Halwa
-
Diwali 2024 దివాలీకి ఈ స్వీట్లు చేసిపెడితే : దిల్ ఖుష్!
దీపాల పండుగ దీపావళి (Diwali 2024) కోసం ఉత్సాహంగా జరుపుకునేందుకు దేశవ్యాప్తంగా పిల్లా పాపా అంతా ఎదురు చూస్తున్నారు. దీపావళి దీప కాంతులు, బాణాసంచా వెలుగులతో పాటు, స్వీట్ల సందడి కూడా ఉంటుంది.మరి ఈ క్రమంలో టేస్టీగా, ఈజీగా, హెల్దీగా చేసుకునే రెండు హల్వాల గురించి తెలుసుకుందాం. ఒకటి మూంగ్ హల్వా, రెండు క్యారెట్–ఖర్జూరం హల్వా. మరి వీటికి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇదిగో..ఇలా..!మూంగ్ హల్వాకావల్సిన పదార్థాలునెయ్యి – రెండు టేబుల్ స్పూన్లుచాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)నీళ్లు – రెండు కప్పులునెయ్యి – అరకప్పుగోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లుపంచదార – ముప్పావు కప్పుఫుడ్ కలర్ – చిటికెడుయాలకుల పొడి – పావు టీస్పూనుజీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లుకిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లుతయారీ స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి.పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. క్యారెట్–ఖర్జూరం హల్వా కావల్సిన పదార్థాలు ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి)క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులుకొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి,పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి)తయారీముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి.కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి.ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి.ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలు.. ట్రై చేయండిలా..!
ఈ కొత్తరకం స్నాక్స్ వంటకాలను గురించి మీరెప్పుడైనా విన్నారా! ఆమ్లెట్ వేయడంలో కొత్తదనం.., బాదం క్రిస్పీ చికెన్ మరెంతో స్పెషల్.., సోయా అంజీరా హల్వాలు నోరూరించే విధంగా ఉన్నాయంటే ఒక్కసారి వంట వార్పు చేయాల్సిందే!కోకోనట్ ఆమ్లెట్..కావలసినవి..గుడ్లు – 5కొబ్బరి కోరు – పావు కప్పుఉల్లిపాయ ముక్కలు – 2 టీ స్పూన్లు (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)పచ్చిమిర్చి ముక్కలు – కొద్దిగా (చాలా చిన్నగా తరిగి, దోరగా వేయించి పెట్టుకోవాలి)కొత్తిమీర తురుము– కొద్దిగా (అభిరుచిని బట్టి)హెవీ క్రీమ్ – అర టేబుల్ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది)పంచదార – 2 లేదా 3 టీ స్పూన్లుబటర్ – 2 టేబుల్ స్పూన్లు (కరిగింది, నూనె కూడా వాడుకోవచ్చు)ఉప్పు – కొద్దిగాతయారీ..– ముందుగా ఒక బౌల్లో వేయించిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు.. కొత్తిమీర తురుము, కొబ్బరి తురుము, పంచదార, హెవీ క్రీమ్ వేసుకుని.. అందులో గుడ్లు పగలగొట్టి.. కొద్దిగా ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి.– అనంతరం పాన్ లో బటర్ లేదా నూనె వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకుని.. ఈ ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్‌లా పరచి.. చిన్న మంట మీద ఉడకనివ్వాలి.– ఇరువైపులా ఉడికిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి ఈ మిశ్రమంతో మొత్తం ఒకే అట్టులా కాకుండా.. రెండు లేదా మూడు చిన్నచిన్న ఆమ్లెట్స్‌లా వేసుకోవచ్చు. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే భలే రుచిగా ఉంటుంది ఈ ఆమ్లెట్.బాదం క్రిస్పీ చికెన్..కావలసినవి..బోన్ లెస్ చికెన్ – 3 లేదా 4 పీసులు (పలుచగా, పెద్దగా కట్ చేసిన ముక్కలు తీసుకోవాలి)మొక్కజొన్న పిండి – 6 టేబుల్ స్పూన్లుగోధుమ పిండి – 1 టేబుల్ స్పూన్బాదం – అర కప్పు (దోరగా వేయించి.. బ్రెడ్ పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి)ఎండుమిర్చి – 2 (కచ్చాబిచ్చాగా పొడి చేసుకోవాలి)గుడ్లు – 2, బాదం పాలు – 3 టీ స్పూన్లుమిరియాల పొడి – కొద్దిగాఉప్పు – తగినంతనూనె – సరిపడాతయారీ..– ముందుగా ఒక బౌల్లో మొక్క జొన్న పిండి, గోధుమ పిండి, మిరియాల పొడి, ఎండు మిర్చి పొడి, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.– మరో బౌల్లో గుడ్లు పగలగొట్టి.. బాగా గిలకొట్టి.. అందులో బాదం పాలు పోసి కలిపి పెట్టుకోవాలి. ఇంకో బౌల్ తీసుకుని.. అందులో బాదం పొడి వేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో చికెన్ ముక్కను తీసుకుని.. దానికి మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని బాగా పట్టించాలి.– అనంతరం దాన్ని గుడ్డు–బాదం పాల మిశ్రమంలో ముంచి, వెంటనే బాదం పొడి పట్టించి.. నూనెలో దోరగా వేయించి.. సర్వ్ చేసుకోవాలి.సోయా అంజీరా హల్వా..కావలసినవి..డ్రై అంజీరా – 20 లేదా 25 (15 నిమిషాలు నానబెట్టుకోవాలి)కిస్మిస్ – 15 (నానబెట్టి పెట్టుకోవాలి)సోయా పాలు – అర కప్పుఫుడ్ కలర్ – కొద్దిగా (అభిరుచిని బట్టి)జీడిపప్పు, బాదం, పిస్తా – కొద్దికొద్దిగా (నేతిలో దోరగా వేయించి.. చల్లారాక కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టుకోవాలి)నెయ్యి, పంచదార – సరిపడాగసగసాలు లేదా నువ్వులు – కొద్దిగా గార్నిష్కితయారీ..– ముందుగా అంజీరా, కిస్మిస్ రెండూ కలిపి.. మెత్తటి పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి.– ఈలోపు కళాయిలో 5 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడి చేసుకుని అందులో.. అంజీరా మిశ్రమాన్ని వేసుకుని చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉండాలి.– దగ్గర పడుతున్న సమయంలో సోయా పాలు, జీడిపప్పు, బాదం, పిస్తా ముక్కలు వేసుకుని మళ్లీ దగ్గరపడే వరకు చిన్న మంట మీద.. మధ్య మధ్యలో తిప్పుతూ ఉడికించాలి.– అనంతరం సరిపడా పంచదార, ఫుడ్ కలర్ వేసుకుని.. బాగా తిప్పాలి. టేస్ట్ చూసుకుని పంచదార, నెయ్యి అభిరుచిని బట్టి ఇంకొంచెం కలుపుకోవచ్చు.– కాస్త దగ్గర పడుతున్న సమయంలో స్టవ్ ఆఫ్ చేసి.. కాసేపు అలానే గాలికి వదిలిపెట్టాలి.– దగ్గరపడి, చల్లారాక చేతులకు నెయ్యి రాసుకుని.. మొత్తం మిశ్రమాన్ని రోల్స్‌లా చుట్టుకుని.. గసగసాల్లో లేదా వేయించిన నువ్వుల్లో దొర్లించాలి. అనంతరం నచ్చినవిధంగా కట్ చేసుకోవాలి.ఇవి చదవండి: ఈ మినీ మెషిన్‌తో.. స్కిన్ సమస్యలకు చెక్! -
Pumpkin Halwa: టేస్టీ టేస్టీగా గుమ్మడికాయ హల్వా రెసిపీ, అలా.. వెన్నలా..
గుమ్మడి కాయలు రెండు రకాలు. రెండూ తీగ జాతికి చెందినవే. తీపి గుమ్మడి, లేదా కూర గుమ్మడి, రెండోది బూడిద గుమ్మడి. తీపి గుమ్మడికాయతో పులుసు కూరలు, స్వీట్ చేసుకుంటారు. బూడిద గుమ్మడికాయతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వడియాలు పెట్టుకుంటారు. మరికొన్ని చోట్ల బూడిద గుమ్మడితో స్పెషల్ స్పీట్ చెస్తారు. అయితే ఈరోజు తీపి గుమ్మడితో చేసే హల్వా ఎలా తయారు చేయాలో చూద్దాం. గుమ్మడికాయ హల్వా, కావాల్సిన పదార్థాలుతీపి గుమ్మడికాయ - ఒకటి, పాలు - రెండు కప్పులు, యాలకుల పొడి - ఒక స్పూను, నెయ్యి - రెండు స్పూన్లు, జీడిపప్పు, బాదం కలిపి - అర కప్పు, కోవా - ఒక కప్పు, చక్కెర లేదా బెల్లం - ఒక కప్పు (గుమ్మడికాయ ఎలాగూ తీయగా ఉంటుంది కాబట్టి పెద్దగా తీపి అవసరంలేదు) కిస్మిస్ : కాసిన్నితయారీ విధానం మంచి తీపి గుమ్మడికాయను తీసుకొని శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసి ఉంచుకోవాలి. దీన్ని సన్నగా తురుముకోవాలి.ముందుగా జీడిపప్పు, కిస్మిస్, కొద్దిగా బాదం పప్పులను వేయించి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉన్న గిన్నెను తీసుకుని, కొద్గాది నెయ్యి వేసుకోవాలి. తరువాత గుమ్మడికాయ తురుము వేసి , సన్నని మంటమీద వేయించుకోవాలి. పచ్చివాసన పోగానే పాలు పోసి బాగా ఉడికించాలి. అది కాస్త చిక్కబడ్డాక పంచదార, యాలకుల పొడి, కోవా వేసుకొని బాగా కలపాలి. బెల్లం అయితే హల్వా చక్కటి రంగు వస్తుంది. పది నిమిషాల ఉడికిన తరువాత దగ్గరగా వస్తుంది. నెయ్యి పైకి తేలుతుంది. ఇపుడు చిన్నమంట మీద ఉంచి మరికాసేపు ఉంచి, మంటను ఆపేయాలి. దీన్నిఒక బౌల్లోకి తీసుకొని వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కిస్మిస్లో గార్నిష్ చేసుకోవడమే. తడి తగలకుండా ఉంటే ఇది నాలుగైదు రోజులు నిల్వ కూడా ఉంటుంది. -
వేసవిలో తాపం తగ్గేలా సగ్గుబియ్యంతో హల్వా చేద్దాం ఇలా!
చలికాలం... సగ్గుబియ్యం హల్వా తింటే జలుబు చేస్తోందా! అయితే... ఇదే మంచి సమయం. ఎండల్లో వండుకుందాం. సగ్గుబియ్యం చలవ చేస్తుంది... ఎండ తాపాన్ని తగ్గిస్తుంది. దహీ... కేసర్... కోవాతోపాటు పొటాటోతోనూ కలిసిపోతుంది. ఈవెనింగ్ స్నాక్ అవుతుంది...లంచ్‌లో మెయిన్ కోర్స్ అవుతుంది. భోజనం తర్వాత డెజర్ట్ గానూ సర్దుకుపోతుంది. అలాంటి సగ్గుబియ్యంతో సాబుదానా హల్వా చేద్దామిలా!. తయారీకి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం– కప్పు చక్కెర – కప్పు నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు ఫుడ్ కలర్– చిటికెడు ఏలకుల పొడి– అర టీ స్పూన్ జీడిపప్పు – 2 టేబుల్ స్పూన్లు కిస్మిస్ – టేబుల్ స్పూన్ పాల కోవా– 2 టేబుల్ స్పూన్లు లేదా చిక్కటి పాలు కప్పు; నీరు – 2 కప్పులు. తయారీ విధానం: సగ్గుబియ్యాన్ని కడిగి నీరు పోసి ప్రెషర్ కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. బాణలిలో నెయ్యి వేడి చేసి జీడిపప్పు, కిస్మిస్లను వేయించాలి. వేగిన జీడిపప్పు, కిస్మిస్ను తీసి పక్కన పెట్టి అదే బాణలిలో ఉడికిన సగ్గుబియ్యం, చక్కెర, ఫుడ్ కలర్ వేసి కలుపుతూ ఉడికించాలి. మిశ్రమం దగ్గరయ్యేటప్పుడు పాల కోవా వేసి కలపాలి. కోవా లేకపోతే పాలు పోసి, ఏలకుల పొడి వేసి దగ్గరయ్యే వరకు కలుపుతూ ఉడికించాలి. చివరగా వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి కలిపితే సాబుదానా హల్వా రెడీ. (చదవండి: మసాలా ఎక్కువై కూర పాడవ్వకూడదంటే ఇలా చేయండి! టేస్ట్ అదిరిపోతుంది) -
బీట్రూట్ ఖర్జూరం హల్వా మీకోసమే..
కావలసినవి: బీట్రూట్ రసం – 1 కప్పు, ఖర్జూరం – 10 (వేడి నీళ్లల్లో కడిగి.. కాసేపు నానబెట్టి, గుజ్జులా చేసుకోవాలి) పంచదార – పావు కప్పుపైనే (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) నెయ్యి – పావు కప్పు, ఏలకులు – 2 జీడిపప్పు – 15 పైనే ఫుడ్ కలర్ – కొద్దిగా (బీట్రూట్ కలర్) తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. మంట చిన్నగా పెట్టుకోవాలి. కళాయి వేడికాగానే.. 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని.. అందులో జీడిపప్పు దోరగా వేయించుకుని, పక్కన పెట్టుకోవాలి. అనంతరం కళాయిలో ఇంకాస్త నెయ్యి వేసి.. ఖర్జూరం గుజ్జు వేసుకుని తిప్పుతూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ బాగా కలపాలి. తర్వాత సరిపడా పంచదార, బీట్రూట్ రసం, ఫుడ్ కలర్ వేసుకుని చిన్నగా గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. మళ్లీ కొద్దిగా నెయ్యి వేసుకుని.. తిప్పాలి. ఏలకులు, జీడిపప్పు వేసుకుని కలపాలి. మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని.. తిప్పుతూ దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ లోపలంతా నెయ్యి రాసి.. ఆ మొత్తం మిశ్రమాన్ని.. దానిలోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇవి చదవండి: మీరెప్పుడైనా బొప్పాయి బన్స్ ట్రై చేసారా..! -
‘ఆహార’ ఉత్పత్తులకు ఊతం
సాక్షి, అమరావతి: ఆత్రేయపురం పూతరేకులు..తాపేశ్వరం మడత కాజా..కాకినాడ గొట్టం కాజా..కండ్రిక పాలకోవా..నగరం గరాచీ..అనకాపల్లి బెల్లం..మాడుగుల హల్వా..గువ్వలచెరువు పాలకోవా, బందరు తొక్కుడు లడ్డు..నన్నారీ ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఏ మారుమూల పల్లెకు వెళ్లినా స్థానికంగా పేరొందిన ఎన్నో సంప్రదాయ ఆహార ఉత్పత్తులున్నాయి. శతాబ్దాల చరిత్ర కలిగిన అద్భుతమైన ఈ ఆంధ్ర వంటకాలకు దశల వారీగా భౌగోళిక గుర్తింపు తీసుకురావడం, ప్రతీ ఉత్పత్తికి ప్రత్యేక బ్రాండింగ్‌తో అంతర్జాతీయ మార్కెటింగ్, తద్వారా వీటిì తయారీపై ఆధారపడిన వారికి మెరుగైన జీవనోపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. సంప్రదాయ ఆహార ఉత్పత్తుల్లో ఇప్పటివరకు తిరుపతిలడ్డూతో పాటు బందరు తొక్కుడు లడ్డు, గుంటూరు సన్నమిరప కాయ, బంగినపల్లి మామిడికి మాత్రమే భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగ్) లభించింది. వందల కోట్ల టర్నోవర్ ఉన్నప్పటికీ మిగిలిన వాటికి తగిన ప్రోత్సాహం లేక గుర్తింపునకు నోచుకోలేకపోతున్నాయి. ఈ పరిస్థితిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం అంతరించిపోతున్న సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు పూర్వ వైభవం తీసుకువచ్చే దిశగా కార్యాచరణ సిద్ధం చేసింది. ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్‌ప్రైజస్ (పీఎంఎఫ్ఎంఈ) కింద 60:40 శాతం నిష్పత్తిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా ఈ ప్రాజెక్టును చేపడుతున్నాయి. ఈ తరహా ఆహార ఉత్పత్తులను తయారు చేసే ప్రాంతాలను కలుపుతూ 32 ట్రెడిషన్ ఫుడ్ క్లస్టర్స్‌ను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. 35 శాతం సబ్సిడీపై రుణాలు ఒక్కో క్లస్టర్ పరిధిలో 50–100కి పైగా కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. వీరికి తమ వ్యాపార అవసరాల కోసం అవసరమైన పెట్టుబడిని సమకూరుస్తారు. సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమల స్థాయికి వీటిని తీర్చిదిద్దేందుకు వీలుగా రూ.కోటి వరకు ఆర్థికసాయం అందజేస్తారు. ఈ మొత్తంలో 35% సబ్సిడీ లేదా గరిష్టంగా రూ.10 లక్షల వరకు సబ్సిడీ ఇస్తారు. ఆధునిక సాంకేతిక టవైపు అడుగులు వేసే విధంగా వీరికి అవసరమైన తోడ్పాటునిస్తారు. వృత్తి నైపుణ్యతలో నూతన సాంకేతికత పద్ధతులపై శిక్షణ కూడా ఇస్తారు. తయారు చేసుకున్న ఆహార ఉత్పత్తుల నిల్వ, మార్కెటింగ్ కోసం పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాల కల్పనకు చేయూతనిస్తారు. రూ.10 కోట్లతో ఉమ్మడి మౌలిక వసతుల కల్పన ఆహార ఉత్పత్తుల తయారీలో అదనపు విలువను చేకూర్చడమే లక్ష్యంగా ఇంక్యూబేషన్ సెంటర్స్ నిర్మిస్తారు. సరుకులు నిల్వ చేసుకునేందుకు వీలుగా స్థానికంగా గోదాములు, కోల్డ్ రూమ్స్ వంటి వాటి నిర్మాణానికి ఉమ్మడి మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్ట్ కింద రూ.10 కోట్ల వరకు ఆహార తయారీ ఉత్పత్తిదారుల సంఘాలు(ఎఫ్‌పీవో)కు లేదా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక చేయూతనిస్తారు. ప్యాకేజ్ డిజైనింగ్, మార్కెటింగ్, బ్రాండింగ్‌తో పాటు రవాణ, నిల్వ ఖర్చులు, ఎడ్వర్టైజ్మెంట్, ట్రేడ్‌మార్క్ కాపీ రైట్, జీఐ ట్యాగ్ గుర్తింపు కోసం అయ్యే ఖర్చుల్లో కూడా 50% గ్రాంట్ రూపంలో సమకూరుస్తారు. మిగిలిన 50% ఆయా తయారీదారులు సొంతంగా సమకూర్చుకోవచ్చు లేని పక్షంలో దాన్ని రుణంగా అందిస్తారు. దీంట్లో గరిష్టంగా రూ.3 కోట్ల వరకు సబ్సీడీ ఇస్తారు. ప్రత్యేక బ్రాండింగ్‌తో రిటైల్ మార్కెట్లోకి ఉత్పత్తుల వారీగా ప్రత్యేక బ్రాండింగ్‌తో మార్కెట్లోకి తీసుకురావడమే కాదు బహుళ జాతి సంస్థలకు చెందిన రిటైల్ అవుట్ లెట్స్ అమ్మకాలకూ చేయూతనిస్తారు. ఆ తర్వాత దశల వారీగా ఆన్లైన్ అమ్మకాలకు శ్రీకారం చుడతారు. తొలిదశలో మాడుగుల హల్వాను జనవరి నుంచి ప్రత్యేక బ్రాండింగ్‌తో జనవరి నుంచి రిటైల్ మార్కెట్లోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆహార ఉత్పత్తులకు బ్రాండింగ్, భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా ఇటీవలే దామోదరం సంజీవయ్య లా వర్సిటీతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ ఎంవోయూ చేసుకున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఆత్రేయపురం పూతరేకులకూ జీఐ ట్యాగ్ వచ్చింది. అదే రీతిలో త్వరలో మాడుగుల హల్వాకు జీఐ ట్యాగ్ తీసుకొచ్చే దిశగా చర్యలు చేపట్టారు. ఆ తర్వాత దశల వారీగా మిగిలిన ఉత్పత్తులకు కూడా జీఐ ట్యాగ్ తీసుకురానున్నారు. మాడుగుల హల్వాకు చేయూత 1890లో మా పూర్వికులు తయారు చేసిన మాడుగుల హల్వాకు ప్రభుత్వం చేయూతనిస్తుండడం ఆనందంగా ఉంది. ఏటా రూ.24 కోట్లకుపైగా టర్నోవర్ జరుగుతున్న మాడుగుల హల్వాకు జీఐ ట్యాగ్‌తో పాటు ప్రత్యేక బ్రాండింగ్‌తో రిటైల్ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఇస్తోన్న సహకారం మరువ లేనిది. వరల్డ్ ఫుడ్ ఇండియా–2023లో మాడుగుల హల్వా స్టాల్‌కు అనూహ్య స్పందన లభించింది. కేంద్రమంత్రితో సహా వివిధ రాష్ట్రాల ప్రముఖులు హల్వా రుచిచూశారు. – దంగేటి మోహన్, మాడుగుల హల్వా సృష్టికర్త మునిమనవడు ఆహార ఉత్పత్తులకు పూర్వవైభవం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా సంప్రదాయ ఆహార ఉత్పత్తులకు పూర్వవైభవం తీసుకురావాలనే సంకల్పంతో ఆంధ్రప్రదేశ్‌లో 32 ట్రెడిషన్ ఫుడ్ క్లస్టర్స్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వాటి పరిధిలో గుర్తించిన ఆహార ఉత్పత్తుల తయారీదారులకు అవసరమైన ఆరి్థక చేయూతను అందజేయనుంది. దీంతో పాటు వాటికి భౌగోళిక గుర్తింపు (జీఐ ట్యాగింగ్), బ్రాండింగ్, మార్కెటింగ్ సౌకర్యాల కల్పనకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. – చిరంజీవి చౌదరి, ప్రిన్సిపల్ సెక్రటరీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ -
ఎల్లలు దాటనున్న మాడుగుల హల్వా!
సాక్షి, విశాఖపట్నం : నోట్లో వేసుకోగానే మైమరపించే మాడుగుల హల్వా రుచిని ప్రపంచానికి పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దీనిని ప్రత్యేక పరిశ్రమగా అభివృద్ధి చేయడంతో పాటు.. భౌగోళిక గుర్తింపు తీసుకొచ్చేందుకు అడుగులేస్తోంది. ఇందుకోసం దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ఒప్పందం కుదుర్చుకుంది. జీడి పప్పు.. బాదం పలుకులు.. కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే.. గోధుమ పాలు.. వీటన్నింటినీ రాతి రుబ్బు రాయితో గంటల పాటు సానబెట్టి.. ఆపై కట్టెల పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపెట్టగానే పుట్టుకొస్తుందీ హల్వా. మాడుగులలో 1890వ సంవత్సరంలో దంగేటి ధర్మారావు కుటుంబం మాత్రమే దీనిని తయారు చేసేది. ప్రస్తుతం ఈ వ్యాపారంపై అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. మొట్టమొదటిగా ‘మాడుగుల హల్వా’ ఎంపిక మాడుగుల హల్వా వ్యాపారాన్ని మరింత వృద్ధిలోకి తేవడమే కాకుండా విదేశాల్లో దర్జాగా విక్రయించేందుకు అవసరమైన చేయూతనందించేందుకు ఇకపై రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా వ్యవహరించనుంది. కేంద్ర ప్రభుత్వ పథకమైన పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ (పీఎంఎఫ్ఎంఈ)లో భాగంగా ఈ పరిశ్రమని అభివృద్ధి చేయనుంది. ఇందుకు కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం నిధులు సమకూరుస్తాయి. యంత్రాల్ని సమకూర్చడం, స్కిల్స్ అప్‌గ్రేడ్ చేయడం, ప్రాసెసింగ్ ఫెసిలిటీస్ వంటివి కల్పిస్తారు. వీటితో పాటు.. మార్కెటింగ్ సౌకర్యాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. ఇందుకోసం రాష్ట్రంలో తొలిసారి మాడుగుల హల్వాని ఎంపిక చేశారు. ఇకపై ఈ హల్వా.. ఒక బ్రాండెడ్ ప్రొడక్ట్‌గా మార్కెట్లో లభించనుంది. ఇందుకు కావాల్సిన వసతుల్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుంది. పథకంలో భాగంగా ఏడాది పాటు ప్యాకేజింగ్ మెటీరియల్, గోదాముల్లో నిల్వ చేసుకునేందుకు అద్దె, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వమే అందిస్తుంది. ఎలాంటి పెట్టుబడి భారం లేకుండా హల్వాని విదేశాలకు ఎగుమతి చేసుకునేందుకు అవకాశం లభిస్తుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన వ్యయంలో 50 శాతం వరకూ గ్రాంట్ కింద ప్రభుత్వం సమకూరుస్తుంది. భౌగోళిక గుర్తింపునకు ఒప్పందం.. వందేళ్ల చరిత్ర గల మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు తెచ్చేందుకు దామోదరం సంజీవయ్య న్యాయ విశ్వవిద్యాలయంతో ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్ సొసైటీ శుక్రవారం ఎంవోయూను కుదుర్చుకుంది. ఈ గుర్తింపు కోసం అవసరమయ్యే రుసుములు, ఇతర ఖర్చులకు సంబంధించి రూ.3 లక్షల వరకూ ప్రభుత్వమే భరించనుంది. వచ్చే ఆరు నెలల్లోపు మాడుగుల హల్వాకు కూడా భౌగోళిక గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ గుర్తింపు వస్తే ఇక ఈ పేరుతో ఇక్కడి నుంచి తప్ప మరెవరూ, ఎక్కడా మాడుగుల హల్వాను తయారు చేయలేరు. వారసత్వ సంపదగా గుర్తింపు వందల ఏళ్ల చరిత్ర కలిగిన అనేక తినుబండారాలు తయారు చేసే పరిశ్రమలు రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి. అవన్నీ చిరు వ్యాపారం మాదిరిగానే మిగిలిపోయాయి. వాటన్నింటినీ అభివృద్ధి చేసి.. వారసత్వ సంపదగా గుర్తింపు తెచ్చేందుకు ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే మాడుగుల హల్వాకు భౌగోళిక గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ మాదిరిగా దీని అభివృద్ధికి శ్రీకారం చుడుతున్నాం. ఆ తర్వాత మిగిలినవాటిపైనా దృష్టిపెడతాం. – కేజే మారుతి, ఏపీ ఫుడ్‌ప్రాసెసింగ్ సొసైటీ మేనేజర్ -
శ్రావణమాసం స్పెషల్.. టేస్టీ హల్వా చేసుకోండి ఇలా
క్యారెట్–ఖర్జూరం హల్వా తయారీకి కావల్సినవి: ఖర్జూరం – పావు కప్పు (గింజలు తీసి, కడిగి, కొన్ని మంచి నీళ్లలో కొంత సేపు నానబెట్టి తీసి, ఉడికించి, మిక్సీ పట్టుకోవాలి) క్యారెట్ తురుము– 1 కప్పు, కొబ్బరి పాలు– 2 కప్పులు కొబ్బరి కోరు, కస్టర్డ్ మిల్క్– పావు కప్పు చొప్పున, నెయ్యి, పంచదార– పావు కప్పు చొప్పున (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు), కుంకుమ పువ్వు – చిటికెడు, వెనీలా ఎసెన్స్– 1 టీ స్పూన్ కిస్మిస్ గుజ్జు– 1 టేబుల్ స్పూన్, డ్రై ఫ్రూట్స్ ముక్కలు– కొన్ని (నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఫుడ్ కలర్– క్యారెట్ కలర్ (అభిరుచిని బట్టి) తయారీ విధానమిలా.. ►ముందుగా ఖర్జూరం గుజ్జు, కొబ్బరి పాలు, పంచదార, ఏలకుల పొడి వేసుకుని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ► అనంతరం స్టవ్ ఆన్ చేసుకుని పాన్ బౌల్లో నెయ్యి వేడి చేసుకుని.. అందులో ఖర్జూరం మిశ్రమం మొత్తం వేసుకుని చిన్న మంట మీద, గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ► కాస్త దగ్గర పడుతున్నప్పుడు క్యారెట్ తురుము, కస్టర్డ్ మిల్క్, ఫుడ్ కలర్ వేసుకుని తిప్పుతూ ఉండాలి. ► ఆ తర్వాత కిస్మిస్ గుజ్జు, కొబ్బరి కోరు, వెనీలా ఎసెన్స్ ఒకదాని తరవాత ఒకటి వేసుకోవాలి. ► ఆ మిశ్రమం మరింత దగ్గర పడగానే, డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఒకసారి అటు ఇటు కలిపి, సర్వ్ చేసుకోవాలి. -
Recipe: కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్.. నోరూరించే పన్నీర్ హల్వా తయారీ ఇలా
స్వీట్‌ను ఇష్టంగా తినేవారు ఇలా పనీర్ హల్వా ఇంట్లోనే తయారు చేసుకోండి. పనీర్ హల్వా తయారీకి కావలసినవి: ►పనీర్ తురుము – 500 గ్రాములు ►బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష – 30 గ్రాముల చొప్పున ►నెయ్యి – పావు కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) ►పాలు – 200 మిల్లీలీటర్లు ►కోవా – 200 గ్రాములు ►కుంకుమపువ్వు – 1/4 టీస్పూన్ ►బెల్లం కోరు – 100 గ్రాములు ►ఏలకుల పొడి – 1/4 టీస్పూన్ ►పిస్తా – గార్నిషింగ్ కోసం తయారీ: ►ముందుగా బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను 1 టేబుల్ స్పూన్ నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం సగం నెయ్యి వేసి.. పనీర్ తురుముని దోరగా వేయించాలి. అందులో పాలు పోసి.. గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ►పాలు దగ్గర పడగానే.. కోవా, కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి. ►అనంతరం బెల్లం కోరు, ఏలకుల పొడి వేసి.. తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడే సమయానికి మిగిలిన నెయ్యి కూడా వేసి కాసేపు.. గరిటెతో అటు ఇటు తిప్పి.. చివరిగా నేతిలో వేగిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేసి కలపాలి. ►సర్వ్ చేసుకునేముందు పిస్తా ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది పనీర్ హల్వా. ఇవి కూడా ట్రై చేయండి: Malpua Sweet Recipe: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పాలు.. మాల్ పువా తయారీ ఇలా Kova Rava Burfi Sweet Recipe: నోరూరించే కోవా రవ్వ బర్ఫీ తయారీ.. -
Recipes: ‘సిరి’ ధాన్యాలు.. నోటికి రుచించేలా.. కొర్రల ఇడ్లీ, మిల్లెట్ హల్వా
Millet Recipes In Telugu: ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకునేందుకు ఈ మధ్యకాలంలో చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నాం. పండగ సందడిలో క్యాలరీలను పట్టించుకోకుండా నోటికి రుచించిన ప్రతివంటకాన్ని లాగించేశాం. ఇప్పుడు ఒక్కసారిగా చప్పగా ఉండే మిల్లెట్స్ తినాలంటే కష్టమే. అయినా కూడా క్యాలరీలు తగ్గించి ఆరోగ్యాన్ని పెంచే ‘సిరి’ ధాన్యాలను నోటికి రుచించేలా ఎలా వండుకోవాలో చూద్దాం.... కొర్రల ఇడ్లీ కావలసినవి: కొర్రలు – మూడు కప్పులు మినపగుళ్లు – కప్పు మెంతులు – రెండు టీస్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా. తయారీ: కొర్రలు, మినపగుళ్లు, మెంతులను శుభ్రంగా కడిగి కొర్రలను విడిగా, మినపగుళ్లు, మెంతులను కలిపి ఐదుగంటలు నానబెట్టాలి కొర్రలు, మినపగుళ్లు చక్కగా నానాక కొద్దిగా నీళ్లు పోసుకుని విడివిడిగా మెత్తగా రుబ్బుకోవాలి ఈ రెండిటినీ కలిపి కొద్దిగా ఉప్పు వేసి పులియనియ్యాలి పులిసిన పిండిని ఇడ్లీ పాత్రలో వేసుకుని ఆవిరి మీద ఉడికించాలి. వేడివేడి కొర్రల ఇడ్లీలు సాంబార్, చట్నీతో చాలా బావుంటాయి. మిల్లెట్ హల్వా కావలసినవి: కొర్రలు – కప్పు బెల్లం – కప్పు జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూను కిస్మిస్లు – టేబుల్ స్పూను నెయ్యి – పావు కప్పు యాలకులపొడి – పావు టీస్పూను. తయారీ: ముందుగా కొర్రలను మరీ మెత్తగా కాకుండా బరకగా పొడిచేసుకుని పక్కన పెట్టుకోవాలి మందపాటి బాణలిలో బెల్లం, పావు కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు మరిగించి పొయ్యిమీద నుంచి దించేయాలి మరో బాణలిలో నెయ్యివేసి వేడెక్కనివ్వాలి. నెయ్యి కాగాక జీడిపప్పు పలుకులు, కిస్మిస్లు వేసి బంగారు వర్ణం వచ్చేంతవరకు వేయించి పక్కనపెట్టుకోవాలి ఇదే బాణలిలో కొర్రల పొడి వేసి ఐదు నిమిషాలు వేయించాలి వేగిన పొడిలో నాలుగు కప్పులు నీళ్లుపోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉడికించాలి నీళ్లన్నీ ఇగిరాక బెల్లం నీళ్లను వడగట్టి పోయాలి కొర్రలు, బెల్లం నీళ్లు దగ్గర పడేంత వరకు ఉడికించాలి. నెయ్యి పైకి తేలుతున్నప్పుడు యాలకుల పొడి, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లు వేసి కలిపి దించేయాలి. ఇవి కూడా ట్రై చేయండి: Dussehra 2022 Sweet Recipes: బాస్మతి బియ్యంతో ఘీ రైస్.. కార్న్‌ఫ్లోర్‌తో పనీర్ జిలేబీ! తయారీ ఇలా Papaya Halwa Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా! -
Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా!
మొక్కజొన్న పిండి, మైదాపిండితో బొప్పాయి హల్వా ఇలా తయారు చేసుకోండి. కావలసినవి: ►బొప్పాయి – 1(ఒక కేజీ) ►మొక్కజొన్న పిండి, మైదాపిండి – పావు కప్పు చొప్పున ►పంచదార – ముప్పావు కప్పు, చిక్కటి పాలు – 2 కప్పులు ►నెయ్యి – 6 టేబుల్ స్పూన్ల పైనే ►కొబ్బరి తురుము – గార్నిష్ కోసం తయారీ విధానం: ►ముందుగా బొప్పాయి తొక్క, లోపల గింజలు తీసి.. మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ►దానిలో మొక్కజొన్న పిండి, మైదాపిండి, పంచదార, చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపాలి. ►పంచదార కరిగేంత వరకూ కలిపి.. కళాయిలో పోసుకుని.. చిన్న మంట మీద.. ఆ మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ ఉండాలి దగ్గరపడేంత వరకూ. ►మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేస్తూ ఉండాలి. ►దగ్గర పడిన తర్వాత మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని, బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►ఒక బౌల్‌కి నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమాన్ని వేసుకుని.. చల్లారనివ్వాలి. ►ఆపై నచ్చిన షేప్‌లో ముక్కలు కట్ చేసుకుని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Makka Sattu Muddalu: మక్క సత్తు ముద్దలు తిన్నారా? ఇలా తయారు చేసుకోండి! ఆరోగ్య ప్రయోజనాలివే! Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
సులువులైన చిట్కాలతో చాక్లెట్ సమోసా-అంజీర్ హల్వా
చాక్లెట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 1 కప్పు, పంచదార పొడి – 5 టేబుల్ స్పూన్లు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, డార్క్ చాక్లెట్ పౌడర్ – 1 కప్పు, పిస్తా ముక్కలు – 1 టేబుల్ స్పూన్ పంచదార పాకం – అభిరుచిని బట్టి (అప్పటికప్పుడు కావాల్సినంత పంచదార, నీళ్లు పోసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్లో మైదాపిండి, నెయ్యి, 4 టేబుల్ స్పూన్ల పంచదార పొడి, నీళ్లు పోసుకుని బాగా కలిపి.. కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ చపాతీ ముద్దలా చేసుకుని ఓ పావు గంట పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. ఈ సమయంలో ఒక బౌల్ తీసుకుని అందులో చాక్లెట్ పౌడర్, పంచదార పౌడర్, పిస్తా ముక్కలు వేసుకుని అటు ఇటుగా కలిపి.. పక్కన పెట్టుకోవాలి. పావు గంట తర్వాత ఫ్రిజ్‌లోంచి మైదా ముద్దను తీసి.. చిన్న చిన్న పూరీల్లా చేసుకుని.. ప్రతి పూరీలో కొంత చాక్లెట్ మిశ్రమం పెట్టుకుని సమోసాలా చుట్టుకోవాలి. అనంతరం రెండు స్టవ్‌లు ఆన్ చేసుకుని.. ఒకవైపు నూనె కళాయి, మరోవైపు పంచదార పాకం ఉన్న కళాయి పెట్టుకుని సమోసాలను నూనెలో దోరగా వేయించి.. వెంటనే పాకంలో వేసి తీసుకోవాలి. ఒకవేళ పాకంలో వేసుకోవడం ఇష్టం లేకుంటే చాక్లెట్ సాస్ని పైన గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంజీర్ హల్వా కావలసినవి: డ్రై అంజీర్ – 400 గ్రా.(నానబెట్టి, ముక్కలు చేసుకోవాలి) బియ్యప్పిండి/మొక్కజొన్న పిండి – 5 టేబుల్ స్పూన్లు(5 టేబుల్ స్పూన్ల నీళ్లనూ జతచేసి బాగా కలుపుకోవాలి), నెయ్యి – 9 టేబుల్ స్పూన్లు లేదా అంతకు మించి, పచ్చిపాలు – అర కప్పు, పంచదార – అభిరుచిని బట్టి, ఫుడ్ కలర్ – కొద్దిగా (గ్రీన్ కలర్), యాలకుల పొడి – కొద్దిగా, డ్రై ఫ్రూట్స్ ముక్కలు – కొద్దిగా తయారీ: ముందుగా పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని, వేడి కాగానే.. అందులో బియ్యప్పిండి/మొక్కజొన్నపిండి మిశ్రమం వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. పాలు పోసుకుని చిన్న మంటపైన గరిటెతో తిప్పుతూ మరిగించుకోవాలి. తర్వాత ఒక కప్పు పంచదార వేసుకుని కరిగే వరకూ గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో అంజీర్ ముక్కలు, ఫుడ్ కలర్ వేసుకుని మధ్య మధ్యలో కొద్దికొద్దిగా నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. దగ్గర పడిన తర్వాత ఒకసారి తీపి సరిపోయిందో లేదో చూసుకుని అవసరమైతే మరికొద్దిగా పంచదార వేసుకుని, మిగిలిన నెయ్యి కూడా వేసుకుని గరిటెతో కలుపుతూ దగ్గర పడే సమయంలో యాలకుల పొడి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అభిరుచిని బట్టి నచ్చిన డ్రై ఫ్రూట్స్ ముక్కలతో గార్నిష్ చేసుకోవచ్చు లేదా.. నచ్చిన ఫ్లేవర్ ఐస్ క్రీమ్‌తో కలిసి తింటే భలే రుచిగా ఉంటుంది ఈ హల్వా. -
రుచిలో మేటి మాడుగుల హల్వా
కాకినాడ కాజాకు, బందరు లడ్డూకు.. ఆత్రేయపురం పూతరేకులకు.. ఇలా ఒక్కో ప్రాంతానికి ఒక్కో మధురమైన ప్రత్యేకత ఉంటుంది. మప విశాఖ జిల్లా పేరు చెబితే అందరికీ గుర్తొచ్చేది నోరూరించే మాడుగుల హల్వా. పేరులోనే కాదు రుచిలో కూడా దీనికి సాటి మరొకటి లేదని చెప్పక తప్పదు. ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో 132 ఏళ్ల క్రితం పుట్టిన ఈ హల్వా ఖ్యాతి ఇప్పుడు ఖండాంతరాలు వ్యాపించింది. వందలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. మాడుగుల: మాడుగులలో 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో పుట్టిన హల్వా నేడు విదేశాల్లో సైతం నోరూరిస్తోంది. మాడుగుల అంటే హల్వాగానే ఖ్యాతి పెరిగింది. గతంలో హల్వా మాడుగులలోనే లభ్యమయ్యేది. ప్రస్తుతం ఆన్లైన్ మార్కెట్ కూడా విస్తరించింది. ఆన్లైన్ ఆర్డరిస్తే ఎంత దూరమైనా హల్వా పంపించే స్థాయికి మార్కెట్..నెట్వర్క్ అభివృద్ధి చెందింది. జీడి, బాదం పలుకులతో పాటు కవ్వంతో చిలికిన ఆవు నెయ్యి, ఎండు ఖర్జూరం నీళ్లు, తేనే..గోధుమ పాలుతోపాటు రాతి రుబ్బి రాయితో గంటలు పాటు సాన పట్టి కర్రలు పొయ్యిలో తగిన ఉష్ణోగ్రతలో తగిన పాకంతో పదునుపట్టగానే పుట్టుకొచ్చేదే మాడుగుల హల్వా. సినీతారలు ఫిదా అరకు, పాడేరు ప్రాంతాల్లో జరిగే సినీ షూటింగ్‌లకు ప్రముఖ హీరోహీరోయిన్లు మాడుగుల హల్వా రుచికి ఫిదా అయినవాళ్లే. హల్వాను లొట్టలేసుకుని తిన్నవారే..అందుకే ఈ ప్రాంతానికి సినీ తారలు ఎవరొచ్చినా కచ్చితంగా హల్వా రుచి చూడకుండా వెళ్లరు. పర్యాటక ప్రాంతాలు వీక్షించేందుకు వచ్చే పర్యటకులు మాడుగుల హల్వా రుచి చూడకుండా వెళ్లరు. విశాఖ అందాలను చూసేందుకు ఎంత ఉవ్విళ్లూరతారో.. మాడుగుల హల్వా తినేందుకు కూడా అంతే ఆసక్తి కనబరుస్తారు. అందుబాటులో ధరలు మాడుగులలో మేలు రకం కిలో రూ 500కాగా రెండో రకం కిలో రూ.400. స్థానిక వ్యాపారంతో పాటు పార్సిల్ ద్వారా ఇతర ప్రాంతాలకు ప్రతి రోజు ఎగుమతి జరుగుతోంది. మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. దంగేటి కుటుంబం మాత్రమే తయారీ చేసేవారు. తయారీ గుట్టురట్టవ్వడంతో మాడుగుల పట్టణానికి చెందిన దాసరి కుటుంబీకులు కూడా హల్వా పాకం, పదునును కనిపెట్టడంతో ప్రస్తుతం సుమారు 20 షాపులకుపైగా ఏర్పాటయ్యాయి. విదేశాలకు హల్వా రుచులు మాడుగులకు చెందిన కొందరు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. పండగలకు, శుభకార్యాలకు మాడుగుల వచ్చి తిరిగి వెళ్లేటప్పుడు విదేశీ స్నేహితుల కోసం హల్వా తీసుకువెళ్లడం..ఆ రుచికి వారు మైమరచిపోవడం ఈ స్వీటుకున్న క్రేజ్ తెలియజేస్తుంది. హైదరాబాద్ చిత్రపురి హౌసింగ్ సొసైటీ జనరల్ సెక్రటరీ, సినీ నటుడు కాదంబరి కిరణ్‌కు మాడుగుల హల్వా అంటే చెప్పలేని ఇష్టం. అంతేకాదు చిత్రపురి కార్మికులకు తన స్నేహితుడైన కేజేపురం గ్రామానికి చెందిన పుట్టా ప్రసాద్ బాబుతో హల్వా రప్పించి పంపిణీ చేస్తుంటారు. హైదరాబాద్, తిరుపతి, విజయవాడ, భద్రాచలం, చెన్నై లాంటి నగరాల్లో కార్తీక ఉత్సవాలు, దసరా ఉత్సవాలు, కోటి దీపాలంకరణ సమయాల్లో ఇక్కడ నుంచి హల్వా తీసుకెళ్లి వందలాది మంది నిరుద్యోగులు జీవనం సాగిస్తుంటారు. హల్వా టర్నోవర్ సాధారణ రోజుల్లో ఒక్కో షాపులో రూ.1500 నుంచి రూ.2 వేలు వరకు విక్రయిస్తారు. పండగ, పర్యాటకుల రద్దీ ఉన్న సమయాల్లో రూ.4 వేలకు పైగా వ్యాపారాలు జరుగుతాయి. ఈ ఒక్కో షాపు నెలకు రూ.5లక్షలకు పైగానే వ్యాపారం సాగిస్తోంది. 5 వేల మందికి ఉపాధి మాడుగుల కేంద్రంగా తయారయ్యే హల్వా వ్యాపారంపై ప్రత్యక్షంగా పరోక్షంగా సుమారు 5 వేల మందికి పైగా నిరుపేద కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఇక్కడ నుంచి విశాఖ, అనకాపల్లి, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వరకు ఎగుమతి చేస్తున్నారు. హల్వా సృష్టి కర్త దంగేటి ధర్మారావు నుంచి అతని కుమారుడు, మనుమలు, ముని మనవళ్లు హల్వా తయారీలో నిష్ణాతులు. తరాలు మారుతున్న హల్వా రుచి ఏ మాత్రం తగ్గలేదు. మాడుగుల నుంచి ఢిల్లీ తదితర ప్రాంతాలకు ప్రతి రోజు హల్వా విక్రయాలు జరుగుతూనే ఉంటాయి. అరకు షూటింగ్‌కు వచ్చిన అల్లు అర్జున్, విజయశాంతి, రాజకీయ నాయకులు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో పాటు ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి సైతం నాటి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారని వ్యాపారులు దంగేటి మోహన్ , దాసరి ప్రసాద్ చెబుతున్నారు. అలాగే నాటి ప్రధాని ఇందిరా గాంధీ గత 40 ఏళ్ల క్రితం ఎన్నికల ప్రచారానికి వచ్చినపుడు హల్వా రుచి చూసి..ఢిల్లీకి పంపాలని అప్పటి సీనియర్ నాయకుడు వేమరవపు వెంకటరమణకు చెప్పారట. అంతలా మాడుగుల హల్వా రుచి అందరి మనసు గెలుచుకుంది. పోస్టల్ కవర్ పై .. విశాఖ జిల్లా మాడుగుల వేదికగా 1890లో తొలిసారి తయారు చేసే హల్వాకు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. మాడుగుల వాసులు తయారు చేసే ఈ రకమైన హల్వాకు లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఉందని అంతర్జాతీయంగా కూడా ప్రచారం జరిగింది. గోధుమ పాలు, నెయ్యి, బాదం పప్పు, జీడిపప్పు వంటి వాటితో మాడుగుల వాసులు తయారు చేసే హల్వా కూడా తపాలా శాఖ విడుదల చేసిన పోస్టల్ కవర్ల పై ఉండటంతో విస్తృత ప్రచారం జరుగుతోంది. మాడుగుల టు ప్యారిస్ మాది విశాఖ జిల్లా మాడుగుల మండలం సత్యవరం గ్రామం. ఉద్యోగరీత్యా ప్యారిస్‌లో 8 ఏళ్లుగా స్థిరపడ్డాం. మాడుగుల ఎప్పుడు వచ్చినా హల్వా తీసుకెళ్లి ప్యారిస్‌లో ఉన్న స్నేహితులకు ఇస్తుంటా..ఇండియా వచ్చినప్పుడు హల్వా మర్చిపోవద్దు అంటూ స్నేహితులు పదేపదే చెబుతుంటారు. –గోపిశెట్టి వెంకటేష్, మెకానికల్ ఇంజనీర్, ప్యారిస్ తరాలుగా ఒకటే రుచి తాతలు నాటి క్వాలిటీని నేటికీ కొనసాగిస్తున్నాం. ఆవు నెయ్యి, బాదం జీడి పలుకులు, గోధుమ పాలతో చేసే హల్వా రుచి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. అందుబాటు «ధరల్లో విక్రయాలు జరుపుతున్నాం. హల్వా తయారీలో మా ముత్తాత ధర్మారావు టెక్నిక్ అనుసరిస్తున్నాం. అందుకే రుచిలో ఒకలా ఉంటుంది. –దంగేటి మోహన్,హల్వా తయారీదారుడు మాడుగుల -
ఊరించే ఉసిరి రుచులు: పుల్లటి హల్వా, నోరూరే రసం తయారీ ఇలా..
కార్తీక మాసం ప్రారంభం కావడంతోనే నేనున్నాని గుర్తు చేస్తుంది... కాస్త వగరు, నొసలు ముడివడేలా చేసే పులుపు ఉసిరి. ఈ కాలంలో ఉసిరి తింటే ఎంతో మంచిది. విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే సీజనల్ ఫ్రూట్ అయిన ఉసిరిని రోజూ నేరుగా తినలేం కాబట్టి... వెరైటీగా ఎలా వండవచ్చో చూద్దాం. పుల్లటి హల్వా కావల్సిన పదార్ధాలు ఉసిరికాయలు – 20 నెయ్యి – అరకప్పు పంచదార – కప్పు ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు జీడి పప్పు – పది కిస్మిస్ – పది నీళ్లు – పావు కప్పు యాలకుల పొడి – టీస్పూను తయారీ విధానం ►ఉసిరికాయలను శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేసి పేస్టులా చేయాలి. పేస్టుని, జ్యూస్‌ను వేరువేరుగా తీసి పక్కన బెట్టుకోవాలి. ►కిస్మిస్, జీడిపప్పుని నెయ్యిలో దోరగా వేయించి పక్కనబెట్టుకోవాలి. ►బాణలిలో ఉసిరిజ్యూస్, పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. ►నీళ్లు బాగా మరిగాక ఉసిరిపేస్టు, పంచదార వేసి తిప్పాలి. ►పదినిమిషాలు కలుపుతూ ఉడికించిన తరువాత ఫుడ్ కలర్, నెయ్యి వేయాలి. ►ఐదు నిమిషాలు మగ్గాక జీడిపప్పు, కిస్మిస్లతో గార్నిష్ చేస్తే పుల్లని ఆమ్లా హల్వా రెడీ. చదవండి: Viral: తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..! నోరూరే రసం కావల్సిన పదార్ధాలు ఉసిరి కాయలు – మూడు కందిపప్పు – రెండు టేబుల్ స్పూన్లు టొమాటో – ఒకటి చింతపండు రసం – రెండు టేబుల్ స్పూన్లు అల్లం – పావు అంగుళం ముక్క వెల్లుల్లి – రెండు రెబ్బలు మినప గుళ్లు – రెండు టీస్పూన్లు జీలకర్ర – అర టీస్పూను ఆవాలు – అరటీస్పూను మిరియాల పొడి – పావు టీస్పూను ఎండు మిర్చి – ఒకటి రసం పొడి – టీస్పూను ఉప్పు – రుచికి సరిపడా బెల్లం – చిన్న ముక్క పసుపు – పావు టీస్పూను కరివేపాకు – రెండు రెమ్మలు ఇంగువ – చిటికెడు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు తయారీ విధానం ►ముందుగా కందిపప్పుని కడిగి టొమాటో ముక్కలు వేసి ఉడికించి, రుబ్బి పక్కనబెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి మినపగుళ్లు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించి పొడిచేసుకోవాలి. ►ఈ పొడిలో విత్తనాలు తీసిన ఉసిరికాయ ముక్కలు, తొక్కతీసిన అల్లం పేస్టు వేయాలి. ►ఇప్పుడు తాలింపు బాణలిలో ఆయిల్ వేడెక్కిన తరువాత..ఆవాలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లిని వేసి వేగనివ్వాలి. ►తరువాత ఉసిరిపేస్టు, పసుపు, రసం పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు రుబ్బిన పప్పు, రసానికి సరిపడా నీళ్లు, చింతపండు రసం, బెల్లం, కొత్తిమీర వేసి మరిగిస్తే నోరూరే రసం రెడీ. చదవండి: Vidit Aatrey: అతిపెద్ద సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘మీ షో యాప్’ తెర వెనుక కథ!! -
Diwali Special: స్వీట్ ఫ్రిట్టర్స్, మూంగ్ హల్వా ఇలా తయారు చేసుకోండి..
దీపావళి పర్వదినాన ఈ స్వీట్లతో మీ నోరు తీపిచేసుకోండి..! స్వీట్ ఫ్రిట్టర్స్ కావల్సిన పదార్థాలు బియ్యం – కప్పు అరటి పండ్లు – రెండు (తొక్కతీసి ముక్కలుగా తరగాలి) యాలకులు – మూడు, బెల్లం – ముప్పావు కప్పు నీళ్లు – రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి – టేబుల్ స్పూను ఎండుకొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు సొంఠి పొడి – పావు టీస్పూను నువ్వులు – టీస్పూను బేకింగ్ సోడా – టీస్పూను ఉప్పు – చిటికడు ఆయిల్ లేదా నెయ్యి – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ విధానం ►ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. ►నానిన బియ్యాన్ని నీళ్లు తీసేసి, మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. దీనిలో అరటిపండు ముక్కలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మీడియం మంట మీద సిరప్ తయారయ్యాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ►బెల్లం సిరప్‌ను వడగట్టి, గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమంలో వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ►చిన్న పాన్ పెట్టి టీస్పూను నెయ్యి వేసి కొబ్బరి ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను నెయ్యితోపాటు పిండిలో వేయాలి. నువ్వులు, సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ►ఇప్పుడు మౌల్డ్స్‌లో నెయ్యి లేదా నూనె వేసి కాగాక బ్యాటర్‌ను వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ►మరోవైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్కలర్లోకి మారేంత వరకు వేయించితే ఉన్ని అప్పం రెడీ. చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! మూంగ్ హల్వా కావల్సిన పదార్థాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు చాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి) నీళ్లు – రెండు కప్పులు నెయ్యి – అరకప్పు గోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – ముప్పావు కప్పు ఫుడ్ కలర్ – చిటికెడు యాలకుల పొడి – పావు టీస్పూను జీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి. ►తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ►పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి. ►పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి. ►ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ►స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. చదవండి: Diwali Lakshmi Puja 2021: ఈ 5 చోట్ల దీపాలు తప్పక వెలిగించాలట..! -
Diwali Special Sweets: మలై లడ్డు, మిల్క్ బర్ఫీ, బొప్పాయి హల్వా తయారీ ఇలా..
వెలుగునిచ్చే దీపాలు, మిరుమిట్లుగొలిపే క్రాకర్స్, నోటిని తీపిచేసే∙స్వీట్లలోనే దీపావళి సందడంతా కనిపిస్తుంది. ఏటా చేçసుకునే మిఠాయిలు కాకుండా, ఆయిల్ వాడకుండా పాలతో ఆరోగ్యకరమైన స్వీట్లను సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... బొప్పాయిహల్వా కావల్సిన పదార్ధాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు బొప్పాయి పండు – ఒకటి (తొక్కసి తురుముకోవాలి) పంచదార – పావు కప్పు బాదం పప్పు పొడి – మూడు టేబుల్ స్పూన్లు యాలకుల పొడి – టీ స్పూను కోవా తురుము – మూడు టేబుల్ స్పూన్లు బాదం పలుకులు – రెండు టీస్పూన్లు. తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి. ►నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. మిల్క్ బర్ఫీ కావల్సిన పదార్ధాలు పాలపొడి – రెండున్నర కప్పులు పంచదార – ముప్పావు కప్పు పాలు – కప్పు నెయ్యి – పావు కప్పు పిస్తా పలుకులు – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►గిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి. ►స్టవ్ మీద నాన్ స్టిక్ పాన్ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి. ►10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్ పేపర్ పరిచిన ట్రేలో వేయాలి. ►ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తాపలుకులు వేసి మరోసారి వత్తుకోని,ట్రేను గంటపాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. ►రిఫ్రిజిరేటర్ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్ చేసుకుంటే మిల్క్ బర్ఫీ రెడీ. మలై లడ్డు కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు కండెన్సెడ్ మిల్క్ – ముప్పావు కప్పు యాలకుల పొడి – పావు టీస్పూను. కోవా నెయ్యి – అరటీస్పూను పాలు – పావు కప్పు ఫ్రెష్ క్రీమ్ – పావు కప్పు పాల పొడి – ముప్పావు కప్పు తయారీ విధానం ►ముందుగా పాలను కాచి, నిమ్మరసం వేసి పన్నీర్‌లా చేసుకోవాలి. ►బాణలి వేడెక్కిన తరువాత అరటీస్పూను నెయ్యి, పావు కప్పు పాలు పోసి వేయించాలి. ఇవన్నీ బాగా కలిసిన తరువాత ముప్పావు కప్పు పాలపొడి వేసి తిప్పుతూ ఉడికించాలి. ►బాణలి నుంచి ఈ పాలమిశ్రమం గట్టిపడి ఉండలా చుట్టుకునేటప్పుడు దించేస్తే పాలకోవ రెడీ. ►ఇప్పుడు స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని..ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్, కోవా వేసి సన్నని మంట మీద తిప్పుతూ వేయించాలి. ►మిశ్రమం మృదువుగా మారాక ముప్పావు కప్పు కండెన్స్డ్ పాలు పోసి కలపాలి. కండెన్స్డ్ పాలు తియ్యగా ఉంటాయి కాబట్టి పంచదార వేయకూడదు. ►మిశ్రమం దగ్గరపడ్డాకా.. యాలకులపొడి వేసి మరో ఐదునిమిషాలు వేయించి దించేయాలి. ►గోరువెచ్చగా ఉన్నప్పుడే గుండ్రంగా చుట్టుకుంటే మలై లడ్డు రెడీ. చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట! -
Quick Sweet Recipes: నోరూరించే కిస్మిస్ లడ్డూ, కస్టర్డ్ ఆపిల్ హల్వా తయారీ ఇలా..
స్వీట్లు చూస్తే ఆగలే.. బజార్లో దొరికే స్వీట్లలో నాణ్యతలేని పదార్థాలు కలుపుతారు.. తింటే ఆరోగ్య సమస్యలు. ఇంట్లోనే మీకిష్టమైన స్వీట్లు తయారు చేస్తే.. కిస్మిస్ లడ్డూ, కస్టర్డ్ ఆపిల్ హల్వా తయారీ విధానం మీకోసం.. కిస్మిస్ లడ్డూ కావలసిన పదార్థాలు: ►కిస్మిస్ పేస్ట్ – 1కప్పు (మిక్సీ పట్టుకోవాలి) ►కొబ్బరి పాలు, తేనె, పీనట్ బటర్ – 4 టేబుల్ స్పూన్ల చొప్పున ►ఓట్స్ – పావు కప్పు ( వేయించి పౌడర్లా మిక్సీ పట్టుకోవాలి) ►బాదం పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు ►నెయ్యి – ఉండ చేసేందుకు చేతులకు ►కొబ్బరి తురుము – కొద్దిగా (అభిరుచిని బట్టి) తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో ఓట్స్ పౌడర్, కొబ్బరిపాలు, తేనె, పీనట్ బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. అందులో బాదం పౌడర్, కిస్మిస్ పేస్ట్ కూడా వేసుకుని ముద్దలా కలుపుకుని, చేతులకు నెయ్యి రాసుకుని చిన్న చిన్న లడ్డూల్లా చేసుకోవాలి. అనంతరం కొబ్బరి తురుములో ఈ లడ్డూలను దొర్లిస్తే సరిపోతుంది. కస్టర్డ్ ఆపిల్ హల్వా కావలసిన పదార్థాలు: ►సీతాఫలం (కస్టర్డ్ ఆపిల్) – 1 కప్పు (బాగా మగ్గిన సీతాఫలాలను పైతొక్క తొలగించి, వడకట్టే తొట్టెలో వేసుకుని, దాని కింద గిన్నె పెట్టుకుని, చేత్తో నలిపి గింజలన్నీ ►తొలగించి గుజ్జు తీసుకోవాలి) ►నెయ్యి, సుజీ రవ్వ – అర కప్పు చొప్పున ►పంచదార – పావు కప్పు, చిక్కటి పాలు – 1 కప్పు ►జాజికాయ పొడి – పావు టీ స్పూన్ ►కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలు – ►అర టేబుల్ స్పూన్ చొప్పున (నేతిలో వేయించి పక్కనపెట్టుకోవాలి) తయారీ విధానం ముందుగా కళాయిలో నెయ్యి వేసుకుని.. అందులో రవ్వ వేసి తిప్పుతూ ఉండాలి. తర్వాత పంచదార, పాలు పోసుకుని దగ్గర పడే వరకూ మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అనంతరం సీతాఫలాల గుజ్జు, జాజికాయ పొడి, నేతిలో వేయించిన కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలూ వేసి తిప్పుతూ దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చదవండి: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ.. -
చపాతీ వెజ్ రోల్స్ చేయడం ఇంత సులువా?
చపాతీ వెజ్ రోల్స్ కావలసినవి: చపాతీలు – 4, క్యాప్సికమ్ – 2, టమాటోలు –2, బంగాళదుంపలు – 2(మెత్తగా ఉడికించి ముక్కలుగా కట్ చేసుకోవాలి), పచ్చి బటానీలు – 2 టేబుల్ స్పూన్లు(నానబెట్టి, ఉడికించుకోవాలి), ఉల్లిపాయ – 2(ముక్కలు కట్ చేసుకోవాలి), పచ్చిమిర్చి – 3(ముక్కలు కట్ చేసుకోవాలి), మిరియాల పొడి – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – 1 టీ స్పూన్, పసుపు – అర టీ స్పూన్, టమాటో కెచప్ – 1 టీ స్పూన్, ఉప్పు – సరిపడా, నూనె – తగినంత తయారీ: కళాయిలో నూనె వేసి వేడెక్కాక తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత క్యాప్సికమ్, టమాటోలను సన్నగా తరిగి వాటిని కూడా వేయించాలి. తర్వాత బంగాళదుంప ముక్కలు, బటానీలు వేసుకుని కూరలా చేసుకోవాలి. అవసరం అనిపిస్తే కాస్త నీళ్లు పోసి ఉడికించాలి. దించడానికి కొన్ని నిమిషాల ముందు జీలకర్ర పొడి, ఉప్పు, టమాటా కెచప్ వేసి ఉడికించాలి. అనంతరం చపాతీలను పెనంపై ఇరువైపులా కాల్చి.. కర్రీ వేడిగా ఉన్నప్పుడే చపాతీపై ఒకవైపు వేసుకుని రోల్స్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. డేట్స్ హల్వా కావలసినవి: ఖర్జూరం – 2 కప్పులు(గింజలు తొలగించి, శుభ్రం చేసుకోవాలి), నెయ్యి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు(1 కప్పు నీళ్లలో బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి), నీళ్లు – సరిపడినన్ని, నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 10(ముక్కలు కట్ చేసుకుని నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి), ఏలకుల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా ఖర్జూరంలో ఒక కప్పు వేడి నీళ్లు వేసుకుని 30 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మిక్సీ పెట్టుకుని మెత్తటి పేస్ట్‌లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని.. ఆ మిశ్రమాన్ని మొత్తం బౌల్లో వేసుకుని, అందులో పావు కప్పు నెయ్యి వేసుకుని గరిటెతో తిప్పుతూ చిన్న మంటపైన ఉడికించుకోవాలి. దగ్గర పడేసరికి మళ్లీ 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుని తిప్పుతూ ఉండాలి. తర్వాత మొక్కజొన్న మిశ్రమాన్ని వేసుకుని తిప్పుతూ ఉండాలి. మళ్లీ 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుని, వేయించి పక్కన నెట్టుకున్న జీడిపప్పు ముక్కలు, ఏలకుల పొడి వేసుకుని బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని.. ఒక బౌల్లోకి తీసుకుని 30 నిమిషాలు చల్లారిన తర్వాత నచ్చిన షేప్‌లో కట్ చేసుకుంటే సరిపోతుంది. బ్రింజాల్ రోల్స్ కావలసినవి: వంకాయలు (బ్రింజాల్) – 3 లేదా 4 (పొడవైనవి), ఆలివ్ నూనె – 2 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి – అర టీ స్పూన్, నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – 4 టేబుల్ స్పూన్లు, ఉడికించిన బియ్యం రవ్వ – ముప్పావు కప్పు, అవకాడో – 1, నూనె – డీప్ ప్రైకి సరిపడా, టమాటా ముక్కలు – పావు కప్పు, జీలకర్ర పొడి – అర టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, ఉల్లికాడ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు, బీట్ రూట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు, పుదీనా తరుగు – 1 టేబుల్ స్పూన్లు, క్యారెట్ – 3, వేరుశనగలు – పావు కప్పు (రవ్వలా మిక్సీ పట్టుకోవాలి), ఉప్పు – తగినంత తయారీ: ముందుగా వంకాయలను శుభ్రం చేసుకుని, కాడలు తొలగించి పదిహేను నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఆలీవ్ నూనె, ఉప్పు, మిరియాల పొడి, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం, నీళ్లు వేసుకుని బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఓ పాన్‌లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని వేడి కాగానే వేరుశనగ రవ్వ, బీట్రూట్ తురుము, టమాటా ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉల్లికాడ ముక్కలు, పుదీనా తరుగు, కొత్తిమీర తరుగు, జీలకర్ర పొడి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ గరిటెతో తిప్పుతూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు అందులో ఉడికించిన బియ్యం రవ్వను కూడా వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో ఆలివ్ మిశ్రమం కూడా వేసుకుని, చివరిగా సరిపడా ఉప్పు వేసుకుని, బాగా కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత మెత్తగా ఉడికిన వంకాయలను పొడవుగా (థిన్ స్లైస్‌లా) కట్ చేసుకుని, నూనెలో దోరగా వేయించుకుని, అందులో కొద్దికొద్దిగా ఈ మిశ్రమాన్ని ఉంచుతూ రోల్స్‌లా చుట్టుకుని కొత్తిమీర లేదా పుదీనాతో గార్నిష్ చేసుకుని, టమాటా సాస్‌తో సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. సేకరణ: సంహిత నిమ్మ -
నోరూరించే ఎగ్ బన్స్ చేసుకోండిలా..
ఎగ్ బన్స్ కావలసినవి: గుడ్లు – 6 బన్స్ – 6, ఉల్లిపాయలు – 3 పచ్చిమిర్చి – 2 చీజ్ తురుము – 2 టీ స్పూన్లు కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ – అర టీ స్పూన్ కారం – 1 టీ స్పూన్ మిరియాల పొడి – 1 లేదా 2 టీ స్పూన్లు ఉప్పు – తగినంత తయారీ: ముందుగా బన్స్ పైభాగం తొలగించి గుంతల్లా చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, చీజ్ తురుము, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. అభిరుచిని బట్టి మరిన్ని జోడించుకోవచ్చు. ఆ మొత్తం మిశ్రమాన్ని కొద్దికొద్దిగా బన్స్ బౌల్స్‌లో వేసుకుని.. ప్రతి బన్‌లో ఒక కోడిగుడ్డు కొట్టి.. ఓవెన్లో ఉడికించుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఆపిల్ కోవా హల్వా కావలసినవి: ఆపిల్స్ – 3 (పైతొక్క తొలగించి గుజ్జులా చేసుకోవాలి) బాదం గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు కోవా – అర కప్పు దాల్చినచెక్క పొడి – అర టీ స్పూన్ పంచదార – అర కప్పు నెయ్యి – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేడికాగానే.. ఆపిల్ గుజ్జు, బాదం గుజ్జు వేసుకుని గరిటెతో తిప్పుతూ.. ఉడికించుకోవాలి. అందులో పంచదార యాడ్ చేసుకుని, బాగా కరిగే వరకూ తిప్పుతూ ఉండాలి. కోవా, దాల్చిన చెక్క పొడి వేసుకుని బాగా కలుపుతూ దగ్గరపడే వరకూ తిప్పుతూ మిగిలిన నెయ్యి వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అరటిపండు పునుగులు కావలసినవి: అరటి పండ్లు – 4 (మెత్తగా గుజ్జులా చేసుకోవాలి) గోధుమ పిండి – పావు కప్పు బియ్యప్పిండి – పావు కప్పు మైదా పిండి – పావు కప్పు మొక్కజొన్న పిండి – ముప్పావు కప్పు ఉప్పు – తగినంత బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్ పంచదార – 2 టేబుల్ స్పూన్లు నూనె – డీప్ ఫ్రై కి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో అరటిపండ్ల గుజ్జు, గోధుమ పిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, పంచదార, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి జోడించి, బాగా కలుపుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని బాగా కాగుతున్న నూనెలో పునుల్లా వేసుకుని దోరగా వేయించి సర్వ్ చేసుకోవాలి. - సేకరణ: సంహిత నిమ్మన -
ప్రసిద్ధ కడాయి హల్వా యజమాని ఆత్మహత్య
సాక్షి, చెన్నై: తమిళనాడులో ప్రసిద్ధి చెందిన తిరునల్వేలి ఇరుట్టు కడాయి హల్వా యజమాని హరిసింగ్(70) కరోనా వ్యాధి సోకడంతో గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత రెండు రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన అనూహ్యంగా ఉరివేసుకుని చనిపోవడం కుటుంబ సభ్యులను విషాదంలోకి నెట్టింది. అభిమానులు ట్విటర్లో హరిసింగ్ కుటుంబానికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. యూరినరీ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న సింగ్‌ను మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనకు కరోనా పరీక్ష నిర్వహించగా గురవారం ఉదయం పాజిటివ్ గా తేలడంగా ఆయన ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. మరోవైపు హరిసింగ్ అల్లుడు కూడా కోవిడ్-19 బారిన పడినట్టు తెలుస్తోంది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అతని కుటుంబానికి అప్పగిస్తామని తిరునెల్వేలి డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) ఎస్ శరవణన్ తెలిపారు. కాగా దేశవ్యాప్తంగా చాలా ప్రసిద్ధి చెందింది ఇరుట్టు కడాయి హల్వా. 100 సంవత్సరాల క్రితం స్థాపించబడిన ఈ దుకాణం ఇప్పటికీ తిరునల్వేలిలో పర్యాటక కేంద్రంగా ఉందంటే ఈ హల్వా ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చు. చదవండి : కరోనా మందు : మరిన్ని చిక్కుల్లో రాందేవ్ -
బుట్ట భోజనం ఆర్డర్: ఓపెన్ చేస్తే ఈగ!
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కారణంగా బయట ఫుడ్ తినాలంటేనే జనాలు జంకుతున్నారు. అయితే కొన్నిసార్లు ఈ భయాన్ని జిహ్వచాపల్యం అణిచివేస్తుంది. ముఖ్యంగా నగరవాసులు ఆహారం కోసం ఎక్కువగా ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలమీదే ఆధారపడుతారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఈగ వచ్చిన ఘటన హైదరాబాద్‌లో వెలుగు చూసింది. భాగ్యనగరానికి చెందిన బెల్లం శ్రీనివాస్ అనే వ్యక్తి కొండాపూర్‌లోని సుబ్బయ్యగారి హోటల్ నుంచి స్విగ్గీలో బుట్ట భోజనం ఆర్డర్ చేశాడు. అనంతరం డెలివరీ బాయ్ అతని ఆహారాన్ని తీసుకువచ్చి ఇవ్వగానే ఎంతో ఆతృతగా దాన్ని ఓపెన్ చేశాడు. (ఇక డ్రోన్స్‌తో ఫుడ్ డెలివరీ!) ఇంతలో హల్వాలో తేడా కొట్టొచ్చినట్లు కనిపించింది. దాన్ని చేతిలోకి తీసుకుని మరింత పరిశీలించి చూడగా అది ఈగ అని తెలిసింది. దీంతో అతను సోషల్ మీడియాలో స్వీటు ఫొటోను పోస్ట్ చేశాడు. "ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు కరోనా కాలంలోనూ మంచి భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్తారు. కానీ తీరా ఇలాంటి అపరిశుభ్రమైన ఆహారాన్ని అందిస్తారు. అదృష్టం బాగుండి నేను దాన్ని తినకముందే చూశాను" అంటూ పేర్కొన్నాడు. దీనిపై స్పందించిన స్విగ్గీ క్షమాపణలు తెలిపింది. ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని పేర్కొంది. (ఏం తింటున్నాం? ఎలా తింటున్నాం?) -
ముచ్చటగా మూడు వంటలు
శనగపప్పు దోసెలు కావలసినవి: ఆలూ మసాలా కర్రీ – 2 కప్పులు (ముందుగా రెడీ చేసుకోవాలి), బియ్యం – 4 కప్పులు, శనగ పప్పు – ఒకటిన్నర కప్పులు , మినప్పప్పు – 1 కప్పు, మెంతులు – 1 టీ స్పూన్, పంచదార – ఒక టీ స్పూన్, ఉప్పు – సరిపడా తయారీ: శనగ పప్పు, బియ్యం, మినప్పప్పులను విడివిడిగా 5 గంటల పాటూ నానబెట్టుకోవాలి. తర్వాత అన్నింటినీ కలిపి మిక్సీలో పేస్ట్‌లా చేసుకుని రాత్రంతా పక్కన పెట్టుకోవాలి. మరునాడు నెయ్యితో దోసెలు వేసుకుని పైన ఆలూ మసాలా కర్రీని పెట్టి మడుచుకోవాలి. వీటిని కొబ్బరి చట్నీతో తింటే భలే రుచిగా ఉంటుంది. మీల్ మేకర్ పకోడీ కావలసినవి: మీల్ మేకర్ – అర కప్పు, మొక్కజొన్న పిండి – అర కప్పు, బియ్యప్పిండి – అర కప్పు , శనగపిండి – అర కప్పు, ఉల్లిపాయ తరుగు – 1 కప్పు, కారం – అర టీ స్పూన్, నిమ్మరసం – 2 టీ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్టు – 2 టీ స్పూన్లు, నూనె – డ్రీప్ ఫ్రైకి సరిపడా, నీళ్లు – కొద్దిగా, ఉప్పు – తగినంత తయారీ: ముందుగా వేడి నీళ్లలో మీల్ మేకర్ వేసుకుని పది లేదా పదిహేను నిమిషాల పాటూ నానబెట్టుకోవాలి. తర్వాత నీళ్లు పిండిన మీల్ మేకర్స్ తురుముకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో మీల్ మేకర్ తురుము, మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి, శనగపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, ఉల్లిపాయ తరుగు, నిమ్మరసం అన్ని వేసుకుని కాస్త నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ షేప్‌లో చేసుకుని.. మరుగుతున్న నూనెలో వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఆపిల్ హల్వా కావలసినవి: ఆపిల్ – 3, పంచదార – ముప్పావు కప్పు, నెయ్యి – 1 కప్పు, ఏలకుల పొడి – అర టీ æస్పూను, జీడిపప్పు ముక్కలు – 1 టీ స్పూ న్, బాదం ముక్కలు – 1 టీ స్పూన్ తయారీ: ముందుగా ఆపిల్స్ శుభ్రం చేసుకుని, తొక్కలు తొలగించి మిక్సీ పట్టుకుని గుజ్జులా చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని.. పాత్రపెట్టుకోవాలి. ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని వేడి కాగానే.. జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆ నెయ్యిలో ఆపిల్ గుజ్జు వేసుకుని బాగా కలపాలి. స్టవ్ మంట తగ్గించి పది నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ ఉండాలి. తర్వాత పంచదార వేసి బాగా కలపాలి. ఇప్పుడు గరిటెతో తిప్పుతూ మధ్య మధ్యలో నెయ్యి వేస్తూ ఉండాలి. ఆపిల్ మిశ్రమం దగ్గరపడగానే.. ఏలకుల పొడి, జీడిపప్పు ముక్కలు, బాదం ముక్కలు కూడా అందులో కలుపుకుని గరిటెతో తిప్పుతూ 2 నిమిషాలకు ముందే దించేసుకోవచ్చు. సేకరణ: సంహిత నిమ్మన -
పేరు గల మాడుగుల హల్వా
