maidapindi
-
నిజంగానే మైదాపిండి మంచిదికాదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే..!
పరోటాలు దగ్గర నుంచి పిజ్జా, బర్గర్, కేక్స్, గులాబ్ జామున్, జిలేబీ వంటి పలు రకాల స్వీట్లను మైదాతోనే తయారు చేస్తారు. ఆఖరికి సాయంత్రం వేళ్ల టీ తాగుతూ తినే బిస్కెట్లు, సమోసాల్లో కూడా మైదా ఉంటుంది. రోగులకు ఇచ్చే బ్రెడ్లలో కూడా మైదా ఉంటుంది. అంటే మన నిత్య జీవితంలో ఏదో రకంగా తెలియకుండానే మైదాను తీసుకుంటున్నాం. అలాంటిది మరీ మైదా మంచిదికాదని చాలామంది చెబుతున్నారు. ఇది ఎంత వరకు నిజం? వైద్యులు ఏమంటున్నారు ? ఎవరెవరు తినకూడదు అంటే.. మైదాని ఎలా తయారు చేస్తారంటే.. బియ్యంలో మూడు దశలు ఉంటాయి. ఊక, బ్రాన్, బియ్యం. ఊకను తొలగించాక పైపొర (బ్రాన్)తో ఉండే బియ్యాన్ని బ్రౌన్ రైస్ అని పిలుస్తారు. ఈ పైపొరను కూడా తొలిగిస్తే పాలిష్డ్ రైస్ అని అంటారు. అలాగే గోదుమల విషయానికొస్తే పైపొట్టు (ఊక), పైపొర(బ్రాన్)తో కూడిన గోదుమ, పాలిష్డ్ గోదుమ అనే మూడు దశలు ఉంటాయి. ఊకను తొలగించి బ్రాన్‌తో కూడిన ధాన్యాన్ని గోదుమలుగా పిలుస్తారు. గోదుమ నుంచి బ్రాన్ను కూడా తీసేసి బాగా మెత్తగా పిండిలా చేస్తే దాన్నే మైదా అని అంటారు. విదేశాల్లో దీన్నే ఆల్ పర్పస్ ఫ్లోర్ అని పిలుస్తారనిని న్యూట్రీషియన్లు వివరించారు. గోధమ రవ్వకు, మైదాకు తేడా ఏంటంటే.. బ్రాన్ను తొలగించిన గోదుమ నుంచే రవ్వ తయారవుతుంది. కాకపోతే మైదాలా దీన్ని బాగా మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేస్తారు. కాబట్టి, ఈ రెండింటికీ పెద్ద తేడా లేదు. రెండూ పైపొర తీసేసిన గోదుమ నుంచే తయారవుతాయి. అందువల్ల మైదాను ఎక్కువగా తినడం కచ్చితంగా ఆరోగ్యానికి మంచిది కాదు. అలా అని చెప్పి మైదా విషయంలో అతిగా భయపడాల్సిన అవసరం కూడా లేదని చెప్పారు. తెలుపు రంగుకి కారణం.. మైదాకు తెలుపు రంగు రావడం కోసం బ్లీచ్‌ను వాడతారు. బ్లీచ్ చుట్టూ చాలా వివాదాలు ఉన్నాయి. బ్లీచ్ అనేది ఆక్సీకరణ (ఆక్సిడేషన్) ప్రక్రియ. ఈ ప్రక్రియ గురించి మనం స్కూల్లోనే నేర్చుకున్నాం. ఈ ప్రక్రియ ద్వారా గోదుమల నుంచి బ్రౌన్ రంగును తొలగించవచ్చు. బ్లీచ్ ప్రక్రియలో బ్లీచింగ్ ఏజెంట్లుగా క్లోరిన్, బెంజాయిల్ పెరాక్సైడ్ వంటి రసాయనాలను వాడతారు. ఈ రసాయనాలను ఎంత మోతాదులో వాడాలనే అంశంపై కొన్ని పరిమితులు ఉన్నాయి. సరైన పరిమాణంలో ఈ రసాయనాలను వాడాలి. బ్లీచింగ్ ప్రక్రియ అంతా పూర్తిచేసుకొని వినియోగానికి అందుబాటులోకి వచ్చిన మైదాలో ఎలాంటి రసాయనాలు ఉండవని ఆహార నిపుణులు చెబుతున్నారు మైదా వల్ల షుగర్ వస్తుందా.. మైదాను బ్లీచింగ్ చేసినప్పుడు, అలోక్సాన్ అనే రసాయనం కలుస్తుంది. ఈ రసాయనం వల్ల డయాబెటిస్ వస్తుందని చెబుతారు. నిజానికి అలోక్సాన్ విషయానికొస్తే, మైదా బ్లీచింగ్ ప్రక్రియలో అదనంగా దీన్ని కలపరు. ఆక్సీకరణ ప్రక్రియలో భాగంగా బై ప్రోడక్ట్‌గా అలోక్సాన్ ఉత్పత్తి అవుతుంది. మైదాలో చాలా స్వల్ప పరిమాణంలో అలోక్సాన్ ఉంటుంది. పరిశోధనల్లో భాగంగా ఎలుకల్లో ఈ అలోక్సాన్ రసాయనాన్ని వాడి కృత్రిమంగా మధుమేహాన్ని ప్రేరేపిస్తారు. దీని కారణంగా మనకు కూడా షుగర్ వస్తుందేమో అని భయపడతారు. కానీ, అధ్యయనాల్లో వాడే అలోక్సాన్, మైదాలో ఉండే అలోక్సాన్ కంటే 25 వేల రెట్లు శక్తిమంతమైనదని గ్రహించాలి. అందువల్ల ఈ రెండింటిని పోల్చకూడదు. మైదాలో ఏముంటాయంటే.. ‘గోదుమ నుంచి తయారు చేసిన మైదాలో పిండిపదార్థం అధికంగా ఉంటుంది. ఉదాహరణకు, 100 గ్రాముల మైదాలో 351 కేలరీలు ఉంటాయి. 10.3 గ్రాముల ప్రొటీన్, 0.7 గ్రాముల కొవ్వు, 2.76 గ్రాముల ఫైబర్, 74.27 గ్రాముల స్టార్చ్ ఉంటుందని చెబుతున్నారు న్యూటిషియన్లు. (చదవండి: అరవింద్ కేజ్రీవాల్ మామిడి పండ్ల డైట్..షుగర్ పేషెంట్లకు మంచిదేనా..?) -
Recipe: మైదాపిండి, పంచదార.. కిస్మిస్ డోనట్స్ తయారు చేసుకోండిలా!
రొటీన్ స్వీట్స్ బోర్ కొడితే మైదాపిండితో కిస్మిస్ డోనట్స్ తయారు చేసుకోండిలా! కావలసినవి: ►మైదాపిండి – 2 కప్పులు ►పంచదార పొడి – 1 కప్పు ►వైట్ వెనిగర్, వెనీలా ఎసెన్స్ ►బేకింగ్ సోడా – 1 టీ స్పూన్ చొప్పున ►ఉప్పు – అర టీ స్పూన్ ►మజ్జిగ – ముప్పావు కప్పు ►గుడ్లు – 2 ►కిస్మిస్ – 1 కప్పు (నానబెట్టి మిక్సీ పట్టి, మెత్తటి గుజ్జులా చేసుకోవాలి) ►నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ►అందులో మైదాపిండి, పంచదార పొడి, బేకింగ్ సోడా, మజ్జిగ, వెనీలా ఎసెన్స్, గుడ్లు, నూనె, వైట్ వెనిగర్, కిస్మిస్ గుజ్జు, తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. ►డోనట్స్ మేకర్‌కి కొద్దిగా నూనె పూసి, ఆ మిశ్రమాన్ని కొద్దికొద్దిగా పెట్టుకోవాలి ►ఓవెన్లో వాటిని బేక్ చేసుకోవాలి. ►అభిరుచిని బట్టి చాక్లెట్స్ క్రీమ్, డ్రైఫ్రూట్స్‌తో నచ్చిన విధంగా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: బంగాళదుంప, శనగపిండి, బియ్యప్పిండితో మరమరాల పకోడా! Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా -
Recipe: మొక్కజొన్న, మైదాపిండితో.. నోరూరించే బొప్పాయి హల్వా!
మొక్కజొన్న పిండి, మైదాపిండితో బొప్పాయి హల్వా ఇలా తయారు చేసుకోండి. కావలసినవి: ►బొప్పాయి – 1(ఒక కేజీ) ►మొక్కజొన్న పిండి, మైదాపిండి – పావు కప్పు చొప్పున ►పంచదార – ముప్పావు కప్పు, చిక్కటి పాలు – 2 కప్పులు ►నెయ్యి – 6 టేబుల్ స్పూన్ల పైనే ►కొబ్బరి తురుము – గార్నిష్ కోసం తయారీ విధానం: ►ముందుగా బొప్పాయి తొక్క, లోపల గింజలు తీసి.. మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ►దానిలో మొక్కజొన్న పిండి, మైదాపిండి, పంచదార, చిక్కటి పాలు పోసుకుని బాగా కలిపాలి. ►పంచదార కరిగేంత వరకూ కలిపి.. కళాయిలో పోసుకుని.. చిన్న మంట మీద.. ఆ మిశ్రమాన్ని గరిటెతో కలుపుతూ ఉండాలి దగ్గరపడేంత వరకూ. ►మధ్య మధ్యలో ఒక టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేస్తూ ఉండాలి. ►దగ్గర పడిన తర్వాత మిగిలిన నెయ్యి మొత్తం వేసుకుని, బాగా కలిపి.. స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ►ఒక బౌల్‌కి నెయ్యి రాసి.. అందులో ఈ మిశ్రమాన్ని వేసుకుని.. చల్లారనివ్వాలి. ►ఆపై నచ్చిన షేప్‌లో ముక్కలు కట్ చేసుకుని కొబ్బరి తురుముతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Makka Sattu Muddalu: మక్క సత్తు ముద్దలు తిన్నారా? ఇలా తయారు చేసుకోండి! ఆరోగ్య ప్రయోజనాలివే! Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
Recipe: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా!
గోధుమ పిండి.. మైదా పిండితో చిలగడదుంపల పూరీ తయారీ విధానం మీకోసం! చిలగడదుంపల పూరీ తయారీకి కావలసినవి: ►చిలగడదుంపలు – 2 (కుకర్‌లో మెత్తగా ఉడికించుకుని, పైతొక్క తొలగించి, గుజ్జులా చేసుకోవాలి.) ►గోధుమ పిండి –2 కప్పులు ►గోరువెచ్చని నీళ్లు – సరిపడా ►మైదాపిండి – 1 టేబుల్ స్పూన్ ►కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు ►కారం – 1 టీ స్పూన్ ►పసుపు – చిటికెడు ►గరం మసాలా – 1 టీ స్పూన్ ►ఉప్పు – తగినంత ►నూనె – సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ►అందులో చిలగడదుంప గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ►సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ►20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. ►ర్వాత కళాయిలో నూనె కాగించి దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mutton Keema Cheese Samosa: మటన్ కీమా- చీజ్ సమోసా తయారీ ఇలా! Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్ తయారీ ఇలా! -
పైనాపిల్ కేక్ ఇంట్లోనే ఇలా ఎంచక్కా తయారు చేసుకోండి!
పైనా‘పిల్’ను తింటే వేరుగా ఏ ‘పిల్’ తీసుకోవాల్సిన అవసరం లేదని చాలా మంది చమత్కరిస్తూ ఉంటారు. దీనిని ఆరోగ్యాల ఆవాస కేంద్రం అని కూడా చెబుతుంటారు. పైనాపిల్ తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఒనగూరుతాయి. అయితే, ఎప్పుడూ రొటీన్‌గా పైనాపిల్ ముక్కలు తినడం, జ్యూస్ తాగడం వంటివి కాకుండా ఇలా ఎంచక్కా కేక్ చేసుకుని తినండి! పైనాపిల్ కేక్ కావలసినవి: బ్రౌన్ సుగర్ పౌడర్ – 150 గ్రాములు అన్ సాల్టెడ్ బటర్ – 175 గ్రాములు, పైనాపిల్ స్లైస్, చెర్రీస్ – 20 చొప్పున మైదాపిండి – ఒకటిన్నర కప్పులు, బేకింగ్ పౌడర్ – ఒకటిన్నర టీ స్పూన్లు ఉప్పు – పావు టీ స్పూన్, పంచదార పొడి – అర కప్పు, గుడ్లు – 2 వెనీలా ఎక్స్ట్రాక్ట్ – 1 టీ స్పూన్, సోర్ క్రీమ్, పాలు, పైనాపిల్ జ్యూస్ – పావు కప్పు చొప్పున తయారీ: ముందుగా ఒక బౌల్లో 60 గ్రాముల కరిగించిన బటర్ వేసుకుని.. అందులో 100 గ్రాముల బ్రౌన్ సుగర్ పౌడర్ వేసుకుని బాగా కలిపాలి. ఆ మిశ్రమాన్ని గుండ్రటి షేప్‌లో ఉండే కేక్ బౌల్లో అర అంగుళం మందంలో విస్తరించాలి. దానిపైన గుండ్రటి పైనాపిల్ స్లైస్, చెర్రీతో డెకరేట్ చేసుకుని ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అనంతరం పెద్ద బౌల్ తీసుకుని మైదాపిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు వేసుకుని బాగా కలిపి ఉంచుకోవాలి. ఈలోపు మరో బౌల్లో మిగిలిన బటర్, బ్రౌన్ సుగర్, పంచదార పొడి వేసుకుని హ్యాండ్ బ్లెండర్ సాయంతో క్రీమ్‌లా చేసుకోవాలి. అందులో గుడ్లు పగలగొట్టి వేసుకుని మరింత మెత్తటి క్రీమ్‌లా చేసుకోవాలి. మధ్యమధ్యలో మైదా–బేకింగ్ పౌడర్ మిశ్రమాన్ని వేసుకుంటూ.. సోర్ క్రీమ్, పాలు, పైనాపిల్ జ్యూస్ కొద్దికొద్దిగా వేసుకుంటూ హ్యాండ్ బ్లెండర్తో మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రిజ్‌లో పెట్టుకున్న కేక్ మేకర్ బౌల్ తీసుకుని దాని నిండుగా ఈ మిశ్రమాన్ని వేసుకుని సమాంతరంగా చేసుకుని ఓవెన్లో బేక్ చేసుకోవాలి. ఆ తర్వాత నచ్చిన విధంగా కలర్‌పుల్ క్రీమ్స్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. -
ఈ పదార్థాలు ఉంటే చాలు.. ఈజీ పొటాటో స్నాక్.. టేస్టు అదిరిపోద్ది!
ఆలు చిప్స్ తినీతిని బోర్ కొట్టిందా! అయితే, బంగాళా దుంపతో ఈ వైరైటీ వంటకాన్ని ట్రై చేయండి. రొటీన్‌కు భిన్నంగా పొటాటో టోర్నడో రుచిని ఆస్వాదించండి. పొటాటో టోర్నడో తయారీకి కావాల్సిన పదార్థాలు: ►బంగాళ దుంపలు – 4 లేదా 5 ►మైదాపిండి – అర కప్పు ►మొక్కజొన్నపిండి – 1 టేబుల్ స్పూన్ ►బేకింగ్ సోడా – అర టీ స్పూన్ ►ఉప్పు – కొద్దిగా, నీళ్లు – కావాల్సినన్ని ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా ►గార్లిక్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ►చీజ్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►చీజ్ సాస్ – 4 టేబుల్ స్పూన్ల పైనే ►డ్రై పార్సీ – అర టేబుల్ స్పూన్ ►ఎండు మిర్చి పొడి – 1 టేబుల్ స్పూన్ తయారీ: ముందుగా ఒక బౌల్లో గార్లిక్ పౌడర్, చీజ్ తురుము, డ్రై పార్సీ.. వేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కో బంగాళదుంపను ఒక్కో పొడవాటి పుల్లకు గుచ్చి.. చాకుతో స్ప్రిల్స్లా (వలయంలా, మొత్తం కట్ చెయ్యకుండా చిత్రంలో ఉన్న విధంగా) కట్ చేసుకుని పెట్టుకోవాలి. ►అనంతరం వెడల్పుగా ఉండే బౌల్లో మైదాపిండి, మొక్కజొన్నపిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసుకుని కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పలుచటి మిశ్రమంలా చేసుకోవాలి. ►ఆ మిశ్రమంలో ఒక్కో పొటాటో స్ప్రింగ్‌ని ముంచి.. నూనెలో దోరగా వేయించాలి. అనంతరం వాటిని వరుసగా పెట్టుకుని.. అటు ఇటు తిప్పుతూ గార్లిక్–చీజ్ మిశ్రమాన్ని చల్లుకోవాలి. ►ఆ పైన చీజ్ సాస్ స్ప్రిల్స్ పొడవునా స్ప్రెడ్ చేసుకుని.. చివరిగా ఎండుమిర్చి పొడిని చల్లి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి: Summer Drink: సుగంధ షర్బత్ ఎలా తయారు చేస్తారో తెలుసా? -
స్వీట్ క్రిస్మస్
దట్టంగా మంచుకురిసే రాత్రి జీసస్ పుట్టాడు. ఎంత తీపి కబురు. అందరి నోరూ తీపి చేయాల్సిన కబురు. ఏం చేద్దాం. కేక్ చేద్దాం. ఏం కేక్. ప్లమ్ కేక్, రమ్ కేక్, చాక్లెట్ కేక్, మార్బుల్ కేక్... కేక్‌ల పండుగుల ఇది. ఒకరికి కేక్ పంచి సంతోషించే పండుగ. ఎప్పుడూ కొనడమేనా. ఈసారి చేయొచ్చుగా? ట్రిపుల్ లేయర్ చాకొలేట్ కేక్ ఈ కేకును తయారుచేయడం కొంచెం కష్టమే. కాని ఇది పూర్తయ్యాక చూసుకుంటే అలసట అంతా మరచిపోవచ్చు. ఇక తిన్నాక, నోటి నుంచి మాటలు రావు. అంత ఆనందంగా ఆస్వాదిస్తూ తింటారు ఈ కేక్‌ని. కావలసినవి: మొదటి లేయర్ కోసం: మైదా పిండి – ఒకటిన్నర కప్పులు; బేకింగ్ పౌడర్ – ముప్పావు టీ స్పూను; బేకింగ్ సోడా – అర టీ స్పూను, ఉప్పు – పావు టీ స్పూను; బటర్ – అర టీ స్పూను; పంచదార – ముప్పావు కప్పు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – అర టేబుల్ స్పూను; కోడి గుడ్లు – 2; బటర్ మిల్క్ – ముప్పావు కప్పు. బటర్ క్రీమ్ కోసం: పంచదార – ఒక కప్పు; కోడిగుడ్డు తెల్ల సొనలు – 4; నిమ్మరసం – అర టీ స్పూను; ఉప్పు – చిటికెడు; బటర్ – ఒక కప్పు. కుకీ డఫ్ లేయర్ కోసం: మొలాసెల్ – 2 టీ స్పూన్లు; చాకొలేట్ చిప్స్ – పావు కప్పు. ఓరియో లేయర్ కోసం: ఓరియో బిస్కెట్స్ (బ్రౌన్ కలర్) – 3 బ్రౌనీ లేయర్ కోసం: డచ్ ప్రోసెస్డ్ కోకో పౌడర్ – 2 టేబుల్ స్పూన్లు గార్నిషింగ్ కోసం: బ్రౌనీ కుకీస్, ఓరియోలు (టాపింగ్ కోసం) – 2 టేబుల్ స్పూన్లు; గనాచే (కుకింగ్ చాకొలేట్ + పాలు కలిపి తయారుచేసినది) – 2 కప్పులు. తయారీ: ►350 డిగ్రీల దగ్గర అవెన్‌ను ప్రీ హీట్ చేయాలి ►తొమ్మిది అంగుళాల కేక్ పాన్‌ను బటర్, మైదాలతో గ్రీజ్ చేయాలి ►ఒక పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలియబెట్టాలి ►మరొక పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా గిలకొట్టి క్రీమ్ తయారుచేసుకోవాలి ►కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎక్స్ట్రాక్ట్ జత చేసి మరోమారు బీటర్‌తో బాగా గిలకొట్టాలి ►మైదా పిండిలో సగ భాగాన్ని జత చేయాలి ►సగం బటర్ మిల్క్ జత చేసి గిలకొట్టాక, మిగిలిన మైదా పిండి, బటర్ మిల్క్ జత చేసి మరోమారు బాగా గిలకొట్టాలి ►ఈ మిశ్రమాన్ని మూడు సమాన భాగాలుగా విడదీసి, ఒక్కో లేయర్‌కు తీసుకున్న పదార్థాలను ఒక్కో దానికి విడివిడిగా జత చేయాలి ►కేక్‌పాన్‌లో ఒక లేయర్ తరవాత మరొక లేయర్కి కలుపుకున్న మిశ్రమాలను జాగ్రత్తగా వేసి, అవెన్‌లో ఉంచి సుమారు 35 నిమిషాలు బేక్ చేయాలి. బటర్ క్రీమ్ కోసం: ఒక సాస్పాన్లో కొద్దిగా నీళ్లు పోసి మరిగించాలి ∙వేరొక పాత్రలో పంచదార, కోడిగుడ్డు తెల్ల సొన నిమ్మ రసం, ఉప్పు వేసి ఆ పాత్రను మరుగుతున్న నీళ్ల గిన్నెలో ఉంచాలి ∙పదార్థాలన్నీ వేడెక్కి, పంచదార కరిగేవరకు కలిపి దింపేసి, ఈ మిశ్రమాన్ని బటర్లో వేసి కొద్దిసేపు కలియబెట్టాలి (ఇలా చేయడం వల్ల మృదువుగా అయ్యి, కేక్ మీద సమానంగా వేయటానికి సులువుగా ఉంటుంది) ∙బేక్ చేసుకున్న కేక్ బేస్‌ను బయటకు తీసి, మొదటి లేయర్‌ను ఒక ప్లేట్లో ఉంచాలి ∙బటర్ క్రీమ్‌ను అర అంగుళం మందంలో మొదటి లేయర్ మీద సమానంగా పోయాలి ∙రెండవ లేయర్‌ను ఉంచి దాని మీద కూడా ఇదే విధంగా చేసి, మూడో లేయర్‌ను ఉంచాలి ∙గనాచేతో అలంకరించాలి ∙టాపింగ్స్ కోసం తీసుకున్న వాటిని కూడా జత చేయాలి. మార్బుల్ కేక్ ఈ కేక్‌కి తయారుచేసే బేస్‌ని చాకొలేట్ మార్బుల్ అంటారు. ఎవరి ఆలోచనకు వారు పదును పెట్టుకుని, మిక్స్డ్ ఫ్రూట్ జామ్ లేదా తాజా పండ్లు... బ్లూ బెర్రీలు, స్ట్రాబెర్రీలు ఏవైనా సరే... బ్యాటర్‌కి జత చేస్తే – కేక్ కలర్ఫుల్గా వస్తుంది. కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; బేకింగ్ పౌడర్ – 2 టీ స్పూన్లు; పంచదార పొడి – ఒక కప్పు కంటె ఎక్కువ; ఉప్పు – చిటికెడు; బటర్ – అర కప్పు (సాల్టెడ్ బటర్ వాడుతుంటే ఉప్పును ఉపయోగించక్కర్లేదు); కోడి గుడ్లు – 2; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను; ఫుడ్ కలర్ – చిటికెడు; పాలు – ఒక కప్పు; కోకో పొడి – 3 టేబుల్ స్పూన్లు తయారీ: ►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ►కేక్ పాన్‌ను బటర్ తో గ్రీజ్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో మైదా పిండి, బేకింగ్ పౌడర్, ఉప్పు, పంచదార పొడి, బటర్, కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎసెన్స్, పాలు వేసి బాగా గిలకొట్టాలి (అన్నీ కలిసి బాగా మెత్తగా అయ్యేవరకు గిలకొడితే కేక్ స్మూత్‌గా వస్తుంది) ►సగం కంటె ఎక్కువ భాగాన్ని కేక్ పాన్‌లో పోయాలి ►ఆ పైన వెనిలా ఎక్స్ట్రాక్ట్ను, ఫుడ్ కలర్ మిశ్రమం, కోకో పొడి ఒక దాని మీద ఒకటి పోయాలి ►చాకుతో కాని ఒక పుల్లతో కాని ఈ మిశ్రమాన్ని జాగ్రత్తగా సరిచేయాలి (మార్బుల్ ఎఫెక్ట్ వచ్చేలాగ) ►అవెన్‌లో ఉంచి సుమారు 40 నిమిషాలు బేక్ చేయాలి ►బయటకు తీసి చల్లారాక సర్వ్ చేయాలి. యూలే ద లాగ్ చాలామందికి ప్లమ్ కేక్, రమ్ కేక్ తెలుసు. మీరెప్పుడైనా యూలే ద లాగ్ కేక్ తయారుచేసుకున్నారా! ఇది చూడటానికి చెక్క దూలంలాగ ఉంటుంది. అందువల్ల ఈ కేక్‌ను చూడగానే సంతోషంతో పాటు సెలవును ఆస్వాదిస్తున్న భావన కూడా కలుగుతుంది. కావలసినవి: కేక్ కోసం: కోడి గుడ్లు – 6; పంచదార – ముప్పావు కప్పు; కోకో పొడి – అర కప్పు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టీ స్పూను ఐసింగ్ కోసం: డార్క్ చాకొలేట్ తురుము – ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; పంచదార – ఒక కప్పు కంటె కొద్దిగా ఎక్కువ; సాఫ్ట్ బటర్ – ఒక కప్పు; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టేబుల్ స్పూను. అలంకరించడం కోసం: 2 టేబుల్ స్పూన్ల పంచదార, పార్లే జి బిస్కెట్స్, ఎరుపు రంగు ఫుడ్ కలర్ (చెర్రీలు తయారుచేయడానికి); మెరింగ్ మష్రూమ్స్, చాకొలేట్ సాయిల్, క్రిస్మస్ ట్రీ పుల్లలు తయారీ: ►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో కోడి గుడ్డు తెల్ల సొనలను వేసి బీటర్‌తో బాగా గిలకొట్టాలి ►బాగా మెత్తగా అయిన తరవాత పావు కప్పు పంచదార కొద్దికొద్దిగా వేస్తూ మళ్లీ గిలకొడుతుండాలి ►వేరొక పాత్రలో కోడిగుడ్డు పచ్చ సొనలను వేసి పంచదార జత చేస్తూ గిలకొట్టాలి ►వెనిలా ఎక్స్ట్రాక్ట్ జత చేయాలి ∙కోకో పొడిని జల్లెడ పట్టి, మెత్తటి పొడిని కొద్దికొద్దిగా జత చేస్తూ గిలకొట్టాలి ►కోడి గుడ్డు తెల్ల సొన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా జత చేస్తూ, అన్నీ బాగా కలిసేలా గిలకొట్టాలి (ఎంత ఎక్కువసేపు గిలకొడితే అంత మెత్తగా వస్తుంది కేక్) ►నలుచదరం లేదా దీర్ఘచతురస్రాకారంలో ఉన్న కేక్‌పాన్‌లో బేకింగ్ షీట్ లేదా ఫాయిల్ (కింద కొద్దిగా పంచదార వేస్తే కేక్ అతుక్కోకుండా తేలికగా వస్తుంది) ఉంచి, దాని మీద ఈ మిశ్రమాన్ని సమానంగా పరిచి, అవెన్‌లో ఉంచి, సుమారు 20 నిమిషాల పాటు బేక్ చేయాలి ►చల్లారిన తరవాత, జాగ్రత్తగా ప్లేట్లోకి తీసుకోవాలి. ఐసింగ్తయారీ: ►చాకొలేట్‌ను ముందుగా కరిగించాలి (మైక్రోవేవ్లోకాని వేడి నీళ్ల మీద కాని) ►ఒక పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా గిలకొట్టాలి ►కరిగించిన చాకొలేట్, వెనిలా ఎక్స్ట్రాక్ట్ జత చేసి మెత్తగా వచ్చేవరకు కలుపుతుండాలి ►బాగా మెత్తగా అయిన తరవాత కేక్ మీద సమానంగా పరిచి, కేక్‌ను (ఫాయిల్‌తో) నెమ్మదిగా రోల్ చేయాలి (వదులుగా కాకుండా టైట్‌గా వచ్చేలా జాగ్రత్తగా రోల్ చేసి, చివరగా ప్రెస్ చేయాలి) ►అంచులను జాగ్రత్తగా కట్ చేయాలి ►మిగిలిన భాగాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేయాలి ►అంతే!!! అందమైన కేక్ సిద్ధమైనట్లే. సాల్టెడ్ క్యారమెల్ షీట్ కేక్ కావలసినవి: మైదా పిండి – రెండు కప్పుల కంటె కొద్దిగా ఎక్కువ; బటర్ – ఒక కప్పు; పంచదార – అర కప్పు; బ్రౌన్ సుగర్ – ఒక కప్పు ; పెద్ద కోడిగుడ్లు – 2; వెనిలా ఎక్స్ట్రాక్ట్ – 2 టీ స్పూన్లు; తాజా పెరుగు – అర కప్పు; బేకింగ్ సోడా – ఒక టీ స్పూను; ఉప్పు – అర టీ స్పూను; చిక్కటి పాలు (హోల్ మిల్క్) – ఒక కప్పు. తయారీ: ►ముందుగా అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీ హీట్ చేయాలి ►12 అంగుళాల చతురస్రాకారంలో ఉన్న కేక్ పాన్లను ముందుగా కొద్దిగా బటర్‌తో గ్రీజ్ చేయాలి ►ఒక పెద్ద పాత్రలో పంచదార, బటర్ వేసి బాగా కలిపి, మెత్తగా వచ్చేవరకు గిలకొట్టాలి ►కోడి గుడ్డు సొనలు, వెనిలా ఎక్స్ట్రాక్ట్, పెరుగు జత చేసి మరోమారు గిలకొట్టాలి ►మరొక పాత్రలో మైదా పిండి, బేకింగ్ సోడా, ఉప్పు వేసి బాగా కలిపి, సగ భాగాన్ని కోడి గుడ్డు మిశ్రమానికి జత చేయాలి ►అర కప్పు పాలు జత చేసి నెమ్మదిగా గిలకొట్టాలి ►మిగిలిన పిండిని జత చేస్తూ, మిశ్రమం మెత్తగా వచ్చేలా బాగా బీట్ చేయాలి ►ట్రేలో పోసి, అవెన్‌లో ఉంచి 25 నిమిషాల పాటు బేక్ చేయాలి ►బయటకు తీసి, చల్లారాక, సాల్టెడ్ కారమెల్ను పైన చల్లి అందించాలి. కేక్ పాప్స్ కావలసినవి: కేక్ పాప్స్ కోసం: పొడిపొడిగా మిగిలిపోయిన కేక్ (క్రంబ్ల్డ్ కేక్) – 2 కప్పులు; హెవీ క్రీమ్ – ఒక కప్పు కోటింగ్ కోసం: తగినంత డార్క్ చాకొలేట్ లేదా వైట్ చాకొలేట్; తగినంత నట్స్ పొడి; కార్డ్బోర్డ్ బాక్స్. తయారీ: ►ఒక పాత్రలో క్రీమ్, క్రంబ్ల్డ్ కేక్ వేసి బాగా కలపాలి (ఈ పొడి కొద్దిగా ఎక్కువ ఉన్నా పరవాలేదు) ►రెండు అంగుళాల పరిమాణంలో బాల్స్‌లా చేతితో చేసి, పొడవాటి పుల్లలకు గుచ్చి, పక్కన పెట్టాలి ►డార్క్ చాకొలేట్ లేదా వైట్ చాకొలేట్‌ను కరిగించాలి (ఒక మామూలు గిన్నెలో వీటిని ఉంచి, మరుగుతున్న గిన్నె మీద ఈ గిన్నె ఉంచి కరిగించాలి) ►కరుగుతున్న చాకొలేట్ లో కేక్ బాల్స్ పుల్లలను ముంచి, తీసేసి, కార్డ్ బోర్డు మీద ఉంచాలి ►నట్స్ పొడి చల్లాలి ►చల్లారాక అందించాలి (వీటిని ఫ్రిజ్‌లో ఉంచితే నాలుగైదు రోజుల వరకు చెడి పోకుండా ఉంటాయి) -
నకిలీ మైదా, గోధుమ పిండి విక్రయం
మల్కాజిగిరి: బ్రాండెడ్ పేరుతో నకిలీ మైదా, గోధుమ పిండి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను గురువారం మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మల్కాజిగిరి సీఐ మన్మోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మౌలాలి రాఘవేంద్రనగర్ కాలనీకి చెందిన వనపర్తి రమేష్ వెంకటేశ్వర ప్రొవిజన్ పేరిట కిరణా దుకాణం నిర్వహిస్తున్నాడు. అతడి వద్ద భాష్యం రాజ్‌కుమార్ అనే వ్యక్తి సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. వీరు పటాన్ చెరులోని శాలిమార్ రోలర్ ఫ్లోర్‌మిల్ చెందిన మైదా, గోధుమపిండిని విక్రయించేవారు. నెల రోజులుగా గౌలిగూడకు చెందిన తోట్ల బిజ్‌గోపాల్ వద్ద శాలిమార్ రోలర్ కంపెనీకి చెందిన బ్యాగులు తయారు చేయింన వీరు శాలిమార్ కంపెనీ పేరుతో విక్రయాలు జరుపుతున్నారు. దీనిపై సమాచారం అందడంతో ఈ నెల 7న ఎస్ఓటీ పోలీసులు దాడిచేసి 13 మైదా బ్యాగులు, 37 ఖాలీ సంచులు, కుట్టు మెషిన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి మల్కాజిగిరి పోలీసులకు అప్పగించారు. -
ఇంటిప్స్
►పప్పు తొందరగా ఉడకాలంటే ఉడికించేటప్పుడు కొద్దిగా డాల్టా లేదా నూనె వేయాలి. ►నిమ్మకాయ తొక్కలను పిండిన తర్వాత వాటిని కుకర్ అడుగున వేసి రుద్దితే నలుపు తగ్గుతుంది. దుర్వాసన దూరం అవుతుంది. ►పచ్చిమిరపకాయల తొడిమలను తీసి ఫ్రిజ్‌లో నిల్వ చేస్తే అవి త్వరగా పాడవవు. ►నూనె ఒలికితే ఆ ప్రాంతంలో కొద్దిగా మైదాపిండి చల్లాలి. పిండి నూనెను త్వరగా పీల్చేస్తుంది. ►క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉండాలంటే చిన్న అల్లం ముక్క వేయాలి. ►కత్తిపీటకు ఉప్పు రాయడం వల్ల పదునుగా తయారవుతుంది. ►కందిపప్పు డబ్బాలో ఎండుకొబ్బరి చిప్ప వేసి నిల్వ ఉంచితే పప్పు త్వరగా పాడవదు. ►మిక్సీ, అవెన్, ఫ్రిజ్.. వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై భాగం జిడ్డుగా మారుతుంటుంది. ఇలాంటప్పుడు 4 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడాలో టేబుల్ స్పూన్ వెచ్చని నీళ్లు కలిపి స్పాంజ్‌తో ముంచి, పిండి తుడవాలి. మురికి సులువుగా వదిలిపోతుంది. ►షూస్, స్నీకర్స్ లోపలి వైపు దుర్వాసన వస్తుంటుంది. కొద్దిగా బేకింగ్ సోడా లోపలి వైపు చల్లి, తడి క్లాత్‌తో తుడిస్తే దుర్వాసన రాదు. ►చెక్క ఫర్నీచర్ మీద మరకలు తొలగించాలంటే టూత్‌పేస్ట్ రాసి తర్వాత తడి క్లాత్‌తో తుడవాలి. ►పిల్లలు కలర్ పెన్సిళ్లతో గోడల మీద బొమ్మలు వేస్తుంటారు. ఈ మరకలు తొలగించాలంటే బేకింగ్ సోడా చల్లి, తడి స్పాంజ్‌తో తుడవాలి. ►నీళ్లలో కప్పు అమ్మోనియా కలిపి మెత్తని టర్కీ టవల్స్‌ను నానబెట్టాలి. అరగంట తర్వాత ఉతికితే మురికిపోతుంది. ►వేడి నీళ్లలో రెండు చుక్కల నిమ్మరసం, చెంచా వంటసోడా, చిటికెడు ఉప్పు వేసి వాటర్ బాటిల్స్‌ను రెండు రోజుల కొకసారి శుభ్రపరిస్తే బాక్టీరియా దరిచేరదు. -
భకర్వాడి
కావలసినవి: మైదా పిండి – ఒకటిన్నర కప్పులు ; ఉప్పు – తగినంత; నూనె – 3 టేబుల్ స్పూన్లు + డీప్ ఫ్రైకి సరిపడా; ధనియాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; సోంపు – అర టీ స్పూను; లవంగాలు – 2; నువ్వులు – ఒక టీ స్పూను ; మిరప కారం – అర టీ స్పూను; పసుపు – చిటికెడు; గరం మసాలా – ఒక టీ స్పూను; ఆమ్ చూర్ – అర టీ స్పూను; సెనగ పిండి – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; పంచదార – ఒక టీ స్పూను తయారీ: ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు, 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి బాగా కలపాలి. తగినన్ని నీళ్లు జత చేసి చపాతీపిండిలా కలిపి పావు గంట సేపు పక్కన ఉంచాలి. స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాగాక ఇంగువ వేసి వేయించాలి. జల్లెడ పట్టిన సెనగ పిండి వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, ఆ పిండిని ఒక పాత్రలోకి తీసుకోవాలి. నూనె లేకుండా స్టౌ మీద బాణలి ఉంచి, అందులో ధనియాలు వేసి వేగాక, జీలకర్ర, సోంపు, లవంగాలు జత చేసి మరోమారు వేయించాలి. బాగా వేగిన తరవాత నువ్వులు జత చేసి వేయించి దింపి చల్లారాక, మిక్సీలో వేసి పొడి చేయాలి. మిరప కారం, పసుపు, గరం మసాలా, ఆమ్ చూర్, జత చేసి మరో మారు మిక్సీ తిప్పాలి. ఈ పొడిని సెనగ పిండిలో వేసి, కొద్దిగా ఉప్పు, పంచదార పొడి కూడా జత చేసి బాగా కలపాలి. పక్కన ఉంచిన మైదా పిండిని ఒక ఉండ పరిమాణంలో తీసుకుని చపాతీలా ఒత్తి, దాని మీద కొద్దిగా నూనె పూయాలి. సెనగ పిండి మిశ్రమాన్ని పైనంతా ఒక పొరలా పూయాలి. ఒత్తి ఉంచుకున్న చపాతీని కొద్దికొద్దిగా మడుస్తూ గట్టిగా దగ్గరగా ఉండేలా రోల్ చేయాలి. ఆఖరి మడత దగ్గర మరి కాస్త నూనె పూసి చుట్టి రోల్ చేయాలి. చాకుతో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. చేతికి కొద్దిగా తడి చేసుకుని కట్ చేసిన ముక్కల అంచులకు తడి పూయాలి. బాణలిలో నూనె కాగిన తరవాత వీటిని అందులో వేసి రంగు మారేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. -
ఎలుకల పని పట్టండిలా..
సిమెంటు, మైదాపిండిలను సమ భాగాలుగా కలిపి పొట్లాలు కట్టి ఎలుకల బొరియల వద్ద ఉంచాలి. వాటిని తిన్న తర్వాత ఎలుకలు నీరు తాగడం వల్ల నోటి భాగాలు పిడుచకట్టుకుపోతాయి. కడుపులో సిమెంట్ గడ్డకడుతుంది. దీంతో ఎలుకలు చనిపోతాయి. బొరియల్లో తడిగడ్డితో నింపిన కుండల ద్వారా పొగబెడితే రంధ్రాల్లో ఉన్న ఎలుకలు చనిపోతాయి. పొలం గట్లపై జిల్లేడు, ఆముదం మొక్కలు పెంచితే ఎలుకలు పొలం గట్లపై బొరియలు పెట్టే అవకాశం ఉండదు. ఐరన్ బుట్టలను అమర్చి ఎలుకలను పట్టుకోవచ్చు. ఎలాస్టిక్ తాళ్లతో పెట్టే బుట్టల ద్వారా కూడా ఎలుకలను నిర్మూలించవచ్చు. ఎకరా పొలంలో సుమారు 20 వరకు బుట్టలు ఉంచాలి. ఈ బుట్టల్లో బియ్యాన్ని ఎరగా వాడాలి. ఇందులోకి ఎలుక రాగానే దీనిలో ఉన్న ఎలాస్టిక్ వల్ల పీక నొక్కకుపోయి మరణిస్తుంది. రసాయనాల ద్వారా.. చాలామంది రైతులు జింక్ ఫాస్ఫైట్ వినియోగిస్తుంటారు. ఈ మందుతో ఒకసారి ఎలుకలను నిర్మూలించినా.. రెండో దఫా మందు పెట్టినప్పడు ఎలుకలు గుర్తించి తప్పించుకుంటాయి. {బోమోడైల్ మందు ద్వారా ఎలుకలను నిర్మూలించవచ్చు. 480 గ్రాముల నూకలకు పది గ్రాముల నూనె పట్టించి మరో 10 గ్రాముల బ్రొమోడైల్ మందు కలిపి ఎరను తయారు చేసుకోవాలి. ఆ ఎరను బొరియల వద్ద ఉంచాలి. దీనిని తిని ఎలుకలు చనిపోతాయి. అయితే పొలంగట్లపై కనిపించిన ప్రతి బొరియ వద్ద ఎర పెట్టడం వల్ల ఫలితం ఉండదు. ముందుగా బొరియలను గుర్తించి వాటిని మట్టితో మూసేయాలి. తర్వాతి రోజు గమనించాలి. తెరుచుకున్న బొరియల్లో ఎలుకలు ఉంటున్నట్లు అర్థం. వాటి వద్ద మందు పెడితే ఉపయోగం ఉంటుంది. వారం తర్వాత మరోసారి ఇలాగే చేయాలి. రైతులు విడివిడిగా ఎలుకలు నివారించేకంటే ఒక ఆయకట్టు రైతులంతా ఒకేసారి ఈ విధానాన్ని అవలంబిస్తే ఎలుకలను శాశ్వతంగా నిర్మూలించే అవకాశం ఉంటుంది. కొబ్బరి చిప్పల్లో పెడితే మేలు.. పంట పొలాల్లో, బొరియల వద్ద పెట్టే మందును కొబ్బరి చిప్పల్లో ఉంచడం ద్వారా రైతులు మరింత ప్రయోజనం పొందవచ్చు. మందు పొట్లాల్లో ఉంచితే వర్షాలకు కరిగిపోవడంతోపాటు కాకులు, పక్షులు తినే అవకాశం ఉంటుంది. కొబ్బరి చిప్పలో మందు ఉంచి పైన మరో చిప్పను ఉంచాలి. చిప్పల మధ్య ఉండే ఖాళీ ప్రదేశం నుంచి ఎలుకలు అందులోకి ప్రవేశించి మందును తింటాయి. పంట పొలాల్లో నీరు ఉన్న ఎత్తులో చిప్పలను కర్రలకు కట్టి ఎరలు ఏర్పాటు చేయాలి. పొలం మధ్యలోకి ఈదుకుంటూ వచ్చే ఎలుకలు చిప్పల్లోకి ప్రవేశించి మందును తిని చనిపోతాయి.