east District
-
ప్రాంతీయపార్టీల హవా పెరుగుతోంది: దేవేగౌడ
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హవా పెరుగుతోందని, దేశ రాజకీయాల్లో భవిష్యత్తులో ఏర్పడే మార్పులకు ఇది కీలకం అవుతుందని భావిస్తున్నానని మాజీ ప్రధాని, జనతాదళ్ (సెక్యులర్) అధ్యక్షుడు, కర్నాటక రాష్ర్టం హాసన్ లోక్‌సభ సభ్యుడు హెచ్డీ దేవెగౌడ అన్నారు. తూర్పు గోదావరి జిల్లా అన్నవరంలో రత్నగిరిపై సతీసమేతంగా ఆయన సోమవారం సత్యదేవుని వ్రతమాచరించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకర్లతో మాట్లాడారు. బీజేపీ పాలనలో ప్రజల్లో ఎన్నడూ లేనివిధంగా అసహనం పెరుగుతోందన్నారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లోను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలోను దళితులపై జరిగిన దాడులపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. చనిపోయిన ఆవు చర్మాలు ఒలిచినా కూడా దాడులు చేస్తూండడంపై విచారం వ్యక్తం చేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీలకు త్వరలో జరిగే ఎన్నికల్లో దళితులపై దాడులు ప్రధానాంశం అవుతుందని ఆయనన్నారు. ప్రధానిగా నరేంద్రమోదీ బాధ్యత లు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన సంఘటనలతో కశ్మీర్ సమస్య మరింత జటిలమైందని దేవెగౌడ అన్నారు. దీనిని బీజేపీ ఏవిధంగా సమర్థించుకుంటుందని ప్రశ్నించారు. బీజేపీ వైఖరిపై దాని మిత్రపక్షాలైన టీడీపీ, శివసేన కూడా గుర్రుగా ఉన్నాయన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా వివిధ ప్రాంతీయ పార్టీలతో థర్డఫ్రంట్ ఏర్పాటుపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని అన్నారు. బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చిందని, ఆ పార్టీకి దాదాపు మూడేళ్ల పదవీ కాలం ఉందని గుర్తు చేశారు. అది పూర్తయ్యాక కానీ థర్డఫ్రంట్పై స్పష్టత రాదని అన్నారు. కర్నాటక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికల్లో జనతాదళ్ (ఎస్) ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదని దేవెగౌడ తెలిపారు. అన్ని స్థానాల్లో తమ పార్టీ సొంతంగా పోటీ చేసి గెలుస్తుందని, తన కుమారుడు కుమారస్వామి సీఎం అవుతారని జోస్యం చెప్పారు. గతంలో 20 నెలలు కుమారస్వామి ముఖ్యమంత్రిగా పని చేసినపుడు అనేక అభివృద్ధి పనులు చేపట్టారన్నారు. ఆ తరువాత ఏ ముఖ్యమంత్రీ కూడా ఆ స్థాయిలో అభివృద్ధి చేయలేదని తెలిపారు. అందువల్లనే ప్రజలు కుమారస్వామి పాలనను కోరుకుంటున్నారని తెలిపారు. -
మంటల్లో చిక్కుకొని కారు దగ్ధం
వేగంగా వెళ్తున్న కారులో మంటలు వ్యాపించి క్షణాల్లో కారు తగలపడిపోయిన సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం వద్ద బుధవారం వెలుగుచూసింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చే లోపే కారు పూర్తిగా కాలి బూడిదైంది. కారులో మంటలు రావడాన్ని గమనించిన ప్రయాణికులు అందులో నుంచి బయటపడ్డారు. వంట కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్ల సాయంతో కారును నడుపుతుంటంతోటే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు అంటున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో మరో రెండు గ్యాస్ సిలిండర్లు ఉండటంతోటే మంటల తీవ్రత అధికంగా ఉందని అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
ఎదురెదురుగు వస్తున్న రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం ఊబలంక సమీపంలో గురువారం వెలుగుచూసింది. ఎదురెదురుగా వస్తున్న రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో వినయ్‌కాంత్ రెడ్డి(22) అనే ఇంజనీరింగ్ విద్యార్థితో పాటు వెంకట సాయిబాబా రెడ్డి(28) మృతిచెందగా.. సాయిబాబా కూతురితో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
కాపుల ఆందోళనను అడ్డుకున్న పోలీసులు
తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ అరెస్టుకు నిరసనగా కంచాలతో ప్రదర్శన నిర్వహిస్తున్న కాపులను పోలీసులు అడ్డుకున్నారు. కాపు సామాజికవర్గానికి చెందినవారు ఆదివారం ఉదయం కంచాలు చేతపట్టుకుని నిరసనవ్యక్తంచేస్తూ ర్యాలీ నిర్వహిస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు-ప్రదర్శనకారులకు మధ్య వాగ్వాదం జరిగింది. -
ఉన్మాది దాడి - ఐదుగురికి గాయాలు
రైల్వే స్టేషన్లో అన్నం తింటున్న వారిపై ఓ ఆగంతకుడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన కొందరు బిచ్చగాళ్లు స్థానిక రైల్వేస్టేషన్లో అన్నం తింటుండగా గుర్తు తెలియని ఓ వ్యక్తి వారిని కర్రతో విపరీతంగా కొట్టాడు. దీంతో ముగ్గురు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక చిన్నారి తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రయాణికులు రైల్వే పోలీసులకు చెప్పటంతో ఉన్మాదిని అదుపులోకి తీసుకుని, స్టేషన్‌కు తరలించారు. -
కామాంధుడ్ని అరెస్ట్ చేయాలంటూ ధర్నా
తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండలం తెనుమళ్ల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మూడు రోజుల క్రితం ఓ బాలికపై అత్యాచారయత్నం చేసిన వద్ధుడ్ని అరెస్ట్ చేయాలంటూ గ్రామస్తులు శనివారం ధర్నాకు దిగారు. పడాల సత్యనారాయణ (60) పాఠశాలలోని మధ్యాహ్న భోజనం చేసే ఓ మహిళ భర్త.. మూడు రోజుల క్రితం పాఠశాలలో బాలికపై సత్యనారాయణ అత్యాచారం చేయబోయాడు. ఈ ఘటనపై చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసులు సత్యనారాయణను అదుపులోకి తీసుకుని తర్వాత వదిలిపెట్టారు. దీంతో నిందితుడిని అరెస్ట్ చేయాలని కోరుతూ గ్రామస్తులు శనివారం పాఠశాల మందు ధర్నా చేపట్టారు. సత్యనారాయణ గతంలోనూ ఇలాంటి ఘటనలకు పాల్పడ్డాడని అతడ్ని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
దమ్ముంటే జగన్ దీక్షను అడ్డుకోండి: జ్యోతుల
చేతనైతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తలపెట్టిన దీక్షను అడ్డుకోవాలని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధినేత దీక్ష తలపెట్టారని... ఆయన తెలిపారు. దీక్షను భగ్నం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించటం మానుకోవాలని హితవు చెప్పారు. గండేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన జగ్గంపేట నియోజకవర్గ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిని యువభేరి సదస్సులో పాల్గొన్నారనే నెపంతో ఆంధ్రా యూనివర్సిటీ ఉన్నతాధికారులు సస్పెండ్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వర్సిటీ అధికారులు అధికార టీడీపీకి వత్తాసు పలకటం మానుకోవాలని సూచించారు. -
పైపులైన్ల పడగ
విశాఖ చుట్టూగ్యాస్ పైపులైన్ల ఉచ్చు పదుల సంఖ్యలో గ్యాస్, చమురు కంపెనీలు తూర్పుగోదావరి జిల్లాలో గ్యాస్ దుర్ఘటనతో కలవరం విశాఖవాసుల్లో వణుకు విశాఖవాసులను గ్యాస్ ముప్పు కలవరపరుస్తోంది. నగరం చుట్టూ గ్యాస్ పైపులైన్లు ఉండడంతో ఏ క్షణాన ఎక్కడ ఏ ప్రమాదం జరుగుతుందో..ఏ పైపులైన్ లీకవుతుందోననే భయం వెన్నాడుతోంది. తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు మండలం నగరంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన గెయిల్ గ్యాస్ పైపులైను భారీ పేలుడు దుర్ఘటన నేపథ్యంలో నగరవాసుల్లో ఆందోళన మొదలయింది. నగరం చుట్టూ అత్యంత భారీ పైపులైన్లు పాతబడి ప్రమాదకరంగా ఉన్నాయి. ఇప్పటికే నగరంలో హెచ్‌పీసీఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, స్టీల్‌ప్లాంట్, హెచ్‌పీ, బీపీసీ టెర్మినల్ ప్లాంట్లు, గ్యాస్ కంపెనీలు భారీగా ఉన్నాయి. ఇవన్నీ నిత్యం గ్యాస్ లోడింగ్, అన్‌లోడింగ్‌తో ప్రమాద హేతువులుగా మారాయి. సాక్షి, విశాఖపట్నం : నగరం నుంచి హైదరాబాద్‌కు గెయిల్ సంస్థ భారీ పైపులైన్ వేసింది. రోజుకు 2.5 లక్షల గ్యాస్ సిలెండర్లను నింపగలిగే సామర్థ్యం ఈ పైపులైన్ సొంతం. ఆ పక్కనే హెచ్‌పీసీఎల్ చమురు, డీజిల్ తరలించే పైపులైన్ కూడా ఉంది. స్టీల్‌ప్లాంట్‌లో భారీ స్థాయిలో గ్యాస్ వినియోగం జరుగుతోంది. హెచ్పీసీల్లోనూ గ్యాస్ పైపులైన్లు భారీస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇవికాకుండా సుమారు 13 రకాల ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్ఈజెడ్లు, ఉక్కు ఆథారిత కంపెనీలు గ్యాస్‌తో నడుస్తున్నాయి. ఇలా భారీ స్థాయిలో కంపెనీలు వందలాది పైపులైన్లు గాజువాక పారిశ్రామిక ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. ఆయా కంపెనీలు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తున్నాయన్న ఆరోపణలున్నాయి. గతంలో స్టీల్‌ప్లాంట్‌లో అనేకసార్లు గ్యాస్ లీకై పదుల సంఖ్యలో కార్మికులు మృతి చెందారు. ఇటీవల గ్యాస్‌లీకై ఉక్కు ఎస్ఎంఎస్-2లో ఇద్దరు ఇంజినీర్లు మృత్యువాత పడ్డారు. 1997లో హెచ్‌పీసీఎల్ గ్యాస్ అన్లోడింగ్ చేస్తుండగా జరిగిన ప్రమాదంలో 60 మంది వరకు మత్యువాత పడ్డారు. 2013 ఆగస్టులో కూలింగ్ టవర్ కూలి 23మంది వరకు మృతి చెందారు. ఇలా నిత్యం ఏదొక కంపెనీలో గ్యాస్ ప్రమాదం జరుగుతూనే ఉంది. కంపెనీలు వేసిన గ్యాస్‌పైపులైన్లు ఇప్పుడు ప్రజలకు సైతం ప్రాణాలకు ముప్పు తెచ్చేలా ఉన్నాయి. ఈ పైపులైన్లు నిర్మించి చాలా ఏళ్లు అవుతుండడంతో ఎక్కడ, ఎప్పుడు, ఏ పైపులైను లీకవుతుందోననే భయం వెన్నాడుతోంది. సింధియా, మల్కాపురం, గాజువాక ప్రాంతాల్లో వందలాది పైపులున్నాయి. ఇవి పాతపబడిపోయి గ్యాస్, చమురు లీకవుతున్నాయి. కంపెనీలు మాత్రం ఈ పైపులైన్ల భద్రతను పట్టించుకోవడంలేదు. వాస్తవానికి గ్యాస్‌పైపులైన్ల వెంబడి నిత్యం కంపెనీల సిబ్బంది పహారా కాయాలి. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా తక్షణమే అప్రమత్తమై స్పందించాలి. కానీ ఇది జరగడం లేదు. పారిశ్రామిక ప్రాంతంలో ఖాళీగా ఉన్న వందలాది ఎకరాల్లో విస్తరించిన పైపులను ఏ కంపెనీ కూడా పట్టించుకోవడం లేదు. దీని వల్ల ఏ ప్రమాదం జరిగినా గ్యాస్ వాసన, రసాయనాల లీకు, అగ్ని ప్రమాదాల కారణంగా నగరవాసుల భద్రతకు ముప్పు పొంచి ఉంటుంది. గెయిల్, హెచ్‌సీపీఎల్ నగరం నుంచి హైదరాబాద్‌కు నిర్మించిన పైపులైన్లు అనేక గ్రామాల మీదుగా వెళ్తున్నాయి. వీటిపై తెలిసో తెలియకో స్థానికులు ఇళ్లు నిర్మిస్తున్నారు. చమురు కోసం దొంగలు వీటిని పగులగొట్టి ఇంధనం కాజేస్తున్నారు. ఇది ప్రమాదకరం. ఏ చిన్న నిప్పు అంటుకున్నా ఇవి పేలి రోజుల తరబడి మంటలు కొనసాగుతాయి. తూర్పుగోదావరి జిల్లా నగరం దుర్ఘటన నేపథ్యంలో మరోసారి ఆయా కంపెనీలు గ్యాస్, చమురు పైపులైన్ల భద్రతపై పునఃసమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం అప్రమత్తంగా లేకపోయినా అంతులేని నష్టం జరిగే ప్రమాదం కూడా ఉంది. నగరానికి ఇంకో గ్యాస్ పైపులైన్ ఇప్పటికే గ్యాస్ పైపులైన్లతో ఉక్కిరిబిక్కిరవుతున్న నగరానికి మరో భారీ పైపులైను రాబోతోంది. కాకినాడ నుంచి విశాఖ వరకు గృహ, పారిశ్రామిక అవసరాల కోసం ప్రత్యేకంగా పైపులైను వేయడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. గరిష్టంగా 10 లక్షల మంది గృహ వినియోగదారులకు, 40 భారీ కంపెనీలు, 13 ఇండస్ట్రియల్ పార్కులు, ఎస్ఈజెడ్లకు నిరంతర గ్యాస్ అందించడానికి దీన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. -
తూర్పు జిల్లాలో చిరుత పులులు
చెన్నూర్, న్యూస్‌లైన్ :తూర్పు జిల్లాలో చిరుత పులులు సంచారిస్తున్నాయి. ఈ నెల 7న చెన్నూర్ మండలంలోని సంకారం గ్రామంలో ఆవుపై దాడి చేసి చంపివేయగా 15న కోటపల్లి మండలంలోని పంగిడిసోమారంలో రెండు ఎద్దులపై దాడి చేశాయి. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. చెన్నూర్, కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో సుమారు మూడు నుంచి నాలుగు పులులు సంచారిస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు నమ్మకంగా చెప్తున్నారు. చెన్నూర్ మండలంలోని సంకారం, బుద్దారం, కన్నెపల్లి ఇలావోస్పల్లి, కోటపల్లి మండలంలోని పంగిడిసోమారం, బద్దెంపల్లి, వేమనపల్లి మండలంలోని మంగెనపల్లి, రాజారాం, జాజులపేట, జిల్లేడ, గ్రామాలు పూర్తిగా అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఆ గ్రామాల రైతులకు అటవీ ప్రాంతంలోనే వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. 10 రోజులుగా ఈ ప్రాంతాల్లో పులులు సంచరిస్తూ పశువులపై దాడి చేయడంతో ఆయా గ్రామాల్లో నివసించే ప్రజల్లో ఆందోళన పెరిగింది. అధికారుల ధ్రువీకరణ నెల రోజులుగా చెన్నూర్ అడవుల్లో చిరుత పులి సంచరిస్తున్నట్లు పలువురు రైతులు అధికారులకు తెలిపారు. ఈ ప్రాంతంలో పులులు లేవని, రైతుల మాటలను అధికారులు తొలుత కొట్టి పారేశారు. అరుుతే ఈ నెల 7న మండలంలోని సంకారం గ్రామంలో గుర్తు తెలియని అటవీ జంతువు ఆవుపై దాడి చేసి చంపిదని, పరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆ గ్రామం రైతు ఆలం బక్కయ్య అటవీ శాఖ అధికారులుకు విన్నవించాడు. దీంతో ఆ శాఖ అధికారులు ఆవుపై దాడి చేసిన తీరును గమనించి అనుమానం వ్యక్తం చేశారు. అటవీ ప్రాంతంలో చిరుత పులి సంచారం ఉందా? అనే కోణంలో దర్యాప్తు చేశారు. సంకారం అటవీ ప్రాంతంలో కిలో మీటర్ పొడువునా గల వాగులో చిరుత పులి అడుగులను పరిశీలించారు. ఒక్క పులి ఉన్నట్లయితే మమూలుగా రెండేసి అడుగులే ఉంటాయని వాగులో ఉన్న చిరుత పులి అడుగులను ఆధారంగా గమనిస్తే రెండు నుంచి మూడు పులులు సంచరించినట్లు అధికారులు భావిస్తున్నారు. స్థానిక పశు వైద్యాధికారి శ్రీనివాస్‌ను సంఘటన స్థలానికి తీసుకెళ్లి గుర్తులను పరిశీలించగా వాగులో ఉన్న గుర్తులు పులి కాళ్ల అడుగులని పశువైద్యాధికారి ధ్రువీకరించారు. ఆయన ఇచ్చిన నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. మహారాష్ట్ర పులులు జిల్లాలో పులులు లేకపోవడంతో ఈ ప్రాంతంలో సంచారిస్తున్న పులులు మహారాష్ట్రకు చెందినవిగా ఫారెస్ట్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మహారాష్ట్రలో అక్రమ కల్ప రవాణాను అడ్డుకునేందుకు వేసవి కాలంలో మూడు పులులను అటవీ ప్రాంతంలో వదిలివేయగా ప్రాణహిత నది నుంచి ఇవతలకు అవి దాటి ఉండవచ్చని భావిస్తున్నారు. ఇప్పటికీ అటవీ ప్రాంతంలో ఉన్న గిరిజనులు పులులను చూడ లేదని అంటున్నారు. అప్రమత్తంగా ఉండాలి - ఎ.అప్పలయ్య, అటవీ శాఖ రేంజ్ అధికారి, మంచిర్యాల చెన్నూర్ అటవీ ప్రాంతంలో రెండు చిరుత పు లులు సంచరిస్తున్నాయి. వాటి మార్కులను పరి శీలించాం. అటవీ ప్రాంతానికి వెళ్లే పశువుల, మే కల కాపరులు అప్రమత్తంగా ఉండాలి. అడవి అంతరించి పోతుండడంతో ఆహారం అవి బ యటికి వచ్చి ఇలా పశువులు, మనుషులపై దా డి చేసే అవకాశాలున్నాయి. పులి దాడిలో చని పోరుున ఆవులపై పరిహారం కోసం ఉన్నతాధికారులకు నివే దిక పంపించాం. త్వరలోనే పరిహారం పంపిణీ చేస్తాం.