క్రిస్మస్ వస్తోంది. కేక్ చేద్దామంటే అమ్మో మైదాతోనా... అని భయం. హెల్త్ కోసం అందరూ మిల్లెట్‌లు తింటున్నారు. మిల్లెట్‌లతో అన్నాలు, బిరియానీలు, బ్రేక్‌ఫాస్ట్‌లు, స్నాక్‌లు...ఎన్నో చేస్తున్నారు. మరి... కేక్‌లు చేయలేమా? ఎందుకు చేయలేం! ఇదిలో ఇలా చేయండి.
కావలసినవి: జొన్న పిండి– కప్పు; బాదం పొడి– కప్పు; బనానా ప్యూరీ– కప్పు; క్యారట్ తురుము– కప్పు; బెల్లం పొడి– కప్పు; పాలు లేదా నీరు – అర కప్పు; వెన్న – 3 టేబుల్ స్పూన్‌లు; అవిసె గింజల పొడి – 3 టేబుల్ స్పూన్‌లు (రెండింతల నీరు వేసి కలపాలి); ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి – ఒక్కొక్కటి అర స్పూన్; బాదం పలుకులు– 10 (సన్నగా తరగాలి)
తయారీ విధానం:
⇒ మందపాటి పెనంలో జొన్నపిండి వేసి సన్న మంట మీద దోరగా వేయించాలి.
⇒ మరొక పాత్రలో అవిసె గింజల పొడిని నీటితో కలిపి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి.
⇒ ఆ తర్వాత జొన్నపిండిలో వెన్న, బనానా ప్యూరీ, అవిసె గింజల పేస్ట్ వేసి బాగా కలపాలి.
⇒ ఇందులో ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి మళ్లీ కలపాలి.
⇒ ఇప్పుడు మిగిలిన పొడులు, క్యారట్ తురుము వేసి తగినంత నీరు లేదా పాలు వేస్తూ బాగా కలపాలి.
⇒ కేక్ మౌల్డ్‌కు వెన్న రాసి పైన కొద్దిగా జొన్న పిండిని చల్లాలి. ఇప్పుడు పై మిశ్రమాన్ని సమంగా సర్దాలి. పైన బాదం పలుకులు చల్లాలి.
⇒ ఇప్పుడు ఒవెన్‌ను 180 డిగ్రీలు వేడి చేసి మౌల్డ్‌ను లోపల పెట్టి 50 లేదా 60 నిమిషాల పాటు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత కేక్‌ను ముక్కలుగా కట్ చేయాలి.
Comments
Please login to add a commentAdd a comment