కర్బూజా– కాజు స్వీట్
కావలసినవి: కర్బూజా– 1 (తొక్కలు, గింజలు తీసి, ముక్కలు కట్ చేసుకోవాలి. ముక్కలను మిక్సీలో వేసుకుని, మెత్తగా గుజ్జులా చేసుకోవాలి)
పంచదార– సరిపడా
జీడిపప్పు గుజ్జు– పావు కప్పు
కొబ్బరి కోరు– పావు కప్పు పైనే (గార్నిష్‌కి కూడా వాడుకోవచ్చు)
తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, ఒక కళాయిలో కర్బూజా గుజ్జు వేసుకుని, చిన్న మంట మీద గరిటెతో తిప్పుతూ ఉడికించుకోవాలి. ఒక నిమిషం తర్వాత పంచదార వేసుకుని దగ్గరపడే వరకు తిప్పుతూ ఉండాలి.
అనంతరం జీడిపప్పు గుజ్జు, పావు కప్పు కొబ్బరి కోరు వేసుకుని తిప్పుతూ ఉండాలి. అభిరుచిని బట్టి ఫుడ్ కలర్ వేసుకోవచ్చు. బాగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని, చల్లారనివ్వాలి. ఆ తర్వాత నచ్చిన విధంగా ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న స్వీట్స్‌లా చేసుకుని, కొద్దికొద్దిగా కొబ్బరికోరుతో అందంగా గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది.
అవిసె గింజల నేతి లడ్డూ..
కావలసినవి:
అవిసె గింజలు– 1 కప్పు, జీడిపప్పు, నువ్వులు– 1 టేబుల్ స్పూన్ చొప్పున (నేతిలో వేయించి పౌడర్‌లా చేసుకోవాలి), వేరుశనగలు– అర కప్పు (దోరగా వేయించి, మెత్తగా పౌడర్‌లా మిక్సీ పట్టుకోవాలి), బెల్లం కోరు– అర కప్పు, బాదం గింజలు–10 (దోరగా వేయించి పొడి చేసుకోవాలి), నెయ్యి– సరిపడా, ఏలకుల పొడి– కొద్దిగా
తయారీ విధానం: ముందుగా అవిసె గింజలను దోరగా వేయించి, చల్లారాక మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అనంతరం అందులో బాదం పొడి, ఏలకుల పొడి, జీడిపప్పు మిశ్రమం వేసుకుని నెయ్యి పోసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. అప్పుడు ఆ ముద్దను, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని వాటిపై జీడిపప్పు లేదా బాదం ముక్కలను ఒత్తుకుని.. సర్వ్ చేసుకోవచ్చు.
(చదవండి: తాత మొండి పట్టుదల ఎంత పనిచేసింది..! ఏకంగా ఇంటి చుట్టూ..)
Comments
Please login to add a commentAdd a comment