Kotapalli
-
డమ్మీ గన్‌తో పోలీసులనే బెదిరించి..!
సాక్షి, నిజమాబాద్ : ఓ వ్యక్తి డమ్మీ గన్‌తో పోలీసులను బెదిరించిన ఘటన నిజామాబాద్‌లో కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. నిజామాబాద్‌లోని కోటగల్లిలో జరిగిన పోలీసుల దాడిలో తప్పించుకుని, ఆ తర్వాత డమ్మీ గన్‌తో బెదిరించిన వ్యక్తిని సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. కాగా అరెస్టు చేయబడిన వ్యక్తిని పోలీసులు చాట్ల గోపిగా గుర్తించారు. గోపి పై గతంలో మర్డర్ కేసులు కూడా ఉన్నట్టు పోలీసులు తెలిపారు. గోపి దగ్గర ఉన్న కత్తి, డమ్మీ గన్లను స్వాధీనం చేసుకోని కేసు నమోదు చేశారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు. -
చలి మంట అంటుకుని యువతి మృతి
కోటపల్లి (ఆదిలాబాద్) : చలి మంట వద్ద కూర్చున్న యువతి ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రగాయాలతో చనిపోయింది. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కోటపల్లిలో చోటుచేసుకుంది. కోటపల్లికి చెందిన రంగు ముత్తయ్య, మల్లక్క దంపతుల కుమార్తె మానస(18) ఇంటర్ వరకు చదివి ఇంట్లోనే ఉంటోంది. గురువారం ఉదయం ఆమె చలి మంట వద్ద కూర్చుని ఉంది. మంట సరిగా రాకపోవటంతో కుటుంబసభ్యులు కిరోసిన్ చల్లారు. దాంతో ఒక్కసారిగా మంటలు రేగి మానస దుస్తులకు అంటుకున్నాయి. వారు ఆర్పేలోగానే ఆమె తీవ్ర గాయాలపాలైంది. కుటుంబసభ్యులు మొదట చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి, ప్రథమ చికిత్స అనంతరం వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెన్నూర్ రూరల్ సీఐ రాములు తెలిపారు. -
2,100 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం
కోటపల్లి : ఆదిలాబాద్ జిల్లా కోటపల్లి మండలంలో ఎక్సైజ్ పోలీసులు సోమవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. రాపూర్, దేవుల్వాడ గ్రామాల్లో సారా తయారీకి నిల్వ ఉంచిన 2,100 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించి ఓ వ్యక్తిపై అధికారులు కేసు నమోదు చేశారు. కాగా సదరు నిందితుడు పరారీలో ఉన్నట్టు సమాచారం. -
సరిహద్దులు దాటుతున్న సరుకు..?
కోటపల్లి : ప్రాణహిత నది మీదుగా నిత్యావసర సరుకులు సరిహద్దు దాటుతున్నాయి. లక్షలాది రూపాయలు వాణిజ్య పన్నులకు ఎగనామం పెడుతూ యథేచ్ఛగా తరలిస్తున్నారు. నిత్యావసర సరుకులు, పప్పు దినుసులు, నూనె డబ్బాలు మహారాష్ట్రకు రవా ణా చేస్తున్నారు. మండలంలోని అర్జునగుట్ట ప్రాణహిత నదీ తీరం సరిహద్దు మహారాష్ట్రకు కేవలం 1.5 కిలోమీటర్ల దూరంతో అవతలి, ఇవతలి తీరంగా ఉంది. ఆ రాష్ట్రం లోని గడ్చిరోళి జిల్లా సిర్వంచ కేంద్రంగా అర్జునగుట్ట తీరం నుంచి వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. నది అవతలి ఒడ్డున పాత తాలూకా కేంద్రం సిర్వంచ గ్రామం ఉంది. జిల్లాలోనే వెనుకబడిన ఆదివాసీ ప్రాంతం. ఇక్కడ ఏ వ్యాపార, వాణిజ్య అవసరాలు ఏర్పడినా మన రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలను ఆశ్రయించాల్సిందే. ఇదే అదునుగా చెన్నూర్‌లోని వ్యా పారులు సిర్వంచ వాణిజ్య కేంద్రంగా వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నారు. అంతర్రాష్ట్ర నిబంధనల ప్రకారం ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి సరుకులను విక్రయాల కోసం తరలించాలంటే పన్నులు చెల్లించాల్సిందే. కానీ ఇక్కడి వ్యాపారులు కొందరు ఆ నిబంధనలేవీ పాటించడం లేదు. నిత్యం టన్నుల కొద్దీ పప్పుదినుసులు, వందలాది లీటర్ల నూనె డబ్బాలు, నాణ్యమైన సన్నబియ్యం సహా ఇతర వస్తువులు ప్రాణహిత నది మీదుగా పడవల్లో సరిహద్దు దాటుతున్నాయి. సరుకుల రవాణాకు వ్యాపారులు ప్రత్యేకంగా జీపులు సమకూర్చుకున్నారంటే పరిస్థితి ఏ విధంగా ఉందో ఊహించవచ్చు. ప్రతీ రోజు సుమారు ఐదు నుంచి పది జీవుల సరుకు లోడ్ నాటు పడవల్లో తరలిపోతోంది. జీరో వ్యాపారం జోరుగా సాగుతున్నా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంటు అధికారులు పట్టిం చుకోవడం లేదనే విమర్శలున్నాయి. అడపా దడపా సరకుల రవాణాను నిలువరించి కేసులు నమోదు చేస్తున్న విజిలెన్స్ అధికారులు నిబంధనలు అతిక్రమించి అక్రమంగా రవాణా అవుతున్న నూనె, పప్పుదినుసులు, బియ్యం తదితర సరకుల అక్రమాలపై విచారణ చేపడితే భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
నేడు 108 పెలైట్స్ డే
కోటపల్లి, న్యూస్‌లైన్ : అత్యవసర పరిస్థితి ఎదురైనపుడు మెరు పు వేగంతో సంఘటన స్థలానికి నవ సంజీవనీని తీసుకెళ్తారు. విధి నిర్వహణలో ముందుండి ప్రమాద బాధితులకు ప్రథమ చికిత్స అందిస్తూ అతి త్వరగా ఆస్పత్రుల్లో చేర్చుతారు. వారికి ఏమీ కాకూడదని కోరుకుంటారు. సోమవారం ‘108 పెలైట్స్ డే’ సందర్భంగా పైలట్స్ అంది స్తున్న సేవలపై ‘న్యూస్‌లైన్’ ప్రత్యేక కథనం. సేవలకు గుర్తింపుగా పెలైట్స్ డే.. 108 అంబులెన్స్‌కు మొదటి ప్రాణం ఈఎంటీ ఐతే రెండో ప్రాణం పెలైట్. ఎలాంటి విపత్తు ఎ దురైనా ఈఎంటీ తక్షణమే స్పందిస్తారు. ప్రమా ద బాధితులకు వైద్య చికిత్స అందించి వారిని కాపాడేందుకు కృషి చేస్తారు. క్షణ కాలాన్ని కూ డా వృథా కానివ్వకుండా అత్యవసర సర్వీసైన 108 అంబులెన్స్‌ను సంఘటన స్థలానికి తీసుకెళ్లడం పెలైట్ బాధ్యత. అందుకే వీరిరువురు 108కు రెండు కళ్లలాంటివారిగా ఆ విభాగం ఉ న్నతాధికారులు బావిస్తుంటారు. అలాంటి వారి సేవలకు గుర్తింపునిచ్చేందుకు ప్రతీ సంవత్సరం మే26న 108 పెలైట్స్ డే జరుపుతుంటారు. బాధితులకు ఆప్తులుగా.. 108 అంబులెన్స్ సమయానికి సంఘటన స్థలానికి చేరడం, అక్కడి నుంచి ఆస్పత్రికి వెళ్లడంలో ప్రతీ క్షణం విలువైందే. ప్రతీ క్షణానికి విలువని స్తూ 108 అంబులెన్స్ సేవలను ప్రతీ ఒక్కరికి తె లియపరుస్తున్న సిబ్బంది ప్రతీ ఒక్కరికి ఆప్తులే. పెలైట్ ఆపద సమయంలో వేగంతో వెళ్తున్నపు డు అంబులెన్స్‌లో ఉన్నవారితో పాటు రోడ్డుపై రాకపోకలు సాగించే వాహనదారులు, పాదచారులకు ఎలాంటి ఆపద కలగకుండా వ్యవహరిం చాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఏమాత్రం ని ర్లక్ష్యం ప్రదర్శించినా ఇద్దరి ప్రాణాలకు అపాయ మే. అంతేకాకుండా అత్యవసర సమయంలో ఈఎంటీలకు సహాయం చేసేందుకు పెలైట్లకు ప్రథమ చికిత్స నిర్వహించే విధానంపై కూడా శి క్షణ ఇస్తారు. దీంతో ఈఎంటీలకు ప్రథమ చికి త్స సమయంలో పెలైట్లు చేదోడువాదోడుగా ఉంటారు. పెలైట్ల సేవల గుర్తింపు కోసం వారికి ఒక రోజును కేటాయించి ప్రతిభ కనబరిచిన పెలైట్లను 108 అధికారులు సత్కరిస్తుంటారు. -
దోపిడీ దొంగల బీభత్సం
కోటపల్లి, న్యూస్‌లైన్: రావులపల్లికి చెందిన జంగ జనార్దన్‌రెడ్డి, సుగుణ అనే వ ృద్ధ దంపతుల ఇంట్లోకి శుక్రవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఇంటి వెనుక గుమ్మం గుండా దొంగలు చొరబడ్డారు. బీరువా తాళం పగులగొట్టేందుకు ప్రయత్నిస్తుండగా చప్పుడు కావడంతో మేల్కొన్న జనార్దన్, సుగుణ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దొంగలు ఇంట్లో ఉన్న కత్తి పీట, కొడవళ్లతో వారిపై విచక్షణరహితంగా దాడి చేయడంతో అక్కడిక్కడే కుప్పకూలారు. దొంగలు సుగుణమ్మ మెడలోని అరతులం బంగారు గొలుసు, 15 తులాల వెండి పట్టగొలుసులు తీసుకొని పరారయ్యారు. తెల్లవారుజామున ఇంటి ముందు నివాసం ఉంటున్న వారు విషయం తెలుసుకొని 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. వెంటనే 108లో చెన్నూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స నిర్వహించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో వీరిని కరీంనగర్‌కు తరలించారు. సంఘటన స్థలాన్ని చెన్నూర్ టౌన్, రూరల్ సీఐలు భద్రయ్య, చంద్రభాను, ట్రైనీ ఎస్సై టి.శ్రీకాంత్ పరిశీలించారు. సంఘటన స్థలంలో జాగిలాలతో తనిఖీలు నిర్వహించారు. కేసు దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
తూర్పు జిల్లాలో చిరుత పులులు
చెన్నూర్, న్యూస్‌లైన్ :తూర్పు జిల్లాలో చిరుత పులులు సంచారిస్తున్నాయి. ఈ నెల 7న చెన్నూర్ మండలంలోని సంకారం గ్రామంలో ఆవుపై దాడి చేసి చంపివేయగా 15న కోటపల్లి మండలంలోని పంగిడిసోమారంలో రెండు ఎద్దులపై దాడి చేశాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో సుమారు మూడు నుంచి నాలుగు పులులు సంచారిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు నమ్మకంగా చెప్తున్నారు. చెన్నూర్ మండలంలోని సంకారం, బుద్దారం, కన్నెపల్లి ఇలావోస్పల్లి, కోటపల్లి మండలంలోని పంగిడిసోమారం, బద్దెంపల్లి, వేమనపల్లి మండలంలోని మంగెనపల్లి, రాజారాం, జాజులపేట, జిల్లేడ, గ్రామాలు పూర్తిగా అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆ గ్రామాల రైతులకు అటవీ ప్రాంతంలోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 10 రోజులుగా ఈ ప్రాంతాల్లో పులులు సంచరిస్తూ పశువులపై దాడి చేయడంతో ఆయా గ్రామాల్లో నివసించే ప్రజల్లో ఆందోళన పెరిగింది. అధికారుల ధ్రువీకరణ నెల రోజులుగా చెన్నూర్ అడవుల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు పలువురు రైతులు అధికారులకు తెలిపారు. ఈ ప్రాంతంలో పులులు లేవని, రైతుల మాటలను అధికారులు తొలుత కొట్టి పారేశారు. అరుుతే ఈ నెల 7న మండలంలోని సంకారం గ్రామంలో గుర్తు తెలియని అటవీ జంతువు ఆవుపై దాడి చేసి చంపిదని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆ గ్రామం రైతు ఆలం బక్కయ్య అటవీ శాఖ అధికారులుకు విన్నవించాడు. దీంతో ఆ శాఖ అధికారులు ఆవుపై దాడి చేసిన తీరును గమనించి అనుమానం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేశారు. సంకారం అటవీ ప్రాంతంలో కిలో మీటర్ పొడువునా గల వాగులో చిరుత పులి అడుగులను పరిశీలించారు. ఒక్క పులి ఉన్నట్లయితే మమూలుగా రెండేసి అడుగులే ఉంటాయని వాగులో ఉన్న చిరుత పులి అడుగులను ఆధారంగా గమనిస్తే రెండు నుంచి మూడు పులులు సంచరించినట్లు అధికారులు భావిస్తున్నారు. స్థానిక పశు వైద్యాధికారి శ్రీనివాస్‌ను సంఘటన స్థలానికి తీసుకెళ్లి గుర్తులను పరిశీలించగా వాగులో ఉన్న గుర్తులు పులి కాళ్ల అడుగులని పశువైద్యాధికారి ధ్రువీకరించారు. ఆయన ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర పులులు జిల్లాలో పులులు లేకపోవడంతో ఈ ప్రాంతంలో సంచారిస్తున్న పులులు మహారాష్ట్రకు చెందినవిగా ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో అక్రమ కల్ప రవాణాను అడ్డుకునేందుకు వేసవి కాలంలో మూడు పులులను అటవీ ప్రాంతంలో వదిలివేయగా ప్రాణహిత నది నుంచి ఇవతలకు అవి దాటి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికీ అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు పులులను చూడ లేదని అంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి - ఎ.అప్పలయ్య, అటవీ శాఖ రేంజ్ అధికారి, మంచిర్యాల చెన్నూర్ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పు లులు సంచరిస్తున్నాయి. వాటి మార్కులను పరి శీలించాం. అటవీ ప్రాంతానికి వెళ్లే పశువుల, మే కల కాపరులు అప్రమత్తంగా ఉండాలి. అడవి అంతరించి పోతుండడంతో ఆహారం అవి బ యటికి వచ్చి ఇలా పశువులు, మనుషులపై దా డి చేసే అవకాశాలున్నాయి. పులి దాడిలో చని పోరుున ఆవులపై పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివే దిక పంపించాం. త్వరలోనే పరిహారం పంపిణీ చేస్తాం.