festival of Diwali
-
ఆలయానికి పోటెత్తిన భక్తులు.. కొండపై నుంచి జారిపడటంతో
బెంగళూరు: కర్ణాటకలోని ఓ ఆలయంలో జరిగిన ఉత్సవాల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. దీపావళి పండుగ సందర్భంగా.. చిక్కమగళూరులోని దేవీరమ్మ కొండపై ఉన్న ఆలయానికి భక్తులు పోటెత్తడంతో తోపులాట జరిగింది. వేలాది సంఖ్యలో భక్తులు ఒక్కసారిగా రావడంతో, కొండలపై జారి పడి పలువురికి గాయాలయ్యాయి. మల్లెనహళ్లిలోని దేవీరమ్మ కొండపై ఉన్న గుడి వద్ద గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది.అయితే గత రెండు రోజులుగా జిల్లాలో కురుస్తున్న వర్షాలే ఇందుకు కారణమని అధికారులు పేర్కొన్నారు. సందర్శకుల భద్రత కోసం జిల్లా యంత్రాంగం, పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ.. భారీ వర్షాల కారణంగా కొండలు తడిగా మారాయని వెల్లడించారు. ఆలయం నుంచి తిరిగి వస్తుండగా పడిపోవడంతో దాదాపు 12మంది భక్తులు స్వల్పంగా గాయపడ్డారని, వారందరూ క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు.కాగా దీపావళి సందర్భంగా ఏడాదిలో కేవలం ఒక్కరోజు మాత్రమే భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శించేందుకు అనుమతిస్తారు. ఇది దేవిరమ్మ అనే కొండపై మూడు వేల అడుగుల ఎత్తులో ఉంటుంది. బాబాబుడంగిరిలోని మాణిక్యధార, అరిసినగుప్పె మీదుగా భక్తులు ఆలయానికి చేరుకుంటారు. నరక చతుర్దశికి ముందు దేవీరమ్మ అమ్మవారి దర్శనం చేసుకుంటారు. -
Diwali Special: స్వీట్ ఫ్రిట్టర్స్, మూంగ్ హల్వా ఇలా తయారు చేసుకోండి..
దీపావళి పర్వదినాన ఈ స్వీట్లతో మీ నోరు తీపిచేసుకోండి..! స్వీట్ ఫ్రిట్టర్స్ కావల్సిన పదార్థాలు బియ్యం – కప్పు అరటి పండ్లు – రెండు (తొక్కతీసి ముక్కలుగా తరగాలి) యాలకులు – మూడు, బెల్లం – ముప్పావు కప్పు నీళ్లు – రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి – టేబుల్ స్పూను ఎండుకొబ్బరి ముక్కలు – రెండు టేబుల్ స్పూన్లు సొంఠి పొడి – పావు టీస్పూను నువ్వులు – టీస్పూను బేకింగ్ సోడా – టీస్పూను ఉప్పు – చిటికడు ఆయిల్ లేదా నెయ్యి – డీప్‌ఫ్రైకి సరిపడా తయారీ విధానం ►ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. ►నానిన బియ్యాన్ని నీళ్లు తీసేసి, మిక్సీజార్‌లోకి తీసుకోవాలి. దీనిలో అరటిపండు ముక్కలు, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి బెల్లం, రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు పోసి మీడియం మంట మీద సిరప్ తయారయ్యాక స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి. ►బెల్లం సిరప్‌ను వడగట్టి, గ్రైండ్ చేసి పెట్టుకున్న బియ్యం మిశ్రమంలో వేసి దోశ పిండిలా కలుపుకోవాలి. ►చిన్న పాన్ పెట్టి టీస్పూను నెయ్యి వేసి కొబ్బరి ముక్కలను వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి మారేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలను నెయ్యితోపాటు పిండిలో వేయాలి. నువ్వులు, సోడా, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ►ఇప్పుడు మౌల్డ్స్‌లో నెయ్యి లేదా నూనె వేసి కాగాక బ్యాటర్‌ను వేసి సన్నని మంట మీద ఐదు నిమిషాలు వేగనివ్వాలి. ►మరోవైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్కలర్లోకి మారేంత వరకు వేయించితే ఉన్ని అప్పం రెడీ. చదవండి: Diwali Special 2021: మీ ప్రియమైనవారికి ఈ గిఫ్ట్స్ ఇచ్చారంటే.. దిల్ ఖుష్!! మూంగ్ హల్వా కావల్సిన పదార్థాలు నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు చాయ పెసరపప్పు – అరకప్పు (కడిగిపెట్టుకోవాలి) నీళ్లు – రెండు కప్పులు నెయ్యి – అరకప్పు గోధుమ పిండి – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – ముప్పావు కప్పు ఫుడ్ కలర్ – చిటికెడు యాలకుల పొడి – పావు టీస్పూను జీడిపలుకులు – రెండు టేబుల్ స్పూన్లు కిస్మిస్లు – రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►స్టవ్ మీద ప్రెజర్ కుకర్ పెట్టి వేడెక్కిన తరువాత టీస్పూను నెయ్యి వేసి పెసరపప్పును దోరగా వేయించాలి. ►తరువాత రెండు కప్పుల నీళ్లుపోయాలి, కుకర్ మూతపెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి. ►పప్పు చల్లారాక మిక్సీజార్‌లో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ∙స్టవ్ మీద మరో బాణలి పెట్టుకుని పావుకప్పు నెయ్యి, గోధుమ పిండి వేసి ఉండలు లేకుండా కలుపుతూ వేయించాలి. ►పిండి వేగిన తరువాత పప్పు మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉడికించాలి. ►ఐదు నిమిషాల తరువాత ముప్పావు కప్పు పంచదార వేసి సన్నని మంట మీద పదిహేను నిమిషాల పాటు తిప్పుతూ ఉడికించాలి. ►ఇప్పుడు పప్పు మిశ్రమం బాగా ఉడికి బాణలికి అంటుకోకుండా మెరుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ సమయంలో ఫుడ్ కలర్ వేసి మరో ఇరవై నిమిషాలు సన్నని మంట మీద ఉడికించాలి. ►స్టవ్‌మీద మరో పాన్ పెట్టి టేబుల్ స్పూను నెయ్యి, జీడిపలుకులు, కిస్మిస్లు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంతవరకు వేయించి హల్వాలో వేయాలి. యాలకులపొడి వేసి రెండు నిమిషాలు తిప్పితే మూంగ్ హల్వా రెడీ. చదవండి: Diwali Lakshmi Puja 2021: ఈ 5 చోట్ల దీపాలు తప్పక వెలిగించాలట..! -
ఈ దీపావళి జవాన్లకు అంకితం!
-
ఈ దీపావళి జవాన్లకు అంకితం!
‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆదివారం ఆలిండియా రేడియోలో మాట్లాడారు. దేశ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దేశ సైనికులు సరిహద్దుల్లో మనకు రక్షణ అందిస్తుండటం వల్లే మనం ఈరోజు ప్రశాంతంగా దీపావళి పండుగ జరుపుకొంటున్నామని, ఈ దీవాళి పండుగను జవానులకు అంకితం చేయాలని ఆయన దేశ ప్రజలను కోరారు. సందేశ్ టు సోల్జర్స్ (#Sandesh2Soldiers) హ్యాష్‌ట్యాగ్ ద్వారా దేశ ప్రజలు లక్షలాది సందేశాలను సైనికులకు అందజేశారని, వారి పట్ల తమ ప్రేమను చాటుకుంటున్నారని చెప్పారు. గత కొన్నాళ్లుగా మన జవాన్లు ఎన్నో త్యాగాలు చేస్తున్నారని, వారి పేరు మీదుగా ఈ దీవాలీ పండుగ జరుపుకోవాలని కోరారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని రేపు జరుపుకోబోతున్నామని, అదేవిధంగా ఇందిరాగాంధీని స్మరించుకుంటున్నామని చెప్పారు. దేశ ప్రజల ఐక్యత కోసం సర్దార్ పటేల్ పోరాడారని, తపించారని గుర్తుచేశారు. ఆయన జయంతి సందర్భంగా దేశ ఐక్యత కోసం మనమంతా కృషి చేయాల్సిన అవసరముందన్నారు. దీపావళి పండుగను ఇప్పుడు ప్రపంచమంతా జరుపుకుంటున్నారని, ఈ పండుగ ప్రజలందరినీ ఒకచోటకు చేరుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
కరెంట్ ‘కట్’.. చీకట్లోనే దీపావళి..
* విద్యుత్ నిలిపివేసిన బీఎంసీ * జనరేటర్లతో నెట్టుకువస్తున్న కుటుంబాలు సాక్షి, ముంబై : నగరంలోని అక్రమ ఫ్లాట్లకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విద్యుత్‌ను నిలిపి వేయడంతో ఆయా ప్రాంతాల వారు అంధకారంలోనే దీపావళిని జరుపుకోవాల్సి వచ్చింది. గత ఏడాది కూడా వీరు పండుగను జరుపుకోలేదు. వీరు ఈ ప్రాంతాన్ని ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికి వారు ఖాళీ చేయకపోవడంతో బీఎంసీ వీరికి విద్యుత్ సరఫరాను నిలిపి వేసింది. దీంతో వీరు బ్లాక్ దీపావళిని జరుపుకున్నారు. జీ/సౌత్ వార్డ్‌లో అక్రమంగా నిర్మాణాలు చేపట్టి నివాసముంటున్న వారికి బీఎంసీ విద్యుత్‌ను నిలిపివేసింది. అయితే వీరు రాత్రి వేళ్లలో జనరేటర్లు, ఎమర్జెన్సీ లైట్లను ఉపయోగిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు తెలిపారు. ఈ సందర్భంగా మిడ్డౌన్ అపార్ట్మెంట్లో ఉంటున్న విద్యా శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఈ సారి తాము దీపావళిని ఎమర్జెన్సీ లైట్లు ఉపయోగించి జరుపుకున్నామని విచారం వ్యక్తం చేశారు. గత ఏడాది కూడా తాము దీపావళిని ఆనందంగా జరుపుకోలేదన్నారు. తమ ఇళ్లను కూల్చివేస్తామని అధికారులు చెప్పడంతో తాము నిరుత్సాహానికి గురై ఆ రోజు ఆందోళనకు కూడా దిగామన్నారు. దీంతో దీపావళిని జరుపుకోలేదన్నారు. కాగా, తాము చివరి అంతస్తులో ఉండడంతో వేడితాపం అంతగా తెలియడం లేదనీ, కానీ కింది అంతస్తులలో ఉంటున్నవారు మాత్రం వేడివల్ల ఉక్కపోతను భరించలేక పోతున్నారని తెలిపారు. ఈ సందర్భంగా బీఎంసీ జీ/సౌత్ వార్డ్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వీరు తమ ఇళ్లను అప్పగించే వరకు పరిస్థితి ఇలానే కొనసాగుతుందని స్పష్టంచేశారు. కాగా, అక్రమంగా నిర్మాణం చేపట్టిన దాదాపు 140 కుటుంబాలకు ఖాళీ చేయాల్సిందిగా బీఎంసీ గత ఏడాదే నోటీసులు జారీ చేసింది. -
హమ్మయ్య.. పక్షులు బతికిపోయాయి!
* ‘దీపావళి’నాడు తగ్గిన పక్షుల మరణాలు, గాయాల కేసులు * గత ఏడాదికంటే 20% తగ్గిన నష్టం * అవగాహన కార్యక్రమాలు చేపట్టిన జంతు ప్రేమికులు * పెరిగిన టపాసుల ధరలూ కారణమే.. సాక్షి, ముంబై : నగరంలో ఈసారి దీపావళి సందర్భంగా గాయపడిన పక్షుల సంఖ్య తగ్గింది. గత ఏడాదితో పోల్చితే ఈ సారి ఈ కేసుల సంఖ్య 20 శాతం తక్కువగా నమోదయ్యిందని ఓ సామాజిక కార్యకర్త పేర్కొన్నారు. ప్రతిసారి దీపావళికి టపాసుల శబ్ధ ధాటికి చాలా పక్షులు గాయాలపాలు కాగా, మరికొన్ని మృత్యువాత పడుతుంటాయి. దీంతో పక్షి ప్రేమికులు ఈసారి నగరవాసుల్లో కొంత మేర అవగాహన కల్పించారు. అన్ని పండుగల కంటే దీపావళి నాడు జంతువులు, పక్షులు ఎక్కువగా ఇబ్బంది పడతాయని జంతు ప్రేమికులు పేర్కొన్నారు. లెక్కలేనన్ని జంతువులు గాయాలపాలవుతాయన్నారు. టపాసులు కాల్చడంతో చాలా జంతువులు శబ్దధాటికి బయటికి పరుగులు తీస్తుంటాయని, ఈ క్రమంలో అవి వాహనాల కింద పడి గాయాలపాలు అవుతుంటాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి కూడా తాము నగర వాసుల్లో అవగాహన కల్పించామన్నారు. చిన్నపిల్లలతో ఈ అంశమై మాట్లాడడమే కాకుండా పోలీస్స్టేషన్లను కూడా ఆశ్రయించామన్నారు. అంతేకాకుండా ఫేస్బుక్, వాట్సప్‌ల ద్వారా కూడా అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఎలాంటి ప్రమాదం జరిగినా లేదా తమ జంతువులు తప్పిపోయినా అప్రమత్తంగా ఉండాలని, అదేవిధంగా తమకు ఫిర్యాదు అందజేయాలని నగరవాసులకు సూచించామన్నారు. ఇదిలా ఉండగా, టపాసుల ధరలు పెరిగిపోవడంతో ఈసారి నగరవాసులు ఎక్కువ స్థాయిలో టపాసులు కాల్చలేదని, దీంతో పక్షులు, జంతువులు చాలావరకు గాయాలబారినుంచి బయటపడ్డాయని వారు అభిప్రాయపడ్డారు. పరేల్‌లోని బాంబే సొసైటీ ఫర్ ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్స్ (బీఎస్పీసీఏ)కు చెందిన ప్రతినిధి ఒకరు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈసారి గాయపడిన పక్షుల సంఖ్య గత ఏడాది కన్నా 25 శాతం తగ్గిందన్నారు. బీఎస్పీసీఏ ఆస్పత్రి ఇన్చార్జి డాక్టర్ జె.సి.కన్నా మాట్లాడుతూ.. దీపావళిని పురస్కరించుకొని ఆస్పత్రుల్లో చేరిన పక్షులు, జంతువులు కేసులు ఈసారి చాలా వరకు తగ్గాయన్నారు. ముఖ్యంగా గాలి పటాలు ఎగురవేయడం ద్వారా చాలా పక్షులు తీవ్రంగా గాయపడుతుంటాయి. దీంతో తమ వద్దకు చికిత్స నిమిత్తం తీసుకు వస్తుంటారన్నారు. కాగా, ఈసారి దీపావళి సందర్భంగా గాయపడిన 18 పక్షులను తమ వద్దకు చికిత్స కోసం తీసుకు వచ్చారన్నారు. ఒక్కోసారి కొంత మంది పిల్లలు శునకాలు, పిల్లులు, గొర్రెల తోకలకు టపాసులను కట్టి ఆడుకుంటారని తెలిపారు. ఇలాంటి వాటిల్లో గాయపడిన కేసులు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ విషయమై కూడా నగర వాసుల్లో అవగాహన కల్పించామన్నారు. టపాసుల ధరలు పెరగడంతో ఎకో ఫ్రెండ్లీ దీపావళి ఆవశ్యకత గురించి తెలియజేశామన్నారు. -
రూ.25 కోట్లు.. ఇదీ దీపావళి బిజినెస్
ఆదిలాబాద్ : కొత్త రాష్ట్రంలో దీపావళి పండుగను జిల్లా వాసులు ఉత్సాహంగానే జరుపుకున్నారు. లక్ష్మీ కటాక్షం కోసం ఘనంగా పూజలు నిర్వహించి బాణాసంచా పేల్చి సందడి చేశారు. ప్రతికూల పరిస్థితుల్లోనూ పండుగ జోరు తగ్గలేదు. ప్రధానంగా దసరా సమయానికే పంటలు చేతికొచ్చి రైతుల చేతుల్లో కాసులు గలగలలాడేవి. ఈసారి అనుకున్న విధంగా పంటలు చేతికి రాకపోవడం, మార్కెట్లో పూర్తిస్థాయిలో పంట కొనుగోళ్లు ప్రారంభం కాకపోవడం, ప్రారంభమైనా సరైన మద్దతు ధర లేక రైతులకు పండుగ కళ తప్పింది. అయినా.. కొనుగోళ్ల జోరు మాత్రం తగ్గలేదు. బాణసంచా, మిఠాయిలు, పువ్వులు, పండ్లు, పూజ సామగ్రి, బంగారం, కొత్త వాహనాలు, దుస్తులు, మొబైల్, ఎలక్ట్రానిక్ పరికరాలు కొనుగోళ్లలో జిల్లా ప్రజలు రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేశారు. టపాసులపై రూ.7 కోట్ల ఖర్చు.. జిల్లా ప్రజలు టపాసులపై రూ.7 కోట్ల వరకు వెచ్చించారు. ఆదిలాబాద్‌లోనే సుమారు రెండున్నర కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఆదిలాబాద్ పట్టణంలో టపాసుల విక్రయాల కోసం సుమారు 70 దుకాణాలు ఏర్పాటు చేయగా, ఒక్కో దుకాణంలో రూ.3 నుంచి రూ.5 లక్షల వరకు వ్యాపారం జరిగినట్లుగా చెబుతున్నారు. మంచిర్యాల, నిర్మల్లోనూ దాదాపు అదేస్థాయిలో ఉంది. పువ్వులు, పండ్లు, పూజా సామగ్రి కోసం రూ.2.5 కోట్లు వెచ్చించారు. మిఠాయిలపై రూ.50 లక్షలు ఖర్చు చేశారు. ద్విచక్ర వాహనాల అమ్మకాలూ జోరుగా సాగాయి. లక్ష్మీపూజల రోజు మంచిర్యాలలో సుమారు 300లకు పైగా బైక్‌లు, ఆదిలాబాద్‌లో 200లకు పైగా అమ్ముడుపోయాయి. మొత్తంగా రూ.3 కోట్లు వాహనాలపై వెచ్చించారు. పండుగ నేపథ్యంలో రెడీమేడ్ బట్టల దుకాణాలు, మొబైల్, ఎలక్ట్రానిక్ షాపులు, వాహనాల షోరూంలు పలు ఆఫర్లతో వినియోగదారులను ఆకట్టుకున్నాయి. మొబైల్ ఫోన్లు ఒకటి కొంటే మరొకటి ఉచితమని, ఒకటి కొంటే రెండు ఫ్రీ అనే ఆఫర్లతో పలు షాపులు పెద్ద పెద్ద బ్యానర్లతో ఆకట్టుకున్నాయి. దీపావళికి కొత్త బట్టల కోసం ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, బెల్లంపల్లి, భైంసా తదితర ప్రాంతాల్లో జోరుగా వ్యాపారం జరిగింది. రూ.3.5 కోట్ల వరకు దుస్తువులపై వెచ్చించారు. మొబైల్, ఎలక్ట్రానిక్ వస్తువుల్లో ప్రధానంగా టీవీల అమ్మకాలు జోరుగా సాగాయి. ఆదిలాబాద్ పట్టణంలో పండుగ సందర్భంగా వెయ్యికి పైగా సెల్ఫోన్లు అమ్ముడుపోగా.. రూ.5 కోట్ల వరకు వ్యాపారం జరిగింది. బంగారం అమ్మకాలు ప్రధానంగా మంచిర్యాలలో అధికంగా జరిగాయి. అక్కడ 2.5 కిలోల బంగారం అమ్ముడుపోయినట్టు తెలుస్తోంది. జిల్లా అంతటా కలిపి కోటిన్నర రూపాయల విలువైన బంగారం విక్రయం జరిగింది. ఆదిలాబాద్‌లో బంగారం అమ్మకాల పరంగా నిస్తేజం కనిపించిందని బులియన్ మార్కెట్ అభిప్రాయ పడుతోంది. గత దీపావళికి 2 కేజీల బంగారం అమ్ముడుపోయిందని, ఈసారి నామమాత్రంగా విక్రయాలు జరిగాయని అంటున్నారు. -
నిప్పురాజుకుంటే ఫోన్ చేయండి
చిత్తూరు (అర్బన్): దీపావళి పండుగ అంటే అందరికీ ఆనందం. అయితే టపాకాయల మధ్య ఏ చిన్న నిప్పురవ్వ పడ్డా ఊహించని ప్రమాదాలు జరుగుతాయి. జిల్లాలో 15 చోట్ల అగ్నిమాపక యంత్రాలు ఉన్నాయి. వాటి ఫోన్ నెంబర్లు, ఆయా కేంద్రాల అధికారుల పేర్లు ఇలా ఉన్నాయి. కార్యాలయం, అధికారి పేరు ల్యాండ్ లైన్ మొబైల్ నెంబర్ చిత్తూరు -ప్రవీణ్‌కుమార్ 08572 -228101 9963735497 కుప్పం-వెంకటరమణ 08570 -255099 9963736524 మదనపల్లె-శంకరప్రసాద్ 08571 -222101 9963735597 ములకలచెరువు-ఉత్తమరెడ్డి 08582 -232555 9963736976 నగరి -దుర్గాప్రసాద్ 08577 -200101 9963737024 పాకాల-రాజగోపాల్‌రెడ్డి 08585 -222101 9963736957 పలమనేరు -చలపతి 08579 -252399 9963735975 పీలేరు -జిలాన్‌ఖాన్ 08584 -244399 9963736587 పుంగనూరు-హేమంత్‌రెడ్డి 08581 -200399 9963736640 పుత్తూరు-విజయకుమార్ 08577 -221699 9963735763 సత్యవేడు-జయరామ్‌నాయుడు 08576 -226779 9963736383 శ్రీకాళహస్తి-నాగరాజు 08578 -222299 9963735672 తిరుమల 0877 -2277299 9963736293 తిరుపతి-రమణయ్య 0877 -2260101 9963736778 వాల్మీకిపురం-డేవిడ్ 08586 -271199 9963737042 -
దద్దరిల్లిన బందరు
దీపావళి బాణసంచా తయారు చేస్తుండగా పేలుడు * ఎంబీఏ విద్యార్థి మృతి * మరో ఐదుగురికి గాయాలు * జిల్లాలో సంచలనం మచిలీపట్నం : దీపావళి మందుగుండు సామగ్రి తయారు చేస్తుండగా భారీ పేలుడు సంభవించడంతో మంగళవారం బందరు దద్దరిల్లింది. అర్ధగంట పాటు భారీగా శబ్దం రావడంతో పట్టణవాసులు ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనలో ఒక విద్యార్థి మృతిచెందగా, మరో ఐదుగురికి గాయాలయ్యాయి. జోగి రాంబాబు అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కలిసి ఏడాదిగా బందరు బైపాస్‌రోడ్డు వెంబడి ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. రాంబాబు తాను ఉంటున్న ఇంటి ఎదురుగానే చిన్న హోటల్ నిర్వహిస్తున్నారు. కొబ్బరి బొండాలు కూడా అమ్ముతున్నారు. ఇతనికి ఇద్దరు కుమారులు కిరణ్, తులసీ, ఒక కుమార్తె నాగలక్ష్మి ఉన్నారు. కిరణ్ గుడ్లవల్లేరులోని ఓ కళాశాలలో ఎంబీఏ చదువుతున్నాడు. తులసీ ఇంటర్మీడియెట్, నాగలక్ష్మి తొమ్మిదో తరగతి చదువుతున్నారు. దీపావళి పండగను పురస్కరించుకుని రాంబాబు తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లోనే పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి తయారుచేస్తున్నారు. కిరణ్ ఉల్లిపాయ బాంబులు తయారుచేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలుడు సంభవించటంతోపాటు దట్టంగా పొగలు కమ్ముకోవడంతో బయటకు పరుగులు తీశారు. అయితే, పేలుడు ధాటికి చెలరేగిన మంటల్లో చిక్కుకుని కిరణ్ అక్కడికక్కడే మరణించాడు. ఇంట్లో ఉన్న కిరణ్ తండ్రి రాంబాబు, సోదరుడు, సోదరి, తులసీ స్నేహితుడు మాచవరానికి చెందిన దిరిశన చాణుక్య గాయపడ్డారు. పేలుడు సంభవించిన పక్క గదిలో ఉన్న ఇంటి యజమాని బంధువు పామర్తి నాగబాలకు కూడా గాయాలయ్యాయి. అర్ధగంటపాటు పేలుడు, దట్టమైన పొగ మందుగుండు సామగ్రి పేలిన ఇంటి నుంచి అర్ధగంట పాటు పేలుడు శబ్దాలు వినిపించాయి. పేలుడు జరిగిన ఇంటి నుంచి దట్టంగా పొగ బయటికి రావడంతో ఏం జరిగిందో తెలియక స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. పేలుడు సంభవించిన గదిలో శ్లాబు పిల్లర్లు బీట్లిచ్చాయి. ఈ ఇంట్లో ఆరు గదులు ఉండగా, అన్నింటిలోనూ వస్తువులు ఛిద్రమయ్యాయి. గుమ్మాలు, కిటికీలు, వాటి తలుపులు ఊడి కిందపడ్డాయి. ప్రహరీ, ఇంటి గోడ ధ్వంసమయ్యాయి. పేలుడు శబ్దం పెద్దగా రావటంతో తొలుత అందరూ గ్యాస్ సిలిండర్ పేలిందని భావించారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది వచ్చి మంటలను అదుపుచేసి, కిరణ్ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. మంటలను ఆర్పు తున్న సమయంలోనూ మందుగుండు సామగ్రి పేలుతూనే ఉంది. గాయపడిన వారు కింద పడిపోవటంతో ఇల్లంతా రక్తసిక్తంగా మారింది. పేలుడు సంభవించిన గృహం వరండాలో ఐదు సంచుల తాటాకు టపాకాయలు ఉన్నాయి. ఇవి పేలకపోవడంతో మరింత ప్రమాదం తప్పిందని స్థానికులు చెబుతున్నారు. సాయంత్రం సమయంలో పేలుడు సంభవించటంతో పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కిరణ్ సోదరుడు తులసీకి తీవ్ర గాయాలు కాగా, మిగిలిన వారు స్వల్పగాయాలతో బయటపడ్డారు. వీరందరికీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. చికిత్స పొందుతూ మాట్లాడలేని స్థితిలో ఉన్న చాణుక్య.. కిరణ్ అన్నయ్యకు ఏమైదంటూ దీనంగా పోలీసులను అడగడం చూపరులను కలచివేసింది. గాయాలపాలైన కిరణ్ సోదరి నాగలక్ష్మి చికిత్స పొందుతూనే ‘మా అన్నయ్య చనిపోయాడు..’ అంటూ కన్నీరుమురుగా విలపించింది. కిరణ్‌ను ఎంబీఏ చదివిస్తున్నామని, చేతికొచ్చే దశలో కళ్లెదుటే చనిపోయాడని తల్లిదండ్రులు, బంధువులు రోదించారు. బాధితులను పరామర్శించిన మంత్రి రవీంద్ర ఈ ఘటనలో గాయపడిన బాధితులను రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం రాత్రి పరామర్శించారు. పేలుడు జరిగిన గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జోగి తులసీ తదితరులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా బాధితులను ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మునిసిపల్ చైర్మన్ మోటమర్రి బాబాప్రసాద్ తదితరులు మంత్రి వెంట ఉన్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన అధికారులు బైపాస్‌రోడ్డులో పేలుడు సంభవించిన ఇంటిని బందరు ఆర్డీవో పి.సాయిబాబు, డీఎస్పీ కేవీ శ్రీనివాసరావు, తహశీల్దార్ నారదముని, చిలకలపూడి సీఐలు సత్యనారాయణ, సుబ్బారావు, ఎస్ఐలు పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి నుంచి పోలీసులు మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. -
మృత్యువు పేల్చిన ‘ప్రాణసంచా’
దీపావళికి మూడురోజులు ముందే మృత్యువు.. ఆ గ్రామంలో ‘ప్రాణసంచా’తో పండుగ చేసుకుంది. అమావాస్య రాత్రిని వన్నెవన్నెల వెన్నెలతో నింపే కృషిలో నిమగ్నమైన వారిపై కన్నెర్రజేసింది. వారినే సీమటపాసుల్లా పేల్చేసి, తునాతునకలు చేసింది. బతుకుతెరువుకు తయారు చేస్తున్న బాణసంచానే చితిగా ముట్టించి వారిని సజీవ దహనం చేసింది. పండుగ మర్నాటి ఉదయం వీధుల్లో కనిపించే.. కాల్చేసిన చిచ్చుబుడ్లు, భూచక్రాలు, మతాబుల అవశేషాల మాదిరిగా మిగిలిన వారి శరీరాలతో ఆ తయారీ కేంద్రాన్ని భయానకంగా మార్చింది. వేలమంది ముంగిళ్లలో ఆనందాల వెలుగులు విరబూయించబోయిన ఆ బడుగుజీవుల ఆత్మీయులను చిమ్మచీకటి లాంటి శోకం కమ్ముకుంది. ‘కాంతుల పర్వం’ వారికి జీవితాంతం వెన్నాడే పీడకలగా మిగిలింది. * వాకతిప్ప బాణసంచా తయారీ కేంద్రంలో విస్ఫోటం * 12 మంది మృత్యువాత, ఏడుగురికి తీవ్రగాయాలు * చికిత్స పొందుతున్న వారిలో 5గురి పరిస్థితి విషమం * తునాతునకలైన మృతదేహాలు, నామరూపాల్లేని ఫైర్వర్క్స్ * బాధితులంతా రెక్కల కష్టాన్ని నమ్ముకున్న బడుగు జీవులే.. * దీపావళికి ముందు ఘోర దుర్ఘటనతో ఉలిక్కిపడ్డ జిల్లా * ప్రమాద కారణంపై వ్యక్తమౌతున్న భిన్నాభిప్రాయాలు పిఠాపురం/ అమలాపురం : ఒకవైపు కొబ్బరి తోపు.. మరోవైపు పచ్చని వరి చేలు.. వాటి మధ్య బాణ సంచా తయారీ కేంద్రం.. పండుగ దగ్గర పడుతున్నందున చకచకా బాణసంచా తయారు చేస్తున్న కార్మికులు..అక్కడ దీపావళి పండుగకు మూడురోజుల ముందే సందడిసందడిగా ఉంది. అది చూసి కన్నుకుట్టిన మృత్యువు కుట్ర పన్నినట్టు.. అంతలోనే మహా విస్ఫోటం. కార్చిచ్చులాంటి అగ్నికీలలు. ఏం జరిగిందో తెలిసే లోపే కొందరు గడ్డిపరకల్లా సజీవ దహనమయ్యారు. కొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పలో జరిగిన ఘోర దుర్ఘటన గ్రామాన్ని శోకపుకుప్పగా మార్చేసింది. వాకతిప్పలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉన్న శ్రీ మణికంఠ ఫైర్వర్క్స్లో సోమవారం మధ్యాహ్నం 3.05 గంటల సమయంలో సంభవించిన పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుతుకుడుమిల్లి శివారు పెదకల్వలదొడ్డికి చెందిన కొప్పిశెట్టి వెంకటరమణ పాతకాలపు పెంకుటిల్లు, రేకులషెడ్లలో నిర్వహిస్తున్న ఈ బాణసంచా తయారీ కేంద్రంలో సొంతంగా తయారు చేసిన రకరకాల మందుగుండు సామగ్రితో పాటు వివిధ కంపెనీల బాణసంచానూ పెద్ద ఎత్తున నిల్వ చేశారు. సోమవారం కేంద్రంలో 25 నుంచి 30 మంది కార్మికులు బాణసంచా తయారీలో నిమగ్నమయ్యారు. కేంద్రం బయట వెంకటరమణ పెద్ద కుమారుడు అప్పారావు, భార్య లక్ష్మి బాణసంచా అమ్మకాలకు టెంటు వేయిస్తున్నారు. ఆ సమయంలో భయంకరమైన పేలుడు సంభవించింది. దీపావళికి ముందు జరిగిన ఈ ఘోరంతో జిల్లా ఉలిక్కిపడింది. కాగా, కాకినాడ అపోలో ఆస్పత్రిలో క్షతగాత్రులను రాష్ర్ట వైద్య, ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివాస్ పరామర్శించారు. ప్రముఖుల పరామర్శ వాకతిప్పలో పేలుడు బాధిత కుటుంబాలను పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పరామర్శించారు. ప్రమాదస్థలాన్ని చూసి వారు చలించిపోయారు. డిప్యూటీ సీఎం చినరాజప్ప, మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, కాకినాడ ఎంపీ తోట నరసింహం, పిఠాపురం ఎమ్మెల్యే వర్మ బాధితులను పరామర్శించారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు బాధిత కుటుంబాలను ఓదార్చారు. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మంగళవారం ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించనున్నట్టు సమాచారం. మృతుల్లో ఎక్కువ మంది మహిళలే దుర్ఘటనలో 9 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఒకరు స్థానిక పీహెచ్సీలో, ఇద్దరు కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందారు. మృతుల్లో అత్యధికులు మహిళలే. కూలి తక్కువన్న కారణంతో బాణసంచా తయారీలో మహిళల్నే ఎక్కువగా వినియోగిస్తున్నట్టు చెపుతున్నారు. ఏడుగురు తీవ్రంగా గాయపడగా వారిలో అయిదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ పేలుడుతో వాకతిప్పవాసులు భూకంపం వచ్చినట్టు కంపించిపోయారు. జరిగింది గుర్తించినా దుర్ఘటనాస్థలం వద్దకు వెళ్లేందుకు సాహసించలేకపోయారు. కొంతమంది ధైర్యం చేసి వెళ్లగా అక్కడి పరిస్థితిని చూసి గుండె చెదిరిపోయింది. రెప్పపాటులో కాలిన మాంసపు ముద్దల్లా మారిన వారి శరీరాలు గుర్తించలేనంతగా ఛిద్రమయ్యాయి. కొన్ని అవయవాలు తునాతునకలై 50 మీటర్ల దూరంలో కొబ్బరి తోటలు, పంట పొల్లాల్లో పడ్డాయంటే.. విస్ఫోటం తీవ్రత అర్థమవుతుంది. స్థానికంగా 108 అంబులెన్స్‌లు అందుబాటులో లేకపోవడంతో గాయపడినవారిని ఆటోల్లో తరలించాల్సి వచ్చింది. ఈ ఘోరానికి కారణం తెలియరాకున్నా బాణ సంచా తయారీ సమయంలో నిప్పు రాజుకుందని కొందరు అంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా దుర్ఘటన జరిగి ఉండవచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది. కంపించిన ఆ మూడు గ్రామాలు పేలుడు తీవ్రతకు మణికంఠ ఫైర్వర్క్స్ నిర్వహిస్తున్న ఇల్లు, షెడ్లు నామరూపాల్లేకుండా పోయాయి. వాటిని అనుకుని ఉన్న కొబ్బరి, మామిడిచెట్లు మాడిమసైపోయాయి. పేలుడు సమయంలో చుట్టుపక్కల మూడు గ్రామాల్లో భూకంపం వచ్చినట్టు ప్రకంపనలు వచ్చాయి. బాణసంచా కేంద్రానికి సమీపంలో ఉన్న ఇళ్లలో కిటికీలు తలుపులు కొట్టుకోవడంతో పాటు టేబుళ్ల వంటి వాటిపైనున్న వస్తువులు ఎగిరి నేలమీద పడిపోయాయి. మణికంఠ ఫైర్వర్క్స్ ఊరికి దూరంగా కొబ్బరితోటలు, వరి చేలను అనుకుని ఉండడం వల్ల మరింత దారుణం తప్పినట్టయింది. అదే గ్రామానికి ఆనుకుని ఉంటే జరిగే నష్టం ఊహించజాలమని స్థానికులు అన్నారు. పేలుడు సమయంలో కొనుగోలుదారులు లేరని, అదే అమ్మకాలు మొదలయ్యాక ఈ దుర్ఘటన జరిగి ఉంటే చోటు చేసుకునే విషాదం తలచుకుంటేనే వణుకు పుడుతోందన్నారు. జాతీయ విపత్తు సహాయక దళం (ఎన్డీఆర్ఎఫ్)కు చెందిన శకటంతోపాటు మరోమూడు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేశారు. మధ్యాహ్నం మూడు గంటలకు విస్ఫోటం జరిగితే సాయంత్రం 5.30 గంటల వరకు మంటలు రగులుతూనే ఉన్నాయి. -
పండుగ సందడి
పండుగ సందడి =అంతటా వెలుగుజిలుగులు =మార్కెట్ కిటకిట.. కళకళ =ధన్తేరస్ ధగధగలు =గుమ్మెత్తిన పూల అమ్మకాలు =టాప్‌లేపిన టపాసుల విక్రయాలు =కొంగొత్త ప్రమిదలతో వినూత్న కాంతులు బంజారాహిల్స్/సనత్‌నగర్/మెహిదీపట్నం/నాంపల్లి, న్యూస్‌లైన్: వెలుగు జిలుగుల పండుగ సందడితో నగరం కళకళలాడుతోంది. శుక్రవారం వివిధ కొనుగోళ్లతో మార్కెట్లు కిటకిటలాడాయి. ఎటుచూసినా ధన్‌తే ‘రష్’.. మరోవైపు టపాసులు, పూలు, ప్రమిదల కొనుగోళ్లు తారస్థాయిలో జరిగాయి. అందరి కళ్లలో దీపావళి పర్వదిన కాంతులు వెల్లివిరిశాయి. ప్రత్యేకించి బంగారం దుకాణాలు వినియోగదారులతో నిండిపోయాయి. అబిడ్స్, కోఠి, బషీర్‌బాగ్, అమీర్‌పేట, పంజగుట్ట తదితర ప్రాంతాల్లోని జ్యూవెలరీ షాపులు ఆభరణాల కొనుగోళ్ల కోసం వచ్చిన వారితో సందడిగా కనిపించాయి. బంగారం ధర పెరిగినా కొనుగోలుదారుల్లో మాత్రం ఆసక్తి తగ్గలేదు. ఒక్క శుక్రవారం రోజే నగరంలోని 600 పైచిలుకు జ్యువెలర్స్‌లో 70 కిలోలకు పైగా బంగారు అభరణాల విక్రయం జరిగినట్లు ఆయా దుకాణాల రికార్డులు వెల్లడిస్తున్నాయి. ఎక్కువగా బంగారం ఆభరణాలకే గిరాకీ ఉందని బంజారాహిల్స్‌లోని శ్రీకృష్ణా జ్యువెలర్స్ మేనేజర్ రావు తెలిపారు. శుక్రవారం 22 క్యారెట్ల బంగారం రూ.30,700 పలికింది. ముత్యాలు, వజ్రాల ఆభరణాల విక్రయాలూ భారీ ఎత్తున జరిగాయి. గుమ్మెత్తిన బంతిపూల అమ్మకాలు దీపావళిని పురస్కరించుకుని నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలు భారీ ఎత్తున బంతిపూలు కొనుగోలు చేశారు. కొత్తపేట, మొజాంజాహి, గుడిమల్కాపూర్, సికింద్రాబాద్ మోండా తదితర మార్కెట్లు కిటకిటలాడాయి. శుక్రవారం ఉదయం నుంచే రైతులు మార్కెట్లకు బంతిపూలను తీసుకువచ్చారు. ధరలు కూడా ఆకాశాన్నంటాయి. సాధారణంగా రూ.20 పలికే కిలో బంతిపూలు ఒక్కసారిగా రూ.60 నుంచి రూ.80కి పెరిగాయి. దీపావళికి దుకాణాలు, వ్యాపార సంస్థలు, కార్యాలయాలు, ఇళ్లను అందంగా అలంకరించేందుకు బంతిపూల కు ఉండే డిమాండ్ ఇంతా అంతా కాదు. ప్రత్యేక పూజలకు బంతిపూలనే ఎక్కువగా వినియోగిస్తారు. మార్కెట్‌కు వచ్చిన పూలు వచ్చినట్లే క్షణాల్లో అమ్ముడయ్యాయి. శుక్రవారం ఒక్కరోజే దాదాపు 100 టన్నుల పూల క్రయవిక్రయాలు జరిగినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. ప్రమిదలు, మిఠాయిల అమ్మకాలు... ఇంటింటా వెలుగులను పంచుతూ కనువిందు చేసే ప్రమిదలు మార్కెట్‌ను ముంచెత్తాయి. వీటి కొనుగోలు కోసం మహిళలు పోటీపడ్డారు. విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో వ్యాపారులు వాటి ధరలకు రెక్కలు తొడిగారు. సాధారణంగా సైజును బట్టి జత ప్రమిదలు రూ.5 నుంచి రూ.10 ఉండగా శుక్రవారం ఏకంగా రూ.15 నుంచి రూ.20 పలికాయి. అలాగే స్టెప్స్ ప్రమిదలు రూ.30- రూ.50 మధ్య అమ్ముడయ్యాయి. ఇక మైనంతో నింపిన ప్రమిదలు అమ్మకాలూ జోరందుకున్నాయి. వీటికి భిన్నంగా మార్కెట్లోకి వచ్చిన ఎలక్ట్రానిక్ ప్రమిదలు సైతం హాట్‌కేకులయ్యాయి. సనత్‌నగర్, బల్కంపేట, అమీర్‌పేట, బేగంపేట, రాంగోపాల్‌పేట, బన్సీలాల్‌పేట, పద్మారావునగర్ డివిజన్ల పరిధిల్లో ఏ రహదారి చూసినా ప్రమిదలు, లక్ష్మీపూజకు అవసరమైన పూలు, ఇతర సామగ్రి అమ్మకందారులు, కొనుగోలుదారులతో కిక్కిరిశాయి. ఇక, మిఠాయి దుకాణాల వద్దా కొనుగోలుదారులు బారులుతీరారు. ఆత్మీయులకు, కుటుంబసభ్యులకు స్వీట్స్ అందజేసి శుభాకాంక్షలు తెలపడం ఈ పర్వదినం నాడు సంప్రదాయంగా వస్తోంది. అలాగే, బొమ్మల కొలువు నిమిత్తం అమ్మకానికి ఉంచిన విభిన్న ఆకృతుల్లోని బొమ్మలు కనువిందు చేశాయి. నింగిలోకి దూసుకెళ్తా.. బాణసంచా అమ్మకాలు రికార్డు స్థాయిలో జరిగాయి. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, బతుకమ్మకుంట, అంబర్‌పేట తదితర ప్రాంతాలతో పాటు, మినీ శివకాశీగా పేరొం దిన సనత్‌నగర్‌లో వందలాది దుకాణాలు వెలిశాయి.అన్ని షాపుల్లోనూ ఫ్యాన్సీ టపాసులే ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విభిన్న రకాల టపాకాయలు మార్కెట్లో కొలువుదీరాయి. ఈ ఏడాది పీఎస్ఎల్వీ పేరిట తయారు చేసిన రాకెట్టు అందరిని ఆకట్టుకుంటోంది.