Cakes
-
నిమిషానికి 607 కేకులు: ప్రేమికుల రోజు ఎక్కువ ఆర్డర్స్ అక్కడి నుంచే..
ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు సందర్బంగా.. భారీగా కేక్ ఆర్డర్స్ వచ్చాయి. ఇప్పటి వరకు అదే ఆల్ టైమ్ రికార్డ్ అని ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ ఫుడ్ మార్కెట్‌ప్లేస్ సీఈఓ 'రోహిత్ కపూర్' వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వాలెంటైన్స్ డే రోజును సెలబ్రేట్ చేసుకోవడానికి.. స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించారు. గతంలో ఇప్పటి వరకు పొందనన్ని కేక్స్ ఆర్డర్.. ఆరోజు వచ్చినట్లు పేర్కొన్నారు. నొయిడాకు చెందిన ఒక వినియోగదారు ఏకంగా రూ. 25,335 విలువైన ఆర్డర్ పెట్టారు. ఆర్డర్లో థియోస్ నుండి తొమ్మిది కేకులు, ప్రీమియం పాటిస్సేరీ, చాక్లెట్లు ఉన్నాయి. ఈ సందర్భంగా.. ''ప్రేమంటే ఇదే, దానిని పంచుకున్నప్పుడు అది పెరుగుతుంది” అని కపూర్ అన్నారు.One user from Noida today bought cakes worth ₹25,335! 9 cakes from Theos. Pyaar ho toh aisa, jitna baatoge utna badhega 🥰— Rohit Kapoor (@rohitisb) February 14, 2025స్విగ్గీ యాప్ నుంచి నిమిషానికి 607 కేక్ డెలివరీ జరిగాయి. అత్యధికంగా ఆర్డర్ చేసిన వాటిలో కేక్ మిల్క్ చాక్లెట్ ఉంది. బెంగళూరులోనే అత్యధికంగా కేకులు ఆర్డర్ చేసుకున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ పేర్కొన్నారు. ఈ సంవత్సరం ప్రేమ వేడుక చాలా మధురంగా ఉందని అన్నారు.Ludhiana, Amritsar, Shillong, Noida, and Agra are leading the charge with the biggest spikes in food deliveries tonight! Who said celebrating love is only a big city trend? 🧡— Rohit Kapoor (@rohitisb) February 14, 2025లూథియానా, అమృత్సర్, షిల్లాంగ్, నోయిడా, ఆగ్రాలలో వాలెంటైన్స్ డే రోజు ఫుడ్ డెలివరీ ఎక్కువగా జరిగింది. స్విగ్గీ బోల్ట్ తిరుపూర్‌లోని ఎన్ఐసీ ఐస్ క్రీమ్స్ నుంచి 3.4 నిమిషాల్లో ఆర్డర్‌ను డెలివరీ చేసింది. ఈ సందర్భంగా “వేడి వేడిగా ఉంటుంది, చలి చల్లగా ఉంటుంది.. కోరికలు ఎప్పుడూ వేచి ఉండాల్సిన అవసరం లేదు” అని కపూర్ వ్యాఖ్యానించారు.Fresh, fast, and right on time! Swiggy Bolt’s fastest order today was 3.4 minutes from NIC Ice Creams in Tirupur. Hot stays hot, cold stays cold, and cravings never have to wait. That’s Swiggy Bolt ⚡️— Rohit Kapoor (@rohitisb) February 14, 2025 -
Christmas 2024 : మైదాలేకుండానే మీ కిష్టమైన కేక్, రెసిపీలు
క్యాలెండర్ చివరికి వచ్చేశాం. హాయ్ చెప్పడానికి క్రిస్మస్ వస్తోంది. కేక్ మీదకు మనసుపోతుంది. బేకరీ కేక్లన్నీ మైదా కేక్‌లే. ఆరోగ్యంగా ఏమీ తినలేమా? పండగ కోసం కొంచెం కష్టపడదాం. మన వంటిల్లు క్రిస్మస్కి సిద్ధమైంది . మీరూ రెడీనా.సెమోలినా కోకోనట్ కేక్ కావలసినవి: బొంబాయి రవ్వ పావు కేజీ; కొబ్బరి తురుము – 125 గ్రాములు; చక్కెర పొడి– 150 గ్రాములు; బటర్– 125 గ్రాములు; పెరుగు– 125 గ్రాములు; పాలు – 125 ఎం.ఎల్; వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్; బేకింగ్ సౌడర్– టీ స్పూన్; బేకింగ్ సోడా– అర టీ స్పూన్; ఉప్పు – చిటికెడు; బటర్– టీ స్పూన్; బాదం పప్పు – గుప్పెడు (సన్నగా తరగాలి).షుగర్ సిరప్ కోసం: చక్కెర – 125 గ్రాములు; నీరు – 200 ఎంఎల్; దాల్చిన చెక్క – అంగుళం ముక్క; రోజ్ ఎసెన్స్ – 2 చుక్కలు.తయారీ: మొదట షుగర్ సిరప్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందుకోసం నాన్‌స్టిక్ పెనంలో చక్కెర, నీరు, దాల్చిన చెక్క, రోజ్ ఎసెన్స్ వేసి కలిపి గరిటెతో కలుపుతూ సన్న మంట మీద వేడి చేయాలి. 8 నుంచి పది నిమిషాలకు మిశ్రమం తీగపాకం వస్తుంది. అప్పుడు స్టవ్ మీద నుంచి దించేయాలి ∙కేక్ ట్రేకి టీ స్పూన్ బటర్ రాయాలి. తర్వాత దళసరి కాగితాన్ని పరిచి సిద్ధంగా ఉంచుకోవాలి ∙ఒవెన్‌ని హీట్ చేయాలి ∙కేక్ తయారీ కోసం తీసుకున్న పదార్థాలలో బాదం పలుకులు మినహా మిలిగిన అన్నింటినీ ఒక పాత్రలో వేసి బీటర్‌తో బాగా చిలకాలి. నురగ వచ్చే వరకు చిలికిన తరవాత మిశ్రమాన్ని ట్రేలో పోసి ఒవెన్‌లో పెట్టి 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలో 40 నిమిషాల సేపు ఉంచాలి.∙ఒవెన్‌లో నుంచి కేక్‌ను బయటకు తీసిన తరవాత ముందుగా కలిపి పెట్టిన షుగర్ సిరప్‌ని కేక్ అంతటికీ సమంగా పట్టేలాగ పోసి (దాల్చిన చెక్కను తీసేయాలి), బాదం పలుకులను కూడా చల్లి ట్రేని కదిలించకుండా పక్కన ఉంచాలి. కేక్ చల్లారేటప్పటికి షుగర్ సిరప్ చక్కగా పడుతుంది. చల్లారిన తర్వాత చాకు సహాయంతో కేక్‌ను ఒక ప్లేట్లోకి తీసుకుని ముక్కలుగా కట్ చేయాలి.కావలసినవి: మెత్తటి ఖర్జూరాలు– 300 గ్రాములు; వాల్నట్ –30 గ్రాములు; పిస్తా– 40 గ్రాములు (రోస్టెడ్, సాల్టెడ్ పిస్తా); నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పు– 30 గ్రాములు (సన్నగా తరగాలి); యాలకుల ΄ పొడి– పావు టీ స్పూన్; గసగసాలు – టేబుల్ స్పూన్.ఖజూర్ బర్ఫీ తయారీ: ∙ఖర్జూరాల నుంచి గింజలు తొలగించాలి. వాల్నట్స్ని సన్నగా తరగాలి. పిస్తాను కూడా తరగాలి ∙ఖర్జూరాలను మిక్సీ బ్లెండర్లో వేసి గుజ్జుగా చేయాలి ∙పెనం వేడి చేసి అందులో నెయ్యి, బాదం, వాల్నట్, పిస్తా పలుకులు వేసి సన్న మంట మీద గోధుమరంగులోకి వచ్చే వరకు వేయించాలి. వేగిన గింజలను ఒక ప్లేట్లోకి తీసుకుని అదే పెనంలో మిగిలిన నెయ్యిలో యాలకుల పొడి, ఖర్జూరం పేస్ట్ వేసి కలుపుతూ వేయించాలి. ఖర్జూరం పేస్ట్ మృదువుగా మారిన తరవాత అందులో ముందుగా వేయించి పక్కన పెట్టిన గింజలను వేసి కలిపి దించేయాలి ఒక దళసరి పేపర్ మీద ఖర్జూర మిశ్రమాన్ని వేసి సమంగా పరిచి పైన గసగసాలను పలుచగా చల్లి పేపర్‌ను రోల్ చేసి మనకు కావల్సిన సైజ్‌లో కట్ చేసుకుంటే ఖజూర్ బర్ఫీ రెడీ. ఇవి మూడు వారాల వరకు నిల్వ ఉంటాయి. వీటిని వేడి తగ్గిన తర్వాత తినవచ్చు, చల్లగా తినాలంటే అరగంట సేపు ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. -
కేకుపుట్టించే టేస్ట్!
ప్రయాణం చేస్తూనే అల్పాహారం తీసుకోవాలనుకున్న ఓ యువ ప్రొఫెషనల్ దీని కోసం అరటి వాల్నట్ కేక్ తయారు చేసుకుంటాడు. బిజీగా ఉండే ఓ మోడ్రన్ మదర్.. చిన్నపిల్లల స్నాక్ బాక్స్ కోసం తన ప్యాంట్రీలో నిల్వ చేసిన ఫ్రూట్ పుడ్డింగ్ కేక్‌ని బయటకు తీసి రెడీగా ఉంచుతుంది. ఇలా ఉదయాన్నే తీసుకునే అల్పాహారం నుంచి రాత్రి పూట ఆస్వాదించే బ్రౌనీస్ వరకూ.. కేక్స్ నగరవాసుల వేగవంతమైన డైలీ రొటీన్లో భాగం అయిపోయాయి. ఇక న్యూఇయర్‌ని, క్రిస్మస్లను మోసుకొచ్చే డిసెంబర్ నెలలో అయితే కేక్‌ల సందడికి హద్దే ఉండదని చెప్పాలి. కేకుల వినియోగంలో సౌలభ్యంతో పాటు వాటి రుచి కారణంగా చాలా మందికి ఆహారపరంగా ప్రాధాన్యత జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి. లాక్డౌన్ సమయంలో ఇళ్లకే పరిమితమైన సిటిజనులు హోమ్ బేకింగ్‌ను అలవాటు చేసుకున్నారు. అలా పదుల సంఖ్యలో పుట్టుకొచి్చన హోమ్ బేకర్స్.. ఆన్లైన్ వేదికగా అనేక మందికి వీటిని చేరువ చేశారు. దీంతో ఈ డెజర్ట్ సిటిజనులకు మరింత ఇష్టమైన ఆహారంగా మారింది. హాట్ కేక్.. ఈట్ రైట్.. సిటీలో విరివిగా వినియోగంలో ఉన్నవాటిని ప్యాకేజ్డ్ కేకులు: ఆరి్టసానల్ కేక్‌లుగా విభజించవచ్చు. వీటిలో స్పాంజ్ కేక్‌లు, కప్ కేక్‌లు, చీజ్ కేక్‌లు, కేక్ పాప్స్ వంటివి వేగంగా తినే పని ముగించాలనుకునేవారికి ఇష్టమైనవిగా మారాయి. దీనికి తోడు పలు బ్రాండ్స్ మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న వివిధ రుచులు ఆకట్టుకునే ప్యాకేజ్లతో మరింతగా ఆదరణ దక్కించుకుంటున్నాయి. ప్లెయిన్ స్పాంజ్ కేకులు, ఫ్రాస్టెడ్ ఐసింగ్, స్విస్ రోల్స్, ఫ్రూట్ ఫిల్డ్ మఫిన్ల వరకు అందుబాటులో ఉన్న అనేక రకాల ప్యాకేజ్డ్ కేక్‌లకు డిమాండ్ బాగా ఉంది. గులాబ్ జామూన్, రస్మలై కేకులు లేదా ఫిర్ని తిరమిసు ఇలా బ్రెడ్ తయారీదారులు మన రుచులతో పాశ్చాత్య డెజర్ట్‌లను చొప్పిస్తున్నారు. పండుగలకూ పసందే.. పుట్టిన రోజులు లేదా వివాహాలతో పాటు కేక్ సంప్రదాయం భారతీయ పండుగలకు కూడా విస్తరించింది. రాఖీ, దీపావళి భాయ్ దూజ్ వంటి పండుగలు సంప్రదాయ స్వీట్లు – బహుమతులతో పాటు కేక్‌లను బహుమతిగా ఇచ్చే వారి సంఖ్య పెరుగుతోంది. సంప్రదాయ స్వీట్లు ఇప్పటికీ పెద్ద ఎత్తున ఆదరణ పొందుతున్నప్పటికీ, కేక్‌ను బహుమతిగా ఇవ్వడం అనేది కూడా క్రమక్రమంగా ఊపందుకుంటోంది. అలా ఇచ్చి పుచ్చుకోవాలనుకునేవారి కోసం రిచ్ ప్లమ్ కేక్, విక్టోరియన్ ప్లమ్ కేక్, చాకొలెట్ ఐసింగ్ కేక్, వెనీలా ఐసింగ్ కేక్, పైనాపిల్, స్ట్రాబెర్రీ, బట్టర్ స్కాచ్, బ్లాక్ ఫారెస్ట్ కేకులతో పాటు ఫ్రెష్ ఫ్రూట్ కేక్, క్యారామిల్ కేక్, చాకొలెట్ ఆల్మండ్ కేక్.. వంటì వెన్నో.. సిటీ మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఊపుతెచ్చిన.. ఈ–కామర్స్ఇ–కామర్స్ ప్లాట్‌ఫారమ్‌ల వల్ల కొన్ని గంటల్లో ఫ్యాన్సీ కేక్‌లను పంపడం/స్వీకరించడం çసర్వసాధారణమైపోయింది. కేక్ గిఫ్టింగ్ కోసం ఈ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేసి, బహుమతిగా పంపే సౌలభ్యంతో కేక్‌ల విక్రయాల్లో 12–15% పెంపునకు ఈ సైట్లు కారణమయ్యాయని అంచనా. ప్రముఖ ఆన్లైన్ బేకరీ రిటైల్ చైన్ అయిన విన్నీ విక్రయాల తీరు రాఖీ, భాయ్ దూజ్ లేదా దీపావళి వంటి పండుగల సమయంలో డిమాండ్‌కు అద్దం పడుతోంది. ఏతావాతా ప్లాట్‌ఫారమ్‌ల వెల్లువ కేక్ గిఫ్టింగ్ మార్కెట్ వృద్ధికి గణనీయంగా దోహదపడింది. రాఖీ, భైదూజ్ దీపావళి వంటి పండుగల సమయంలో కేక్ విక్రయాల దాదాపు 20% వృద్ధి రేటును చూసింది. సోషల్.. సోస్టైల్.. డిజైనర్ కేక్స్ హవాకు సోషల్ మీడియా ఆజ్యం పోస్తోంది. ఆకర్షణీయమైన వెరైటీలను సోషల్ వేదికలపై ఇన్ఫ్లుయెన్సర్లు, ఫుడ్ బ్లాగర్లు తాజా కేక్ డిజైన్లను క్రమం తప్పకుండా ప్రదర్శిస్తున్నారు. తద్వారా ప్రత్యేక సందర్భాలకు తగ్గట్టుగా డిజైన్ చేసిన కేక్‌ల వైపు వినియోగదారుల చూపు మళ్లేలా చేస్తున్నారు. పరిశ్రమ నివేదికల ప్రకారం, సోషల్ మీడియా ప్రభావం వల్ల దేశంలో కేక్ మార్కెట్ కొన్ని సంవత్సరాలుగా 20శాతం వరకూ పెరుగుతోందట.సందర్భమేదైనా.. సందడి కేక్స్దే.. ఒకప్పుడు కేక్స్‌ను కేవలం బర్త్‌డేలకు మాత్రమే ఎక్కువగా వినియోగించేవారు. క్రిస్మస్, న్యూ ఇయర్లతో పాటు ఇప్పుడు ఇవి విభిన్న సందర్భాలకు విస్తరించాయి. చిన్నారుల పుట్టిన రోజుల్ని ప్రతినెలా జరపడం దగ్గర నుంచీ వివాహ వార్షికోత్సవాల దాకా అలాగే కొత్తగా జాబ్‌లో చేరడం దగ్గర నుంచీ ప్రమోషన్స్, పదవీ విరమణ దాకా.. ఇలా అనేకానేక సందర్భాలకు కేక్స్‌ను వినియోగించడం జరుగుతోంది. పైనాపిల్ కేక్, బటర్‌స్కాచ్ కేక్, ఛీజ్ కేక్, బిస్కోటి కేక్.. తదితర వెరైటీలకు ఫుల్ డిమాండ్ ఉంది. – సయ్యద్ ఇర్ఫాన్, సుభాన్ బేకరీ -
Prachi Dhabal Deb: ఆ కేకుల కోసం క్యూ కడతారు
బొమ్మలేసే ఆర్టిస్టు గురించి విన్నాం. కేక్ ఆర్టిస్ట్ గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రాచీ ధబల్ను మన దేశంలో బేకింగ్ క్వీన్‌గా, గొప్ప కేక్ ఆర్టిస్ట్‌గా పిలుస్తారు. కేక్‌లను కళాత్మకంగా సౌందర్యాత్మకంగా చేసి తినడానికే కాదు చూడటానికి కూడా రుచికరంగా తయారు చేసి అంతర్జాతీయ అవార్డులు పొందుతోందామె. ఈ ఫొటోలు చూడండి. అన్నీ తినే కేకులే. ‘మీరూ ఇలా కొత్తగా ట్రై చేసి సక్సెస్ సాధించండి’ అంటోంది ప్రాచీ. ప్రపంచ ప్రఖ్యాత కేక్ ఆర్టిస్ట్ ఎవరో తెలుసా? యూకేకు చెందిన ఎడ్డీ స్పెన్స్. కళాత్మకమైన కేకుల తయారీలో ఆయన ప్రతిభకు అక్కడి ప్రభుత్వం ‘సర్’ బిరుదుతో గౌరవించింది. ‘నేను లండన్ వెళ్లి ఆయన దగ్గర పని నేర్చుకున్నాను. నాకు కేక్ ఆర్ట్ అంటే అంత పిచ్చి’ అంటుంది ప్రాచీ ధబల్. 36 ఏళ్ల ప్రాచీ గత సంవత్సరం 100 కిలోల కేక్‌ను తయారు చేసింది. ఇది ఇటలీలో ప్రసిద్ధమైన మిలాన్ కేథడ్రల్ (చర్చ్)కు రెప్లికా. ఆరున్నర అడుగుల పొడవు, నాలుగున్నర అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉన్న ఈ భారీ చర్చ్ ఆకారపు కేక్‌లో దాదాపు 1500 సున్నితమైన భాగాలు ఉన్నాయి. వాటన్నింటినీ రాయల్ ఐసింగ్ (తెల్ల సొన, చక్కెర పొడుల మిశ్రమం)తో తయారు చేసి ‘వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ 2022’లో ఎక్కింది ప్రాచీ. అందుకే ఆమెను ‘బేకింగ్ క్వీన్ ఆఫ్ ఇండియా’ అంటుంటారు. చిన్నప్పటి నుంచి ప్రాచీ ధబల్ సొంత ఊరు డెహరాడూన్. అక్కడే పుట్టి పెరిగింది. ‘నాకు పదేళ్లున్నప్పుడు వేసవి సెలవుల్లో కేకుల తయారీని మా అమ్మ నాకు కాలక్షేపంగా నేర్పింది. నేను కప్‌కేక్‌లు తయారు చేసేదాన్ని. రోజులు పెరిగే కొద్దీ ఆ ఆసక్తి కూడా పెరిగింది. నాకు బొమ్మలు వేయడం కూడా వచ్చు. కథల పుస్తకాలు బాగా చదివేదాన్ని. నా పుట్టిన రోజున బయట కేక్ ఆర్డర్ ఇస్తున్నప్పుడు నేను చదివిన కథల్లోని కోటల్లాంటి, రాకుమార్తెల్లాంటి, ఉద్యానవనాల్లాంటి కేక్‌లు తెప్పించమని మా అమ్మను పోరేదాన్ని. కాని అలాంటి కేకులు ఎవరూ తయారు చేయరు. మార్కెట్లో మామూలు కేకులు ఉండేవి. నాకు అలాంటివి ఎందుకు తయారు చేయకూడదు అనిపించేది’ అంది ప్రాచీ ధబల్. ఉద్యోగం నచ్చలేదు ప్రాచీ కోల్‌కతాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. ఆ తర్వాత ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా పూణెలో ఉద్యోగానికి వచ్చి స్థిరపడింది. కాని ఆమెకు ఆ ఉద్యోగం నచ్చలేదు. ‘2012 నాటికి నాకు ఉద్యోగం బోర్ కొట్టింది. అందులో నాకు ఇష్టమైనదేదో లేదు. నాకు కేక్ ఆర్టిస్ట్‌గా మారాలనిపించింది. కాని ఆ రోజుల్లో ఆ కళకు పెద్దగా గిరాకీ లేదు. ఎవరికీ అలాంటిది ఒకటి ఉంటుందని తెలియదు. కళాత్మక కేకులు తయారు చేయాలంటే కావలసిన మెటీరియల్ మన దేశంలో దొరికేది కాదు. అయినా సరే తెగించి విదేశాల నుంచి కావలసిన సామాగ్రి తెప్పించుకుంటూ రంగంలో దిగాను. నేను తయారు చేసేది షాపులో అమ్మే కేకులు కాదు. కస్టమైజ్డ్ కేకులు. అందువల్ల వీటి ఖరీదు కూడా ఎక్కువ. అలాంటి కస్టమర్లు పెరిగే వరకూ నాకు కొంచెం కష్టంగానే అనిపించింది. కాని నా ప్రత్యేకమైన కేకులు నలుగురి దృష్టిలో పడ్డాక ఇప్పుడు ఊపిరి సలపడానికి కూడా టైమ్ లేదు’ అని నవ్వుతుంది ప్రాచీ. దేశీయత ప్రాచీ తయారు చేసే కేకులు దేశీయతతో నిండి ఉంటాయి. చీరల మీద డిజైన్లు, ఆర్కిటెక్చర్, సంప్రదాయ చిహ్నాలు అన్నీ ఆమె కేకుల్లో కనిపిస్తాయి. ఇటీవల ఆమె బెనారస్ చీరను, ఆభరణాలను పోలిన కేక్‌ను తయారు చేసింది. ‘కుంకుమ భరిణె’ లా కనిపిస్తున్న ఆ కేక్ ఎన్నో ప్రశంసలు పొందింది. ఆమె తయారు చేసిన నెమలి కేక్‌లో పైకి ఆభరణాలుగా కనిపించేవి కూడా తినదగ్గ మెటీరియల్‌తో తయారు చేసినవే. అయితే ఈ కళను ప్రాచీ తన దగ్గరే దాచుకోవడం లేదు. యువ బేకర్లకు ప్రత్యేక శిక్షణ ఏర్పాటు చేసి నేర్పుతోంది. ‘అమ్మాయిలు ముందు తమకు ఇష్టమైన రంగంలో కనీస డిగ్రీ సంపాదించాలి. ఆ తర్వాత ఆ ఇష్టం కోసం కష్టపడాలి. తప్పకుండా విజయం లభిస్తుంది. కష్టపడకుండా ఏదీ రాదు’ అంటుంది ప్రాచీ. పాత దారిలో కొత్తగా నడవడమే విజయం అని ప్రాచీ విజయం తెలుపుతోంది. -
కేక్ విత్ మెసేజ్: సందేశాత్మక, థీమ్‌లతో కూడిన న్యూ ఇయర్ కేక్‌లు
-
Cake Recipes: న్యూ ఇయర్‌కి ప్రత్యేకంగా.. ఇలా రాగి పిండితో కేక్ చేసుకుంటే!
న్యూ ఇయర్‌కి ఈసారి వెరైటీగా రాగి పిండితో ఆరోగ్యకరమైన కేక్ తయారు చేసుకోండి! కావలసినవి: ►రాగి పిండి– 100 గ్రాములు ►గోధుమ పిండి – వంద గ్రాములు ►కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు ►చక్కెర – 100 గ్రాములు (చక్కెరకు బదులు బెల్లం పొడి లేదా తాటి బెల్లం పొడి కూడా వాడవచ్చు) ►పెరుగు – 100 ఎమ్ఎల్ (చిలకాలి) ►వెన్న – 150 గ్రాములు ►పాలు – 200 ఎమ్ఎల్ ►యాపిల్ సిడర్ వినెగర్– అర టేబుల్ స్పూన్ ►వెనిలా ఎసెన్స్ – టేబుల్ స్పూన్ ►బేకింగ్ పౌడర్ – టీ స్పూన్ ►బేకింగ్ సోడా – అర టీ స్పూన్ తయారీ: ►రాగి పిండి, గోధుమ పిండి కలిపి జల్లించాలి. ►జల్లించిన పిండిలో కోకోపౌడర్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసి మరో రెండుసార్లు జల్లించాలి. ►ఇలా చేయడం వల్ల అన్నీ సమంగా కలుస్తాయి. ఇందులో చక్కెర వేసి కలపాలి. ►మరొక పాత్రలో పాలు, వెనిలా ఎసెన్స్, వినెగర్, చిలికిన పెరుగు, వెన్న వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని పిండి మిశ్రమంలో పోసి బాగా కలపాలి. ►ఇప్పుడు ఒవెన్‌ను 170 డిగ్రీల దగ్గర వేడి చేయాలి. ►కేక్ మౌల్డ్ లేదా వెడల్పు పాత్రకు కొద్దిగా వెన్న రాసి కేక్ మిశ్రమం అంతటినీ పాత్రలో పోసి ఒవెన్‌లో పెట్టాలి. ►అరగంటకు కేక్ చక్కగా బేక్ అవుతుంది. ►ఒవెన్‌లో నుంచి తీసిన తర్వాత చల్లారనిచ్చి ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేయాలి. ►ఇష్టమైతే కేక్ మీద కోకో, చాకొలెట్లతో గార్నిష్ చేయవచ్చు. ఇవి కూడా ట్రై చేయండి: కెవ్వు కేకు.. రుచికరమైన జోవార్ క్యారట్ కేక్ తయారీ ఇలా! మైదా ఎందుకు? సజ్జపిండితో ఆరోగ్యకరమైన కేక్ ఇలా! -
Recipe: మైదా ఎందుకు? సజ్జపిండితో ఆరోగ్యకరమైన కేక్ తయారీ ఇలా!
మైదాతో కాకుండా సజ్జపిండితో ఇలా కేక్ తయారు చేసుకోండి! ఎంచక్కా క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలను పెర్ల్ మిల్లెట్ కేక్‌తో ఆస్వాదించండి. కావలసినవి: ►సజ్జ పిండి– వంద గ్రాములు ►చక్కెర – 80 గ్రాములు ►పాలు – 30 ఎమ్ఎల్ ►కోడిగుడ్లు – 3 ►వెనిలా ఎసెన్స్– 2 చుక్కలు ►వెన్న – టీ స్పూన్ తయారీ: ►సజ్జలను మందపాటి పెనంలో దోరగా వేయించి, చల్లారిన తరవాత మెత్తగా పొడి చేసి జల్లెడ పట్టి పక్కన ఉంచుకోవాలి. ►ఒవెన్‌లో పెట్టే పాత్రకు వెన్న రాసి సిద్ధంగా ఉంచుకోవాలి. ►వెడల్పుగా లోతుగా ఉండే పాత్రలో కోడిగుడ్ల సొన వేసి బీటర్‌తో నురగ వచ్చే వరకు బీట్ చేయాలి. ►ఇప్పుడు అందులో చక్కెర వేసి మరికొంత సేపు గిలక్కొట్టాలి. ►సజ్జ పిండిని జల్లెడలో వేసి కోడిగుడ్ల మిశ్రమం ఉన్న పాత్రలో జల్లించినట్లు వేయాలి. ►ఇలా చేస్తే పిండి ఉండలు లేకుండా సమంగా కలుస్తుంది. పాలు, వెనిలా ఎసెన్స్ కూడా వేసి సమంగా కలిసే వరకు బీట్ చేయాలి. ►బీట్ చేయడం తగ్గిస్తే కేక్ సరిగా పొంగదు. ►కాబట్టి పిండి మిశ్రమాన్ని గుల్లబారే వరకు బీట్ చేయాలి. ►బాగా కలిసిన కేక్ మిశ్రమాన్ని వెన్నరాసిన కేక్ మౌల్డ్ లేదా మామూలు పాత్రలో పోసి ఒవెన్‌ను 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసి అందులో పెట్టాలి. ►అర గంట సేపటికి చక్కగా బేక్ అవుతుంది. ►టూత్ పిక్‌తో కేక్ పై నుంచి గుచ్చి బయటకు తీసి చూస్తే తేమ అంటకపోతే మిశ్రమం పూర్తిగా బేక్ అయినట్లు, తేమ ఉన్నట్లనిపిస్తే మరో ఐదు నిమిషాల సేపు ఉంచాలి. ►కేక్‌ను ఒవెన్ నుంచి తీసి వేడి తగ్గిన తరవాత ముక్కలు కట్ చేసి సర్వ్ చేసుకోవాలి. ►ఇష్టమైన వాళ్లు కేక్ మీద ఐసింగ్ షుగర్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. -
కెవ్వు కేకు.. రుచికరమైన జోవార్ క్యారట్ కేక్ తయారీ ఇలా!
క్రిస్మస్ వస్తోంది. కేక్ చేద్దామంటే అమ్మో మైదాతోనా... అని భయం. హెల్త్ కోసం అందరూ మిల్లెట్లు తింటున్నారు. మిల్లెట్లతో అన్నాలు, బిరియానీలు, బ్రేక్‌ఫాస్ట్‌లు, స్నాక్‌లు...ఎన్నో చేస్తున్నారు. మరి... కేక్‌లు చేయలేమా? ఎందుకు చేయలేం! ఇదిలో ఇలా చేయండి. కావలసినవి: జొన్న పిండి– కప్పు; బాదం పొడి– కప్పు; బనానా ప్యూరీ– కప్పు; క్యారట్ తురుము– కప్పు; బెల్లం పొడి– కప్పు; పాలు లేదా నీరు – అర కప్పు; వెన్న – 3 టేబుల్ స్పూన్లు; అవిసె గింజల పొడి – 3 టేబుల్ స్పూన్లు (రెండింతల నీరు వేసి కలపాలి); ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, దాల్చిన చెక్క పొడి – ఒక్కొక్కటి అర స్పూన్; బాదం పలుకులు– 10 (సన్నగా తరగాలి) తయారీ విధానం: ⇒ మందపాటి పెనంలో జొన్నపిండి వేసి సన్న మంట మీద దోరగా వేయించాలి. ⇒ మరొక పాత్రలో అవిసె గింజల పొడిని నీటితో కలిపి ఐదు నిమిషాల సేపు పక్కన ఉంచాలి. ⇒ ఆ తర్వాత జొన్నపిండిలో వెన్న, బనానా ప్యూరీ, అవిసె గింజల పేస్ట్ వేసి బాగా కలపాలి. ⇒ ఇందులో ఉప్పు, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, దాల్చిన చెక్క పొడి వేసి మళ్లీ కలపాలి. ⇒ ఇప్పుడు మిగిలిన పొడులు, క్యారట్ తురుము వేసి తగినంత నీరు లేదా పాలు వేస్తూ బాగా కలపాలి. ⇒ కేక్ మౌల్డ్‌కు వెన్న రాసి పైన కొద్దిగా జొన్న పిండిని చల్లాలి. ఇప్పుడు పై మిశ్రమాన్ని సమంగా సర్దాలి. పైన బాదం పలుకులు చల్లాలి. ⇒ ఇప్పుడు ఒవెన్‌ను 180 డిగ్రీలు వేడి చేసి మౌల్డ్‌ను లోపల పెట్టి 50 లేదా 60 నిమిషాల పాటు బేక్ చేయాలి. చల్లారిన తర్వాత కేక్‌ను ముక్కలుగా కట్ చేయాలి. -
Recipe: బనానా– కాఫీ కేక్ ఇలా తయారు చేసుకోండి!
బనానా కాఫీ కేక్ ఇలా ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోండి! బనానా- కాఫీ కేక్ తయారీకి కావలసినవి: ►అరటిపండ్లు – 2 (గుండ్రంగా కట్ చేసుకోవాలి) ►బ్రౌన్ సుగర్ – 1 కప్పు, ►నూనె – అర కప్పు ►మైదాపిండి – 1 కప్పు ►బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►పాలు – అర కప్పు, చాక్లెట్ చిప్స్ – 1 టేబుల్ స్పూన్ తయారీ: ►ముందుగా అరటిపండు ముక్కలు, నూనె, బ్రౌన్ సుగర్ మిక్సీ బౌల్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ►అనంతరం ఆ మిశ్రమంలో మైదాపిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా వేసుకోవలి. ►ఇందులో కొద్దికొద్దిగా పాలు పోసుకుంటూ క్రీమ్‌లా బాగా కలుపుకోవాలి. ►తర్వాత నచ్చిన షేప్‌లో ఉండే బేకింగ్ బౌల్ తీసుకుని.. దానిలోపల నూనె పూయాలి. ►ఈ మిశ్రమాన్ని బౌల్లో వేసుకుని.. చాక్లెట్ చిప్స్ జల్లుకుని.. ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ►కాస్త చల్లారిన తర్వాత నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని.. సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Recipe: మొక్కజొన్న పిండి, కోడిగుడ్లు, నువ్వులతో సెసెమీ క్రస్టెడ్ చికెన్! Recipe: బీట్రూట్ బజ్జీ ఇలా తయారు చేసుకోండి! -
ఉద్యోగం వదిలి 2 లక్షల పెట్టుబడితో కంపెనీ.. కట్ చేస్తే 75 కోట్ల టర్నోవర్
వ్యాపారం చేయాలనే ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కొందరు మాత్రమే పట్టుదల, కృషితో తాము అనుకున్న గమ్యానికి చేరుకుంటారు. ప్రస్తుతం అలాంటి ముగ్గురు స్నేహితుల విజయగాథ ఇది. రెండు లక్షల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు కోట్ల రుపాయలు టర్నోవర్ చేస్తున్నారు. అందరిలానే చదువు పూర్తి చేసుకుని కొన్నాళ్లు ఉద్యోగం చేసి సంతృప్తి చెందక వ్యాపారం వైపు అడుగులు వేశారు హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహగల్, సుమన్ పాత్ర. 2 లక్షలు పెట్టుబడి.. 75 కోట్ల టర్నోవర్ వ్యాపారం చేద్దామని అనుకునే సమయానికి వారి వద్ద కేవలం రూ.2 లక్షలు మాత్రం ఉంది. ఆ డబ్బునే పెట్టుబడిగా పెట్టి 2010లో ఫ్లవర్ ఆరా పేరుతో కంపెనీని ప్రారంభించారు. ఇందులో పూలు, కేకులు, బహుమతులు వంటి వస్తువులకు సంబంధించిన ఆన్లైన్ సేవలను అందిస్తూ వచ్చారు. ప్రారంభంలో, ఆ కంపెనీలో ఒక ఉద్యోగి మాత్రమే ఉన్నాడు. అదే ఉద్యోగి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్‌గా పని చేయడంతో సహా కార్యకలాపాలు, డెలివరీ వంటి అన్ని అంశాలను నిర్వహించేవాడు. అనుకోకుండా వాలెంటైన్స్ డే వాళ్ల కంపెనీకి చాలా ఆర్డర్లు వచ్చాయి. స్టాఫ్ ఒక్కరే కావడంతో సహ వ్యవస్థాపకులు హిమాన్షు, శ్రే కూడా డెలివరీ కోసం వెళ్ళవలసి వచ్చింది. ఇక అప్పటి నుంచి చాలా సందర్భాల్లో కేకులు ఎక్కువగా విక్రయాలు జరుగుతుండడం గమనించారు. దీంతో 2016 సంవత్సరంలో బెకింగో అనే కొత్త బ్రాండ్‌ను ప్రారంభించారు. ఈ కంపెనీ దేశంలోని వివిధ ప్రాంతాలకు ఒకే బ్రాండ్‌కు చెందిన తాజా కేక్‌లను డెలివరీ చేస్తూ బెకింగోని విస్తరింపజేశారు. ప్రస్తుతం, కంపెనీ ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పాటు మీరట్, పానిపట్, రోహ్తక్ కర్నాల్ వంటి చిన్న నగరాలకు సేవలందిస్తోంది. కంపెనీ విక్రయాల్లో 30 శాతం వెబ్సైట్ ద్వారానే 70 శాతం అమ్మకాలు స్విగ్గీ, జొమాటో ద్వారా జరుగుతున్నాయి. అలా 2021-22లో బెకింగో 75 కోట్లకు పైగా టర్నోవర్ చేరకుంది. ప్రస్తుతం కంపెనీలో 500 మందికి పైగా పనిచేస్తున్నారు. కంపెనీ ఈ ఏడాది తన మొదటి ఆఫ్‌లైన్ అవుట్‌లెట్‌ను ఢిల్లీలో ప్రారంభించింది. చదవండి: గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ సమస్య ఉండదబ్బా! -
కేక్‌లతో పాటు.. బ్రెడ్స్, బన్స్.. బేక్ చేయొచ్చు! దీని ధర ఎంతంటే!
అకేషన్ ఏదైనా.. లొకేషన్ ఎక్కడైనా.. సెలబ్రేషన్ అనగానే కేక్ ఉండాల్సిందే. ఆ కేక్స్‌ని నచ్చే ఫ్లేవర్స్‌లో హాట్‌హాట్‌గా తయారు చేసిపెడుతుందీ ఎలక్ట్రిక్ కేక్ మేకర్. ఇందులో కేవలం కేక్సే కాదు.. బ్రెడ్స్, బన్స్, కప్‌కేక్స్.. ఇలా చాలా రకాలను బేక్ చేసుకోవచ్చు. దీంట్లో బేక్, గ్రిల్ వంటి ఆప్షన్స్‌తో పాటు.. లో–గ్లూటెన్ ఫ్రీ కేక్, సుగర్ ఫ్రీ కేక్, ఫ్రూట్ కేక్ వంటివీ బేక్ చేసుకోవడానికి రెసిపీ బుక్ కూడా లభిస్తుంది. డివైజ్‌కి సరిపడే.. బ్లాక్ కలర్ పాత్ర, దానికి తగ్గ మూత ఉంటాయి. ఆ పాత్ర అడుగున.. గరిటెలాంటి పరికరం బిగించి ఉంటుంది. దాంతో కేక్స్ మాత్రమే కాదు.. ఫ్రైలు, కూరలనూ వండుకోవచ్చు. -ధర 189 డాలర్లు (రూ.14,946) చదవండి: 1 Pot Multi Cooker: నాన్‌స్టిక్ మినీ ఓవెన్.. ధర రూ.12,034..! ‘క్రీస్ కప్స్’.. కాఫీతోనే కప్పులు తయారీ..! -
జఫ్పా కేక్.. రికార్డులు బ్రేక్.. పేరు డిఫరెంట్‌గా ఉన్నా... టేస్ట్ మాత్రం సూపర్
జఫ్ఫాకేక్స్... అవేం కేక్స్ అని నవ్వుకుంటున్నారా? మీరు సరిగ్గానే విన్నారు. పేరు డిఫరెంట్‌గా ఉన్నా... టేస్ట్ మాత్రం సూపర్. బ్రిటిష్ కేక్స్ కంపెనీ మెక్విటీ తయారు చేసే ఈ ఆరెంజ్ కేక్స్, డార్క్ ఫాంటసీ బిస్కెట్ సైజ్‌లో ఉంటాయి. అయితే దాని గురించి ఇప్పుడెందుకు మాట్లాడుకుంటున్నాం అనే కదా మీ డౌట్. అంత చిన్న సైజ్‌లో ఉండే కేక్‌ను ఫ్లేవర్, రుచి ఏమాత్రం పోకుండా... 80 కిలోల కేక్ తయారు చేసింది చెఫ్ ప్రాన్సిస్ క్విన్. అంటే దాదాపు 6,557 చిన్న కేకులు కలిపినంత ఉంటుందన్నమాట. ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన జఫ్ఫాకేక్గా గిన్నిస్ వరల్డ్ రికార్డును సృష్టించింది. అత్యంత పెద్ద జఫ్ఫాకేక్ తయారు చేసి... 2017లో తాను నెలకొల్పిన రికార్డును తానే బ్రేక్ చేసింది క్విన్. కేక్స్ తయారు చేయడంలో నిపుణురాలైన ఆమె... 2013లో ‘ద గ్రేట్ బ్రిటిష్ బేక్ ఆఫ్’లో విజేతగా నిలిచింది. 80 కిలోల బరువు, దాదాపు రెండు మీటర్ల వైశాల్యంతో ఉన్న ఈ కేక్ తయారీ కోసం 160 గుడ్లు, 8 కిలోల డార్క్ చాక్లెట్, 15 కిలోల ఆరెంజ్ జెల్లీ ఉపయోగించింది. కేక్ మిక్సింగ్ దగ్గర్నుంచి బేకింగ్ వరకు 11 గంటల సమయం పట్టింది. జప్ఫాకేక్కు అసలైన రుచి రావడం కోసం ఆ కేక్స్ కంపెనీ ‘మెక్విటీ’ సిబ్బంది కూడా క్విన్‌కు సహాయం చేశారు. ఇదంతా ఓకే అసలు ఆ కేక్‌కు జఫ్ఫా అనే పేరు ఎందుకొచ్చిందనేగా మీ డౌట్. జఫ్ఫా ఆరెంజెస్‌తో చేసిన కేక్ కాబట్టి జఫ్ఫా కేక్ అని పిలుస్తారు. ఈ జఫ్ఫా ఆరెంజెస్ అరబ్ రైతుల 19వ శతాబ్దపు సృష్టి. ఈ ఆరెంజెస్ తక్కువ గింజలు, ఎక్కువ గుజ్జు, మందపాటి పీల్‌తో ఎగుమతి చేయడానికి వీలుగా ఉంటాయి. -
పైనాపిల్ కేక్ ఇంట్లోనే ఇలా ఎంచక్కా తయారు చేసుకోండి!
పైనా‘పిల్’ను తింటే వేరుగా ఏ ‘పిల్’ తీసుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది చమత్కరిస్తూ ఉంటారు. దీనిని ఆరోగ్యాల ఆవాస కేంద్రం అని కూడా చెబుతుంటారు. పైనాపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అయితే, ఎప్పుడూ రొటీన్‌గా పైనాపిల్ ముక్కలు తినడం, జ్యూస్ తాగడం వంటివి కాకుండా ఇలా ఎంచక్కా కేక్ చేసుకుని తినండి! పైనాపిల్ కేక్ కావలసినవి: బ్రౌన్ సుగర్ పౌడర్ – 150 గ్రాములు అన్ సాల్టెడ్ బటర్ – 175 గ్రాములు, పైనాపిల్ స్లైస్, చెర్రీస్ – 20 చొప్పున మైదాపిండి – ఒకటిన్నర కప్పులు, బేకింగ్ పౌడర్ – ఒకటిన్నర టీ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గుడ్లు – 2 వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 1 టీ స్పూన్, సోర్ క్రీమ్, పాలు, పైనాపిల్ జ్యూస్ – పావు కప్పు చొప్పున తయారీ: ముందుగా ఒక బౌల్లో 60 గ్రాముల కరిగించిన బటర్ వేసుకుని.. అందులో 100 గ్రాముల బ్రౌన్ సుగర్ పౌడర్ వేసుకుని బాగా కలిపాలి. ఆ మిశ్రమాన్ని గుండ్రటి షేప్‌లో ఉండే కేక్ బౌల్లో అర అంగుళం మందంలో విస్తరించాలి. దానిపైన గుండ్రటి పైనాపిల్ స్లైస్, చెర్రీతో డెకరేట్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం పెద్ద బౌల్ తీసుకుని మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఈలోపు మరో బౌల్లో మిగిలిన బటర్, బ్రౌన్ సుగర్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో క్రీమ్‌లా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టి వేసుకుని మరింత మెత్తటి క్రీమ్‌లా చేసుకోవాలి. మధ్యమధ్యలో మైదా–బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకుంటూ.. సోర్ క్రీమ్, పాలు, పైనాపిల్ జ్యూస్ కొద్దికొద్దిగా వేసుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిజ్‌లో పెట్టుకున్న కేక్ మేకర్ బౌల్ తీసుకుని దాని నిండుగా ఈ మిశ్రమాన్ని వేసుకుని సమాంతరంగా చేసుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత నచ్చిన విధంగా కలర్‌పుల్ క్రీమ్స్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. -
పైనాపిల్, చాక్లేట్, వెనీలా.. నోరూరించే కెవ్వు కేక్స్..
సాక్షి,మంచిర్యాలటౌన్: మారుతున్న కాలానికి అనుగుణంగా కేకులు సులభమైన పద్ధతులలో ఎన్నో రకాలుగా మరింత ఆకర్షణీయంగా తయారు చేస్తున్నారు. పేస్ట్రీలు, మెరింగ్యూస్, కస్టర్డ్స్, ఫ్రూట్స్, నట్స్, డెజర్ట్ సాస్, బటరక్రీమ్, క్యాండీడ్ ఫ్రూట్స్‌తో ఎన్నో రకాల కేక్‌లను త యారు చేసి, ప్రజలకు అందిస్తున్నారు. రుచితో పాటు, ఇట్టే ఆకర్షించేలా పలు ఆకృతులతో పాటు, మనకు నచ్చిన రూపంలోనూ కేక్‌లను తయారు చేసి ఇస్తున్నారు. ఇక ప్రతి ఏటా డిసెంబర్ 31వ తేదీ రాత్రి నుంచి జనవరి 1వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా లక్షలాది కేక్‌లను కట్ చేస్తుంటారు. పోటీతత్వంతో హైదరాబాద్ వంటి నగరాల్లో లభించే కేక్‌లను మంచిర్యాలలో ప్రజలకు అందిస్తున్నారు. నూతన సంవత్సర వేడుకల కోసం ఒక్కరోజే వేలాది కేక్‌లు అమ్మకా లు సాగితే, సాధారణ రోజుల్లో వందలాది కేక్‌లు అమ్ముడుపోతున్నాయి. ప్రజల్ని ఆకర్షించేందుకు కేక్‌లను ఎప్పటికప్పుడు కొత్త కొత్త వెరైటీలతో సిద్ధం చేస్తున్నారు. రుచిని బట్టి ధరలు పైనాపిల్, బటర్‌స్కాచ్, చాక్లేట్, వెనీలా, బ్లాక్ ఫారెస్ట్, రెడ్విల్వెట్, ఫ్రెష్ఫ్రూట్, చాక్లెట్ చాపర్ చిప్స్, వైట్ ఫారెస్టు, గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్ వంటి రకాల కేకులు రూ.500లకు కేజీ నుంచి రూ. 1200ల వరకు లభిస్తున్నాయి. కొత్త వెరైటీతో వస్తున్న గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్ కేక్‌లు కేజీకి రూ.1000 నుంచి రూ.1200ల వరకు లభిస్తున్నాయి. ఇక వీటితో పాటు రెగ్యులర్ కేక్‌లు కేజీకి రూ.200ల నుంచి రూ.400ల వరకు లభిస్తుండగా, కూల్ కేక్‌లు రూ.500ల నుంచి రూ.1000ల వరకు లభిస్తున్నాయి. చాలా వెరైటీలు చేస్తున్నాం ప్రజలు కొత్తకొత్త వెరైటీ కేక్‌లను ఇష్టపడుతున్నారు. అందుకే ధర ఎక్కువైనా రుచికరమైన కొత్త వాటిని తయారు చేస్తున్నాం. గమ్‌పేస్ట్, ఫౌంటేయిన్, చాక్లెట్ చాపర్స్ వంటి లేటెస్ట్ రకాలను తయారు చేస్తున్నాం. వీటి ధర రూ. వెయ్యికి పైగా ఉన్నా, వీటినే కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నారు. బార్బీ బొమ్మ, బాంబుల రూపంలో ఉన్న కేక్‌లను చేస్తున్నాం. – కొండపర్తి రమేశ్, బేకరీ నిర్వాహకుడు, మంచిర్యాల వెరైటీ కేక్‌లంటే ఇష్టం ఏదైనా శుభసందర్భంలో కేక్‌లను తింటుంటాం. ఎప్పుడో ఒకసారి ఈ కేక్‌లను తింటాం కాబట్టి, వెరైటీ కేక్‌లను తినడం ఇష్టం. అందుకే అప్పుడప్పుడు కొనే కేక్‌లలో వెరైటీగా, కొత్త రుచులతో వచ్చే కేక్‌లను కొంటున్నాం. – మహేందర్, రామకృష్ణాపూర్ చదవండి: రూ.5కేనాలుగు ఇడ్లీలు.. అక్కడ ఫుల్ డిమాండ్.. దీనికో ప్రత్యేకత ఉంది -
ప్రధాని మోదీ బర్త్‌డే వేడుకలు: భారీ కేక్స్, ఆకట్టుకునే సైకత శిల్పం
సాక్షి, న్యూఢిల్లీ: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 71వ పుట్టిన రోజు సందర్భంగా పలువురు కేంద్రమంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులు విషెస్ అందిస్తున్నారు. అలాగే సినీ, క్రీడారంగ దిగ్గజాలు కూడా మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు దీంతో సోషల్‌మీడియాలో భారీ సందడి నెలకొంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు మోదీబర్త్‌డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సిరంజి ఆకారంలో ఉన్న 71 అడుగుల పొడవైన కేక్‌ను కట్ చేసి ప్రధానికి విషెస్ తెలిపారు. భోపాల్‌లో 71 అడుగుల కేక్ కట్ చేశారు. అలాగే 71 మంది బీజేపీ కార్యకర్తలు, రక్తదానం చేయనున్నారు. మోదీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో సెప్టెంబర్ 16 న నిర్వహించారు మట్టి దీపాలు వెలిగించి 71 కిలోల లడ్డూతో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా 'కాశీ సంకల్ప్' పుస్తకాన్ని లాంచ్ చేశారు. చదవండి: Ola Electric : రెండు రోజుల్లో రూ. 1100 కోట్లు మరోవైపు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్ ఒడ్డున ప్రధాని సైకత శిల్పాన్ని రూపొందించారు. మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన పట్నాయక్ సముద్ర గవ్వలతో స్పెషల్‌గా రూపొందించిన ఈ సైకత శిల్పం ఫొటోను ట్విటర్లో షేర్ చేశారు. గౌరవ ప్రధాని మోదీజీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మహాప్రభు జగన్నాథ స్వామి దీవెనలు ఎప్పటికీ ఉండాలి, ఆయురారోగ్యాలతో ఉండాలంటూ మోదీకి ఆయన బర్త్ డే విషెస్ చెప్పారు. ఒడిశా కళాకారిణి ప్రియాంక సహానీ ప్రదాని పుట్టినరోజున తృణ ధాన్యాలతో మోదీ చిత్రాన్ని రూపొందించారు. 8 అడుగుల x 4 అడుగులతో అపురూపమైన కళాఖండాన్ని తయారు చేశారు. ఇందుకోసం 25 గంటలు పట్టిందని ఆమె తెలిపారు. Wishing Our Hon’ble Prime Minister @narendramodi ji on his birthday. May Mahaprabhu Jagannatha bless him with long and healthy life to serve mother India. I’ve created a SandArt installation used 2035 sea shells with message #HappyBirthdayModiJi at Puri beach , Odisha . pic.twitter.com/uDTJGOLCFk — Sudarsan Pattnaik (@sudarsansand) September 17, 2021 Birthday wishes to our Honourable Prime Minister @narendramodi ji. May the Almighty shower you with good health, happiness and success throughout your journey. @PMOIndia #HappyBdayModiji pic.twitter.com/ABdFCMt87q — Mohanlal (@Mohanlal) September 17, 2021 -
ఓహ్రీస్లో 'వింటర్' కేక్..
-
వీడియో చూస్తే మీరూ ఆశ్చర్యపోవాల్సిందే!
ఈ రోజుల్లో ప్రతి చిన్న వేడుకను కేక్‌తో సెలబ్రేట్ చేసుకోవడం సాధారణమైంది. అయితే, ఎప్పుడూ ఒకే తరహా కేకులతో విసిగిపోయిన అమెరికాకు చెందిన ప్రముఖ చెఫ్ నటాలీ సైడ్‌సర్ఫ్ సరికొత్తగా ఆలోచించారు. చాలా వెరైటీగా కేకులు తయారు చేసి అబ్బురపరిచారు. వెరైటీ అంటే మరీ షాక్ అయ్యే విధంగా చేసేశారు. వంకాయ, ఉల్లిగడ్డ, నిమ్మకాయ, ఇలా అన్ని రకాల పళ్ల ఆకారాలతో కేకులు తయారు చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ వెరైటీ కేకుల వీడియో అందరినీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకోవడంతో వైరల్ అయింది. అచ్చం నిజమైనా కూరగాయాల్లా ఉన్న కేకులను చూస్తే మీరూ ఆశ్చర్యపోవాల్సిందే! 'నేను అక్షరాలా జీవించడానికి కేకులను తయారుచేస్తాను, కాబట్టి ఇది నిజంగా నాతో మాట్లాడుతుంది' అనే కాప్షన్‌తో నటాలీ ఈ వీడియో షేర్ చేశారు. నోరూరించే కేకుల వీడియోపై నెటిజన్ల కామెంట్ల వర్షం కురుస్తోంది. I literally make cakes like this for a living so this really speaks to me 😂😂 pic.twitter.com/507k4uXcEr — Natalie Sideserf (@NatalieSideserf) July 10, 2020 -
అచ్చంగా వాటిలాగానే కేకులు!
-
కేక్ తయారీ విధానం
స్వీట్ కార్న్ కేక్ కావలసినవి: స్వీట్ కార్న్ – 3 కప్పులు బటర్ – అర కప్పు, అరటిపండు గుజ్జు – 3 టేబుల్ స్పూన్లు పంచదార – ఒక కప్పు మొక్కజొన్న పిండి – అర కప్పు గుడ్లు – 3 (తెల్లసొన మాత్రమే) నీళ్లు – కొద్దిగా వెనీలా ఎక్స్ట్రాక్ట్ – పావు టీ స్పూన్ తయారీ: ముందుగా స్వీట్ కార్న్, పంచదార రెండూ కలిసి మిక్సీ పెట్టుకుని ముద్దలా చేసుకోవాలి. అందులో కరిగించిన బటర్, గుడ్ల తెల్లసొన, వెనీలా ఎక్స్ట్రాక్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అరటిపండు గుజ్జు, మొక్కజొన్న పిండి వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. తర్వాత ఒక ట్రేలో ఆ మిశ్రమాన్ని మొత్తం వేసుకుని, సమాంతరంగా చేసుకోవాలి. ఇప్పుడు మరో పెద్ద ట్రేలో ఆ ట్రేను పెట్టుకుని.. అడుగున నీళ్లు నింపుకుని.. రెండూ కలిపి, ఓవెన్లో పెట్టి ఉడికించుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత ఐస్‌క్రీమ్ స్కూపర్‌తో తీసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీ బ్రెడ్ బోండా కావలసినవి: బ్రెడ్ స్లైస్ – 12 నీళ్లు – 1 కప్పు బంగాళదుంపలు – 2 (మెత్తగా ఉడికించి ముద్ద చేసుకోవాలి) పచ్చిమిర్చి పేస్ట్ – 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ – అర టీ స్పూన్ పసుపు – కొద్దిగా ఆలివ్ నూనె, నిమ్మరసం – 1 టీ స్పూన్ చొప్పున కొత్తిమీర గుజ్జు –1 టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో.. బంగాళదుంప గుజ్జు, పచ్చిమిర్చి పేస్ట్, అల్లం పేస్ట్, పసుపు, నిమ్మరసం, కొత్తిమీర గుజ్జు, ఆలివ్ నూనె, ఉప్పు వేసుకుని, కొద్దికొద్దిగా నీళ్లు కలుపుకుంటూ.. ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ స్లైస్‌లను నాలుగువైపులా (బ్రౌన్ కలర్ భాగం) తొలగించి.. ఒక్కో బ్రెడ్ స్లైస్‌ని నీళ్లలో బాగా తడిపి.. బంగాళదుంప మిశ్రమాన్ని చిన్న బాల్ పరిమాణంలో తీసుకుని, అందులో పెట్టుకోవాలి. తర్వాత ఆ స్లైస్‌ని నాలుగు వైపుల నుంచి కలుపుతూ.. గుండ్రంగా తయారు చేసుకోవాలి. అవసరమైతే కొద్దికొద్దిగా నీళ్లతో తడి చేసుకుంటూ బంగాళదుంప మిశ్రమం కనిపించకుండా క్లోజ్ చెయ్యాలి. ఇప్పుడు వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకుని వేడి వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోవాలి. డేట్స్ శాండ్విచ్ కావలసినవి: ఖర్జూరం – అర కప్పు (గింజలు తొలగించి, మిక్సీ పట్టుకోవాలి) బ్రెడ్ స్లైస్ – 6 (త్రిభుజాకారంలో ఒక్కో స్లైస్‌ని రెండు ముక్కలు చొప్పున కట్ చేసుకోవాలి) వాల్నట్స్ 2 టేబుల్ స్పూన్(మిక్సీ పట్టుకోవాలి) బాదం – 3 టేబుల్ స్పూన్ (నానబెట్టి, పేస్ట్‌లా మిక్సీ పట్టుకోవాలి) బ్రెడ్ పౌడర్ – పావు కప్పు మొక్కజొన్న పిండి – పావు కప్పు బటర్ – పావు కప్పు (కరింగించి) గడ్డ పెరుగు – 2 కప్పులు(ఒక మంచి క్లాత్‌లో మొత్తం పెరుగు వేసుకుని, రెండుమూడు సార్లు గట్టిగా పిండి, 3 గంటల పాటు ఓ పక్కగా వేలాడదీయాలి. 3 గంటల తర్వాత నీటిశాతం తగ్గి, క్రీమ్‌లా తయారవుతుంది) జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ – అభిరుచిని బట్టి.. ఖర్జూరం ముక్కలు – 4 లేదా 5 టేబుల్ స్పూన్లు (అదనంగా తీసుకోవాలి) తయారీ: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బ్రెడ్ పౌడర్, మొక్కజొన్న పిండి, బటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఖర్జూరం గుజ్జు, బాదం పేస్ట్, వాల్నట్ పేస్ట్, క్రీమ్‌లా సిద్ధం చేసుకున్న పెరుగు ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ ముద్దలో ఖర్జూరం ముక్కలు, జీడిపప్పు ముక్కలు, కిస్మిస్ ఇలా నచ్చిన డ్రైఫ్రూట్స్ వేసుకుని అటు ఇటు ఒకసారి కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత రెండేసి త్రిభుజాకారపు బ్రెడ్ స్లైస్‌లను తీసుకుని కొద్దికొద్దిగా ఖర్జూరం మిశ్రమాన్ని పెట్టుకుని.. రెండువైపులా గ్రిల్ చేసుకుంటే అదిరే రుచి మీ సొంతవుతుంది. -
కల్తీ కేకులు.. 8 బేకరీలకు నోటీసులు
అనంతపురం న్యూసిటీ: నగరంలోని అరవిందనగర్‌లో ఓ బేకరీ నిర్వాహకుడు కల్తీ కేకులు విక్రయిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో తేలింది. మంగళవారం ఫుడ్ సేఫ్టీ, తూనికలు, కొలతల శాఖ అధికారులు నగరంలోని వివిధ బేకరీలపై ఆకస్మిక దాడులు చేశారు. అరవిందనగర్ మసీదు వెనుక ఓ షెడ్డులో ప్రసాద్ అనే వ్యాపారి కల్తీ కేకులు తయారు చేసి విక్రయిస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్‌రెడ్డి, తూనికలు, కొలతల శాఖ సీఐ మహ్మద్‌గౌస్‌కు సమాచారం వచ్చింది. కేకులకు వాడే మైదా పురుగులు పట్టి ఉండడంతో అధికారులు ఆశ్చర్యానికి గురయ్యారు. కేకుల్లో కలర్లు అధికంగా కలపడంతో పాటు చాక్లెట్ ఫ్లేవర్ కోసం వాడే పౌడర్‌కు తయారీ తేదీ లేదు. ఇప్పటికే వేలాది కేకులు బేకరీలకు సరఫరా అయ్యాయి. 8 బేకరీలకు నోటీసులు అనంతరం అధికారులు నగరంలోని ఎనిమిది బేకరీలు, హోటళ్లపై దాడులు నిర్వహించారు. క్లాక్‌టవర్, సప్తగిరి తదితర ప్రాంతాల్లో ఉన్న బేకరీలకు నోటీసులు జారీ చేశారు. స్వగృహ స్వీట్స్, న్యూ బెంగళూరు బేకరీ నిర్వాహకులకు పలు సూచనలు, సలహాలనందజేశారు. కార్యక్రమంలో గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కరీముల్లా, వినియోగదారుల సంఘం నాయకులు రవీంద్రరెడ్డి పాల్గొన్నారు. -
న్యూఇయర్ కేక్ క్రేజ్
-
అదిరిపోయే ఆఫర్లు.. ఇంకెందుకు ఆలస్యం
కొత్త సంవత్సరం ఎన్నో ఆశలను, ఆశయాలను తీసుకువస్తుంది. ప్రతి ఏడాది మనకు అనేక జ్ఞాపకాలను, అనుభూతులను అందిస్తుంది. వీటికితోడు కొన్ని చేదు అనుభవాలను సైతం ఇస్తుంది. గడిచిన ప్రతి క్షణం రేపటికి ఒక జ్ఞాపకమే. మంచి చెడుల సమ్మేళనమే జీవితం. అలాంటి జీవితంలో మరో నూతన అధ్యాయాన్ని స్వాగతిస్తూ.. న్యూ ఇయర్‌కు వెల్కమ్ చెబుతాం.. న్యూ ఇయర్ ఇంకో నెల రోజులు ఉంది అనగానే వేడుకలు, సంబరాల గురించి మదిలో ఆలోచనలు మెదులుతాయి. గత ఏడాది కంటే భిన్నంగా ఈసారి డిసెంబర్ 31 వేడుకల నిర్వహణకు హైదరాబాదీయులు తహతహలాడుతున్నారు. మొదట్లో ఈ కల్చర్‌కు ఇంత క్రేజు లేకున్నా రానూ రానూ పరాయి వేడుకపై మోజు బంగారం ధరలా పెరుగుతూనే ఉంది. ఇక ఈ నూతన సంవత్సర సంబరాలలో ప్రజలను ఆకర్షించే వాటిలో ఆఫర్లు ప్రధానమైనవి. కేకుల నుంచి ఫేస్ క్రీమ్ వరకు అన్ని ఆఫర్లే (క్లాతింగ్, ఫుట్‌వేర్, జ్యూవెల్లరీ, ఫుడ్, కాస్మోటిక్స్).. వీటిలో మరీ ముఖ్యమైనది ఫుడ్. కోటి విద్యలు కూటి కొరకే అన్నారు పెద్దలు. ఫుడ్‌ను ఇష్టపడని వారంటూ ఉండరు. అసలే హైదరాబాదీలు భోజన ప్రియులు. ఇక ఆఫర్లు కనిపిస్తే ఊరుకుంటారా... లేదండోయ్ ఆవురావురంటూ లాంగిచేయడమే. చాలా సందర్బాల్లో ఫుడ్ ఫెస్టివల్స్‌ను సైతం నిర్వహిస్తుండటం తెలిసిందే. మరీ ఫుడ్‌కు ఉన్న డిమాండేంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ఆఫర్లే ఆఫర్లు... నగరంలో ఇంచుమించుగా 12వేల వరకు చిన్న, పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు ఉండగా. మరో 10వేల దాకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మెస్‌లు హోటల్ ఉన్నాయి. హోటళ్లు, రిసార్ట్లు ప్రజలను ఆకర్షించేందుకు వినూత్నడిస్కౌంట్లు, స్పెషల్ ఆఫర్లతో తలుపులు తెరుస్తున్నాయి. నోరూరించే ఆహారాన్ని అందించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. రెస్టార్లెంటు, హోటళ్లు, దాబాలు, చిన్న చిన్న హోటళ్లు సైతం తమదైన రీతిలో ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఒకటి కొంటే మరొకటి ఉచితమని,, ఒక్కొదానిపై 30, 40, 50 శాతం వరకు డిస్కౌంట్‌ను ప్రకటిస్తున్నాయి. కొన్ని రెస్టారెంట్లయితే బఫేపై వన్ ప్లస్ వన్ ఆఫర్ కూడా ఇస్తున్నాయి. కొన్నిచోట్ల అన్లిమిటెడ్ ఫుడ్, బేవరేజ్‌ను ఆఫర్ చేస్తున్నారు. పేరుగాంచిన హోటళ్లు పాశ్చాత్య వంటకాలు, కాక్టైల్స్, మాక్‌టైల్స్‌ను రుచి చూపించనున్నాయి. నాన్ వెజ్ ఆఫర్లు.. ఆదివారం వచ్చిందంటే ముక్క లేనిది ముద్ద దిగదు. అలాంటిది వేడుకల్లో నాన్ వెజ్ లేకుంటే.. నో నో తప్పకుండా ఉండాల్సిందే అంటున్నారు హైదరాబాదీలు. మరీ నాన్ వెజ్ లవర్స్ వారి కోసం ప్రముఖ రెస్టారెంట్లు ఇస్తున్న ఆఫర్లు ఏంటో తెలుసుకుందాం. హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టపడని వారంటూ ఉండరు... ప్రతి ఒక్కరూ ఏదో ఒక సందర్బంలో బిర్యాని లాంగించేస్తూ ఉంటారు. వీటిలో చికెన్, మటన్, మష్రూమ్,ఫిష్ బిర్యానీలు ప్రత్యేకం. ఈ సారి ఈ బిర్యానిపైలపై ఆఫర్లు ఆశించిన స్థాయిలో లేనట్లు కన్పిస్తోంది. సాధారణ రోజుల్లో బిర్యాని ధర రెస్టారెంట్లను బట్టి 150 నుంచి 300 వరకు ఉండగా... న్యూ ఇయర్ సందర్భంగా ఈ ధరను 100 నుంచి 250 లోపు తగ్గించారు. అదేవిధంగా కొన్ని రకాల ఐటమ్‌లపై 10 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి. ఇక స్టాటర్లు, సూప్‌లు ధరలు అదేవిధంగా కొనసాగుతున్నాయి. ఆన్లైన్ ఫుడ్ సర్వీసింగ్.... ఆన్లైన్ ఫుడ్ సర్వీస్‌లు వచ్చాక నగరంలో తిండికి కొదవే లేకుండా పోయింది. యాంత్రిక టెక్నాలజీ వచ్చాక బిజీ సిటీ లైఫ్‌లో అటు ఉద్యోగం ఇటు జీవితాన్నిసమన్వయం చేయలేక నానా తాంటాలు పడుతున్న కుటుంబాలు ఎన్నో. అలాంటి వారికి ఆన్లైన్ ఫుడ్ డెలీవరీ యాప్‌లు ఎంతగానో దోహదపడుతున్నాయి. కేవలం తినాలనుకున్న సమయానికి అరగంట ముందు కావాల్సిన ఫుడ్‌ను ఆర్డర్ చేసుకుంటే సరి. దీనికి కావాల్సింది. కేవలం సంబంధిత యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవడమే. హోటల్ కు వెళ్లి తినేవారు తగ్గడంతో ఆన్లైన్ ఫుడ్ సర్వీస్‌లను డిమాండ్ పెరిగింది. ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించడంతో ఫుడ్డీస్ రెస్టారెంట్లకు క్యూ కడుతున్నారు. వెజ్, నాన్‌వెజ్, ఫాస్ట్‌ఫుడ్ ఐటమ్ ఏదైనా సరే మనీ ఉంటే చాలు. మీ దరికి విచ్చేస్తుంది. అంతేగాక 10 శాతం నుంచి 50 శాతం వరకు డిస్కౌంటు లభిస్తుంది. పైగా డెలివరీ కూడా ఫ్రీ... అర్థరాత్రి అపరాత్రి అన్న తేడా కూడా లేదు. ఎప్పుడంటే అప్పుడు.. ఎక్కడంటే అక్కడ మీరు కోరుకున్న ఆహారం.. మీ చెంతకు చేరుతుంది. దీంతో ఫుడ్ ఆర్డరింగ్ అనేది చాలామంది జీవితాలలో ఓ ఫ్యాషన్‌లో మారిపోయింది. ఫేమస్ ఫుడ్ యాప్‌లు ఆన్లైన్ ఫుడ్ యాప్‌లో స్విగ్గీ, జొమాటో, ఉబర్ ఈట్స్, ఫుడ్ పాండా వంటివే అధికం. సిటీలో నిత్యం అమ్ముడయ్యే ఫుడ్‌లో 60శాతం మేర ఆన్ లైన్ డెలివరీలే ఉంటాయి. ఒక్క స్విగ్గీ ఫుడ్ డెలివరీ సంస్థనే నగరంలో రోజూ 80వేల ఆర్డర్ల వరకు యాప్ ద్వారా విక్రయిస్తోంది. ఇలా మిగతా ఫుడ్ డెలివరీ సంస్థలు అన్ని కలిసి దాదాపు ప్రతి నెల 10లక్షలకు పైనే ఆర్డర్లను చేరవేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వినియోగదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండానే తమ వద్దకు ఫుడ్ వస్తుండటంతో ఈ యాప్‌లకు క్రేజ్ పెరిగిపోయింది. దీంతో ప్రత్యేక ప్యాకేజీల రూపంలో తమ వినియోగదారులను ఆకర్షిస్తున్నాయి. భోజన ప్రియులను కట్టిపడేస్తున్నాయి. ఇంకేముంది ఆర్డర్ చేసిన అరగంటలో నోరూరించే వంటకాలు మన ముంగిట ప్రత్యక్షమవుతున్నాయి. ప్రమోషన్ ఆఫర్లు, డిస్కౌంట్ల వర్షాలు.. కొద్ది తేడాతో దాదాపు అన్ని సంస్థలు ఒకే విధమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ముఖ్యంగా బిర్యానీలు, పిజ్జాలు, మిల్క షేక్‌లు,ఫ్యామిలీ ప్యాక్ వంటివి అధికంగా ఉన్నాయి. ఈ న్యూ ఈయర్‌కు మరీ ఏ సంస్థ ఏ ఆర్డర్‌ను అందిస్తోందో ఓ లుక్కేద్ధాం... జొమాటో...న్యూ యూజర్లకు 40 శాతం డిస్కౌంట్‌ను అందిస్తుంది. అంతేగాక ప్రోమో కోడ్లు అందిస్తుంది. అలాగే పేటీఎం యూపీఐ ద్వారా రూ. 350 మించి కొనుగోలు చేస్తే 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందుకు ZOMATO300 కోడ్‌ను ఆప్లై చేయాలది. అదే విధంగా స్నాక్స్‌పై 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. టాప్ రెస్టారెంట్లలో రూ. 99 కంటే కొనుగోలు చేస్తే 50 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఇందుకు ZOMATO కోడ్‌ను అప్లై చేయాలి. కోటక్ మహీంద్ర కార్డు ద్వారా రూ. 250 కంటే ఎక్కు కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్‌ను అధికంగా రూ75 వరకు అందిస్తోంది. ప్రత్యేక పార్టీ ఆఫర్ పేరుతో రూ .500 విలువైన ఆహార ఆర్డర్లలో రూ .1000 వరకు ఆదా ఇస్తుంది. ఇది కేవలం ఎంచుకున్న రెస్టారెంట్లలో మాత్రమే. స్విగ్గీ.. కొత్త యూజర్లకు 33 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. దీంతోపాటు ఫ్రీ డెలివరీ లభిస్తుంది. ఫుడ్ డెలివరీ యాప్స్ అన్నీ కొత్త యూజర్లను ఆకట్టుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యమిస్తాయి. ఆఫర్లు కూడా వారికే ఎక్కువ ఉంటాయి. సంబంధిత రెస్టారెంట్ల ద్వారా WELCOME50... ద్వారా 50 శాతం డిస్కౌంట్‌ను ఇస్తుంది. 150LPAYNEW ద్వారా 150 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. రెండు మీడియం పిజ్జాలను ఒక పిజ్జా ధరకే పిజ్జా హట్ ద్వారా ఇస్తోంది. ఉబర్ ఈట్స్.. ఉబర్ రైడ్లతోపాటు ఉబర్ ఈట్స్ ఆహార డెలివరీ యాప్ ప్రముఖంగా నిలుస్తోంది అన్ని రకాల పదార్థాలపై 30 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. సెలక్టెడ్ రెస్టారెంట్ల నుంచి 50 శాతం బిర్యానిపై డిస్కౌంట్‌ను అందిస్తోంది. సంబంధిత రెస్టారెంట్లపై30,40, 50 శాతం వరకు కూడా తగ్గింపును అందిస్తోంది. వీటికి ఎలాంటి ప్రోమో కోడ్ అవసరం లేదు. నేచురల్ ఐస్ క్రీం నుంచి కప్ ఐస్ క్రీమ్నుఒకటి కొంటే ఒకటి ఉచితంగా అందిస్తోంది. మిల్క్ షేక్‌లను కేవలం 99 రూపాయలకే అందిస్తోంది. HYDFEAST50, HYDFEAST30, HYDFEAST20 ద్వారా 50,30, 20 శాతం డస్కౌంట్ను ఇస్తుంది బేకరీల్లో బారులు.. న్యూయర్ దగ్గర పడుతుండటంతో బేకరీలలో కేకుల తయారీలు జోరందుకున్నాయి. కేకుల్లో వెజ్, నాన్ వెజ్, పేస్ట్రీస్ వంటివి.. విభిన్న రకాల ఆకృతిలో అందుబాటులో ఉన్నాయి.. ఒక్కో బేకరీలలో దాదాపు 500 నుంచి 1000 కేకుల వరకు తయారీ చేస్తున్నారు. నూతన సంవత్సర సందర్భంగా కేక్‌లు కొనుగోలు చేసేందుకు బేకరీ నిర్వాహకులు వినియోగదారులను ఆకట్టుకునేందుకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నారు. బేకరీలలో అయితే. కేజీ కేకు 400 రూపాయలు, అర కేజీ కేకు 200 రూపాయలకే అందిస్తున్నాయి. అంతేగాక వీటికి 500 ఎంఎల్ కూల్‌డ్రింక్, మిక్చర్ వంటివి ఉచితంగా అందజేస్తున్నాయి. వీటితోపాటు పిజ్జా, బర్గర్ సెంటర్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, బేకరీలు ఆఫర్లను జోరుగా అందిస్తున్నాయి. మరి ఇంకేందుకు ఆలస్యం.. వెంటనే న్యూ ఇయర్ ఆఫర్లను ఆరగించండి.. - గుండా భావన (వెబ్ డెస్క్ ప్రత్యేకం) -
నోట్లో ‘కుకీసు’కుందాం
న్యూ ఇయర్ వస్తోందంటే ఇళ్లన్నీ కేకులు, కుకీస్, బిస్కెట్లతో నిండిపోతాయి. ఒకరికి ఒకరు బహుమతిగా ఇవ్వడానికి బేకరీలకు ఆర్డర్ చేస్తుంటారు. మరి మనకు కావలసినవారికోసం స్వయంగా మనమే తయారు చేస్తే! న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మీ స్నేహితుల ఇంటికి వెళ్లి, ఈ కుకీస్‌తో వారి నోటిని తీపి చేసి, ‘హ్యాపీ న్యూ ఇయర్’ చెప్పండి. క్రంచీ పీనట్ బటర్ కుకీస్ కావలసినవి: బ్రౌన్ సుగర్ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; పీనట్ బటర్ – ఒక కప్పు; (కప్పుడు పల్లీలకు ముప్పా వు కప్పు బటర్ జత చేసి, మిక్సీలో వేసి మెత్తగా చేస్తే హోమ్ మేడ్ పీనట్ బటర్ సిద్ధమైనట్లే) కోడి గుడ్లు – 2 (పెద్దవి); వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను; ఉప్పు – పావు టీ స్పూను; బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; వేడి నీళ్లు – 2 టేబుల్ స్పూన్లు; మైదా పిండి – 2 కప్పులు; బటర్/నెయ్యి – కొద్దిగా తయారీ: ►ముందుగా అవెన్‌ను 375 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో బ్రౌన్ సుగర్, పంచదార, పీనట్ బటర్, కోడి గుడ్లు వేసి బాగా గిలకొట్టాలి (ఎలక్ట్రిక్ మిక్సర్ ఉంటే, అందులో వేసి బాగా మెత్తగా అయ్యేవరకు బ్లెండ్ చేయాలి) ►వెనిలా ఎక్స్ట్రాక్ట్, ఉప్పు, బేకింగ్ సోడా, వేడి నీళ్లు జత చేసి మరోమారు గిలకొట్టాలి ►మైదా పిండి జత చేసి అన్నీ కలిసేవర కు మరోమారు గిలకొట్టాలి ►కుకీస్ షీట్ లేదా అల్యూమినియం ఫాయిల్ తీసుకుని, దాని మీద బటర్ పూయాలి ►కుకీస్ మిశ్రమాన్ని ఒక పాత్రలోకి తీసుకుని ఫ్రిజ్‌లో సుమారు అర గంటసేపు ఫ్రీజ్ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న బాల్స్‌లా చేతితో తయారుచేసి కుకీస్ షీట్ మీద ఉంచి, ప్రీ హీట్ చేసిన అవెన్‌లో ఉంచాలి ►సుమారు పావు గంట తరవాత బయటకు తీసి, చల్లారాక వాటిని గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. క్రిస్పీ చాకొలేట్ చిప్ కుకీస్ కావలసినవి: మైదా పిండి – రెండు కప్పులు (నిండుగా); బేకింగ్ సోడా – అర టీ స్పూను; బటర్ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు; ప్యాక్డ్ బ్రౌన్ సుగర్ – ఒక కప్పు; ఉప్పు – ఒక టీ స్పూను; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు; కోడి గుడ్డు – 1 (పెద్దది); మిల్క్ చాకొలేట్ చిప్స్ – ఒక కప్పు; డార్క్ చాకొలేట్ – అర కప్పు (సన్నగా ముక్కలు చేయాలి) తయారీ ►అవెన్‌ను 375 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ►చిన్న పాత్రలో మైదా పిండి, ఉప్పు, బేకింగ్ సోడా వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ►వేరొక పాత్రలో బ్రౌన్ సుగర్, పంచదార, బటర్ వేసి బ్లెండర్తో బాగా గిలకొట్టాలి ►పావుకప్పు నీళ్లు, వెనిలా, కోడిగుడ్డు జత చేసి మరి కాసేపు గిలకొట్టాలి ►మైదా పిండి మిశ్రమం జత చేసి బాగా గిలకొట్టాలి ►చాకొలేట్ చిప్స్ జత చేసి, సుమారు అరగంటసేపు ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో ఉంచి ఫ్రీజ్ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న ఉండలుగా చేయాలి ►కుకీస్ షీట్ లేదా అల్యూమినియం ఫాయిల్ మీద బటర్ పూసి, ఆ పైన కుకీస్‌ను ఉంచి, ఆ షీట్‌ను అవెన్‌లో ఉంచి సుమారు పావు గంట సేపు బేక్ చేసి బయటకు తీయాలి ►బాగా చల్లారాక వీటిని గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. జింజర్ బ్రెడ్ కుకీస్ కావలసినవి: బటర్ – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; బ్రౌన్ సుగర్ (బ్రౌన్ సుగర్ బదులు పంచదార కూడా వాడచ్చు) – ముప్పావు కప్పు; మొలాసెస్ లేదా బెల్లం పాకం – అర కప్పు కంటె కొద్దిగా ఎక్కువ కోడి గుడ్డు – 1; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను; మైదా పిండి – మూడున్నర కప్పులు బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; అల్లం పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – ఒక టేబుల్ స్పూను; గరం మసాలా – అర టీ స్పూను; లవంగాల పొడి – అర టీ స్పూను తయారీ ►అవెన్‌ను 350 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి ►ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, అల్లం పేస్ట్, దాల్చిన చెక్క పొడి, లవంగాల పొడి వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ►వేరొక పాత్రలో బటర్, బ్రౌన్ సుగర్, పంచదార వేసి బాగా గిలకొట్టాలి ►బెల్లం పాకం లేదా మొలాసెస్ జత చేసి మరోమారు గిలకొట్టాలి ►కోడిగుడ్డు, వెనిలా జత చేసి బాగా కలియబెట్టాలి ►మైదా పిండి మిశ్రమం జత చేసి పదార్థాలన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు బీటర్‌తో బాగా గిలకొట్టాక ఈ మిశ్రమాన్ని ఒక రాత్రి అంతా ఫ్రిజ్‌లో ఉంచి ఫ్రీజ్ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న బాల్స్ చేయాలి ►బటర్ పూసిన అల్యూమినియం ఫాయిల్ లేదా కుకీస్ షీట్ మీద ఈ బాల్స్ ఉంచి, షీట్‌ను అవెన్‌లో పది నిమిషాల పాటు బేక్ చేసి బయటకు తీసి, చల్లారాక గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. సుగర్ కుకీస్ కావలసినవి: మైదా పిండి – మూడు కప్పులకు కొద్దిగా తక్కువ బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; బటర్ – ఒక కప్పు; పంచదార – ఒక కప్పు + 2 టేబుల్ స్పూన్లు; బ్రౌన్ సుగర్ – 2 టేబుల్ స్పూన్లు; కోడి గుడ్డు – 1; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు; పంచదార – పావు కప్పు తయారీ ►ముందుగా అవెన్‌ను 350 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి ►ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ►వేరొక పాత్రలో బటర్, బ్రౌన్ సుగర్, పంచదార వేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి ►కోడిగుడ్డు, వెనిలా జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ►మైదా పిండి మిశ్రమం జత చేసి పదార్థాలన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు బీటర్‌తో బాగా గిలకొట్టి, ఈ మిశ్రమాన్ని అరగంట సేపు ఫ్రిజ్‌లో ఫ్రీజ్ చేసి, బయటకు తీసి, చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి ►వీటి మీద మనకు నచ్చిన చిప్స్‌ను చల్లుకోవాలి ►అల్యూమినియం ఫాయిల్ లేదా కుకీస్ షీట్‌కు బటర్ పూసి, ఆ పైన ఈ కుకీస్‌ను ఉంచి, అవెన్‌లో ఉంచి సుమారు పది నిమిషాల పాటు బేక్ చేసి బయటకు తీసేయాలి ►చల్లారిన తరవాత గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. వైట్ చాకొలేట్ బ్లూ బెర్రీ ఓట్మీల్ కుకీస్ కావలసినవి: బటర్ – అర కప్పు; పంచదార – అర కప్పు; బ్రౌన్ సుగర్ – అర కప్పు; కోడి గుడ్డు – 1 (పెద్దది); వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు; మైదా పిండి – ఒక కప్పు + 2 టేబుల్ స్పూన్లు; కార్న్ స్టార్చ్ – 2 టీ స్పూన్లు; ఉప్పు – అర టీ స్పూను; బేకింగ్ సోడా – అర టీ స్పూను; బేకింగ్ పౌడర్ – పావు టీ స్పూను; ఓట్స్ – ఒక కప్పు; వైట్ చాకొలేట్ చిప్స్ – అర కప్పు; తాజా బ్లూబెర్రీలు – ఒక కప్పు తయారీ ►ముందుగా అవెన్‌ను 350 ఫారెన్ హీట్ డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసుకోవాలి ►ఒక పాత్రలో మైదాపిండి, కార్న్ స్టార్చ్, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన ఉంచాలి ►వేరొక పాత్రలో బటర్, బ్రౌన్ సుగర్, పంచదార వేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి ►కోడిగుడ్డు జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ►మైదా పిండి మిశ్రమం జత చేసి పదార్థాలన్నీ బాగా కలిసి మెత్తగా అయ్యేవరకు బీటర్‌తో గిలకొట్టాక, ఓట్స్, వైట్ చాకొలేట్ చిప్స్ జత చేసి, గరిటెతో జాగ్రత్తగా కలియబెట్టాలి ►చివరగా తాజా బ్లూబెర్రీలు జత చేయాలి ►చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి ►అల్యూమినియం ఫాయిల్ లేదా కుకీస్ షీట్‌కు బటర్ పూసి, ఆ పైన ఈ కుకీస్‌ను ఉంచి, అవెన్‌లో ఉంచి సుమారు పది నిమిషాల పాటు బేక్ చేసి బయటకు తీసేయాలి ►చల్లారిన తరవాత గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. -
కేకో... కేక!
