గుమ్మడి కాయలు రెండు రకాలు. రెండూ తీగ జాతికి చెందినవే. తీపి గుమ్మడి, లేదా కూర గుమ్మడి, రెండోది బూడిద గుమ్మడి. తీపి గుమ్మడికాయతో పులుసు కూరలు, స్వీట్ చేసుకుంటారు. బూడిద గుమ్మడికాయతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వడియాలు పెట్టుకుంటారు. మరికొన్ని చోట్ల బూడిద గుమ్మడితో స్పెషల్ స్పీట్ చెస్తారు. అయితే ఈరోజు తీపి గుమ్మడితో చేసే హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం.
గుమ్మడికాయ హల్వా, కావాల్సిన పదార్థాలు
తీపి గుమ్మడికాయ - ఒకటి, పాలు - రెండు కప్పులు, యాలకుల పొడి - ఒక స్పూను, నెయ్యి - రెండు స్పూన్లు, జీడిపప్పు, బాదం కలిపి - అర కప్పు, కోవా - ఒక కప్పు, చక్కెర లేదా బెల్లం - ఒక కప్పు (గుమ్మడికాయ ఎలాగూ తీయగా ఉంటుంది కాబట్టి పెద్దగా తీపి అవసరంలేదు) కిస్‌మిస్ : కాసిన్ని
తయారీ విధానం
మంచి తీపి గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసి ఉంచుకోవాలి. దీన్ని సన్నగా తురుముకోవాలి.
ముందుగా జీడిపప్పు, కిస్‌మిస్, కొద్దిగా బాదం పప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని, కొద్గాది నెయ్యి వేసుకోవాలి. తరువాత గుమ్మడికాయ తురుము వేసి , సన్నని మంటమీద వేయించుకోవాలి. పచ్చివాసన పోగానే పాలు పోసి బాగా ఉడికించాలి. అది కాస్త చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కోవా వేసుకొని బాగా కలపాలి. బెల్లం అయితే హల్వా చక్కటి రంగు వస్తుంది.
పది నిమిషాల ఉడికిన తరువాత దగ్గరగా వస్తుంది. నెయ్యి పైకి తేలుతుంది. ఇపుడు చిన్నమంట మీద ఉంచి మరికాసేపు ఉంచి, మంటను ఆపేయాలి. దీన్నిఒక బౌల్‌లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్‌మిస్‌లో గార్నిష్ చేసుకోవడమే. తడి తగలకుండా ఉంటే ఇది నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment