గోధుమ పిండి.. మైదా పిండితో చిలగడదుంపల పూరీ తయారీ విధానం మీకోసం!
చిలగడదుంపల పూరీ తయారీకి కావలసినవి:
►చిలగడదుంపలు – 2 (కుకర్‌లో మెత్తగా ఉడికించుకుని, పైతొక్క తొలగించి, గుజ్జులా చేసుకోవాలి.)
►గోధుమ పిండి –2 కప్పులు
►గోరువెచ్చని నీళ్లు – సరిపడా
►మైదాపిండి – 1 టేబుల్ స్పూన్
►కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు
►కారం – 1 టీ స్పూన్
►పసుపు – చిటికెడు
►గరం మసాలా – 1 టీ స్పూన్
►ఉప్పు – తగినంత
►నూనె – సరిపడా
తయారీ:
►ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి.
►అందులో చిలగడదుంప గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసుకోవాలి.
►సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి.
►20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి.
►ర్వాత కళాయిలో నూనె కాగించి దోరగా వేయించుకోవాలి.
ఇవి కూడా ట్రై చేయండి: Mutton Keema Cheese Samosa: మటన్ కీమా- చీజ్ సమోసా తయారీ ఇలా!
Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్ తయారీ ఇలా!
Comments
Please login to add a commentAdd a comment