
►గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాల ఆరోగ్యానికి గుమ్మడి ఎంతగానో ఉపకరిస్తుంది. గుమ్మడిలో ఉండే విటమిన్ సి వల్ల రక్తంలోని తెల్ల రక్తకణాలు వృద్ధి చెందేందుకు సహాయపడుతుంది. అందువల్ల శరీరంలో రోగనిరోధక కణాలు శక్తివంతంగా పనిచేస్తాయి.
►గుమ్మడిలో కంటి ఆరోగ్యాన్ని కాపాడే విటమిన్ ‘ఎ’ అధికంగా ఉంటుంది.
►రక్తపోటు తగ్గడంలోనూ గుమ్మడి ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. పక్షవాతం రాకుండా కాపాడుతుంది.
►గుమ్మడిలో ఉండే బీటా కెరొటిన్ మన చర్మం మీద సూర్యకిరణాల ప్రభావం పడకుండా కాపాడుతుంది.
►గుమ్మడి గింజల్లోనూ ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీర్ఘకాలిక సమస్యలైన ఆర్థరైటిస్, క్యాన్సర్ వంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది.
►గుండె సంబంధిత వ్యాధులు ఉన్నవారు గుమ్మడి గింజలు తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.
►గుమ్మడి గింజలు ప్రతిరోజు తీసుకోవడం అలవాటుగా చేసుకోవాలి.
►డయాబెటిస్‌ను అదుపులో ఉంచుతుంది.
►చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.
►ఏదైనా పరిమితంగా తీసుకోవాలి.
►గుమ్మడి అధికంగా తీసుకుంటే కొన్ని సమస్యలు వస్తాయి.
►ముఖ్యంగా మలబద్దకం వచ్చే అవకాశం ఉంది. అందుకే ఈ గింజలు తినేవారు మంచినీళ్లు ఎక్కువగా తీసుకోవాలి.
►పండ్లతో పాటు పండ్ల రసాలు కూడా ఎక్కువగా తీసుకోవాలి.