Special recipes
-
దేవి నవరాత్రుల్లో వెరైటీగా దెహరోరి స్వీట్ ట్రై చేయండి!
దెహరోరిలు తయారు చేయడానికి కావలసినవి: బియ్యం – కప్పు నీళ్లు – పావు కప్పు పెరుగు – పావు కప్పు నెయ్యి – అరకప్పు పంచదార – రెండు కప్పులు యాలకుల పొడి – రెండు టీస్పూన్లు బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులు – గార్నిష్‌కు సరిపడా. తయారీ విధానం: బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆరుగంటల పాటు నానబెట్టుకోవాలి. నానిన బియ్యంలో నీటిని తీసేసి సూజీ రవ్వలా బరకగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసేటప్పుడు నీళ్లు అసలు పోయకూడదు∙ రవ్వలా గ్రైండ్ చేసిన బియ్యంలో పెరుగు వేసి చేతులతో బాగా కలపాలి∙ చేతులు వేడెక్కిన తరువాత కలపడం ఆపేసి మూతపెట్టి రాత్రంతా ఉంచేయాలి∙ మరుసటిరోజు పంచదారను గిన్నెలో వేయాలి. పంచదార మునిగేన్ని నీళ్లుపోసి మంట మీద పెట్టాలి∙ సన్నని మంట మీద సిరప్‌ను తయారు చేయాలి∙ పాకం తయారైందనుకున్నప్పుడు యాలకుల పొడి వేసి కలిపి, దించేయాలి∙ ఇప్పుడు బాణలిలో నెయ్యివేసి చక్కగా కాగనివ్వాలి∙ రాత్రి కలిపి పెట్టుకున్న బియ్యం రవ్వ మిశ్రమాన్ని కుడుముల్లా చేసుకుని నెయ్యిలో డీప్‌ఫ్రై చేయాలి∙ కుడుము రెండువైపులా లైట్ బ్రౌన్ కలర్లోకి మారాక తీసేసి టిష్యూ పేపర్ మీద వేయాలి∙ ఐదు నిమిషాల తరువాత టిష్యూపేపర్ మీద నుంచి తీసి పంచదార పాకంలో వేయాలి∙ బాదం, జీడిపప్పు, పిస్తా పలుకులతో గార్నిష్ చేసి సర్వ్‌చేసుకోవాలి. రిఫ్రిజిరేటర్లో పెట్టకపోయినా దెహరోరిలు పదిరోజులపాటు రుచిగా ఉంటాయి . -
కెవ్వు కేకు.. రుచికరమైన జోవార్ క్యారట్ కేక్ తయారీ ఇలా!
క్రిస్మస్ వస్తోంది. కేక్ చేద్దామంటే అమ్మో మైదాతోనా... అని భయం. హెల్త్ కోసం అందరూ మిల్లెట్లు తింటున్నారు. మిల్లెట్లతో అన్నాలు, బిరియానీలు, బ్రేక్‌ఫాస్ట్‌లు, స్నాక్‌లు...ఎన్నో చేస్తున్నారు. మరి... కేక్‌లు చేయలేమా? ఎందుకు చేయలేం! ఇదిలో ఇలా చేయండి. కావలసినవి: జొన్న పిండి– కప్పు; బాదం పొడి– కప్పు; బనానా ప్యూరీ– కప్పు; క్యారట్ తురుము– కప్పు; బెల్లం పొడి– కప్పు; పాలు లేదా నీరు – అర కప్పు; వెన్న – 3 టేబుల్ స్పూన్లు; అవిసె గింజల పొడి – 3 టేబుల్ స్పూన్లు (రెండింతల నీరు వేసి కలపాలి); ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి – ఒక్కొక్కటి అర స్పూన్; బాదం పలుకులు– 10 (సన్నగా తరగాలి) తయారీ విధానం: ⇒ మందపాటి పెనంలో జొన్నపిండి వేసి సన్న మంట మీద దోరగా వేయించాలి. ⇒ మరొక పాత్రలో అవిసె గింజల పొడిని నీటితో కలిపి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ⇒ ఆ తర్వాత జొన్నపిండిలో వెన్న, బనానా ప్యూరీ, అవిసె గింజల పేస్ట్ వేసి బాగా కలపాలి. ⇒ ఇందులో ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి మళ్లీ కలపాలి. ⇒ ఇప్పుడు మిగిలిన పొడులు, క్యారట్ తురుము వేసి తగినంత నీరు లేదా పాలు వేస్తూ బాగా కలపాలి. ⇒ కేక్ మౌల్డ్‌కు వెన్న రాసి పైన కొద్దిగా జొన్న పిండిని చల్లాలి. ఇప్పుడు పై మిశ్రమాన్ని సమంగా సర్దాలి. పైన బాదం పలుకులు చల్లాలి. ⇒ ఇప్పుడు ఒవెన్‌ను 180 డిగ్రీలు వేడి చేసి మౌల్డ్‌ను లోపల పెట్టి 50 లేదా 60 నిమిషాల పాటు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత కేక్‌ను ముక్కలుగా కట్ చేయాలి. -
రుచుల పండుగ రంజాన్.. 10 వెరైటీలు మీకోసం!
రంజాన్ మాసంలో సూర్యోదయానికి ముందు సుహార్, సూర్యాస్తమయం తరువాత ఇఫ్తార్ విందు కానిస్తారు. కులమతాలకు అతీతంగా ఇఫ్తార్ ఇచ్చి పుచ్చుకోవడం ఇప్పుడు సర్వసాధారణంగా మారింది. ఈ ఇఫ్తార్ లో వడ్డించే వంటకాలు అద్భుతమైన రుచులతో ఉంటాయి. వీటిలో 10 వెరైటీల గురించి కలినరీ స్పెషలిస్ట్ పల్టి హరినాథ్ వివరిస్తున్నారు. సాధారణంగా రంజాన్ వేళ ఉపవాసదీక్షను ఖర్జూరం, డ్రై ఫ్రూట్స్, సీజనల్ ఫ్రూట్స్, నిమ్మరసంతో ముగిస్తారు. అయితే ఈ పండుగ విందుల్లో ఆరగించే టాప్ 10 వంటకాల్లో... ► హలీమ్ – ఇఫ్తార్ విందులో తప్పనిసరిగా దర్శనమిచ్చే ఫుడ్ వెరైటీ ఇది. మటన్‌ను పప్పుదినుసులు, గోధుమలు, మసాలాలు, డ్రై ఫ్రూట్స్‌లో నిదానంగా ఉడికించి తయారుచేస్తారు. ఈ ఫుడ్ అత్యధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. ► కెబాబ్స్:మటన్ లేదంటే చికెన్ ముక్కలను పెరుగు, మసాలాలలో నానబెట్టి అనంతరం ఫ్రై చేయడం లేదా స్క్రూ చేయడం లేదా బార్బిక్యు చేయడం ద్వారా వీటిని వండుతారు. ► చికెన్ షావార్మా – అత్యంత ప్రాచుర్యం పొందిన మధ్య ప్రాశ్చ్య డిష్ ఇది. సన్నగా కోసిన చికెన్ లేదా మటన్ ముక్కలను బ్రెడ్ లోపల కూరగాయలు, సాస్ కలిపి ఆరగిస్తారు. ► కీమా సమోసా – గోధుమ పిండి, మటన్‌తో తయారుచేసే ఈ సమోసాలు భారతీయ రుచుల సంగమంగా నిలుస్తాయి. ► మటన్ రెసాలా – ఇది పూర్తిగా బెంగాలీ డిష్. బోన్ మటన్ పీస్‌లను పెరుగులో నానబెట్టి , జీడిపప్పు, గసగసాల పేస్ట్‌తో పాటుగా భారతీయ మసాలాలు కూడా కలిపి తయారుచేస్తారు. పరాటా లేదా నాన్‌తో కలిపి తింటే అద్భుతంగా ఉంటుంది. ► దమ్ బిర్యానీ – దక్షిణ భారతదేశంలో దీనిని విభిన్న రకాలుగా చేయడం కనిపిస్తుంది. ప్రధానంగా బియ్యం, మటన్ లేదా చికెన్, మసాలాలు నెయ్యి, కుంకుమపువ్వుతో చేస్తారు. కొన్నిసార్లు కూరగాయలు, సోయా ముక్కలు, సీఫుడ్‌తో కూడా ఈ బిర్యానీ చేయడం కనిపిస్తుంది. ► ఫలాఫెల్ –అంతర్జాతీయంగా ఎక్కువ మంది ఇష్టపడే వంటకాలలో ఫలాఫెల్ ఒకటి. బటానీ గింజలు లేదంటే ఫవా బీన్స్ లేదా రెండింటినీ కలిపి తయారుచేసిన బాల్ లేదా పట్టీ ఫలాఫెల్. వీటిని సాధారణంగా హమ్మస్‌తో పాటుగా తహినీ సాస్‌తో కలిపి ఇఫ్తార్ సమయంలో సర్వ్ చేస్తారు. . ► షీర్ ఖుర్మా – మొఘలాయ్ వంటకం ఇది. షీర్ అంటే పాలు, ఖుర్మా అంటే ఖర్జూరం. రెండింటి మేళవింపే ఈ షీర్ఖుర్మా దీని ఆకృతి మాత్రమే కాదు, రుచి కూడా వినూత్నంగా ఉంటుంది. ► అఫ్లాటూన్– ప్రత్యేక తియ్యని వంటకం అఫ్లాటూన్ . స్వచ్ఛమైన నెయ్యి, నట్స్‌తో తయారుచేస్తారు. రంజాన్ వేళ భోజనం ముగించేందుకు అత్యుత్తమ డిష్ ఇది. రూ అఫ్జా – రంజాన్ మాసంలో సాధారణంగా తయారుచేసే షర్బత్ ఇది. దీనిలో వనమూలికలు, పండ్లు, కూరగాయలు, పూలు, వేర్లు కూడా భాగంగా ఉంటాయి. ప్రత్యేకమైన రుచులు, కూలింగ్ ఎఫెక్ట్ దీనిని మిలిగిన పానీయాలకు భిన్నంగా నిలుపుతుంది. ఈ రూ అఫ్జా సిరప్‌ను కుల్ఫీ ఐస్‌క్రీమ్‌లు, సేమియాలలో కూడా కలిపి తీసుకోవచ్చు. ఐకమత్యం పెంచే రుచులు... ఇది నిజంగా జష్న్–ఏ–రంజాన్. విభిన్నరకాల అభి‘రుచుల’ను సంతృప్తి పరిచే విధంగా వెరైటీ డిషెస్‌ను రంజాన్ మోసుకొస్తుంది. అందుకు తగ్గట్టే ఏర్పాటయ్యే ఇఫ్తార్ విందులు అందర్నీ ఆకట్టుకుంటాయి. –మితేష్ లోహియా, డైరెక్టర్, సేల్స్–మార్కెటింగ్, గోల్డ్ డ్రాప్ -
Delicious Winter Soup Recipes: స్పినాచ్ సూప్, బ్రకోలి ఆల్మండ్ సూప్ తయారీ ఇలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... స్పినాచ్ సూప్ కావల్సిన పదార్ధాలు లేత పాలకూర ఆకులు – రెండు కప్పులు క్యారెట్ – ఒకటి బంగాళదుంప – ఒకటి ఉల్లిపాయ – ఒకటి వెల్లుల్లి రెబ్బలు – నాలుగు మిరియాల పొడి – టీస్పూను ఆయిల్ – రెండు టీస్పూన్లు పంచదార – టీస్పూను వెజిటేబుల్ స్టాక్ – రెండు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా క్యారెట్ బంగాళ దుంపలను తొక్కతీసి కడిగి, సన్నగా తరుక్కోవాలి. ►ప్యాన్‌లో రెండు కప్పుల నీళ్లు, క్యారెట్, బంగాళ దుంపల ముక్కలు వేసి మీడియం మంట మీద ఉడికించాలి. ►ఇవి ఉడికాక ఈ ముక్కలను తీసి వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఈ వేడినీటిలో కడిగి పెట్టుకున్న పాలకూర ఆకులు వేసి ఐదు నిమిషాలు ఉడికించాలి. ►పాలకూర ఉడికిన తరువాత చల్లారనిచ్చి, క్యారెట్, దుంపలతో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మధ్యలో వెజిటేబుల్ స్టాక్ వేసి ప్యూరీలా చేసుకోవాలి. ►ఇప్పుడు ఈ ప్యూరీని వడగట్టి రసం మాత్రమే తీసుకోవాలి. ►ఇప్పుడు బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి తరిగిన వెల్లుల్లిని వేసి గోల్డ్కలర్లోకి మారేవరకు వేయించాలి. ►తరువాత పంచదార, ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ►ఇవన్నీ వేగాక వడగట్టిన పాలకూర రసం, మిరియాలపొడి, రుచికి సరిపడా ఉప్పువేసి బాగా మరిగించాలి. ►ఈ వేడివేడి సూప్‌లో క్రీమ్ లేదా బటర్ వేసి సర్వ్‌చేసుకోవాలి. బ్రకోలి ఆల్మండ్ సూప్ కావల్సిన పదార్ధాలు బ్రకోలి – ఒకటి ఉల్లిపాయలు – రెండు (ముక్కలుగా తరగాలి) వెల్లుల్లి రెబ్బలు – ఆరు (సన్నగా తరగాలి) బాదం పప్పులు – పదహారు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు బటర్ – టీ స్పూను పాలు – కప్పు మిరియాల పొడి – టీస్పూను ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా బ్రకోలిని ముక్కలుగా తరుక్కోవాలి. ►పాన్ వేడెక్కిన తరువాత బటర్, ఆయిల్ వేయాలి. ►బటర్ కరిగిన వెంటనే వెల్లుల్లి తరుగు వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఇప్పుడు బాదం పప్పులు, బ్రకోలి వేసి రంగు మారేంత వరకు ఉడికించాలి. ►ఇవన్నీ ఉడికిన తరువాత, చల్లారానిచ్చి పేస్టులా గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ పేస్టును మరో పాన్‌లో వేసి నీరంతా ఇగిరేంత వరకు మరిగించాలి. ►ఇప్పుడు పాలు పోసి మరో రెండు నిమిషాలు మగ్గనిచ్చి, మిరియాల పొడితో గార్నిష్‌చేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: Viral Video: డ్యామిట్!! కథ అడ్డం తిరిగింది! మూడున్నర అడుగుల పామును అమాంతం మింగిన చేప.. -
కీమా ఇడ్లీ, బనానా షీరా చాక్లెట్ బాల్స్, బ్రెడ్–ఎగ్ బజ్జీ తయారు చేసేద్దామిలా..
కొత్త కొత్తగా ఈ వంటకాలను కూడా ట్రై చేయండి.. బనానా షీరా చాక్లెట్ బాల్స్ కావలసిన పదార్ధాలు రవ్వ – 1 కప్పు (దోరగా వేయించుకోవాలి) అరటి గుజ్జు – 1 కప్పు, ఏలకుల పొడి – కొద్దిగా నెయ్యి – పావు కప్పు, పంచదార – 1 కప్పు (అభిరుచిని బట్టి మరికొంత పెంచుకోవచ్చు) పాలు – రెండున్నర కప్పులు డ్రై ఫ్రూట్స్ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు చాక్లెట్ చిప్స్ – అర కప్పు, కొబ్బరి నూనె – కొద్దిగా తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. బౌల్లో పాలు పోసుకుని వేడి చేసుకోవాలి. అందులో ఏలకుల పొడి, పంచదార ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూనే ఉండాలి. కొంతసేపు తర్వాత డ్రై ఫ్రూట్స్, బనానా గుజ్జు వేసుకుని కలుపుతూ ఉండాలి. రవ్వ కూడా వేసుకుని దగ్గర పడేదాక గరిటెతో తిప్పుతూ ఉండాలి. చివరిగా మిగిలిన నెయ్యి కూడా వేసుకుని బాగా దగ్గర పడేదాక కలిపి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారనిచ్చి చిన్న చిన్న బాల్స్‌లా చే సుకుని పెట్టుకోవాలి. అనంతరం చాక్లెట్ చిప్స్, కొబ్బరి నూనె ఒక బౌల్లో వేసుకుని ఓవెన్లో కొన్ని సెకన్స్ పాటు మెల్ట్ చేసుకోవాలి. ఆ మిశ్రమంలో ఒక్కో బాల్ వేసుకుని, అటు ఇటు తిప్పి.. నెమ్మదిగా ఆ బాల్స్‌ని ఒక ట్రేలో పెట్టుకుని ఆరనివ్వాలి. అనంతరం నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. బ్రెడ్–ఎగ్ బజ్జీ కావలసిన పదార్ధాలు బ్రెడ్ – 15 (ఒకదాన్ని త్రికోణంలో 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి) శనగ పిండి – అర కప్పు, బియ్యప్పిండి – పావు కప్పు గుడ్లు – 2, కారం – ముప్పావు టీ స్పూన్ పసుపు – చిటికెడు, నీళ్లు – కొద్దిగా వంట సోడా – పావు టీ స్పూన్ ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ముందుగా ఒక బౌల్లో శనగపిండి, ఓట్స్‌పిండి, బియ్యప్పిండి, అర టీ స్పూన్ కారం, వంట సోడా, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. మరో బౌల్లో గుడ్లు, పసుపు, పావు టీ స్పూన్ కారం వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. అనంతరం బ్రెడ్ ముక్కలని ముందుగా గుడ్డు మిశ్రమంలో ముంచి, అనంతరం శనగపిండి మిశ్రమంలో ముంచి.. బాగా పట్టించి నూనెలో దోరగా వేయించుకోవాలి. కీమా ఇడ్లీ కావలసిన పదార్ధాలు కీమా – పావు కప్పు (ఉప్పు, కారం, పసుపు, మసాలా దట్టించి కుకర్‌లో విజిల్స్ వేయించుకోవాలి) ఇడ్లీపిండి – 5 లేదా 6 కప్పులు (ముందుగానే మినప్పప్పు నాన బెట్టుకుని, మిక్సీ పట్టుకుని, బియ్యప్పిండి కలిపి సిద్ధం చేసుకోవాలి) పచ్చి బఠాణీ – 4 టేబుల్ స్పూన్లు (నానబెట్టి, ఉడికించాలి) క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్లు ఆవాలు – పావు టీ స్పూన్ పచ్చిమిర్చి ముక్కలు – అర టీ స్పూన్ (చిన్నగా) కరివేపాకు – కొద్దిగా నూనె – 2 టీ స్పూన్లు, ఉప్పు – తగినంత తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, కళాయిలో నూనె పోసుకుని, వేడి కాగానే.. కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఆవాలు, క్యారెట్ తురుము, పచ్చి బఠాణీ.. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. అందులో కీమా మిశ్రమాన్ని కూడా వేసి, 1 నిమిషం పాటు వేయించుకుని పక్కనపెట్టుకోవాలి. అనంతరం ఇడ్లీ పాత్రకు నూనె రాసి, వాటిలో కొద్దికొద్దిగా ఇడ్లీపిండి వేసుకుని.. మధ్యలో 2 లేదా 3 టీ స్పూన్ల కీమా కర్రీ పెట్టుకోవాలి. ఆపైన నిండుగా ఇడ్లీ పిండి వేసుకుని ఆవిరిపై ఉడికించుకోవాలి. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! -
Delicious Winter Soups: గుమ్మడి సూప్, మటన్ సూప్ తయారీ ఇలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... గుమ్మడి సూప్ కావల్సిన పదార్ధాలు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ – ఒకటి (ముక్కలు తరగాలి) వెల్లుల్లి రెబ్బలు – రెండు గుమ్మడి తరుగు – రెండు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా మిరియాల పొడి – అరటీస్పూను నీళ్లు – రెండు కప్పులు క్రీమ్ – గార్నిష్‌కు సరిపడా తయారీ విధానం ►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత వెల్లుల్లి రెబ్బలు వేయాలి. ►ఇవి కూడా వేగిన తరువాత గుమ్మడి తరుగు, రుచికి సరిపడా ఉప్పు, మిరియాలపొడి రెండు కప్పులు నీళ్లు పోసి కలపి మూతపెట్టి 15 నిమిషాల పాటు మీడియం మంటమీద ఉడికించాలి. ►ఉడికిన తరువాత మిశ్రమాన్ని చల్లారనిచ్చి, మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని పాన్‌లో వేసి ఐదు నిమిషాలు మరిగించి, క్రీమ్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. మటన్ సూప్ కావల్సిన పదార్ధాలు మటన్ – పావుకేజీ నీళ్లు – రెండు కప్పులు అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను పసుపు – అర టీస్పూను మిరియాల పొడి – అర టీస్పూను జీలకర్ర పొడి – పావు టీస్పూను గరం మసాలా – అర టీస్పూను కొత్తిమీర తరుగు – టేబుల్ స్పూను తయారీ విధానం ►మటన్‌ను చిన్నచిన్న ముక్కలుగా చేసి శుభ్రంగా కడగాలి. ►ప్రెజర్ కుకర్ గిన్నెలో మటన్ ముక్కలు, అల్లం వెల్లుల్లిపేస్టు, మిరియాలపొడి, జీలకర్రపొడి, గరం మసాలా, రుచికి సరిపడా ఉప్పు, రెండు కప్పులు నీళ్లుపోయాలి. ►వీటన్నింటిని కలిపి మూత పెట్టి ఆరు విజిల్స్ రానివ్వాలి. ►కుకర్ ప్రెజర్ పోయాక మూతతీసి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే వేడి వేడి మటన్ సూప్ రెడీ. చదవండి: Beauty Tips: ముఖం మీద పేరుకుపోయిన ట్యాన్ తొలగించేందుకు.. ఆనప ఫేస్ ప్యాక్! -
నేతి బీరకాయకూ ఓ రోజొచ్చింది! డిమాండే డిమాండు
నందిగామ: నేతిబీరకాయకూ ఓ రోజొచ్చింది. మామూలు రోజుల్లో దీనిని అడిగే నాథుడే ఉండడు. కానీ ఏడాదిలో ఒక్కరోజు మాత్రం అది ఈరోజు నాది అని సగర్వంగా చెప్పుకుంటుంది. కార్తిక పౌర్ణమి నేపథ్యంలో పట్టణంలో నేతిబీరకాయకు డిమాండ్ పెరిగింది. గతంలో గ్రామీణ ప్రాంతాల్లో నేతి బీరకాయలు విరివిగా దర్శనమిచ్చేవి. చదవండి: Visakhapatnam: ఆ ఊహలన్నీ త్వరలోనే నిజం కానున్నాయి.. కాలక్రమంలో ఇవి కనుమరుగు కావడంతో మార్కెట్లో వీటి లభ్యత అరకొరగానే ఉంటోంది. అయితే, కార్తికపౌర్ణమి రోజున నేతి బీరకాయతో వంటకాలు రుచి చూడటం ఎంతో శ్రేష్టమని ప్రజలు భావిస్తారు. దీంతో గురువారం నందిగామ మార్కెట్లో వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది. ప్రజల అవసరాన్ని ఆసరా చేసుకొని అమ్మకందారులు ఒక్కో కాయను రూ.50 చొప్పున విక్రయించడం గమనార్హం. చదవండి: ఎక్కడి నుంచి వచ్చిందో ఆ యువతి.. ఆకతాయిలు వేధిస్తుండడంతో.. -
ఊరించే ఉసిరి రుచులు: పుల్లటి హల్వా, నోరూరే రసం తయారీ ఇలా..
కార్తీక మాసం ప్రారంభం కావడంతోనే నేనున్నాని గుర్తు చేస్తుంది... కాస్త వగరు, నొసలు ముడివడేలా చేసే పులుపు ఉసిరి. ఈ కాలంలో ఉసిరి తింటే ఎంతో మంచిది. విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే ఉసిరిని ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. అయితే సీజనల్ ఫ్రూట్ అయిన ఉసిరిని రోజూ నేరుగా తినలేం కాబట్టి... వెరైటీగా ఎలా వండవచ్చో చూద్దాం. పుల్లటి హల్వా కావల్సిన పదార్ధాలు ఉసిరికాయలు – 20 నెయ్యి – అరకప్పు పంచదార – కప్పు ఆరెంజ్ ఫుడ్ కలర్ – చిటికెడు జీడి పప్పు – పది కిస్మిస్ – పది నీళ్లు – పావు కప్పు యాలకుల పొడి – టీస్పూను తయారీ విధానం ►ఉసిరికాయలను శుభ్రంగా కడిగి విత్తనాలు తీసేసి పేస్టులా చేయాలి. పేస్టుని, జ్యూస్‌ను వేరువేరుగా తీసి పక్కన బెట్టుకోవాలి. ►కిస్మిస్, జీడిపప్పుని నెయ్యిలో దోరగా వేయించి పక్కనబెట్టుకోవాలి. ►బాణలిలో ఉసిరిజ్యూస్, పావు కప్పు నీళ్లుపోసి మరిగించాలి. ►నీళ్లు బాగా మరిగాక ఉసిరిపేస్టు, పంచదార వేసి తిప్పాలి. ►పదినిమిషాలు కలుపుతూ ఉడికించిన తరువాత ఫుడ్ కలర్, నెయ్యి వేయాలి. ►ఐదు నిమిషాలు మగ్గాక జీడిపప్పు, కిస్మిస్లతో గార్నిష్ చేస్తే పుల్లని ఆమ్లా హల్వా రెడీ. చదవండి: Viral: తెలుసా! ఈ ఉల్లిని కట్ చేస్తే కన్నీళ్లు రావట..! నోరూరే రసం కావల్సిన పదార్ధాలు ఉసిరి కాయలు – మూడు కందిపప్పు – రెండు టేబుల్ స్పూన్లు టొమాటో – ఒకటి చింతపండు రసం – రెండు టేబుల్ స్పూన్లు అల్లం – పావు అంగుళం ముక్క వెల్లుల్లి – రెండు రెబ్బలు మినప గుళ్లు – రెండు టీస్పూన్లు జీలకర్ర – అర టీస్పూను ఆవాలు – అరటీస్పూను మిరియాల పొడి – పావు టీస్పూను ఎండు మిర్చి – ఒకటి రసం పొడి – టీస్పూను ఉప్పు – రుచికి సరిపడా బెల్లం – చిన్న ముక్క పసుపు – పావు టీస్పూను కరివేపాకు – రెండు రెమ్మలు ఇంగువ – చిటికెడు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు కొత్తిమీర తరుగు – రెండు టీస్పూన్లు తయారీ విధానం ►ముందుగా కందిపప్పుని కడిగి టొమాటో ముక్కలు వేసి ఉడికించి, రుబ్బి పక్కనబెట్టుకోవాలి. ►స్టవ్ మీద బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి మినపగుళ్లు, జీలకర్ర, మిరియాలు, ఎండు మిర్చి వేసి దోరగా వేయించి పొడిచేసుకోవాలి. ►ఈ పొడిలో విత్తనాలు తీసిన ఉసిరికాయ ముక్కలు, తొక్కతీసిన అల్లం పేస్టు వేయాలి. ►ఇప్పుడు తాలింపు బాణలిలో ఆయిల్ వేడెక్కిన తరువాత..ఆవాలు, కరివేపాకు, దంచిన వెల్లుల్లిని వేసి వేగనివ్వాలి. ►తరువాత ఉసిరిపేస్టు, పసుపు, రసం పొడి వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు రుబ్బిన పప్పు, రసానికి సరిపడా నీళ్లు, చింతపండు రసం, బెల్లం, కొత్తిమీర వేసి మరిగిస్తే నోరూరే రసం రెడీ. చదవండి: Vidit Aatrey: అతిపెద్ద సోషల్ కామర్స్ ప్లాట్‌ఫామ్ ‘మీ షో యాప్’ తెర వెనుక కథ!! -
రుచులూరే వేడివేడి వింటర్ సూప్స్ తయారు చేయండిలా..
చలికాలం మొదలైపోయింది. ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా తింటేనే హాయిగా అనిపిస్తుంది. ఎంతో రుచికరంగా ఉండే సూప్‌లు అయితే శరీరానికి వెచ్చదనంతోపాటు పోషకాలనూ అందిస్తాయి. వేడివేడి సూప్‌లను రుచికరంగా, సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం... బీట్రూట్ చికెన్ సూప్ కావల్సిన పదార్ధాలు చికెన్ – పావుకేజీ వెల్లుల్లి రెబ్బలు – ఆరు అల్లం – అరంగుళం ముక్క ఉల్లిపాయలు – రెండు బీట్రూట్ – రెండు మిరియాల పొడి – టీ స్పూను బటర్ – రెండు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా కొత్తిమీర తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు స్ప్రింగ్ ఆనియన్ తరుగు – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►పాత్రను తీసుకుని.. శుభ్రంగా కడిగిన చికెన్, ఒక ఉల్లిపాయను ముక్కలు తరిగి వేయాలి. మూడు వెల్లుల్లి రెబ్బలు, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, లీటరు నీళ్లు పోసి కలపాలి. ఈ మిశ్రమాన్ని మూతపెట్టి 10 నిమిషాలు ఉడికించాలి. ►ఉడికించిన మిశ్రమం నుంచి చికెన్, స్టాక్‌ను వేరుచేసి పక్కనబెట్టుకోవాలి. చికెన్‌ను చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. ►స్టవ్ మీద పాన్ వేడెక్కిన తరువాత బటర్ వేయాలి. ►మిగిలిన వెల్లుల్లిని కచ్చాపచ్చాగా దంచి వేయాలి. మిగిలిన ఉల్లిపాయను ముక్కలు తరిగి వేసి వేయించాలి. ►ఇవి రెండూ వేగిన తరువాత చికెన్ స్టాక్, బీట్రూట్ ముక్కలు మరికొన్ని నీళ్లు పోసి మరిగించాలి. ►పది నిమిషాలు మరిగాక చికెన్ ముక్కలు వేసి మరో ఇరవై నిమిషాలు మరిగించి కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ తరుగుతో గార్నిష్ చేసి వేడివేడిగా సర్వ్‌చేయాలి. చదవండి: వింత ఆచారం! అల్లుడికి కట్నంగా 21 విషపూరితమైన పాములు.. స్వీట్ కార్న్ వెజ్ సూప్ కావల్సిన పదార్ధాలు పేస్టు కోసం: స్వీట్‌కార్న్ గింజలు – అరకప్పు నీళ్లు – రెండు టేబుల్ స్పూన్లు సూప్: ఆయిల్ – మూడు టీస్పూన్లు వెల్లుల్లి రెబ్బలు – రెండు అల్లం – అంగుళం ముక్క స్ప్రింగ్ ఆనియన్ తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు స్వీట్ కార్న్ గింజలు – పావు కప్పు క్యారెట్ తరుగు – పావు కప్పు బీన్స్ తరుగు – పావు కప్పు నీళ్లు – మూడు కప్పులు ఉప్పు – రుచికి సరిపడా మిరియాలపొడి – టీ స్పూను వెనిగర్ – టీస్పూను కార్న్‌ఫ్లోర్ – టీస్పూను (పావు కప్పు నీటిలో కలిపి పెట్టుకోవాలి) తయారీ విధానం ►ముందుగా అల్లం, వెల్లుల్లిలను సన్నగా తరగాలి. ►బాణలి వేడెక్కిన తరువాత ఆయిల్ వేసి వెల్లుల్లి, అల్లం తరుగు వేసి దోరగా వేయించాలి. ►తరువాత స్ప్రింగ్ ఆనియన్ తరుగు, పావు కప్పు స్వీట్ కార్న్, క్యారెట్, బీన్స్ తరుగును వేసి ఐదునిమిషాలు ఉడకనివ్వాలి. ►ఇప్పుడు పేస్టుకోసం తీసుకున్న స్వీట్‌కార్న్‌ను రెండు టేబుల్ స్పూన్లు నీళ్లు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ పేస్టును ఉడుకుతున్న సూప్ మిశ్రమంలో వేసి రెండు నిమిషాలు వేయించాలి. ►ఇప్పుడు మూడు కప్పుల నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి 15 నిమిషాలు మరిగించాలి. ►మరిగాక కార్న్‌ఫ్లోర్ మిశ్రమం వేసి కలుపుకోవాలి. ►సూప్ మిశ్రమం చిక్కబడిన తరువాత మిరియాల పొడి, వెనిగర్, స్ప్రింగ్ ఆనియన్ వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి: హెచ్చరిక!! ఈ శతాబ్దం చివరి నాటికి భూమిపై ఘోర మారణహోమం.. -
నోరూరించే గలౌటీ కబాబ్, కోకోనట్ బ్రకోలి తయారీ ఇలా..
రోటీన్‌కి భిన్నంగా ఈ ప్రత్యేక వంటకాలను కూడా ప్రయత్నించండి. కోకోనట్ బ్రకోలి కావల్సిన పదార్ధాలు బ్రకోలి ముక్కలు – రెండున్నర కప్పులు ఉల్లిపాయ ముక్కలు – ముప్పావు కప్పు ఆయిల్ – రెండు టేబుల్ స్పూన్లు స్రింగ్ ఆనియన్ – ఒకటి కరివేపాకు – ఒక రెమ్మ పచ్చిమిర్చి – ఒకటి జీలకర్ర – పావు టీస్పూను ఆవాలు – టీస్పూను అల్లం వెల్లుల్లి పేస్టు – టీస్పూను కారం – టీస్పూను గరం మసాలా – టీస్పూను పచ్చికొబ్బరి తురుము – మూడు టేబుల్ స్పూన్లు ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►స్టవ్ మీద బాణలి వేడెక్కిన తరువాత జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. ►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డెన్ బ్రౌన కలర్లోకి వచ్చేంతవరకు వేయించాలి. ►ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టువేసి పచ్చివాసన పోయేంత వరకు వేగనిచ్చి, బ్రకోలి ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి మూడు నిమిషాలు మగ్గనివ్వాలి. ►బ్రకోలి మగ్గాక పచ్చికొబ్బరి, కారం, గరం మసాలా వేసి నూనె పైకి తేలేంత వరకు వేగనిస్తే కోకోనట్ బ్రకోలి రెడీ. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! గలౌటీ కబాబ్ కావల్సిన పదార్ధాలు మటన్ ఖీమా – ఆరకేజీ బొప్పాయి పేస్టు – మూడు టీస్పూన్లు జీలకర్ర పొడి – రెండు టీస్పూన్లు ధనియాల పొడి – టీస్పూను గరం మసాలా పొడి – టీ స్పూను ఉల్లిపాయ – ఒకటి (సన్నగా తరగాలి) అల్లంవెల్లుల్లి పేస్టు – రెండు టీస్పూన్లు మిరియాలపొడి – పావు టీస్పూను శనగపిండి – రెండు టేబుల్ స్పూన్లు పుదీనా ఆకులు – అరకప్పు నిమ్మరసం – టీస్పూను ఉప్పు – రుచికి సరిపడా నెయ్యి – టీస్పూను ఆయిల్ – వేయించడానికి సరిపడా తయారీ విధానం ►శుభ్రంగా కడిగిన మటన్ ఖీమాను ఒక గిన్నెలో తీసుకుని నిమ్మరసం బొప్పాయి పేస్టు, నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలిపి పది నిమిషాలపాటు పక్కనబెట్టుకోవాలి. ►మిక్సీజార్లోఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు, శనగపిండి, పుదీనా, ధనియాలపొడి, గరం మసాల, మిరియాలపొడి వేసి గ్రైండ్ చేయాలి. మసాలాలు నలిగిన ►తరువాత మటన్ ఖీమా వేసి మిశ్రమం మెత్తగా మారేవరకు గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఎనిమిది గంటలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ►తరువాత మిశ్రమాన్ని కబాబ్‌లా చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి సన్నని మంట మీద రెండువైపులా బ్రౌన్‌కలర్ వచ్చేంతవరకు వేగనిస్తే గలౌటీ కబాబ్ రెడీ. చదవండి: Best Foods For Vitamin C: చిగుళ్లనుంచి రక్తం వస్తుందా? స్ట్రాబెర్రీ పండ్లు, బొప్పాయి.. ఇవి తిన్నారంటే.. -
రుచులూరే.. షాహీ తుకడా, ఖీమా పన్నీర్ వండేద్దాం ఇలా..
ఈ కొత్త రుచులను ట్రై చేయండి. ఘుమ ఘుమలాడే వంటకాలతో మీ ఇంటిల్లిపాదిని ఆనందపరచండి. షాహీ తుకడా కావల్సినవి పధార్థాలు మిల్క్ బ్రెడ్ స్లైసులు – ఆరు పాలు – లీటరు పంచదార – ఐదు టేబుల్ స్పూన్లు యాలకులపొడి – అర టేబుల్ స్పూను కుంకుమ పువ్వు – అరటీస్పూను పిస్తా పలుకులు – ఐదు టీస్పూన్లు బాదం పలుకులు – ఐదు టీస్పూన్లు సుగర్ సిరప్ నీళ్లు – అరకప్పు పంచదార – అరకప్పు యాలకులు – రెండు రోజ్ వాటర్ – అరటీస్పూను గార్నిష్ బ్రెడ్‌స్లైసులు – మూడు నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు డ్రైఫ్రూట్స్ – రెండు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►ముందుగా టేబుల్‌స్పూను పాలల్లో కుంకుమ పువ్వును నానబెట్టు కోవాలి. ►మందపాటి గిన్నెలో పాలు పోసి వేడిచేయాలి. ►పాలు మీగడ కట్టి, సగమయ్యాక, పంచదార, కుంకుమపువ్వు, యాలకుల పొడి, బాదం, పిస్తా పలుకులు వేసి, 5 నిమిషాలకొకసారి కలుపుతూ ఉండాలి. చిక్కబడిన తరువాత దించి పక్కనబెట్టుకోవాలి. ►ఇప్పుడు అరకప్పు పంచదార, నీళ్లు వేసి తీగపాకం వచ్చిన తరువాత రోజ్ వాటర్, యాలకులపొడి వేసి కలపాలి. ►ఈ పాకంలో బ్రెడ్ స్లైసులను వేసి నానబెట్టుకోవాలి. ►గార్నిష్ కోసం తీసుకున్న బ్రెడ్‌ను త్రికోణాకృతి ఆకృతిలో కట్ చేసి నెయ్యిలో బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►వీటిని కూడా పాకంలో 15 సెకన్ల పాటు ఉంచాలి. ►ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో బ్రెడ్‌ముక్కలు వరుసగా పేర్చి, కాచి పెట్టుకున్న పాల మిశ్రమాన్ని వాటిమీద పోసి, గార్నిష్ కోసం తీసుకున్న పదార్థాలను వేసి సర్వ్చేస్తే ఎంతో రుచికరమైన షాహీ తుకడ రెడీ. ఖీమా పన్నీర్ కావల్సినవి పధార్థాలు పన్నీర్ తురుము – కప్పు బటర్ – మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు జీలకర్ర – అర టీస్పూను లవంగాలు – రెండు దాల్చిన చెక్క – చిన్న ముక్క యాలకులు – రెండు బిర్యానీ ఆకు – ఒకటి మిరియాలు – మూడు ఉల్లిపాయలు – రెండు (సన్నగా తరగాలి) టొమోటో – రెండు (సన్నగా తరుక్కోవాలి) అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరగాలి) కారం – రెండు టీస్పూన్లు పసుపు – పావు టీస్పూను ధనియాల పొడి – టీస్పూను గరం మసాలా పొడి – అరటీస్పూను కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు పంచదార – అరటీస్పూను నిమ్మరసం – టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద బాండీ వేడెక్కిన తరువాత బటర్, నూనె వేయాలి. రెండూ వేడయ్యాకా జీలకర్ర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మిరియాలు, బిర్యానీ ఆకు వేసి నిమిషం వేయించాలి. ►తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తబడనివ్వాలి. ►ఉల్లిపాయ వేగాక, అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి, టొమోటో, కొత్తిమీర తరుగు వేసి కలిపి మగ్గనివ్వాలి. ►టొమోటో మగ్గాకా.. పసుపు, కారం, ధనియాల పొడి వేసి సన్నని మంటమీద తిప్పుతూ ఉండాలి. ►ఆయిల్ పైకి తేలిన తరువాత పన్నీర్ తురుము, గరం మసాలా, పంచదార, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి . ►ఇప్పుడు మూతపెట్టి మూడు నిమిషాల ఉడికించి, నిమ్మరసం, కొత్తిమీర తరుగు వేస్తే ఖీమా పన్నీర్ రెడీ. చదవండి: గుడ్‌న్యూస్.. ఈ ప్రొటీన్‌తో బట్టతల సమస్యకు శాశ్వత పరిష్కారం..! -
నోరూరించే రుచులు.. కిస్మిస్–అంజీరా బర్ఫీ, సందేష్ తయారీ ఇలా..
స్వీట్స్ అంటే నాలుక కోసుకునేవారు ఈ కొత్త రుచులను కూడా ప్రయత్నించండి. కిస్మిస్–అంజీరా బర్ఫీ సందేష్ కావల్సిన పదార్ధాలు అంజీరా – 4 (నానబెట్టి, ముక్కలు కట్ చేసుకుని, గుజ్జులా మిక్సీ పట్టుకోవాలి) కిస్మిస్ – పావు కప్పు (నానబెట్టి, మిక్సీ పట్టుకుని, గుజ్జు చేసుకోవాలి) కొబ్బరి పాలు – 4 టేబుల్ స్పూన్లు తేనె – 2 టేబుల్ స్పూన్లు నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు కొబ్బరి కోరు – అర కప్పు నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా నేతిలో నువ్వులు, కొబ్బరి కోరు వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో కిస్మిస్ గుజ్జు, అంజీరా గుజ్జు, కొబ్బరి పాలు, తేనె వేసుకుని తిప్పుతూ ముద్దలా చేసుకోవాలి. అనంతరం ఉండలు లేదా బిట్స్లా నచ్చిన షేప్‌లో తయారు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. సందేష్ కావల్సిన పదార్ధాలు క్రీమ్ మిల్క్ – రెండు లీటర్లు నిమ్మరసం – మూడు టేబుల్ స్పూన్లు పంచదార పొడి – అరకప్పు యాలకుల పొడి – పావు టీస్పూను ట్యూటీ ఫ్రూటీ – మూడు టేబుల్ స్పూన్లు తయారీ విధానం ►ముందుగా మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించాలి. ►పాలు కాగాక నిమ్మరసం వేసి కలపాలి. ►ఇప్పుడు పాలు విరిగినట్లు అవుతాయి. వీటిని బట్టలో వడగట్టి, చల్లటి నీరుపోసి మరోసారి వడకట్టుకోవాలి. ►నీళ్లు తీసేసిన పాల మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుని పంచదార పొడి వేసి మెత్తగా కలపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని బాణలిలో వేసి తేమ పోయేంతరకు వేయించాలి. దించే ముందు యాలకులపొడి వేసి తిప్పాలి ►ఐదునిమిషాలు ఆరాక చిన్నచిన్న ఉండలుగా చేసి మధ్యలో గుంటలా వత్తుకుని ట్యూటీప్రూటీలతో గార్నిష్ చేస్తే తియ్యటి సందేష్ రెడీ. -
ఘుమ ఘుమలాడే పనీర్ రోటీ రోల్స్, కీమా బోండా తయారీ విధానం ఇలా..
మార్నింగ్ టిఫిన్ గా ఈ కొత్త వంటకాలను ప్రత్నించండి.. మీ ఇంటిల్లిపాదికి కొత్త రుచులను పరిచయం చేయండి. కీమా బోండా కావలసిన పదార్థాలు కీమా – పావు కిలో (ఉప్పు, కారం, మసాలా దట్టించి కుకర్‌లో విజిల్స్ వచ్చేవరకూ ఉంచాలి) జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు – అర టీ స్పూన్ చొప్పున పచ్చిమిర్చి – 2 (చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి) కరివేపాకు తురుము – కొద్దిగా ఉల్లిపాయలు – 1 (చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసుకోవాలి) బఠాణీలు – పావు కప్పు (నానబెట్టినవి) ఉప్పు – తగినంత, పసుపు – చిటికెడు గరం మసాలా – 1 టీ స్పూన్ అల్లంవెల్లుల్లి పేస్ట్– అర టీ స్పూన్ కొత్తిమీర తురుము – కొద్దిగా శనగపిండి – 3 టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి – 2 టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా, కారం – అర టీ స్పూన్ చొప్పున బంగాళదుంప గుజ్జు – పావు కప్పు (ఉడికించినది) నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానం ముందుగా పాన్‌లో 1 టేబుల్ స్పూన్ నూనె వేడి చేసుకుని.. జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు తురుము, ఉల్లిపాయ ముక్కలు, బఠాణీలు, బంగాళదుంప గుజ్జు, కీమా, తగినంత ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర తురుము వేసుకుని గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త చల్లారనివ్వాలి. ఈలోపు ఒక బౌల్ తీసుకుని శనగపిండి, బియ్యప్పిండి, బేకింగ్ సోడా, కారం వేసుకుని నీళ్లు పోసుకుని పలచగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. కీమా–బంగాళదుంప మిశ్రమాన్ని బాల్స్‌లా చేసుకుని.. వాటిని శనగపిండి మిశ్రమంలో ముంచి, బూరెలు మాదిరిగా కాగుతున్న నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. పనీర్ రోటీ రోల్స్ కావలసిన పదార్థాలు పనీర్ ముక్కలు – 1 కప్పు ఓట్స్ – 2 కప్పులు (పిండిలా మిక్సీ పట్టుకోవాలి) జొన్నపిండి – పావు కప్పు నెయ్యి – 1 టేబుల్ స్పూన్ గోరువెచ్చని నీళ్లు – సరిపడా గరం మసాలా, కారం – 1 టీ స్పూన్ చొప్పున పసుపు – కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు (సన్నగా పొడవుగా తరగాలి) టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున కొత్తిమీర తురుము – 2 టీ స్పూన్లు ఉప్పు – తగినంత నూనె – సరిపడా తయారీ విధానం ముందుగా పనీర్ ముక్కలకు గరం మసాలా, కారం, పసుపు, కొద్దిగా ఉప్పు పట్టించి పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో ఓట్స్ పిండి, జొన్నపిండి, ఉప్పు, నెయ్యి వేసుకుని, గోరువెచ్చని నీళ్లను కొద్దికొద్దిగా కలుపుకుంటూ.. ముద్దలా చేసుకుని 15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపు స్టవ్ ఆన్‌చేసి.. కళాయిలో 2 గరిటెల నూనె వేసుకుని, అందులో ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికం ముక్కలు వేసుకుని దోరగా వేయించి, పనీర్ మిశ్రమాన్నీ వేసి గరిటెతో తిప్పుతూ ఉండాలి. మరోవైపు ఓట్స్ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని చపాతీల్లా ఒత్తుకుని, పెనం మీద ఇరువైపులా దోరగా వేయించుకుని, ప్రతి రోటీలో కొద్దికొద్దిగా పనీర్ మిశ్రమాన్ని పెట్టుకుని రోల్స్‌లా చుట్టుకోవాలి. చదవండి: 900 యేళ్లనాటి ఈ గ్రామానికి రెండే ద్వారాలు... కారణం అదేనట.. -
నోరూరించే ఫిష్ కట్లెట్ విత్ రైస్, ఆనియన్ చికెన్ రింగ్స్ తయారీ..కొంచెం వెరైటీగా!
చికెన్, చేపలతో ఈ ప్రత్యేక వంటకాలు సరదాగా ట్రై చేయడి.. రుచి కూడా అదిరిపోతుంది. ఆనియన్ చికెన్ రింగ్స్, ఫిష్ కట్లెట్ విత్ రైస్ వెరైటీలతో మీ కుటుంబ సభ్యులకు మరిచిపోలేని ట్రీట్ ఇవ్వండి..! ఆనియన్ చికెన్ రింగ్స్ కావల్సిన పదార్థాలు చికెన్ ఖీమా – పావు కేజీ ఉల్లిపాయలు – రెండు (గుండ్రంగా రింగుల్లా తరగాలి) స్రింగ్ ఆనియన్ కాడలు – రెండు (సన్నగా తరగాలి) వెల్లుల్లి తురుము – టేబుల్ స్పూను కారం – టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా గోధుమ పిండి – కప్పు చీజ్ – అరకప్పు గుడ్లు – మూడు బ్రెడ్ ముక్కలపొడి – ఒకటిన్నర కప్పు ఆయిల్ – డీప్‌ఫ్రై కి సరిపడా తయారీ విధానం ►ముందుగా కడిగిన చికెన్ ఖీమాను ఒక గిన్నెలో తీసుకుని స్ప్రింగ్ ఆనియన్ , వెల్లుల్లి తరుగు, కారం, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. ►గోధుమపిండిలో కొద్దిగా ఉప్పు, గుండ్రంగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను ముంచి పక్కన బెట్టుకోవాలి. ►గుడ్ల సొనను ఒక గిన్నెలో , ప్లేటులో బ్రెడ్ ముక్కల పొడి తీసుకోవాలి. ►ఇప్పుడు ఉల్లిపాయ రింగుల్లో.. కలిపి చికెన్ ఖీమా మిశ్రమాన్ని పెట్టి, మధ్యలో చీజ్ తరుగు పెట్టి గుండ్రంగా వత్తుకోవాలి. ►ఈ ఆనియన్ రింగ్స్‌ను గుడ్డు సొన, బ్రెడ్‌ముక్కల పొడిలో వరుసగా రెండుసార్లు ముంచి, పదిహేను నిమిషాలు రిఫ్రిజిరేటర్లో ఉంచాలి. ►డీప్‌ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడెక్కిన తరువాత..ఆనియన్ రింగ్స్‌ను గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించితే ఆనియన్ చికెన్ రింగ్స్ రెడీ. చదవండి: True Love Story: 65 ఏళ్ల ఎదురుచూపు.. అద్భుత ప్రేమ గాథ! ఫిష్ కట్లెట్ విత్ రైస్ కావల్సిన పదార్థాలు బోన్ లెస్ చేపముక్కలు – అరకేజి బియ్యం – ముప్పావు కప్పు గుడ్డు – ఒకటి బ్రెడ్ స్లైసులు – రెండు(నానబెట్టాలి) స్ప్రింగ్ ఆనియన్ కాడలు – నాలుగు కొత్తి మీర తరుగు – అరకప్పు మిరియాల పొడి టీ స్పూను ఉప్పు – రుచికి సరిపడా ఆయిల్ – ఫ్రై కి సరిపడా తయారీ విధానం ►ముందుగా స్టవ్ మీద గిన్నెపెట్టి బియ్యం ఉడకడానికి సరిపడా నీళ్లు, రుచికి సరిపడా ఉప్పువేసి నీళ్లను మరిగించాలి. ►నీళ్లు మరిగాక బియ్యం వేసి మెత్తటి అన్నంలా ఉడికించి పక్కనబెట్టుకోవాలి. ►చేపముక్కల్ని ఖీమాలా తరుక్కోవాలి. ఈ ఖీమాలో గుడ్డు సొనను కార్చాలి. తరువాత మిరియాలపొడి, నానబెట్టిన బ్రెడ్, తరిగిన కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్ ముక్కలు, ఉడికించిన అన్నం వేసి బాగా కలపాలి. ►చేతులకు కొద్దిగా ఆయిల్ రాసుకుని చేప ఖీమా మిశ్రమాన్ని కట్లెట్లా వత్తుకోవాలి. ►బాణలిలో కొద్దిగా ఆయిల్ వేసి సన్నని మంటమీద, ఒక్కోవైపు పదినిమిషాలు వేయించితే ఫిష్ కట్లెట్ విత్ రైస్ రెడీ. చదవండి: Viral Video: అరె.. ఏం చేస్తున్నావ్.. ఛీ! డ్రైనేజీ వాటర్‌తో.. -
Navratri Special 2021: ఘుమ ఘుమలాడే పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ..
దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక వంటకాలతో మీ ఇంటి అథిదులకు మరింత దగ్గరవ్వండి. పనీర్ సమోసా, మరమరాల వడ తయారీ మీ కోసం.. పనీర్ సమోసా కావలసినవి: ►మైదా పిండి – పావు కిలో ►పనీర్ తురుము – 2 కప్పులు ►వాము – అర టీ స్పూన్ ►అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్ ►క్యాబేజీ, క్యారెట్ తురుము – 2 టేబుల్ స్పూన్ల చొప్పున ►రెడ్ చిల్లీ సాస్ – 1 టీ స్పూన్, ►సోయాసాస్ – 2 టీ స్పూన్లు ►ఉల్లికాడ ముక్కలు – 2 టీ స్పూన్లు ►మొక్కజొన్న పిండి – 1 టీ స్పూన్ ►పెరుగు – 1 టేబుల్ స్పూన్ ►నీళ్లు – సరిపడా ►ఉప్పు – తగినంత తయారీ విధానం ముందుగా కళాయిలో నూనె వేసి.. అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించి.. అందులో క్యాబేజీ తురుము, క్యారెట్ తరుగు, పనీర్ తురుము, రెడ్ చిల్లీసాస్, సోయాసాస్, వాము వేసుకుని గరిటెతో తిప్పుతూ బాగా వేయించుకోవాలి. అనంతరం సరిపడా ఉప్పు, మొక్కజొన్న పిండి, పెరుగు వేసి తిప్పుతూ ఉండాలి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మరో గిన్నె తీసుకుని, అందులో మైదాపిండి, ఉప్పు, కాస్త నూనె, నీళ్లు పోసి బాగా కలుపుతూ.. చపాతి ముద్దలా కలుపుకుని అరగంట పాటు మూతపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఆ ముద్దని చిన్న ఉండలుగా చేసుకుని పూరీల్లా ఒత్తాలి. పూరీని సగానికి కోసి త్రికోణాకారంలో మడతబెట్టి, లోపల పనీర్ మిశ్రమాన్ని పెట్టి అంచులు మూసేయాలి. అన్నీ అలాగే చేసుకుని.. నూనెలో డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మరమరాల వడ కావలసిన పదార్ధాలు ►మరమరాలు – 3 కప్పులు (నీటిలో నానబెట్టి, గట్టిగా పిండి ఒక బౌల్‌ల్లోకి తీసుకోవాలి) ►పెరుగు – 3 టేబుల్ స్పూన్లు ►గోధుమ పిండి – పావు కప్పు ►మైదా పిండి – పావు కప్పు ►అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు – 1 టీ స్పూన్ చొప్పున ►తెల్ల నువ్వులు – 1 టీ స్పూన్ + గార్నిష్‌కి ►కారం – ఒకటిన్నర టీ స్పూన్, నీళ్లు – కొన్ని ►ఉప్పు – తగినంత, గరం మసాలా – పావు టీ స్పూన్, పంచదార – 2 టీ స్పూన్లు, నిమ్మ రసం – 1 టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా, కొత్తిమీర తురుము – కొద్దిగా తయారీ విధానం ముందుగా మరమరాలను గట్టిగా పిసికి, అందులో పెరుగు వేసుకుని బాగా కలిపి, 15 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచుకోవాలి. అనంతరం అందులో గోధుమ పిండి, మైదా పిండి, అల్లం పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, సోంపు, 1 టీ స్పూన్ తెల్ల నువ్వులు, కారం, ఉప్పు, గరం మసాలా, పంచదార, నిమ్మరసం, 3 టీ స్పూన్ల నూనె, కొత్తిమీర తురుము వేసుకుని బాగా ముద్దలా చేసుకోవాలి. అవసరమయితే కొద్దిగా నీళ్లు కలుపుకోవాలి. ఆ ముద్దను చిన్న చిన్న కట్లెట్స్ మాదిరి చేసుకుని, ప్రతి కట్లెట్కి కాస్త తడి చేసి, పైన నువ్వులు పెట్టి నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! -
Navratri Special: నోరురించే స్వీట్స్ పనియారం, ఆలూకా హల్వా తయారీ విధానం ఇలా..
దసరా పండగ వేళ.. రొటీన్‌కు కాస్త భిన్నంగా సరికొత్త, ఘుమఘుమలాడే వంటకాలను బంధువులు, స్నేహితులు, ఇంట్లో వాళ్లకు రుచి చూపిద్దాం... స్వీట్ పనియారం కావల్సిన పదార్థాలు: ►గోధుమ పిండి – కప్పు ►అరటిపళ్లు – రెండు ►బియ్యప్పిండి – రెండు టేబుల్ స్పూన్లు ►పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్ స్పూన్లు ►బెల్లం – అరకప్పు ►నీళ్లు – అరకప్పు ►యాలకులపొడి – అరటీస్పూను ►నెయ్యి – టీస్పూను తయారీ విధానం.. ►అరకప్పు నీటిని వేడి చేసి, దానిలో బెల్లం వేసి కరిగించి పక్కనబెట్టుకోవాలి. ►ఒక గిన్నెలో రెండు అరటిపళ్లను తొక్కతీసి గుజ్జులా చేసుకోవాలి. ►ఇప్పుడు అరటిపండు గుజ్జులో బెల్లం సిరప్‌ను వడగట్టి పోయాలి. ఈ మిశ్రమానికి కొబ్బరి తురుము, యాలకుల పొడి, గోధుమపిండి, బియ్యప్పిండి వేసి ఉండలు లేకుండా, ►దోశ పిండిలా కలుపుకోవాలి. అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకోవచ్చు. ►ఇప్పుడు పొంగనాలు లేదా ఇడ్లీ పాత్రకు కొద్దిగా నెయ్యిరాసి, పిండి మిశ్రమాన్ని వేసి, మూతపెట్టి 15 నిమిషాలు ఉడికించిన తరువాత, మరోవైపు తిప్పి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉడికిస్తే స్వీట్ పనియారం రెడీ. ఆలూ కా హల్వా కావల్సిన పదార్థాలు: ►ఉడికించి తొక్కతీసిన బంగాళ దుంపలు – ఆరు (తురుముకోవాలి) ►నెయ్యి – అరకప్పు ►పాలు – కప్పు ►పంచదార పొడి – ఒకటిన్నర కప్పు ►యాలకుల పొడి – టీ స్పూను ►డ్రైఫూట్స్ పలుకులు – అరకప్పు తయారీ విధానం.. ►స్టవ్ మీద మందపాటి బాణలిని పెట్టి, వేడెక్కిన తరువాత కొద్దిగా నెయ్యి వేసి బంగాళ దుంపల తురుము వేసి దోరగా వేయించాలి. ►తురుము వేగాక పాలు, పంచదార పొడి వేసి కలపాలి. ►పంచదార పొడి పూర్తిగా కరిగిన తరువాత, మిగతా నెయ్యి వేసి తిప్పుతుండాలి. ►నెయ్యి పైకి తేలేంత వరకు ఉడికించి, యాలకుల పొడి, డ్రైఫ్రూట్స్ పలుకులు వేస్తే పొటాటో హల్వా రెడీ. చదవండి: ఈ హెర్బల్ టీతో మీ ఇమ్యునిటీని పెంచుకోండిలా.. -
ఫ్రైయిడ్ రైస్ ఆమ్లెట్, మష్రూమ్స్ సూప్, వెజ్ నూడూల్ బాల్స్ తయారీ ఇలా..
కొత్త రుచుల కోసం రెస్టారెంట్లవైపు పరుగులు తీసే అలవాటుకు స్వస్తిపలికే వేళాయే! ఎందుకంటే రెస్టారెంట్ లాంటి స్పెషల్ డిషెస్ మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అవేంటో తెలుసుకుందామా.. ఫ్రైయిడ్ రైస్ ఆమ్లెట్ కావలసిన పదార్థాలు: అన్నం – పావు కప్పు బోన్‌లెస్ చికెన్ – పావు కప్పు (ఉడికించినది) కూరగాయ ముక్కలు – పావు కప్పు (నూనెలో వేయించినవి) బటర్, టొమాటో సాస్ – 1 టేబుల్ స్పూన్ చొప్పున గుడ్లు – 3, నీళ్లు – 3 టేబుల్ స్పూన్లు ఉప్పు – తగినంత, మిరియాల పొడి – కొద్దిగా, నూనె – సరిపడా తయారీ విధానం: ముందుగా కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకుని.. అందులో అన్నం, చికెన్ ముక్కలు దోరగా వేయించిన తర్వాత.. బటర్, టొమాటో సాస్, మిరియాల పొడి, కూరగాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసుకుని తిప్పుతూ ఉండాలి. ఈ లోపు ఒక చిన్న బౌల్లో గుడ్లు, నీళ్లు, ఉప్పు బాగా కలుపుకుని మరో పాన్ మీద ఆమ్లెట్ వేసుకుని.. దానిపైన ఈ ఫ్రైయిడ్ రైస్ వేసుకుని.. ఫోల్డ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. మష్రూమ్స్ సూప్ కావలసినవి: మష్రూమ్స్ ముక్కలు (పుట్టగొడుగులు) – 2 కప్పులు (అదనంగా 2 టేబుల్ స్పూన్లు గార్నిష్‌కి నూనెలో వేయించినవి) ఉల్లిపాయ ముక్కలు – అర కప్పు అల్లం తురుము – అర టీ స్పూన్, మొక్కజొన్న పిండి – పావు కప్పు కొబ్బరి పాలు – 2 కప్పులు, ఉప్పు – తగినంత మిరియాల పొడి – 1 టీ స్పూన్ నీళ్లు – ఒకటిన్నర కప్పులు బ్రెడ్ ముక్కలు – గార్నిష్‌కి (నూనె లేదా నేతిలో వేయించాలి) చీజ్ తురుము, నూనె – 2 టేబుల్ స్పూన్ల చొప్పున తయారీ విధానం: ముందుగా ఒక కళాయిలో చీజ్, నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, అల్లం తురుము వేసుకుని దోరగా వేయించుకోవాలి. అందులో మష్రూమ్ ముక్కలు వేసుకుని 5 నిమిషాలు పైనే మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ మగ్గనివ్వాలి. అనంతరం మొక్కజొన్న పిండి, కొబ్బరి పాలు పోసి గరిటెతో బాగా కలిపి చిన్న మంట మీద ఏడెనిమిది నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆపైన ఉప్పు, మిరియాల పొడి వేసుకుని తిప్పుతూ ఉండాలి. కాస్త దగ్గర పడగానే నీళ్లు పోసి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించాలి. అనంతరం ఆ మిశ్రమాన్ని మొత్తం మిక్సీ పట్టుకోవాలి. చివరిగా హెవెన్ క్రీమ్ కరిగించి అందులో కలుపుకోవాలి. కొత్తమీర తురుము, వేయించి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల మష్రూమ్ ముక్కలు, బ్రెడ్ ముక్కలు వేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగాఉంటుంది. వెజ్ నూడూల్ బాల్స్ కావలసినవి: వెల్లుల్లి రేకలు – 3 ధనియాలు, కొత్తిమీర తురుము – 1 టేబుల్ స్పూన్ చొప్పున ఉప్పు – కొద్దిగా ఓట్స్ పౌడర్, జొన్న పిండి, క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము, కొబ్బరి కోరు – పావు కప్పు చొప్పున గడ్డ పెరుగు – 4 టేబుల్ స్పూన్లు నీళ్లు – కొన్ని నూనె – డీప్ ఫ్రైకి సరిపడా నూడూల్స్ – బాల్స్ చుట్టేందుకు సరిపడా (నీటిలో ఉడికించి పక్కనపెట్టుకోవాలి) తయారీ విధానం: ముందుగా మిక్సీలో వెల్లుల్లి రేకలు, ధనియాలు, కొత్తిమీర తురుము వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక పెద్ద బౌల్లో వేసుకుని, ఓట్స్ పౌడర్, జొన్న పిండి, క్యారెట్ తురుము, బీట్ రూట్ తురుము, కొబ్బరి కోరు, గడ్డపెరుగుతో పాటు నీళ్లు అవసరం అయితే కొద్దికొద్దిగా పోసుకుంటూ.. ముద్దలా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్‌లా చేసుకుని.. నూడూల్స్ పొడవుగా పరచి.. రోల్స్ మాదిరి బాల్స్ చుట్టూ నూడూల్స్ చుట్టి, తడి చేత్తో నూడూల్స్ చివర్లను బాల్స్‌కి గట్టిగా ఒత్తాలి. నూనెలో దోరగా వేయించుకోవాలి. -
వెదురు కొమ్ముల కూర.. ఎర్రచీమల గుడ్లతో చేసే చారు!
బుట్టాయగూడెం/పశ్చిమ గోదావరి: భిన్నమైన సంసృతి సంప్రదాయాలకు పెట్టింది పేరు గిరిపుత్రులు. ప్రకృతితో మమేకమై జీవిస్తూ ఆ అడవి నుంచే అన్నీ పొందుతుంటారు. అలాగే వారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. అడవిలో దొరికే వాటితో వంటకాలు చేసుకుని ఆ రుచుల్ని ఆస్వాదిస్తుంటారు. తొలకరి అనంతరం కొండ కోనల్లో అడుగడుగునా కన్పించే వెదురు చెట్ల నుంచి మొలిచే కొమ్ముల్ని వండుకుని ఆనందిస్తుంటారు. అలాగే ఎర్రచీమల గుడ్లతో చేసే చారు ప్రత్యేకం. సంప్రదాయ వంటకం కొమ్ముల కూర ఎంతో రుచికరమైన వెదురు కొమ్ముల కూర అడవి పుత్రుల సంప్రదాయ వంట. మారుమూల అటవీ ప్రాంతంలో నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనులు ఎక్కువగా వండుకుని తింటారు. అడవిలో వెదురు మొక్కల పక్కన మొలకెత్తే లేత పిలకల్ని కొమ్ములుగా పిలుస్తారు. వర్షాకాలంలో గిరిజన మహిళలు అడవికి వెళ్లి వాటిని సేకరిస్తారు. వెదురు కొమ్ముల తొక్కలు తీసి సన్నగా తరగాలి. అనంతరం నీళ్లలో తరుగును ఉడకపెట్టాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ వేయాలి. ఉప్పు వేసి కొంతసేపు ఉడికించాక.. ఎండు మిరపకాయలతో తాలింపు పెట్టి కూరను సిద్ధం చేస్తారు. వెదురు కొమ్ముల కూరలో ఇంకా రుచి రావాలంటే అందులో చింతచిగురు లేదా గోంగూర వేస్తుంటారు. ఈ కొమ్ముల కూరలో కారం వేస్తే కూర చేదు వస్తుంది. వర్షాకాలంలో ప్రత్యేకం వర్షాకాలంలో కొమ్ములు దొరికినంత కాలం గిరిజనులు ఈ కూరే తింటారు. ప్రతి ఇంట గ్రామాల్లో వెదురు కొమ్ముల కూర ఘుమఘుమలు అదిరిపోతుంటాయి. జూన్‌లో తొలకరి వర్షాలతో వెదురు చెట్లు చిగురిస్తాయి. జూలై, ఆగస్టు నెలల్లో వెదురు కొమ్ములు దొరుకుతాయి. ఆ సమయంలో ప్రతి ఇంటా కొమ్ముల కూర ఉండాల్సిందే. వెదురు కొమ్ముల సేకరణ అంత సులువేం కాదు. వాటి కోసం గిరిజన మహిళలకు అనేక ఇబ్బందులు తప్పవు. వెదురు కూపులో పిలకలు (కొమ్ములు) కోసే సమయంలో పొదల్లో విష సర్పాలు ఎక్కువగా తిరుగుతుంటాయి. వెదురు ముళ్లు విపరీతంగా గుచ్చుకుంటాయి. అయినా వాటి కోసం వెదుకులాట మానరు. 1. వెదురులో రెండు రకాలు ఉన్నాయి. కొండ వెదురు, ములస వెదురు. 2. వీటిలో కొండ వెదురు కొమ్ములను గిరిజనులు ఎక్కువగా తింటారు. ►వెదురు కొమ్ముల కూర ఎంతో ఇష్టం కావడంతో కష్టమైనా జాగ్రత్తగా సేకరిస్తామని గిరిజన మహిళలు చెబుతున్నారు. గత నాలుగు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నా.. అటవీప్రాంతానికి వెళ్ళి సేకరిస్తున్నారు. ఎన్నో ఏళ్లకు ఒకసారి దొరికే వెదురు బియ్యంతోనూ ప్రత్యేక వంటకాలు చేసుకుంటారు. ఎర్ర చీమలతో చారు... అడవుల్లో ఉండే పెద్ద పెద్ద చెట్లకు చీమలు గూళ్ళు ఏర్పాటు చేసుకుంటాయి. ఆ గూళ్ళను దులిపి దొరికే గుడ్లను నూరి ఆ చూర్ణంతో చారు కాసుకుంటారు. ఈ వర్షాకాలంలో ఈ చారు గిరిజనులు ఎంతో ఇష్టంగా తాగుతుంటారు. ఇది మా సంప్రదాయ వంటకం అడవి వెదురు కొమ్ముల కూర ఎంతో రుచిగా ఉంటుంది. ఇది తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వంటకం. కొమ్ముల కూరలో ఎండు చేపలు వేసుకుంటే చాలా బాగుంటుంది. చెట్లకు పట్టే ఎర్ర చీమల పుట్టను తెచ్చుకుని దాని గుడ్లతో చారుగా చేసుకుంటే చాలా బాగుంటుంది. – మాల్చి కోటంరెడ్డి, చింతలగూడెం, బుట్టాయగూడెం మండలం వెదురు కూరలో ఎన్నో పోషకాలు వానలు కురిసే సమయంలో ఎక్కువగా పప్పు కొమ్ముల కూరం తింటాం. దీనిలో ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఈ కూర తినేవారు మంచి ఆరోగ్యం ఉంటారు. – మాల్చి పాపాయమ్మ, చింతలగూడెం, బుట్టాయగూడెం మండలం -
పండగొచ్చింది.. నచ్చిన వంటలు చేసుకుందామా!
మూడు రోజుల పండుగ... ముచ్చటైన పండుగ... ముగ్గుల పండుగ... బొమ్మల కొలువు పండుగ.. గొబ్బెమ్మల పండుగ... హరిదాసులు గంగిరెద్దుల పండుగ... అల్లుళ్లతో సందడైన పండుగ.. దండిగా వంటలు వండే పండుగ... సంక్రాంతికి సంప్రదాయంగా చేసే వంటలతో పాటు, కొత్త వంటలను కూడా ప్రయత్నించి చూద్దాం.. నోటిని పండుగతో తీపి చేస్తూ, పండుగను సందడిగా చేసుకుందాం... అరిసెలు కావలసినవి: బియ్యం – 600 గ్రా.; బెల్లం – 300 గ్రా.; నీళ్లు – 50 మి.లీ.(సుమారుగా); ఏలకుల పొడి – అర టీ స్పూను; నువ్వులు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: బియ్యాన్ని రాత్రంతా నానబెట్టాలి ∙ఉదయాన్నే శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి, జల్లెడలో వేసి నీళ్లు మొత్తం పూర్తిగా కారిపోయేవరకు ఉంచాలి ∙బియ్యాన్ని కొద్దికొద్దిగా చిన్న మిక్సీ జార్లో వేసి బాగా మెత్తగా పొడి కొట్టి, జల్లెడ పట్టి, మెత్తటి పిండిని చేతితో గట్టిగా నొక్కి పక్కన ఉంచాలి (తడి ఆరిపోకూడదు) పాకం తయారీ: ∙ఒక గిన్నెలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి, బెల్లం కరిగే వరకు ఉంచాలి ∙పాకం అడుగు అంటకుండా మధ్యమధ్యలో తిప్పుతూ ఉండాలి ∙ఒక చిన్న గిన్నెలో నీళ్లు పోసి, అందులో పాకం వేస్తే అది కరిగిపోకుండా, ఉండలా అయితే, పాకం సరిగ్గా తయారయినట్లు లెక్క ∙మంట సిమ్‌లోకి ఉంచి, నెయ్యి, ఏలకుల పొడి వేసి బాగా కలిపి స్టౌ కట్టేసి గిన్నె కిందకు దింపాలి ∙బియ్యప్పిండిని కొద్దికొద్దిగా వేస్తూ పిండి గట్టిగా అయ్యేవరకు కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, మంటను మీడియంలో ఉంచాలి ∙పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని, నూనె పూసిన ప్లాస్టిక్ పేపర్ మీద ఉంచి, చేతితో ఒత్తి, కాగిన నూనెలో వేసి పైకి తేలేవరకు కదపకుండా ఉంచాలి ∙పైకి తేలాక ఒక నిమిషం పాటు ఆగి, రెండో వైపుకి తిప్పాలి ∙బంగారు రంగులోకి మారేవరకు వేయించి, బయటకు తీసి, రెండు గరిటెల మధ్యన కాని, అరిసెల చట్రంతో కాని నూనె పోయేవరకు గట్టిగా ఒత్తాలి (నువ్వుల అరిసెలు కావాలంటే, పిండిని కలుపుతున్నప్పుడే నువ్వులు కూడా వేసి కలిపేయాలి) బాగా చల్లారాక డబ్బాలో నిల్వ చేసుకోవాలి. గుడ్ కా హల్వా కావలసినవి: ∙బొంబాయి రవ్వ – 150 గ్రా.; సెనగ పిండి – 50 గ్రా.; బెల్లం తురుము – 80 గ్రా.; పంచదార – ఒక టీ స్పూను; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; డ్రై ఫ్రూట్స్ తరుగు – ఒక టేబుల్ స్పూను; కుంకుమ పువ్వు – చిటికెడు; నెయ్యి – 200 గ్రా. తయారీ: ∙స్టౌ మీద పాత్రలో అర గ్లాసు నీళ్లు పోసి మరిగాక, బెల్లం తురుము, పంచదార వేసి బాగా కలియబెట్టాలి ∙స్టౌ మీద మరొక పాత్రలో నెయ్యి వేసి కరిగాక సెనగ పిండి వేసి దోరగా వేయించాక, అదే బాణలిలో బొంబాయి రవ్వ వేసి దోరగా వేయించాలి ∙డ్రైఫ్రూట్స్ జత చేసి మరోమారు వేయించాలి ∙చివరగా పంచదార + బెల్లం కరిగించిన నీళ్లను జత చేసి, ఆపకుండా కలుపుతుండాలి ∙ఒక టీ స్పూను నీళ్లలో కుంకుమ పువ్వు కరిగించి, ఉడుకుతున్న హల్వాకు జత చేసి కలిపి దింపేయాలి. గోకుల్ పీఠే కావలసినవి: కొబ్బరి తురుము – పావు కేజీ; పచ్చి కోవా – అర కిలో; ఖర్జూర తాటి బెల్లం – పావు కేజీ; పంచదార – పావు కేజీ; మైదా పిండి – ముప్పావు కప్పు; నెయ్యి – ఒక కప్పు. తయారీ: పంచదార పాకం కోసం.. స్టౌ మీద ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి మరిగించాలి ∙ఒకటిన్నర కప్పుల పంచదార జత చేసి, తీగ పాకం వచ్చేవరకు బాగా కలిపి దింపేయాలి ∙పచ్చి కొబ్బరి తురుము, ఖర్జూరం తాటి బెల్లం జత చేయాలి ∙స్టౌ మీద బాణలి వేడయ్యాక, ఈ మిశ్రమాన్ని అందులో వేసి నాలుగైదు నిమిషాలు ఉడికించాలి ∙పచ్చి కోవా జత చేసి ఉండలు లేకుండా కలపాలి ∙ఈ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుంటూ, అప్పాల మాదిరిగా ఒత్తాలి ∙ఒక పాత్రలో మైదా పిండికి ఒక కప్పుడు నీళ్లు జత చేస్తూ బాగా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి, నాలుగు నిమిషాల పాటు కరిగించాలి ∙తయారుచేసి ఉంచుకున్న అప్పాలను బజ్జీల మాదిరిగా మైదా పిండిలో ముంచి తీసి, నూనెలో వేసి దోరగా వేయించాలి ∙కిచెన్ టవల్ మీదకు తీసుకోవాలి. పిన్నే కావలసినవి: మినప్పప్పు – అర కేజీ; పచ్చి కోవా తురుము – ఒక టీ స్పూను; బాదం పప్పుల పొడి – ఒక టీ స్పూను; పంచదార నీళ్లు – 3 టీ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను; గార్నిషింగ్ కోసం బాదం పప్పులు – కొద్దిగా. తయారీ: ∙మినప్పప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి ఆరు గంటలు నానిన తరవాత, నీళ్లు వడకట్టి, పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగించాలి ∙మినప్పప్పు జత చేసి సన్నని మంట మీద బంగారు రంగులోకి వచ్చేవరకు ఆపకుండా కలుపుతుండాలి ∙కోవా తురుము జత చేయాలి ∙బాదం పప్పుల పొడి జత చేయాలి ∙పంచదార నీళ్లు, ఏలకుల పొడి జత చేసి ఆపకుండా కలిపి దింపి చల్లార్చాలి ∙ఉండలుగా చేసి, బాదం పప్పులతో అలంకరించాలి. -
నోటిని తీపి చేస్తూ.. పండుగను సందడిగా చేసుకుందాం
స్వీట్ పొంగల్ కావలసినవి: పాలు – 4 కప్పులు; బియ్యం – కప్పు; బెల్లం పొడి – కప్పు; జీడిపప్పులు – 10; కిస్మిస్ – 2 టేబుల్‌స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; నెయ్యి – 6 టేబుల్ స్పూన్లు; కొబ్బరి ముక్కలు – 2 టేబుల్ స్పూన్లు తయారి: ముందుగా పాలను మరిగించాలి ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి నీరు ఒంపేసి, మరుగుతున్న పాలలో వేయాలి ∙ బాగా ఉడికిన తరవాత బెల్లం పొడి వేసి కలియబెట్టి, ఉడికించాలి ∙ ఐదు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి ∙బాణలిలో టేబుల్ స్పూను నెయ్యి వేసి కరిగాక జీడిపప్పులు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు విడివిడిగా వేసి వేయించి, ఉడికిన పొంగల్‌లో వేసి బాగా కలపాలి వేడివేడిగా వడ్డించాలి. సకినాలు కావలసినవి: బియ్యం – ఒక కప్పు; నువ్వులు – అర కప్పు; వాము – అర టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీటిని ఒంపేయాలి ∙బియ్యాన్ని పొడి వస్త్రం మీద పావు గంటసేపు నీడలో ఆరబెట్టాలి (పూర్తిగా తడిపోకూడదు) ఈ బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసి, జల్లెడ పట్టాలి ∙ఒకటిన్నర కప్పుల పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఉప్పు, వాము, నువ్వులు జత చేసి బాగా కలపాలి ∙తగినన్ని నీళ్లు జత చేస్తూ, జంతికల పిండిలా కలిపి, వస్త్రంతో మూసి ఉంచాలి ∙కొద్ది కొద్దిగా పిండి చేతిలోకి తీసుకుని, సకినాలు మాదిరిగా చుట్టాలి (పిండి ఎండినట్టుగా అనిపిస్తే, కొద్దికొద్దిగా తడి చేసుకోవాలి) ∙మొత్తం పిండిని సకినాలుగా ఒత్తి, సుమారు రెండు గంటల పాటు ఆరనివ్వాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాచాలి ∙ఒత్తి ఉంచుకున్న సకినాలను అట్లకాడ సహాయంతో జాగ్రత్తగా తీసి, కాగుతున్న నూనెలో వేసి కొద్దిగా బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. పులి పీఠా కావలసినవి: చిక్కటి పాలు – 2 లీటర్లు; బియ్యప్పిండి – 200 గ్రా.; బొంబాయి రవ్వ – 2 టేబుల్ స్పూన్లు; కొబ్బరి తురుము – 2 కప్పులు; గట్టి బెల్లం – 800 గ్రా. (సన్నగా తురమాలి). తయారీ: ∙స్టౌ మీద బాణలిలో కొబ్బరి తురుము వేసి, తyì పోయేవరకు బాగా కలపాలి ∙సగం బెల్లం జత చేసి, మొత్తం కరిగి, మిశ్రమం సగం అయ్యేవరకు కలిపి, దింపేసి, చల్లారాక ఈ మిశ్రమాన్ని మరో పాత్రలోకి తీసుకోవాలి ∙ఒక పాత్రలో బియ్యప్పిండి, బొంబాయి రవ్వ వేసి బాగా కలపాలి ∙వేడి నీళ్లు జత చేస్తూ పిండిని మెత్తగా అయ్యేలా కలుపుకోవాలి ∙పిండిని సమాన భాగాలుగా కట్ చేసుకోవాలి ∙ఒక్కో ఉండను చేతిలోకి తీసుకుని గుండ్రంగా చపాతీ మాదిరిగా ఒత్తాలి ∙కొబ్బరి తురుము మిశ్రమాన్ని అందులో ఉంచి, అర్ధ చంద్రాకారంగా ఒత్తాలి ∙స్టౌ మీద పాలు ఉంచి చిక్కగా అయ్యేవరకు మరిగించాలి ∙బెల్లం జత చేసి కరిగించాలి. తయారు చేసి ఉంచుకున్న అర్ధచంద్రాకారంలో ఉన్న పీఠాలను పాలలో వేసి ఒకసారి కలిపి, దింపేయాలి. మకర చౌలా కావలసినవి: ముడి బియ్యం – అర కప్పు; పాలు – ఒక కప్పు; కొబ్బరి తురుము – అర కప్పు; చెరకు ముక్కలు – అర కప్పు; బాగా ముగ్గిన అరటి పండ్లు – 2; పంచదార – తగినంత; మిరియాల పొడి – అర టీ స్పూను; కాటేజ్ చీజ్ – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; పండ్ల ముక్కలు – అర కప్పు తయారీ: ముందు రోజు రాత్రి బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి నానబెట్టాలి ∙ మరుసటి రోజు ఉదయం బియ్యాన్ని శుభ్రంగా కడిగి, పొడి వస్త్రం మీద సుమారు గంటసేపు ఆరబెట్టాలి ∙మిక్సీలో వేసి కొద్దిగా రవ్వలా ఉండేలా పిండి పట్టాలి ∙స్టౌ మీద ఒక పాత్రలో బియ్యప్పిండి, పాలు, కొబ్బరి తురుము, చెరకు ముక్కలు, పంచదార, అరటి పండ్లు, మిరియాల పొడి, కాటేజ్ చీజ్, అల్లం తురుము, పండ్ల ముక్కలు వేసి బాగా కలియబెట్టి, కొద్దిసేపు ఉడికించాలి ∙అరటి పండ్లను ముక్కలు చేసి, చేతితో బాగా మెత్తగా అయ్యేలా మెదిపి, బియ్యప్పిండి మిశ్రమానికి జత చేసి, రెండు నిమిషాలు ఉంచి దింపేయాలి ∙వేడివేడిగా తింటే రుచిగా ఉంటుంది. చల్లగా కావాలనుకునేవారు కొద్దిసేపు ఫ్రిజ్‌లో ఉంచితే చాలు. -
స్వీట్ కార్న్- చికెన్ కట్లెట్ తయారు చేయండిలా..
స్వీట్ కార్న్– చికెన్ కట్లెట్ కావలసినవి: చికెన్ – పావు కిలో(బోన్ లెస్ ముక్కలని మెత్తగా ఉడికించిపెట్టుకోవాలి), స్వీట్ కార్న్ – 1 కప్పు, బంగాళ దుంప – 1 (ముక్కలు కోసి, మెత్తగా ఉడికించుకోవాలి), ఉల్లిపాయ ముక్కలు – పావు కప్పు, పసుపు – పావు టీ స్పూన్, కారం – 1 టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, అల్లం– వెల్లుల్లి పేస్ట్ – 1 టీ స్పూన్, ఉప్పు – తగినంత, పాలు – 2 టేబుల్ స్పూన్లు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, నీళ్లు – సరిపడా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని అందులో చికెన్, స్వీట్ కార్న్, బంగాళ దుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని, అందులో పసుపు, కారం, జీలకర్రపొడి, గరం మసాలా, అల్లం–వెల్లుల్లి పేస్ట్, ఉప్పు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు నచ్చిన షేప్‌లో కట్లెట్స్ చేసుకుని.. ఒకసారి పాలలో ముంచి, మొక్కజొన్న పిండి పట్టించి.. నూనెలో డీప్ ఫ్రై చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే కొత్తిమీర తురుము లేదా ఉల్లిపాయ ముక్కలు వంటివి గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటాయి. ఆపిల్ కేక్ కావలసినవి: యాపిల్స్ – 6, గోధుమ పిండి, మొక్కజొన్న పిండి, మైదా పిండి, బ్రౌన్ సుగర్ – అర కప్పు చొప్పున, బటర్ – పావు కప్పు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 1 టీ స్పూన్, గుడ్లు – 3, పాలు – 1 కప్పు ఆప్రికాట్ జామ్ – పావుకప్పు (మార్కెట్లో లభిస్తుంది) తయారీ: ముందుగా ఆపిల్స్ శుభ్రం చేసుకుని నాలిగింటిని మెత్తగా, గుజ్జులా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బటర్ కరిగించుకుని ఒక పెద్ద బౌల్లో పోసుకుని అందులో బ్రౌన్ సుగర్, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో గుడ్లు, గోధుమపిండి, మొక్కజొన్న పిండి, మైదాపిండి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, పాలను కొద్దికొద్దిగా వేస్తూ మొత్తం కలపాలి. ఇప్పుడు ఆపిల్ గుజ్జు, ఆప్రికాట్ జామ్ కూడా వేసుకుని బాగా కలుపుకుని ఓవెన్లో పెట్టుకునేందుకు అవసరమైన పాత్రలో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన రెండు ఆపిల్స్‌ని అర్థచంద్రాకారంలో ముక్కలు చేసుకుని, వాటిని పైన అలంకరించుకుని 35 నుంచి 40 నిమిషాల పాటు ఓవెన్లో ఉడికించుకోవాలి. సర్వ్ చేసుకునేటప్పుడు అభిరుచిని బట్టి కేక్‌పైన క్రీమ్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డెకరేట్ చేసుకోవచ్చు. కీరదోస హల్వా కావలసినవి: కీరదోసకాయలు – 4 (పైతొక్కను తొలగించి, తురుములా చేసుకోవాలి), నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు, పాలపొడి – 1 కప్పు, పాలు – 2 కప్పులు, పంచదార – 4 టేబుల్ స్పూన్లు(అభిరుచి బట్టి పెంచుకోవచ్చు), గోధుమ రవ్వ – 5 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు, బాదం, పిస్తా – అభిరుచిని బట్టి తయారీ: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని.. పాన్‌లో పాలు, కీరదోస తురుము వేసుకుని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో పాలపొడి, గోధుమ రవ్వ, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ కలపాలి. ఆ మిశ్రమంలో పాల శాతం పూర్తిగా తగ్గి పొడిపొడిలాడుతున్న సమయంలో బాదం, పిస్తా లేదా జీడిపప్పు వేసుకుని గరిటెతో తిప్పుతూ స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. వేడి వేడిగా ఉన్నప్పుడే తింటే ఈ కీరదోస హల్వా చాలా రుచిగా ఉంటుంది. -
ముచ్చటగా మూడు స్నాక్స్ మీకోసం..
బనానా–వాల్నట్ మఫిన్స్ కావలసినవి: అరటిపండ్లు – 8, ఖర్జూరం పేస్ట్ – 1 కప్పు, వాల్నట్ పేస్ట్ – 3 టేబుల్ స్పూన్లు, బటర్ – అర కప్పు, మైదాపిండి – 1 కప్పు, మొక్కజొన్న పిండి – 2 టేబుల్ స్పూన్లు, బేకింగ్ పౌడర్ – 2 టీ స్పూన్లు, బేకింగ్ సోడా – అర టీ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గుడ్లు – 4, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా బటర్ కరింగించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండు అరటిపండ్లను అడ్డంగా అంగుళం పొడవులో కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద బౌల్ తీసుకుని, మిగిలి ఉన్న 6 అరటిపండ్లను మెత్తగా గుజ్జులా చేసుకోవాలి. అందులో వెనీలా ఎక్స్ట్రాక్ట్, ఖర్జూరం పేస్ట్, గుడ్లు వేసుకుని కలుపుకోవాలి. తర్వాత చల్లారిన బటర్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మైదాపిండి, మొక్కజొన్న పిండి, పంచదార పొడి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, వాల్నట్స్ పేస్ట్ వేసుకుని మరోసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు మఫిన్స్ బౌల్స్‌లో కొద్దికొద్దిగా ఆ మిశ్రమాన్ని పెట్టుకుని వాటిపైన అరటిపండు ముక్కలు చిత్రంలో ఉన్న విధంగా పెట్టుకుని, 20 నిమిషాల పాటు ఓవెన్లో ఉడికించుకోవాలి. పీనట్ పాన్కేక్ కావలసినవి: వేరుశనగలు – ఒకటిన్నర కప్పులు(దోరగా వేయించినవి), పంచదార – 2 కప్పులు, మైదాపిండి – 1 కప్పు, బియ్యప్పిండి – ముప్పావు కప్పు, మొక్కజొన్నపిండి – పావు కప్పు, కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు – ముప్పావు కప్పు, బేకింగ్ సోడా – పావు టీ స్పూన్, బేకింగ్ పౌడర్ – 1 టీ స్పూన్, నీళ్లు – సరిపడా, ఉప్పు – తగినంత, నెయ్యి – అర టేబుల్ స్పూన్ తయారీ: ముందు ఒక పెద్ద బౌల్ తీసుకుని అందులో.. మైదాపిండి, బియ్యప్పిండి, మొక్కజొన్న పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవాలి. అందులో ఒక కప్పు పంచదార, కొబ్బరిపాలు, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ దోశల పిండిలా సిద్ధం చేసుకుని, ఆ మిశ్రమాన్ని ఏడెనిమిది గంటల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. పాన్ కేక్స్ సిద్ధం చేసుకునే ముందు పల్లీలు, ఒక కప్పు పంచదార మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత నెయ్యిలో కొబ్బరి తురుమును బాగా వేయించి అందులో కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మైదాపిండి మిశ్రమంతో మందంగా దోసెల్లా వేసుకుని, దానిపైన కొద్దిగా పల్లీ–కొబ్బరి తురుము మిశ్రమాన్ని వేసుకుని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. వీటిని బెల్లం పాకంలో వేసిన ఆపిల్ ముక్కలతో కలిపి తింటే భలే రుచిగా ఉంటాయి. పనీర్ హల్వా కావలసినవి: పనీర్ తురుము – 1 కప్పు, పాలు – 2 కప్పులు (కాచి చల్లార్చినవి), పంచదార – అర కప్పు, సొరకాయ ముక్కలు – 2 కప్పులు (పైతొక్క తొలగించి), బ్రెడ్ పౌడర్ – 1 కప్పు, నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు, కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 10 లేదా 15, వేరుశనగలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఏలకుల పొడి – పావు టీ స్పూన్ తయారీ: ముందు స్టవ్ ఆన్ చేసుకుని.. ఒక బౌల్ పెట్టుకుని.. అందులో 3 టేబుల్ స్పూన్ల నెయ్యిలో వేరుశనగలు, జీడిపప్పు, కిస్మిస్ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరో బౌల్ తీసుకుని.. అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని, అందులో సొరకాయ తురుము వేసుకుని మూడు నిమిషాల పాటు గరిటెతో తిప్పుతూ వేయించుకోవాలి. తర్వాత పాలు వేసుకుని మధ్య మధ్యలో గరిటెతో తిప్పుతూ సొరకాయ ముక్కలను మెత్తగా ఉడికించుకోవాలి. తర్వాత పనీర్ తురుము, పంచదార వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఆ మిశ్రమం మొత్తం పొడిపొడిలాడుతున్నట్లుగా మారిన సమయంలో.. చివరిగా అభిరుచిని బట్టి ఏలకుల పొడి కూడా వేసుకుని గరిటెతో బాగా కలిపి స్టవ్ మీద నుంచి ఆ పాన్‌ను దించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు, కిస్మిస్, వేరుశనగలు వేసుకుని, ఒకసారి అటూ ఇటూ కలిపి.. వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటుంది. -
మటన్ బిర్యానీ.. కొర్రమీను వేపుడు..
నోరూరించిన వంటకాలు - 26 రకాల పసందైన వెరైటీలు - 150 మంది వంటగాళ్లు.. 350 మంది వలంటీర్లు సాక్షి, హైదరాబాద్: మటన్ దమ్కా బిర్యానీ... దమ్కా చికెన్ ఫ్రై.. గుడ్డు పులుసు.. మిర్చీకా సాలన్.. కొర్రమీను వేపుడు.. రొయ్యల ఫ్రై.. ఇలా ఘుమఘుమలాడే వంటకాలెన్నో ప్లీనరీలో నోరూరించాయి. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తెలంగాణ వంటకాలను ఆరగించి అదుర్స్ అని మెచ్చుకున్నారు. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో 26 రకాల ప్రత్యేక వంటకాలతో సుమారు 15–20 వేల మంది ప్రతినిధుల ఆకలి తీర్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ వంటకాల తయారీకి సుమారు రూ.20 లక్షలు ఖర్చయినట్లు అంచనా. మెనూలో ఉన్న ప్రత్యేక వంటకాలను నల్లకుంట ప్రాంతానికి చెందిన స్పందన క్యాటరర్స్ యజమాని పి.రమేశ్ నేతృత్వంలో సిద్ధం చేశారు. వంటకాల తయారీలో 150 మంది పాల్గొన్నారు. అతిథులకు కొసరి కొసరి వడ్డించేందుకు 350 మంది వలంటీర్లను అందుబాటులో ఉంచారు. వీరంతా గురువారం రాత్రి నుంచే వంటకాల తయారీలో నిమగ్నమయ్యారు. ఇదీ మెనూ.. 2,500 కిలోల మటన్‌తో దమ్కా బిర్యానీ తయారుచేశారు. 3000 కిలోల చికెన్‌తో దమ్కా బిర్యానీ సిద్ధం చేశారు. 15 వేల గుడ్లతో గుడ్డుపులుసు, 200 కిలోల చేపలు, 200 కిలోల రొయ్యల వేపుడు సిద్ధం చేశారు. 700 కిలోల మాంసంతో మటన్ కర్రీ చేశారు. మటన్ దాల్చాకు 300 కిలోల మాంసాన్ని వినియోగించారు. 200 లీటర్ల పాలతో పైనాపిల్ ఫిర్నీ స్వీట్ తయారు చేశారు. ఫ్లమ్ కేక్ ఐస్‌క్రీమ్ అతిథుల నోరూరించింది. శాకాహారుల కోసం మిర్చీకా సాలన్, ఆలుగోబీ టమాటా కుర్మా, గంగవాయిలి కూర పప్పు, వెజ్ దాల్చ, పచ్చి పులుసు, పెరుగు చట్నీ, పెరుగు, దోసకాయ చట్నీ, ఫ్రూట్ సలాడ్, ఐస్‌క్రీం వడ్డించారు.