Delicious Winter Soups: గుమ్మడి సూప్‌, మటన్‌ సూప్‌ తయారీ ఇలా.. | How To Make Gummadi Kaya Soup And Mutton Soup In Telugu | Sakshi
Sakshi News home page

Delicious Winter Soups: గుమ్మడి సూప్‌, మటన్‌ సూప్‌ తయారీఇలా..

Published Sat, Nov 20 2021 1:44 PM | Last Updated on Sat, Nov 20 2021 2:21 PM

How To Make Gummadi Kaya Soup And Mutton Soup In Telugu - Sakshi

చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... 

గుమ్మడి సూప్‌ 
కావల్సిన పదార్ధాలు
ఆయిల్‌ – రెండు టేబుల్‌ స్పూన్లు
ఉల్లిపాయ – ఒకటి (ముక్కలు తరగాలి)
వెల్లుల్లి రెబ్బలు – రెండు
గుమ్మడి తరుగు – రెండు కప్పులు
ఉప్పు – రుచికి సరిపడా
మిరియాల పొడి – అరటీస్పూను
నీళ్లు – రెండు కప్పులు
క్రీమ్‌ – గార్నిష్‌కు సరిపడా

తయారీ విధానం 
►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. 
►తరువాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి. 
►ఇవి కూడా వేగిన తరువాత గుమ్మడి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి రెండు కప్పులు నీళ్లు పోసి కలపి మూతపెట్టి 15 నిమిషాల పాటు మీడియం మంటమీద ఉడికించాలి. 
►ఉడికిన తరువాత మిశ్రమాన్ని చల్లారనిచ్చి, మెత్తగా గ్రైండ్‌ చేయాలి. 
►ఈ గ్రైండ్‌ చేసిన మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఐదు నిమిషాలు మరిగించి, క్రీమ్‌తో గార్నిష్‌ చేసి సర్వ్‌ చేసుకోవచ్చు.  

మటన్‌ సూప్‌ 
కావల్సిన పదార్ధాలు
మటన్‌ – పావుకేజీ
నీళ్లు – రెండు కప్పులు
అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను
పసుపు – అర టీస్పూను
మిరియాల పొడి – అర టీస్పూను
జీలకర్ర పొడి – పావు టీస్పూను
గరం మసాలా – అర టీస్పూను
కొత్తిమీర తరుగు – టేబుల్‌ స్పూను

తయారీ విధానం 
►మటన్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడగాలి. 
►ప్రెజర్‌ కుకర్‌ గిన్నెలో మటన్‌ ముక్కలు, అల్లం వెల్లుల్లిపేస్టు, మిరియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పులు నీళ్లుపోయాలి. 
►వీటన్నింటిని కలిపి మూత పెట్టి ఆరు విజిల్స్‌ రానివ్వాలి. 
►కుకర్‌ ప్రెజర్‌ పోయాక మూతతీసి కొత్తిమీరతో గార్నిష్‌ చేస్తే వేడి వేడి మటన్‌ సూప్‌ రెడీ. 

చదవండి: Beauty Tips: ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్‌ తొలగించేందుకు.. ఆనప ఫేస్‌ ప్యాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement