గొంతులో పూరీ ఇరుక్కుని మహిళ మృతి
నిజామాబాద్ : నిజామాబాద్ పోచమ్మ కాలనీలో విషాదం నెలకొంది. టిఫిన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ గొంతులో పూరీ ఇరుక్కుని చింతకుంట రాధ అనే మహిళ మృతి చెందింది. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా విషాహారం వల్ల ఈ ఘటన జరిగిందా అనే అనుమానంతో మృతురాలి సోదరుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు పోస్ట్మార్టంకు ఆదేశించారు. పూరీ గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడకే మహిళ మృతి చెందినట్లు వైద్యులు పోస్ట్మార్టం నివేదికలో వెల్లడించారు.