►బాదం పప్పులు, జీడి పప్పులు, ఏలకుల పొడి జత చేసి కలియబెట్టి, సుమారు పావుగంట సేపు ఉడికించాలి (మాడిపోకుండా మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►గుమ్మడికాయ తురుము బాగా మెత్తపడిందనుకున్నాక దింపి, చల్లారాక, మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో కప్పుడు పాలు, పాల పొడి జత చేసి, సన్నటి మంట మీద కాచాక, మెత్తగా చేసిన గుమ్మడికాయ తరుగు జత చేసి, బాగా ఉడికించాలి ►మిశ్రమం బాగా ఉడికి, చిక్కబడ్డాక బెల్లం తరుగు వేసి మరోమారు కలియబెట్టి, దింపేయాలి ►బెల్లం కరిగేవరకు గరిటెతో కలుపుతుండాలి ∙కిస్మిస్ జత చేయాలి ►బాదం పప్పు తరుగుతో అలంకరించి, బౌల్స్‌లోకి తీసుకుని, అందించాలి. కేరళ గుమ్మడి పచ్చడి కావలసినవి: తీపి గుమ్మడి కాయ – 300 గ్రా.; పసుపు – అర టీ స్పూను; బెల్లం తరుగు – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; మసాలా కోసం: తాజా కొబ్బరి తురుము – అర కప్పు; పచ్చి మిర్చి – 1; అల్లం తురుము – 1 టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు పోపు కోసం: నూనె – ఒక టీ స్పూను; ఆవాలు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు. తయారీ: ►గుమ్మడికాయను శుభ్రంగా కడిగి, పెద్ద పెద్ద ముక్కలుగా తరగాలి ►స్టౌ మీద కుకర్‌లో గుమ్మడికాయ ముక్కలు, తగినంత ఉప్పు, పసుపు, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టి, ఒక విజిల్ రాగానే దింపేసి, కుకర్ మీద చల్ల నీళ్లు పోసి, మూత తీసేయాలి ►గుమ్మడికాయ ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ►మసాలా కోసం తీసుకున్న పదార్థాలను మిక్సీలో వేసి కొద్దిగా మెత్తగా చేసి, బయటకు తీసి, గుమ్మడి కాయ ముక్కలకు జత చేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక, ఆవాలు, మినప్పప్పు, కరివేపాకు వేసి వేయించి, పచ్చడి మీద వేసి కలియబెట్టాలి ►ఈ పచ్చడి అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఒడిషా గుమ్మడి సెనగపప్పు బంగాళ దుంప కూర కావలసినవి: పచ్చి సెనగ పప్పు – ఒక కప్పు (అర గంట సేపు నీళ్లలో నానబెట్టాలి); గుమ్మడి కాయ ముక్కలు – ఒక కప్పు; బంగాళ దుంప ముక్కలు – ఒక కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; టొమాటో తరుగు – అర కప్పు; జీలకర్ర – 4 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 10; మిరప కారం – ఒక టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను; తాజా కొబ్బరి తురుము – రెండున్నర టేబుల్ స్పూన్లు; పంచదార – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; జీలకర్ర పొడి – ఒక టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర – ఒక కట్ట. తయారీ: ►స్టౌ మీద కుకర్‌లో సెనగ పప్పు, బంగాళ దుంప ముక్కలు, గుమ్మడికాయ ముక్కలు, ఉప్పు, పసుపు వేసి ఉడికించి, ఒక విజిల్ వచ్చాక దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక, జీలకర్ర, ఎండు మిర్చి వేసి వేయించాలి ►అల్లం తురుము జత చేసి బాగా కలపాలి ∙టొమాటో తరుగు జత చేసి ఉడికించాలి ►ఉడికించిన గుమ్మడికాయ మిశ్రమం జత చేసి బాగా కలియబెట్టాలి ►కొబ్బరి తురుము జత చేసి కొద్దిసేపు ఉడికించాలి ►జీలకర్ర పొడి, మిరప కారం, కొత్తిమీరలతో అలంకరించి దింపేయాలి ►పూరీ, అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. గోవా గుమ్మడి కూర కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; మిరప కారం – ఒక టీ స్పూను; గరం మసాలా పొడి – ఒక టీ స్పూను; పసుపు – ఒక టీ స్పూను; తాజా కొబ్బరి తురుము – 4 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ముప్పావు కప్పు; ఉప్పు – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలిలో ముప్పావు కప్పు నీళ్లు పోసి మరిగాక గుమ్మడికాయ ముక్కలు వేసి ఉడికించాలి ►ఉల్లి తరుగు, మిరపకారం, గరం మసాలా పొడి, పసుపు, ఉప్పు జత చేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి ►చివరగా తాజా కొబ్బరి తురుము వేసి మరోమారు కలియబెట్టి, తడి పోయేంత వరకు ఉడికించి దింపేయాలి ►అన్నంలోకి రుచిగా ఉంటుంది. స్పైసీ గుమ్మడి కాయ కూర కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – అర కేజీ; టొమాటో ముక్కలు – ఒక కప్పు; గసగసాలు – 2 టీ స్పూన్లు; వెల్లుల్లి తరుగు – ఒక టీ స్పూను; పసుపు – అర టీ స్పూను; గరం మసాలా – ఒక టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – తగినంత; మిరప కారం – ఒక టీ స్పూను; కొత్తిమీర తరుగు – కొద్దిగా తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక గసగసాలు వేసి రంగు మారే వరకు వేయించాలి ►వెల్లుల్లి తరుగు జతచేసి కొద్దిసేపు వేయించాలి ∙పసుపు, ధనియాల పొడి, గరం మసాలా జత చేసి మరోమారు వేయించాలి ►టొమాటో తరుగు, గుమ్మడికాయ ముక్కలు జత చేసి బాగా కలియబెట్టాలి ►ఉప్పు, మిరప కారం జత చేసి మరోమారు కలిపి మూత ఉంచాలి (అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు చిలకరించాలి) ►మధ్యమధ్యలో కలుపుతూ బాగా ఉడికించాలి ►కొత్తిమీర తరుగుతో అలంకరించి దింపేయాలి ►ఈ వంటకం భోజనంలోకి రుచిగా ఉంటుంది. గుమ్మడి రైతా కావలసినవి: గుమ్మడి కాయ తురుము – 200 గ్రా.; పెరుగు – 400 మి.లీ.; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; కొత్తిమీర – ఒక కట్ట; ఉప్పు – తగినంత. తయారీ: ►స్టౌ మీద బాణలిలో తగినన్ని నీళ్లు, గుమ్మడి తురుము వేసి ఉడికించి, నీళ్లు పిండేయాలి ►స్టౌ మీద మరో బాణలిలో నూనె వేసి కాగాక ఉడికించిన గుమ్మడి తురుము, ఉప్పు వేసి తడిపోయే వరకు వేయించి, కొద్దిసేపు మూత ఉంచి, బాగా ఉడికిన తరవాత ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►ఒక పాత్రలో పెరుగు వేసి బాగా గిలకొట్టాలి ►ఉప్పు, మిరప కారం, జీలకర్ర పొడి, కొత్తిమీర జత చేయాలి ►చివరగా గుమ్మడికాయ తురుము జత చేసి బాగా కలపాలి ►అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. ఉడిపి గుమ్మడి సాంబార్ కావలసినవి: కంది పప్పు – అర కప్పు (సుమారు రెండు గంటలు నానబెట్టాలి); పసుపు – అర టీ స్పూను; ఇంగువ – అర టీ స్పూను; సాంబార్ మసాలా కోసం; తాజా కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు; ధనియాలు – 2 టీ స్పూన్లు; మెంతులు – పావు టీ స్పూను; సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4; కరివేపాకు – 3 రెమ్మలు. ఇంకా... నూనె – ఒక టేబుల్ స్పూను; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో ముక్కలు – ఒక కప్పు; మునగ కాడలు – 2 (ముక్కలు చేయాలి); గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; చింత పండు గుజ్జు – ఒక టేబుల్ స్పూను; బెల్లం తరుగు – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం –అర టీ స్పూను; ఉప్పు – తగినంత. పోపు కోసం: ఆవాలు – అర టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 2; ఇంగువ – కొద్దిగా. తయారీ: ►కందిపప్పును సుమారు రెండు గంటల పాటు నానబెట్టాక, శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ధనియాలు, జీలకర్ర, మెంతులు, సెనగ పప్పు, మినప్పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించి, దింపి చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ►కొబ్బరి తురుము, కొద్దిగా నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, మెంతులు, మినప్పప్పు, ఎండు మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసి కొద్దిసేపు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►మునగకాడ ముక్కలు, ఒక కప్పుడు నీళ్లు జత చేసి సుమారు పావు గంట సేపు సన్నని మంట మీద ఉడికించాలి ►గుమ్మడి కాయ ముక్కలు, మిరప కారం జత చేసి మరి కాసేపు ఉడికించాలి ►ముక్కలన్నీ ఉడికిన తరవాత, టొమాటో తరుగు జత చేయాలి ►ఉడికించిన పప్పును మెత్తగా మెదిపి, ఉడుకుతున్న సాంబారుకు జత చేసి కలియబెట్టాలి ►చింతపండు గుజ్జు, ఉప్పు, బెల్లం తరుగు, మసాలా ముద్ద జత చేసి మరోమారు బాగా కలిపి మరిగించి దింపేయాలి. చింతపండు గుమ్మడి కూర కావలసినవి: గుమ్మడికాయ ముక్కలు – 2 కప్పులు; నూనె – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టేబుల్ స్పూను; జీలకర్ర – పావు టేబుల్ స్పూను; అల్లంవెల్లుల్లి ముద్ద – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 2 ; ఉల్లి తరుగు – పావు కప్పు; కరివేపాకు – రెండు రెమ్మలు; మిరప కారం – ఒక టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నీళ్లు – ఒక కప్పు; చింతపండు గుజ్జు – ఒక టేబుల్ స్పూను; బెల్లం తరుగు – అర టేబుల్ స్పూను. తయారీ: ►స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►ఉల్లి తరుగు, అల్లం వెల్లుల్లి ముద్ద, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►మిరప కారం, ధనియాల పొడి, పసుపు వేసి మరోమారు బాగా కలిపి, గుమ్మడికాయ ముక్కలు జత చేయాలి ►ఉప్పు, కొద్దిగా నీళ్లు జత చేసి బాగా కలిపి మూత ఉంచాలి ►ఐదు నిమిషాల తరవాత ముక్కలు బాగా ఉడికాయో లేదో చూసి, చింత పండు గుజ్జు జత చేయాలి ►బెల్లం తరుగు వేసి బాగా కలియబెట్టి, మూత ఉంచి తడిపోయే వరకు ఉడికించాలి ►పరాఠా, అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. -
భారీ గుమ్మడికాయల పోటీ
-
భారీ పెండలం.. జంబో గుమ్మడి
పెండలం దుంప.. గుమ్మడికాయ భారీ బరువులతో రికార్డులు సృష్టించాయి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరంలో కానూరి రాజేంద్రప్రసాద్ పెరట్లో ఈ 46 కిలోలు పెండలం దుంప కనిపించింది. విశేషమేమంటే గతంలోనూ ఈయన 45 కిలోల పెండలాన్ని పండించారు.ఇక ఈ గుమ్మడికాయ ఖమ్మం జిల్లా అశ్వారావుపేట మండలంలోని రైతు అంకత ఉమామహేశ్వరరావు తోటలో కాసింది. దీని బరువు ఏకంగా 40 కేజీలు. గతంలో అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ హైదరాబాద్ వచ్చినప్పుడు ఉమామహేశ్వరరావు తన తోటలో కాసిన భారీ సైజు గుమ్మడిని బహుమతిగా ఇచ్చారు. - గుడ్లవల్లేరు/అశ్వారావుపేట -
ఎంత పెద్ద గుమ్మడో!
