దమ్ముంటే జగన్ దీక్షను అడ్డుకోండి: జ్యోతుల | Jyotula Nehru statement on YS Jagan's fasting | Sakshi
Sakshi News home page

దమ్ముంటే జగన్ దీక్షను అడ్డుకోండి: జ్యోతుల

Published Thu, Sep 24 2015 10:35 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

దమ్ముంటే జగన్ దీక్షను అడ్డుకోండి: జ్యోతుల - Sakshi

దమ్ముంటే జగన్ దీక్షను అడ్డుకోండి: జ్యోతుల

చేతనైతే.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ తలపెట్టిన దీక్షను అడ్డుకోవాలని పార్టీ తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ సవాల్ విసిరారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధనే లక్ష్యంగా వైఎస్సార్ సీపీ అధినేత దీక్ష తలపెట్టారని... ఆయన తెలిపారు. దీక్షను భగ్నం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం ప్రయత్నించటం మానుకోవాలని హితవు చెప్పారు. గండేపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన జగ్గంపేట నియోజకవర్గ మండల, గ్రామ కమిటీల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రొఫెసర్ ప్రసాదరెడ్డిని యువభేరి సదస్సులో పాల్గొన్నారనే నెపంతో ఆంధ్రా యూనివర్సిటీ ఉన్నతాధికారులు సస్పెండ్  చేయడం సిగ్గుచేటని విమర్శించారు. వర్సిటీ అధికారులు అధికార టీడీపీకి వత్తాసు పలకటం మానుకోవాలని సూచించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement