Diwali Special: స్వీట్‌ ఫ్రిట్టర్స్‌, మూంగ్‌ హల్వా ఇలా తయారు చేసుకోండి.. | How To Make Sweet Fritters And Moong Halwa Recipes | Sakshi
Sakshi News home page

Diwali Special: స్వీట్‌ ఫ్రిట్టర్స్‌, మూంగ్‌ హల్వా ఇలా తయారు చేసుకోండి..

Published Thu, Nov 4 2021 11:34 AM | Last Updated on Thu, Nov 4 2021 1:25 PM

How To Make Sweet Fritters And Moong Halwa Recipes - Sakshi

దీపావళి పర్వదినాన ఈ స్వీట్లతో మీ నోరు తీపిచేసుకోండి..!

స్వీట్‌ ఫ్రిట్టర్స్‌  
కావల్సిన పదార్థాలు
బియ్యం – కప్పు
అరటి పండ్లు – రెండు (తొక్కతీసి ముక్కలుగా తరగాలి)
యాలకులు – మూడు, బెల్లం – ముప్పావు కప్పు
నీళ్లు – రెండు టేబుల్‌ స్పూన్లు
నెయ్యి – టేబుల్‌ స్పూను
ఎండుకొబ్బరి ముక్కలు – రెండు టేబుల్‌ స్పూన్లు
సొంఠి పొడి – పావు టీస్పూను
నువ్వులు – టీస్పూను
బేకింగ్‌ సోడా – టీస్పూను
ఉప్పు – చిటికడు
ఆయిల్‌ లేదా నెయ్యి – డీప్‌ఫ్రైకి సరిపడా


 
తయారీ విధానం
►ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి.
►నానిన బియ్యాన్ని నీళ్లు తీసేసి, మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. దీనిలో అరటిపండు ముక్కలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి.  
►ఇప్పుడు స్టవ్‌ మీద బాణలి పెట్టి బెల్లం, రెండు టేబుల్‌ స్పూన్ల నీళ్లు పోసి మీడియం మంట మీద సిరప్‌ తయారయ్యాక స్టవ్‌ ఆపేసి చల్లారనివ్వాలి.  
►బెల్లం సిరప్‌ను వడగట్టి, గ్రైండ్‌ చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమంలో వేసి దోశ పిండిలా కలుపుకోవాలి.  
►చిన్న పాన్‌ పెట్టి టీస్పూను నెయ్యి వేసి కొబ్బరి ముక్కలను వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌లోకి మారేంతవరకు వేయించాలి.  
►ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను నెయ్యితోపాటు పిండిలో వేయాలి. నువ్వులు, సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
►ఇప్పుడు మౌల్డ్స్‌లో నెయ్యి లేదా నూనె వేసి కాగాక బ్యాటర్‌ను వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేగనివ్వాలి.  
►మరోవైపు తిప్పి గోల్డెన్‌ బ్రౌన్‌కలర్‌లోకి మారేంత వరకు వేయించితే ఉన్ని అప్పం రెడీ.   

చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్‌ ఇచ్చారంటే.. దిల్‌ ఖుష్‌!!

మూంగ్‌ హల్వా
కావల్సిన పదార్థాలు
నెయ్యి – రెండు టేబుల్‌ స్పూన్లు
చాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి)
నీళ్లు – రెండు కప్పులు
నెయ్యి – అరకప్పు
గోధుమ పిండి – రెండు టేబుల్‌ స్పూన్లు
పంచదార – ముప్పావు కప్పు
ఫుడ్‌ కలర్‌ – చిటికెడు
యాలకుల పొడి – పావు టీస్పూను
జీడిపలుకులు – రెండు టేబుల్‌ స్పూన్లు
కిస్‌మిస్‌లు – రెండు టేబుల్‌ స్పూన్లు
 
తయారీ విధానం
►స్టవ్‌ మీద ప్రెజర్‌ కుకర్‌ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి.
►తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్‌ మూతపెట్టి మూడు విజిల్స్‌ రానివ్వాలి.
►పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్‌ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి.
►పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి.
►ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి.
►ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్‌ కలర్‌ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి.  
►స్టవ్‌మీద మరో పాన్‌ పెట్టి టేబుల్‌ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్‌మిస్‌లు వేసి గోల్డెన్‌ బ్రౌన్‌ కలర్‌ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్‌ హల్వా రెడీ. 

చదవండి: Diwali Lakshmi Puja 2021: ఈ 5 చోట్ల దీపాలు తప్పక వెలిగించాలట..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement