poori
-
ఆనపకూయతో సాంబార్ ఒకటే కాదు, పూరీలు కూడా చేసుకోవచ్చు
ఆనపకాయ పూరీ తయారీకి కావల్సినవి: ఆనపకాయ – 1 (తొక్క తీసేసి.. గింజలు తొలగించి.. ముక్కలను మెత్తగా ఉడికించి, కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి) గోధుమ పిండి –3 కప్పులు, గోరువెచ్చని నీళ్లు – సరిపడా మైదాపిండి – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, వాము – అర టీ స్పూన్ చొప్పున (కచ్చాబిచ్చా మిక్సీ చేసుకోవాలి) కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి పొడి– 1 టీ స్పూన్ (ఎండు మిరపకాయలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టాలి) పసుపు – చిటికెడు,ఉప్పు – తగినంత,నూనె – సరిపడా \ తయారీ విధానమిలా: ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో ఆనపకాయ గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, ఎండుమిర్చి పొడి, జీలకర్ర, వాము మిశ్రమం, ఉప్పు, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా సిద్ధం చేసుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగనిచ్చి.. పూరీలను వేయించాలి. -
టాలీవుడ్లో మళ్లీ డ్రగ్స్.. నాడు ఏం జరిగింది?
టాలీవుడ్లో మరోసారి డ్రగ్స్ దుమారం తెరపైకి వచ్చింది. తాజాగా కబాలి తెలుగు నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో తెలుగు చిత్రసీమను కుదిపేస్తుంది. ఇప్పటికే అతని కాల్ లిస్ట్‌లో ఇద్దరు స్టార్ హీరోయిన్లతో పాటు నలుగురు మహిళా నటులు ఉన్నారని సమాచారం. ఈ లింక్ వెనుక ప్రముఖ డైరెక్టర్ కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. తెలుగు పరిశ్రమలో డ్రగ్స్ మాఫియా కొత్త కాదు. 2017లో టాలీవుడ్లో డ్రగ్స్ కేసు భారీగా ప్రకంపనలు రేపింది. గతంలో టాలీవుడ్‌ను డ్రగ్స్‌తో షేక్ చేసిన అలెక్స్‌ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు ఒక్కోక్కటిగా బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి..వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు. మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు 7 చార్జిషీట్లు వారిపై అప్పట్లో దాఖలు చేశారు. (ఇదీ చదవండి: Drugs Case: కేపీ చౌదరి ఫోన్ లిస్ట్‌లో సినీ ప్రముఖల లిస్ట్) నాటి విచారణలో ఏం తేల్చారు దర్యాప్తులో భాగంగా అప్పటి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో టాలీవుడ్‌కు చెందిన అనేక మందిని విచారించి.. వారి వాంగ్మూలం నమోదు చేశారు. డ్రగ్స్ వాడుతున్నదీ, లేనిదీ శాస్త్రీయంగా నిర్ధారించేందుకు వీరందరి గోళ్లు, వెంట్రుకలు సేకరించి ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపారు. అన్ని కోణాల్లో దర్యాప్తుతో పాటు సాక్షులనూ విచారించారు. దాదాపు మూడేళ్లపాటు దర్యాప్తు చేసినా మత్తుమందుల వాడకంపై ప్రాథమిక ఆధారాలూ లభించలేదు. ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు ముగిసిన తరుణంలో అకస్మాత్తుగా ఈడీ అధికారులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై మళ్లీ కొత్తగా సినీ ప్రముఖులపై కేసు నమోదు చేశారు. డ్రగ్స్ దిగుమతితో పాటు విదేశాలకు నిధుల మళ్లింపు కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది. (ఇదీ చదవండి: రాయలేని భాషలో బూతులు.. ‘సైతాన్’ వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..) దీనిలో భాగంగా తెలుగు సినీ పరిశ్రమకు చెందిన హీరో రవితేజ, ఛార్మీ, రకుల్ ప్రీత్ సింగ్, రానా, పూరి జగన్నాధ్, నవదీప్, తరుణ్, తనీష్, సుబ్బరాజు, ముమైత్ ఖాన్ వంటి వారిలో 12మందిని విచారించారు. వారందరి బ్యాంకు లావాదేవీలు పరిశీలించారు. అలా ఈడీ విచారణ కూడా సుమారు 2 నెలలు కొనసాగింది. అన్ని కోణాల్లో దర్యాప్తు జరిపినా కేసుకు సంబంధించి ఎలాంటి ఆధారాలూ లభించలేదని ఈడీ తేల్చేసింది. వారిలో ఎవరూ కూడా డ్రగ్స్ వాడినట్లుగా ఆధారాలు లభ్యం కాలేదని ఫోరెన్సిక్ ల్యాబ్ తేల్చేసింది. ఈ నేపథ్యంలో డ్రగ్స్ కేసును మూసివేసినట్లు అయింది. ఈడీ ఎంట్రీతో ఆయన బదిలీ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అకున్ సబర్వాల్ ఆధ్వర్యంలో విచారణ కొనసాగుతున్న సమయంలో ఈడీ రంగంలోకి దిగడం అబ్కారీ శాఖకు సంకటంగా మారింది. ఆ సమయంలో అకున్ సబర్వాల్ ఆకస్మికంగా బదిలీ కావడం సంచలనం కలిగించింది. తర్వాత ఆ సిట్‌కు వేరే అధికారుల నేతృత్వంతో కేసు నీరుగారిపోయిందని, సిట్ తీరు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని ఆ సమయంలో పలు విమర్శలు వచ్చాయి. బాలీవుడ్లో డ్రగ్స్.. అక్కడా ఇదే స్టైల్ బాలీవుడ్ బాద్షా షారుక్ కొడుకు ఆర్యన్ కూడా డ్రగ్స్ తీసుకున్నట్లు అప్పట్లో దుమారం జరిగింది. ఏం జరిగిందో తెలియదు కానీ అతనికి క్లీన్ చిట్ వచ్చింది..అతను నిర్దోషిగా తేల్చి నార్కోటిక్స్ డిపార్ట్మెంట్ వదిలేసింది. మరి ఆర్యన్ నిర్దోషి అయితే 28 రోజులు ఎందుకు జైల్లో పెట్టారు? రెండు సార్లు బెయిల్ ఎందుకు తిరస్కరించారు? అసలు ఏ ఆధారాలతో పట్టుకున్నారు? అనే ప్రశ్నలకు ఇప్పటికి సమాధానాలు దొరకలేదు. (ఇదీ చదవండి: ప్రెగ్నెన్సీ అని చెర్రీకి చెప్పా.. అలా చేయొద్దన్నాడు: ఉపాసన) ఆర్యన్ కేసుకు ముందు కూడా బాలీవుడ్లో డ్రగ్స్ కలకలం రేపింది. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత రియా చక్రవర్తి ఫోన్లో పోలీసులకు కీలక ఆధారాలు దొరికాయని చెప్పారు. రియా సుశాంత్‌కు డ్రగ్స్ తెప్పించేదని ఆరోపణలొచ్చాయి. డ్రగ్స్ వ్యవహారం తెరపైకి రావడంతో.. సుశాంత్ మృతి కేసు కూడా మరుగున పడిపోయింది. అక్కడి నుంచి రియా చక్రవర్తి, రకుల్ ప్రీత్ సింగ్ నుంచి శ్రద్ధ కపూర్, దీపికా పదుకునే లాంటి టాప్ స్టార్స్ పేర్లు కూడా వినిపించాయి. వీళ్లందర్నీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించింది. ఆ సమయంలో కూడా బాలీవుడ్ మూలస్తంభాలకూ డ్రగ్స్ లింకులున్నాయని, టాప్ హీరోలందరికీ నోటీసులిస్తారని పెద్దఎత్తున దుమారం రేగింది. కానీ అక్కడా కేసు సైలెంటైపోయింది. సినిమా రంగంలోనే ఎందుకు? సినిమా అనేది అనేక రంగుల ప్రపంచం. అక్కడ డబ్బు, ఫేమ్ సంపాదించే క్రమంలో నటీనటులతో పాటు టెక్నీషియన్స్లలో కొందరు ఈ డ్రగ్స్ కల్చర్‌కు అలవాటు పడుతారని తెలుస్తోంది. అంతేకాకుండా ఫిట్ నెస్, సౌందర్యం కోసం కూడా డ్రగ్స్ తీసుకుంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. బాడీని మైంటైన్ చేయడంతో పాటు వయసు మీద పడకుండా ఉండటానికి కూడా కొన్ని రకాల మాదక ద్రవ్యాలు తీసుకుంటారని కామెంట్స్ వస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలియదు కానీ.. సినీ ఇండస్ట్రీలలో జరిగే పార్టీ కల్చర్ లో వీటిని అలవాటు చేసుకొని.. మెల్లమెల్లగా డ్రగ్స్‌కు బానిసలుగా మారుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌కి బానిసలైన సెలబ్రిటీలను లొంగదీసుకుని... సెలబ్రిటీలను డ్రగ్స్ ఉచ్చులోకి డీలర్స్ దింపుతారని తెలుస్తోంది. ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ కంగనా రనౌత్ - మాధవీలత వంటి వారు సినీ ఇండస్ట్రీలో జరిగే పార్టీలలో డ్రగ్స్ కంపల్సరీ అని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. -
Recipe: నోరూరించే చిలగడదుంపల పూరీ తయారీ ఇలా!
గోధుమ పిండి.. మైదా పిండితో చిలగడదుంపల పూరీ తయారీ విధానం మీకోసం! చిలగడదుంపల పూరీ తయారీకి కావలసినవి: ►చిలగడదుంపలు – 2 (కుకర్‌లో మెత్తగా ఉడికించుకుని, పైతొక్క తొలగించి, గుజ్జులా చేసుకోవాలి.) ►గోధుమ పిండి –2 కప్పులు ►గోరువెచ్చని నీళ్లు – సరిపడా ►మైదాపిండి – 1 టేబుల్ స్పూన్ ►కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు ►కారం – 1 టీ స్పూన్ ►పసుపు – చిటికెడు ►గరం మసాలా – 1 టీ స్పూన్ ►ఉప్పు – తగినంత ►నూనె – సరిపడా తయారీ: ►ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి. ►అందులో చిలగడదుంప గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, గరం మసాలా, ఉప్పు, కారం, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసుకోవాలి. ►సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. ►20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా ఒత్తుకోవాలి. ►ర్వాత కళాయిలో నూనె కాగించి దోరగా వేయించుకోవాలి. ఇవి కూడా ట్రై చేయండి: Mutton Keema Cheese Samosa: మటన్ కీమా- చీజ్ సమోసా తయారీ ఇలా! Singori Sweet Recipe: కోవా... పంచదార.. పచ్చి కొబ్బరి.. నోరూరించే స్వీట్ తయారీ ఇలా! -
వైభవంగా జగన్నాథుని రథయాత్ర
పూరీ (ఒడిశా): ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఒడిశాలోని పూరీలో జగన్నాథ రథయాత్ర వైభవోపేతంగా మొదలైంది. శుక్రవారం ఉదయం మొదలైన ఈ యాత్ర తొమ్మిది రోజులు సాగుతుంది. కోవిడ్ కారణంగా గత రెండేళ్లుగా ఈ యాత్రను నిర్వహించలేదు. దీంతో ఈ యాత్రకి భక్తులు వెల్లువెత్తారు. పూరీ పట్టణం భక్తజన సంద్రంగా మారింది. జై జగన్నాథ, హరిబోల్ నామస్మరణతో చుట్టుపక్కల ప్రాంతాలు మారుమోగాయి.అంతరాలయం నుంచి చతుర్థా మూర్తులు బలభద్రుడు, దేవీ సుభద్ర, జగన్నాథుడు, సుదర్శనునితో పాటు మదన మోహనుడు, రామ, కృష్ణ ఉత్సవ మూర్తులను వరుస క్రమంలో రథాలపైకి తరలించారు. మంగళస్నానాలు, సకలధూపం, హారతి వంటివి శాస్త్రోక్తంగా నిర్వహించారు. సంప్రదాయం ప్రకారం పూరీ శంకరాచార్య స్వామి నిశ్చలానంద సరస్వతి, ఆయన శిష్యులు కొందరు జగన్నాథుడిని తొలి దర్శనం చేసుకున్నారు. పూరీ గజపతి వంశం మహారాజు దివ్యసింగ్ దేబ్ బంగారు చీపురుతో రథాలన్నీ శుభ్రం చేశారు. ఆ దేవదేవుడి ముందు అందరూ సమానమేనన్న సందేశాన్ని ఇవ్వడానికే మహరాజులే ఈ రథాలను ఊడుస్తారు. ఏడాదిపాటు పూరీ జగన్నాథ ఆలయ గర్భగుడిలో ఉండే సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథుడు ఆషాఢ మాసం శుక్లపక్ష విదియనాడు ఈ యాత్ర మొదలవుతుంది. మొదట తాళధ్వజ రథంపై బలభద్రుడుని తీసుకువచ్చారు. ఆ తర్వాత దర్పదళన్ రథంపై సుభద్ర, చివరగా నందిఘోష్ రథంపై జగన్నాథుడిని ఊరేగింపుగా గుండిచా మందిరానికి బయల్దేరాయి. ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, గవర్నర్ గణేషిలాల్, కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరై లాంఛనంగా రథాల్ని లాగి యాత్రను ప్రారంభించారు. భక్తులు భారీగా తరలిరావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జగన్నాథ రథయాత్ర దేశవ్యాప్తంగా పలు ఇతర నగరాల్లో కూడా అత్యంత వైభవోపేతంగా జరుగుతోంది. యాత్రను పురస్కరించుకుని మూల విరాటులను వరుస క్రమంలో రథాలపైకి ఎక్కించి, దించడం గొట్టి పొహొండిగా వ్యవహరిస్తారు. గుండిచా మందిరం అడపా మండపంపై కొలువు దీరిన జగన్నాథుని దర్శించుకుంటే జీవితం పావనం అవుతుందని భక్తులు విశ్వాసం. ఈ ప్రాంగణంలో స్వామికి నివేదించిన అన్న ప్రసాదాలు(ఒభొడా) లభించడం పుణ్యప్రదంగా భావిస్తారు. శ్రీమందిరానికి యథాతధంగా తరలి వచ్చేలోగా జరిగే ప్రత్యేక ఉత్సవాలు యాత్రికుల్ని మరింత ఉత్సాహపరుస్తాయి. వీటిలో హిరా పంచమి, సంధ్యా దర్శనం(నవమి), మారు రథయాత్ర(బహుడా), హరి శయన ఏకాదశి(స్వర్ణాలంకారం), అధర సేవ, గరుడ శయనసేవ, నీలాద్రి విజే ప్రధానమైనవి. -
ఇకపై దేవస్థానంలో..భిక్షాటన నిషేధం
సాక్షి,భువనేశ్వర్/పూరీ: జగతి నాథుడు కొలువుదీరిన శ్రీ మందిరం లోపల, బయట చక్కటి ఆధ్యాత్మిక, ధార్మిక వాతావరణం కల్పించేందుకు పూరీ జిల్లా యంత్రాంగం నడుంబిగించింది. ఆలయ సంప్రదాయాలు, ఆచార–వ్యవహారాల సంస్కరణకు సుప్రీంకోర్టు ప్రత్యేకంగా శ్రద్ధ కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో సింహద్వారం పరిసరాల్లో ఇబ్బందికర పరిస్థితులను నివారించి, రోజువారీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. ఈ క్రమంలో సింహద్వారం పరిసరాల్లో బిక్షాటన, విక్రయ కేంద్రాలు, వాహనాల నిలుపుదల వంటి చర్యల నిర్మూలనకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు అధికారిక సమాచారం. జగన్నాథుని దర్శనం కోసం దేశ, విదేశాల నుంచి నిత్యం లెక్కకు మించిన భక్తులు, యాత్రికులు, పర్యాటకులు, సందర్శకులు వచ్చిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు కలెక్టర్ జ్యోతిప్రకాష్ దాస్ తెలిపారు. పార్కింగ్, విక్రయాలు కూడా.. రథయాత్ర సమయంలో మినహా ఇతర రోజుల్లో బొడొ–దండొ ప్రాంగణం అంతా కలుషితం కావడంతో అక్కడికి వచ్చే పర్యాటక వర్గానికి ఇబ్బంది కలిగిస్తోంది. ముఖ్యంగా అనధికారిక వాహనాల పార్కింగ్ యాత్రికులకు తీవ్ర ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. దీంతో పాటు సింహద్వారం పరిసరాల్లో చిరువ్యాపార దుకాణాలు, ఇతరేతర వ్యవహారాలు కూడా యాత్రికులు, పర్యాటకులకు అసౌకర్యాన్ని కలిగిస్తున్నాయి. వీటితో పాటు ఆలయ పరిసరాల్లో జరిగే బిక్షాటన కూడా విచారకర పరిస్థితులను ప్రేరేపిస్తోంది. సింహద్వారం పరిసరాల్లో ఆబోతుల స్వైరవిహారం నిర్మూలనకు కూడా జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇదే పరిసరాల్లో వాహనాల అనధికారిక పార్కింగ్‌ను కూడా నిషేధించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు జిల్లా పోలీసు యంత్రాంగం చెబుతోంది. అలాగే పరిసరాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు రాత్రింబవళ్లు జవానులతో పహారా ఏర్పాటు చేస్తున్నామని పోలీసు సూపరింటెండెంట్ ఉమాశంకర దాస్ తెలిపారు. ప్రతిపాదిత కార్యాచరణ విజయవంతం జగన్నాథుని ప్రధాన దేవస్థాన ప్రవేశద్వారం పరిసరాల్లో చక్కటి పర్యావరణం కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రతిపాదిత కార్యాచరణను ప్రయోగాత్మకంగా ఆదివారం ప్రారంభించింది. రోజంతా ఈ కార్యాచరణను ప్రయోగాత్మకంగా నిర్వహించి, సింహద్వారం పరిసరాల్లో అనధికారిక పార్కింగ్, బిక్షాటన, విక్రయ సంస్థల నిర్మూలన వంటి చర్యలను విజయవంతంగా నిర్వహించారు. -
వైభవంగా రథయాత్ర
భువనేశ్వర్/పూరీ: శ్రీ జగన్నాథుని రథ యాత్ర శనివారం పూరీలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశ, విదేశాల నుంచి తరలివచ్చిన లక్షలాది భక్తజన సందోహం నడుమ జగన్నాథుడు, బలభద్రుడు, దేవీ సుభద్ర విగ్రహాలతో కూడిన రథాలు శ్రీ మందిరం నుంచి అక్కడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుండిచా ఆలయానికి బయలుదేరాయి. పూరీ గజపతి మహారాజా దివ్య సింఘ్ దేవ్ రథాల్ని బంగారు చీపురుతో శుభ్రం చేసి దేవతలకు మంగళ హారతి సమర్పించడంతో యాత్ర ప్రారంభమయింది. జగన్నాథుని నందిఘోష్ రథం సకాలంలో శనివారం సాయంత్రానికి గమ్యం చేరలేక పోయింది. గుండిచా మందిరానికి సమీపంలో ఆగిపోయింది. దీంతో ఇక్కడే రథంపై ఉన్న జగన్నాథునికి సేవాదులు నిర్వహిస్తారు. కాగా, రథయాత్ర సజావుగా సాగేందుకు కీలక ప్రాంతాల్లో భారీగా సీసీ టీవీలను అమర్చారు. సుమారు 5,200 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ఒడిశా స్విఫ్ట్ యాక్షన్ ఫోర్స్‌ను మోహరించారు. -
గొంతులో పూరీ ఇరుక్కుని మహిళ మృతి
నిజామాబాద్ : నిజామాబాద్ పోచమ్మ కాలనీలో విషాదం నెలకొంది. టిఫిన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ గొంతులో పూరీ ఇరుక్కుని చింతకుంట రాధ అనే మహిళ మృతి చెందింది. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా విషాహారం వల్ల ఈ ఘటన జరిగిందా అనే అనుమానంతో మృతురాలి సోదరుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు పోస్ట్‌మార్టంకు ఆదేశించారు. పూరీ గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడకే మహిళ మృతి చెందినట్లు వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడించారు.