Diwali Special Sweets: మలై లడ్డు, మిల్క్‌ బర్ఫీ, బొప్పాయి హల్వా తయారీ ఇలా.. | How To Make Malai Laddu Milk Barfi Papaya Halwa Sweets | Sakshi
Sakshi News home page

Diwali Special Sweets: మలై లడ్డు, మిల్క్‌ బర్ఫీ, బొప్పాయి హల్వా తయారీ ఇలా..

Published Sat, Oct 30 2021 12:43 PM | Last Updated on Sat, Oct 30 2021 12:50 PM

How To Make Malai Laddu Milk Barfi Papaya Halwa Sweets - Sakshi

వెలుగునిచ్చే దీపాలు, మిరుమిట్లుగొలిపే క్రాకర్స్, నోటిని తీపిచేసే∙స్వీట్లలోనే దీపావళి సందడంతా కనిపిస్తుంది. ఏటా చేçసుకునే మిఠాయిలు కాకుండా, ఆయిల్‌ వాడకుండా పాలతో ఆరోగ్యకరమైన స్వీట్లను సులభంగా, తక్కువ సమయంలో ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం...

బొప్పాయిహల్వా
కావల్సిన పదార్ధాలు
నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు
బొప్పాయి పండు – ఒకటి (తొక్కసి తురుముకోవాలి)
పంచదార – పావు కప్పు
బాదం పప్పు పొడి – మూడు టేబుల్‌ స్పూన్లు
యాలకుల పొడి – టీ స్పూను
కోవా తురుము – మూడు టేబుల్‌ స్పూన్లు
బాదం పలుకులు – రెండు టీస్పూన్లు.

తయారీ విధానం
►ముందుగా స్టవ్‌ మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ పెట్టి బొప్పాయి తురుము వేసి 15 నిమిషాల పాటు సన్నని మంట మీద ఉడికించాలి.
►నీరంతా ఇగిరాక, పంచదార వేసి మరో పదినిమిషాలు తిప్పుతూ ఉడికించాలి.
►ఇప్పుడు యాలకుల పొడి, కోవా తురుము, బాదంపప్పు పొడి, బాదం పలుకులు వేసి తిప్పితే పపయా హల్వా రెడీ. 

మిల్క్‌ బర్ఫీ
కావల్సిన పదార్ధాలు
పాలపొడి – రెండున్నర కప్పులు
పంచదార – ముప్పావు కప్పు
పాలు – కప్పు
నెయ్యి – పావు కప్పు
పిస్తా పలుకులు – మూడు టేబుల్‌ స్పూన్లు

తయారీ విధానం
►గిన్నెలో పాలపొడి, పంచదార, పాలు పోసి కలుపుకోవాలి.
►స్టవ్‌ మీద నాన్‌ స్టిక్‌ పాన్‌ పెట్టుకుని పాలపొడి మిశ్రమం, నెయ్యివేసి సన్నని మంటమీద వేయించాలి.
►10 నిమిషాల తరువాత మిశ్రమం పాన్‌ కు అతుక్కోకుండా ఉండకట్టినట్టుగా అవుతుంది. అప్పుడు ఈ మిశ్రమాన్ని తీసి బేకింగ్‌ పేపర్‌ పరిచిన ట్రేలో వేయాలి.
►ట్రే మొత్తం సమానంగా పరుచుకునేలా మిశ్రమాన్ని వత్తుకోవాలి. పిస్తాపలుకులు వేసి మరోసారి వత్తుకోని,ట్రేను గంటపాటు రిఫ్రిజిరేటర్‌లో పెట్టుకోవాలి.
►రిఫ్రిజిరేటర్‌ నుంచి తీసిన తరువాత నచ్చిన ఆకారంలో ముక్కలు కట్‌ చేసుకుంటే మిల్క్‌ బర్ఫీ రెడీ. 

మలై లడ్డు
కావల్సిన పదార్ధాలు
క్రీమ్‌ మిల్క్‌ – రెండు లీటర్లు
నిమ్మరసం – రెండు టేబుల్‌ స్పూన్లు
కండెన్సెడ్‌ మిల్క్‌ – ముప్పావు కప్పు
యాలకుల పొడి – పావు టీస్పూను.
కోవా
నెయ్యి – అరటీస్పూను
పాలు – పావు కప్పు
ఫ్రెష్‌ క్రీమ్‌ – పావు కప్పు
పాల పొడి – ముప్పావు కప్పు

తయారీ విధానం
►ముందుగా పాలను కాచి, నిమ్మరసం వేసి పన్నీర్‌లా చేసుకోవాలి.
►బాణలి వేడెక్కిన తరువాత అరటీస్పూను నెయ్యి, పావు కప్పు పాలు పోసి వేయించాలి. ఇవన్నీ బాగా కలిసిన తరువాత ముప్పావు కప్పు పాలపొడి వేసి తిప్పుతూ ఉడికించాలి. ►బాణలి నుంచి ఈ పాలమిశ్రమం గట్టిపడి ఉండలా చుట్టుకునేటప్పుడు దించేస్తే పాలకోవ రెడీ.
►ఇప్పుడు స్టవ్‌ మీద మరో బాణలి పెట్టుకుని..ముందుగా తయారు చేసి పెట్టుకున్న పన్నీర్, కోవా వేసి సన్నని మంట మీద తిప్పుతూ వేయించాలి.
►మిశ్రమం మృదువుగా మారాక ముప్పావు కప్పు కండెన్స్‌డ్‌ పాలు పోసి కలపాలి. కండెన్స్‌డ్‌ పాలు తియ్యగా ఉంటాయి కాబట్టి పంచదార వేయకూడదు.
►మిశ్రమం దగ్గరపడ్డాకా.. యాలకులపొడి వేసి మరో ఐదునిమిషాలు వేయించి దించేయాలి.
►గోరువెచ్చగా ఉన్నప్పుడే గుండ్రంగా చుట్టుకుంటే మలై లడ్డు రెడీ.  

చదవండి: ఈ వ్యాయామం క్రమంతప్పకుండా చేస్తే ఆయుష్షు పెరుగుతుందట!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement