
ప్రార్థనలు చేస్తున్న వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీ నాయకులు
కర్నూలు (ఓల్డ్‌సిటీ) : ప్రత్యేక హోదా కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేసిన వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల ఆరోగ్యం కుదుట పడాలని ఆకాంక్షిస్తూ శుక్రవారం వైఎస్‌ఆర్‌సీపీ మైనారిటీసెల్ నాయకులు రోజాదర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మైనారిటీసెల్ జిల్లా నాయకుడు ఎస్.ఫిరోజ్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం మాట మార్చడం అన్యాయమన్నారు. కేంద్ర ప్రభుత్వానికి హోదా ఇచ్చే బుద్ధి ప్రసాదించాలని ప్రార్థించారు. కార్యక్రమంలో పార్టీ మైనారిటీసెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బి.జహీర్ అహ్మద్‌ఖాన్, జిల్లా నాయకుడు దొడ్డిపాడు మహబూబ్‌బాషా, మైనారిటీసెల్ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎస్.ఎ.అహ్మద్, పార్టీ నగర ప్రధాన కార్యదర్శి నూరుల్లా ఖాద్రి, జగన్ యూత్ ఐకాన్ (పులివెందుల) వ్యవస్థాపకుడు షామీర్ బాష, జావీద్ ఖాన్, దర్గా ముతవల్లి సయ్యద్ దాదాబాష ఖాద్రి తదితరులు పాల్గొన్నారు.
సామూహిక అత్యాచార దుండగులను కఠినంగా శిక్షించాలి
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఇటీవల యువతిపై సామూహిక అత్యాచారం జరిపిన దుండగులను కఠినంగా శిక్షించాలని వైఎస్‌ఆర్‌సీపీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త హఫీజ్ ఖాన్ డిమాండ్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని శుక్రవారం ఓ ప్రకటనలో కోరారు. అలాగే కతువాలో మైనర్ బాలికపై అత్యాచారం చేసి ఆపై హత్య చేసిన దుండుగులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మానవత్వానికి తలవంపులుగా నిలిచే ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment