కోటపల్లి (ఆదిలాబాద్) : చలి మంట వద్ద కూర్చున్న యువతి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రగాయాలతో చనిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కోటపల్లిలో చోటుచేసుకుంది. కోటపల్లికి చెందిన రంగు ముత్తయ్య, మల్లక్క దంపతుల కుమార్తె మానస(18) ఇంటర్ వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉదయం ఆమె చలి మంట వద్ద కూర్చుని ఉంది.
మంట సరిగా రాకపోవటంతో కుటుంబసభ్యులు కిరోసిన్ చల్లారు. దాంతో ఒక్కసారిగా మంటలు రేగి మానస దుస్తులకు అంటుకున్నాయి. వారు ఆర్పేలోగానే ఆమె తీవ్ర గాయాలపాలైంది. కుటుంబసభ్యులు మొదట చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూర్ రూరల్ సీఐ రాములు తెలిపారు.
చలి మంట అంటుకుని యువతి మృతి
Published Thu, Jan 7 2016 8:16 PM | Last Updated on Sun, Sep 3 2017 3:16 PM
Advertisement
Advertisement