దట్టంగా మంచుకురిసే రాత్రి జీసస్ పుట్టాడు. ఎంత తీపి కబురు. అందరి నోరూ తీపి చేయాల్సిన కబురు. ఏం చేద్దాం. కేక్ చేద్దాం. ఏం కేక్. ప్లమ్ కేక్, రమ్ కేక్, చాక్లెట్ కేక్, మార్బుల్ కేక్... కేక్‌ల పండుగుల ఇది. ఒకరికి కేక్ పంచి సంతోషించే పండుగ. ఎప్పుడూ కొనడమేనా. ఈసారి చేయొచ్చుగా?
ట్రిపుల్ లేయర్ చాకొలేట్ కేక్
ఈ కేకును తయారుచేయడం కొంచెం కష్టమే. కాని ఇది పూర్తయ్యాక చూసుకుంటే అలసట అంతా మరచిపోవచ్చు. ఇక తిన్నాక, నోటి నుంచి మాటలు రావు. అంత ఆనందంగా ఆస్వాదిస్తూ తింటారు ఈ కేక్‌ని.
కావలసినవి: మొదటి లేయర్ కోసం: మైదా పిండి – ఒకటిన్నర కప్పులు; బేకింగ్ పౌడర్ – ముప్పావు టీ స్పూను; బేకింగ్ సోడా – అర టీ స్పూను, ఉప్పు – పావు టీ స్పూను; బటర్ – అర టీ స్పూను; పంచదార – ముప్పావు కప్పు; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ – అర టేబుల్ స్పూను; కోడి గుడ్లు – 2; బటర్ మిల్క్ – ముప్పావు కప్పు.
బటర్ క్రీమ్ కోసం: పంచదార – ఒక కప్పు; కోడిగుడ్డు తెల్ల సొనలు – 4; నిమ్మరసం – అర టీ స్పూను; ఉప్పు – చిటికెడు; బటర్ – ఒక కప్పు.
కుకీ డఫ్ లేయర్ కోసం: మొలాసెల్ – 2 టీ స్పూన్లు; చాకొలేట్ చిప్స్ – పావు కప్పు. ఓరియో లేయర్ కోసం: ఓరియో బిస్కెట్స్ (బ్రౌన్ కలర్) – 3
బ్రౌనీ లేయర్ కోసం: డచ్ ప్రోసెస్డ్ కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు
గార్నిషింగ్ కోసం: బ్రౌనీ కుకీస్, ఓరియోలు (టాపింగ్ కోసం) – 2 టేబుల్ స్పూన్లు; గనాచే (కుకింగ్ చాకొలేట్ + పాలు కలిపి తయారుచేసినది) – 2 కప్పులు.
తయారీ:
►350 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి
►తొమ్మిది అంగుళాల కేక్ పాన్‌ను బటర్, మైదాలతో గ్రీజ్ చేయాలి
►ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి
►మరొక పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా గిలకొట్టి క్రీమ్ తయారుచేసుకోవాలి
►కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ జత చేసి మరోమారు బీటర్‌తో బాగా గిలకొట్టాలి
►మైదా పిండిలో సగ భాగాన్ని జత చేయాలి
►సగం బటర్ మిల్క్ జత చేసి గిలకొట్టాక, మిగిలిన మైదా పిండి, బటర్ మిల్క్ జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి
►ఈ మిశ్రమాన్ని మూడు సమాన భాగాలుగా విడదీసి, ఒక్కో లేయర్‌కు తీసుకున్న పదార్థాలను ఒక్కో దానికి విడివిడిగా జత చేయాలి
►కేక్‌పాన్‌లో ఒక లేయర్ తరవాత మరొక లేయర్‌కి కలుపుకున్న మిశ్రమాలను జాగ్రత్తగా వేసి, అవెన్‌లో ఉంచి సుమారు 35 నిమిషాలు బేక్ చేయాలి.
బటర్ క్రీమ్ కోసం: ఒక సాస్‌పాన్‌లో కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి ∙వేరొక పాత్రలో పంచదార, కోడిగుడ్డు తెల్ల సొన నిమ్మ రసం, ఉప్పు వేసి ఆ పాత్రను మరుగుతున్న నీళ్ల గిన్నెలో ఉంచాలి ∙పదార్థాలన్నీ వేడెక్కి, పంచదార కరిగేవరకు కలిపి దింపేసి, ఈ మిశ్రమాన్ని బటర్‌లో వేసి కొద్దిసేపు కలియబెట్టాలి (ఇలా చేయడం వల్ల మృదువుగా అయ్యి, కేక్ మీద సమానంగా వేయటానికి సులువుగా ఉంటుంది) ∙బేక్ చేసుకున్న కేక్ బేస్‌ను బయటకు తీసి, మొదటి లేయర్‌ను ఒక ప్లేట్‌లో ఉంచాలి ∙బటర్ క్రీమ్‌ను అర అంగుళం మందంలో మొదటి లేయర్ మీద సమానంగా పోయాలి ∙రెండవ లేయర్‌ను ఉంచి దాని మీద కూడా ఇదే విధంగా చేసి, మూడో లేయర్‌ను ఉంచాలి ∙గనాచేతో అలంకరించాలి ∙టాపింగ్స్ కోసం తీసుకున్న వాటిని కూడా జత చేయాలి.
