ఆనపకాయ పూరీ తయారీకి కావల్సినవి:
ఆనపకాయ – 1 (తొక్క తీసేసి.. గింజలు తొలగించి.. ముక్కలను మెత్తగా ఉడికించి, కాస్త చల్లారాక మిక్సీ పట్టుకోవాలి)
గోధుమ పిండి –3 కప్పులు, గోరువెచ్చని నీళ్లు – సరిపడా
మైదాపిండి – 1 టేబుల్ స్పూన్, జీలకర్ర, వాము – అర టీ స్పూన్ చొప్పున (కచ్చాబిచ్చా మిక్సీ చేసుకోవాలి)
కొత్తిమీర తురుము – 2 టేబుల్ స్పూన్లు, ఎండు మిర్చి పొడి– 1 టీ స్పూన్ (ఎండు మిరపకాయలను కచ్చాబిచ్చాగా మిక్సీ పట్టాలి)
పసుపు – చిటికెడు,ఉప్పు – తగినంత,నూనె – సరిపడా
\
తయారీ విధానమిలా:
ముందుగా ఒక బౌల్ తీసుకుని.. అందులో ఆనపకాయ గుజ్జు, గోధుమ పిండి, మైదాపిండి, కొత్తిమీర తురుము, ఎండుమిర్చి పొడి, జీలకర్ర, వాము మిశ్రమం, ఉప్పు, పసుపు, అర టీ స్పూన్ నూనె వేసుకుని, సరిపడా గోరువెచ్చని నీళ్లతో మెత్తగా ముద్దలా చేసుకోవాలి. 20 నిమిషాలు పక్కన పెట్టుకుని.. నూనె అప్లై చేసుకుంటూ చిన్న చిన్న పూరీల్లా సిద్ధం చేసుకోవాలి. తర్వాత కళాయిలో నూనె కాగనిచ్చి.. పూరీలను వేయించాలి.
Comments
Please login to add a commentAdd a comment