-
స్వీట్ క్రిస్మస్
దట్టంగా మంచుకురిసే రాత్రి జీసస్ పుట్టాడు. ఎంత తీపి కబురు. అందరి నోరూ తీపి చేయాల్సిన కబురు. ఏం చేద్దాం. కేక్ చేద్దాం. ఏం కేక్. ప్లమ్ కేక్, రమ్ కేక్, చాక్లెట్ కేక్, మార్బుల్ కేక్... కేక్‌ల పండుగుల ఇది. ఒకరికి కేక్ పంచి సంతోషించే పండుగ. ఎప్పుడూ కొనడమేనా. ఈసారి చేయొచ్చుగా? ట్రిపుల్ లేయర్ చాకొలేట్ కేక్ ఈ కేకును తయారుచేయడం కొంచెం కష్టమే. కాని ఇది పూర్తయ్యాక చూసుకుంటే అలసట అంతా మరచిపోవచ్చు. ఇక తిన్నాక, నోటి నుంచి మాటలు రావు. అంత ఆనందంగా ఆస్వాదిస్తూ తింటారు ఈ కేక్‌ని. కావలసినవి: మొదటి లేయర్ కోసం: మైదా పిండి – ఒకటిన్నర కప్పులు; బేకింగ్ పౌడర్ – ముప్పావు టీ స్పూను; బేకింగ్ సోడా – అర టీ స్పూను, ఉప్పు – పావు టీ స్పూను; బటర్ – అర టీ స్పూను; పంచదార – ముప్పావు కప్పు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – అర టేబుల్ స్పూను; కోడి గుడ్లు – 2; బటర్ మిల్క్ – ముప్పావు కప్పు. బటర్ క్రీమ్ కోసం: పంచదార – ఒక కప్పు; కోడిగుడ్డు తెల్ల సొనలు – 4; నిమ్మరసం – అర టీ స్పూను; ఉప్పు – చిటికెడు; బటర్ – ఒక కప్పు. కుకీ డఫ్ లేయర్ కోసం: మొలాసెల్ – 2 టీ స్పూన్లు; చాకొలేట్ చిప్స్ – పావు కప్పు. ఓరియో లేయర్ కోసం: ఓరియో బిస్కెట్స్ (బ్రౌన్ కలర్) – 3 బ్రౌనీ లేయర్ కోసం: డచ్ ప్రోసెస్డ్ కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు గార్నిషింగ్ కోసం: బ్రౌనీ కుకీస్, ఓరియోలు (టాపింగ్ కోసం) – 2 టేబుల్ స్పూన్లు; గనాచే (కుకింగ్ చాకొలేట్ + పాలు కలిపి తయారుచేసినది) – 2 కప్పులు. తయారీ: ►350 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి ►తొమ్మిది అంగుళాల కేక్ పాన్‌ను బటర్, మైదాలతో గ్రీజ్ చేయాలి ►ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి ►మరొక పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా గిలకొట్టి క్రీమ్ తయారుచేసుకోవాలి ►కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎక్స్ట్రాక్ట్ జత చేసి మరోమారు బీటర్‌తో బాగా గిలకొట్టాలి ►మైదా పిండిలో సగ భాగాన్ని జత చేయాలి ►సగం బటర్ మిల్క్ జత చేసి గిలకొట్టాక, మిగిలిన మైదా పిండి, బటర్ మిల్క్ జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ►ఈ మిశ్రమాన్ని మూడు సమాన భాగాలుగా విడదీసి, ఒక్కో లేయర్‌కు తీసుకున్న పదార్థాలను ఒక్కో దానికి విడివిడిగా జత చేయాలి ►కేక్‌పాన్‌లో ఒక లేయర్ తరవాత మరొక లేయర్కి కలుపుకున్న మిశ్రమాలను జాగ్రత్తగా వేసి, అవెన్‌లో ఉంచి సుమారు 35 నిమిషాలు బేక్ చేయాలి. బటర్ క్రీమ్ కోసం: ఒక సాస్పాన్లో కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి ∙వేరొక పాత్రలో పంచదార, కోడిగుడ్డు తెల్ల సొన నిమ్మ రసం, ఉప్పు వేసి ఆ పాత్రను మరుగుతున్న నీళ్ల గిన్నెలో ఉంచాలి ∙పదార్థాలన్నీ వేడెక్కి, పంచదార కరిగేవరకు కలిపి దింపేసి, ఈ మిశ్రమాన్ని బటర్లో వేసి కొద్దిసేపు కలియబెట్టాలి (ఇలా చేయడం వల్ల మృదువుగా అయ్యి, కేక్ మీద సమానంగా వేయటానికి సులువుగా ఉంటుంది) ∙బేక్ చేసుకున్న కేక్ బేస్‌ను బయటకు తీసి, మొదటి లేయర్‌ను ఒక ప్లేట్లో ఉంచాలి ∙బటర్ క్రీమ్‌ను అర అంగుళం మందంలో మొదటి లేయర్ మీద సమానంగా పోయాలి ∙రెండవ లేయర్‌ను ఉంచి దాని మీద కూడా ఇదే విధంగా చేసి, మూడో లేయర్‌ను ఉంచాలి ∙గనాచేతో అలంకరించాలి ∙టాపింగ్స్ కోసం తీసుకున్న వాటిని కూడా జత చేయాలి. మార్బుల్ కేక్ ఈ కేక్‌కి తయారుచేసే బేస్‌ని చాకొలేట్ మార్బుల్ అంటారు. ఎవరి ఆలోచనకు వారు పదును పెట్టుకుని, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లేదా తాజా పండ్లు... బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు ఏవైనా సరే... బ్యాటర్‌కి జత చేస్తే – కేక్ కలర్ఫుల్గా వస్తుంది. కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – 2 టీ స్పూన్లు; పంచదార పొడి – ఒక కప్పు కంటె ఎక్కువ; ఉప్పు – చిటికెడు; బటర్ – అర కప్పు (సాల్టెడ్ బటర్ వాడుతుంటే ఉప్పును ఉపయోగించక్కర్లేదు); కోడి గుడ్లు – 2; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను; ఫుడ్ కలర్ – చిటికెడు; పాలు – ఒక కప్పు; కోకో పొడి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ►కేక్ పాన్‌ను బటర్ తో గ్రీజ్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార పొడి, బటర్, కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎసెన్స్, పాలు వేసి బాగా గిలకొట్టాలి (అన్నీ కలిసి బాగా మెత్తగా అయ్యేవరకు గిలకొడితే కేక్ స్మూత్‌గా వస్తుంది) ►సగం కంటె ఎక్కువ భాగాన్ని కేక్ పాన్‌లో పోయాలి ►ఆ పైన వెనిలా ఎక్స్ట్రాక్ట్ను, ఫుడ్ కలర్ మిశ్రమం, కోకో పొడి ఒక దాని మీద ఒకటి పోయాలి ►చాకుతో కాని ఒక పుల్లతో కాని ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా సరిచేయాలి (మార్బుల్ ఎఫెక్ట్ వచ్చేలాగ) ►అవెన్‌లో ఉంచి సుమారు 40 నిమిషాలు బేక్ చేయాలి ►బయటకు తీసి చల్లారాక సర్వ్ చేయాలి. యూలే ద లాగ్ చాలామందికి ప్లమ్ కేక్, రమ్ కేక్ తెలుసు. మీరెప్పుడైనా యూలే ద లాగ్ కేక్ తయారుచేసుకున్నారా! ఇది చూడటానికి చెక్క దూలంలాగ ఉంటుంది. అందువల్ల ఈ కేక్‌ను చూడగానే సంతోషంతో పాటు సెలవును ఆస్వాదిస్తున్న భావన కూడా కలుగుతుంది. కావలసినవి: కేక్ కోసం: కోడి గుడ్లు – 6; పంచదార – ముప్పావు కప్పు; కోకో పొడి – అర కప్పు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను ఐసింగ్ కోసం: డార్క్ చాకొలేట్ తురుము – ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; పంచదార – ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; సాఫ్ట్ బటర్ – ఒక కప్పు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టేబుల్ స్పూను. అలంకరించడం కోసం: 2 టేబుల్ స్పూన్ల పంచదార, పార్లే జి బిస్కెట్స్, ఎరుపు రంగు ఫుడ్ కలర్ (చెర్రీలు తయారుచేయడానికి); మెరింగ్ మష్రూమ్స్, చాకొలేట్ సాయిల్, క్రిస్మస్ ట్రీ పుల్లలు తయారీ: ►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో కోడి గుడ్డు తెల్ల సొనలను వేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి ►బాగా మెత్తగా అయిన తరవాత పావు కప్పు పంచదార కొద్దికొద్దిగా వేస్తూ మళ్లీ గిలకొడుతుండాలి ►వేరొక పాత్రలో కోడిగుడ్డు పచ్చ సొనలను వేసి పంచదార జత చేస్తూ గిలకొట్టాలి ►వెనిలా ఎక్స్ట్రాక్ట్ జత చేయాలి ∙కోకో పొడిని జల్లెడ పట్టి, మెత్తటి పొడిని కొద్దికొద్దిగా జత చేస్తూ గిలకొట్టాలి ►కోడి గుడ్డు తెల్ల సొన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా జత చేస్తూ, అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి (ఎంత ఎక్కువసేపు గిలకొడితే అంత మెత్తగా వస్తుంది కేక్) ►నలుచదరం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కేక్‌పాన్‌లో బేకింగ్ షీట్ లేదా ఫాయిల్ (కింద కొద్దిగా పంచదార వేస్తే కేక్ అతుక్కోకుండా తేలికగా వస్తుంది) ఉంచి, దాని మీద ఈ మిశ్రమాన్ని సమానంగా పరిచి, అవెన్‌లో ఉంచి, సుమారు 20 నిమిషాల పాటు బేక్ చేయాలి ►చల్లారిన తరవాత, జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఐసింగ్తయారీ: ►చాకొలేట్‌ను ముందుగా కరిగించాలి (మైక్రోవేవ్లోకాని వేడి నీళ్ల మీద కాని) ►ఒక పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా గిలకొట్టాలి ►కరిగించిన చాకొలేట్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ జత చేసి మెత్తగా వచ్చేవరకు కలుపుతుండాలి ►బాగా మెత్తగా అయిన తరవాత కేక్ మీద సమానంగా పరిచి, కేక్‌ను (ఫాయిల్‌తో) నెమ్మదిగా రోల్ చేయాలి (వదులుగా కాకుండా టైట్‌గా వచ్చేలా జాగ్రత్తగా రోల్ చేసి, చివరగా ప్రెస్ చేయాలి) ►అంచులను జాగ్రత్తగా కట్ చేయాలి ►మిగిలిన భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి ►అంతే!!! అందమైన కేక్ సిద్ధమైనట్లే. సాల్టెడ్ క్యారమెల్ షీట్ కేక్ కావలసినవి: మైదా పిండి – రెండు కప్పుల కంటె కొద్దిగా ఎక్కువ; బటర్ – ఒక కప్పు; పంచదార – అర కప్పు; బ్రౌన్ సుగర్ – ఒక కప్పు ; పెద్ద కోడిగుడ్లు – 2; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు; తాజా పెరుగు – అర కప్పు; బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; చిక్కటి పాలు (హోల్ మిల్క్) – ఒక కప్పు. తయారీ: ►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ►12 అంగుళాల చతురస్రాకారంలో ఉన్న కేక్ పాన్లను ముందుగా కొద్దిగా బటర్‌తో గ్రీజ్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా కలిపి, మెత్తగా వచ్చేవరకు గిలకొట్టాలి ►కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎక్స్ట్రాక్ట్, పెరుగు జత చేసి మరోమారు గిలకొట్టాలి ►మరొక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలిపి, సగ భాగాన్ని కోడి గుడ్డు మిశ్రమానికి జత చేయాలి ►అర కప్పు పాలు జత చేసి నెమ్మదిగా గిలకొట్టాలి ►మిగిలిన పిండిని జత చేస్తూ, మిశ్రమం మెత్తగా వచ్చేలా బాగా బీట్ చేయాలి ►ట్రేలో పోసి, అవెన్‌లో ఉంచి 25 నిమిషాల పాటు బేక్ చేయాలి ►బయటకు తీసి, చల్లారాక, సాల్టెడ్ కారమెల్ను పైన చల్లి అందించాలి. కేక్ పాప్స్ కావలసినవి: కేక్ పాప్స్ కోసం: పొడిపొడిగా మిగిలిపోయిన కేక్ (క్రంబ్ల్డ్ కేక్) – 2 కప్పులు; హెవీ క్రీమ్ – ఒక కప్పు కోటింగ్ కోసం: తగినంత డార్క్ చాకొలేట్ లేదా వైట్ చాకొలేట్; తగినంత నట్స్ పొడి; కార్డ్బోర్డ్ బాక్స్. తయారీ: ►ఒక పాత్రలో క్రీమ్, క్రంబ్ల్డ్ కేక్ వేసి బాగా కలపాలి (ఈ పొడి కొద్దిగా ఎక్కువ ఉన్నా పరవాలేదు) ►రెండు అంగుళాల పరిమాణంలో బాల్స్‌లా చేతితో చేసి, పొడవాటి పుల్లలకు గుచ్చి, పక్కన పెట్టాలి ►డార్క్ చాకొలేట్ లేదా వైట్ చాకొలేట్‌ను కరిగించాలి (ఒక మామూలు గిన్నెలో వీటిని ఉంచి, మరుగుతున్న గిన్నె మీద ఈ గిన్నె ఉంచి కరిగించాలి) ►కరుగుతున్న చాకొలేట్ లో కేక్ బాల్స్ పుల్లలను ముంచి, తీసేసి, కార్డ్ బోర్డు మీద ఉంచాలి ►నట్స్ పొడి చల్లాలి ►చల్లారాక అందించాలి (వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే నాలుగైదు రోజుల వరకు చెడి పోకుండా ఉంటాయి) -
ఆస్వాదించు.. మైమ‘రుచి’
సాక్షి, విశాఖపట్నం: కేక్ అంటే.. అందరికీ గుర్తొచ్చేది న్యూ ఇయర్, బర్త్‌డే సెలబ్రేషన్లు. ఇంకాస్తా ముందుకెళ్తే.. ఎంగేజ్మెంట్, మ్యారేజ్ డే సెలబ్రేషన్లు.. అన్నింటికీ దాదాపు ఒకే మోడల్ కేక్ ఉంటుంది. బేకరీలో ఏ డిజైన్ ఉంటే ఆ కేక్నే కొని తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ట్రెండ్ మారింది. శుభకార్యానికి తగ్గట్టుగా కేక్‌ను ఎంపిక చేసుకుని.. సంబరాలు జరుపుకోవచ్చు. సందర్భం ఏదైనా ఆశా రాథోడ్ కేక్ చేస్తే అదిరిపోతుంది. నగరంలోని మాధవధారకు చెందిన ఆశా రాథోడ్ కన్నడ అమ్మాయి. దీంతో ఈ రంగంలో ఇట్టే ప్రావీణ్యం పొందారు. సందర్భానికి తగ్గట్టుగా..కావాల్సిన డిజైన్‌తో కేక్ ఎందుకు చేయకూడదన్న ఆలోచన రావడంతో..ఈ రంగాన్నే కెరీర్‌గా ఎంచుకున్నారు. కేక్ తయారీపై దృష్టి సారించారు. విదేశాల్లోనూ ఫేమస్.. ఆ నోటా.. ఈ నోటా.. ఆశా రాథోడ్ చేసిన ప్రాచుర్యం పొందాయి. విదేశాల్లో కూడా వాలిపోయాయి. విదేశాల్లో ఉన్న తెలుగు ప్రజలు.. అక్కడ ఏదైనా శుభకార్యం ఏర్పాటు చేసుకోవాలంటే ఆశా రాథోడ్ కేక్ ఉండాల్సిందే. అమెరికా, చికాగో, న్యూయార్క్, లండన్ ఎన్ఆర్ఐలు ఈ కేక్స్‌ను ఆర్డర్ చేస్తుంటారు. వైజాగ్‌తో పాటు విజయవాడ, కాకినాడ, హైదరాబాద్, వరంగల్ నుంచి కూడా ఆర్డర్స్ వస్తున్నాయి. ఇలా కేక పుట్టించే కేక్స్‌తో ఫేమస్ అయిపోయారు ఆశారాథోడ్. నాలుగేళ్లగా హోం మేడ్ కేక్స్‌ను తయారు చేస్తున్నారు. నగరం నుంచి ఎవరైనా విదేశాలకు వెళ్తే అక్కడ వాళ్లకు ఈ కేక్స్‌ను పార్శిల్ ద్వారా పంపుతారు. తనదైన శైలిలో పేస్త్రీ, చాక్లెట్‌తో పాటు కస్టమైజ్డ్ కేకులు ఆశా రాథోడ్ చేతుల్లో తియ్యగా.. అందంగా రూపుదిద్దుకుంటున్నాయి. కొత్త పంథాలో.. ముందుగా తన కుమార్తె పుట్టిన రోజుకు సంబంధించిన కేక్‌ను విభిన్నంగా తయారు చేయాలని ఆశా నిర్ణయించారు. తన కుమార్తెకు ఇష్టమైన మోడల్‌తో అచ్చం బొమ్మను తలపించేలా కేక్ తయారు చేశారు. బర్త్‌డేకు వచ్చిన వారంతా అది కేక్ కాదు బొమ్మ అనేంతగా భ్రమపడ్డారు. ఇక అప్పటి నుంచి ఆమె ట్రెండీ కేక్ కలెక్షన్ కొత్త పంథాలో సాగిపోయింది.ఉద్యోగి విరమణ కార్యక్రమం అయితే.. ఉద్యోగి కుర్చీలో సేదతీరుతూ, పేపర్ చదువుతున్నట్లుగా., ఎంగేజ్మెంట్ అయితే.. మేడ్ ఫర్ ఈచ్ అదర్ కేక్., బారసాల కార్యక్రమం అయితే.. బుజ్జాయి ఊయలలో ఊగుతున్న కేక్.., హాఫ్ శారీ ఫంక్షన్ అయితే.. పట్టుచీర కేక్.., ప్రేమను వ్యక్తం చేయాలనుకునే సందర్భం ఉంటే ప్రపోజ్ కేక్.., కృష్ణాష్టమికి వెన్నముద్దల కేక్.., ఇలా ప్రతి శుభకార్యానికి మరింత వన్నె తెచ్చేలా కేక్ తయారు చేస్తూ అందరినీ మెప్పిస్తున్నారు ఆశా రాథోడ్. పిల్లలు ఎక్కువగా మెచ్చే బొమ్మల కేక్స్, డ్రైఫ్రూట్స్ కేక్, ఫొటో రోల్ కేక్.. ఇలా ఆశా తయారు చేసిన కేక్స్ అన్నీ సహజ సిద్ధంగా కనిపిస్తుంటాయి. భలే డిమాండ్ ఆకర్షణీయంగా కనిపిస్తేనే కేక్స్ కొంటారు. తర్వాత టేస్ట్ చూస్తారు. అందుకని కేక్‌లను చూడగానే ఆకట్టుకునేలా తయారుచేసే కళ సొంతం చేసుకోవాలి. ఇదే సూత్రాన్ని ఆశా రాథోడ్ పాటిస్తుంటారు. కళ చేతిలో ఉంటే పలు రకాల బొమ్మలను, ఆకారాలను కేక్‌ల రూపంలో ఆకర్షణీయంగా మలచవచ్చని ఆమె నిరూపిస్తున్నారు. ‘కేక్స్‌లో వంద రకాల రెసిపీలు ఉంటాయి. అయితే బేసిక్ విధానం వచ్చి ఉండాలి. వంట చేయడం కంటే కూడా బేకింగ్ చేయడం చాలా సులభం. ఎందుకంటే బేకింగ్‌లో పదార్థాలన్నీ కొలతల బట్టి వాడాలి. చెప్తే అతిశయోక్తి అనుకుంటారు కానీ...! బేకరీ పెట్టే వాళ్లకి వచ్చే ఆదాయం కంటే కూడా ఇంటి నుంచి కేక్స్ చేసే వాళ్ల ఆదాయం ఎక్కువ. నలుగురితో పరిచయాలు ఉండి, కాస్త పేరొస్తే చాలు ‘హోం బేకర్స్’కు డిమాండ్ ఉంటుంది. దీనికి పెట్టుబడి కూడా ఎక్కువ అక్కర్లేదు.’ అని ఆశా రాథోడ్ అంటారు. మనసుకు నచ్చిన పని చేస్తున్నా.. కొత్తగా ఆలోచించడమనేది చిన్నప్పటి నుంచి అలవాటుగా మారిపోయింది. అందుకే ఇలా భిన్నంగా ఆలోచించాను. ఏ ఫంక్షన్‌కు సంబంధించిన కేక్ అయినా అందరికీ నచ్చేలా చేయాలన్నదే నా ఆకాంక్ష. ప్రతి ఒక్కరూ నేను తయారు చేసిన కేక్ గురించి మాట్లాడుతుంటారు. ఇంటి వద్దనే ఉంటూ మనసుకు నచ్చిన పని చేస్తున్నాను. ఆ పని పది మంది మెచ్చుకుంటుంటే చాలా ఆనందంగా ఉంది. – ఆశా రాథోడ్ -
కేక్ ఆర్డర్ చేస్తున్నారా..? అయితే జాగ్రత్త!
తమిళనాడు: పుట్టిన రోజు, న్యూఇయర్ వేడుకలను కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకోవడం ఈరోజుల్లో చాలా కామన్. అయితే ఇదే అదనుగా కొంతమంది దందా రాయుళ్లు కల్తీ కేకులను తయారు చేయడం మొదలుపెట్టారు. కల్తీ కేకులు ఏంటి అనుకుంటున్నారా? అవును.. కుళ్లిపోయిన కోడిగుడ్లతో కేకులు తయారుచేస్తున్న ఘటన తమిళనాడులోని మధురై జిల్లాలో బయటపడింది. కుళ్లిన కోడిగుడ్లతో కేకులు తయారుచేస్తున్నారని మధురై అధికారులకు ఇటీవల ఫిర్యాదులు అందాయి. దీంతో అధికారులు కొన్ని బేకరీలు, గోదాముల్లో తనిఖీలు చేపట్టారు. తత్తనేరిలోని ఓ గోదాములో కుళ్లిన కోడి గుడ్లను పెద్ద ఎత్తున స్టోర్ చేయడం గుర్తించారు. ఒక్కో గుడ్డును కేవలం రూ.1కే విక్రయిస్తుండటంతో పలువురు బేకరీ షాపుల యజమానులు వాటిని తీసుకెళ్లి కేకు తయారీలో వాడుతున్నారు. ఈ దందాను తీవ్రంగా పరిగణించిన పోలీసులు బాధ్యులపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటువంటి కేకులు తింటే అనారోగ్యాలు కొనితెచ్చుకున్నట్టేనని వైద్యులు సూచిస్తున్నారు. -
ఎడారి దేశంలో కళా నైపుణ్యం
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలం దమ్మన్నపేట్ గ్రామానికి చెందిన నర్సింహా చారి పదేళ్ల క్రితం జీవనోపాధి కోసం దుబాయికి వెళ్లాడు. అక్కడ ఓ బేకరీలో పనిలో చేరాడు. బెకరీలో కేక్‌లను కళా ఖండాలుగా తయారు చేసి పేరు తెచ్చుకున్నాడు. దుబాయిలో ఇటీవల కేక్‌ల తయారీపై పోటీలు నిర్వహించారు. ఇందులో అనేక బేకరీ కంపెనీలు పాల్గొని రకరకాల కేక్‌లను తయారు చేశాయి. ఇందులో నర్సింహాచారి తయారు చేసిన కేక్‌కు బహుమతి వచ్చింది. దుబాయి ప్రభుత్వం నర్సింహాచారికి బంగారు పతకంతో పాటు ప్రసంశాపత్రం అందించింది. బంగారు పతకం సాధించి ఆయన పనిచేసే మిస్టర్ బెకరీ కంపెనీకి మంచి పేరు తెచ్చిపెట్టడంతో నర్సింహాచారికి కంపెనీ ప్రత్యేక స్థానం ఇచ్చింది. మంచి వసతులతో పాటు జీతభత్యాలను పెంచింది. తన కళాఖండాలకు మంచి గుర్తింపు వచ్చిందని నర్సింహాచారి ‘సాక్షి’తో మాట్లాడుతూ చెప్పారు. – అల్లాడి శేఖర్, ధర్పల్లి -
భగత్ హల్వా (1795 నుండి)
భగత్ హల్వా తాజ్‌మహల్ అంత పురాతనమైనది కాకపోవచ్చును కాని, ఇంచుమించు అంత పురాతనమైనదే. బెలాంగంజ్ ప్రాంతానికి చెందిన లేఖ్‌రాజ్ భగత్ సుమారు రెండు శతాబ్దాల క్రితం హల్వాను అమ్మడం ప్రారంభించారు. మట్టితో అలికిన నేల మీద కూర్చుని రెస్టారెంట్ భోజనం చేసే రోజులు అవి. చెక్క స్పూనుతో, మట్టి పాత్రలలో మాత్రమే ఆ రోజుల్లో ఆహారం తీసుకునేవారు. దక్షిణ భారతీయులు, చైనీయులు ఇక్కడకు ఒక కొత్త సంస్కృతిని తీసుకొచ్చారు. లడ్డు, బర్ఫీల స్థానంలో స్టేపుల్ ఫుడ్ అంటే పూరీ కూర, కేక్స్ పేస్ట్రీలు వంటివి పరిచయం చేశారు. అన్నిటికీ దీటుగా నిలబడింది ఇది.భగత్ హల్వాయి కుటుంబం లో తొమ్మిదో తరానికి చెందినవారు రాజ్‌కుమార్ భగత్. మొఘలుల కాలం నుంచి వీరి కుటుంబాలు ఇక్కడే ఉన్నాయట. బొగ్గులు, కట్టె పుల్లల వంటి వాటిని వంటకు ఉపయోగించే వారు కాదు. కేవలం ఆవు పిడకల మీద మాత్రమే వంట చేసేవారు. మొదట్లో పూరీ కూర తయారుచేసేవారు. బేడాయ్ (స్టఫ్డ్ పూరీ), రబ్రీ, జిలేబీ, బర్ఫీ వంటి మిఠాయిలు తయారుచేసేవారు. కాలక్రమేణా వీరు తమ వ్యాపారాన్ని విస్తరించారు. నగరంలో చాలా షాపులు ప్రారంభించారు. స్వీట్స్ నుంచి కేకుల వరకు, బ్రెడ్ నుంచి బటర్ వరకు, చాట్ నుంచి ఫాస్ట్ ఫుడ్ వరకు, అన్ని రకాల సంప్రదాయ మిఠాయిలు సైతం వీరు తయారుచేస్తున్నారు. కోకోనట్ వాటర్ రిఫ్రెషనర్ కావలసినవి: కొబ్బరి నీళ్లు – ఒకటిన్నర లీటర్లు; పుదీనా ఆకులు – అర కప్పు; నిమ్మ తొనలు – 4 (చిన్న చిన్న ముక్కలు); నిమ్మ రసం – ఒక టీ స్పూను; సన్నగా పొడవుగా తరిగిన పుచ్చకాయ ముక్కలు – అర కప్పు; ఐస్ క్యూబ్స్ – కొద్దిగా. తయారీ: ∙ఒక పాత్రలో ఒక టీ స్పూను నిమ్మ రసం, కొద్దిగా పుదీనా ఆకులు వేసి బాగా కలిపి మిక్సీ జార్లో వేసుకోవాలి ∙నిమ్మ తొనలు, పుచ్చకాయ ముక్కలు జత చేసి అన్నీ కలిసేలా మిక్సీ పట్టాలి ∙గ్లాసులోకి తీసుకోవాలి ∙కొబ్బరి నీళ్లు, ఐస్ క్యూబ్స్ జత చేసి బాగా కలిపి, చల్లగా అందించాలి. ట్రాపికల్ కోకోనట్ సంగారియా కావలసినవి: పైనాపిల్ తరుగు – ఒక కప్పు; పచ్చి మామిడికాయ తురుము – ఒక కప్పు; కమలాపండు తొనలు – ఒక కప్పు (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొబ్బరి నీళ్లు – ఒకటిన్నర కప్పులు తయారీ: ∙ఒక పెద్దపాత్రలో పైన చెప్పిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి ∙సుమారు రెండు గంటలపాటు మూత పెట్టి ఉంచేయాలి ∙కొద్దిగా ఐస్ వేసి చల్లగా అందించాలి. వాహ్ లస్సీవాలా! వాహ్!!!జైపూర్ లస్సీవాలా (1944 నుంచి) జైపూర్ లస్సీవాలా గురించి ఎవరికి తెలియదు కనుక మళ్లీ వాళ్ల గురించి చెప్పడానికి. తరతరాలుగా అందరూ అక్కడి లస్సీ తాగినవారే. జైపూర్ వెళితే లస్సీని రుచి చూడకుండా వెనక్కు రారు. ఎం.ఐ. రోడ్లో ఈ లస్సీవాలా సుమారు ఏడు దశాబ్దాలుగా లస్సీ అమ్ముతున్నారు. 1944లో కిషన్‌లాల్ అగర్వాల్ ‘లస్సీవాలా’ ప్రారంభించారు. జైపూర్‌లో ఇటువంటి షాపు ఇదే మొదటిది. ఇక్కడ సంప్రదాయబద్ధంగా తియ్యగా, ఉప్పగా రెండు ఫ్లేవర్స్లోను లస్సీ దొరుకుతుంది. ఇప్పుడు సుగర్ ఫ్రీ లస్సీ కూడా అందిస్తున్నారు. ఈ లస్సీని రుచి చూడని సెలబ్రిటీలు లేరు. ప్రముఖ బాలీవుడ్ తారలంతా ఈ లస్సీని రుచి చూసినవారే. ఈ లస్సీవాలాను దర్శించి, లస్సీ రుచిని తలచుకుంటూ నాలుక తడుపుకుంటుంటారు. అమితాబ్, ముఖేష్ అంబానీ, శిల్పాశెట్టి, డింపుల్ కపాడియా, శోభాడే వంటి వారంతా ఈ లస్సీని ఆస్వాదించినవారే. మిగిలిన షాపులు రాత్రివరకు తెరిచి ఉంటాయి. లస్సీవాలాలు మాత్రం ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం నాలుగు వరకు మాత్రమే తెరచి ఉంటాయి. ఇందుకు కారణం ఏమిటని ప్రశ్నిస్తే, లస్సీవాలా అధినేత ఘనశ్యామ్ అగర్వాల్ ఇందుకు మంచి సమాధానం చెబుతారు, ‘సాయంత్రానికి పెరుగు పులిసిపోతుంది. అంతేకాదు ఆ తరవాత ఇంక మా దగ్గర పెరుగు కూడా మిగలదు’ అంటారు. కుల్లాడ్ (మట్టి పాత్ర) 200 మి.లీ., 400 మి.లీ. పరిమాణంలో రెండు సైజులలో లస్సీ దొరుకుతుంది. ఇందులో పెరుగు, ఐస్, మంచి నీళ్లు పోస్తారు. మండుటెండలో చల్లటి లస్సీ కోసం నిలబడలేమనుకుంటే, ప్యాకింగ్ కూడా తెప్పించుకోవచ్చు. బటర్ పేపర్‌తో కవర్ చేసి, దారంతో బిగించి ఇంటి గుమ్మం దగ్గరకు చేరుతుంది ఈ కుల్లాడ్. భారతీయులే కాకుండా, ప్రతిరోజు కనీసం వంద మంది విదేశీయులు సైతం కుల్లాడ్ లస్సీని రుచి చూస్తారు. జైపూర్ వెళితే లస్సీ తాగడం మరచిపోకండేం!!! -
థర్మకోల్ కేకు @ 5 లక్షల రూపాయలు
మనీలా : పెళ్లిరోజు అనేది మన జీవితంలో అతి ముఖ్యమైన రోజుల్లో ఒకటి. పెళ్లి రోజును మన జీవితంలో మర్చిపోలేము. మన దేశంతో పాటు చాలా దేశాల్లో పెళ్లిరోజును పండుగలా జరుపుకుంటారు.బంధువులను, స్నేహితులను పిలుస్తారు. వారందరికి విందు ఇస్తారు. ఇలా ఆ రోజును చాలా సంతోషంగా గడుపుతారు. అందరిలాగానే ఓ జంట కూడా తమ పెళ్లి రోజును ఘనంగాజరుపోవాలని భావించింది. దీని కోసం నెల ముందు నుంచే ప్లాన్ చేసుకుంది. బంధువులకు, స్నేహితులకు ఆహ్వానం కూడా పంపారు. విందు కోసం రూ.5లక్షలులతో ఓ ప్రముఖక్యాటరింగ్ సంస్థకు ఆర్డర్ ఇచ్చారు. చివరకు క్యాటరింగ్ సంస్థ చేసిన మోసానికి అందరి ముందు తలదించుకున్నారు. వారు ఆర్డర్ చేసిన పుడ్ సప్లై చేయకపోవడమే కాకుండా, భారీ కూల్ కేకుకు బదులు థర్మకోల్ కేకు పార్శిల్ ఇచ్చి నలుగురి ముందు నవ్వులపాలు చేశారు. వివరాలు.. ఫిలిప్పీన్స్ దేశంలో పాసిగ్ సిటీకి చెందిన షైన్ తమాయో తన పెళ్లి రోజు ఘనంగా జరుపోవాలకున్నారు. నగరానికి చెందిన ప్రముఖ క్యాటరింగ్ సంస్థకు రూ. 5లక్షలు అడ్వాన్స్ ఇచ్చి వింధు ఏర్పాటు చేశారు. పెళ్లి రోజు బంధువులు, స్నేహితులు అంతా తన ఇంటి వచ్చారు. వింధు కోసమై వెళ్లి చూడగా అక్కడ పుడ్ ఏర్పాటు చేయలేదు. దింతో పక్క వీధిలో ఉన్న హోటల్లో పుడ్ తెప్పించి వారికి వింధు ఇచ్చారు. అనంతరం కేకు కటింగ్ వెళ్లారు. అందరు చూట్టూఉండగా ఆ జంట కేక్ కట్ చేసింది. అది చూసి బంధువుతలతో పాటు, వారు కూడా షాకయ్యారు. అది కేకు కాదు థర్మకోల్. కేకు ఆకారంలో థర్మకోల్ను తయారు చేసి పైన రంగు వేశారు. ఇది చూసి పెళ్లి రోజు ఆ జంట బోరుమంది. క్యాటరింగ్ సంస్థ చేసిన మోసానికి తాము బలైపోయామని వాపోయారు. వెంటనే పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఏదేమైనా పెళ్లి రోజు ఆ జంటకు తీవ్ర నిరాశ ఎదురైంది. -
కేక్‌లో పలుకు చిలకలు...
ఫైలో : ఫైలో అనే పదానికి గ్రీకులో ‘ఆకు’ అని అర్థం. ఇది చాలా పల్చగా ఉంటుంది. పేస్ట్రీల తయారీలో ఫైలోను ఎక్కువగా ఉపయోగిస్తారు. బాల్కన్ క్విజీన్‌లో వీటి వాడకం ఎక్కువ. ఫైలో డఫ్‌ను మైదాపిండి, నీళ్లు, కొద్దిగా నూనె లేదా వైట్ వెనిగర్ ఉపయోగించి తయారుచేస్తారు. ఈ షీట్లను వరుసగా ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ, ఆయిల్ లేదా బటర్‌తో బ్రషింగ్ చేసి, అప్పుడే పేస్ట్రీని బేక్ చేస్తారు. ఇంటి దగ్గర చేయడానికి చాలా సమయం పడుతుంది. ఇందుకోసం పెద్ద పెద్ద రోలింగ్ షీట్లు, పెద్ద టేబుల్, పెద్ద చపాతీ కర్ర అవసరమవుతాయి. అలాగే రెండు పొరల మధ్య పొడి పిండి వేస్తూనే ఉండాలి. అందువల్ల వీటిని ఇంటి దగ్గర తయారు చేసుకోవడం కష్టం. ఫైలోలను చక్కగా తయారుచేసే యంత్రాన్ని 1970లో కనిపెట్టారు. ఇవి ఇప్పుడు సూపర్ మార్కెట్లో విస్తృతంగా దొరుకుతున్నాయి. వీటి తయారీకి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో అందుబాటులో ఉన్నాయి. క్రీమ్ ఆఫ్ టార్టార్: ఈ పేరు చూడగానే క్రీమ్ అనుకోకూడదు. ఇది పొడిపొడిగా ఉంటుంది. ద్రాక్ష పళ్లను పులియబెట్టి, తయారుచేసిన వైన్ నుంచి తయారయ్యే బైప్రోడక్ట్ ఇది. శాస్త్రీయంగా దీనిని పొటాషియం బైకార్బొనేట్ అంటారు. కోడిగుడ్లను గిలకొట్టేటప్పుడు ఈ పొడిని కొద్దిగా జత చేస్తే, మిశ్రమం బాగా నురుగులా, మెత్తగా వస్తుంది. షార్టెనింగ్: ఘనరూపంలో ఉన్న ఏదో ఒక ఫ్యాట్‌ని పేస్ట్రీలలో ఉపయోగిస్తారు. షార్టెనింగ్ అనే పదాన్ని మార్గరిన్కి దగ్గరగా ఉండే బటర్ పదానికి బదులుగా ఉపయోగిస్తారు. కొబ్బరి ఫ్లేక్స్: కొబ్బరిని సన్నగా ముక్కలుగా తురమాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఈ కొబ్బరి ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. స్వీటెన్డ్ ఫ్లేక్డ్ కోకోనట్ : సన్నగా తురిమిన కొబ్బరి ముక్కలకు కొద్దిగా పంచదార జతచేసి బాగా కలపాలి. పాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి కరిగాక ఈ ముక్కలను అందులో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి తీసేయాలి. ఇవి సుమారు వారం రోజులు నిల్వ ఉంటాయి. ఇదీ కేకు చరిత్ర: కేక్ అనే పదానికి చాలా పెద్ద చరిత్ర ఉంది. ఈ పదం వికింగ్ దేశాలకు చెందిన పురాతన నార్స్ (స్కాండెనేవియా) పదం ‘కక’ నుంచి వచ్చింది. పురాతన గ్రీకులు కేక్‌ని ప్లకోస్ అని పిలిచేవారు. ఇది ఫ్లాట్ అనే పదం నుంచి పుట్టింది. కోడిగుడ్లు, పాలు, నట్స్, తేనెలను జత చేసి బేక్ చేసి తయారుచేసేవారు. గ్రీకులకు సతురా అనే ప్రత్యేకమైన కేక్ ఉండేది. అంటే ఫ్లాట్‌గా తయారుచేసిన హెవీ కేక్ అన్నమాట. రోమనుల కాలంలో ప్లాసెంటాను కేక్‌తో కలిపి బేక్ చేసేవారు. పేస్ట్రీల తయారీలో ఉపయోగించే వారు. వీరు మేకపాలను ఉపయోగించి చీజ్ తయారుచేసేవారు. పూర్వకాలంలో రోమన్లు బటర్, కోడిగుడ్లు, తేనె కలిపి బ్రెడ్ తయారీకి కావలసిన పిండిని తయారుచేసేవారు. ఇంగ్లండ్‌లో కూడా తొలినాళ్లలో బ్రెడ్‌నే కేక్‌గా ఉపయోగించుకునేవారు. స్పాంజ్కేకులు స్పెయిన్‌లో ప్రారంభమైనట్లు భావిస్తారు. కేకులు చాలా రకాలు ఉన్నాయి. బటర్ కేక్స్, స్పాంజ్ కేక్స్, చిఫాన్ కేక్స్, చాకొలేట్ కేక్స్, కాఫీ కేక్స్... -
ప్రేమ బేకరీ
చక్కెర తీపి కంటే.. తేనె తీపి కంటే తియ్యనైనది ప్రేమ. పంచే కొద్దీ.. ఇచ్చే కొద్దీ పెరిగేది ప్రేమ. చర్చి గంటల్లా ఘనమైనది క్రిస్మస్ ట్రీలా వెలుగులు విరజిమ్మేది శాంటాక్లాజ్ కానుకల్లో ఉన్నది ప్రేమ. క్రిస్మస్ అంటే ప్రేమ. ప్రేమగా చేసుకునే ఈ పండుగనుప్రియమైన వ్యక్తులతో పంచుకోవడానికి ఈ గుప్పెడు కుకీస్ మీకోసం... శాంటాక్లాజ్ స్వీట్ బ్రెడ్ కావలసినవి: మైదా పిండి – రెండు కప్పులు; బటర్ – 2 టేబుల్ స్పూన్లు; కోడి గుడ్డు – 1 (బాగా గిలకొట్టాలి); ఉప్పు – చిటికెడు; గోరువెచ్చని పాలు – ఒక కప్పు; పంచదార – 2 టేబుల్ స్పూన్లు; డ్రై ఈస్ట్ – ఒక ప్యాకెట్ తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బటర్, కోడిగుడ్డు సొన, ఉప్పు వేయాలి ∙చిన్న పాత్రలో గోరు వెచ్చని పాలు, పంచదార, డ్రై ఈస్ట్ వేసి స్పూనుతో బాగా కలిపి, మైదా పిండి మిశ్రమానికి జత చేయాలి ∙బీటర్ సహాయంతో బాగా గిలకొట్టాలి ∙మూత పెట్టి సుమారు రెండు గంటలు వదిలేయాలి ∙ఈ మిశ్రమం అంతా బాగా పొంగుతుంది ∙అప్పుడు ఆ పిండి ముద్దను తీసుకుని రెండు సమాన భాగాలుగా చేయాలి ∙పీట మీద పొడి పిండి వేసి రెండు భాగాలను విడివిడిగా ఒత్తుకోవాలి ∙ఒక భాగాన్ని శంఖం ఆకారంలో పొడవుగా ఒత్తుకోవాలి ∙రెండో భాగాన్ని గుండ్రంగా ఒత్తుకుని, రెండు భాగాలుగా కట్ చేయాలి ∙పైభాగాన్ని చాకుతో అడ్డంగా అంగుళం దూరంలో పొడవుగా కట్ చేయాలి ∙కింది భాగాన్ని నిలువుగా శాంటాక్లాజ్ గడ్డం వచ్చేలా దగ్గర దగ్గరగా కట్ చేసి, కింది భాగాన్ని వేరుచేయాలి ∙శంఖం ఆకారంలో ఒత్తుకున్న దాని కింది భాగంలో గడ్డం భాగం ఉంచాలి ∙కట్ చేసిన భాగాలను చేతితో బాగా మెలితిప్పాలి ∙పై భాగంలోఉన్న వాటిని గడ్డం అతికించిన భాగానికి పైన ముఖం ఆకారంలో వచ్చేలా ఒక్కో ముక్కను అమర్చాలి ∙చాకొలేట్ చిప్స్‌తో కళ్లు తయారుచేయాలి ∙ కోడి గుడ్డు పచ్చ సొనను బాగా గిలకొట్టి, కొంత భాగం తీసి, ఎరుపు రంగు మిఠాయి రంగు జతచేసి, వేరే పాత్రలో ఉంచాలి ∙తయారుచేసి ఉంచుకున్న శాంటాక్లాజ్ మీద బ్రషింగ్ చేయాలి ∙ టోపీ, ముక్కు భాగంలో ఎరుపు రంగును బ్రష్ చేయాలి ∙350 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీహీట్ చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న శాంటాక్లాజ్‌ను అవెన్‌లో ఉంచి, అర గంట బేక్ చేసి బయటకు తీయాలి ∙తియ్యటి జామ్‌ను పూసి తియ్యతియ్యగా తినాలి. క్రిస్మస్ బెల్స్ కావలసినవి: డార్క్ బ్రౌన్ సుగర్ – ఒకటిన్నర కప్పులు; అన్సాల్టెడ్ బటర్ – ఒక కప్పు; డార్క్ కార్న్ సిరప్ – పావు కప్పు; పెద్ద కోడి గుడ్డు – 1; నిమ్మ రసం – ఒకటిన్నర టీ స్పూన్లు; మైదా పిండి – మూడున్నర కప్పులు; ఇన్స్టెంట్ ఎస్ప్రెసో – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – ఒకటిన్నర టీ స్పూన్లు; దాల్చిన చెక్క పొడి – ఒక టీ స్పూను; బేకింగ్ సోడా – అర టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను ఫిల్లింగ్ కోసం: డార్క్ బ్రౌన్ సుగర్ – పావు కప్పు; చెర్రీ జ్యూస్ – ఒక టేబుల్ స్పూను; చాకొలేట్ చిప్స్ – తగినన్ని; అన్సాల్టెడ్ బటర్ – ఒక టేబుల్ స్పూను; చెర్రీలు – తగినన్ని . తయారీ: ఫిల్లింగ్ తయారీ... ∙ఒక పాత్రలో బ్రౌన్ సుగర్, చెర్రీ రసం, బటర్ వేసి బాగా బ్లెండ్ చేయాలి. చాకొలేట్ చిప్స్ జత చేయాలి. పిండి తయారు చేసుకోవడం... ∙ఒక పాత్రలో బ్రౌన్ సుగర్, బటర్ వేసి మిక్సర్‌లో వేసి సుమారు మూడు నిమిషాలు పాటు మిక్సీ పట్టి, ఒక పాత్రలోకి తీసుకోవాలి (మిశ్రమం బాగా నురుగులా రావాలి) ∙వేరొక పాత్రలో కార్న్ సిరప్, కోడి గుడ్డు సొన. క్రీమ్, నిమ్మ రసం వేసి బాగా బీట్ చేయాలి ∙మైదా పిండి, ఇన్స్టెంట్ ఎస్ప్రెసో, అల్లం తురుము, దాల్చిన చెక్క పొడి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి కలుపుకోవాలి ∙బటర్ మిశ్రమానికి కొద్దికొద్దిగా జత చేస్తూ కలపాలి ∙మిశ్రమాన్ని చపాతీ ముద్దలాగ చేసి, పైన ప్లాస్టిక్ పేపర్‌తో చుట్టేసి, సుమారు రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో చిల్లర్‌లో ఉంచాలి ∙మిశ్రమాన్ని బయటకు తీసి, పొడి పిండి అద్దుతూ, కొద్దిగా మందంగా ఒత్తాలి ∙కుకీ కటర్‌తో గుండ్రంగా కట్ చేయాలి ∙త్రికోణాకారంలో అంటే బెల్ షేప్‌లో మడవాలి ∙బేకింగ్ షీట్ మీద దూరం దూరంగా వరుసలో అమర్చాలి ∙తయారు చేసి ఉంచుకున్న ఫిల్లింగ్ మిశ్రమం కొద్దిగా తీసుకుని వీటిలో అమర్చి, పైన సగం చెర్రీ ముక్క ఉంచాలి ∙350 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి ∙తయారుచేసుకున్న వాటిని అవెన్‌లో ఉంచి సుమారు పావు గంట సేపు బేక్ చేయాలి ∙ఐదు నిమిషాలయ్యాక బయటకు తీయాలి ∙బాగా చల్లారాక ప్లేట్లోకి తీసి అందించాలి. చాకొలేట్ డెకొరేటివ్ బాల్స్ కావలసినవి: పాల పొడి – ఒకటిన్నర కప్పులు; కోకోపొడి – 5 టేబుల్ స్పూన్లు; బటర్ – పావు కప్పు; పంచదార – ముప్పావు కప్పు; నీళ్లు – అర కప్పు తయారీ: ∙పాలపొడిని, కోకోపొడిని జల్లించి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో నీళ్లు, పంచదార వేసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ∙మంట తగ్గించి, తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ∙ బటర్ జత చేసి బాగా కరిగేవరకు కలిపి దింపేయాలి ∙కోకో పొడి, పాల పొడి జత చేసి ఆపకుండా కలుపుతుండాలి ∙ఒక ప్లేట్‌కి నెయ్యి పూసి అందులో ఈ మిశ్రమం వేసి స్పూన్‌తో సమానంగా పరవాలి ∙పావుగంట తరువాత చేతితో ఉండలుగా చేసి, ఆ ట్రేను ఫ్రిజ్‌లో ఉంచి సుమారు అర గంట తరువాత బయటకు తీసి అందించాలి. క్రిస్మస్ ట్రీ స్వీట్ పఫ్ కావలసినవి: పఫ్ పేస్ట్రీ – 2 షీట్లు (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); న్యుటెల్లా – 50 గ్రా. (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది); బాదం పప్పుల తరుగు – ఒక టేబుల్ స్పూను; కోడి గుడ్డు – 1 (పచ్చ సొన మాత్రమే); పంచదార పొడి – ఒక టేబుల్ స్పూను. తయారీ: ∙పఫ్ పేస్ట్రీ షీట్‌ని క్రిస్మస్ ట్రీ ఆకారంలో కట్ చేయాలి ∙దాని మీద న్యుటెల్లా సమానం పూయాలి ∙ఆ పైన బాదం పప్పుల తరుగు సమానంగా పరవాలి ∙రెండవ పఫ్ పేస్ట్రీ షీటును పైన ఉంచి చేతితో నెమ్మదిగా అదమాలి ∙రెండు వైపులా క్రిస్మస్ ట్రీ ఆకారంలో వచ్చేలా చాకుతో జాగ్రత్తగా కట్ చేయాలి ∙అలా కట్ చేసిన ఒక్కో భాగాన్ని చేతితో జాగ్రత్తగా మెలిపెట్టినట్టు చేయాలి ∙పేస్ట్రీ షీట్లో మిగిలిన భాగంతో నక్షత్రం ఆకారం చేసి పైన ఉంచాలి ∙కోడిగుడ్డు పచ్చ సొనను బాగా గిలకొట్టాలి ∙క్రిస్మస్ ట్రీ మీద బ్రష్ చేయాలి ∙అవెన్‌ను 220 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ∙తయారుచేసుకున్న క్రిస్మస్ ట్రీని అవెన్‌లో ఉంచి 20 నిమిషాలు బేక్ చేసి బయటకు తీయాలి ∙వేడిగా ఉండగానే పై భాగంలో పంచదార పొడి చల్లాలి ∙కొద్దికొద్దిగా కట్ చేసుకుంటూ తినాలి. స్టార్ ఐడ్ క్రిస్మస్ కుకీస్ కావలసినవి: స్టార్ ఆకారంలో ఉండే ప్రెట్జెల్స్ – ఒక ప్యాకెట్ (సూపర్ మార్కెట్లో దొరుకుతాయి); పీనట్ బటర్ చాకొలేట్ క్యాండీస్ (ఎరుపు, ఆకుపచ్చ రంగులు) – ఒక ప్యాకెట్; మిల్క్ చాకొలేట్ కిసెస్ – 3 ప్యాకెట్లు తయారీ: ముందుగా అవెన్‌ను 170 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ∙ప్రెట్æజెల్స్‌ను ఒక ప్లేట్లో వేసుకోవాలి (విరిగిపోయిన వాటిని వేరుచేయాలి) ∙వ్యాక్స్ పేపర్ మీద ఒక వరుసలో ఉంచాలి ∙మిల్క్ చాకొలేట్ కిసెస్ను ఒక్కో ప్రెట్æజెల్ మీద ఒక్కోటి ఉంచాలి ∙ఈ విధంగా కుకీస్ షీట్ మీద ఉన్న అన్ని ప్రెట్తజెల్స్ మీద ఒక్కోటి ఉంచాలి ∙ఈ షీట్‌ను ప్రీహీట్ చేసిన అవెన్‌లో ఉంచాలి ∙ఆరు నిమిషాల పాటు బేక్ చేయాలి ∙బయటకు తీయగానే సగం సగంగా కరిగిన కిసెస్ మీద పీనట్ బటర్ చాకొలేట్ క్యాండీని ఉంచాలి ∙ఇలా ఒకటి ఎరుపు, ఒకటి ఆకుపచ్చరంగు క్యాండీలు ఉంచిన వెంటనే, కుకీస్ షీట్‌ను ఫ్రిజ్‌లో ఉంచి, కుకీస్ పూర్తిగా తయారయ్యేవరకు కదపకుండా ఉంచాలి ∙వచ్చిన అతిథులకు క్యూట్ హాలిడే బ్యాగ్‌లో పెట్టి, అందించాలి ∙వారు ఇవి చూడగానే చాలా బాగా ఎంజాయ్ చే స్తూ తింటారు. -
జంక్ ఫుడ్‌తో మనసుకూ నష్టమే
కేకులు..పిజ్జా బర్గర్లతో రోజులు గడిపేస్తూంటే.. కొంచెం జాగ్రత్త. ఈ జంక్‌ఫుడ్ మీ ఒంటికే కాదు.. మనసుకూ చేటు చేస్తుందని హెచ్చరిస్తున్నారు మాంఛెస్టర్ మెట్రోపాలిటన్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. కొలెస్ట్రాల్, సంతప్త కొవ్వులు పిండిపదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల మనో వ్యాకులత (డిప్రెషన్) వచ్చే అవకాశాలు 40 శాతం వరకూ పెరుగుతాయని వీరు జరిపిన అధ్యయనం ఒకటి చెబుతోంది. పదహారేళ్ల నుంచి 72 ఏళ్ల మధ్యవయస్కులు దాదాపు లక్ష మందిపై జరిగిన పదకొండు అధ్యయనాల ఫలితాలను విశ్లేషించడం ద్వారా తాము ఈ అంచనాక వచ్చినట్లు ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్త స్టీఫెన్ బ్రాడ్‌బర్న్ తెలిపారు. అమెరికాతోపాటు యూరప్, ఆస్ట్రేలియా, మధ్యాప్రాచ్య దేశాల్లోని స్వచ్ఛంద కార్యకర్తలతో ఈ అధ్యయనం జరిగిందని మనోవ్యాకులత లేదా దాని లక్షణాలు ఉన్న వారి ఆహారపు అలవాట్లను సేకరించి.. అవి శరీరంలో మంట/వాపు కలిగించేందుకు ఉన్న అవకాశం ఆధారంగా ఒక సూచీ సిద్ధం చేశామని వివరించారు. సూచీలో ఎక్కువ స్థాయిలో ఉన్న వారు వారి వయసు, ప్రాంతాలతో సంబంధం లేకుండా జంక్‌ఫుడ్ తీసుకుంటున్నట్లు స్పష్టమైందని అన్నారు. డిప్రెషన్‌కు సరికొత్త ఆహారం ఆధారంగా చికిత్స పద్ధతులను అభివద్ధి చేసేందుకు ఈ పరిశోధన ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పరిశోధన వివరాలు క్లినికల్ న్యూట్రీషన్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయి. -
ఇంటిప్స్
బర్త్‌డే పార్టీల్లో కొవ్వొత్తులు వెలిగించిన తరవాత, అందరూ వచ్చి కేక్ కట్ చేసేలోపే కరిగిపోతుంటాయి. క్యాండిల్ ఎక్కువ సేపు వెలగాలంటే... ఒక రోజంతా కొవ్వొత్తులను ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రీజర్‌లో ఉంచాలి. ఫ్రీజర్‌లో గట్టిపడిపోయిన క్యాండిల్ మెల్లగా కరుగుతూ ఎక్కువ సేపు వెలుగుతుంది. మైనం కరిగి కేక్ మీద పడుతుందేమోననే ఆందోళన ఉండదు. బాత్రూమ్లోని అద్దం నీటి ఆవిరితో మసకబారుతుంటుంది. అలా జరగకుండా ఉండాలంటే... వారానికోసారి అద్దాన్ని సబ్బు (డ్రై సోప్ బార్) తో రుద్ది ఆ తర్వాత పొడి వస్త్రంతో తుడవాలి. పట్టుచీరలకు నూనె మరకలంటితే... మరక మీద మొక్క జొన్న పిండి (కార్న్‌ఫ్లోర్) చల్లి కొద్దిసేపు అలా ఉంచేయాలి. నూనెను పిండి పీల్చుకున్న తర్వాత పొడిరాలిపోయేటట్లు విదిలించాలి. స్నానానికి వాడిన సబ్బు అరిగి చిన్నదైన తర్వాత దానిని వేడినీటిలో వేసి కొద్దిగా గ్లిజరిన్ కలిపి ఒక బాటిల్లో పోసి బాగా కదిలించాలి. ఈ లిక్విడ్‌ని హ్యాండ్వాష్గా వాడుకోవచ్చు. -
జన్మదిన వేడుకల్లో అపశ్రుతి
సాక్షి, కశింకోట : కశింకోటలోని హౌసింగ్ కాలనీలో జరిగిన ఓ జన్మదిన వేడుకల్లో ఆహారం విషపూరితమై సుమారు 18 మంది చిన్నారులు శనివారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. వారిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. హౌసింగ్ కాలనీలో ఒక చిన్నారికి జన్మదిన వేడుకలు జరగ్గా దానికి హాజరైన పిల్లలు కేక్ తిని, రస్నా తాగిన తర్వాత వాంతులై అస్వస్థతకు గురయ్యారు. వీరిలో వినయ్, డి.గణేష్, డి.సాయి, డి.మనోహర్, మానశ్రీ, లేఖిని, దుర్గా, వినయ్, తదితరులు ఉన్నారు. వీరంతా రెండు నుంచి పదేళ్లలోపు వయస్సు వారే. వీరిని తల్లిదండ్రులు, స్థానికులు వెంటనే అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి 108 వాహనంలో తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని, చికిత్స అందించి పంపించామని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. -
తీపి బొమ్మ.. జోయీ మాయేనమ్మ
తీరైన కనుబొమ్మలు,... జాలు వారే కురులు.. రాజసం ఉట్టిపడే వస్త్రధారణ.. కలిగిన ఈ ఫోటోలోని బొమ్మను చూస్తే ఓహో అనాల్సిందే! కానీ దీన్ని బొమ్మ అనుకుంటే మీరు పొరబడినట్టే! అందమైన ఈ బొమ్మ ‘‘కేకు’’ అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.! చైనాకు చెందిన జోయీ అనే వ్యక్తి వీటిని ఇలా అద్భుతంగా తయారు చేస్తాడు. చైనాలోనే ది బెస్ట్ కేకులు తయారు చేసే వ్యక్తిగా జోయీకి పేరుంది. తయారీలో అంతర్జాతీయ కేకు పోటీల్లో మూడు బంగారు, రెండు కాంస్య పతకాలు కూడా దక్కించుకున్నాడు. -
హోమ్బేకరీ
బెస్ట్ అనిపించే బనానా కేక్... కరిగిపోయే ఖర్జూరా కేక్ ఆపిల్, కొబ్బరి కలిపి కొట్టి కిరాక్ అనిపిస్తూ... ఖర్జూరాలకి చాకొలేట్ మిక్స్ చేసి, ఆరంజ్కి ఆపిల్ జత చేసేద్దామా? అదెలా కుదురుతుంది.... అంటారా? ఈ న్యూ ఇయర్‌కి మనమే ఇంటి దగ్గర ఓ బేకరీ పెట్టేస్తే సరి! షాకయ్యారా? బేకరీలో కూడా దొరకనన్ని కేకులు ఇంట్లోనే ఈజీగా చేసేయొచ్చు ఇలా... ఆపిల్ కొబ్బరి కుకీస్ కావలసినవి: ఆపిల్స్ – 3 (తొక్క తీసి సన్నగా తురమాలి), బాదం పప్పుల పొడి – 2 కప్పులు (బాదం పప్పుల తొక్క తీయకుండా మిక్సీలో వేసి రవ్వలా వచ్చేలా చేయాలి), ఎండు కొబ్బరి తురుము – కప్పు, కోడి గుడ్లు – 3 (గిన్నెలో వేసి గిలకొట్టాలి), కొబ్బరి నూనె – 2 టీ స్పూన్లు, వెనిలా ఎసెన్స్ – 2 టీ స్పూన్లు, దాల్చిన చెక్క పొడి – టీ స్పూను తయారి: ∙కుకర్‌ను ముందుగా వేడి చేసి ఉంచుకోవాలి ∙ఆపిల్ తురుమును బ్లెండర్ లేదా మిక్సీలో వేసి మెత్తగా చేయాలి ∙ఒక పాత్రలో బాదంపప్పుల పొడి, దాల్చినచెక్క పొడి, కొబ్బరి నూనె, వెనిలా ఎసెన్స్ వేసి బాగా కలపాలి ∙ఆపిల్ గుజ్జు, ఎండు కొబ్బరి తురుము, ఉప్పు వేసి బాగా కలపాలి ∙కోడి గుడ్డు సొన కూడా జత చేయాలి ∙మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో గుండ్రంగా అదమాలి అల్యూమినియం ప్లేట్ లేదా గిన్నెకు నెయ్యి లేదా బటర్ పూసి, తయారుచేసుకున్న కుకీలను దూరం దూరంగా సర్దాలి ముందుగా వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో ఉంచి సన్నని మంట మీద 20 నిమిషాలు ఉంచి దించేయాలి కొద్దిగా చల్లారాక రెండు బిస్కెట్ల మధ్య క్రీమ్ పూసి, ఆరనివ్వాలి ∙గాలిచొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. ఆరంజ్ ఆపిల్ బకిల్ కావలసినవి: టాపింగ్ కోసం, మైదా పిండి – అర కప్పు, పంచదార – అర కప్పు కంటె కొద్దిగా తక్కువ, ఉప్పు – పావు టీ స్పూను, కమలాపండు – 1, బటర్ – 4 టేబుల్ స్పూన్లు తయారి: ∙ఒక పాత్రలో మైదా పిండి, పంచదార, ఉప్పు, ఒక చెక్క కమలా పండు తొనలు వేయాలి ∙బటర్ జత చేస్తూ, మెత్తగా అయ్యేలా చేతితో జాగ్రత్తగా కలిపి ఫ్రీజర్‌లో గంటసేపు ఉంచాలి. కేక్ కోసం కావలసినవి: గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు, కార్న్ మీల్ – 2 టేబుల్ స్పూన్లు (రెడీమేడ్‌గా సూపర్ మార్కెట్లో లేదా ఆ¯Œ లైన్లో దొరుకుతుంది), బేకింగ్ పౌడర్ – టీ స్పూను, బేకింగ్ సోడా – పావు టీ స్పూను, ఉప్పు – అర టీ స్పూను, కమలా పండు గుజ్జు – 2 టేబుల్ స్పూన్లు, జాజికాయ పొడి – చిటికెడు, బటర్ – 6 టేబుల్ స్పూన్లు, మజ్జిగ – అర కప్పు, ఆపిల్ ముక్కలు – 2 కప్పులు (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి) పైన అలంకరణ కోసం కావలసినవి: కమలారసం – పావు కప్పు, పంచదార – పావు కప్పు కంటె కొద్దిగా ఎక్కువ, రాళ్ల ఉప్పు – చిటికెడు తయారి: ∙ఒక పాత్రలో గోధుమ పిండి, కార్న్ మీల్, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు, కమలా పండు గుజ్జు, జాజికాయ పొడి వేసి బాగా కలపాలి ∙మరొక పాత్రలో బటర్ వేసి కవ్వం సహాయంగా బాగా క్రీమీగా వచ్చేవరకు గిలకొట్టి, పంచదార వేసి మరోమారు బాగా కలపాలి ∙కోడి గుడ్లు జత చేసి ఒకసారి, మజ్జిగ జత చేసి మరోమారు గిలకొట్టి, పిండి మిశ్రమంలో వేసి బాగా కలపాలి ∙ఒక కప్పు ఆపిల్ ముక్కలు వేసి మరోమారు కలిపి, బటర్ రాసి ఉంచిన ప్లేట్ మీద ఈ మిశ్రమం సమానంగా పరవాలి ∙మిగిలిన ఆపిల్ ముక్కలు పైన చల్లాలి ముందుగా వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో ఈ ప్లేట్ ఉంచి, సన్నటి మంట మీద సుమారు 40 నిమిషాలు ఉంచి దించేయాలి.పైన అలంకరణ తయారి: ∙చిన్న బాణలిలో పంచదార, కమలాపండు రసం వేసి బాగా కలిపి, సన్నటి మంట మీద పంచదార కరిగేవరకు ఉడికించి, దించి చల్లారనివ్వాలి ∙ఉడికిన కేక్‌ను కుకర్‌లో నుంచి వెంటనే బయటకు తీయాలి ∙తయారుచేసి ఉంచుకున్న అలంకరణ మిశ్రమాన్ని పైన పోసి, వెంటనే ఉప్పు చల్లాలి ∙సుమారు అరగంటసేపు చల్లారిన తరవాత అందించాలి. అరటిపండు కేక్ కావలసినవి: మైదా – కప్పు, కోడి గుడ్లు – 2, పంచదార – ముప్పావు కప్పు, బటర్ – కప్పు (కరిగించాలి), బేకింగ్ పౌడర్ – టీ స్పూను, బేకింగ్ సోడా – అర టీ స్పూను, వెనిలా – టీ స్పూను, జీడి పప్పులు – 20 (చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), అరటిపండ్లు – 2 తయారి: ∙ఒక పాత్రలో బటర్ వేసి బాగా గిలకొట్టాలి ∙పంచదార జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙కోడిగుడ్డు సొనలు వేసి మొత్తం అన్నీ కలిసేవరకు గిలకొట్టాలి ∙బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, మైదా పిండి జత చేసి పదార్థాలన్నీ కలిసి మెత్తటి మిశ్రమం తయారయ్యే వరకు కవ్వం లేదా బీటర్‌తో గిలకొట్టాలి ∙వెనిలా ఎసెన్స్ జత చేసి, మిశ్రమాన్ని పక్కన ఉంచాలి ∙మరో పాత్రలో తొక్క తీసిన అరటిపండ్లు వేసి, స్పూను లేదా ఫోర్క్‌తో మెత్తగా చేసి, ముందుగా తయారుచేసిన పదార్థానికి జత చేసి మరోమారు బాగా కలపాలి ∙అల్యూమినియం పాత్రకు నెయ్యి లేదా బటర్ పూసి తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరిచి, ముందుగా వేడి చేసిన కుకర్‌లో ఉంచి 40 నిమిషాల తరవాత దించేయాలి ∙చెర్రీలు, డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి అందించాలి. ఖర్జూరాల కేక్ కావలసినవి: ఖర్జూరాలు – కప్పు (గింజలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి), బేకింగ్ సోడా – 2 టీ స్పూన్లు, బటర్ – కప్పు, పంచదార – ముప్పావు కప్పు, కోడి గుడ్లు – 4, వెనిలా ఎసెన్స్ – టీ స్పూను, మైదా – రెండున్నర కప్పులు, ఉప్పు – టీ స్పూను, బేకింగ్ పౌడర్ – 3 టీ స్పూన్లు తయారి: ∙ఒక పాత్రలో మూడున్నర కప్పుల నీళ్లు, గింజలు తీసిన ఖర్జూరాలను వేసి సన్నని మంట మీద ఉడికించాలి ∙తగినంత ఉప్పు జత చేయాలి ఒక పాత్రలో బటర్ వేసి మెత్తగా అయ్యేవరకు గిలకొట్టాలి ∙కోడి గుడ్ల సొన జత చేసి మరోమారు గిలకొట్టాలి ∙వెనిలా ఎసెన్స్, మైదా పిండి, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసి అన్నీ కలిసే వరకు గిలకొట్టాలి ∙ఉడికించిన ఖర్జూరాలను జత చే సి బాగా కలియబెట్టాలి ∙మైదా జత చేసి మిశ్రమం దగ్గర పడేవరకు కలపాలి ∙అల్యూమినియం పాత్రకి నెయ్యి లేదా బటర్ రాసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని పోసి, సమానంగా పరచాలి ముందుగా వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో సుమారు 45 నిమిషాలు ఉడికించి బయటకు తీయాలి ∙జీడిపప్పు, బాదం పప్పులతో గార్నిష్ చేసి, ముక్కలుగా కట్ చేసి అందించాలి. డేట్స్ చాకొలేట్ మౌసీ కావలసినవి: ఖర్జూరాలు – కప్పు, వేడి నీళ్లు – కప్పు, మైదా పిండి – ముప్పావు కప్పు, బేకింగ్ సోడా – పావు టీ స్పూను, తీపి లేని కోకో పొడి – టీ స్పూను, పంచదార – కప్పు, బటర్ – అర కప్పు, ఉప్పు – పావు టీ స్పూను, కోడి గుడ్లు – 2, బాదంపప్పుల తరుగు – పావు కప్పు, తీపి తక్కువగా ఉన్న చాకొలేట్ చిప్స్ – కప్పు. తయారి: ∙గింజలు వేరు చేసిన ఖర్జూరాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్లలో వేసి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, తీపి లేని కోకో పొడి వేసి కలిపి పక్కన ఉంచాలి ∙ఒక పాత్రలో బటర్, పంచదార వేసి మెత్తగా క్రీమీగా అయ్యేవరకు కలపాలి ∙కోడి గుడ్ల సొన జత చేసి మరోమారు బాగా కలపాలి ∙కలిపి ఉంచుకున్న పిండి మిశ్రమం ఇందులో వేసి కలియబెట్టాలి ∙వెడల్పుగా ఉండే అల్యూమినియం పాత్రకు నెయ్యి లేదా బటర్ రాసి, తయారుచేసి ఉంచుకున్న మిశ్రమం వేసి సమానంగా పరవాలి ∙చాకొలేట్ చిప్స్‌ను పైన... బిస్కెట్ల మిశ్రమానికి అతుక్కునేలా ఉంచాలి ∙ముందుగా వేడి చేసి ఉంచుకున్న కుకర్‌లో ఈ ప్లేట్‌ను ఉంచి సన్నటి సెగ మీద సుమారు 30 నిమిషాలు ఉంచి (విజిల్ పెట్టకూడదు) దింపేయాలి ∙బయటకు తీసి, కావలసిన ఆకారంలో చాకుతో కట్ చేసి అందించాలి. -
మెర్రీ కేక్స్
‘మెర్రీ’ అంటే సంతోషం. ఇది సంతోషాన్నిచ్చే పండుగ. అవును... ఇచ్చే పండుగ! ప్రేమను కానుకల్లా... ప్యాకేజ్ చేసి ఇచ్చే ప్రేమ ఎలా ఉంటుంది?! మృదువుగా... అందంగా... తియ్యగా... కేకులా ఉంటుంది. క్రిస్మస్ కేక్స్... మీ కోసం! ‘మెర్రీ క్రిస్మస్’ కోసం!! క్రిస్మస్ కేక్ కావాల్సినవి: స్పాంజ్ కేక్, ప్లమ్ కేక్‌ని ఈ కింద చెప్పిన విధంగా అలంకరిస్తే క్రిస్మస్ కేక్ సిద్ధం... ప్లమ్ కేక్/ స్పాంజ్ కేక్ – 1 (కేజీ), గుడ్డులోని తెల్లసొన – 100 ఎం.ఎల్, ఐసింగ్ షుగర్ (పంచదార పొడి) – 300 గ్రాములు, నిమ్మకాయ – 1 (రసం తీయాలి) ఆప్రికాట్ జామ్ – 20 గ్రాములు, మార్జిపాన్ క్రీమ్ – తగినంత అలంకరణకు: శాంటాక్లాజ్ – 1, క్రిస్మస్ ట్రీ – 1 (చిన్నది), శాటిన్ రిబ్బన్ – 1, స్టార్– 1 తయారీ: ప్లమ్కేక్కి పైన, చుట్టుపక్కల ఆప్రికాట్ జామ్ పూయాలి. మార్జిపాన్‌తో ప్లమ్కేక్ను అంతా కవర్ చేయాలి. గుడ్డులోని తెల్లసొనను గరిటతో నురగ వచ్చేదాకా గిలకొట్టాలి. దీంట్లో పంచదార పొడి, నిమ్మరసం కలపాలి. దీనిని ‘రాయల్ ఐసింగ్’ అంటారు. దీనిని ప్లమ్ కేక్ మీద లేయర్‌లాగా పూయాలి. చివరగా శాంటాక్లాజ్, క్రిస్మస్ ట్రీ, శాటిన్ రిబ్బన్, స్టార్లతో అలంకరిస్తే క్రిస్మస్ కేక్ సిద్ధం. క్యారెట్ కేక్ కావాల్సినవి: మైదా – 2 కప్పులు, బేకింగ్ పౌడర్ – టీ స్పూన్, వంటసోడా – పావు టీ స్పూన్, ఉప్పు – చిటికెడు, దాల్చిన చెక్క పొడి – అర టీ స్పూన్, జాజికాయపొడి – చిటికెడు, వెన్న – కప్పు, పంచదార పొడి – కప్పు, కండెన్స్డ్ మిల్క్ – ఒక టిన్ను (500 మి.లీ), వెనీలా ఎసెన్స్ – అర టీ స్పూన్, క్యారెట్ తురుము – ఒకటిన్నర కప్పు, డ్రై ఫ్రూట్స్ (బాదం, జీడిపప్పు, వాల్నట్స్, కిస్మిస్) – అర కప్పు, పాలు – అర కప్పు తయారీ: మైదా, బేకింగ్ పౌడర్, సోడా, ఉప్పు, దాల్చిన చెక్క పొడి, జాజికాయపొడి కలిపి జల్లించాలి. వెన్న, పంచదారపొడి, కండెన్స్డ్ మిల్క్, వెనిలా ఎసెన్స్ వేసి నురగ వచ్చేలా గిలకొట్టాలి. ఇందులో జల్లించిన మైదా మిశ్రమం, క్యారెట్ తురుము, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కలపాలి. పిండి గట్టిగా ఉంటే... కొద్దిగా పాలు పోసి కలపాలి. కేక్ టిన్ను లోపల ఫాయిల్ పేపర్ పరిచి, కేకు మిశ్రమం వేసి గరిటెతో, లేదంటే చేతితో టిన్ను లోపల అంతా సర్దాలి. అవెన్ని 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేసి, అర గంటపాటు బేక్ చేసి తీయాలి. తర్వాత లేయర్స్‌గా కట్ చేయాలి. లేయర్ల మధ్యలో వైట్ బటర్ని పెట్టి, ఆ పైన కట్ చేసిన క్యారెట్ కేక్‌ను అమర్చాలి. పైన వైట్ బటర్తోనూ, కలర్ క్రీమ్‌తోనూ అలంకరించాలి. పైనాపిల్కేక్ కావాల్సినవి: గుడ్లు – 4, మైదా – 200 గ్రాములు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూను, వంటసోడా – పావు టీ స్పూన్, వెన్న – 200 గ్రాములు, పంచదార – 200 గ్రాములు, పైనాపిల్ ఎసెన్స్ – 6 చుక్కలు, పైనాపిల్ ముక్కలు – 8, చెర్రీలు – 8 తయారీ: కేక్ చేసే టిన్నులో మూడు చెంచాల పంచదార వేసి, వేడి చేయాలి. అది కరిగి ఎర్రగా అవుతుంది. ఆ పాకాన్ని గిన్నెకి అంతా రాసి ఉంచాలి. మైదాలో బేకింగ్ పౌడర్, వంటసోడా వేసి రెండు మూడు సార్లు చల్లించాలి. పైనాపిల్ చెక్కు తీసి సన్నని, గుండ్రటి స్లైసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలో వెన్న, పంచదార వేసి కరిగేవరకు బాగా కలపాలి. ఇందులో కోడిగుడ్లు పచ్చసొన వేసి కలపాలి. తెల్లసొనను విడిగా నురుగ వచ్చేలా గిలకొట్టాలి. ఈ వెన్న మిశ్రమంలో గుడ్ల మిశ్రమం, మైదాపిండిని ఒకదాని తరువాత ఒకటి వేసి కలుపుతుండాలి. చివరలో ఎసెన్స్ వేయాలి. క్యారమిల్ సిరప్ రాసిన కేక్ టిన్నులో పైనాపిల్ ముక్కలు దగ్గర దగ్గరగా అమర్చాలి. వీటి మధ్యభాగంలో చిన్న ముక్క తీసేసి అక్కడ చెర్రీపళ్లు పెట్టాలి. కలిపి సిద్ధంగా ఉంచిన కేక్ మిశ్రమాన్ని వేసి సమానంగా పరవాలి. ముందే వేడి చేసుకున్న 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత దగ్గర 50 నిముషాల పాటు బేక్ చేయాలి. చల్లారిన తరువాత టిన్నును ఒక పళ్లెంపై పెట్టి తిరగేసి, కేక్‌ను బయటకు తీస్తే పైనాపిల్ ముక్కలు పైకి కనపడుతూ కేక్ తయారవుతుంది. అడుగున పెట్టిన పళ్ల ముక్కలు పైకి వస్తాయన్నమాట. తర్వాత వైట్ బటర్, పైనాపిల్, చెర్రీ, చాకో స్టిక్స్‌తో అలంకరించుకోవాలి. ఎగ్‌లెస్ కేక్ కావాల్సినవి: మిల్క్‌మెయిడ్ – 400 గ్రాములు, పాలు – 300 మి.లీ, వైట్ బటర్ – 180 గ్రాములు, పంచదార – 15 గ్రాములు, మైదా – 250 గ్రాములు, వంట సోడా– చిటికెడు, బేకింగ్ పౌడర్– టీ స్పూన్, వెనీలా ఎసెన్స్ – 10 మి.లీ. తయారీ: మైదా, వంటసోడా, బేకింగ్ పౌడర్ కలిపి జల్లించుకోవాలి. దీనికి మిల్క్‌మెయిడ్, పాలు, వెనీలా ఎసెన్స్, చక్కెర, వైట్ బటర్ కలిపి చిక్కగా చేసుకోవాలి. అవెన్ని 150 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో వేడి చేసి, ఈ మిశ్రమం ఉన్న కేక్పాత్రను అవెన్‌లో 20 నిమిషాలు బేక్ చేసుకోవాలి. వాల్నట్కేక్ కావాల్సినవి: మైదా – పావుకేజీ, గుడ్లు – 6, పంచదార పొడి – 200 గ్రాములు, బేకింగ్ పౌడర్ – అర టీ స్పూన్, వంటసోడా – చిటికెడు, వైట్ బటర్ – పావుకేజీ, వాల్నట్స్– 25 గ్రాములు (పలుకులుగా చేయాలి) తయారీ: ఒక పెద్ద గిన్నెలో మైదా, బేకింగ్ పౌడర్, వంట సోడా వేసి జల్లించాలి. దీంట్లో బాగా గిలకొట్టిన గుడ్లసొన వేసి కలపాలి. తర్వాత పంచదార, బటర్, వాల్నట్ పలుకులు బాగా కలిపి, పక్కన ఉంచుకోవాలి. బేకింగ్ గిన్నె అడుగున కొద్దిగా బటర్ రాసి, ఆ తరువాత ఈ మిశ్రమాన్ని అందులో వేసి, సమానంగా చేయాలి. అవెన్‌లో 180 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 30–40 నిమిషాలు బేక్ చేసి, తీయాలి. పొడి చేసిన పంచదార పైన చల్లి, బటర్ రాసి, వాల్‌నట్స్‌తో అలంకరించాలి. -
భయంకరమైన తిండి!
వీడు భయంకరంగా తిండి తింటాడు. ఇది పెద్దలు సాధారణంగా వాడే మాట. కానీ, తినే పదార్ధాలను భయంకరంగా ఉండేలా చేస్తే ఎలా ఉంటుంది. ఆ పనే చేశాడు డే అనే ఓ చెఫ్. పెద్ద స్టార్ హోటల్ లో చెఫ్ గా పనిచేసే ఇతనికి సాధారణంగా వంటకాలు చేసి చేసి విసుగొచ్చింది. అందుకే పెద్దల సామెతకు వ్యతిరేకంగా కొన్ని రకాల వంటకాలను సిద్ధం చేసేశాడు. నరికిన మనిషి తల, బయటకు తీసిన మెదడు, నుంచుని చూస్తున్న దెయ్యం బాలుడు, పేడ పురుగు, బయటకు తీసిన గుండె, చర్మం వలిచిన పొట్టేలు తల ఇలా అచ్చం సహజంగా కనిపించే విధంగా కేక్ లు తయారుచేశాడు. ఇవి ఎంత సహజంగా ఉన్నాయంటే మాటల్లో చెప్పడం కంటే చూసి అనుభవిస్తేనే తెలుస్తుంది. -
ఇవ్వడంలోని ఆనందమే వేరు!
క్రిస్మస్ అంటే ఒకరికి ఇవ్వడంలో ఉండే సంతోషాలను అనుభవించడం. మరొకరికి సంతోషాలను పంచివ్వడంలో ఉండే ఆనందాన్ని పొందడం. నేను క్రిస్మస్ ద్వారా తెలుసుకున్నది... ఇవ్వడంలోని హాయిని అనుభూతి చెందడం. ఎందుకంటే... క్రిస్మస్ గురించి నాకు చిన్నప్పటి నుంచీ స్పష్టమైన జ్ఞాపకాలు ఉన్నాయి. క్రిస్మస్ అనగానే మా ఉపప్రధాన అధ్యాపకులు సుందరం మాస్టారు, విక్టోరియా టీచర్, విమలమ్మగారు, ఇంకా మా నాన్న కొలీగ్ మోజెస్ గారు... ఇలా చాలామంది గుర్తుకొస్తారు. ఆ పండుగ రోజున మా నాన్నగారు వాళ్లకు కేక్స్, ఫ్రూట్స్ పంపుతుండేవారు. అప్పటికి నా వయసు పదీ పన్నెండేళ్లు ఉండేది. ఆ తర్వాత నేను ఇంగ్లండ్ వెళ్లాక క్రిస్మస్ అంటే మళ్లీ గిఫ్ట్స్ ఇచ్చిపుచ్చుకోవడం జరుగుతుండేది. ఇక క్రిస్మస్ సమయంలో మా ‘హృదయ ఫౌండేషన్’కు ఎన్నెన్నో విరాళాలు పంపుతుంటారు. మనకు ఉన్నదానిలో ఇతరులకు ఏదైనా ఇచ్చినప్పుడు వాళ్ల సంతోషాన్ని చూసి మనం పొందే ఆనందం ఎలా ఉంటుందో చిన్నప్పుడు తెలుసుకున్నాను నేను. ఇలా హృదయ ఫౌండేషన్‌కు ఇవ్వడం ద్వారా ఇతరులూ అదే సంతోషాన్ని పొందుతున్నారనే విషయాన్ని ఇప్పుడు పెద్దయ్యాక సహానుభూతి వల్ల తెలుసుకోగలుగుతున్నాను. చిన్నప్పుడు వ్యక్తిగా ఇవ్వడంలోని ఆనందాన్ని తెలుసుకున్న నేను... పెద్దయ్యాక అదే విషయాన్ని డాక్టర్‌గా కూడా తెలుసుకున్నాను. ఒక్కమాటలో చెప్పాలంటే క్రిస్మస్ అంటే ‘ఇవ్వడం’. - డా॥గోపీచంద్ మన్నం కార్డియోథొరాసిక్ సర్జన్, స్టార్ హాస్పిటల్స్ -
కేక్... రొటీన్‌కు బ్రేక్
- ఠీఇంట్లోనే కేక్‌లు సిద్ధం - విభిన్న రుచుల్లో లభ్యం వేసవి కాలంలో ఇళ్లలోఉండే పిల్లలకు విభిన్న రుచులు చూపించేందుకు రెడీ అవుతున్నారు అమ్మలు. రోజూ అమ్మ చేతి వంట తినే పిల్లలు... సెలవులు కదా అని బయటకు తీసుకెళితే చిరుతిళ్ల కోసం మారాం చేస్తున్నారు. బేకరీ ఫుడ్ నోట్లో పడేదాకా నానా అల్లరి చేస్తున్నారు. అందుకే పిల్లలు అతిగా ఇష్టపడుతున్న కేకులు, స్వీట్లను ఇంట్లోనే రెడీ చేసి ఇవ్వాలనుకుంటున్న సిటీవాసులు... శిక్షణ సంస్థల బాట పడుతున్నారు. వీరి అభిరుచికి తగ్గట్టుగానే కేవలం ఒక రోజులోనే పూర్తి స్థాయి శిక్షణను ఇస్తున్నాయి వివిధ సంస్థలు. ఎగ్ఫ్రీ బేకింగ్, కేక్ డెకరేషన్, డిసార్ట్స్, డూనట్స్, చాక్లెట్ మేకింగ్, పెస్ట్రీలు, ట్రఫుల్, సాస్, ఫ్రూట్ కేక్, మ్యాంగో చాక్లెట్ కేక్, పైనాపిల్ పెస్ట్రీ నేర్చుకునేందుకు చాలా మంది మహిళలు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు బోయిన్‌పల్లిలోని టంక్డ్లైట్ నిర్వాహకురాలు ప్రియాంక టంక్. హోం బేకింగ్ అయితే ఎప్పటికప్పుడు తాజాగా... మన అభిరుచులకు అనుగుణంగా రెడీ చేసుకునే అవకాశముంటుందని అంటున్నారు. ఆసక్తి చూపుతున్నారు కప్‌కేక్స్, అసార్టెడ్ చాక్లెట్, కప్‌కేక్స్ బాక్సెస్, చాక్లెట్ థీమ్ బోటిక్, కప్ కేక్స్ థీమ్ బొటిక్, ముఫిన్స్, జెల్లీస్, 2-టైర్, 3-టైర్ వెడ్డింగ్ కేక్స్‌కు సిటీలో మంచి డిమాండ్ ఉంది. విభిన్న ఆకృతుల కేక్‌లు, చాక్లెట్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు సిటీవాసులు. పిల్లలు కూడా అవే ఇష్టపడుతున్నారు. అందుకే మేం ఈ చాక్లెట్, కేకుల తయారీలో శిక్షణ ఇస్తున్నామని చెబుతోంది ప్రియాంక టంక్. ‘ఆరోగ్యంతో పాటు ఫిట్నెస్ను కాపాడుకోవాలనుకుంటున్న సిటీవాసుల అభిరుచులను దృష్టిలో ఉంచుకొని డిఫరెంట్ కేకుల బేకింగ్‌లో శిక్షణ ఇస్తున్నాం. కేలరీ గురించి ఆందోళన చెందే వారికి జింజర్ బ్రెడ్ కేకులు, ఓట్మీల్ కేకులను రెడీ చేయిస్తున్నాం. హెల్తీ, ఫ్యాట్ ఫ్రీతో పాటు టేస్టీగా ఉండేలా చూస్తున్నాం. దీనికి సిటీవాసుల నుంచి మంచి స్పందన ఉంటుద’ంటున్నారు కేక్ డిజైనర్ ప్రియాంక. ఇవీ నా ఫేవరేట్... ‘బర్త్‌డేలు, వివాహ వేడుకలకు డిజైన్ చేసే కేకులు నా ఫేవరేట్. ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి స్పెషల్ మూమెంట్స్. అలాంటి వాటిలో నేను భాగస్వామ్యం అవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంటుంద’ని చెబుతున్నారు ప్రియాంక. ఎంతో మంది మహిళలకు చాక్లెట్ తయారీ, కేక్ బేకింగ్‌లో శిక్షణ ఇస్తున్నందుకు గర్వంగా ఉందంటున్నారు. పని ఒత్తిడి దూరం... ‘కేక్ బేకింగ్ పని ఒత్తిడిని దూరం చేస్తుంది. కొన్నిసార్లు థెరపటిక్గా కూడా పని చేస్తుంది. కార్పొరేట్ కంపెనీల్లో పనిచేసే వాళ్లు వీకెండ్లలో మా వద్ద శిక్షణకు వస్తున్నారు. ఐదు రోజుల పాటు పనిలో బిజీగా ఉండే వీరికి కేక్ బేకింగ్... ఆ ఒత్తిడి నుంచి దూరం చేస్తోంది. కొంత మంది శిక్షణ తీసుకున్న వారు ఉద్యోగాలకు రాజీనామా చేసి సొంతంగా వెంచర్‌ను ప్రారంభిస్తున్నవారు కూడా ఉన్నారంటున్నారు ప్రియాంక. ఆర్డర్లపై చాక్లెట్లు, కేకులను పంపిణీ చేస్తున్నామని వివరించారు. అభిరుచి నుంచి వృత్తి వైపు... ‘కేక్ బేకింగ్, చాక్లెట్ తయారీమంచి హాబీ. ఇంట్లో వారి కోసం ఎప్పుడూ చేస్తుండేదాన్ని. ఇలా ఒక రోజు వంట పోటీల్లో పాల్గొన్నా. ఆ అనుభవంతోనే నేను సొంతంగా వెంచర్‌ను ప్రారంభించాలకున్నా. సిటీలోని ఆరోరా కాలేజీ నుంచి ఎంబీఏ (ఫినాన్స్) పూర్తవగానే హాబీనే ప్రొఫెషన్‌గా మార్చుకున్నా. తొలినాళ్లలో కప్‌కేక్స్, చాక్లెట్లతో చిన్నగా ప్రారంభించా. కస్టమర్ల నుంచి వచ్చిన రెస్పాన్స్‌తో 2012లో టంక్డ్లైట్గా మార్చా’నంటారు ప్రియాంక. తయారీలో శిక్షణ... ఎగ్ఫ్రీ బేకింగ్, కేక్ డెకరేటింగ్, డిసార్ట్స్, డూనట్స్, చాక్లెట్ తయారీలో రెండు రోజుల వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాం. ఈ నెల 23, 24 తేదీల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు చాక్లెట్ కేక్‌లు, చాక్లెట్ డెకరేషన్, ట్రఫుల్, సాస్, ఫ్రూట్ కేక్, మ్యాంగో చాక్లెట్ కేక్, ఫైనాపిల్ పెస్ట్రీ, ఎగ్‌లెస్ చాక్లెట్ తయారీలో శిక్షణ ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. మరిన్ని వివరాలకు 90526 62545 నంబరులో సంప్రదించవచ్చు. -
బనానాతో భలే కేక్స్!
ఫుడ్ n బ్యూటీ అరటి పండు కేవలం మధురఫలమే కాదు.. శరీరానికి అవసరమైన పీచు పదార్థానికి మంచి వనరు కూడా. అరటిపండు తినడం వల్ల శరీరంలో ఉత్పత్తి అయ్యే మంచిబ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను శుద్ధి చేస్తుంది. అలాగే అరటిపండులో విటమిన్ బి, విటమిన్ సి, పొటాషియమ్లు అధికంగా ఉండి శరీరానికి మేలు చేస్తాయి. అలాంటి అరటిపండును ఉపయోగించి వండగల వంటకం బనానా పాన్ కేక్స్. తక్షణం శక్తిని అందించగల, ఎదిగే పిల్లల శారీరక అవసరానికి చాలా ఉపయుక్తమైన ఆహారం ఇది. అవసరమైనవి: అరటి పండ్లు- రెండు, మైదా ఒక కప్పు, ఎగ్ - ఒకటి, మిశ్రమం చేయడానికి తగినంత మజ్జిగ, ఒక టేబుల్ స్పూన్ చక్కెర, తేనె, ఫ్రై కోసం నూనె లేదా వెన్న. విధానం: మైదా, కోడి గుడ్డు, చక్కెర, మజ్జిగలను కలిపి ఉంచుకోవాలి. పాన్ ను హీట్ చేసి ఆ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు వేయించాలి. నూనెను ఉపయోగించుకొని పాన్ కేక్‌లను తయారు చేసుకోవాలి. నాలుగు నుంచి ఆరు పాన్కేక్లను తయారు చేసుకొని ఒకదానిపై మరోటి ఉంచుతూ వాటి మధ్యలో చిన్న స్లైస్‌లుగా కోసి ఉంచిన అరటిపండును ఉంచాలి. అలా అమర్చి ఉంచిన కేక్లపైన వేయించిన మిశ్రమాన్ని పోసి సర్వ్ చేసుకోవడమే. పోషకవిలువలు: ఈ పరిమాణంలోని బనానా పాన్కేక్స్తో 510 కిలో క్యాలరీల శక్తి, 14 గ్రాముల ప్రొటీన్లు, 3 గ్రాముల ఫైబర్, 10 గ్రాముల కొవ్వు, 143 గ్రాముల కొలెస్ట్రాల్ శరీరానికి అందుతాయి. -
అక్షరాలా రూ.10 కోట్లు
- కేకులు, పూలకు రూ. 2 కోట్లు - విందుకు రూ. 2 కోట్లకుపైనే - మద్యానికి రూ. 5 కోట్లు.... ఇతరాలకు రూ. కోటి - నూతన సంవత్సర వేడుకలకు జిల్లా వాసులు చేసిన ఖర్చు కడప కల్చరల్ : నూతన సంవత్సరం సందర్భంగా సంతోషంగా గడిపేందుకు జిల్లా వాసులు 24 గంటల్లో చేసిన ఖర్చు రూ. 10 కోట్లు. నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ ఆ రోజును జీవితంలో మరుపురాని విధంగా మలుచుకోవాలని 2014 డిసెంబరు 31 వతేదీ మధ్యాహ్నంనుంచి 2015 జనవరి 1వ తేదీ వరకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసుకుని బంధుమిత్రులతో విందులు, వినోదాలతో సంతోషంగా గడిపారు. ఇందులో ముఖ్యంగా యువతదే ప్రథమస్థానం. డిసెంబరు 31వ తేదీ రాత్రి జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వినోద, సాంసృ్కతిక కార్యక్రమాల కోసమే ప్రజలు దాదాపు రూ. కోటి ఖర్చు చేశారు. నూతన సంవత్సరం ప్రారంభ దినాన సంతోషంగా గడిపితే ఈ సంవత్సరమంతా అదే ఆనందం కొనసాగుతుందన్న నమ్మకంతో ఖర్చు గురించి ఆలోచించలేదు. డిసెంబరు 31వ తేదీ రాత్రి 10 గంటల నుంచి మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు, లాడ్జీలు సందడిగా మారాయి. మద్యం షాపుల్లో రాత్రి 12.30 గంటల వరకు గ్లాసుల గలగల వినిపించింది. అర్ధరాత్రి 12.30 గంటల తర్వాత రోడ్లపై ఎలాంటి కార్యక్రమాలను అనుమతించబోమని, వేడుకలన్నీ ఈలోపుగానే నిర్వహించుకోవాలని పోలీసులు ప్రత్యేకంగా హెచ్చరించడంతో గడువులోపే సంబరాలు ముగించుకున్నారు. పోలీసుల హెచ్చరికల ప్రభావంతో తెల్లవార్లు జరగాల్సిన ప్రత్యేక సంబరాలకు అడ్డుకట్ట పడినట్లయింది. ఫలితంగా నూతన సంవత్సర వేడుకల ఖర్చుకూడా ఒకింత తగ్గింది. -
క్రిస్మస్ కళ
-
సిసిలియన్ స్పైరల్ పాస్తా కేక్
-
కాఫీ అండ్ ప్రూన్
-
కెవ్వు కేక్