మాడుగుల హల్వా ఘుమఘుమలు ఎల్లలు దాటాయి.నాలుగు తరతరాలు గడుస్తున్నాహల్వాకు ఆదరణ తగ్గలేదు.నేటికీ నిత్య మధురంగా ఉంటూ,అందరి నోటినీ పలకరిస్తోంది.విశాఖపట్టణం వచ్చినవారికి, మాడుగుల కూడా ఒక పర్యాటక ప్రదేశమే.సుమారు 125 సంవత్సరాల క్రితం ప్రారంభమైన మాడుగుల హల్వా ఈ వారం మన ఫుడ్ ప్రింట్స్... మాడుగుల పేరు వింటేనే ముందుగా గుర్తొచ్చేది నోరూరించే హల్వా. ఈ తీయని పేరు సముద్ర తీరాలు దాటింది. విశాఖపట్టణానికి వచ్చినవారు, అక్కడి ప్రదేశాలను సందర్శించాక, నేరుగా మాడుగుల చేరుకుంటారు. నేతి వాసనతో ఘుమఘుమలాడే హల్వా రుచి చూస్తారు. విశాఖ జిల్లా మాడుగుల ప్రాంతం పేరుతోనే ఆ హల్వాకు మాడుగుల హల్వా అని పేరు వచ్చింది. 1890లో ఒక సామాన్య మిఠాయి వ్యాపారి ఇంట్లో పురుడు పోసుకుంది ఈ హల్వా. ఇంతింతై వటుడింతౖయె నుంచి త్రివిక్రముని స్థాయికి చేరినక ఈ హల్వా దేశ సరిహద్దులు దాటింది. హల్వా పుట్టుక మాడుగుల గ్రామానికి చెందిన దంగేటి ధర్మారావు సుమారు 130 ఏళ్ల కిందట మిఠాయి వ్యాపారం ప్రారంభించారు. మొదట్లో బూడిద గుమ్మడి, కొబ్బరికాయలతో హల్వా తయారు చేసి అమ్మేవారు. కొంతకాలం తరవాత ఏదో ఒక కొత్త రకమైన స్వీట్ తయారుచేయాలనే ఆలోచన కలిగింది. ఆ ఆలోచన... తియ్యని హల్వా రూపంలో ఆచరణలోకి వచ్చింది. మాడుగుల హల్వా తయారీ విధానం మంచి రకం గోధుమలను మూడు రోజుల పాటు నానబెట్టి, రుబ్బి, గోధుమ పాలు తీస్తారు. ఆ పాలను ఒక రోజు పులియబెట్టి ఆ తర్వాత పెద్ద పాత్రలో పోస్తారు. నెయ్యి, బెల్లం జత చేసి, మంట మీద ఉంచి, పాలు బాగా మరిగి దగ్గర పడేవరకు కలిపి దింపేస్తారు. జీడి పప్పు, బాదం పప్పులతో అలంకరిస్తారు. హల్వా తయారీ వినడానికి, చూడటానికి సులువుగానే అనిపిస్తుంది కానీ, పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కొద్దిగా కష్టమే. మాడుగుల వాతావరణం, అక్కడి నీటిలో ఉండే గొప్పదనం వల్లే ఇంత రుచి వస్తుందని మాడుగుల వాస్తవ్యులు గర్వంగా చెప్పుకుంటారు. ఎంతమంది ఎన్నిరకాలుగా ప్రయత్నించినా హల్వాకు మాడుగుల కుటుంబం వారికి వచ్చిన రుచి రావటం లేదని అందరూ చెబుతుంటారు. వారికి మాత్రమే అంత రుచి రావడానికి వారు కొన్ని కారణాలు చెబుతారు. గోధుమలను రోటిలో రుబ్బడంలో నైపుణ్యం ప్రదర్శించడం, రుబ్బిన పాలను ఇనుప కళాయిలో వేసి, పాకం వచ్చే వరకు అదే వేడిలో మరగ పెట్టి హల్వా పాకం తయారు చేయడం మాడుగుల హల్వాకు రుచి రావడానికి కారణాలు. హల్వాలో పెరుగుతున్న రకాలు మొదటలో హల్వా ఒకటే రకం ఉండేది. విక్రయాలు పెరగడంతో పాటు సామాన్యులకు అందుబాటులో ఉంచడానికి హల్వాను... ఆవు నెయ్యి బాదం పప్పు బెల్లం గోధుమ పాలు; డాల్డా జీడి పప్పు బెల్లం గోధుమ పాలు; డాల్డా గోధుమపాలు నెయ్యి చక్కెరలతో మూడు రకాలుగా తయారుచేస్తున్నారు. పెరుగుతున్న షాపులు మాడుగులలో ఒకప్పుడు దంగేటి వారి హల్వా షాపు ఒక్కటే ఉండేది. కొన్నాళ్ల తరవాత వారి హల్వా తయారీ విషయం బయటకు తెలియడంతో మరో మూడు కుటుంబాలు కూడా హల్వా తయారుచేయడం ప్రారంభించారు. రుచిలోను, క్వాలిటీలోనూ దంగేటివారి హల్వా ఎక్కడా రాజీ పడలేదు. ఎన్ని షాపులు వచ్చినా దంగేటి వారి హల్వా షాపుకే మంచి పేరు ఉంది. రెండు వేల కుటుంబాలకు ఆధారం మాడుగుల హల్వా వ్యాపారం కారణంగా సుమారు 2000 కుటుంబాలు సుఖవంతమైన జీవనం సాగిస్తున్నాయి. మాడుగులలో ఉన్నత చదువులు చదువుకుని ఇతర దేశాలలో ఉద్యోగాలు చేస్తున్నారు వారంతా తప్పనిసరిగా హల్వా తీసుకెళ్ళి అక్కడ వారికి రుచి చూపిస్తున్నారు. నాలుగు తరాలుగా తగ్గని ఆదరణ... దంగేటి ధర్మారావు నుండి అతని కుమారుడు కొండలరావు, మనుమడు దంగేటి మూర్తి, ముని మనముడు మెహన్ వరకూ క్వాలిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అరకులోయకు షూటింగులకు వచ్చే సినీ నటులు ఈ హల్వాను తప్పక రుచి చూస్తారు. దివంగత ముఖ్యమంత్రి వై.స్. రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర సమయంలో మాడుగుల హల్వా రుచి చూశారు. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఈ హల్వా రుచి చూశారు. హల్వా ద్వారానే మాడుగుల ప్రసిద్ధి మత్స్య వంశ రాజుల పాలనలో మాడుగుల సామ్రాజ్యం ఉండేది. వారి పరిపాలనలో మాడుగుల ప్రాంతానికి పేరుప్రఖ్యాతులు ఉన్నప్పటికీ, హల్వా ద్వారానే మాడుగులకు దేశవిదేశాలలో మంచి గుర్తింపు వచ్చింది. మాడుగుల నుండి వచ్చామని ఎవరితోనైనా అనగానే, ‘‘హల్వా తెచ్చారేమిటి బాబూ, అదెలా తయారువుతుంది. మళ్లీ ఎప్పుడు వస్తావు, మీరు వచ్చినపుడు హల్వా తీసుకురావడం మరవకండి’’ అని పలకరించడం పరిపాటిగా మారిపోయిందని స్థానికులు చెబుతారు. - కరణం నారాయణరావు, సాక్షి, మాడుగుల, విశాఖపట్నం జిల్లా తరాలుగా ఒకటే రుచి నేటికీ కొనసాగిస్తున్నాం... ఆవు నెయ్యి, గోధుమలు, కూలీల ధరలు పెరిగినా, లాభాలు ఆశించకుండా, ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచుతున్నాం. మా ముత్తాత ధర్మారావు కనిపెట్టిన హల్వాను క్వాలిటీ తగ్గకుండా నేటి వరకు ఒకే విధంగా తయారు చేస్తున్నాం. అడ్రసు చెబితే చాలు ఎంత దూరమైన అందజేస్తున్నాం. - దంగేటి మోహన్, మునిమనుమడు, మాడుగుల -
బడ్జెట్ ‘హల్వా’ రెడీ..!
న్యూఢిల్లీ: సాంప్రదాయకంగా వస్తున్న ‘హల్వా’ తీపి రుచులతో 2019 కేంద్ర బడ్జెట్ పత్రాల ముద్రణా కార్యక్రమం ప్రారంభమైంది. న్యూఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లో సోమవారంనాడు ఈ మేరకు జరిగిన ఒక కార్యక్రమంలో ‘బడ్జెట్ హల్వా’ రుచి చూడడానికి కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రులు శివ్ ప్రతాప్ శుక్లా, పొన్ రాధాకృష్ణన్, ఆర్థికశాఖ ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. ఫైనాన్స్ సెక్రటరీ ఏఎన్ ఝా, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాశ్ చంద్ర గార్గ్, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, డీఐపీఏఎం కార్యదర్శి ఏ చక్రవర్తి, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్ కుమార్‌లు కార్యక్రమంలో పాల్గొన్న సీనియర్ అధికారుల్లో ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ఈ కార్యక్రమానికి హాజరుకాలేకపోయారు. ఎన్డీఏ ప్రభుత్వం ఫిబ్రవరి 1వ తేదీన పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. 2019లో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో... కేంద్రం ఓట్–ఆన్–అకౌంట్‌ను ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2019–2020) పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఎన్నికల అనంతరం కేంద్రంలో కొలువుదీరనున్న కొత్త ప్రభుత్వం ప్రవేశపెడుతుంది. బయటి ప్రపంచంతో సంబంధాలు కట్... కీలక హల్యా కార్యక్రమం అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడ్డానికి వీలుండదు. నార్త్ బ్లాక్ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది. అంత గోప్యత ఎందుకు? ఎంతో పకడ్బందీగా తయారయ్యే బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్ కింద ఉండే బడ్జెట్ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేస్తారు. అంతేకాక మొబైల్ ఆపరేటర్ల సమన్వయంతో ఇక్కడి నుంచి వెళ్లే ప్రతి కాల్‌ను ట్యాప్ చేస్తారు. అలాగే ఆర్థికశాఖ కార్యాలయ వరండాలలో ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పనిచేయకుండా ప్రత్యేక పరికరాలు ఏర్పాటు చేస్తారు. మధ్య మధ్యలో ‘మాక్ డ్రిల్’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరినిసమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రత సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. -
హల్వా కావాలా బాబూ!
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌కు ఎక్కవమంది బాలీవుడ్ స్టార్స్ విదేశాలకు వెళ్లి మస్త్ మజా చేస్తే కంగనా రనౌత్ మాత్రం సొంతింట్లోనే వేడుక చేసుకున్నారు. గతేడాది కంగనా హిమాచల్‌ప్రదేశ్‌లోని మనాలిలో ఓ ఇల్లు కొనుక్కున్నారు. న్యూ ఇయర్‌కు ముందు రోజు కిచెన్‌లోకి వెళ్లి ఆమె గరిటె తిప్పి హల్వా ప్రిపేర్ చేశారు. కంగనా వంట చేస్తున్న ఫొటోను ఆమె సోదరి రంగోలి షేర్ చేశారు. ఇక్కడున్న ఫొటో అదే. హల్వా కావాలా బాబు? అని అడిగేలా ఉంది కదా కంగనా స్మైల్. మరి.. టేస్ట్ ఎలా ఉందనే విషయం మైకుల ముందుకు వచ్చినప్పుడు కంగనానే అడిగి తెలుసుకుందాం. ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే... వీరనారి ఝాన్సీ లక్ష్మీభాయ్ జీవితం ఆధారంగా కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేసిన ‘మణికర్ణిక: ది క్వీన్ ఆఫ్ ఝాన్సీ’ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ప్రస్తుతం ఆమె అశ్వనీ అయ్యర్ తివారి దర్శకత్వంలో ‘పంగా’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత స్వీయదర్శకత్వంలో ఓ లవ్‌స్టోరీని తెరకెక్కించాలని కంగనా అనుకుంటున్నారట.