woman dead
-
పోటీ పరీక్ష రాసేందుకు వెళుతూ..
మర్రిపాలెం: రాజమహేంద్రవరం శివారు గామన్ వంతెనపై బుధవారం అర్ధరాత్రి కావేరి ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తాపడిన ఘటనలో నగరంలోని 53వ వార్డు మర్రిపాలెం పార్వతీనగర్‌కు చెందిన హోమిని కల్యాణి (21) మృతి చెందింది. దువ్వాడలోని ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న కల్యాణి కాంపిటేటివ్ పరీక్ష రాయడానికి హైదరాబాద్ బయలుదేరింది. బుధవారం రాత్రి ఎన్ఏడీ కొత్తరోడ్డులో బస్సు ఎక్కగా..అర్ధరాత్రి రాజమండ్రి గామన్ వంతెన వద్ద బస్సు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. ప్రమాదంలో కల్యాణి అక్కడికక్కడే మృతి చెందగా, మరో పది మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతురాలు శరీరం నుజ్జునుజ్జవ్వడం అందర్నీ కలచి వేసింది. గురువారం సాయంత్రం కల్యాణి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అందివచ్చిన కుమార్తె ఇలా విగతజీవిగా ఉండడాన్ని తల్లిదండ్రులు, బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. కల్యాణి తండ్రి రాఘవదాస్ రైల్వే ఉద్యోగి కాగా.. తల్లి లక్ష్మి(లత) గృహిణి. వీరికి ఇద్దరు కుమార్తెలు, కాగా పెద్ద కుమార్తె మేఘన ఇంజినీరింగ్ పూర్తి చేసి ఉన్నత చదువులకు సిద్ధమవుతోంది. కల్యాణి ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతోంది. ఈ క్రమంలో కాంపిటేటివ్ పరీక్ష రాసేందుకు వెళుతూ మృతిచెందడంతో పార్వతినగర్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. -
క్రాస్ వీల్ నుంచి పడి యువతి మృతి..
చంద్రగిరి(తిరుచానూరు): సరదాగా గడపాలని ఆటవిడుపు కోసం వచ్చిన మహిళా ప్రమాదవశాత్తు మృత్యు వాత పడగా, మరో మహిళా తీవ్ర గాయాలపాలైన ఘటన తిరుచానూ రు శిల్పారామంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... తిరుపతి అర్బన్ మండలం సుబ్బారెడ్డి నగర్‌కు చెందిన లోకేశ్వరి(22) తన స్నేహితురాలు గౌ తమి అలియాస్ పండుతో కలసి ఆటవిడుపు కోసం తిరుచానూరు సమీపంలోని శిల్పారామానికి చేరుకుంది. సుమారు గంట పాటు శిల్పారామంలో ప లు ప్రాంతాలను సందర్శించి, ప్రశాంత వాతావరణంలో ఆహ్లాదకరంగా గడిపారు. ఈ క్రమంలో అక్కడే ఏర్పాటు చేసిన క్రాస్‌వీల్ ఎక్కారు. ఇద్దరు మహిళలు కూర్చుని తి రుగుతుండగా క్రాస్‌వీల్ ఉన్నట్టుండి విరిగి పడిపోయింది. ఈ ప్రమాదంలో లోకేశ్వరి, ఆమె స్నేహితురాలు గౌతమి గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నిర్వాహుకులు తేరుకుని, 108కు సమాచారం అందించారు. అనంతరం క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతి రుయాకు తరలించారు. అక్కడ వైద్య పరీక్షలను ని ర్వహించిన వైద్యులు అప్పటికే లోకేశ్వరి మృతి చెందినట్లు నిర్ధారించగా, గౌతమి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. మెరుగైన వైద్యం కోసం గౌతమిని తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భారీ వర్షాలతో కూలిన బిల్డింగ్.. మహిళ మృతి
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లపై ఎక్కడికక్కడ నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దీంతో రహదారులపై విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. అంధేరి సబ్వే ఐదు అడుగుల మేర నీటితో నిండిపోవడంతో అధికారులు ఈ సబ్వేను మూసివేశారు.విస్తారంగా కురుస్తున్న వర్షాలతో ముంబైలోని గ్రాంట్ రోడ్డులో ఓ బహుళ అంతస్తుల బిల్డింగ్‌లోని కొంతభాగం కూలిపోయింది. ఈ ఘటనలో 70 ఏళ్ల వృద్ధ మహిళ ప్రాణాలు కోల్పోయింది. మరో నలుగురికి గాయాలయ్యాయి. గ్రాంట్ రోడ్ రైల్వే స్టేషన్ సమీపంలోని స్లీటర్ రోడ్డులో నాలుగు అంతస్తుల రూబినిస్సా మంజిల్ భవనంలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బిల్డింగ్ రెండు, మూడు అంతస్తుల్లోని బాల్కనీతోపాటు కొంత భాగం కూలిపోయింది.సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు ప్రారంభించాయి. అయితే భవనం కూలిపోయే సమయానికి అందులో 35 నుంచి 40 మంది చిక్కుకొని ఉన్నట్లు అధికారులు తెలిపారు. వారందరినీ సురక్షితంగా బయటకు తీసుకుకొచ్చినట్లు పేర్కొన్నారు. ఇప్పటికీ బిల్డింగ్ ముందు కొంత భాగం ప్రమాదకరంగా వేలాడుతూనే ఉంది.ఈ ఘటనకు చెందిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో శిథిలాల కింద ఇరుక్కుపోయిన వ్యక్తిని రక్షించేందుకు స్థానికులు కాంక్రీట్ స్లాబ్‌లను తొలగిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇక గత మూడు రోజులుగా ముంబై, దాని పరిసర ప్రాంతాల్లో వర్షాలు పడటం, బిల్డింగ్ శిథిలావస్థలో ఉండటమే ప్రమాదానికి కారణంగా అధికారులు భావిస్తున్నారు. Today, G+4 storey Rubinisa Manzil building came crashing down at 10.55 am. Around 35-40 people were in the building at the time of the collapse. Rescuers are looking for survivors trapped under the debris.1 woman feared dead, 3 injured. 😰#GrantRoad #Mumbai pic.twitter.com/XtGws2pizq— ѕυηιтαנα∂нαν (@01greenelephant) July 20, 2024 -
నిర్మల్ జిల్లాలో దారుణం.. ప్రియురాలి దారుణ హత్య
నిర్మల్: నిర్మల్‌జిల్లా ఖానాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. నడిరోడ్డుపై ప్రియురాలని హత్య చేశాడో యువకుడు. తనతో పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలని హతమార్చాడు. అడ్డుకోబోయిన మరో ఇద్దరిపై కూడా దాడి చేశాడు. వివరాలు.. ఖానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ముగ్గురుపై అదే కాలనీకి చెందిన శ్రీకాంత్ అనే యువకుడు గొడ్డలితో దాడి చేశాడు. ఈ దాడిలో షెట్పల్లి అలేఖ్య(23) అనే యువతి అక్కడికక్కడే మృతి చెందారు. అలేఖ్య వదిన షెట్పల్లి జయా (25) , కొడుకు షెట్పల్లి రియన్స్ (3)కు తీవ్ర గాయాలు కాగా వారిని ఆసుపత్రికి తరలించారు. ఆలేఖ్య, జయా, రియాజ్.. ఖానాపూర్ మార్కెట్‌కు వచ్చి పెళ్లి సామాను కొనుగోలు చేసి ఇంటికి వెళ్తున్న సమయంలో శివాజీ నగర్ శివారులో శ్రీకాంత్ అనే యువకుడు కాపు కాసి దాడి చేశాడు. అయితే అలేఖ్యకు మరో యువకుడితో నెల క్రితం వివాహం నిశ్చయమైంది. దీనిని తట్టుకోలేక అలేఖ్యపై ఈ దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. తనను కాదని మరో వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోవడంతో గొడ్డలితో ఆమెపైకి దాడికి చేసినట్లు సమాచారం. -
అమ్మానాన్న క్షమించండి!
కర్నూలు: ‘‘అమ్మానాన్న నన్ను క్షమించండి.. మీరు చెప్పిన మాట విననందుకు నాకు తగిన శాస్తి జరిగింది. నా గురించి బాధ పడకండి.. తమ్ముడు, చెల్లి గురించి ఆలోచించండి.. ధైర్యంగా ఉండండి.. నా చావుకు కారణం వినోద్ అలియాస్ ప్రవీణ్‌కుమార్, అతని తల్లిదండ్రులు లక్ష్మీదేవి, బక్కన్న, బావ శోభన్, బాబాయి మధుబాబు, మరో ఐదుగురు మేనత్తలు’’ అంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. కర్నూలు పీవీ నరసింహారావు నగర్‌కు చెందిన మధు, శేఖమ్మలకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. మధు..బి.క్యాంప్‌లోని దిన్నెదేవరపాడుకు వెళ్లే రోడ్డులో ఉన్న ఆర్మీ క్యాంటీన్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన కుమార్తె పద్మావతిని బీకామ్ కంప్యూటర్స్ చదివించారు. ఈ యువతి కర్నూలులోని ఓ షోరూమ్‌లో పనిచేస్తుండగా నందికొట్కూరు మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వినోద్‌కుమార్‌తో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. కొంతకాలానికి వినోద్‌కుమార్ అనంతపురం జిల్లాలోని కియా పరిశ్రమకు బదిలీపై వెళ్లాడు. ఇద్దరూ కలసి వివాహం చేసుకోవాలనుకున్నారు. మార్చి 9వ తేదీన వీరికి నిశి్చతార్థం జరిగింది. జూన్ 10వ తేదీన పెళ్లి వేడుకలు జరిపించేందుకు ఇరు కుటుంబాలు అంగీకరించి పత్రికలు కూడా పంచుకున్నారు. అయితే పద్మావతి వయసు తనకంటే పెద్దదని తర్వాత తెలుసుకుని జూపాడుబంగ్లా పీఎస్‌లో వినోద్ కుమార్ ఫిర్యాదు చేసి మే 29వ తేదీన మరో మహిళను పెళ్లి చేసుకున్నాడు. దీంతో పద్మావతి కుటుంబ సభ్యులు కూడా దిశ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఇరు కుటుంబాలను కౌన్సెలింగ్‌కు రావలసిందిగా పోలీసులు సూచించగా సోమవారం తెల్లవారుజామున పద్మావతి ఇంట్లో క్రిమిసంహారక మందు తాగి వాంతులు చేసుకుంటుండగా కుటుంబ సభ్యులు కనుక్కొని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక కొద్దిసేపటికే పద్మావతి మృతిచెందింది. నాల్గో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
షాకింగ్ ఘటన.. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిన మహిళ..
సాక్షి, ఖమ్మం: జిల్లాలోని అర్బన్ అల్లిపురంలో విషాద ఘటన జరిగింది. పెళ్లి ఊరేగింపులో డ్యాన్స్ చేస్తూ ఓ మహిళ సడన్‌గా కుప్పకూలింది. అనంతరం హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. ఆమె చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె బ్రెయిన్ స్ట్రోక్‌తో మరణించినట్లు నిర్ధారించారు. మృతురాలి పేరు రాణి. బంధువుల పెళ్లికి హాజరై ఊరేగింపులో ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ప్రాణాలు కోల్పోయింది. దీంతో అప్పటిదాకా ఆనందంగా సాగుతున్న పెళ్లి వేడుకలో విషాదం నెలకొంది. రాణి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఊరేగింపును అర్ధాంతరంగా నిలిపివేశారు. చదవండి: పెళ్లింట విషాదం.. అప్పుడు వరుడి తండ్రి.. ఇప్పుడు వధువు తండ్రి.. -
గాల్లోకి ఎగిరి.. కూలీలపైకి దూసుకెళ్లిన కారు.. వివాహిత మృతి!
యడ్లపాడు: సినీఫక్కిలో రోడ్డుపై వెళ్తున్న కారు ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పొలంలోకి దూసుకెళ్లి తోటలో పూలు కోస్తున్న కూలీ మృత్యువాత పడిన సంఘటన మండలంలో శనివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..మంగళగిరిలోని ఎన్ఆర్ఐ వైద్యకళాశాల విద్యార్థులు ఏడుగురు కొండవీడు సందర్శనకు శనివారం ఉదయం బయలుదేరారు. రెండు బైకులపై నలుగురు విద్యార్థులు, మరో ముగ్గురు వారి వెనుక కారులో ప్రయాణిస్తున్నారు. మండలంలోని కొత్తపాలెం నుంచి కొండవీడు ఘాట్‌రోడ్డుకు వెళ్లే మార్గంలో వేగంలో ఉన్న కారు అదుపుతప్పింది. బీటీరోడ్డు పక్కనే ఉన్న మట్టికట్టపై ఎక్కడంతో కారు పైకెగిరి గాల్లోనే 20 మీటర్ల దూరాన లోతట్టుగా ఉన్న రాట్నాల యలమంద సాగు చేస్తున్న కనకాంబరం తోటలోకి వెళ్లి పడింది. సరిగ్గా ఆ సమయంలో పూలు కోస్తున్న కొత్తపాలెం గ్రామానికి చెందిన మలమంటి శివకుమారి (42)ని కారు ఢీకొనడంతో పాటు ఆమెను ఈడ్చుకువెళ్లింది. కారు ముందుటైరుపేలిపోవడంతో కొద్దిదూరం వెళ్లి పూలతోటలోనే ఆగిపోయింది. దీంతో కూలీ శివకుమారి తలకు బలంగానూ, అలాగే కారులోని ముగ్గురిలో ఓ విద్యార్థికి కూడా గాయాలయ్యాయి. అప్పటి వరకు శివకుమారితో పాటు పని చేసి పక్కనే ఉన్న మరో తోటలో పూలు కోస్తున్న ఆమె కుమార్తె శిరీష, కూలీలు పరుగున వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. నరసరావుపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శివకుమారిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. అందరూ చూస్తుండగానే ఊహించని విధంగా రోడ్డుపై వెళ్లే వాహనం గాల్లోంచి వచ్చి పూలతోట లో పనిచేస్తున్న మహిళను ఢీకొని మృతి చెందడాన్ని గ్రామస్తులు జీర్ణించు కోలేకపోతున్నారు. కుమార్తెతో పాటు తోట సీతమ్మ, రాట్నాల మంగమ్మలు శివకుమారిని పక్కతోటలో పూలు కోసేందుకు పిలిచినా, అక్కడి మొక్కలు ఎత్తుతక్కువలో ఉన్నాయని తాను ఒంగి పనిచేయలేనంటూ అక్కడే ఉండటంతో కారు రూపంలో మృత్యువు వెంటాడిందని చెప్పుకుని కన్నీరుమున్నీరవుతున్నారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కారు స్వాధీనం చేసుకుని, అందులో ప్రయాణిస్తున్న యువకుల్ని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కుటుంబ సభ్యుల నుంచి ఫిర్యాదు అందుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పైడి రాంబాబు తెలిపారు. మృతురాలికి భర్త ఆదినారాయణ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. బాధాకరమైన సంఘటన! పూలతోటలోకి కారు దూసుకొచ్చిన ప్రమాదంలో మృతి చెందిన వైఎస్సార్సీపీ నాయకులు మాధవరావు సోదరి శివకుమారి మృతి బాధాకరమని ఎమ్మెల్యే విడదల రజిని చెప్పారు. శనివారం కొత్తపాలెం గ్రామంలోని శివకుమారి భౌతికకాయాన్ని పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగఢ సానుభూతిని తెలిపారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. ఆమె వెంట పార్టీ నాయకులు, గ్రామపెద్దలు ఉన్నారు. చదవండి: కోవిడ్ వ్యాక్సిన్ దుష్ప్రభావాలపై విచారణ కమిటీని కోరిన మంత్రి ఇక లేరు! -
మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం.. తల్లీబిడ్డా మృతి
సాక్షి, చెన్నై: రాత్రి వేళ పురిటి నొప్పులు రావడంతో స్థానిక మహిళలు ప్రసవం చేశారు.. తల్లీ బిడ్డా అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో మృతిచెందారు. ఈ విషాదకర ఘటన పెరంబలూరు జిల్లాలో జరిగింది. వెప్పంతడై తాలూకా అంకూర్ గ్రామానికి చెందిన దిలీప్‌కుమార్ భార్య సెల్వరాణి (36) దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ క్రమంలో సెల్వరాణి మూడో గర్భం దాల్చింది. ఈ నెల 4వ తేదీ రాత్రి నొప్పులు రావడంతో ఇరుగుపొరుగు మహిళల సాయంతో ఇంట్లోనే ప్రసవం చేశారు. ఆడబిడ్డ పుట్టింది. కొద్ది సమయానికి ఇద్దరూ అస్వస్థతకు గురికావడంతో బంధువులు 108లో పెరంబలూరు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యలో ఇద్దరూ మృతి చెందారు. మంగళమేడు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. చదవండి: దొంగ అనుకుని చావబాదారు.. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి -
చికిత్స కోసం ఆస్పత్రికి.. చనిపోయిందనడంతో తీసుకొచ్చినవారు పరార్
దుండిగల్: అపస్మారక స్థితిలో ఉన్న ఓ గుర్తుతెలియని మహిళను ఆస్పత్రికి తీసుకొచ్చిన వ్యక్తులు తీరా ఆమె చనిపోయిందని తెలియడంతో పరారైన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల సమాచారం మేరకు... ఈ నెల 16న రాత్రి 10:25 గంటల సమయంలో సూరారంలోని నారాయణ మలారెడ్డి ఆస్పత్రికి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో ఓ మహిళను చికిత్స నిమిత్తం తీసుకొచ్చారు. సదరు మహిళను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందిందని చెప్పారు. దీంతో ఇద్దరు వ్యక్తులు అక్కడ నుంచి పరారయ్యారు. ఆస్పత్రి సిబ్బంది వారి కోసం వెతకగా కనిపించలేదు. దీంతో ఆస్పత్రి సిబ్బంది శనివారం దుండిగల్ పోలీçసులకు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో పరిశీలించగా ఆటోలో వెళ్లిపోయినట్లు కనిపించింది. స్పష్టత లేకపోవడంతో సదరు వ్యక్తులను గుర్తించలేకపోయారు. మహిళ ఎడమ చేతిపై లక్ష్మి, కుడి చేతిపై ‘ఎం’ అనే అక్షరాలతో పచ్చబొట్లు ఉన్నాయని, మెడలో మంగళసూత్రం, చేతులు, కాళ్లకు పారాణి ఉండటంతో కొత్తగా పెళ్లై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మహిళ వయసు సుమారు 25 సంవత్సరాలు ఉంటుందని, కుటుంబ గొడవల నేపథ్యంలో హత్యాయత్నం జరిగిందా లేదా ఇతరాత్రా కారణాలతో మృతి చెంది ఉంటుందా అనే కోణంలో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ కుటుంబ సభ్యులెవరైనా ఉంటే దుండిగల్ పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని కోరారు. -
విషాదం: ఆస్పత్రికి చేరకుండానే...
హత్నూర(సంగారెడ్డి): జ్వరంతో బాధపడుతున్న ఓ మహిళ తన భర్తతో కలసి ఆటోలో ఆసుపత్రికి వెళ్తూ మార్గమధ్యలోనే ప్రాణాలు విడిచింది. ఆటోడ్రైవర్ భయంతో రోడ్డుపైనే దించేసి వెళ్లిపోయాడు. దిక్కుతోచని ఆ వ్యక్తి తన భార్య మృతదేహాన్ని రోడ్డు పక్కన పెట్టుకొని రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది. వివరాలు... సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం లక్మాతండాకు చెందిన మాలోత్ మరోని(50)కి ఆరోగ్యం బాగా లేకపోవడంతో భర్త పాండునాయక్ శనివారం ఆమెను దౌల్తాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్షించిన వైద్యులు సంగారెడ్డికి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో దంపతులిద్దరూ ఆటో మాట్లాడుకుని సంగారెడ్డికి బయలుదేరారు. దారిమధ్యలో బోర్పట్ల బస్సు స్టేజీ సమీపంలోకి చేరుకోగానే తీవ్ర అస్వస్థతకు గురైన మరోని ఆటోలోనే తనువు చాలించింది. దీంతో భయపడిన ఆటోడ్రైవర్ అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఏం చేయాలో తోచని పాండునాయక్, భార్య మృతదేహాన్ని రోడ్డు పక్కనే పడుకోబెట్టి కన్నీరు మున్నీరయ్యాడు. అదే సమయంలో అటుగా వెళ్తున్న కొందరు వ్యక్తులు పాండును ఓదార్చడంతోపాటు తండావాసులకు సమాచారం ఇచ్చారు. తండావాసులు మరో వాహనం తీసుకువచ్చి మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. నాయక్ దంపతులకు నలుగురు కూతుళ్లు కాగా, అందరికీ వివాహాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. చదవండి: పత్తి.. వరి.. కంది -
దారుణం: దురాచారం మహిళ ప్రాణం తీసింది
గుడిహత్నూర్(బోథ్): ఓ దురాచారం మహిళ ప్రాణం తీసిన సంఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మం డలం ధరమడుగు గ్రామంలో చోటుచేసుకుంది. మావల మండలంలోని వాఘాపూర్‌కు చెందిన సునీత (22)కు మండలంలోని ధరమడుగుకు చెందిన ఆత్రం సంతోష్‌తో మూడేళ్ల కిందట వివాహమైంది. వీరికి రెండేళ్ల కిందట బాబు పుట్టగా.. అనారోగ్య సమస్యలతో కొన్నిరోజులకే మృతిచెందాడు. మళ్లీ సంతానం కోసం నిష్టతో పెద్దలు చెప్పినట్లుగా ఉంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఆమెకు రుతుక్రమం వచ్చింది. వీరి ఆచారం ప్రకారం రుతుక్రమం వచ్చిన మహిళ ఇంటి బయటే ఉండాలి. దీంతో సునీత సోమవారం రాత్రి ఇంటి బయట నేలపై పడుకోగా.. రాత్రి 11 గంటల సమయంలో పాము కాటేసింది. ఆమె బాధతో మూలగడంతో.. పక్కనే మంచంపై పడుకున్న భర్త సంతోష్ వెంటనే ఆమెను రిమ్స్‌కు తరలించాడు. అక్కడ చికిత్స పొందుతూ సునీత ప్రాణాలు కోల్పోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. చదవండి: సగం కాలిన మృతదేహాలు.. పీక్కు తింటున్న కుక్కలు -
అంబులెన్స్ ఆలస్యం.. మహిళ మృతి
రాంచీ: సమయానికి అంబులెన్స్ రాక మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన జార్ఖండ్‌లో జరిగింది. గుమ్లా జిల్లాలోని సదర్ ఆస్పత్రిలో సదాన్ దేవి(48) గత నెల 29న చేరారు. అయితే ఆమె పరిస్థితి ఉన్నట్టుండి విషమంగా మారడంతో వైద్యులు రాంచీలోని రాజేంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (రిమ్స్)కు తీస్కెళ్లాల్సిందిగా శుక్రవారం మధ్యాహ్నం సూచించారు. బాధితురాలి బంధువులు అంబులెన్స్‌కు ఫోన్ చేశారు. అయితే అంబులెన్స్ మూడు గంటలు ఆలస్యంగా వచ్చింది. ఆమెను రిమ్స్‌కు తరలించినా ఆలస్యం కావడంతో మరణించింది. అంబులెన్స్ డ్రైవర్ ఆలస్యం చేయడమే దీనికి కారణమని వైద్యులు తెలిపారు. -
పూజలోనే మృత్యు ఒడిలోకి..
రాయచోటిటౌన్: ఆమె పూజలో కూ ర్చుంది.. పూజ ప్రారంభమైంది.. అలా కూర్చున్న చోటనే నేలకొరిగింది. ఉదయం నుంచి ఉపవాసం ఉండటంతో నీరసించి ఉంటుందని అక్కడి వారు అం దరూ సపర్యలు చేశారు. కానీ ప్రయోజనం లేదు. అప్పటికే ఆమెను మృత్యువు ఆహ్వానించింది. వివరాల్లోకి వెళితే.. రాయచోటి డైట్ పాఠశాలలో హిందీ పం డిట్గా పని చేస్తున్న చంద్రశేఖర్ రెడ్డి, రత్నమ్మ (47) దంపతులు పట్టణంలోని గున్నికుంట రోడ్డుకు దగ్గరగా ఉన్న అల్తాఫ్ కల్యాణ మండపం సమీపంలో నివా సం ఉంటున్నారు. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. వారికి వివాహాలు అయ్యాయి. శుక్రవారం రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో వేలాది మంది ముత్తయిదువులతో కలసి సామూహిక వరలక్ష్మి వ్రతం చేపట్టారు. ఆ పూజలో పాల్గొని అమ్మవారికి మొక్కులు తీర్చుకోవాలని తెల్లవారు జామునే ఇంటిలోని పనులన్నీ పూర్తి చేసి 8గంటలకు ఉపవాసంతో ఆలయానికి చేరుకొంది. ఇంతలో ఒక్కసారిగా ఆమె ముందుకు వాలిపోయింది. ఆమె అనారోగ్యానికి గురై ఉంటుందని భావించి అక్కడి వారు ప్రాథమిక చికిత్స చేశారు. కానీ ఆమె స్పృహ కోల్పోయి పడి ఉండటంతో వెంటనే ఆటోలో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె అప్పటికే మృతి చెందిందని తెలిపారు. ఈ సంఘటన జరిగిన సమయంలో ఆమె భర్త తమిళనాడులోని తిరుణామళైలో బంధువుల పెళ్లికి వెళ్లి ఉన్నారు. విషయం తెలుసుకున్న బంధువులు ఆమె మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. -
స్కూటర్ ప్రమాదంలో మహిళ మృతి
జమ్మలమడుగురూరల్: ప్రొద్దుటూరు రహదారిలోని దానవులపాడు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో జమ్మలమడుగులోని కన్నెలూరుకు చెందిన డి. హుసేనమ్మ( 50) మృతి చెందింది. ఆమె కుమారుడు హుసేనయ్య గాయాలపాలయ్యాడు. పోలీసులు ఇచ్చిన వివరాల మేరకు.. కన్నెలూరు గ్రామానికి చెందిన హుసేనమ్మకు గత కొంత కాలం నుంచి ఆరోగ్యం సరిగా లేదు. గురువారం సాయంత్రం కుమారుడు హుసేనయ్యతో కలసి స్కూటర్లో దువ్వూరు గ్రామంలో ఉన్న దర్గాకు వెళుతుండగా మార్గమధ్యలో జమ్మలమడుగు మండలంలోని దానవులపాడు గ్రామం వద్దకు వెళ్లగానే ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించబోయి స్కూటర్ అదుపుతప్పి పోలాల్లోకి దూసుకెళ్లింది. ఈ సంఘటనలో హుసేనమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కుమారుడు హుసేనయ్యకు స్వల్పగాయాలయ్యాయి. వెంటనే 108 ద్వారా జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికు తరలించారు. డాక్టర్లు పరీక్షించి హుసేనమ్మ చనిపోయినట్లు తెలిపారు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ కొండారెడ్డి తెలిపారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ అవినాష్‌రెడి, సుధీర్‌రెడ్డి కన్నెలూరు గ్రామానికి చెందిన హుసేనమ్మ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డిలు ప్రభుత్వ ఆసుపపత్రికి వెళ్లారు. చికిత్స పొందుతున్న హుసేనయ్యను పరామర్శించారు. అనంతరం జరిగిన సంఘటనను అడిగి తెలుసుకున్నారు. -
మహిళ అనుమానాస్పద మృతి
మల్కాజిగిరి: ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్హెచ్ఓ కొమరయ్య కథనం ప్రకారం..గుంటూరు జిల్లా, రాజుపాలెంకు చెందిన పెమ్మ రమేష్, నాగలక్ష్మి దంపతులు సాయినగర్ గ్రీన్‌గోల్డ్ అపార్ట్మెంట్లో ఉంటున్నారు. వారికి కుమార్తె మోక్షాంజలి(4) ఉంది. సోమవారం తెల్లవారుజామున నాగలక్ష్మి అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతి చెందినట్లు సమాచారం అందడంతో డీసీసీ ఉమామహేశ్వరరావు, ఏసీపీ సందీప్ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. అనుమానాలెన్నో.. నాగలక్ష్మి పడివున్న తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగు అంతస్తులపై నుంచి కిందకు దూకినా అమె ఒంటిపై ఎక్కడా గాయాలు లేవు. ఆదివారం రమేష్, నాగలక్ష్మి మ్యారేజ్ డే సందర్భంగా జూబ్లిహిల్స్‌లోని జగన్నాథస్వామి గుడికి వెళ్లి వచ్చామని, మధ్యాహ్నం అమీర్‌పేటలో కంప్యూటర్ కోర్సు వెళ్లి వచ్చి రాత్రి ఇంట్లోనే భోజనం చేసి నిద్రపోయామని మృతురాలి భర్త రమేష్ తెలిపాడు. సోమవారం తెల్లవారుజామున తనకు మెలుకువ వచ్చి చూసే సరికి నాగలక్ష్మి కనిపించకపోవడంతో బయటకు రావడానికి ప్రయత్నించగా బయట గడియపెట్టి ఉండటంతో పక్క ప్లాట్‌లో ఉంటున్న వారికి ఫోన్ చేస్తే వారు గొళ్లెం తీసారన్నారు. సెక్యూరిటీ గార్డు సహాయంతో గాలించగా కిందపడి ఉన్న నాగలక్ష్మిని గుర్తించి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించానన్నాడు. కాగా తమ మథ్య ఎలాంటి గొడవలు లేవని, ఆమెకు ఆరోగ్య సమస్యలు కూడా లేవని రమేష్ పేర్కొన్నాడు. దర్యాప్తులో భాగంగా పోలీసు జాగిలాన్ని రప్పించడంతో జాగిలం నేరుగా అపార్ట్మెంట్ డాబా పైకి వెళ్లి నేరుగా నాగలక్ష్మి మృతదేహం వరకు వచ్చి ఆగిపోయింది. జాగిలం పైకి వెళ్లినప్పుడు నాగలక్ష్మి చున్నీని గుర్తించింది. నాగలక్ష్మి ఎడమ కాలి మడమ వద్ద,వెన్నుముక కింది భాగం(పెల్విక్) వద్ద గాయాలు ఉన్నట్లు గుర్తించారు. అనుమానాలున్నాయి : నాగలక్ష్మి తల్లితండ్రులు తమ కుమార్తె మృతిపై అనుమానాలు ఉన్నాయని నాగలక్ష్మి తండ్రి అచ్చయ్య, తల్లి కృష్ణకుమారి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం కూడా నాగలక్ష్మి ఫోన్ చేసిందని ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కన్నీటిపర్యంతమయ్యారు. నాగలక్ష్మి కుమార్తె మోక్షాంజలిని తల్లి మృతదేహం వద్దకు తీసుకెళ్లగా అమ్మ పడుకుందా అని అడగడం అందరినీ కదిలించింది. తమ కుమార్తె మృతిపై పూర్తి విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. ఎస్హెచ్ఓ కొమురయ్య మాట్లాడుతూ నాగలక్ష్మి తల్లితండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
దుస్తులు పట్టుకోబోయి.. చెరువులోకి జారి
నరసన్నపేట: ఎండకు ఆరబెట్టిన దుస్తులు గాలికి ఎగిరిపోవడాన్ని గమనించి వాటిని పట్టుకునేందుకు యత్నించిన ఒక మహిళ ప్రమాదవశాత్తూ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర సంఘటన నరసన్నపేట మండలం జమ్ము శివార్లులోని కోలవానిచెరువు వద్ద గురువారం జరిగింది. బొమ్మాళి అంకమ్మ(48), ఆమె భర్త సింహాచలం రజకవృత్తి చేస్తూ జీవనం సాగిస్తున్నారు. సింహాచలం ఆరోగ్యం బాగోలేకపోవడంతో అంకమ్మ ఒక్కరే గురువారం చెరువు వద్దకు వచ్చారు. వస్త్రాలను ఉతికి ఆరబెట్టారు. ఆరిన దుస్తులను భద్రపరుస్తుండగా ఒక్కసారి గాలివీచింది. మిగిలిన వస్త్రాలు గాలికి ఎగిరిపోవడంతో వాటిని పట్టుకునేందుకు ఆమె ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో చెరువు గట్టుపై నుంచి ఒక్కసారిగా లోపలికి జారిపోయారు. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో కాపాడలేకపోయారు. తల్లి ఎప్పటికీ ఇంటికి రాకపోవడంతో అనుమానించిన కుమారులు చెరువు వద్దకు వచ్చారు. అక్కడ ఆమె చెప్పులు ఉండటాన్ని గమనించి గాలించగా మృతదేహం లభ్యమైంది. ఈ వార్త తెలిసిన కుటుంబ సభ్యలు కన్నీరుమున్నీరయ్యారు. -
కాంతి పుంజం..తీసింది ప్రాణం
తుమకూరు: మిరిమిట్లు గొలిపే కాంతి పుంజం ఒకరి మృతికి కారణమైంది. కారు హెడ్లైట్ల వెలుతురులో దారి కనిపించక స్కూటీ ట్రాక్టర్‌ను ఢీకొంది. ఘటనలో ఒక మహిళ మృతి చెందగా మరో మహిళ గాయపడింది. ఈఘటన సోమవారం రాత్రి తుమకూరు జిల్లా, హులియూరు సమీపంలో చోటు చేసుకుంది. హులియూరు గ్రామ పంచాయతీ సభ్యుడు ఎస్ఎస్ఆర్ ధయానంద్ భార్య కళావతి(28) సోమవారం రాత్రి తన వదిన వినూతతో కలిసి తిపటూరు వెళ్లింది. తిరిగి వస్తుండగా హులియూరు వద్ద కారు ఎదురైంది. హెడ్లైట్ల వెలుతురులో దారి కనిపించక స్కూటీ ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఢీకొంది. ప్రమాదంలో కళావతి అక్కడికక్కడే మృతి చెందింది. మరో మహిళ వినూతకు తీవ్ర గాయాలయ్యాయి. హందనకెరె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని, క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఆర్టీసీ బస్ ఢీకొని సాఫ్ట్వేర్ ఉద్యోగిని మృతి
సాక్షి, హైదరాబాద్ : బంజారాహిల్స్ పెన్షన్ ఆఫీస్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని (25) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. మియాపూర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొనటంతో ఆమె ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కాగా ఐడీ కార్డు ఆధారంగా మృతురాలు స్పిన్స్‌సై సాఫ్ట్వేర్ కంపెనీ ఉద్యోగిని శిరీషగా గుర్తించారు. ఆమెకు ఇటీవలే వివాహం జరిగినట్లు తెలుస్తోంది. ఖైరతాబాద్ నుంచి కార్యాలయానికి వెళ్లే సమయంలో శిరీష రోడ్డు ప్రమాదానికి గురైంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తున్నారు. మరోవైపు బస్సు డ్రైవర్, కండక్టర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
యువకుడిపై కేసు నమోదు
టెక్కలి: టెక్కలి మండలం లింగాలవలస సమీపంలో ఈ నెల 25న జరిగిన ద్విచక్రవాహన ప్రమాదంలో జీరు రాజేశ్వరి అనే యువతి మృతి చెందిన కేసులో బాధ్యుడైన యువకుడిపై పదేళ్ల జైలు శిక్ష కలిగిన సెక్షన్లు నమోదు చేసినట్లు టెక్కలి సీఐ కె.భవానిప్రసాద్ తెలిపారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ మాట్లాడుతూ సంతబొమ్మాళి మండలం యామాలపేటకు చెందిన రఘు డిల్లేశ్వరరావు (అలియాస్ వినోద్) అదే మండలం మూలపేటకు చెందిన జీరు రాజేశ్వరితో ద్విచక్రవాహనంపై మితిమీరిన వేగంతో పాతపట్నం నుంచి వస్తుండగా లింగాలవలస సమీపంలో యువతి జారి పడటంతో మృతి చెందినట్లు పేర్కొన్నారు. దీనికి కారకుడైన యువకుడికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం ప్రధాన నేరంగా పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. పదేళ్ల పాటు జైలు శిక్ష కలిగిన 304 పార్ట్–2లో భాగంగా కల్ప్బుల్ హోమిసైడ్ నాట్ ఎమాంటింగ్ టు మర్డర్’ అనే కఠినతరమైన సెక్షన్‌ను యువకుడిపై నమోదు చేసి కోర్టుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వ్యక్తులపై, మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై, డ్రైవింగ్ అర్హత లేకుండా వాహనాలు నడిపిన మైనర్లపై ఈ సెక్సన్ అమలు చేస్తామని చెప్పారు. వాహన యజమానులకు సైతం ఇదే సెక్షన్ వర్తిస్తుందని పేర్కొన్నారు. -
తెలంగాణలో మళ్లీ స్వైన్ ఫ్లూ టెర్రర్
-
తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం
-
తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం
హైదరాబాద్ : తెలంగాణలో స్వైన్ ఫ్లూ కలకలం రేపుతోంది. యాదాద్రి జిల్లాకు చెందిన ఓ మహిళ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వైన్ ఫ్లూతో మృతి చెందింది. చికిత్స పొందుతున్న మరో ఇద్దరికి స్వైన్ ప్లూ ఉన్నట్లు నిర్థారణ అయింది. కాగా గత ఆరు నెలల కాలంలో ఇప్పటివరకూ ఆరుగురు మృత్యువాత పడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా 112 మందికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో జనం భయాందోళన చెందుతున్నారు. శీతాకాలం కావడంతో స్వైన్‌ఫ్లూ వేగంగా వ్యాపిస్తోందని వైద్యులు చెప్తున్నారు. తీవ్రమైన జలుబు, జ్వరంతోపాటు కీళ్లు, కండరాల నొప్పులతో బాధపడుతున్నవారు వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని సూచిస్తున్నారు. -
విషజ్వరంతో మహిళ మృతి
బోయినపల్లి : మండలంలోని తడగొండ గ్రామానికి చెందిన సారబుడ్ల రజిత(30) అనే వివాహిత విషజ్వరంతో మృతి చెందింది. రజిత, రమేష్‌రెడ్డి కుటుంబం కొంతకాలంగా కరీంనగర్‌లోని సూర్యనగర్‌లో నివాసం ఉంటూ తెలంగాణ చౌక్ సమీపంలో జీఎస్ టిఫిన్ సెంటర్, రెడ్డి చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నారు. రజితకు పది రోజుల క్రితం జ్వరం రాగా.. కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స చేయించారు. జ్వరం తగ్గకపోవడంతో హైదరాబాద్ తరలించారు. అక్కడ ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మూడు రోజులుగా చికిత్స పొందుతున్న రజిత బుధవారం మృతి చెందింది. -
లండన్‌లో ఉగ్రదాడి, మహిళ మృతి
-
లండన్‌లో ఉగ్రదాడి, మహిళ మృతి
లండన్‌లోని రసెల్ స్క్వేర్‌లో బుధవారం ఆర్ధరాత్రి దాటిన తర్వాత దారుణం జరిగింది. కత్తితో దాడి చేసిన ఓ వ్యక్తి ఒక మహిళను చంపడంతో పాటు ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాడు. భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 3.00 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. స్థానికులు పోలీసులకు ఫోన్ చేయడంతో.. వెంటనే పోలీసులు దాడిచేసిన వ్యక్తిని అరెస్టుచేశారు. దాడిలో ఆరుగురు గాయపడిన విషయాన్ని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు నిర్ధారించారు. మరో మహిళకు ఘటనా స్థలంలోనే చికిత్స అందించినా, కాసేపటి తర్వాత ఆమె మరణించారు. ఇది బహుశా ఉగ్రదాడి లాంటిదే కావచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకోడానికి ఓ అధికారి స్టన్ గన్ ఉపయోగించాల్సి వచ్చిందని ప్రకటనలో తెలిపారు. బ్రిటిష్ మ్యూజియంకు సమీపంలో ఉన్న ఈ ప్రాంతంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. క్షతగాత్రుల పరిస్థితి ఎలా ఉందన్న విషయం తెలియలేదు. -
అమెరికాలో ఇండో-అమెరికన్ మహిళ హత్య
శాన్ఫ్రాన్సిస్కో: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ ఇండో అమెరికన్ మహిళ దారుణ హత్యకు గురైంది. శాన్ జోన్‌లోని ఇండిగో ఓక్ లేన్‌లో నివాసముంటున్న 48 ఏళ్ల సోనియా నల్లాన్ ను ఆమె భర్త జేమ్స్ నల్లన్ అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ఈ దుర్ఘటన శనివారం జరిగినట్లు తెలుస్తుంది. మృతురాలు సోనియా నల్లాన్ ఎంకోర్ సెమీ కండక్టర్స్ అనే కంపెనీలో పనిచేస్తోంది. 63 ఏళ్ల ఆమె భర్త జేమ్స్ నల్లన్ కూడా ఇండో అమెరికన్ నే. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. నిందితున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు. -
పెళ్లి బృందానికి విషాదం
ప్రకాశం జిల్లాలో నేడు వివాహం విజయవాడ నుంచి బయలుదేరిన కాసేపటికే ప్రమాదం పెళ్లి బృందం ఆటోను ఢీకొట్టిన వ్యాన్ మహిళ మృతి 15 మందికి గాయాలు విజయవాడ (లబ్బీపేట) : పెళ్లి బృందంతో వెళ్తున్న టాటా ఏస్ ట్రక్ ఆటోను ఐషర్ వ్యాన్ ఢీకొట్టిన ఘటనలో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి గాయాలయ్యాయి. బెంజిసర్కిల్ సమీపంలో జరిగిన ఈ ఘటనలో పెళ్లి కుమార్తె తల్లిదండ్రులకు గాయాలయ్యాయి. దీంతో పెళ్లి ఇంట విషాదం నెలకొంది. వివరాల ప్రకారం.. పటమటలంక ఎన్ఎస్ఎం స్కూల్ సమీపంలో నివసించే వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి దంపతుల కుమార్తె వివాహం, ప్రకాశం జిల్లా గిద్దలూరులోని సమీ ప బంధువుతో శనివారం ఉదయం జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బంధువులతో కలిసి పెళ్లికి వెళ్లేందుకు శుక్రవారం వేకువజామున సిద్ధమయ్యారు. పెళ్లి కుమార్తెతోపాటు మరి కొందరు కారులో వెళ్లగా ఆమె తల్లిదండ్రులు, మరో 14 మంది రైలులో గిద్దలూరు వెళ్లేందుకు ట్రక్కు ఆటోలో రైల్వేస్టేషన్‌కు బయలుదేరారు. ఆటో నిర్మలా కాన్వెంట్ రోడ్డులోకి వచ్చి జాతీయ రహదారి దాటుతుండగా బెంజిసర్కిల్ వైపు నుంచి వస్తున్న ఐషర్ వ్యాన్ ఢీకొట్టింది. క్షతగాత్రులను 108లో తొలుత ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అనంతరం మెరుగైన చికిత్స కోసం హెల్ప్ ఆస్పత్రికి తరలించారు. అయితే అల్లూరమ్మ(37) మృతి చెందగా, పెళ్లి కుమార్తె తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు, నాగలక్ష్మి, బంధువులు రమణమ్మ, సూరీడమ్మ, పిచ్చమ్మ, ఆదిలక్ష్మి, నాగేంద్ర, శ్రీదేవి, సూర్య డు, మహాలక్ష్మి, అనూష, తరుణ్, మాలమ్మ, మునిశేఖర్లతోపాటు ఎనిమిదేళ్ల చిన్నారి కృష్ణవేణికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. అల్లూరమ్మ మృతదేహానికి ప్రభుత్వాస్పత్రిలో పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం అనంతరం బంధువులకు అప్పగించారు. -
చలి మంట అంటుకుని యువతి మృతి
కోటపల్లి (ఆదిలాబాద్) : చలి మంట వద్ద కూర్చున్న యువతి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రగాయాలతో చనిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కోటపల్లిలో చోటుచేసుకుంది. కోటపల్లికి చెందిన రంగు ముత్తయ్య, మల్లక్క దంపతుల కుమార్తె మానస(18) ఇంటర్ వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉదయం ఆమె చలి మంట వద్ద కూర్చుని ఉంది. మంట సరిగా రాకపోవటంతో కుటుంబసభ్యులు కిరోసిన్ చల్లారు. దాంతో ఒక్కసారిగా మంటలు రేగి మానస దుస్తులకు అంటుకున్నాయి. వారు ఆర్పేలోగానే ఆమె తీవ్ర గాయాలపాలైంది. కుటుంబసభ్యులు మొదట చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూర్ రూరల్ సీఐ రాములు తెలిపారు. -
ఆటో బోల్తా: మహిళ మృతి
కంచికచర్ల (కృష్ణా జిల్లా) : కంచికచర్ల మండలం బత్తినపాడు వద్ద సోమవారం ఓ ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో కంచికచర్ల మండల కేంద్రం హనుమాన్‌పేటకు చెందిన సి.నాగమణి(48) అనే మహిళ మృతిచెందింది. ఆటో చెవిటికల్లు నుంచి కంచికచర్ల వెళ్తుండగా ముందు వెళ్తున్న బైక్‌ను తప్పించబోయి బోల్తా కొట్టింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
కారు బోల్తా: మహిళ మృతి
పులివెందుల (వైఎస్సార్ జిల్లా) : వైఎస్సార్ జిల్లా పులివెందులలోని నామాలగుండు వద్ద ఓ కారు బోల్తా పడి జయకళ(38) అనే ఉపాధ్యాయురాలు మృతిచెందారు. ఈ ప్రమాదం మంగళవారం సాయంత్రం 5 గంటలకు జరిగింది. గొల్లపల్లి తాండాలో పనిచేస్తున్న ఆమె అటుగా వస్తున్న కారులో లిఫ్ట్ అడిగి ఎక్కారు. అయితే పులివెందుల శివారులో కారు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. క్షతగాత్రులను పులివెందుల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
భోగాపురం: విజయనగరం జిల్లాలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందగా... మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖపట్టణం నుంచి విజయనగరం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు భోగాపురం మండలం మహారాజుపేట పెట్రోల్ బంక్ సమీపంలో ముందు వెళ్తున్న ఆటో ట్రాలీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఓ మహిళ చనిపోగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకన్న పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది. -
వివాహానికి వెళ్తూ మృత్యుఒడికి..
సదాశివపేట (మెదక్) : భర్త, రెండేళ్ల కూతురుతో కలిసి ఆనందంగా బంధువుల వివాహానికి వెళుతూ మార్గమాధ్యంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వివాహిత దుర్మరణం చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. మునిపల్లి మండలంలోని మేళసంగేం గ్రామం నుంచి సదాశివపేట మండలం కొల్కూర్ గ్రామంలో బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ఆదివారం గంగ(24) , భర్త అశోక్, రెండేళ్ల కూతురు అమ్ములుతో కలిసి స్కూటీపై బయలు దేరారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై పట్టణంలోని హెచ్‌పీ గ్యాస్ ఏజేన్సీ ముందుకు రాగానే అతి వేగంతో వెనుక నుంచి వస్తున్న లారీ ముందు వెళ్తున్న స్కూటీనీ బలంగా ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బైక్‌పై ఉన్న గంగ రోడ్డుపై పడడంతో తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. -
హైదరాబాద్‌లో మహిళ హత్య
హైదరాబాద్‌సిటీ: చాంద్రాయణగుట్టపరిధిలోని ఫలక్‌నూమా బ్రిడ్జి వద్ద శుక్రవారం ఉదయం ఓ గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. హత్యకు గురైన మహిళ దగ్గర ఓ సెల్‌ఫోన్, ఓ బ్యాగును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎక్కడో హత్య చేసిన అనంతరం బ్రిడ్జి వద్ద పడవేసి ఉంటారని తెలుస్తుంది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీం రప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు. -
ఆత్మహత్యకు పాల్పడ్డ మహిళ మృతి
పాల్వంచ: ఖమ్మం జిల్లాలో భర్త వేధింపులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డ ప్రమీల(32) అనే మహిళ చికిత్స పొందుతూ గురువారం అర్థరాత్రి మరణించింది. పాల్వంచ మండలం జగన్నాధపురం గ్రామానికి చెందిన ప్రమీల, చందు భార్యాభర్తలు. చందు పాల్వంచ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. భర్త వేధింపులు తాళలేక గురువారం ఒంటిపై కిరోసిన్ పోసుకుని ప్రమీల ఆత్మహత్యకు పాల్పడింది. తీవ్రగాయాలైన ప్రమీలను కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
లిఫ్ట్ నుంచి జారిపడి మహిళ మృతి
నెల్లూరు : నెల్లూరులోని రెయిన్బో ఆసుపత్రిలో ఆదివారం ఉదయం ప్రమాదవశాత్తూ లిఫ్ట్ నుంచి జారిపడి భాగ్యమ్మ(50) అనే మహిళ మృతిచెందింది. మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా తరలించేందుకు ఆసుపత్రి సిబ్బంది ప్రయత్నించడంతో మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. నష్టపరిహారం చెల్లించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతరాలి స్వగ్రామం అనంతసాగరం మండలం గోవిందమ్మపల్లి. -
పిడుగుపాటుకు మహిళ మృతి
విశాఖపట్నం (కె.తోటపాడు) : విశాఖ జిల్లా కె.తోటపాడు మండలం ఎడ్లవానిపాలెంలో శనివారం భారీ వర్షం కురిసింది. పిడుగు పడటంతో గ్రామానికి చెందిన ఎడ్ల ముత్యమమ్మ(28) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందింది. పొలంలో గడ్డి కోస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనాస్థలాన్ని తహశీల్దార్‌తోపాటు పోలీసులు పరిశీలించారు. -
ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి
తొండూరు (అనంతపురం) : ట్రాక్టర్ కింద పడి ఓ వృద్ధురాలు మృతిచెందిన సంఘటన అనంతపురం జిల్లా తొండూరు మండల కేంద్రంలోని హరిజన వాడలో జరిగింది. గ్రామానికి చెందిన జంగమ్మ(53) వీధిలో నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో వినాయక నిమజ్జనానికి తరలుతున్న ట్రాక్టర్ ఢీకొట్టింది. దీంతో ఆమె ట్రాక్టర్ వెనక చక్రాల కిందపడి మృతిచెందింది. -
భోజనం చేస్తుండగా పిడుగుపాటు
దుర్గి (గుంటూరు) : అప్పటి వరకు పొలంలో చెమటోడ్చి... ఆకలితో భోజనం చేస్తున్న ఓ మహిళను పిడుగు బలి తీసుకుంది. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా దుర్గి మండలం నెహ్రూ నగర్ తాండాకు చెందిన రమావతు శాంతిబాయి(25) సోమవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో పొలంలో చెట్టు కింద కూర్చుని భోజనం చేస్తోంది. అదే సమయంలో వర్షంతోపాటు సమీపంలోనే పిడుగు పడడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. శాంతిబాయికి భర్త బాల్సింగ్, కుమార్తె, కుమారుడు ఉన్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
మెహదీపట్నం (హైదరాబాద్) : నగరంలోని షేక్ పేట్ ప్రాంతంలో ఓ మహిళ బట్టలు ఆరేస్తూ విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. వివరాల ప్రకారం.. షేక్‌పేట లేబర్ కాలనీకి చెందిన భారతి (34) శనివారం ఓ ఇంటిలో పనిచేసేందుకు వెళ్లింది. బట్టలు ఉతికిన అనంతరం మేడపై ఆరేస్తుండగా అవి వెళ్లి సమీపంలోని విద్యుత్ తీగలకు తగిలాయి. దీంతో విద్యుత్ షాక్‌కు గురై ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. -
పిడుగుపాటుకు మహిళ దుర్మరణం
విడవలూరు : పిడుగుపాటుతో ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడవలూరు మండల కేంద్రం శివారులో ఈ ఘటన జరిగింది. శుక్రవారం సాయంత్రం 5 గంటల సమయంలో పిడుగు పడడంతో సమీపంలోని పొలంలో పనులు చేసుకుంటున్న సుబ్బమ్మ (45) అక్కడికక్కడే మృతి చెందింది. -
పాము కాటుకు మహిళ మృతి
జీఎం వలస( విజయనగరం జిల్లా) : విజయనగరం జిల్లా జీఎంవలస మండలం బట్లభద్ర గ్రామంలో పాముకాటుకు ఓ మహిళ మృతిచెందింది. మంగళవారం మధ్యాహ్నం పొలంలో పనిచేస్తున్న మంగమ్మ(30)ను పాము కాటువేయడంతో మృతిచెందింది. కుటుంబసభ్యులు గమనించి పామును చంపేశారు. అయితే ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. -
షిర్డీ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి మహిళ మృతి
నల్గొండ : ప్రమాదవశాత్తూ షిర్డీ ఎక్స్‌ప్రెస్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన నల్గొండ జిల్లా భువనగిరి రైల్వేస్టేషన్ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. మృతురాలు కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన రమాదేవిగా గుర్తించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గొంతులో పూరీ ఇరుక్కుని మహిళ మృతి
నిజామాబాద్ : నిజామాబాద్ పోచమ్మ కాలనీలో విషాదం నెలకొంది. టిఫిన్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ గొంతులో పూరీ ఇరుక్కుని చింతకుంట రాధ అనే మహిళ మృతి చెందింది. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే కుటుంబ సభ్యులు మహిళను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. కాగా విషాహారం వల్ల ఈ ఘటన జరిగిందా అనే అనుమానంతో మృతురాలి సోదరుడు రమేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో పోలీసులు పోస్ట్‌మార్టంకు ఆదేశించారు. పూరీ గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడకే మహిళ మృతి చెందినట్లు వైద్యులు పోస్ట్‌మార్టం నివేదికలో వెల్లడించారు. -
ప్లాట్ఫారం మూసివేత.. హెల్ప్‌లైన్ నంబర్ల ప్రకటన
చెన్నై రైల్వే స్టేషన్లో నిలిచి ఉన్న గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పేలుడు అనంతరం తొమ్మిదో నెంబరు ప్లాట్‌ఫారాన్ని మూసేశారు. బాంబు పేలుడు ఫలితంగా రెండు బోగీలతో పాటు ప్లాట్ఫారం కూడా పూర్తిగా ధ్వంసమైంది. దీంతో ప్లాట్‌ఫారాన్ని పోలీసులు పూర్తిగా అదుపులోకి తీసుకున్నారు. రైల్లో మరిన్ని బాంబులు ఏమైనా ఉన్నాయేమోనని పోలీసులు క్షుణ్ణంగా గాలించారు. చెన్నై వస్తున్న పలు రైళ్లను ఇతర స్టేషన్లలో ఆపేశారు. చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు వెళ్లే దారులన్నీ హడావుడిగా మారిపోయాయి. మరోవైపు బెంగళూరు, చెన్నైలలో భారతీయ రైల్వే శాఖ హెల్ప్‌లైన్ నెంబర్లను ఏర్పాటుచేసింది. ప్రయాణికులు గానీ, వారి బంధువులు గానీ సంప్రదించేందుకు వీలుగా ఈనెంబర్లు ప్రకటించింది. పేలుడుకు కారణం ఏంటన్న విషయం ఇంతవరకు నిర్ధారణ కాలేదని తమిళనాడు డీజీపీ కె.రామానుజం తెలిపారు. బెంగళూరు వాసులు అయితే 080- 22876288, చెన్నై వాసులు అయితే 044 25357398 నెంబర్లలో సంప్రదించవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. -
చెన్నై పేలుళ్లలో గుంటూరు యువతి మృతి
చెన్నై : చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్లో జరిగిన జంట పేలుళ్ల ఘటనలో మృతి చెందిన యువతి గుంటూరు జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. మృతురాలు గుంటూరుకు చెందిన స్వాతిగా (22) గుర్తించటం జరిగింది. కాగా చెన్నైపై ఉగ్రవాదులు పంజా విసిరారు. చెన్నై రైల్వేస్టేషన్ గురువారం ఉదయం జంట పేలుళ్లతో దద్దరిల్లింది. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌లోని గౌహతి ఎక్స్‌ప్రెస్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. పేలుడు ధాటికి ఎస్-4 బోగీలోని 70వ సీటులో కూర్చున్న స్వాతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దుర్ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను చెన్నై ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అటు.... ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో ప్రయాణికులు వణికిపోయారు. భయంతో రైల్వే స్టేషన్ నుంచి పరుగులు తీశారు. మరోవైపు బాంబు పేలుళ్ల సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక సిబ్బంది వెంటనే చెన్నై రైల్వే స్టేషన్‌కు చేరుకొని తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్ నుంచి ప్రయాణికులను బయటకు పంపించి విస్తృత తనిఖీలు చేస్తున్నారు. -
విద్యుదాఘాతంతో మహిళ మృతి
కెరమెరి, న్యూస్‌లైన్: మండలంలోని సుర్దాపూర్ గ్రామ పంచాయతీ పరిధి నీంగూడ గ్రామానికి చెందిన కమలాబాయి(36) శుక్రవారం విద్యుదాఘాతంతో మృతిచెందింది.మృతురాలి భర్త చంద్రు తెలిపిన వివరాల ప్రకారం.. కమలాబాయి శుక్రవారం ఉదయం బట్టలు ఉతికి పక్కనే వెదురు కర్రలపై ఆరవేయబోయింది. కర్రల పక్కనే రేకులు ఉండగా.. వాటికి కోతకు గురైన సర్వీసు వైర్ల నుంచి కరెంటు సరఫరా జరిగింది. దీంతో ఆమె కరెంటు షాక్‌కు గురైంది. ఆమెను కుటుంబ సభ్యులు గమనించి ఎడ్లబండిపై పెద్దవాగు దాటించారు. అక్కడి నుంచి ఆటోలో ఆసిఫాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా ధనోర వద్ద 108 ఎదురుగా వచ్చింది. సిబ్బంది పరీక్షించి కమలాబాయి మృతిచెందినట్లు నిర్దారించారు. ఆమెకు కూతుళ్లు శంకరాబాయి, బుదాబాయి, కుమారుడు పాండు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై లింగమూర్తి వివరించారు. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కమలాబాయి మృతికి విద్యుత్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు, సాయిబాబా యువజన సంఘం నాయకులు అశోక్, నారాయణ, అన్నారావు, ఆనంద్‌రావు ఆరోపించారు. కొంతకాలంగా గ్రామంలో విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా మారిందని పేర్కొన్నారు. అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కరెంటు సరఫరాలో హెచ్చుతగ్గుల కారణంగా గురువారం సోనేరావు, పాండు, అశోక్ ఇళ్లలో షాక్‌కు గురయ్యారని తెలిపారు. విద్యుత్ సరఫరాను సరిదిద్దాలని, షాక్ తగలకుండా చూడాలని కోరుతున్నారు. -
కావేరి ట్రావెల్స్ బస్సు బోల్తా, మహిళ మృతి
సింగరాయకొండ : వరుస రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా .. ప్రైవేటు బస్సుల స్పీడ్‌కు అధికారులు బ్రేక్ వేయలేకపోతున్నారు. ఫలితంగా ప్రకాశం జిల్లాలో మరో ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ అతి వేగానికి ఒక మహిళ మృతిచెందగా, పదిమంది వరకూ గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి నెల్లూరుకు జెట్ స్పీడ్‌తో వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు సింగరాయకొండ దాటి వెళ్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేశారు. -
బస్సు ఢీకొని మహిళ దుర్మరణం
తణుకు క్రైం, న్యూస్‌లైన్ :తణుకు మండలం తేతలి వై జంక్షన్‌వద్ద బుధవారం మోపెడ్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఓ మహిళ అక్కడికక్కడే మరణించింది. వివరాలు ఇవి.. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట మండలం పెదగొల్లపాలానికి చెందిన కొప్పిశెట్టి మహాలక్ష్మి, అతని భార్య సత్యవతి(45) కొయ్యలగూడెంలోని తమ కుమార్తె ఇంటికి మోపెడ్‌పై బయలుదేరారు. తేతలి వై జంక్షన్ వద్దకు వచ్చేసరికి తాడేపల్లిగూడెం నుంచి కాకినాడ వెళుతున్న ఆర్టీసీ బస్సు మోపెడ్ ను ఢీకొట్టింది. బస్సు ఢీకొట్టగానే వెనుక కూర్చున్న సత్యవతి బస్సువైపుకు పడిపోవడంతో వెనుక చక్రం తల మీద నుంచి వెళ్లిపోయింది. ఆమె బండిపైనే ఉండిపోగా తల చిధ్రమైపోయింది. ఘటన చూసిన మహాలక్ష్మి భయంతో గజగజ వణికి సొమ్మసిల్లిపోయాడు. పోలీసులు 108 అంబులెన్స్‌లో అతడిని తణుకు ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని స్థానికులు పేర్కొన్నారు. రూరల్ ఎస్సై ఎం.కేశవరావు ఘటనా ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరించారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. కుమార్తె కుటుంబంతో కలిసి తిరుపతి వెళ్లేందుకు.. పెద్ద తిరుపతి వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకునేందుకు వెళ్తుం డగా ఇలా జరిగిందేంటి అని మహాలక్ష్మి చేస్తున్న రోదన అక్కడి వారిని కలచివేసింది. కొయ్యలగూడెంలోని తమ కుమార్తె ఇంటికి వెళ్లి అంతా కలిసి పెద్ద తిరుపతి వెళ్దామని బయలుదేరామని ఇంతలో ఇలా జరిగిపోయిందంటూ గండెలవిసేలా రోదించాడు.