కార్తీక మాసం ప్రారంభం కావడంతోనే నేనున్నాని గుర్తు చేస్తుంది... కాస్త వగరు, నొసలు ముడివడేలా చేసే పులుపు ఉసిరి. ఈ కాలంలో ఉసిరి తింటే ఎంతో మంచిది. విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే సీజనల్ ఫ్రూట్ అయిన ఉసిరిని రోజూ నేరుగా తినలేం కాబట్టి... వెరైటీగా ఎలా వండవచ్చో చూద్దాం.
పుల్లటి హల్వా
కావల్సిన పదార్ధాలు
ఉసిరికాయలు – 20
నెయ్యి – అరకప్పు
పంచదార – కప్పు
ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు
జీడి పప్పు – పది
కిస్‌మిస్ – పది
నీళ్లు – పావు కప్పు
యాలకుల పొడి – టీస్పూను
తయారీ విధానం
►ఉసిరికాయలను శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేసి పేస్టులా చేయాలి. పేస్టుని, జ్యూస్‌ను వేరువేరుగా తీసి పక్కన బెట్టుకోవాలి.
►కిస్‌మిస్, జీడిపప్పుని నెయ్యిలో దోరగా వేయించి పక్కనబెట్టుకోవాలి.
►బాణలిలో ఉసిరిజ్యూస్, పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి.
►నీళ్లు బాగా మరిగాక ఉసిరిపేస్టు, పంచదార వేసి తిప్పాలి.
►పదినిమిషాలు కలుపుతూ ఉడికించిన తరువాత ఫుడ్ కలర్, నెయ్యి వేయాలి.
►ఐదు నిమిషాలు మగ్గాక జీడిపప్పు, కిస్‌మిస్‌లతో గార్నిష్ చేస్తే పుల్లని ఆమ్లా హల్వా రెడీ.
చదవండి: Viral: తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..!
నోరూరే రసం
కావల్సిన పదార్ధాలు
ఉసిరి కాయలు – మూడు
కందిపప్పు – రెండు టేబుల్ స్పూన్లు
టొమాటో – ఒకటి
చింతపండు రసం – రెండు టేబుల్ స్పూన్లు
అల్లం – పావు అంగుళం ముక్క
వెల్లుల్లి – రెండు రెబ్బలు
మినప గుళ్లు – రెండు టీస్పూన్లు
జీలకర్ర – అర టీస్పూను
ఆవాలు – అరటీస్పూను
మిరియాల పొడి – పావు టీస్పూను
ఎండు మిర్చి – ఒకటి
రసం పొడి – టీస్పూను
ఉప్పు – రుచికి సరిపడా
బెల్లం – చిన్న ముక్క
పసుపు – పావు టీస్పూను
కరివేపాకు – రెండు రెమ్మలు
ఇంగువ – చిటికెడు
ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు
తయారీ విధానం
►ముందుగా కందిపప్పుని కడిగి టొమాటో ముక్కలు వేసి ఉడికించి, రుబ్బి పక్కనబెట్టుకోవాలి.
►స్టవ్ మీద బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి మినపగుళ్లు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించి పొడిచేసుకోవాలి.
►ఈ పొడిలో విత్తనాలు తీసిన ఉసిరికాయ ముక్కలు, తొక్కతీసిన అల్లం పేస్టు వేయాలి.
►ఇప్పుడు తాలింపు బాణలిలో ఆయిల్ వేడెక్కిన తరువాత..ఆవాలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లిని వేసి వేగనివ్వాలి.
►తరువాత ఉసిరిపేస్టు, పసుపు, రసం పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి.
►ఇప్పుడు రుబ్బిన పప్పు, రసానికి సరిపడా నీళ్లు, చింతపండు రసం, బెల్లం, కొత్తిమీర వేసి మరిగిస్తే నోరూరే రసం రెడీ.
చదవండి: Vidit Aatrey: అతిపెద్ద సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘మీ షో యాప్’ తెర వెనుక కథ!!
Comments
Please login to add a commentAdd a comment