తూర్పు జిల్లాలో చిరుత పులులు
Published Thu, Sep 19 2013 2:05 AM | Last Updated on Fri, Sep 1 2017 10:50 PM
చెన్నూర్, న్యూస్‌లైన్ :తూర్పు జిల్లాలో చిరుత పులులు సంచారిస్తున్నాయి. ఈ నెల 7న చెన్నూర్ మండలంలోని సంకారం గ్రామంలో ఆవుపై దాడి చేసి చంపివేయగా 15న కోటపల్లి మండలంలోని పంగిడిసోమారంలో రెండు ఎద్దులపై దాడి చేశాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో సుమారు మూడు నుంచి నాలుగు పులులు సంచారిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు నమ్మకంగా చెప్తున్నారు. చెన్నూర్ మండలంలోని సంకారం, బుద్దారం, కన్నెపల్లి ఇలావోస్‌పల్లి, కోటపల్లి మండలంలోని పంగిడిసోమారం, బద్దెంపల్లి, వేమనపల్లి మండలంలోని మంగెనపల్లి, రాజారాం, జాజులపేట, జిల్లేడ, గ్రామాలు పూర్తిగా అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆ గ్రామాల రైతులకు అటవీ ప్రాంతంలోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 10 రోజులుగా ఈ ప్రాంతాల్లో పులులు సంచరిస్తూ పశువులపై దాడి చేయడంతో ఆయా గ్రామాల్లో నివసించే ప్రజల్లో ఆందోళన పెరిగింది.
అధికారుల ధ్రువీకరణ
నెల రోజులుగా చెన్నూర్ అడవుల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు పలువురు రైతులు అధికారులకు తెలిపారు. ఈ ప్రాంతంలో పులులు లేవని, రైతుల మాటలను అధికారులు తొలుత కొట్టి పారేశారు. అరుుతే ఈ నెల 7న మండలంలోని సంకారం గ్రామంలో గుర్తు తెలియని అటవీ జంతువు ఆవుపై దాడి చేసి చంపిదని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆ గ్రామం రైతు ఆలం బక్కయ్య అటవీ శాఖ అధికారులుకు విన్నవించాడు. దీంతో ఆ శాఖ అధికారులు ఆవుపై దాడి చేసిన తీరును గమనించి అనుమానం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేశారు. సంకారం అటవీ ప్రాంతంలో కిలో మీటర్ పొడువునా గల వాగులో చిరుత పులి అడుగులను పరిశీలించారు. ఒక్క పులి ఉన్నట్లయితే మమూలుగా రెండేసి అడుగులే ఉంటాయని వాగులో ఉన్న చిరుత పులి అడుగులను ఆధారంగా గమనిస్తే రెండు నుంచి మూడు పులులు సంచరించినట్లు అధికారులు భావిస్తున్నారు. స్థానిక పశు వైద్యాధికారి శ్రీనివాస్‌ను సంఘటన స్థలానికి తీసుకెళ్లి గుర్తులను పరిశీలించగా వాగులో ఉన్న గుర్తులు పులి కాళ్ల అడుగులని పశువైద్యాధికారి ధ్రువీకరించారు. ఆయన ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.
మహారాష్ట్ర పులులు
జిల్లాలో పులులు లేకపోవడంతో ఈ ప్రాంతంలో సంచారిస్తున్న పులులు మహారాష్ట్రకు చెందినవిగా ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో అక్రమ కల్ప రవాణాను అడ్డుకునేందుకు వేసవి కాలంలో మూడు పులులను అటవీ ప్రాంతంలో వదిలివేయగా ప్రాణహిత నది నుంచి ఇవతలకు అవి దాటి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికీ అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు పులులను చూడ లేదని అంటున్నారు.
అప్రమత్తంగా ఉండాలి
- ఎ.అప్పలయ్య, అటవీ శాఖ రేంజ్ అధికారి, మంచిర్యాల
చెన్నూర్ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పు లులు సంచరిస్తున్నాయి. వాటి మార్కులను పరి శీలించాం. అటవీ ప్రాంతానికి వెళ్లే పశువుల, మే కల కాపరులు అప్రమత్తంగా ఉండాలి. అడవి అంతరించి పోతుండడంతో ఆహారం అవి బ యటికి వచ్చి ఇలా పశువులు, మనుషులపై దా డి చేసే అవకాశాలున్నాయి. పులి దాడిలో చని పోరుున ఆవులపై పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివే దిక పంపించాం. త్వరలోనే పరిహారం పంపిణీ చేస్తాం.
Advertisement
Advertisement