ఈ భారీ గుమ్మడి కాయను చూస్తుంటే ఆశ్యర్యంగా ఉంది కదూ...మామూలు గుమ్మడి కంటే భిన్నంగా ఉన్న దీని బరువు 42 కిలోలు. తూర్పు గోదావరి జిల్లా కడియం కూరగాయల మార్కెట్లోని దొడ్డా శ్రీను దుకాణంలో బుధవారం ఈ ‘సుమో’ గుమ్మడి కనిపించింది. మండలంలోని దామిరెడ్డిపల్లికి చెందిన గాజుల సూర్యప్రకాశరావు అనే రైతు మార్కెట్‌కు 30 బూడిద గుమ్మడికాయలు తీసుకు రాగా అందులో ఒకటి ఇలా భారీగా ఉంది. అంతేకాదు.. మిగిలిన కాయల్లోనూ అనేకం 25 కేజీలు, ఆపైనే తూగాయి. - కడియం -
హ్యూమరం: కోకోనట్ థియరీ
బాబు విలేకరుల సమావేశం.‘‘రాష్ట్రం గురించి మీ అభిప్రాయం?’’ అడిగారు విలేకరులు. ‘‘కొబ్బరికాయలా సమంగా పగలాలి. గుమ్మడికాయలా ముక్కలు కాకూడదు. ప్రతిదీ పండే కదాని అన్నిటినీ ఒక్కలా తినకూడదు. అరటికి తొక్క తీయాలి. ఆపిల్‌ను కోసి తినాలి. పైనాపిల్ చెక్కు తీయాలి. ద్రాక్షను గుటుక్కున మింగాలి. సీతాఫలంలో విత్తనాలు ఊసేయాలి...’’ ‘‘కొబ్బరికాయ గోలేంటి సార్?’’ ‘‘గోలలోనే గోల్ ఉంటుంది. కొబ్బరిని నారికేళమంటారు. నా రాజకీయాన్ని నారావారి కేళమంటారు. కొబ్బరి నీడ కొంప ముంచుతుంది. కాయ నెత్తిన పడితే కైలాసం ఫ్రీ. ఇడ్లీలోకి చెట్నీ అవుతుంది. మటన్‌లోకి మసాలాగా మారుతుంది. పది వంకాయలు కూడా ఒక టెంకాయతో సమానం కావు.’’ ‘‘మేమడిగిందేంటి?’’ ‘‘అడిగేవాడికే జ్ఞానం. కడిగేవాడికే పాత్రలు. కొబ్బరిలోకి నీళ్లెలా వచ్చాయో తెలుసుకోవడమే జ్ఞానం. నీళ్లు నూనెగా మారడమే విజ్ఞానం. తలకు నూనె రాస్తే, తలరాతలు మారుతాయనుకోవడం అజ్ఞానం. అలలను, కలలను ఎవరూ ఆపలేరు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం నా కల. ఓటర్లకు వాగ్దానం చేయడం ఓ వల. అల, కల, వల అన్నీ రాజకీయమే. పీచే కదాని చులకన చేయకు. అదే ఒకనాడు పరుపవుతుంది.’’ ‘‘మీరెప్పటికీ మారరా?’’ ‘‘ప్రపంచంలో ఎప్పటికీ మారనిది కొబ్బరికాయే. శతాబ్దాల క్రితం దేవుడికి కొబ్బరికాయే కొడుతున్నాం. ఇప్పుడూ అదే. తీర్థమిచ్చిన ప్రతివాడూ పూజారి కాదు. ప్రసాదం తిన్న ప్రతివాడూ భక్తుడు కాదు. భక్తికీ కొబ్బరికాయకీ ఉన్న అనుసంధానమే ఈ రాష్ట్రం. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఓటరుకూ ఒక కొబ్బరికాయ కొడతా. ఓటేయకపోతే నెత్తిన కొడతా. టెంకాయ సమంగా పగలకపోతే ఢిల్లీదే తప్పు...’’ విలేకరులు కుయ్యో మొర్రో అన్నారు. ‘‘కుయ్యోమని కూయమంటే కోడి కూయదు. మొర్రోమన్నా మేకని వదలరు. కూతలు, కోతలు రెండూ ఒకటే. టెంక ఉన్నంత మాత్రాన మామిడి టెంకాయగా మారదు. కొబ్బరి కొబ్బరే, మామిడి మామిడే. కొబ్బరిని ఇంగ్లిష్‌లో కోకోనట్, హిందీలో నారియల్ అంటారు.’’ ‘‘సార్, స్టేట్ పరిస్థితి...’’ ‘‘స్టేట్మెంట్లతో స్టేట్ మారదు. స్టేట్లు మారినా స్ట్రీట్మారదు. ఏ స్టేట్‌లో ఉన్నా మన ఎస్టేట్లు ఉన్నాయా లేదా, మన స్టేటస్ ఏంటి అన్నది ముఖ్యం.’’ విలేకరులు పారిపోవడానికి ప్రయత్నించారు. తలా ఒక కొబ్బరి బర్ఫీని తినిపించాడు బాబు. ఆ తరువాత వాళ్లు ఎటుపోయారో తెలియదు. పత్రికా కార్యాలయాలకు, టీవీ చానళ్లకు చేరలేదు. - జి.ఆర్.మహర్షి మహర్షిజం ఢిల్లీ నాటకం: నాయకులు తెల్లమొహాలేసి, జనాల మొహాలకు రంగు పూస్తున్నారు. తెలుగు తమ్ముడి కామెంట్: అర్థమయ్యేలా మాట్లాడటం మా చంద్రబాబు డిక్షనరీలోనే లేదు. కిరణ్ ఏం చేస్తున్నాడు? హార్స్ రేస్‌ల కోసం చెక్క గుర్రంపై ప్రాక్టీస్ చేస్తున్నాడు. రాజకీయమంటే: ఎన్నటికీ రాని రైలుకి టికెట్లు అమ్మడం! మన నాయకుల ప్రత్యేకత: బాల్, గోల్ రెండూ లేకుండా ఫుట్‌బాల్ ఆడటం! కాంగ్రెస్ నాయకుడి ఆవేదన: ఆయుధాలన్నీ ఢిల్లీవాళ్లు లాక్కుని, యుద్ధానికి వెళ్లమంటున్నారు. -
కాలిపోర్లియాలో 900 కిలోల భారీ గుమ్మడికాయ
-
విభజనకు వ్యతిరేకంగా గుమ్మడికాయలతో నిరసన