మార్బుల్ కేక్
ఈ కేక్‌కి తయారుచేసే బేస్‌ని చాకొలేట్ మార్బుల్ అంటారు. ఎవరి ఆలోచనకు వారు పదును పెట్టుకుని, మిక్స్‌డ్ ఫ్రూట్ జామ్ లేదా తాజా పండ్లు... బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు ఏవైనా సరే... బ్యాటర్‌కి జత చేస్తే –
కేక్ కలర్‌ఫుల్‌గా వస్తుంది.
కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – 2 టీ స్పూన్లు; పంచదార పొడి – ఒక కప్పు కంటె ఎక్కువ; ఉప్పు – చిటికెడు; బటర్ – అర కప్పు (సాల్టెడ్ బటర్ వాడుతుంటే ఉప్పును ఉపయోగించక్కర్లేదు); కోడి గుడ్లు – 2; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ – ఒక టీ స్పూను; ఫుడ్ కలర్ – చిటికెడు; పాలు – ఒక కప్పు; కోకో పొడి – 3 టేబుల్ స్పూన్లు
తయారీ:
►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి
►కేక్ పాన్‌ను బటర్ తో గ్రీజ్ చేయాలి
►ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార పొడి, బటర్, కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎసెన్స్, పాలు వేసి బాగా గిలకొట్టాలి (అన్నీ కలిసి బాగా మెత్తగా అయ్యేవరకు గిలకొడితే కేక్ స్మూత్‌గా వస్తుంది)
►సగం కంటె ఎక్కువ భాగాన్ని కేక్ పాన్‌లో పోయాలి
►ఆ పైన వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌ను, ఫుడ్ కలర్ మిశ్రమం, కోకో పొడి ఒక దాని మీద ఒకటి పోయాలి
►చాకుతో కాని ఒక పుల్లతో కాని ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా సరిచేయాలి (మార్బుల్ ఎఫెక్ట్ వచ్చేలాగ)
►అవెన్‌లో ఉంచి సుమారు 40 నిమిషాలు బేక్ చేయాలి
►బయటకు తీసి చల్లారాక సర్వ్ చేయాలి.
యూలే ద లాగ్
చాలామందికి ప్లమ్ కేక్, రమ్ కేక్ తెలుసు. మీరెప్పుడైనా యూలే ద లాగ్ కేక్ తయారుచేసుకున్నారా! ఇది చూడటానికి చెక్క దూలంలాగ ఉంటుంది. అందువల్ల ఈ కేక్‌ను చూడగానే సంతోషంతో పాటు సెలవును ఆస్వాదిస్తున్న భావన కూడా కలుగుతుంది.
కావలసినవి:
కేక్ కోసం: కోడి గుడ్లు – 6; పంచదార – ముప్పావు కప్పు; కోకో పొడి – అర కప్పు; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ – ఒక టీ స్పూను
ఐసింగ్ కోసం: డార్క్ చాకొలేట్ తురుము – ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; పంచదార – ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; సాఫ్ట్ బటర్ – ఒక కప్పు; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ – ఒక టేబుల్ స్పూను.
అలంకరించడం కోసం: 2 టేబుల్ స్పూన్ల పంచదార, పార్లే జి బిస్కెట్స్, ఎరుపు రంగు ఫుడ్ కలర్ (చెర్రీలు తయారుచేయడానికి); మెరింగ్ మష్రూమ్స్, చాకొలేట్ సాయిల్, క్రిస్మస్ ట్రీ పుల్లలు
తయారీ:
►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి
►ఒక పెద్ద పాత్రలో కోడి గుడ్డు తెల్ల సొనలను వేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి
►బాగా మెత్తగా అయిన తరవాత పావు కప్పు పంచదార కొద్దికొద్దిగా వేస్తూ మళ్లీ గిలకొడుతుండాలి
►వేరొక పాత్రలో కోడిగుడ్డు పచ్చ సొనలను వేసి పంచదార జత చేస్తూ గిలకొట్టాలి
►వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ జత చేయాలి ∙కోకో పొడిని జల్లెడ పట్టి, మెత్తటి పొడిని కొద్దికొద్దిగా జత చేస్తూ గిలకొట్టాలి
►కోడి గుడ్డు తెల్ల సొన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా జత చేస్తూ, అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి (ఎంత ఎక్కువసేపు గిలకొడితే అంత మెత్తగా వస్తుంది కేక్)
►నలుచదరం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కేక్‌పాన్‌లో బేకింగ్ షీట్ లేదా ఫాయిల్ (కింద కొద్దిగా పంచదార వేస్తే కేక్ అతుక్కోకుండా తేలికగా వస్తుంది) ఉంచి, దాని మీద ఈ మిశ్రమాన్ని సమానంగా పరిచి, అవెన్‌లో ఉంచి, సుమారు 20 నిమిషాల పాటు బేక్ చేయాలి
►చల్లారిన తరవాత, జాగ్రత్తగా ప్లేట్‌లోకి తీసుకోవాలి.
ఐసింగ్‌తయారీ:
►చాకొలేట్‌ను ముందుగా కరిగించాలి (మైక్రోవేవ్‌లోకాని వేడి నీళ్ల మీద కాని)
►ఒక పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా గిలకొట్టాలి
►కరిగించిన చాకొలేట్, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ జత చేసి మెత్తగా వచ్చేవరకు కలుపుతుండాలి
►బాగా మెత్తగా అయిన తరవాత కేక్ మీద సమానంగా పరిచి, కేక్‌ను (ఫాయిల్‌తో) నెమ్మదిగా రోల్ చేయాలి (వదులుగా కాకుండా టైట్‌గా వచ్చేలా జాగ్రత్తగా రోల్ చేసి, చివరగా ప్రెస్ చేయాలి)
►అంచులను జాగ్రత్తగా కట్ చేయాలి
►మిగిలిన భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి
►అంతే!!! అందమైన కేక్ సిద్ధమైనట్లే.
సాల్టెడ్ క్యారమెల్ షీట్ కేక్
కావలసినవి: మైదా పిండి – రెండు కప్పుల కంటె కొద్దిగా ఎక్కువ; బటర్ – ఒక కప్పు; పంచదార – అర కప్పు; బ్రౌన్ సుగర్ – ఒక కప్పు ; పెద్ద కోడిగుడ్లు – 2; వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు; తాజా పెరుగు – అర కప్పు; బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; చిక్కటి పాలు (హోల్ మిల్క్) – ఒక కప్పు.
తయారీ:
►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి
►12 అంగుళాల చతురస్రాకారంలో ఉన్న కేక్ పాన్‌లను ముందుగా కొద్దిగా బటర్‌తో గ్రీజ్ చేయాలి
►ఒక పెద్ద పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా కలిపి, మెత్తగా వచ్చేవరకు గిలకొట్టాలి
►కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎక్స్‌ట్రాక్ట్, పెరుగు జత చేసి మరోమారు గిలకొట్టాలి
►మరొక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలిపి, సగ భాగాన్ని కోడి గుడ్డు మిశ్రమానికి జత చేయాలి
►అర కప్పు పాలు జత చేసి నెమ్మదిగా గిలకొట్టాలి
►మిగిలిన పిండిని జత చేస్తూ, మిశ్రమం మెత్తగా వచ్చేలా బాగా బీట్ చేయాలి
►ట్రేలో పోసి, అవెన్‌లో ఉంచి 25 నిమిషాల పాటు బేక్ చేయాలి
►బయటకు తీసి, చల్లారాక, సాల్టెడ్ కారమెల్‌ను పైన చల్లి అందించాలి.
కేక్ పాప్స్
కావలసినవి: కేక్ పాప్స్ కోసం: పొడిపొడిగా మిగిలిపోయిన కేక్ (క్రంబ్‌ల్డ్ కేక్) – 2 కప్పులు; హెవీ క్రీమ్ – ఒక కప్పు
కోటింగ్ కోసం: తగినంత డార్క్ చాకొలేట్ లేదా వైట్ చాకొలేట్; తగినంత నట్స్ పొడి; కార్డ్‌బోర్డ్ బాక్స్.
తయారీ:
►ఒక పాత్రలో క్రీమ్, క్రంబ్‌ల్డ్ కేక్ వేసి బాగా కలపాలి (ఈ పొడి కొద్దిగా ఎక్కువ ఉన్నా పరవాలేదు)
►రెండు అంగుళాల పరిమాణంలో బాల్స్‌లా చేతితో చేసి, పొడవాటి పుల్లలకు గుచ్చి, పక్కన పెట్టాలి
►డార్క్ చాకొలేట్ లేదా వైట్ చాకొలేట్‌ను కరిగించాలి (ఒక మామూలు గిన్నెలో వీటిని ఉంచి, మరుగుతున్న గిన్నె మీద ఈ గిన్నె ఉంచి కరిగించాలి)
►కరుగుతున్న చాకొలేట్ లో కేక్ బాల్స్ పుల్లలను ముంచి, తీసేసి, కార్డ్ బోర్డు మీద ఉంచాలి
►నట్స్ పొడి చల్లాలి
►చల్లారాక అందించాలి (వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే నాలుగైదు రోజుల వరకు చెడి పోకుండా ఉంటాయి)
Comments
Please login to add a commentAdd a comment